జూబ్లీ ఉప ఎన్నికల్లో 300 మంది మాలల నామినేషన్లు

  తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో గత ఐదు నెలలుగా ఎస్సీలోని 58 కులాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో ఎదురవుతున్న నష్టాన్ని నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ....గత ఐదు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందని, మాల సమాజానికి జరుగుతున్న అన్యాయం, రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఆకాంక్షను, ఆవేదనను తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ మాల సమాజానికి జరుగుతున్న అన్యాయంపై తమ నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో 300 మంది మాలలు నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు. ఐదు నెలలుగా గ్రూప్-3లోని మాల 25 కులాలకు జరుగుతున్న నష్టంపై ఈ పోటీ ఒక నిరసన యుద్ధంగా ఉంటుందని తెలిపారు.  

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

  ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. జోయెల్ మోకీర్, అఘీయన్, పీటర్ హూవీట్‌‌కు నోబెల్ బహుమతి దక్కింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధి సిద్దాంతానికి గాను ఈ పురస్కారం అందించనున్నట్టు నోబెల్ ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. ఫిలిప్ అఘియన్, పీటర్ హౌయిట్‌లకు ‘ఇన్నోవేషన్-డ్రైవెన్ ఎకనామిక్ గ్రోత్’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు గాను ఈ గౌరవం లభించింది.  జోయెల్ మోకిర్ అమెరికన్-ఇజ్రాయెల్ ఆర్థిక చరిత్రకారుడు. ప్రస్తుతం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావాన్ని ఆయన విస్తృతంగా పరిశీలించారు. ఫిలిప్ అఘియన్ ఫ్రెంచ్-బ్రిటిష్ ఆర్థికవేత్త. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన, పోటీ, ఆవిష్కరణ, వృద్ధి మధ్య సంబంధాన్ని ప్రత్యేక మోడల్స్‌ ద్వారా వివరించారు. మరో శాస్త్రవేత్త పీటర్ హౌయిట్ కెనడాకు చెందినవారు.  బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన, ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలో ఎలా పనిచేస్తాయో గణిత మోడల్స్‌ ద్వారా ప్రపంచానికి చూపించారు. మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (సుమారు 12 మిలియన్ అమెరికన్ డాలర్లు) విలువైన ఈ బహుమతి ముగ్గురికి సమానంగా పంచనున్నారు. కాగా ఇటీవలే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో శాస్త్రవేత్తలకు , అలాగే శాంతి పురస్కారాలని నోబెల్ కమీటి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సీఐఐ సదస్సు

అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం  రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక  కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.  విశాఖపట్నంలో  వచ్చే నెల 14, 15 తేదీలలో  రెండు రోజుల పాటు  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ సన్నాహకాలపై ఆయన సచివాలయంలో  సోమవారం (అక్టోబర్ 13)   ఆయన సమీక్ష నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్‌ను  ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.  వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్-గ్లోబల్ సీఈవోలను కూడా ఈ సదస్సుకు ఆహ్వాచించాలని ఆయన అదికారులకు నిర్దేశించారు.  దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లకు ఈ సదస్సులో   ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్సఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్‌లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశంచేశారు.  ఈ సదస్సు సందర్భంగా విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆయన అలాగే సదస్సుకు వచ్చే ప్రతినిథులకు మంచి ఆతిథ్యమివ్వాలన్నారు.   గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం త్వరలోనే ఏఐ, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుంది. సదస్సులో ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలన్నారు.  ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.  ఇలా ఉండగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో సీఐఐ సదస్సు నిర్వహించడం ఇది నాలుగో సారి.  గతంలో 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్ల పాటు మూడు  విశాఖలో వేదికగానే సీఐఐ సదస్సులు జరిగాయి.  ఇప్పుడు జరగనున్న ఈ సీఐఐ సదస్సు  టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్  థీమ్‌తో  నిర్వహించనున్నారు. మొత్తం 13 సెషన్లుగా జరిగే ఈ సదస్సులో..  29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు  హాజరవుతారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.  ట్రేడ్, జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీ-ఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్-సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీ-క్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. అయితే ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలుదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించడంతో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ పాల్గొన్నారు.

డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్

  డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన సస్పెండెట్ నేత కోట వినుత వీడియో విడుదల చేశారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ కంటే హత్య చేశారని చెప్పడమే బాధగా ఉందన్నారు. తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది.  కోర్టులో కేసు ఉంది. కావునా ఎక్కువ మాట్లాడలేను. త్వరలో నిజాలు బయట వస్తాయన్నారు. ఈ కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలను బయటపెడతామని వినూత వీడియోలో పేర్కొన్నాది. విదేశాలలో లక్షల జీతాలు వదులుకొని  ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.  మరోవైపు గత కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  2023 నవంబర్ నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో టచ్‌లో ఉన్నాను. జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, అలాగే సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి ద్వారా పరిచయం ఏర్పడింది అని పేర్కొన్నారు.అలాగే, వినూత కోటాకు సంబంధించిన రాజకీయ, వ్యక్తిగత వివరాలన్నీ తానే ఎమ్మెల్యేకు అందించానని, ఆ సేవలకు ప్రతిఫలంగా 2024 ఎన్నికల ముందు రూ.20 లక్షలు అందుకున్నానని వీడియోలో తెలిపారు. ఇంకా ఆయన చెప్పిన మరో సంచలన అంశం— వినూత కోటా, చంద్రబాబు కోటా లను చంపాలని ఎమ్మెల్యే ఆదేశించాడని, ఆ ఆదేశాల మేరకు రెండు సార్లు కారు ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశానని చెప్పారు.అదేవిధంగా, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా వచ్చి, వినూత కోటా, చంద్రబాబు కోటా ప్రైవేట్ వీడియోలు తీయాలని బెదిరించాడని, అందుకోసం మరో రూ.30 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టాడని శ్రీనివాసులు వీడియోలో వెల్లడించారు. కెమెరాలు బెడ్రూంలో ఏర్పాటు చేసే సమయంలోనే తాను పట్టుబడ్డానని తెలిపారు. డ్రైవర్ శ్రీనివాసులు విడుదల చేసిన ఈ వీడియో బయటకు రావడంతో శ్రీకాళహస్తి ప్రాంతంలో కలకలం రేగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

బాటిల్ బాగోతం బయటపెట్టే ఎక్సైజ్ సురక్షా యాప్!

