యాక్షన్ లవర్స్ కి పండగే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'బడే మియా చోటే మియా' మేకింగ్ వీడియో
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకొని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో ‘బడే మియా చోటే మియా' సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ మధ్య విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంది.