ఉరికి వేలాడిన నిర్భ‌య దోషులు

చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనే విషయం మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25) లను తిహార్ జైలులో కట్టుదిట్టమైన సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య సాగిన ఉరిశిక్ష ప్రక్రియ అమలు చేశారు. ఉదయం 4 గంటలకు నలుగురు దోషులకు అల్పహారాం అందించారు. ఉరికంబం వద్ద 40 మంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దోషి వెంట 12 మంది సిబ్బంది ఉన్నారు. దోషులకు ఉరిశిక్షకు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలు నెంబర్ 3లో నలుగురిని ఉరి తీశారు. అయితే ఉరిశిక్షకు ముందు వినయ్ శర్మ బోరున విలపించాడు. ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులకు ఉరి తీశారు తలారి పవన్. అయితే ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు దోషులు అనేక ప్రయత్నాలు చేశారు. వివిధ కోర్టుల్లో వివిధ రకాల పిటిషన్లు దాఖలు చేసి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఢిల్లీ హైకోర్టులో నిర్భయ దోషుల పిటిషన్‌పై గురువారం అర్థరాత్రి వరకు వాడీవేడీ వాదనలు జరిగాయి. గురువారం రాత్రి 11.30ల వరకు విచారణ సాగింది. దీంతో హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. సౌత్ ఢిల్లీలో 2012 డిసెంబర్ 12న కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయను గ్యాంగ్ రేప్ చేశారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయ.. చివరికి ప్రాణం వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తం ఆరుగురు దోషులు కాగా.. ఒకడు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో జువైనల్ జైల్లో శిక్ష అనుభవించాడు.  20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నలుగురు దోషులకు ఉరితీశారు. నలుగురు దోషులను ఉరి తీసినట్లు తిహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయెల్ ధ్రువీకరించారు. ఉదయం 6.00 గంటలు నలుగురు దోషులు మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. నలుగురు దోషుల మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వ‌హించారు.

జగన్ అపాయింట్ మెంట్ కోసం ఎంఎల్ఏల ఎదురు చూపులు

ఏపీలో ప్రభుత్వం ఏర్పడి  సుమారు పది నెలలు దాటిపోయాయి....ఇప్పటి వరకు  ఎంఎల్ఏల్లో  సగానికి సగం మందికి పైగా సీఎం అపాయింట్ మెంట్ లేకుండా ఉన్నారు..వీరిలో అసలు ఇప్పటి  వరకు సీఎం ను కలవని వారు ఇంకా ఎక్కువ ఉన్నారు.....మరో వైపు   ఏపీ సచివాయలం  వైజాగ్ కు తరలించేందుకు కూడా  సిద్దం అయింది.....దీంతో సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే బావుండును   అని ఎదురు చూసే ఎంఎల్ఏల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..మాకు కనీసం ఒక గంట సమయం కేటాయించండి అని చాలా మంది ఎంఎల్ఏలు సీఎం  ను కలవడం కోసం ఎదురు చూస్తున్నారు...చాలా జిల్లాల్లో మంత్రుల డామినేషన్ ప్రస్తుతం నడుస్తోంది..ఎంఎల్ఏలు తమ వాయిస్ వినిపించాలన్నా కూడా కష్టంగా మారింది..తమ మనసులో మాట సీఎం కు  చెప్పుకోవాలనే ఆవేదనలో ఉన్న శాసన సభ్యులు చాలా మంది ఉన్నారు.వీరు సీఎం ఎప్పుడు కలుస్తాడా  మనసు విప్పి ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నారు..అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు కలుద్దామంటే  కుదరని పరిస్థితి,,,,నిత్యం సీఎం బిజీగా ఉంటున్నారు..ఇంట్లో కలుద్దామంటే  రివ్యూలు ,,హడావిడి..దీంతో ఎంఎల్ఏలు సీఎం ను కలవడమే కష్టమయిపోతున్న పరిస్థితి.....     ప్రభుత్వ కార్యక్రమాలు జనంలోకి తీసు కెళ‌్లడానికి  శాసన సభ్యుల పాత్ర చాలా ఉంది.. ఈ అంశాన్ని ప్రస్తుతం మంత్రులు బాధ్యత తీసుకున్నారు...చాలా ప్రాంతాల్లో మంత్రులకు ఎంఎల్ఏలకు మధ్య గ్యాప్ ఉంది..ఈ  విషయాలు సీఎం తో చర్చించాలి..కానీ  అపాయింట్ మెంట్ దొరకడం లేదు....ఇంచార్జ్ మంత్రులకు ఎంఎల్ఏలకు కూడా గ్యాప్ ఉన్న పరిస‌్థితి ఏర్పడింది....ఎంఎల్ఏలు  తమ జిల్లాల్లో  ఉన్న గ్రూపు రాజకీయాుల  తో పాటు ఇతరత్రా అంశాలు చెప్పుకోవ డానికి తగిన మనిషి లేరనే అభిప్రాయంతో ఉన్నారు 150 మందికి పైగా గెలిచి  సీఎం అపాయింట్ మెంట్ లేకపోవడంతో కొంత మందిలో నిరుత్సాహం అసంత్రుప్తి కూడా ఉన్నాయి...కొంత మంది ఎంఎల్ఏలు మంత్రి పదవులు ఆశిస్తున్న వారు  ఇతరత్రా  కొంత మంది కోసం  నామినేటెడ్ పోస్టుల కోసం ఎదరు చూస్తున్న వారు ఉన్నారు..తమ వర్గంలో కొంత మంది కి నామినేటెడ్ పోస్టులు  కావాలని కూడా అడుగుుతున్నారు..నియోజక వర్గాల్లో  పెండింగ్  పనులు కూడా ఉన్నాయి.ఇలా ఏదో  ఒక కారణంతో సీఎంతో కనీసం ఒక గంట సమయం కావాలని  కోరుకునే ఎంఎల్ఏల సంఖ్య  రో్జు రోజుకు పెరుగుతూ ఉంది.

