English | Telugu

అన్‌బిలీవ‌బుల్‌.. అమెజాన్ రూ. 400 కోట్ల ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన ప్రొడ్యూస‌ర్‌!

స‌ల్మాన్ ఖాన్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అక్ష‌య్ కుమార్ లాంటి బాలీవుడ్ బిగ్ స్టార్స్ సైతం కొవిడ్ మ‌హ‌మ్మారి కాలంలో థియేట‌ర్ల‌ను కాకుండా ఓటీటీని న‌మ్ముకుంటుంటే, ఒక వ్య‌క్తి మాత్రం ఎగ్జిబిట‌ర్ల‌కు అండ‌గా నిలుస్తున్నాడు. ఆయ‌న.. య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత, న‌టి రాణీ ముఖ‌ర్జీ భ‌ర్త‌.. ఆదిత్య చోప్రా! బంటీ ఔర్ బ‌బ్లీ 2, షంషేరా, పృథ్వీరాజ్‌, జ‌యేష్‌భాయ్ జోర్దార్ సినిమాల‌ను నిర్మిస్తోన్న ఆయ‌న 18 నెల‌లుగా వాటి విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌కుండా థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు.

డైరెక్ట్ డిజిట‌ల్ రిలీజ్ కోసం ప‌లు ఓటీటీ నిర్వాహ‌కులు ఆయ‌న‌ను సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. అయితే బిగ్ స్క్రీన్స్ మీదే త‌న సినిమాలు ఆడాల‌ని బ‌లంగా కోరుకుంటున్న ఆదిత్య చోప్రా.. ఆ ఆఫ‌ర్ల‌న‌న్నింటికీ తిరస్క‌రిస్తూ వ‌స్తున్నాడు.

ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే నాలుగు సినిమాల కోసం ఏకంగా రూ. 400 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఆయ‌న స్థానంలో మ‌రొక‌రు ఉన్న‌ట్ల‌యితే మ‌రో ఆలోచ‌న లేకుండా ఓకే అనేసేవారేమో. కానీ ఆదిత్య మాత్రం ఆ ఆఫ‌ర్‌కు నో చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచించి, ఓకే చెప్పివుంటే ఆయ‌న‌కు మంచి లాభాలు వ‌చ్చేవి అనేది గ‌మ‌నార్హం. దీన్నిబ‌ట్టి మ‌హారాష్ట్ర‌లో సినిమా హాళ్లు ఓపెన్ అయినే త‌న సినిమాల‌ను రిలీజ్ చేయ‌డానికి ఆయ‌న రెడీగా ఉన్నాడు.