English | Telugu

చిక్కుల్లో ఏక్తా కపూర్‌.. ఆల్ట్‌ బాలాజీ బ్యాన్..!

బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ (Ekta Kapoor) చిక్కుల్లో పడింది. ఆమెపై పై పోక్సో కేసు నమోదైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆల్ట్‌ బాలాజీలో ప్రసారమవుతోన్న 'గంధీ బాత్‌ సీజన్‌-6' సిరీస్ కు సంబంధించి ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్ లో మైనర్లకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఫిర్యాదుతో ఏక్తా కపూర్‌ తో పాటు, ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో కేసు నమోదైంది.

ఏక్తా కపూర్‌ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అభ్యంతర మరియు భారతీయ సంస్కృతిని అవమానించేలా ఉన్న కంటెంట్ ని ప్రసారం చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆల్ట్‌ బాలాజీని బ్యాన్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. #BanAltBalaji హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అలాగే ఏక్తా కపూర్‌ కి ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని రద్దు చేయాలని కొందరు సోషల్ మీడియా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.