English | Telugu
ప్రముఖ హీరోకి, రకుల్ ప్రీత్ సింగ్ భర్తకి గాయాలు
Updated : Jan 20, 2025
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi)భర్త బోనికపూర్(Boney Kapoor)మొదటి భార్య కొడుకైన అర్జున్ కపూర్(Arjun Kapoor)బాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కి బీవీ'(Mere husband ki biwi)అనే చిత్రం చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)భర్త జాకీ భగ్నానీ(Jackky Bhagnani)ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తుండగా అజీజ్(ajij)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.
గత కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్ ముంబై లోని ఒక పురాతన భవనంలో జరుగుతుంది.అర్జున్ కపూర్ తో పాటు కొంత మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య చిత్రీకరణ జరుపుతున్నారు.కానీ ఈనెల 18 న పురాతన భవనంలోని సీలింగ్ కూలిపోవడంతో అర్జున్ కపూర్,జాకీ భగ్నానీ,అజీజ్ లతో పాటుగా కొంత మంది జూనియర్ ఆర్టిస్టులకి కూడా స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తుంది.కాకపోతే ఈ విషయం ఈ రోజు బయటకి వచ్చింది.ఇక ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా కూడా తీవ్రంగా స్పందించి ప్రస్తుతం జరుగుతున్న ప్రదేశంలో షూటింగ్ ని నిషేధించింది.
ప్రమాద ఘటనని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా, షూటింగ్ జరుగుతున్న పురాతన భవనంలోని సీలింగ్ ని ఎందుకు సరిగా పరీక్షించలేదంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ని సంజాయిషీ కూడా కోరడం జరిగింది.