English | Telugu

కోట్ల రూపాయలని నా స్నేహం కోసం షారుక్ వదిలేసాడు.. వివేక్ వాస్వాని ప్రకటన 

హిందీ చిత్ర సీమలో వివేక్ వాస్వాని గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. నటుడుగా సుమారు 100 కి పైగా సినిమాల్లో నటించి ఆ పై  రైటర్ గాను వర్క్ చేసాడు. అంతటితో ఆగకుండా నిర్మాతగాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలని నిర్మించాడు. వాటిల్లో ఒక మూవీనే  దుల్హ మిల్ గయ. ఒక అగ్ర హీరో రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ మూవీలో నటించాడనే నిజాన్ని వివేక్  చాలా ఏళ్ళ తర్వాత బయటపెట్టాడు. ఇంతకీ ఆ అగ్ర హీరో ఎవరో చూద్దాం.

2010 లో వచ్చిన దుల్హ మిల్ గయ లో  ఫర్దీన్ ఖాన్, సుస్మితాసేన్ లు జంటగా నటించగా కింగ్ ఖాన్ బాద్షా ఒక గెస్ట్ రోల్ పోషించాడు. గెస్ట్ రోల్ అనే పేరే కానీ షారుక్ సుమారు 42 నిమిషాల దాకా కనిపిస్తాడు. తాజాగా వివేక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి ప్రస్తావనకి వచ్చింది. దాంతో ఆయన కొన్ని సీక్రెట్స్ ని బయటపెట్టాడు. షారుక్ తన ఫ్రెండ్ షిప్ కోసం రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా దుల్హ మిల్ గయ లో నటించాడని చెప్పాడు.పైగా సినిమాలో తన  క్యారక్టర్ ఏంటి అసలు సినిమా కథ ఏంటి అని కూడా షారుఖ్ అడగలేదని చెప్పుకొచ్చాడు. 

ఇప్పడు వివేక్ చెప్పిన మాటలని సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్లంతా స్నేహానికి షారుక్ ఇచ్చిన విలువ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. షారుక్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే రోజుల నుంచి వివేక్ తో  మంచి సాన్నిహిత్యం ఉంది. కెరీర్ తొలినాళ్లలో వివేక్ ఇంట్లోనే షారుఖ్ ఉండే వాడు. అలాగే  తన కెరీర్ తొలినాళ్లలో చేసిన ఇంకో మూవీ రాజు బన్ గయా జెంటిల్ మెన్ కి కూడా వివేక్ సహా నిర్మాతగా వ్యవహరించాడు.దానికి  మాత్రం షారుక్ 50000  రెమ్యునరేషన్ ని తీసుకున్నాడు. 1992 లో ఆ మూవీ వచ్చింది