Read more!

English | Telugu

ఆర్జే సూర్య బాధపడేలా కీర్తి భట్ ఏం చేసింది?

ఆర్జే సూర్య.. బిగ్ బాస్ సీజన్‌-6 తో బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌజ్ లో ఆరోహీతో లవ్ ట్రాక్ నడిపి ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకున్న సూర్య.. ఆరోహి హౌజ్ నుండి బయటకు రాగానే ఫైమాతో సన్నిహితంగా ఉన్నాడు. ఆ తర్వాత కీర్తి భట్ తో కొన్ని గొడవలు జరిగాయి. అయితే బిగ్ బాస్ తర్వాత అందరిననీ కలిసిన సూర్య కీర్తి భట్ ని కలవలేదంట.

బిగ్ బాస్ తర్వాత బిబి జోడీ మొదలైంది. ఇందులో సూర్యకి జోడిగా ఫైమా పాల్గొంది. అయితే సూర్యకి డ్యాన్స్ రాదు.. ఈ షో కోసం కష్టపడి నేర్చుకున్నాడంట.. ఫైమా తనని చాలా మోటివేట్ చేసిందంట. బిగ్ బాస్ తర్వాత తన ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు సూర్య. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు బుజ్జమ్మ.. బుజ్జమ్మ అని కలవరించిన సూర్య.. హౌజ్ నుండి బయటకెళ్ళాక బుజ్జమ్మని కలుసుకొని చాలా హ్యాపీగా ఉన్నానని తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పాడు. ఇలా ఎప్పటికప్పుడు సూర్య.. తనకు సంబంధించిన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటున్నాడు.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించాడు. అభిమానులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకి సమాధానమిచ్చాడు సూర్య. బిబి జోడీలో ఫైమాతో కలిసి డ్యాన్స్ చేశారు కదా? ఎలా అనిపించిందని ఒక అభిమాని ప్రశ్న అడుగగా.. ఇట్ వజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్.. ఎందుకంటే నాకసలు డ్యాన్స్ గురించి ఏమీ తెలియదు. నేను డ్యాన్స్ నేర్చుకున్నానంటే అది ఫైమా వల్లేనని సూర్య సమాధానమిచ్చాడు. ఆరోహీ ఎలా ఉందని ఒకరు అడుగగా.‌ ఆరోహీతో సూర్య కలిసి దిగిన ఫోటోని అప్లోడ్ చేసాడు సూర్య. ఆ తర్వాత ఆరోహీ అండ్ బుజ్జమ్మ ఇద్దరిలో ఫస్ట్ మీ ఫేవరెట్ ఎవరని ఒకరు అడుగగా.. అన్ డౌటెడ్లీ బుజ్జమ్మనే అని సూర్య రిప్లై ఇచ్చాడు. బ్రో పెళ్ళి ఎప్పుడు.. వదిన కోసం వెయిటింగ్ అని ఒకరు అడుగగా.. ఈ సంవత్సరం అయిపోద్ది ఇంట్లో కూడా గట్టిగానే చూస్తున్నారని సూర్య రిప్లై ఇచ్చాడు. మీ ఫ్రెండ్ లిస్ట్ లో కీర్తీని ఎప్పుడు మెన్షన్ చేయరు? కీర్తీ మీ ఫ్రెండ్ కాదా బ్రో అని ఒకరు అడుగగా.. "బిగ్ బాస్ హౌజ్ లో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లలో కీర్తీ కూడా ఉంది. కానీ బయటకొచ్చాక తను సీరియల్స్ తో బిజీగా ఉంది.. నేను నా వర్క్ తో బిజీగా ఉన్నాను..పెద్దగా కలవలేదు.. కానీ ఒక చిన్న విషయంలో హర్టింగ్ అనిపించింది అంతే.. ఏది ఏమైనా.‌. తను నా పిచ్చి అండ్ ఫేవరేట్ ఫ్రెండ్" అని రిప్లై ఇచ్చాడు సూర్య. ఇలా సూర్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.