నటుడు అయ్యంగార్‌పై "మా" విష్ణుకు ఫిర్యాదు

  మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య కర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యం గార్  పై  చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్...మా అసోషియేషన్ అధ్య క్షులు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు.... అక్టోబర్ రెండో తేదీన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజు సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అయ్యాంగర్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.  అది చూసినట్టు డిజైన్లు విమర్శల వర్షం కురిపించారు. దీంతో సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అయ్యాంగర్ ఓ వీడియో విడుదల చేశారు. మహాత్మా గాంధీ గురించి ఓ పోస్టు పెడితే చాలా మంది విమర్శలు చేశారని వాటి గురించి నేను అంతగా పట్టించుకోనని... అయినా మహాత్మాగాంధీ గురించి మీకేం తెలుసురా... అంటూ మహాత్మా గాంధీ గురించి అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేశాడు. అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో... నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.  ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఈరోజు ఉదయం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు మనోజ్ ని కలిశారు. మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యాంగార్ పై తక్షణమే చర్యలు తీసు కోవాలి.. అంతేకాకుండా అతడి మా సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ మంచు మనోజ్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మా  అసోసియేషన్ విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని మంచు మనోజ్ తెలిపారు

భారతీ సిమెంట్‌కు షాక్

  ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ కార్పొరేషన్ కు ఇచ్చిన రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దం అవుతోంది.కేంద్ర గనుల నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో భారతి సిమెంట్స్‌కు మంజూరైన రెండు సున్నపురాయి లీజులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.  కేంద్ర గనులశాఖ అభ్యంతరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి, అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ లీజులు చట్టవిరుద్ధంగా మంజూరైనట్టు గుర్తించింది. రాష్ట్ర గనులశాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే, భారతి సిమెంట్స్‌కు ఇచ్చిన రెండు లీజుల రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2015లో కేంద్రం సవరించిన గనుల చట్టం ప్రకారం, సున్నపురాయి వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి. అలాగే, 2015 జనవరి 12కు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా, 2017 జనవరి 11లోపు అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ స్వయంగా రద్దు అవుతుందని నిబంధనల్లో స్పష్టం చేశారు. కానీ, ఈ నిబంధనలను పక్కనబెట్టి 2024 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాటి సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ (తన సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న సంస్థ)కు రెండు లీజులను మంజూరు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీజులు కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లోని 509.18 ఎకరాలు మరియు 235.56 ఎకరాల భూములపై ఇవ్వబడ్డాయి. వాస్తవానికి ఈ భూములు రఘురాం సిమెంట్స్‌కు చెందినవిగా ఉండగా, 2009లో భారతి సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.  

