English | Telugu

సింగర్ ఐన శ్రద్దా...అలా చూస్తూ ఉండిపోయిన ఆది, శేఖర్ మాస్టర్

ఢీ-15 నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో టీం - బి నుంచి కంటెస్టెంట్ భవ్య వచ్చి  చేసిన డాన్స్ కి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయాడు. "సినిమా సాంగ్ చూస్తున్నట్టే ఉంది" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత పండు చేసిన డాన్స్ లో ఇన్ని షేడ్స్ ఉంటాయని తెలియలేదు అంటూ శ్రద్దా, శేఖర్ మాస్టర్ అని మంచి కామెంట్స్  ఇచ్చారు. తర్వాత పండుతో కలిసి శేఖర్ మాస్టర్ స్టేజి మీద డాన్స్ చేశారు. ఈ షోలో  కొరియోగ్రాఫర్స్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ థీమ్ లో  ఒక్కో కొరియోగ్రాఫర్ ఒక్కో రేంజ్ లో డాన్స్ ఇరగదీసారు. సోమేష్-సుదర్శన్ మాష్టర్ ఇద్దరూ చేసిన డాన్స్ కి స్టేజి ఊగిపోయింది. తర్వాత లేడీ కొరియోగ్రాఫర్ గ్రీష్మ కూడా ఒక రేంజ్ లో దసరా మూవీ డాన్స్ పెర్ఫార్మ్ చేసేసి పాజిటివ్ కామెంట్స్ ని సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ ఫేమ్ సుదీప కొత్తగా కొన్న గింబల్!

పింకీ అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసినా పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకి అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప.. బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది.

శైలేంద్ర విలనిజం.. ఇక నుండి రిషిధార లకు కష్టమే!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -753 లో.. రిషి కుర్చీ లో శైలేంద్ర కూర్చోవడంతో వసుధార బాధపడుతూ రిషిని తీసుకొచ్చి తన కుర్చీలో కూర్చో పెట్టి.. మీరు మాత్రమే ఈ కుర్చీలో కూర్చోవాలని అంటుంది. అన్నయ్య కూర్చున్నాడని ఫీల్ అవుతున్నావా అని రిషి అడుగుతాడు.. నా స్వార్థం అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి.. ఈ కుర్చీ మీకు మాత్రమే.. ఇది మీ ప్రతిష్ట అని వసుధార అనగానే.. ఎప్పుడు సిచ్యువేషన్ ఒకేలా ఉండదు వసుధార.. అన్న మారొచ్చని రిషి అంటాడు. మీరు ఏంటీ సర్ ఆలా మాట్లాడుతున్నారని వసుధార అంటుంది. సరే సరే నీకు నచ్చినట్లే ఉంటాను హ్యాపీనా.. ఈ బ్రేస్లెట్ తో కట్టిపడేసావని చెప్పి వసుధారని దగ్గరికి తీసుకుంటాడు రిషి.

కృష్ణ ప్లాన్ రివర్స్ అయింది.. ముకుందకి కడుపుమంట! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్  బుధవారం నాటి ఎపిసోడ్ -147 లో.. భవానికి మురారి కాల్ చేస్తే, ఆమె కాల్ కట్ చేసి నెంబర్ బ్లాక్ లో పెట్టడంతో.. కృష్ణ కోపంతో "ఎందుకు మీ పెద్దమ్మ ఇలా చేస్తుంది.. నేను పెంచాను నేను పెంచానని ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా.. కోపం, ద్వేషంని పెంచుకుంది" అంటూ.. ఆగండి వెళ్లి అడిగేస్తా అని పెద్ద వీరనారిలాగా రెడీ అవుతుంది కృష్ణ. ఆ తర్వాత మీరు కూడా రావొచ్చు కదా అని మురారిని అడుగుతుంది. నువ్వే కదా.. కొంగు బిగించిన ఝాన్సీ లాగా రెడీ అయ్యావ్.. వెళ్ళు అని మురారి అనగానే.. తనకి భవాని గన్ పెట్టిన విషయం గుర్తొచ్చి.. భయపడి వెనక్కి వచ్చి మురారి దగ్గర కూర్చుంటుంది. మీ పెద్దమ్మ గన్ తో కాలుస్తుందని చెప్పగానే.. ఎప్పుడు అలానే ఏం జరగదని మురారి అంటూ.. కృష్ణ భయపడడం చూసి ఇద్దరు నవ్వుకుంటారు. అంతలోనే అటుగా వెళ్తున్న ముకుంద వాళ్ళని చూసి షాక్ అవుతుంది. 