ముల‌క‌ల‌చెరువు, ఇబ్ర‌హీంప‌ట్నం న‌కిలీ మ‌ద్యం వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు చాలా చాలా సీరియ‌స్ అయ్యారు. ఈ విష‌యంలో ఎన్నో రాజ‌కీయ కుట్ర కోణాలున్నాయ‌ని.. వాటిని తానిపుడు చెప్ప‌న‌నీ.. న‌లుగురు ఐపీఎస్ ల‌తో పాటు మ‌రొక ఎక్సైజ్ అధికారితో ఈ కేసు విచార‌ణ జ‌రుపుతామ‌ని, దీని ద్వారా ఈ మొత్తం వ్య‌వ‌హారంలోని అస‌లు కుట్ర మొత్తం బ‌య‌ట ప‌డుతుంద‌ని అన్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. తాను ఇటీవ‌లే 15 వేళ్ల పాటు సీఎంగా ప‌ద‌వీ కాలం పూర్తి చేశాన‌నీ.. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంలో కూడా అంతే కాల‌మున్నాన‌నీ.. అలాంటి త‌న‌కు ఇలాంటి వ్య‌వ‌హారం ఎక్క‌డా త‌గ‌ల్లేద‌ని అన్నారుచంద్రబాబు. డ‌బుల్ ఈఎన్ఏ తీసుకొచ్చింది తానేన‌నీ. మంచో చెడో కొంద‌రు మందుబాబుల‌కు ఈ వ్య‌స‌నం అల‌వాటైంది. వారిని తాగ‌మ‌ని ప్రోత్స‌హించ‌డం కాదు కానీ, వారి ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ త‌న‌కు  అత్యవసరం అని అన్నారు చంద్ర‌బాబు.  అందులో భాగంగా తాము ఎక్సైజ్ సుర‌క్ష అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చామ‌నీ.. ఈ యాప్ ద్వారా బాటిల్ ట్రాకింగ్ ఈజీగా చేయ‌వ‌చ్చ‌ని.. ఒక్క‌సారి మీరు ప్లే స్టోర్ కి వెళ్లి.. ఏపీ ఎక్సైజ్ సుర‌క్ష  యాప్ డౌన్ లోడో చేస్కుని.. స్కాన్ చేసుకుంటే.. అస‌లీ బాటిల్ ఎప్పుడు- ఎక్క‌డ-  ఎలా త‌యారైంది? ఆ వివ‌రాలేంటి? అనే అంశాల‌తో కూడిన ట్రేస‌బిలిటీ నుంచి దాని క్వాలిటీ స‌ర్టిఫికేష‌న్ తో స‌హా అన్ని అందులో న‌మోదు అయ్యి ఉంటాయని అన్నారు.  ఆ మాట‌కొస్తే తాము ఫించ‌న్లు ఎలా ఇస్తున్నామో జియో ట్యాగింగ్ తో స‌హా తెలిసిపోతుంద‌ని అన్నారు. ఒక బాటిల్ ఎవ‌రు- ఎప్పుడు- ఎక్క‌డ  అమ్మారు? కొన్నార‌న్న డీటైల్స్ మొత్తం ఇందులో ఎగ్జిబిట్ అవుతాయ‌ని. ఒక్క‌సారి ఒక బాటిల్ అమ్మ‌డంతో ఈ కేస్ హిస్ట‌రీ అక్క‌డితో క్లోజ్ కావాల‌ని.. ఇక్క‌డ కొని మ‌రొక చోట అమ్మినా ఆ విష‌యం కూడా మ‌న‌కు ఈ యాప్ ద్వారా తెలిసిపోతుంద‌ని.. ఇక‌పై బెల్ట్ షాపులు న‌డ‌వ‌టం అంత తేలిక కాద‌ని అన్నారాయ‌న‌. బెల్ట్ షాపులు న‌డిపితే బెండు తీస్తామ‌ని హెచ్చ‌రించారు సీఎం చంద్ర‌బాబు. అస్త‌వ్య‌స్తంగా ఉన్న అబ్కారీ శాఖ‌ను అంచెలంచ‌లుగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని.. సిబ్బంది సైతం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. లేకుంటే త‌ర‌త‌మ బేధాలు చూడ‌కుండా వారిపైనా క‌ఠిన  చ‌ర్య‌లుంటాయ‌ని వార్న్ చేశారు  చంద్ర‌బాబు. ఈ న‌కిలీ మ‌ద్యం కేసులో కీల‌క నిందితుడైన జ‌య‌చంద్రారెడ్డి త‌మ పార్టీ వాడైనా స‌రే ఎక్కువ ఆలోచించ‌కుండానే స‌స్పెండ్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు. ఇక ఏ1 నిందితుడు జ‌నార్ద‌న‌రావును కూడ అరెస్టు చేసి వివ‌రాలు రాబ‌డుతున్న‌ట్టు చెప్పారు చంద్ర‌బాబు. ఫ్యూచ‌ర్ లో దీని వెన‌కున్న రాజ‌కీయ కుట్ర కోణం మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అన్నారాయ‌న‌. ఒక వేళ ఈ బాటిల్ ట్రాకింగ్ లో.. ఒక న‌కిలీ బాటిల్ బ‌య‌ట ప‌డితే.. అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో కూడా తెలిసిపోతుంద‌ని.. నేర‌స్తులు ఈ విష‌యం గుర్తించాల‌ని అన్నారు చంద్ర‌బాబు. లేదు మా వెన‌క వాళ్లున్నారు వీళ్లున్నార‌ని వేషాలు వేస్తే.. వారి తాట తీస్తామ‌ని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు సీఎం చంద్ర‌బాబు.

అమరావతిలో సీఆర్డీయే భవన ప్రారంభం

రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసిన చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంతంలో మరో అధునాతన కట్టడం ప్రారంభమైంది. రాజధాని అమరావతికి గుండెకాయ వంటి సీఆర్డీయే భవనాన్ని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (అక్టోబర్  13)  ప్రారంభించారు.   ఏడు ఫ్లోర్లతో , రెండున్నర  లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించిన భవనం ప్రారంభం కావడం రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక ముందడుగుగా చెప్పవచ్చు. కాగా ఈ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కూడా భాగస్వాములను చేశారు  ఈరోజు ఉదయం 9.54 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. సీఆర్డీయే భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబుకు   పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి సీఎం చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన భవనమంతా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్న మంత్రి నారాయణ.. భవన నిర్మాణ శైలి, సౌకర్యాలను సీఎంకు వివరించారు. వాస్తవానికి సీఆర్డీయే భవన నిర్మాణం 2019లోనే  పూర్తైనప్పటికీ, అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ కూడా భవన ఎలివేషన్ పనులను నిలిపివేసింది. తిరిగి 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే మిగిలిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది.  సీఎం చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు  సీఆర్డీఏ కార్యాలయాన్ని  అత్యాధునిక  హంగులతో రూపొందించారు. పూర్తి సౌండ్ ప్రూఫ్ విధానంతో ఈ నిర్మాణా లు జరిగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అమరావతి  నగరవ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో,  సీసీ కెమెరాలును ఏర్పాటు చేసి..  వాటి ద్వారా వచ్చే ఫీడ్ ను ఈ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. వీటితోపాటు డ్రోన్ ద్వారా చిత్రీకరించే దృశ్యాలను కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని కమాండ్ కంట్రోల్ రూమ్  లో ఏర్పాటు చేశారు.  రాజధాని నగరంలోని కీలక ప్రాంతాలు ,భవనాలకు సంబంధించిన మైక్రో లెవల్  డిజైన్ ఎక్స్పీరియన్స్  ను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్ ప్రణాళిక ను ఈ కేంద్రంలోని నమునాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది.  అదేవిధంగా సచివాలయం ,హైకోర్టు, అసెంబ్లీ, రాజభవన్, సీఎం నివాసం తో పాటు క్వాంటం వ్యాలీ  ఉద్యానవనాలు, రహదారులు తదితర డిజైన్లను ఈ కార్యాలయం నుండి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వీక్షించే వీలు ఉంటుంది.  ఈ భవనం  మొదటి అంతస్తులో  కమాండ్ కంట్రోల్ సెంటర్   ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్యాంటీన్లు ,ఇతర ఎక్స్పీరియన్స్ సెంటర్లను నిర్మించారు.  కాన్ఫరెన్స్ హాల్స్ కూడా మొదటి అంతస్తులోనే ఉన్నాయి. ఇక పోతే..    రెండు, మూడు, ఐదు అంతస్తులు సిఆర్డిఏ వర్క్ స్టేషన్లు,  నాలుగో అంతస్తులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలకు కేటాయించారు. ఇక ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం ,ఏడో అంతస్తులో మున్సిపల్  శాఖ మంత్రి పేషీ , ప్రజా ఆరోగ్య శాఖ తదితర కార్యాలయాల కు కేటాయించారు ..మొత్తం 4.23 ఎకరాలలో నిర్మించిన ఈ భవనంలో, మొత్తం 2.42 లక్షల చదరపు అడుగులు బిల్ట్  ఏరియా ఉంది.... ప్రతి అంతస్తులో 33 వేల చదరపు అడుగులు అందుబాటులో ఉంటుంది. 

