Read more!

English | Telugu

గేమ్స్, డాన్స్ తో ఎంటర్టైన్ చేసిన సమ్మర్ స్పెషల్ కిడ్స్ షో

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం కిడ్స్ స్పెషల్ బాగా ఎంటర్టైన్ చేసింది. చిన్నారులు బాగా నవ్వించారు. ఇక ఈ షోలోకి స్టార్ మా కిడ్స్ అంతా ఎంట్రీ ఇచ్చారు. టీం ఏ నుంచి ఇంటింటి లక్ష్మి సీరియల్ లో హాని రోల్ లో చేసిన శ్రేష్ఠ, ఎన్నెన్నోజన్మల బంధంలో ఖుషి రోల్ నైనికా, కార్తీకదీపంలో సౌర్యగా చేసిన కృతిక, దేవతలో దేవిగా చేసిన అహానా,  సూపర్ సింగర్ జూనియర్ జివి శ్రీకీర్తి, ఇంటింటి గృహలక్ష్మిలో లక్కీగా నటించిన అద్వైత్ వచ్చారు. టీమ్ బి లోకి కార్తీక దీపంలో హిమగా నటించిన సహృద, మధురానగరిలో బుడ్డోడు ఆదిత్య, అలాగే "ఫలక్నుమా దాస్, ఈ నగరానికి ఏమయ్యింది, విరూపాక్ష, మిషన్ ఇంపాసిబుల్, ఏజెంట్" వంటి చిత్రాల్లో నటించిన రోషన్, దేవత సీరియల్ లో చిన్మయి రోల్ లో నటించిన రిధి, ఇక సూపర్ సింగర్ జూనియర్ కామిని వచ్చారు. 

శ్రీముఖి, హరి, అవినాష్, ఫైమా కలిసి ఈ చిన్నారులతో గేమ్స్ ఆడించారు. ఐస్క్రీమ్ బండిని పిలిపించి అందరికి కోన్ ఐస్క్రీమ్స్ ఇప్పించారు. అలాగే రిషికేష్ అనే ఒక పొట్టతో ఉన్న భారీ మనిషిని పిలిపించి కాసేపు కుస్తీ పోటీలు కూడా పెట్టింది. అలాగే వాళ్ళతో డాన్స్ కూడా చేయించింది.  సూపర్ సింగర్ జూనియర్స్ ఇద్దరితోనూ పాటలు పాడించింది. ఇక ఈ షోలో పరివారం బ్యాంకు నుంచి టీం ఏ డబ్బుని గెలుచుకుని విన్నర్స్ అయ్యారు.