English | Telugu
భారత వనిత గురించి ప్రపంచానికి చెప్తానంటున్న రాణి!
Updated : Jun 9, 2023
రాణి ముఖర్జీ పేరు వినగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది ఎవరికైనా. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అలాగని స్క్రీన్ మీద కూడా అంతే ఈజీగా ఉంటారనుకుంటే పొరపాటు. చాలెంజింగ్ రోల్స్ టేకప్ చేసి, రాణి ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అనిపించుకుంటూ ఉంటారు. అలాంటి రాణిముఖర్జి తన మనసులోని మాటలను బయటపెట్టారు. ``సొసైటీలో ఏ మార్పైనా మహిళలతో సాధ్యమని నా నమ్మకం. నా నమ్మకాన్నే నేను స్క్రీన్ మీద చూపిస్తాను. గ్లాస్ సీలింగ్‌ని తొలగించే వైవిధ్యమైన పాత్రలంటే ఇష్టం. జీవితంలో ఎన్నో సాధించిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటివారి గురించి భావి తరాలకు చెప్పాలి. అంతకన్నా ముందు ఈ ప్రపంచానికి వారిని పరిచయం చేయాలి. అలాంటి కథలతో సినిమాలు చేయాలని ఉంది. మన జాతినిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి మహిళదీ ప్రత్యేక కథేనన్నది నా నమ్మకం`` అని అన్నారు.
తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ అని మదర్ ఇండియా గురించి చెప్పారు. అక్రాస్ ద వరల్డ్ సినిమాలోనూ మదర్ ఇండియాకు ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. నా చిన్నతనం నుంచి ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో, చూసిన ప్రతిసారీ మరొక్కసారి రీప్లే కొట్టాలనిపిస్తుంది. అంతగా నన్ను ఇన్‌స్పయర్ చేసిన సినిమా అని అన్నారు. ఆమె నటించిన మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమా గురించి కూడా గొప్పగా చెప్పారు. కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మీ అని అంటారు. ఓ మహిళ తన కన్న బిడ్డ కోసం ఓ దేశాన్నే ఎదిరించి గెలిచింది. ఆ కథను మా సినిమాలో చెప్పాం. ఎంతో మందిలో స్ఫూర్తినింపాం. సినిమాలు కేవలం వ్యాపారాత్మక దృష్టితోనే చూడకూడదు. అంతర్లీనంగా సమాజ శ్రేయస్సును మర్చిపోకూడదు. నేను కథలను ఎంపిక చేసుకునేటప్పుడు అన్ని విషయాలను బ్యాలన్స్ చేసుకుంటాను`` అని అన్నారు.