Read more!

English | Telugu

 "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" కొత్త సీరియల్ టైమింగ్స్ ఇవే...

స్టార్ మా సీరియల్స్ అంటే చాలు ఆడియన్స్ ఫుల్ జోష్ తో చూస్తూ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇక ఈ ఛానల్ లో వచ్చే సీరియల్ రేటింగ్స్ కూడా అలాగే ఉంటాయి. రీసెంట్ గా స్టార్ట్ ఐన బ్రహ్మముడి, కృష్ణా ముకుంద మురారి సీరియల్స్ ప్రతీ తెలుగు ప్రేక్షకుడిని అలరిస్తున్నాయి. బ్రహ్మముడి సీరియల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు అదే టాప్ రేటింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు మరో కొత్త సీరియల్ ని తీసుకురాబోతోంది స్టార్ మా. అదే "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" అనే సీరియల్. ఈ సీరియల్ మే 9 నుంచి సాయంత్రం 7 గంటలకు  ప్రసారం కాబోతోంది.

బెంగాలీ సీరియల్ "సాంజెర్ బాటి" ని హిందీలో "ఆప్ కి నజారోన్ నే సమజా" పేరుతో , తమిళ్ లో "రాజా పారవై" అనే పేరుతో " ఆకాశ దీప" పేరుతో, కన్నడలో రీమేక్ అయ్యింది. ఇప్పుడు "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" అంటూ తెలుగులో ప్రసారం కాబోతున్న సీరియల్ లో విజయ్ సూరియా హీరో రోల్ లో అంధుడిగా నటిస్తున్నాడు. విజయ్ కన్నడ సీరియల్ యాక్టర్..ఈ సీరియల్ ద్వారా తెలుగులో పరిచయం కాబోతున్నాడు. హీరోయిన్ గా ఒడియా నటి జాస్మిన్ రాత్ నటిస్తోంది. తెలుగు ఈ సీరియల్ ద్వారా పరిచయం కాబోతోంది. అలాగే భావన, నటకుమారి, మహేశ్వరీ, వైభవ్ సూర్య, రాంగోపాల్, సుష్మకిరణ్, షేక్ ముంతాజ్, అజయ్,  సీనియర్ యాక్టర్ సాయి దీపికా, శివకామేశ్వరావు, జబర్దస్త్ కెవ్వు కార్తిక్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరత్ కుమార్ నటిస్తున్నారు. ఆడియన్స్ కూడా మూస సీరియల్స్ ని అస్సలు పట్టించుకోవడం లేదు. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇక స్టార్  మా కూడా ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టే కొత్త కొత్త కథనాలతో సీరియల్స్ ని తీసుకొస్తోంది.