English | Telugu
బడ్జెట్ లెక్కలు కత్రినవి... పాప్‌కార్న్ విక్కీది!
Updated : Jun 9, 2023
పెళ్లయిన తర్వాత కత్రిన బడ్జెట్ లెక్కలు చెప్పడానికి ఇంట్లో మీటింగ్ పెడితే, అసలేమాత్రం సంబంధం లేని వ్యక్తిగా పాప్‌కార్న్ తో ప్రేక్షకుడి పాత్రకు సిద్ధమవుతారట విక్కీ కౌశల్. ఈ విషయాలను సరదాగా ఆయనే పంచుకున్నారు. విక్కీ కౌశల్ నటించిన జర హట్కే జర బచ్కే మూవీకి పాజిటివ్ బజ్ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు విక్కీ కౌశల్. తన వైవాహిక జీవితం గురించి ఒక్క మాటలో చెప్పమంటే పరాఠా వెళ్లి ప్యాన్ కేక్‌ని చేసుకున్నట్టు అనిపిస్తోందని అన్నారు. తన భార్య కత్రినకి తన తల్లి చేసిపెట్టే పరాఠాలు అంటే చాలా ఇష్టమని అన్నారు. బాలీవుడ్ హాట్ కపుల్‌లో విక్కీ కౌశల్, కత్రినా ఒకరు. 2021లో వీరిద్దరి పెళ్లి జరిగింది. వారిద్దరూ కలిసి డ్రీమీ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రిలీజ్ చేసి జనాలకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ మధ్య కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలింది.
లవ్ మేరేజ్‌కి ఓటు వేస్తారా? అరేంజ్డ్ మేరేజ్‌కి ఓటు వేస్తారా అని అడిగితే ``ఏ బంధంలో అయినా ప్రేమ చాలా ముఖ్యం. పెళ్లి అరేంజ్డ్ అయినా ఫర్వాలేదు. ప్రేమించి చేసుకున్నా ఫర్వాలేదు. కాకపోతే అర్థం చేసుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి ఆరాధనా భావం ఉండాలి. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే పరిపక్వత అందరికీ ఉండదు. నా ఆలోచనలు అన్నిటినీ ఆమె అంగీకరించాలని లేదు. ఆమె అభిప్రాయాలు అన్నిటికీ నేను యస్ చెప్పాలని లేదు. కాకపోతే ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు, ఒకరితో ఒకరం సరదాగా సంతోషంగా ఉంటున్నామా? లేదా? అనేది చాలా కీలకం`` అని అన్నారు. ఆయన నటించిన జర హట్కే జర బచ్కే సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటించారు. జూన్ 2 నుంచి ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.