టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడి కుమారుడు, కుమార్తె అరెస్టు

దివంగత మాజీ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు, కుమార్తెలు అరెస్టయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రఘునాథ్‌ అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌, కుమార్తె కల్పజ, డీఎస్పీ మోహన్‌ను సీబీఐ అధికారులు సోమవారం (డిసెంబర్ 22) అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రఘునాథ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో   భూముల క్రయవిక్రయాలు చేసేవారు. ఆయన 2019 మే4న బెంగళూరు వైట్ ఫీల్డ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.  ఆయన  భార్య మంజుల  ఫిర్యాదు మేరకు .  పోలీసులు  విచారణ చేపట్టారు. తన భర్త మరణంపై శ్రీనివాస్‌తో పాటు పలువురు కారణమని మంజుల తన ఫిర్యాదులో పూర్కొన్నారు.  తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రఘునాథ్ అత్మహత్య అని పేర్కొంటూ అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిని సవాల్ చేస్తూ రఘునాథ్ భార్య మంజుల హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా రఘునాథ్ ది ఆత్మహత్యేనని నిర్ధారించింది. అయితే  మంజుల హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించారు.  ఆమె పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం, రఘునాథ్‌ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసు సీబీఐ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో భాగంగానే  ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజతో పాటు పలువురిని  అరెస్టు చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి ఆరోపణలపై ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణకు పెట్టుబడులు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదు : శ్రీధర్‌బాబు

  తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దని ఇదే బీఆర్ఎస్ పాలసీ అని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపర్చడం మంచిది కాదని. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హితవు పలికారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మేం  చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే .... జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్ కు రావడం అబద్ధమా అని  శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.  మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదు. ‘అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి విమర్శించారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా...? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు...? ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్ ను పూర్తి చేశామని తెలిపారు. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.  వాస్తవాలు మాట్లాడితే... ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్ లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణం. అవునా... కాదా..?  మంత్రి ప్రశ్నించారు. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచంల్లో మూడొంతుల వ్యాక్సిన్లు తెలంగాణ నుంచే  ఉత్పత్తి అవుతున్నాయి మంత్రి వెల్లడించారు

ఇదేం స్నేహంరా బాబోయ్... ప్రేమ కోసం ఎంత పని చేస్తారా?

  మంచి స్నేహితులు సన్మార్గంలో నడిపించడమే కాకుండా కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని... అదే చెడు సహవాసం చేస్తే అది ఎప్పటికైనా మనల్ని అంతం చేస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. ఇది అక్షర సత్యం... చాలాచోట్ల స్నేహితులే మరో స్నేహి తుడిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి... ఇలా వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో పాతబస్తీ పరిధిలోని బాలాపూర్, పహాడీ షరీఫ్, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.. అయినా కూడా ఈరోజు తెల్లవారుజామున బాలాపూర్ లో ఓ యువ కుడు స్నేహితుల చేతిలో దారుణంగా గాయపడ్డాడు... రిహాన్ (17), శానవాజ్, మోహిజ్ ఈ ముగ్గురు స్నేహితులు కలిసి వట్టేపల్లి నుండి ఫంక్షన్ కని ఎర్ర కుంటకు కలిసి బయలు దేరారు...  బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట లో అర్ధరాత్రి సమయంలో ఈ ముగ్గురి మధ్య వాగ్వివాదం చెలరేగింది... పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో  శానవాజ్, మోహిజ్ ఈ ఇద్దరు స్నేహితులు  ఆగ్రహంతో ఊగిపోతూ స్నేహితుడు రిహాన్ పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి పారిపోయారు... రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న రిహాన్ ను చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రిహాన్ను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. రిహన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిం చారు.  అమ్మాయితో ప్రేమ వ్యవహారమే ఈ హత్య యత్నానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కారణంగా స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు... ఇప్పటికే వరుస నేరాలు, హత్యలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో రాచకొండ సిపి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి బాలాపూర్, పాతబస్తీ, పహడి షరీఫ్, చాంద్రా యణగుట్ట పరిసర ప్రాంతా ల్లో అర్ధరాత్రి సమయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ పోకిరిలపై  కొరడా ఝళిపిస్తున్న కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు బయటికి రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

కోడి గుడ్లు, చికెన్ ధరలకు రెక్కలు

  రాష్ట్రవ్యాప్తంగా కోడి గుడ్లు, చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8 నుంచి రూ.9 వరకు చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో కోడి గుడ్డు రూ.7.30కు విక్రయమవుతుండటం గమనార్హం. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర అని రైతులు, వ్యాపా రులు పేర్కొంటున్నారు.  ఇక చికెన్ ధర కూడా సామాన్య వినియోగదా రుడికి భారంగా మారింది. మార్కెట్‌లో చికెన్ కిలో ధర రూ.300కు చేరడంతో వినియోగం తగ్గుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో అందుబాటులో ఉన్న చికెన్, గుడ్లు ఇప్పుడు ఖరీదైన ఆహార పదార్థాలుగా మారుతున్నాయి. ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణంగా ఉత్పత్తి తగ్గుదలనేనని పౌల్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. వేసవి ప్రభావం, మేత ఖర్చులు పెరగడం, కోళ్ల పెంపకంలో నష్టాలు వంటి అంశాల వల్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు.  అదే సమయంలో డిమాండ్ తగ్గకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వివరిస్తున్నారు.ధరల పెరుగుదలతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గుడ్లను ప్రధాన పోషకాహారంగా వినియో గించే పిల్లలు, వృద్ధుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెరిగితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుడ్లు, చికెన్ ధరలు పెరిగిపో వడంతో సామాన్యులు వాటిని కొనేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది..  

పవిత్ర బంధానికి తూట్లు.. ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య!

  ఏడు అడుగులు వేసి, జీవితాంతం తోడుంటానని బాస చేసిన భార్యే కాలయముడిగా మారింది. పరాయి వ్యక్తి మోజులో పడి, కట్టుకున్న వాడినే కడతేర్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు "గుండెపోటు" నాటక మాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బట్టబయలైంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ‌... అశోక్,పూర్ణిమ దంపతులు... వీరికి పిల్లలున్నారు. బోడుప్పల్, ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసముంటు న్నారు. వి.జె. అశోక్ (45) శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య జె. పూర్ణిమ (36) ప్లే స్కూల్ నడుపుతోంది. పైకి అన్యోన్యంగా కనిపిస్తున్న వీరి కాపురంలో 'అక్రమ సంబంధం' చిచ్చు రేపింది. అదే కాలనీలో నివాసం ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ (22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడి, అది వివాేహేతర సంబంధానికి దారితీసింది.భార్య తీరుపై అనుమానం వచ్చిన అశోక్, ఆమెను పలుమార్లు మందలించారు. తన ఆనందానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన పూర్ణిమ.. ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి జరిగింది ఇదే.. డిసెంబర్ 11, 2025 సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన అశోక్‌పై, పథకం ప్రకారం మాటు వేశారు. మహేష్ తన స్నేహితుడు సాయి కుమార్ (22) సహాయం తీసుకున్నాడు. అశోక్ ఇంట్లోకి రాగానే మహేష్, సాయి ఆయనను పట్టుకోగా.. కట్టుకున్న భార్య పూర్ణిమ భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. అనంతరం మహేష్ మూడు చున్నీలతో అశోక్ మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు. అనుమానం రాకుండా హైడ్రామా.. హత్య అనంతరం నిందితులు అశోక్ బట్టలు మార్చి, రక్తపు మరకలున్న దుస్తులను, సాక్ష్యాలను మాయం చేశారు. డిసెంబర్ 12న పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త బాత్‌రూమ్‌లో పడిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్తే మృతి చెందాడని, గుండెపోటు వచ్చి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల చాకచక్యం.. మొదట సాధారణ మరణంగా కేసు నమోదు చేసినా, దర్యాప్తులో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. అశోక్ మృతదేహంపై బుగ్గలు, మెడ భాగంలో గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ పుటేజీలు, టెక్నికల్ ఆధారాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. అశోక్ దిన దిశ కర్మ అయి పోయిన వరకు కూడా పూర్ణిమ చాలా చాకచక్యంగా వ్యవహరించింది ..అంతేకాదు పది రోజులపాటు తన భర్త లేడు అనే విషయాన్ని జీర్ణించుకో లేకుండా పోయింది.. ఒకవైపు భర్త లేడని నాటకం ఆడుతూనే మరోవైపు తన ప్రియుడితో నిత్యం చాటింగ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటి కప్పుడు చేరవేసింది..  తన భర్త తనను తన పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడని నిత్యం రోదించింది ..కానీ ఇదంతా నాటకం అని పోలీసుల విచారణలో బయటపడింది.. దశ దిన కర్మ పూర్తి అయిన వెంటనే పోలీసులు  విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచి విచారించారు.. తనదైన స్టైల్ లో ఏమీ తెలియనట్టు బుకాయించే ప్రయత్నం చేసింది ..కానీ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో చివరికి నిజాన్ని బయటకు వెళ్ళ గక్కింది.. తన ప్రియుడుతో కలిసి తాను ఈ హత్య చేశానని పేర్కొంది ..ఈ వరకు ప్రియుడు అయిన మహేష్ తో పాటు పూర్ణిమనీ పోలీస్ లు అరెస్టు చేశారు.. క్షణికావేశం, అక్రమ సంబంధాల మోజులో పచ్చని కాపురాన్ని కూల్చుకుని, కటకటాల పాలైన పూర్ణిమ ఉదంతం స్థానికులను విస్మయానికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఛేదించి సంచలన హత్యకేసును వెలికితీసిన మేడిపల్లి పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు  

జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటెషన్‌పై పిటిషన్ కొట్టివేత

  జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 7 కార్పోషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.  వార్డుల విభజను సవాల్‌ చేస్తూ హైకోర్టులో  పిటిషన్‌ దాఖలైంది.  ఎంసీహెచ్‌ఆర్‌డీలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని తెలంగాణ సర్కార్ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. చట్టపరిధిలోనే వార్డుల విభజన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ బుధవారమే కోర్టుకు వివరించారు. 

రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం

  టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యా దపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని శాలువతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. రాష్ట్రపతిని కలసి గౌరవించడం పట్ల బ్రహ్మీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.  బ్ర‌హ్మీ కేవలం నటుడే కాకుండా గొప్ప చిత్రకారుడు కూడా. ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్‌లో దేవుళ్ల చిత్రాలను అద్భుతంగా గీస్తారు. ఖాళీ సమయాల్లో తన మనసుకు నచ్చిన చిత్రాలను గీయడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయా చిత్రాలను తనను కలిసే ప్రముఖులకు బహుమతిగా అందించడం బ్రహ్మానందం ప్రత్యేకత. కృష్ణంరాజు నుంచి రామ్ చరణ్ వరకు ఎంతోమందికి ఆయన గీసిన చిత్రాలను అందించారు. 

సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవంలో రభస

  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా డీజేలో పెట్టిన పాటకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా  చెన్నారావుపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన కంది శ్వేత కృష్ణచైతన్య రెడ్డి ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఉప సర్పంచ్ బొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు.  ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు డీజేలో పాట పెట్టారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త వనపర్తి శోభన్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపించారు. అనంతరం చెన్నారావుపేట ఎంపీడీవో వెంకట శివానంద్ సర్పంచ్ మిగతా వార్డుల సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి ప్రమాణ చేయించారు.

ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ

  సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయో గిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నటులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారించింది. సోషల్ మీడియా వేదికలపై తమ చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అవమా నకరమైన పోస్టులు పెడుతు న్నారని, వాటి ద్వారా తమ ప్రతిష్ఠకు భంగం కలుగు తోందని పిటిషన్లలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.  ఈ విధమైన చర్యలు తమ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తు న్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈపిటిషన్లపై పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తన వాదనలు కోర్టు కు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఆయన కోర్టుకు వివరించారు.ఈ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ సంస్థ లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ప్రతివాదులు ఇప్పటికే కొన్ని వివాదాస్పద లింకులను తొలగించామని కోర్టుకు తెలిపారు.  అయితే, తొలగించబడిన లింకులపై తుది ఆదేశాలు జారీ చేసే ముందు సంబంధిత లింకులను వినియోగించిన ఖాతాదారుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుల విషయంలో ప్రత్యేకంగా స్పష్టమైన నిరాకరణ (డిస్‌క్లైమర్) ఉండాలని కోర్టు సూచిం చింది.ఈ అంశంపై గూగుల్ సంస్థ తమ ఖాతాదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, అవసరమైతే సంబంధిత ఖాతాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే, వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల లోపు కోర్టుకు సమ ర్పించాలని ప్రతివాదులకు సూచించింది. వాదప్రతివాదనలు పూర్తి అయినా తరువాత కోర్టు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

అమరావతిలో "ఆవకాయ్" ఉత్సవాలు : మంత్రి కందుల

  అమరావతిలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ వేడుకల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. పున్నమి ఘాట్, ద్వీపంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేయునున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఉగాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్‌ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.  అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో  ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని  మూవీ టికెట్‌ రేట్లు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.  

ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు

  ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఏపీ శాసనమండలి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కించపరిచే విధంగా ట్వీట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు మండలి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపధ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న హక్కుల కమీటి ముందు హాజరు కావాలని ఆదేశించింది.  అమ్మిరెడ్డి ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. గతంలో అమ్మిరెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో ఈ వివాదాస్పద ట్వీట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదును పరిశీలించిన శాసనమండలి, ఈ అంశాన్ని హక్కుల కమిటీకి (ప్రివిలేజెస్ కమిటీ) నివేదించింది.

సోనియా, రాహుల్‌కు హైకోర్టు నోటీసులు

  నేషనల్ హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసుకున్న అప్పీల్‌ఫై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణన జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్  మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.  ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

మేడ్చల్ లో విద్యార్థి మిస్సింగ్.. బతికున్నాడా లేదా అంటూ తల్లిదండ్రుల ఆందోళన

మేడ్చల్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది.  ఆ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ అనే 14 ఏళ్ల విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ఆచూకీ గత ఎనిమిది రోజులుగా లభించకపోవడంతో ఆ విద్యార్థి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఈ నేప థ్యంలో కుటుంబ సభ్యులు స్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు.  తమ కుమారుడి మిస్సింగ్‌కు స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఆవరణలో చలి మంట వేసుకున్న కారణంగా వార్డెన్ తమ కుమారుడిని చితకబాదాడని, ఆ దాడి కారణంగానే కార్తీక్ భయంతో స్కూల్ నుంచి వెళ్లిపోయి ఉంటాడనీ వారంటున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజ మాన్యం సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలింతకీ తమ కుమారుడు బతికి ఉన్నాడా? లేదా అన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.   ఇలా ఉండగా.. కార్తీక్ ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ పరిసరాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. 

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం- 15 మంది దుర్మరణం

ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తు న్నాయి.  రోడ్డు, రైలు విమాన అన్న తేడా లేకుండా ఈ ప్రమాదాలు పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల ఉసురు తీస్తున్నాయి. సాంకేతిక సమస్య, మానవ తప్పిదం కారణమేమైతేనేం ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇండోనేసియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ని సెమరాంగ్ నగరం  టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.  సోమవారం (డిసెంబర్ 22) తెల్లవారుజామున  ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.    క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ని బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు అద్దాలు పగిలి, డోర్లు మూసుకుపోయాయి. దీంతో బస్సులోకి వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసుకురావడం సమస్యగా మారింది. స్థానికుల సహకారంలో ఎలాగో బస్సు డోర్లను తెరిచి లోపలకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు

అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం (డిసెంబర్ 22)  ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో  ఓడిపోయింది.   అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన  పాకిస్థాన్ నిర్ణీత  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి   347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌  113 బంతుల్లో 172 పరుగులు చేశాడు.  అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్‌ హుస్సేన్‌  56  పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో  దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది.  భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్.  కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.   పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు  భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు.  సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లతో  నో హ్యాండ్‌ షేక్‌  విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.   కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు  భారత జట్టు కెప్టెన్  ఆయుష్‌ అవునప్పుడు కూడా  అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు.  ఆసియా క్రికెట్‌ మండలి  ఏసీసీ  చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్.. గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్ ని మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ ను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న సుక్మా జిల్లాలో వారికి చెందిన భారీ ఆయుధాల కర్మాగారాన్ని గుర్తించిన పోలీసులు, భద్రతా బలగాలు దానికి ధ్వంసం చేశారు. సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది. ఈ ఆయుధ డంప్ ను మావోయిస్టులు భద్రత దళాలపై దాడికి ఉపయోగిస్తారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ డంప్ ధ్వంసంతో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఆటంకం తప్పదని తెలిపారు.   ఈ ఆయుధ డంప్ లో  ఆయుధాల తయారీ సామగ్రి, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  భద్రతా దళా లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అక్కడ నిల్వ ఉంచారన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ దాక్కుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో అడవులను అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలిపిన భద్రతా బలగాలు  నిర్దిష్టగడువులోగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది  సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్.  4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం.  ఈ నెల 24  ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో  చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు.   బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే   కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ  బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్  తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్  2 ఉపగ్రహానికి పూజలు చేశారు.