విజయవాడ దుర్గగుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం

  విజయవాడ ఇంద్రకీలాద్రి  కనకదుర్గ ఆలయం దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం రాజగోపురం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటలనుండి కార్యక్రమం ప్రారంభం అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనా నాయక్ 16 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, 1 ఎక్స్ అఫీషియో మెంబెర్, 2 ప్రత్యేక ఆహ్వానితులతో ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఇద్దరు సభ్యులు చైర్మన్ గా  బొర్రా రాధాకృష్ణ గాంధీ ని చైర్మన్ గా ప్రతిపాదించగా,మిగతా సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు. దాంతో  బొర్రా రాధాకృష్ణ  చైర్మన్ గా ఎన్నికయినట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. అనంతరం ధర్మకర్తల మండలి ప్రత్యేక సమావేశం జరిగింది. చైర్మన్,సభ్యులు  దుర్గా మల్లేశ్వరులకు, ప్రభుత్వమునకు ధన్యవాదములు తెలియజేసారు. అనంతరం ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో నూతన చైర్మన్, సభ్యులను ఆలయంలోనికి తోడ్కోని వెళ్లి అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం అందించారు.అనంతరం మహా మంటపం 6వ అంతస్తులో  ధర్మకర్తల మండలి చైర్మన్  బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వీకే. శీనా నాయక్ వార్లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఉన్న ప్రాముఖ్య ఆలయమైన  కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, మాస్టర్ ప్లాన్ అమలుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, దసరా లో ఈవో  సారద్యం లో పని చేసి ఉత్సవాలు విజయవంతం చేసిన రీతిలో సిబ్బంది అంతా అదే స్ఫూర్తి కొనసాగించాలని, ధర్మకర్తల మండలి మొత్తం సిబ్బంది, ఈవో గారితో కలసి మెలసి ఒకే కుటుంబంగా ముందుకు సాగుతామని  బొర్రా రాధాకృష్ణ గాంధీ పేర్కొన్నారు. దేవస్థానం ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ధర్మ కర్తల మండలి సహకారంతో ముందుకు సాగుతామని,భక్తులకు సరైన సౌకర్యాల కల్పన కు కృషి చేస్తామని పేర్కొన్నారు. కొండ దిగువున నూతనంగా సమాచారకేంద్రాల ఏర్పాటు, భక్తుల కోసం కొత్త బ్యాటరీ వాహనాల ఏర్పాటు చేస్తున్నామని ఈవో వివరించారు. భక్తి, ఆధ్యాత్మిక భావన ఉన్న ధర్మకర్తల మండలితో సంయుక్తంగా ముందుకు సాగుతామని తెలిపారు. నూతన ధర్మకర్తల మండలి చైర్మన్  బొర్రా గాంధీ, సభ్యులను రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి, కొల్లు రవీంద్ర, స్థానిక శాసన సభ్యులు  సుజనా చౌదరి,ప్రభుత్వ విప్  తంగిరాల సౌమ్య, స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్  పట్టాభిరామ్ తదితరులు పాల్గొని, అభినందనలు తెలియజేసారు.

ప్రధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం... ఎందుకంటే?

  రేపు ఈజిప్టులో జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని మోదీ హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీకి ఆహ్వానం పంపించారు. హమాస్, ఇజ్రాయేల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఈ ఒప్పందంలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మోదీ హాజరుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆకలి చావులతో తీవ్రంగా అల్లాడిపోతున్న  గాజాలో శాంతి సాధనకు అడుగులుపడిన విషయం తెలిసిందే.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని మొదటి దశను గమనార్హంగా ఇజ్రాయెల్, హమాస్ రెండూ అంగీకరించాయి. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు త్వరలో సంతకం చేయబోతున్నట్లు తెలిసింది. మొదటి దశ ప్రకారం గాజాలో దాడులను వెంటనే నిలిపివేయాల్సి ఉందని, హమాస్ తమ ధరల్లోని ఇజ్రాయెల్‌ బందీలను త్వరగా విడుదల చేయనూ, భదులుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వాటి నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలను వదిలివేయనుందని ప్రకటించారు. అదేవిధంగా, గాజా ప్రక్కన ఉన్న ఇజ్రాయెల్ సైన్యాన్ని వరుసగా వెనక్కి తీసుకెళ్లడం కూడా ఈ దశలో భాగమని వివరమవుతోంది.  

ఏఐ డేటా సెంటర్‌‌కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

  విశాఖలో ఏఐ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. నాస్ డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను సిఫీ అభివృద్ధి చేయనుంది. దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటుతో గ్లోబల్‌ డిజిటల్‌ గేట్‌వేగా విశాఖ మారనుంది  

గుప్తనిధుల కోసం తవ్వకాలు...వైసీపీ నేత అరెస్ట్

  చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం వీర్పల్లి కొండపై ఆదివారం అర్ధరాత్రి గుప్తనిధుల కోసం సాగిన తవ్వకాలు కలకలం రేపాయి. బంగారం కోసం తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మెరుపుదాడి చేశారు. దాడిలో వైసీపీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక జేసీబీ యంత్రం, ఒక కారు, నాలుగు మోటార్‌సైకిళ్లు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలం బంటపల్లెకు చెందినవారిగా తేలింది. ఇంకా ఇద్దరు స్వామీజీలు, మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం ప్రకారం, కొండపై పాతకాలపు నిధులు ఉన్నాయన్న వదంతులు నెలలుగా ప్రచారంలో ఉన్నాయి. ఆ నమ్మకంతో ఈ గుంపు రాత్రివేళ తవ్వకాలకు చేపట్టారని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుప్తనిధుల వేటలో రాజకీయ నేతల ప్రమేయం బయటపడటం చిత్తూరు జిల్లాలో పెద్ద చర్చగా మారింది.

సీఎం చంద్రబాబును అభినందిస్తూ ప్రధాని మోదీ ఫోన్

  ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుకు శనివారం ఫోన్ చేశారు. సీఎంగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దూరదృష్టి, నిబద్ధత, విలువల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందని మోదీ అన్నారు. ఇరువురు  సీఎంలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కలిసి పని చేశామని నాటి సంగతులను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి చంద్రబాబు చేస్తున్న కృషి కొనసాగాలని... ప్రజా సంక్షేమ బాటలో సీఎం చంద్రబాబు అంకితభావంతో చేస్తున్న కృషి మరింత ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు... ప్రధాని మోదీ సహకారంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తామని సీఎం చంద్రబాబు మోదీతో అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా మోదీ 25 ఏళ్లుగా దేశానికి సేవలందిస్తున్నారని చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేయగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.  

తిరుమలలో భక్తుల రద్దీ... దర్శనానికి 24 గంటలు

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరుకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్ల లేని వారికి  సర్వ దర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. వారాంతం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.  

నెల్లూరులో స్మార్ట్ బజార్.. వర్చువల్ గా ప్రారంభించిన చంద్రబాబు

మంత్రి పొంగూరు నారాయణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందించారు.   మెప్మా, డ్వాక్రా గ్రూపుల నుంచి   లక్ష మంది  యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్న చంద్రబాబు.. ఇందులో భాగంగా   రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరులో నిరుపేదలైన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి నారాయణ కార్యాచరణ చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.  నెల్లూరులోని మైపాడు రోడ్డు వద్ద ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 కంటైనర్లలో 120 షాపులను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు.    ఈ సందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నదని అందులో భాగంగా తొలి అడుగు నెల్లూరులో పడిందన్నారు. 120 మంది చిరు వ్యాపారులను ఎంటర్ప్రైన్నుర్లుగా తీర్చిదిద్దేలా  చర్యలు తీసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణను, నెల్లూరు జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.  చాలామంది వీధి వ్యాపారులను సొంత షాప్ యజమానులుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టడాన్ని ఆయన ప్రశంసించారు.   స్మార్ట్ స్ట్రీట్ బజారు ఏర్పాటు వల్ల నెల్లూరుకు మంచి లుక్ వచ్చిందనీ,   కార్పొరేట్ సిటీలో  లాగా కనపడుతున్నదనీ సీఎం అన్నారు. పర్యావరణ   నిబంధనలను పాటిస్తూ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అన్ని వసతులతో అన్ని రకాల వస్తువులు దొరికే విధంగా షాపులు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. పారదర్శకతతో షాపులు ఏర్పాటు చేసి వారికి చెన్నై వంటి మహానగరాలలో శిక్షణ ఇప్పించడం గొప్ప విషయమన్నారు.  మంత్రి నారాయణ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా మైపాడు రోడ్డులో 120 షాపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని వల్ల 120 మందికి ప్రత్యక్షంగా   500 మందికి పైగా  పరోక్షంగా ఉపాధి కల్పించడం జరిగిందన్నారు.  ఎన్నిక చేయబడిన చిరు వ్యాపారస్తులకు చెన్నైలోని బర్మా బజార్లో శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. స్మార్ట్ షాపుల కాంప్లెక్స్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లు 123 మున్సిపాలిటీలలో ఇలాంటి షాపులు ఏర్పాటు చేస్తామని నారాయణ చెప్పారు.    జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, ఆర్టీసీ జోనల్ మేనేజర్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మోడీ అభినందనలకు చంద్రబాబు థ్యాంక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ   ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అరుదైన మైలురాయిని చేరుకున్న చంద్రబాబుకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ   చంద్రబాబు రాజకీయ జీవితం  దార్శనికత, సుపరిపాలన పట్ల నిబద్ధత స్థిరంగా కొనసాగాయన్నారు.  2000 సంవత్సరం ప్రారంభంలో తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు.   ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం చంద్రబాబు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఆయనకు అన్నివిధాలా అండగా ఉంటాననీ ప్రధాని పేర్కొన్నారు. కాగా తనకు ఫోన్ చేసి మరీ అభినందించిన ప్రధాని మోడీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు మీ దార్శనిక నాయకత్వంలో వికసిత భారత్  లక్ష్యాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలక శక్తిగా నిలబెడతామని  మద్దతుతో స్వర్ణాంధ్రను నిర్మించేందుకు మోడీ సహకారం కావాలని ఆయనీ సందర్భంగా కోరారు.  అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఫోన్ కాల్ కు తాను ఎంతో సంతోషిస్తున్నానని చంద్రబాబు అన్నారు.  

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. ఆదివారం (అక్టోబర్ 12) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పడుతోంది. ఇక శనివారం (అక్టోబర్ 11) శ్రీవారిని మొత్తం 84,571 మంది దర్శించుకున్నారు. వారిలో 36,711 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70  లక్షల రూపాయలు వచ్చింది. 

విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు : రామ్మోహన్‌ నాయుడు

  విజయవాడ నుంచి సింగపూర్‌కు మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించినున్నట్లు  పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడి తెలిపారు. విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. నవంబర్‌ 15వ తేదీన విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌లోని ఛాంగీ విమానశ్రయానికి చేరకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే అంతార్జాతీయ కనెక్టవిటీని ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సౌకర్యం తెలుగు ప్రవాస భారతీయులకు విశేష ప్రయోజనం కలిగించడమే కాకుండా వ్యాపార, సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విమానయాన పటంలో గౌరవప్రదంగా నిలబెట్టే మైలురాయిగా నిలుస్తుందన్నారు. సింగపూర్‌లోని తెలుగువారికి మరిన్ని అవకాశాలు కల్పించేలా వైమానిక అనుసంధానాన్ని విస్తరించేందుకు మీరు చేపడుతున్న ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు.  

సచివాలయం పరిసరాల్లో పిచ్చి కుక్కల వీరంగం

  తెలంగాణ సచివాలయం పరిసర ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు వీరంగం సృష్టిస్తు న్నాయి. గత కొన్ని రోజులుగా సచివాలయం ప్రాంతంలో స్వైర విహారం చేస్తున్న స్ట్రే డాగ్స్ ఇప్పటికే ముగ్గురిని కరిచి గాయపరిచాయి. తాజాగా ఈరోజు మరో మహిళపై కూడా పిచ్చి కుక్క దాడి చేసింది. డైలీ పాస్ కౌంటర్, క్యాంటీన్, మీడియా సెంటర్ పరిసరాల్లో ఈ కుక్కలు కాపు కాస్తూ.... పాదాచా రులు, సచివాలయ సిబ్బంది, వాహనదా రులపై దాడులు చేస్తూ నానా హంగామా సృష్టిస్తు న్నాయి.  నిన్న ముగ్గురు సందర్శకులు గాయపడగా, ఈరోజు మరొకరు కుక్క దాడికి గుర య్యారు. దీంతో సెక్రటేరియట్ సిబ్బంది, సందర్శకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడదతో పాదాచారులు రోడ్లపై నడవటానికే భయపడుతున్నారుసచివాలయం సమీపంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్  కార్యాలయం దగ్గరే ఈ సంఘటనలు చోటుచేసుకోవడం విశేషం. .అయిన ప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సెక్రటేరియట్ సిబ్బంది రేబిస్ ఇంజెక్షన్లు సెక్రటేరి యట్ డిస్పెన్సరీలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. గతంలో వీధి కుక్కలు ఒంటరిగా ఉన్న చిన్నారులపై  విచక్షణారహితంగా దాడి చేసిన ఘట నలు ఎన్నో జరిగాయి... పలు ప్రాంతాల్లో పాదా చారులపై దాడులు చేసిన ఘటనలు కూడా జరిగాయి.. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తు న్నారంటూ ప్రజలు, సచివాలయం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ పోలీసులకు కమిషనర్‌ సజ్జనార్ కీలక సూచనలు

