Read more!

English | Telugu

బూతులతో కంపు కొట్టించిన కమెడియన్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో మొత్తం బూతులతో నిండిపోయింది. ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా పోటీ పడి మరీ బూతులు తిట్టుకున్నారు. ఇక షోలో తోటికోడళ్ళ గొడవలు పేరుతో వీళ్ళు చేసిన అల్లరి, హంగామా అంతా ఇంతా లేదు. హైపర్ ఆది భార్యగా ఉమాదేవి, బులెట్ భాస్కర్ భార్యగా నటకుమారి ఈ ఎపిసోడ్ లో కనిపించారు. ఉమాదేవి వచ్చి ఎపిసోడ్ కి సంబంధించిన లింక్స్ చెప్తుండగా "అమ్మా నువ్వు సుమా అనుకుంటున్నావా... ఉమా నీకెందుకు అవన్నీ..లింక్స్ చెప్పడం ఒక ఆర్ట్ " అన్నారు ఆది, బులెట్ భాస్కర్.

 "రాత్రి ఉరుములు, పిడుగులు.. అంటే అది నీ ఎఫెక్ట్ అన్నమాట" అని భాస్కర్ ఆదిని అనేసరికి "అంతలేదు మంచం మొత్తానికి అదే సరిపోయింది నేను కింద పడుకున్నా " అన్నాడు. "అసలు నువ్వు ఇరగ్గొట్టావా మంచాలు" అని నటకుమారి భాస్కర్ మీద ఫైర్ అయ్యేసరికి  "చూసావా అదెప్పుడు నన్ను ఊరపంది అనదు..ఎందుకంటే చూడడానికి అదే అలా ఉంటుంది కాబట్టి" అన్నాడు ఉమాదేవి ఆది. "అది మిమ్మల్ని ఏమీ అనదు..ఊరకుక్కను కొట్టినట్టు కొడుతుంది తెలుసా" అని నటకుమారి కూడా ఉమను మరిన్ని బూతులు తిట్టింది. ఊరపంది, ఊరకుక్క అని ఇలా తిట్టిస్తున్నావేంట్రా అని ఫైర్ అయ్యాడు ఆది భాస్కర్ మీద.. "శ్రీనగర్ కాలనీ లో ఇలాగే కొట్టుకుంటాయి" అని లేడీస్ ఇద్దరినీ ఉద్దేశించి మరిన్ని బూతు డైలాగులు వేసాడు ఆది. ఇలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంట్రడక్షన్ బూతుమయమయ్యింది.