గ్రేటర్ కమ్యూనిటీలో దొంగల బీభత్సం

గ్రేటర్ కమ్యూనిటీ లో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రేటర్ కమ్యూనిటీ అంటేనే పూర్తి భద్రత, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ఎటువంటి భయానికీ తావులేకుండా ప్రశాంతంగా ఉండొచ్చనే ఎవరైనా గ్రేటర్ కమ్యూనిటీలో ఇళ్లు తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎక్కువైనా భద్రతకు సంబంధించిన భరోసా ఉంటుందన్న భావనతో గ్రేటర్ కమ్యూనిటీలకే మొగ్గు చూపుతారు.   అయితే అటువంటి గ్రేటర్ కమ్యూనిటీలోనే ఆదివారం (అక్టోబర్ 12) అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇళ్లల్లోకి చొరబడి భారీగా దోచుకున్నారు. ఈ ఘటన హిమాయత్ నగర్ పీఎస్ పరిధిలోని సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో జరిగింది. ఈ కమ్యూనిటీలోని రెండు విల్లాలలో దొంగలు భారీ ఎత్తున నగదు, బంగారం దోచుకున్నారు. గ్రేటర్ కమ్యూనిటిలో తాళం వెసి ఉన్న రెండు విల్లాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. చొరీకి ముందు  ఆ ప్రాంతంలోని సీసీ కెమేరాలను ఆపి వేసి, సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ముఖానికి మాస్క్ వేసుకున్న దొంగలు  ఆ రెండు ఇళ్లల్లోనూ కలిపి 60 వేల రూపాయలకు పైగా నగదు, 35 గ్రాముల బంగారం, ఐదు కేసీల వెండి, విలువైన చీరలు దోచుకున్నారు.  ఫుల్ సెక్యూరిటీ ఉన్నా కూడా గ్రేటర్ కమ్యూనిటీలో చోరీ జరగడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు   కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

వేద విశ్వవిద్యాలయంలో మరో రెండు చిరుతలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో  చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి వర్సిటీ ప్రాంగణంలోని ఉద్యోగుల క్వార్టర్స్ సమీపంలోకి చిరుత వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి.  ఇటీవల అటవీశాఖ అధికారులు ఒక చిరుతను బంధించిన సంగతి తెలిసిందే. దీంతో ఊపిరి పీల్చుకున్న వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది అంతలోనే మరో చిరుత సంచరిస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.  అధికారుల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతలను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.. రాత్రి వేళల్లో సిబ్బంది, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఎవరూ బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించారు.   

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. సోమవారం  (అక్టోబర్ 13) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా ఆదివారం  (అక్టోబర్ 12) శ్రీవారిని మొత్తం 84,424 మంది దర్శించుకున్నారు. వారిలో 27,872 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 06  లక్షల రూపాయలు వచ్చింది. 

పెట్టుబడుల రాకతో ఏపీ ఆదాయానికి బూస్ట్

ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందా అంటే.. పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులూ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రం నలుమూలలా విస్తరించేలా తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. ఆ కారణంగానే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానికి పరిశ్రమలు.. ఇలా ఒకటనేమిటి.. పలు పరిశ్రమలు ఏపీలో అడుగుపెడుతున్నాయి పెట్టుబడులు, పరిశ్రమల రాకవల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందులో సందేహం లేదు. కానీ ఆ ప్రయోజనం అంతటితో ఆగదు.. పెట్టుబడుల రాకవల్ల రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. పెరుగుతోంది.  ఈ పెట్టుబడుల్లో 30శాతం పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయానికి జమ అవుతుంది.రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విశాఖలో గూగుల్ డేటాసెంటర్ రాకతో ఏపీకి దాదాపుగా పదివేల కోట్ల ఆదాయం వస్తుంది.  అలాగే ఇతర పరిశ్రమల రాకవల్ల కూడా. అందుకోసమే.. రాష్ట్రంలోకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలూ కూడా తమ తమరాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారికి ప్రోత్సహకాలు ఇస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. అయితే రాష్ట్రంలో పెట్టుబడులకే పారిశ్రమిక వేత్తలు ఆసక్తి చూపడానికి కారణమేంటంటే.. ఇక్కడ ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబుపై విశ్వసనీయత, పారిశ్రామిక అబివృద్ధికి దోహదపడటంలో ఆయనకు ఉన్న విశ్వసనీయత కారణంగా చెప్పవచ్చు.  ఇక పరిశ్రమలు గ్రౌండ్ అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే.. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన తరువాత.. మొత్తం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు ఆ నగరమే కావడమే. ఇక అనంతపురంలో కియా పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, నిరంతరాయంగా వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన రాయతీల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఆ ఆదాయం ఉంటుంది.  తమ ఉత్తత్తులపై పన్నులు, ఇతర పన్నులు అన్నీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేవే.  అందుకే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్, గుడ్ విల్ కారణంగా పెట్టుబడిదారులు ఏపీవైపు చూస్తున్నారు. 

