English | Telugu

అమితాబ్‌ కు నాటో సంచలన లేఖ.. ఆ యాడ్ నుంచి తప్పుకోండి!

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కు నేషనల్‌ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్‌(నాటో) ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ సల్కర్ సంచలన లేఖ రాశారు. పాన్‌ మసాల ప్రమోషన్‌ యాడ్‌ నుంచి వైదొలగాలని ఆయన తన లేఖలో అమితాబ్‌ ను కోరారు.

పాన్‌ మసాలాలో పొగాకు ఉంటుందని, ఇది క్యాన్సర్ తో పాటు అనేక అనారోగ్య సమ్యలకు కారణమవుతుందని శేఖర్ సల్కర్ లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఇలాంటి ప్రమాకరమైన పదార్థాల వినియోగానికి సంబంధించిన యాడ్స్ నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్.. ఇలా ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్‌ లో నటించడం సరికాదన్నారు. వెంటనే అమితాబ్ ఈ యాడ్ నుంచి తప్పుకోవాలని కోరారు.

పాన్‌ మసాలా యాడ్ నుంచి తప్పుకోవాలంటూ అమితాబ్‌ కు నాటో లేఖ రాయడం సంచలనంగా మారింది. మరి నాటో విజ్ఞప్తి మేరకు అమితాబ్‌ ఈ ప్రకటన నుంచి తప్పుకుంటారో లేదో చూడాలి.