English | Telugu
సుశాంత్ ఆత్మహత్య కేసులో LOC రద్దు..ఆ హీరోయిన్ ఇక విదేశాలకు
Updated : Feb 23, 2024
2020 లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఆత్మహత్యకి సంబంధించి సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి మీద పోలీసు కేసుతో పాటు LOC జారీ అయ్యింది. ఇప్పుడు ఆ విషయంలో ఆమెకి ఊరట లభించడం చర్చినీయాంశంగా మారింది
సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంలో రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసారు.అనంతరం ఆ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. దాంతో సిబిఐ అభ్యర్థన మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు రియా చక్రవర్తి, ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి మరియు సోదరుడు పై LOC ని జారీ చేసారు. అంటే లుక్ అవుట్ సర్క్యులర్ ని జారీ చేసారు. దాని ప్రకారం న్యాయస్థానం యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విదేశాలకి వెళ్ళకూడదు. దీంతో రియా తరుపు లాయర్ LOC వలన రియా తన వృత్తిని తాను చేసుకోలేకపోతుందని ముంబై హైకోర్ట్ లో పిటిషిన్ వేసాడు. పైగా సంవత్సరాలుగా జరుగుతున్న విచారణకు కూడా ఆమె సహకరిస్తుందని పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు LOC ని రద్దు చేస్తు తీర్పుని ఇచ్చింది. దీంతో ఆమె ఇప్పుడు విదేశీ ప్రయాణాలు కూడా చెయ్యవచ్చు.
ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. రియా మరియు ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఇన్నాళ్లు ఎల్‌ఓసి జారీ చేయడంలో హేతుబద్ధతను ప్రశ్నించింది.అలాగే సుశాంత్ ఆత్మహత్య కేసుని పరిష్కరించడానికి చాలా సమయం పట్టవచ్చని కూడా పేర్కొంది.