ఈ నెల 25న మలయప్ప స్వామి దర్శనం

  తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన‌ నాగుల చవితి ప‌ర్వ‌దినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు.అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.  

బీసీ రిజర్వేషన్ల బంద్ వాయిదా

  తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బంద్ అక్టోబర్‌ 18కి వాయిదా పడింది. రిజర్వేషన్ల కోసం ఇవాళ పలు బీసీ సంఘాలు ఒక్కటై బీసీ జేఎసీగా ఏర్పాడ్డాయి. ఛైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్‌ నారగొని,వర్కింగ్ ఛైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్‌గా దాసు సురేష్ , రాజారామ్ యాదవ్‌లు ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వాస్తవానికి అక్టోబర్‌ 14న బీసీ సంఘాలు బంద్‌ చేపట్టాల్సి ఉంది.  అయితే ఈ క్రమంలో బీసీ సంఘాలు ఆదివారం (అక్టోబర్‌ 12) సమావేశమయ్యాయి. ఈ భేటీలో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించాయి.    

కులం ఆధారంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు : మంత్రి వివేక్‌

  మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా నాపై కుట్రలు చేస్తునారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మాలల ఐక్య సదస్సలో మంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారన్నారు. నేను మాల జాతికి చెందిన వాడిని అని అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తున్నాడు.  జూబ్లీ హిల్స్ ఇంచార్జ్ గా కాంగ్రెస్  పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందని విమర్శలు చేసున్నారని ఆయన అన్నారు.లక్ష్మణ్ నా పై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు. లక్ష్మణ్ వచ్చినపుడు నేను వెళ్ళిపోతున్నాను అనటం అబద్ధమని పేర్కొన్నారు. నాకు మంత్రి పదవి పై మోజు లేదని వివేక్ అన్నారు. లక్ష్మణ్ ను రాజకీయంగా ప్రోత్సహించింది వెంకటస్వామి అని మర్చిపోతున్నాడని వాపోయారు.   కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు.. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగా మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదు.. నన్నే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నన్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజును టార్గెట్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు.  మా ఇమేజ్, పేరును డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించినా మేము ఎక్కడా వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు.  

అర్థరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది : సీఎం మమతా

  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టళ్లలో ఉండే అమ్మయిలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని ఆమె సూచించారు. మెడికల్ స్టూడెంట్ గ్యాంగ్‌రేప్‌పై ఘటనపై మమతా బెనర్జీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హాస్టల్ నుంచి అర్థరాత్రి 12 :30 గంటలకు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు.  అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మణిపుర్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని మమతా అన్నారు. ఒడిశాకు చెందిన యువతి పశ్చిమ బెంగాల్‌లో అత్యాచారానికి గురైంది. జలేశ్వర్‌కు చెందిన ఆమె దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం కోసం స్నేహితుడితో కలిసి కాలేజీ క్యాంపస్ బయటకు వెళ్లిన విద్యార్థినిని కొందరు యువకులు వెంబడించారు. బైక్‌లపై వచ్చిన వారు అసభ్యంగా ప్రవర్తించి, ఆమె స్నేహితుడిని బెదిరించి పంపించివేశారు. అనంతరం విద్యార్థినిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి మొబైల్‌ ఫోన్‌ను కూడా దొంగిలించారు. తరువాత స్నేహితుడు మరికొందరిని తీసుకెళ్లి అక్కడికి చేరుకోగా, విద్యార్థిని తీవ్ర గాయాలతో కిందపడి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో షేక్ రియాజుద్దీన్‌, అపు బౌరి‌, ఫిర్దోస్ షేక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ సమర్పించాలని పశ్చిమ బెంగాల్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. బాధిత విద్యార్థినికి అన్ని విధాల సహాయం అందిస్తామని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.

రూ.78 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత

  స్మగ్లర్లు కొత్త కొత్త వ్యూహాలతో డ్రగ్స్ ని రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి ఎత్తులను అధికారులు చిత్తు చిత్తు చేసి... జైలుకు పంపుతున్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్ర యంలో కస్టమ్స్ అధికారులు కొన్ని కోట్ల విలువ చేసే విదేశీ గంజాయిని పట్టుకుని... స్మగ్లర్ల ను కటకటాల వెనక్కి పంపిం చారు.. విదేశీ గంజా యిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా కస్టమ్స్ అధికారు లకు విశ్వసనీయ మైన సమాచారం రావడంతో వెంటనే వారు ముంబై ఎయిర్ పోర్ట్ లో మాటు వేశారు.  ఓ పదిమంది స్మగ్లర్లు బ్యాంకాక్ నుండి ముంబై అంతర్జా తీయ విమానాశ్ర యంలో దిగారు. వారి నడవడికపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు వెంటనే వారందరినీ అడ్డుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ల కు సంబంధించిన ట్రాలీ బ్యాగ్ స్క్రీనింగ్ చేయగా విదేశీ గంజాయి వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అను మానం కలగకుండా గంజాయిని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి... ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో దాచిపెట్టి పైన వస్తువులు పెట్టు కుని... దర్జాగా ఎయిర్ పోర్ట్ లో దిగి బయటికి వెళ్లేం దుకు ప్రయత్నిం చారు.  ఈ కేటు గాళ్లు..... కానీ కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో విదేశీ గంజాయి వ్యవ హారం కాస్త గుట్టు రట్టు అయింది. దీంతో కస్టమ్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై 10 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.78 కోట్ల విలువచేసి 78 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకు న్నారు. అనంతరం ఎన్డిపిఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు.

పెళ్లైన 13 రోజులకే యువతి ప్రెగ్నెన్సీ... యువకుడు షాక్

  వివాహం జరిగిన 13 రోజులకే  ఒక నవవధువుకి విపరీ తమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో నవ వరుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు చెప్పిన మాటలు విన్న నవ వరుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది... అనంతరం నవ వరుడు తన భార్య వద్దకు వెళ్లి అసలు నిజం చెప్పమని వేడుకున్నాడు. భార్య చెప్పిన షాకింగ్ న్యూస్ విని తనను మోసం చేశారంటూనవ వరుడు పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  సిద్దిపేట జిల్లాలోని ములుగు లో నివాసముంటు న్న ఓ యువకుడు అంగరంగ వైభవం గా వివాహం చేసుకున్నాడు. తన జీవితంలోకి అడు గుపెట్టిన యువతిని సంతోషంగా చూసు కోవాలని అనుకు న్నాడు. అలా నవ వరుడు 12 రోజులు ఆనంద డోలికల్లో విహరించాడు... 13వ రోజు అనగా ఈనెల 8వ తేదీన నవవధువు తీవ్ర మైన కడుపు నొప్పితో బాధప డుతూ ఉండడం గమనించిన నవ వరుడు వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు. ఆమెను పరీక్ష చేసిన వైద్యులు బయటికి వచ్చి అసలు విషయం నవవరుడికి చెప్పారు. వైద్యులు చెప్పిన మాటలు విన్న ఆ యువకు డికి నోట మాట రాలేదు. ఇదెలా సాధ్యం మాకు వివాహమై కేవలం 13 రోజులే అవు తుందని వైద్యులతో చెప్పాడు... అనంతరం యువకుడు నేరుగా వెళ్లి నవ వధువును నిలదీసి అడిగాడు. దీంతో నవవధువు అసలు విషయం చెప్పింది... ఉదయ్ కిరణ్ అనే యువ కుడు ప్రేమ పేరుతో తనను శారీరకంగా లొంగ దీసుకున్నాడు.ఈ విషయం తెలు సుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో యువకుడు నన్ను బెదిరింపులకు గురిచేసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ విషయం నా తల్లి దండ్రులకు కూడా తెలుసు.... అయినా కూడా నా తల్లిదం డ్రులు ఈ విషయం దాచిపెట్టి మీకు ఇచ్చి వివాహం చేశారని నవవ ధువు అసలు విషయం చెప్పింది. తనను మోసం చేసి పెళ్లి చేశారని నవ వరుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