  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వి.సి. సజ్జనార్ నేడు మొదటిసారిగా నగరంలోని అన్ని విభాగాలు మరియు పోలీస్ స్టేషన్ల (లా & ఆర్డర్, ట్రాఫిక్) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ వ్యవస్థను మరింత ప్రజాను కూలంగా, సమర్థ వంతంగా మార్చ డంపై పలు కీలక సూచనలు, సలహాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్  మాట్లాడుతూ “గత ఆరు నెలలుగా సిటీ పోలీస్ ప్రతి విభాగంలోను అద్భుతంగా పనిచేసింది. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని సిపి అన్నారు. ఇదే ఉత్సాహంతో, నిబద్ధతతో ముందుకు సాగితే, హైదరాబాద్ కమిషనరేట్ ప్రతిష్టను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లవచ్చునని సిపి పేర్కొన్నారు. ఎవరైనా సరే  విధుల్లో నిర్లక్ష్యం చూపితే అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకో వడం అసహ్యకర మంటూ హెచ్చరిం చారు. కానీ విధులు సమర్థవంతంగా నిర్వర్తించిన సిబ్బందిని ప్రత్యేకం గా గుర్తించి ప్రశంసిస్తామని స్పష్టం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచే యడం ఎంత ముఖ్యమో వివరించారు. “పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదు దారులను మర్యా దపూర్వకంగా, సహానుభూతితో ఆదరించండి. మీ ప్రవర్తనే పోలీస్ శాఖ ఇమేజ్‌ను నిర్ణయిస్తుందని సిపి అన్నారు... ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్” కార్యక్రమం ప్రారంభం హైదరాబాద్ సిపి సజ్జనార్  కొత్తగా ‘ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్’ అనే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించారు. “విధి నిర్వర్తనతో పాటు మానవతా దృక్పథం తో పనిచేసిన వారిని ప్రతి శనివారం గుర్తించి ప్రశంసాపత్రం మరియు రివార్డుతో సత్కరిస్తామని వెల్లడించారు. డ్రగ్ రహిత నగరమే లక్ష్యం “హైదరాబాద్‌ను డ్రగ్ రహిత నగరంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. డ్రగ్ కేసుల్లో నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. మహిళలు, చిన్నారుల భద్రత పై ఎటువంటి రాజీ ఉండకూడదు. షీ టీమ్స్, లా & ఆర్డర్ విభాగాలు సమన్వ యంతో పని చేయాలి.అలాగే నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ఆలోచనలు చేయాలి. ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలిగించే మార్గాలు వెతకాలని  సూచించారు. సిబ్బందికి ప్రోత్సాహం, అభినందనలు సజ్జనర్  ఇటీవల మాదన్నపేట పీఎస్ పరిధిలో జరిగిన చిన్నారి హత్య కేసు చేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సైలు సుధాకర్, శోభ, సాయికాంత్, శివకుమార్ తదితరులను అభినందించారు. అలాగే నిరాశ్రయు లను ఆదరించి అమ్మనాన్న ఆశ్రమా నికి తరలించిన అప్జల్ గంజ్ ఎస్‌హెచ్‌వో రవి, అడ్మిన్ ఎస్సై నిరంజన్, ఏఎస్సై ధర్మేందర్ లను ప్రశంసించారు. 30 ఏళ్ల తర్వాత ఓ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన ఫిలింనగర్ హెడ్ కానిస్టేబుల్ విజయ సుధాకర్, కానిస్టేబుల్ సురేందర్ లను కూడా సత్కరిం చారు. మెరుగైన పోలీసింగ్ కోసం మీ సలహాలు, సూచ నలు నేరుగా నాకు తెలియజే యండి. అంతేకాక ముఖ్యం గా పని ఒత్తిడిలో  మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సిబ్బందికి సూచించారు.  

