English | Telugu
హీరోతో పోలిస్తే కియారా రెమ్యునరేషన్ అంత తక్కువా?
Updated : Jun 8, 2023
హీరోలకు అంతంత పారితోషికాలు ఎందుకు? హీరోయిన్లకు అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ విషయం మీద ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. కొన్ని సినిమాల్లో హీరోలతో సమానంగా మమ్మల్ని చూడటానికి కూడా ప్రేక్షకులు వస్తున్నారు కదా అనేది నాయికల మాట. ఈ డిస్కషన్ ఇలా జరుగుతుండగానే కియారా రెమ్యునరేషన్ టాపిక్ స్క్రీన్ మీదకు వచ్చింది. లేటెస్ట్ మూవీ కోసం కియారా అందుకుంటున్న డీటైల్స్, ఆమె కోస్టార్ తీసుకుంటున్న అమౌంట్ బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అదేంటి? అంత తేడానా? అని నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా సత్యప్రేమ్‌కీ కథ. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్.
పెళ్లి తర్వాత ప్రేమ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా క్లిక్ అవుతుందనే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నెల 29న విడుదల కానుంది సినిమా. సత్యప్రేమ్‌కీ కథ కోసం ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేదాని మీద కూడా వార్తలున్నాయి. ఈ చిత్రం కోసం కార్తిక్ ఆర్యన్‌కి దాదాపు పాతిక కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అతనిలో ఆరో వంతును మాత్రమే అందుకున్నారట కియారా. ఆమె అందుకున్న రెమ్యునరేషన్ నాలుగు కోట్లు. సౌత్ హీరోయిన్లు చాలా మంది ఈ నెంబర్‌ని ఇంకా రీచ్ కాలేదు. అయినా ఉత్తరాదిన మోస్ట్ డిమాండింగ్‌లో ఉన్న కియారా ఇంత తక్కువ పారితోషికం తీసుకోవడం ఏంటని హర్ట్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. హీరోయిన్లు పార్ ఈక్వాలిటీ గురించి ఎందుకు మాట్లాడతారో అర్థమవుతుందని అన్నారు.