రాజ్ డిఫెక్ట్ ని కనిపెట్టిన కావ్య.. అవును వాళ్ళిద్దరు ఒకే గదిలో..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -86 లో.. స్వప్న ఒంటరిగా రావడంతో కనకం చూసి.. నీతో వచ్చిన అప్పు ఎక్కడ అని అడుగుతుంది. అప్పు ఏదో వర్క్ ఉందంటూ వెళ్ళిందని చెప్తుంది. మీ నాన్న గారు నీకో సంబంధం తెచ్చారు.. బుద్దిగా చెప్పింది విను.. వారం రోజుల్లో పెళ్ళని కనకం అంటుంది. ఇంతలో అప్పు వచ్చి.. కలిసావా మీ ఫ్రెండ్ ని అని అడుగుతుంది. కొంపదీసి ఇది నన్ను రాహుల్ ని చూసేసిందా ఏంటని స్వప్న భయపడుతుంది. మా ఫ్రెండ్ అమెరికా వెళ్తుంది. అందుకే ఒకసారి కలిసి వెళ్ళడానికి వచ్చిందని కవర్ చేస్తుంది. మళ్ళీ ఎవడితో లేచిపోవ్ కదా.. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు.. ఖర్చులైనా మిగులుతాయని అప్పు అంటుంది. ఇంకా వారం రోజులే టైమ్ ఉంది కదా.. నేను రాహుల్ ని పెళ్లి చేసుకోవడానికి ఒక్క రోజు చాలు.. అయిన నేను రాహుల్ ని పెళ్లి చేసుకున్నాక.. ఈ పూరి గుడిసెలో ఉండను.. దుగ్గిరాల ఇంటి కోడలిగా మహారాణిలాగా ఉంటానని స్వప్న తన మనసులో అనుకుంటుంది.

కల నిజమాయెనే..నా పేజీకి కూడా బ్లూ టిక్ వచ్చేనే...ఆనందంలో గీతూ.

చిత్తూరు చిరుత అంటూ తెగ సందడి చేసే గీతూ రాయల్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బిగ్ బాస్ షోల పై రివ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది ఈ గీతూ. అలా ఫేమస్ ఐన గీతూ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో కూడా ఇలా కనిపించి అలా మెరిసి మాయమయ్యింది. బిగ్ బాస్ హౌజ్‌‌లోకి 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఈ షోని  ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేనంతగా పేరు తెచ్చిపెట్టింది గీతూ. అలాంటి గీతూ సోషల్ మీడియాలో తన నీతి సూత్రాలతో, జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వంటివి చెప్తూ పాపులారిటీ తెచ్చుకుంది. యూట్యూబ్ లో వెరైటీ వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫోటోషూట్స్ అని, ఫంక్షన్ వీడియోస్ అని ఆదిరెడ్డితో డాన్సులని అన్ని ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి తన ఇన్స్టాగ్రామ్ పేజీ వెరిఫై అయ్యి బ్లూ టిక్ వచ్చేసరికి పండగ చేసుకుంటోంది.

శేఖర్ మాస్టర్ ఈరోజు కేసిపిడి అన్న ఆది...ఎలిమినేట్ ఐన సుదర్శన్ మాస్టర్

ఢీ షో ఛాంపియన్ షిప్ బాటిల్ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షో క్వాటర్ ఫైనల్స్ లో టీం ఏ కంటెస్టెంట్స్ తమ  డాన్సేస్ తో ఇరగదీసాడు. ఇక ఇందులో ఆది, పండు, జెస్సి స్కిట్స్ కూడా బాగా నవ్వు తెప్పించాయి. పండు రంగురంగుల షర్ట్ వేసుకుని స్టేజి మీదకు వచ్చేసరికి "బుడబుక్కలోడు వచ్చాడు" అన్నాడు శేఖర్ మాస్టర్. "ఢీకి ప్రాక్టీస్ చేయడానికి ఫ్లోర్ చాలా దూరమైపోయింది..అందుకే సెట్ లో ఒక ఇల్లు ఉంది కదా దాన్ని రెంట్ కి అడుగుదాం అనుకుంటున్నా" అని ప్రదీప్ ని అడిగేసరికి ఆది, జెస్సి దగ్గరకు పంపించాడు. "వైజాగ్ లో రూములన్నీ ఇపోయాయా మా రూమ్ మీద పడ్డావ్" అని ఆది సెటైర్ వేసాడు. "మా రూమ్ లో ఉండాలి అంటే కండిషన్స్ ఉన్నాయి.

కొత్తింట్లోకి ఉదయభాను..పిల్లల స్కూల్ కి దగ్గరలోకి షిఫ్ట్

ఉదయభాను ఒకప్పటి టాప్ యాంకర్స్ లో ఒకరు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే బుల్లితెరను ఏలిన యాంకర్స్ లో ఉదయభాను చాలా స్పెషల్. ఉదయభాను యాంకరింగ్ చేసిన షోస్  ‘సాహసం చేయరా డింభకా’, ఒన్స్ మోర్ ప్లీజ్, జాణవులే నెరజాణవులే అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. బుల్లితెర శ్రీదేవి అని ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుని బుల్లితెరకి దూరమయ్యింది. మ్యారేజ్ లైఫ్ లో సెటిల్ ఐపోయింది. ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి ఇంటి పనుల్లో బిజీ ఐపోయింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుండడంతో టీవీ షోస్ లో మళ్ళీ కనిపించడం స్టార్ట్ చేసింది ఉదయభాను. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే పేరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తోంది.