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రామ్ చరణ్ దంపతులు

  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ప్రధాని మోదీని కలిశారు. అనిల్‌ కామినేని సారథ్యంలో వరల్డ్‌ ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్న వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన వివరాలను ఉపాసనతో కలిసి ప్రధానికి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా  శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును ప్రధానికి అందించారు.  దీనికి సంబంధించి ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీగ్ విజయ వంతం అయిన సందర్బంగా మోదీని కలిసినట్లు చరణ్ తెలిపారు. మరోవైపు  రామ్‌చరణ్‌  బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీలో నటిస్తున్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఫైనాన్స్ సంస్థ మోసం...యువకుడు బలి

  మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థ క్యూనేట్ మోసానికి ఓ యువకుడు బలి అయినా ఘటన ఆ కుటుంబంలో విషా దాన్ని నింపింది. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం లో ఉన్న వేలూరు లో నివాసముంటున్న హరికృష్ణ (26) అనే యువకుడు మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థలో నాలుగు లక్షల కడితే ప్రతి నెల 15 వేల రూపాయల వడ్డీ వస్తుం దని నమ్మించారు. ఆ మాటలు నిజమని నమ్మిన హరికృష్ణ అప్పు చేసి మరి నాలుగు లక్షల రూపాయలు క్యూనెట్ కంపెనీకి ఇచ్చాడు.  ఆ తర్వాత క్యూనెట్ కంపెనీ ఇచ్చిన షాక్ కి హరికృష్ణ మైండ్ బ్లాక్ అయింది. ఇది చైన్ లింక్ కాబట్టి మరో వ్యక్తితో నాలుగు లక్షలు కట్టిస్తేనే 15 రూపా యలు వస్తాయని చెప్పారు. అసలే హరికృష్ణ గతంలో ఆన్లైన్ బెట్టింగ్స్  ఆడి రూ.18 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు తాజాగా మరో నాలుగు లక్షల అప్పుచేసి తీసుకు వచ్చి క్యూనెట్ కంపెనీలో పెట్టాడు.  ఒకవైపు అప్పుల బాధ.... మరోవైపు క్యూ నెట్  సంస్థ మోసాన్ని భరించ లేక తీవ్ర మనస్థా పానికి గురైన హరికృష్ణ ఆత్మ హత్య చేసుకున్నా డు అయితే హరి కృష్ణ ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాశాడు. క్యూనెట్ కంపెనీ నన్ను మోసం చేసింది. వాళ్లు చెప్పింది ఒకటి అందులో చేసేది మరొకటి... వారి మాటలు నమ్మి నేను అప్పు చేసి మరీ నాలుగు లక్షల కట్టారు.  డబ్బులు కట్టిన తర్వాత ఆ కంపెనీ నన్ను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ... సూసైడ్ నోట్లో రాసి ఆత్మ హత్య చేసుకు న్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివాహేతర సంబంధంతో విషాదం… రెండు కుటుంబాల విచ్చిన్నం

