English | Telugu

అక్ష‌య్ జాలీ ఎల్ ఎల్ బీ: లేటెస్ట్ అప్‌డేట్‌

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో అర్ష‌ద్ వార్సీ ఒక‌రు. అసుర్ సీజ‌న్‌2 ఓటీటీల్లో దున్నేస్తుండ‌టంతో అర్ష‌ద్ వ‌ర్సీ ఆనందానికి అవ‌ధుల్లేవు. అర్ష‌ద్ వ‌ర్సీకి చేతినిండుగా ప్రాజెక్టులున్నాయి. అయితే ఆయ‌న న‌టించిన సినిమాల సీక్వెల్ సంగ‌తులేంట‌న్న‌ది ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విష‌యం. మున్నాభాయ్‌3, జాలీ ఎల్ ఎల్ బీ3, గోల్‌మాల్5, ధ‌మాల్‌4 వంటివ‌న్నీ జ‌నాల ఆద‌ర‌ణ పొందిన సినిమాలే. వీటి గురించి అర్ష‌ద్ వ‌ర్సీ చాలా విష‌యాల‌నే చెప్పుకొచ్చారు. ``మున్నాభాయ్ 3 ఉండ‌దు. సంజ‌య్‌, నేనూ ఉండాల‌నే కోరుకున్నాం. రాజు హిరానీ కూడా చేయాల‌నే అనుకున్నారు. విధు  వినోద్ చోప్రా నిర్మించ‌డానికి రెడీ అయ్యారు. అయినా, ఇప్ప‌టికి అది అవ్వ‌దు. జాలీ ఎల్ ఎల్ బీ 3 మాత్రం ఉంటుంది. 

అక్ష‌య్‌తో క‌లిసి త‌ప్పకుండా న‌టిస్తాను. రైట‌ర్ ధ‌మాల్ నాకు ఫోన్ చేశారు. ఆయన దీనికి ప‌నిచేస్తున్నారు. గోల్‌మాల్‌5 త‌ప్ప‌కుండా ఉంటుంద‌నే అనుకుంటున్నా. రోహిత్ శెట్టి స‌డ‌న్‌గా ఒక రోజు ఫోన్  చేసి షూటింగ్ గోవాలో సార్‌. బ‌య‌లుదేరుదాం అని అంటార‌ని ఎదురుచూస్తున్నా. అత‌ను అంత‌టికి స‌మ‌ర్థుడే. త‌ప్ప‌కుండా చేయ‌గ‌ల‌డు`` అని అన్నారు. ఇంత‌కీ అక్ష‌య్‌కుమార్‌తో జాలీ ఎల్ ఎల్ బీ సెట్స్ కి ఎప్పుడు వెళ్తుంది అని అడిగితే ``వ‌చ్చే ఏడాది షూటింగ్ మొద‌ల‌వుతుంది`` అని స‌మాధాన‌మిచ్చారు. ప్ర‌స్తుతం ఘ‌మ‌న్‌సాన్‌, బందా సింగ్ లైన‌ప్‌లో ఉన్నాయని అన్నారు. జాలీ ఎల్ ఎల్ బీ సినిమా గురించి విని అక్ష‌య్‌కుమార్ ఫ్యాన్స్ అంద‌రూ హ్యాపీగా ఉన్నారు. తమ హీరో చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న హిట్ ఈ సినిమాతో అయినా త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. జాలీ ఎల్ ఎల్ బీలో ఇంత‌కు ముందు క‌నిపించిన అక్ష‌య్‌క‌న్నా డిఫ‌రెంట్ రోల్‌ని ప్లాన్  చేస్తున్నార‌ట మేక‌ర్స్. ఈ సారి అక్ష‌య్ మేన‌రిజ‌మ్స్ స‌రికొత్త‌గా ఉంటాయ‌ని అంటున్నారు.