English | Telugu
ఆ హీరోతో కలిసి సిగరెట్ తాగడం వల్ల బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు
Updated : Dec 18, 2024
షారుక్ ఖాన్(sharukh khan)హీరోగా 2017 లో వచ్చిన 'రయిస్'(raees)అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన పాకిస్థానీ నటి మహీరాఖాన్(mahira khan)తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి నటిగా కూడా ప్రూఫ్ చేసుకుంది.దీంతో బాలీవుడ్ లో ఆమెకి వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఆమెకి అవకాశాలు రాలేదు.అందుకు గల కారణాన్ని లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మహిమ మరో సారి గుర్తు చేసుకుంది.
ఆమె మాట్లాడుతు నా తొలి సినిమా'రయిస్' రిలీజయ్యి మంచి పేరు తెచ్చుకుంది.ఆ తర్వాత రణబీర్ కపూర్(ranbir kapoor)తో కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు బయటకి వచ్చాయి.అప్పుడు'ది లిటిల్ వైట్ డ్రెస్'పేరుతో మీడియా ఒక ఆర్టికల్ రాసింది.పాకిస్థాన్ లో ఏ నటి సాధించని విజయాన్ని ఇక్కడ మహీరా అందుకుంది.ఇప్పుడు ఆ క్రేజ్ అంత పోయేలా ఉంది.ఈమెకి ఏమైందని ఆర్టికల్ రాసింది.ఆ ఆర్టికల్ చూసిన నేను నాకేమైనా పిచ్చిపట్టిందా అనుకున్నాను.పైగా నా కెరీర్ ముగిసిందని కూడా నాకు అనిపించింది.అనుకున్నట్టుగానే నాకు అవకాశాలు రాలేదు.నా జీవితంలో అత్యంత కష్ట సమయం కూడా అదే.ఆ సంఘటన వల్ల వృత్తి పరంగాను,వ్యక్తి గతంగాను జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి.ఒక వైపు విడాకులు,సింగల్ పేరెంట్ గా ఉండటం,మరో వైపు కెరీర్ గురించి ఆలోచించి రోజు ఏడ్చుకుంటూ కుర్చునేదానినని చెప్పుకొచ్చింది.
'రేయిస్' అనే సినిమా కంటే ముందు మహీరా పాకిస్థాన్ లో ఎన్నో సినిమాల్లో నటించింది.రణబీర్ తో సిగరెట్ తాగుతున్న పిక్స్ బయటకి వచ్చినప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి.ఇక మహీరా వ్యక్తి గత జీవితాన్ని చూసుకుంటే తన స్నేహితుడు అలీ అస్కారి ని వివాహమాడిన మహీరా 2015 లో అలీ నుంచి విడిపోయింది.అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్న మహీరా గత ఏడాది వ్యాపారవేత్త సలీం కరీం ని పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం పాకిస్తాన్ లోనే కొన్ని సినిమాల్లో చేస్తుంది.