Read more!

English | Telugu

ఈ రోజుతో సినిమాకి 111 ఏళ్ళు 

భారతీయుల జీవన విధానంలో సినిమా అనేది నిత్యకృత్యమయిపోయింది. రోజుకి ఒక సినిమా అయినా చూడందే నిద్రపోనీ వాళ్ళు కోట్లల్లోనే ఉంటారు. ఇక సినిమా విడుదల రోజు చూడాలి. థియేటర్ ల దగ్గర  డాన్స్ లు,మేళతాళాల చప్పుళ్ళు   బాణాసంచా మోతలతో పెద్ద హడావిడే  చేస్తారు. మరీ ఇంతలా ఆనందాన్ని ఇస్తున్న సినిమా ఎప్పుడు విడుదలయింది. ఆ సినిమా ఏంటి

మొట్టమొదటి భారతీయ సినిమా రాజా హరిచంద్ర. మే 3  1913 సంవత్సరం విడుదలైంది. అంటే నేటికీ  నూట పదకొండు సంవత్సరాలు అవుతుంది. అసేతు హిమాచలం సాక్షిగా  వెండి తెరపై సగర్వంగా ప్రదర్శితమయ్యింది. కాకపోతే  సైలెన్స్ చిత్రంగా తెరకెక్కింది. అంటే ఎలాంటి మాటలు, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండవు. కేవలం పాత్రలు మాత్రమే కనపడతాయి. పురాణాల్లోని రాజా హరిచంద్ర జీవిత కథ ఆధారంగా నిర్మాణం జరుపుకుంది.మరాఠీ నటులు ఎక్కువ భాగం  నటించారు. ఇరవై వేలరూపాయిల బడ్జట్ తో  నలభై నిమిషాల నిడివితో తెరకెక్కింది

దాదాసాహెబ్ ఫాల్కే ఈ చిత్రానికి  దర్శకత్వం వహించారు. దాంతో  ఇండియన్ సినిమా పితామహుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. నేటికీ కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద అవార్డుల్ని ఇస్తుంది. ఆ అవార్డు అందుకోవడాన్ని సినీ ప్రముఖులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక రాజా హరిచంద్ర ప్రీమియర్ షో ని కూడా జరుపుకుంది ఏప్రిల్ ఇరవై ఒకటిన ముంబైలో ని ఒలింపిక్ థియేటర్ లో ప్రదర్శితమయ్యింది. ఏది ఏమైనా తింటే గారెలు తినాలి..వింటే భారతం వినాలి.. చూస్తే సినిమా చూడాలి