మా దేశాన్ని చైనా రేప్ చేసింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
posted on May 2, 2016 @ 2:41PM
గతంలో మన ఉద్యోగాలు చైనా వాళ్లు కొల్లగొడుతున్నారని నోరు జారిన ట్రంప్ ఇప్పుడు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో నోరు జారారు. దఫోర్డ్‌వేన్, ఇండియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన అమెరికా వాణిజ్య లోటు గురించి మాట్లాడుతూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా ఎక్కువ ఉందని, చైనా తన కరెన్సీని అనుసంధానించడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో తన ఎగుమతులను పెంచుకోగలుగుతుందని.. 'మా దేశాన్ని చైనా రేప్ చేయడానికి ఇక ఏమాత్రం మేము అనుమతించం' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మళ్లీ చైనాపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇంతకుముందున్న నాయకుల అసమర్థత వల్లే అమెరికా వాణిజ్యం ఇలా తయారైందని ఆరోపించారు. మరి గతంలో తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు అన్న ట్రంప్ వ్యాఖ్యలను చైనా వాళ్లు పొగడ్తలుగా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారో చూద్దాం..