English | Telugu
రాముడిగా రణబీర్, రావణుడిగా యశ్.. 'రామాయణ' షూట్ ఎప్పుడంటే?
Updated : Jun 8, 2023
రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్' జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అయితే అంతకుమించిన భారీ బడ్జెట్ తో భారీస్థాయిలో రామాయణం ఆధారంగా మరో సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన సంయుక్తంగా అత్యంత భారీస్థాయిలో ప్రతిష్టాత్మక 'రామాయణ' చిత్రాన్ని రూపొందించానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుందని అంటున్నారు. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్ నటించనున్నారని సమాచారం. అలాగే రావణాసుర పాత్ర కోసం కేజీఎఫ్ స్టార్ యశ్ ని సంప్రదించారట. రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తే పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహంలేదు. 'దంగల్' ఫేమ్ నితేష్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు.