English | Telugu

సైఫ్ అలీఖాన్ నుంచి 15 వేల కోట్లని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందా!

సైఫ్ అలీఖాన్ నుంచి 15 వేల కోట్లని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందా!

బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan)పై ఇటీవల బంగ్లాదేశ్ కి చెందిన దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.సైఫ్ అభిమానులైతే ఈ విషయంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఇటీవలే ఎన్టీఆర్(Ntr)కొరటాల శివ(Koratala Siva)కాంబోలో వచ్చిన దేవర(Devara)లో కూడా చెయ్యడంతో తెలుగు నాట కూడా సైఫ్ మీద జరిగిన దాడి సంచలనం సృష్టించింది.ఇక ఘటనలో గాయపడిన సైఫ్ ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ కూడా కావడం జరిగింది.

ఇక సైఫ్ అలీ ఖాన్ పూర్వికులకి మధ్య ప్రదేశ్ లోని భూపాల్ లో' ఫ్లాగ్ స్టాఫ్ హౌస్,నూర్ ఉస్ సాభా ప్యాలెస్, దార్ ఉస్ సలాం,హబిబి బంగ్లా,అహ్మదాబాద్ ప్యాలెస్,కొఫేజా ప్రాపర్టీ తో పాటు మరికొన్ని 
విలువైన ఆస్తులు ఉన్నాయి.వాటి విలువ సుమారు15 వేల కోట్ల దాకా ఉంటుంది.కానీ ఇప్పుడు  అవన్నీ 'ఎనిమీ' ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ప్రభుత్వానికి అధీనంలోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.'ఎనిమీ' ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించగా,దాని ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వ్యక్తులు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది.ఈ మేరకు సైఫ్ పూర్వీకుల ఆస్తులన్నీ గవర్నమెంట్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే కోర్టు 2015లో వీటిపై విధించిన స్టేను ఇటీవలే ఎత్తివేసింది. 

భోపాల్ చిట్టచివరి నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఖాన్ ఆస్తికి చట్టబద్ధ వారసురాలు అయినటువంటి పెద్ద కూతురు అబిద,1950లోనే పాక్‌కు వలస వెళ్లిపోయింది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆధారాలతో కోర్టుకి స్పష్టం చేసింది.కానీ నవాబ్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసులైన సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్(Sharmila tagore)వంటివారు ఈ ఆస్తిపై తమకు హక్కు ఉందని కోర్టును ఆశ్రయించడం జరిగింది.