జూబ్లీహిల్స్‌లో ఓటుకు రూ.10 వేలు : కేటీఆర్‌

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని ఆయన సుచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హైదరాబాద్‌ షేక్‌పేట డివిజన్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు చెర్క మహేశ్‌.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. . కాంగ్రెస్‌ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని.. రాష్ట్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు.  ఈ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌ పార్టీకి సోయి వస్తదని అన్నారు. రెండేళ్లలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెడతారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఓటుకు రూ.10 వేలు కూడా ఇస్తామంటారని తెలిపారు. బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని అన్నారు.  హైదరాబాద్‌లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే మళ్లీ మాజీ సీఎం కేసీఆర్‌ మళ్లీ రావాల్సిందే అని మాజీ మంత్రి అన్నారు. అది జూబ్లీహిల్స్‌ నుంచి మొదలు కావాల్సిందే అన్నారు. అప్పుడే ఎన్నికల హామీల అమలులో చేసిన మోసంతో ప్రజలు కోపంగా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకుంటుందన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోతేనే నెలకు రూ.4వేల పెన్షన్‌ వస్తుందని.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని స్పష్టం చేశారు. అదే కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే.. ప్రజలను.. ఎంత మోసం చేసినా ప్రజలు ఏమీ అనరనే ధీమాలోకి వెళ్లిపోతారని కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లో లారీ ఢీకొని ఇద్దరు మృతి

  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు  వ్యక్తులు మృతి చెందారు... నగరంలో ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో గ్రీన్ ల్యాండ్ నుండి బేగంపేట వైపు వెళ్తున్న ఇసుక లారీ వెనక నుండి ముందు వస్తున్న ఒక హోండా యాక్టి వా ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండ డంతో వెంటనే అతన్ని సోమాజి గూడ లో ఉన్న యశోద హాస్పిటల్ కి తరలించారు అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు నవీన్, జగదీష్ చంద్రగా పోలీసులు గుర్తించారు.  ఖమ్మం జిల్లా హవేలీ రూరల్ కు చెందిన ముద్దంగల్ నవీన్ (30) హైదరాబాద్ నగరానికి వచ్చి జేఎన్టీయూ పరిధిలో నివాసం ఉంటే రాపిడో డ్రైవర్గా పనిచేస్తు న్నాడు. అలాగే కరీంనగర్ జిల్లా ధర్మపురి కి చెందిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర (35) హైదరాబాదులోని బేగంపేట్ కుండన్ బాగ్ లో నివాసం ఉంటూ కిమ్స్_సన్ షైన్ హాస్పిటల్ లో జనరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్నాడు.  ఈ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న సమ యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద వైట్ హౌస్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పరిణ స్థలానికి చేరుకుని నాగూర్ కర్నూల్ జిల్లాకి చెందిన లారీ డ్రైవర్ శంకర(38) ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

ఎస్సారెస్పీకి దామోదర్‌ రెడ్డి పేరు : సీఎం రేవంత్‌రెడ్డి

  సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని సీఎం అన్నారు.  సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలవకపోయిన ప్రజల కోసం ఆయన పనిచేశారని రేవంత్‌ తెలిపారు. ఎస్సారెస్పీ-2కి ఆర్‌డీఆర్‌  దామోదర్‌ రెడ్డి అని నామకరణం చేస్తామని దీనిపై 24 గంటల్లో జీవో తెస్తామని సీఎం అన్నారు.  ఆయన కుటుంబానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అండగా ఉంటుందని సోనియా గాంధీ చెప్పారు. ఆయన కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తాం. దామన్న మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సంతాపం తెలిపారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉన్నా దామోదర్ రెడ్డి.. తన ఆస్తులు నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలకే అంకితం చేశారని కొనియాడారు.  భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా దామోదర్ రెడ్డి కుటుంబానికి గాంధీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ముఖ్యంగా రిజర్వేషన్ల పరంగా తుంగతుర్తి నియోజకవర్గం వదిలి సూర్యాపేటకు వెళ్లినప్పటికీ కూడా దామోదర్ రెడ్డి సొంత ప్రాంతాన్ని ఏనాడు మర్చిపోలేదని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఒకప్పటి సుజాతనగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్య వహించిన రాంరెడ్డి సోదరులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి జోడిద్దుల్లాగా జెండాను మోసారని గుర్తు చేశారు