  అక్రమ సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రజలలో మార్పు రావడం లేదు. అక్రమ సంబంధాల వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతు ప్రాణాల మీదికి వస్తున్నప్పటికీ తమ తీరును మార్చుకోలేకపోతున్నారు. తాజాగా అక్రమ సంబంధంతో ప్రియుడు ప్రియురాలు కూడా ఒకరి మీద మోజుతో మరొకరు కుటుంబ సంబంధాలను తెంచుకొని ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి లో గ్రామానికి చెందిన  ధనుంజయ గౌడ్ (27) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తన కంటే పెద్దది అయిన  శశికళతో  ప్రేమ లో పడ్డారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ వేరే వేరే వారితో పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా వారి మధ్య వివాహేతరబంధం కొనసాగడం, ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు వెల్లిపోవడంతో ధనుంజయ గౌడ్ భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది.  ఆ తరువాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతరబంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడుతో గ్రామాన్ని వదిలి ఎమ్మిగనూరు కు వచ్చేసింది. ఎమ్మిగనూరు లో మెడికల్ షాప్ పెట్టుకున్న ధనుంజయ గౌడ్ ప్రియురాలిని ఓ లేడీస్ హాస్టల్ లో చేర్చి తమ బందాన్ని కొనసాగించాడు. అయితే హాస్టల్ లో ఉండలేక పోతున్నానని, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రియురాలు  నిత్యం ఒత్తిడి పెంచింది. ప్రియుడు కాలయాపన చేస్తుండటం తో ఆదివారం ప్రియురాలు తాను ఉంటున్న హాస్టల్ లో మెడకు ఉరిని బిగించుకొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు  సెల్ఫీ ఫోటో ను  ధనుంజయ గౌడ్ కు పంపింది.  ఆమె చనిపోతే తనపై కేసు నమోదై జైలుకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డ ధనుంజయ గౌడ్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామంలోని  పొలం లోకి వెళ్లి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం పక్కన ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలించారు. అయితే  చికిత్స పొందుతూ ధనుంజయ గౌడ్ అదే రోజు  రాత్రి మృతి చెందాడు. శశికళ నిత్యం వేధింపులు చేస్తుండడంతోనే తమ కుమారుడు మరణించాడని ధనుంజయ గౌడ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రియుడు ధనుంజయ గౌడ్ మరణం తట్టుకోలేక తాను కూడా ప్రియుడి దగ్గరికి వెళ్లాలని ధనుంజయ్ మరణించిన మరుసటిరోజే ప్రియురాలు శశికళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చికిత్స కొరకు, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున శశికళ మృతి చెందింది. వివాహేతర సంబంధం మత్తులో గువ్వల దొడ్డి గ్రామానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

అడవి పందులను చంపి తినేందుకు పర్మిషన్ ఇవ్వాలి : కేరళ మంత్రి

  అడవి పందులను బెడదతో పంట పొలాలు నాశనమవుతున్నాయని కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్ అన్నారు. వాటిని చంపి తినేందుకు అనుమతి ఇస్తే సమస్య తగ్గే అవకాశం ఉందని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం చట్టం దానిని అనుమతించలేట్లదని ఆయన గుర్తు చేశారు. పాలమేల్ గ్రామ పంచాయతీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కేరళ వ్యవసాయ మంత్రి హాజరయ్యారు.  అడవి పందులు అంతరించిపోతున్న జాతి కాదని పేర్కొన్నారు. వైల్డ్‌లైప్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 ప్రకారం వన్యప్రాణుల వేట చట్ట విరుద్దం. ఈ విధంగా చేస్తేనే అడవి పందుల సమస్యను వేగంగా పరిష్కరించి, పంటలను కాపాడుకోగలమని  మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిని చంపకుండా ఉండాలని చెప్పేందుకు అడవి పందులేమీ అంతరించిపోతున్న జాతి కూడా కాదని ఆయన పేర్కొన్నారు.