మహిళా జర్నలిస్టును చంపిన ఐసిస్... గూఢాచార్యం చేస్తుందని
posted on Jan 6, 2016 @ 2:10PM
ఉగ్రవాదుల ఆకృత్యాలకు అంతులేకుండా పోతుంది. రాక్షసత్వంతో ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. కొద్ది రోజుల క్రిందట పారిస్ లో దాడులు జరిపి ప్రజలను భయాందోళనకు గురిచేసిన సిరియా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు. ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. రక్కా ప్రాంతంలోని పౌర జర్నలిస్టుగా పని చేస్తున్న రుఖియా హసన్ అనే మహిళ గూఢచార్యం చేస్తున్నదని ఆరోపిస్తూ అతి దారుణంగా ఉరి తీసి చంపేశారు. ఈ విషయాన్ని సిరియాలోని సీనియర్ జర్నలిస్టు సంస్థ ‘సిరియా డైరెక్ట్' తెలిపింది. ఇప్పటివరకూ ఉగ్రవాదులు ఐదుగురు విలేకరులను చంపారని ఈ పత్రికలో పేర్కొంది.
అంతేకాదు ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం అనే పేరుతో ఉగ్రవాదులు చేసే అరాచకాలను ఫేస్ బుక్ ద్వారా అందరికి తెలిపేదంట. తాను చివరి సారిగా.. నన్ను ఉగ్రవాదులు చంపేస్తానని బెదిరిస్తున్నారు.. వాళ్లు నన్ను చంపేస్తారని.. ఇలా జీవించడం కంటే చనిపోవడం మేలు అని సిరియా మానవహక్కుల సంస్థ (ఆర్బీఎస్ఎస్) వ్యవస్థాపకుడు అబు అహమ్మద్ కు చివరికి సారిగా ట్వీట్టర్ లో వెల్లడించిందట.