వీల్ చైర్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం.. సెంటిమెంట్ పండుతుందా?
posted on Jan 31, 2024 7:14AM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి రానున్నారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేయనున్నారు. అదేమీ విశేషం కాదు. కానీ ఆయన అసెంబ్లీకి వీల్ చైర్లో వస్తారన్న వార్తే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ సర్కిల్స్ లో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవ్వక తప్పని పరిస్థితి. దీంతొ ఆయన వీల్ చైర్లో అయినా ప్రజల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయారు.
సరే ఒక పొలిటీషియన్ గా, విపక్ష నేతగా ఆయన ప్రజలలోకి రావడం పెద్ద విశేషమేమీ కాదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైన తరువాత కేసీఆర్ కనీస రాజకీయ మర్యాద కూడా పాటించకుండా.. ఎవరికీ చెప్పాపెట్టకుండా.. ఒక రహస్యోద్యమంలా ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు షిప్ట్ అయిపోయారు. కనీసం ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేయలేదు. తొమ్మిదేళ్ల పాటు తనకు అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ణతలు తెలుపుకోలేదు. హుందాగా ఓటమిని అంగీకరించలేదు. అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ జనం ముందుకు వీల్ చైర్ లో రావడానికి రెడీ అయిపోయారు. ఎన్నికల ప్రచారం కూడా వీల్ చైర్ లోనే చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలా అయితేనే సెంటిమెంట్, సానుభూతి వెల్లువెత్తి పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది ఆయన వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటరు కాంగ్రెస్ కు పట్టం కట్టిన తరువాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ బాత్ రూమ్‌లో జారీ పడి గాయపడి, కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
రేవంత్ సర్కార్ కొలువుదీరిన ఈ రెండు నెలలుగా ఆయన పొలిటికల్ గా ఏ మాత్రం యాక్టివ్ గా లేరు. వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ రెండు నెలలలో బీఆర్ఎస్ పార్టీ అటు అసెబ్లీలో కానీ
కానీ ఎన్నికల సమీపిస్తున్న వేళ.. సుడిగాలి పర్యటనలు చేయాల్సి ఉంది. అందునా.. ప్రత్యర్థి పార్టీ అధినేత, సీఎం రేవంత్ రెడ్డి మాంచీ దూకుడు మీద ఉన్నారు. అలాంటి వారి వేగానికి ముక్కుతాడు వేసేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారని.. అందులోభాగంగానే వీల్ చైర్‌లో ఆయన.. తన ఎన్నికల ప్రచార పర్వానికి తెర తీయనున్నారని తెలుస్తోంది.
సింపతినే ఆస్త్రంగా చేసుకొని ఎన్నికలకు వెళ్లితే.. అనుకూలంగా ఫలితాల రాబట్టడంలో తిరుగుండదని... అందుకే వీల్ చైర్ మాంత్రాన్ని ఈ సారి కేసీఆర్ అండ్ కో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాక.. గత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ అధినేత, సీఎం మమతా దీదీ.. వీల్ చైర్‌లో ప్రచారం చేసి.. సీఎం చైర్ అందుకొందని.. అలాగే రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్.. అదే విధంగా వ్యవహరించి.. 17 లోక్ సభ స్థానాల్లో కొన్ని స్థానాలనైనా కైవసం చేసుకొనేందుకు కేసీఆర్ పక్కాగా స్కెచ్ వేశారనే ఓ చర్చ సైతం సదరు సర్కిల్‌లో హల్ చల్ చేస్తోంది. మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్ని లోక్ సభ స్థానాలు గంపగుత్తగా గెలుచుకొనేందుకు పథక రచనకు శ్రీకారం చుట్టారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే.. పలువురు కారు పార్టీ ఎమ్మెల్యేలు.. పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని.. అలాంటి వేళ.. వారి మధ్యే ఉంటూ.. వారితో నిత్యం వారిలో ఒకడిగా ఉండేందుకు కేసీఆర్ స్కెచ్ వేశారనే ఓ చర్చ సైతం నడుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు నోటిపికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరు చేయి జారకుండా.. కేసీఆర్ అండ్ కో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.
అదీకాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండగా.. ఒక్క రోజు కూడా ఆయన సెక్రటేరియట్‌కు రాలేదనీ.. కానీ ఓటమి తర్వాత.. ఆయన తన పంథాను మార్చుకొన్నారని సమాచారం. ఏదీ ఏమైనా... అధికారంలో వస్తే.. పదవి పదిలం అనుకున్నారే కానీ.. ఆ పదవి కట్టబెట్టిన ప్రజల సాధక బాధకాలు పట్టించుకోలేదని.. దీంతో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ పార్టీని ఓటర్లు సర్వీసింగ్ సెంటర్‌కు పంపారని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది.