English | Telugu
ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్ భార్య సైరా బాను!
Updated : Sep 1, 2021
దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. గత మూడు రోజులుగా రక్తపోటు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహితులు తెలిపారు.
ఈ యేడాది జూలై 7 న దిలీప్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఆయన మృతితో మానసికంగా కృంగిపోయిన సైరా బాను అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రక్తపోటు పెరగడంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
కాగా దిలీప్ కుమార్, సైరా బానులది ప్రేమ వివాహాం. దిలీప్ కుమార్(98) కన్నుమూసేంత వరకు వీరు ఎంతో అనోన్యంగా ఉన్నారు. దిలీప్ కుమార్ ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు దగ్గరుండి సైరా బాను సేవలు చేశారు.