అమరావతి ఉద్యమాలకు కరోనా అడ్డుపడుతోందా...

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ   చూసినా  కరోనా పైనే చర్చ జరుగుతోంది...ఏ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నా కరోనా నే...బస్సులు, రైళ్లు, సినిమాలు అన్నీ బంద్ అయిపోతున్నాయి...ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అయితే  ఛకా చకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి......మనుషులు గుమిగూడి ఉండకూడదదు అనే చర్చ జరుగుతోంది...దీంతో అమరావతిలో గత కొన్ని రో్జులుగా  జరుగుతున్న ఆందోళనలకు కరో్నా ఎఫెక్ట్ ఉండదా అనే చర్చ జరుగుతోంది...కరోనా  వల్ల  అందరూ ఒక చోట  గుమి గూడి ఉంటే  నష్టం జరుగుతంది అని ఏపీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.దీంతో అమరావతి  ప్రాంతంలో జరిగే ఉద్యమాలపై కరోనా ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనే చర్చ మొదలయింది..   అమరావత రాజధాని ఉద్యమాలలో  రోజూ పదుల సంఖ్యలో జనం ఒకే చోట ఉంటున్నారు..దీక్షలు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు..దీంతో ఇప్పుడు శాంతి భద్రతల సమస్యకన్నా కరోనా సమస్య తీవ్రం అవుతోంది..వీరిలో   పొరపాటున విదేశాల నుంచి వచ్చిన  వారు ఉంటే మరింత ఎక్కువగా  నష్టం జరుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుుతున్నాయి....ఎలాంటి ఆందోళనలు చేయకుండా ఉండేనే  మంచిదని అధికారులు సైతం చెబుతున్నారు..అనవసరంగా  ఆనారోగ్యం కొని తెచ్చుకోవడం అవుతుందనే సంకేతాలు కూడా వెళుతున్నాయి......దీంతో  కరోనా ఎపెక్ష్  అమరావతి ఉద్యమంపై తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుుతున్నాయి..?ఒక  వేళ నిరసనలు, ఆందోళనలు జరుపుకోవాలనుకుంటే కరోనా తీవ్రత తగ్గిన తర్వాత  చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు కూడా  వ్యక్తం అవుతున్నాయి...

క‌రోనా నియంత్ర‌ణ‌కు భార‌త్ యాక్ష‌న్ ప్లాన్!

క‌రోనా తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని మార్చి 18 నుంచి ఆంక్ష‌లు విధిస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వ జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి ఉత్త‌ర్వుల‌ను విడుద‌ల చేసింది. మ‌రో వైపు కరోనా బారినపడి పంజాబ్‌లో ఓ వృద్ధుడు చనిపోయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. మృతుడి వయసు 68-70 వరకు ఉంటుందని సమాచారం. ఇటీవలే అతడు ఇటలీ నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. వైరస్ ప్రభావంతో చండీగఢ్ PGI ఆస్పత్రిలో చేరిన బాధితుడు.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు మరణించారు. మార్చి 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఇండియాకు అంత‌ర్జాతీయ విమానాల రాక‌పై ఆంక్ష‌లు విధించారు. దేశంలోని స్కూళ్లను మార్చి 31 వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్ఈ బోర్డు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. భారత్‌లో ఇప్పటి వరకూ 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా.. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. కోవిడ్- 19పై పోరాడేందుకు దేశమంతా సన్నద్ధం కావాలని సూచించారు. అలాగే కరోనా తర్వాతి దశపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, నిపుణులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా భయాందోళనల నేపథ్యంలో భారత్ అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వ‌చ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 14 రోజులపాటు వారిని పరీక్షించి.. దగ్గు, జలుబు, జ్వరం లాంటి కరోనాల లక్షణాలు లేవని నిర్ధారించకున్న తర్వాతే ఇళ్లకు వెళ్లనిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వారిని ఐసోలేటెడ్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించడంతోపాటు వారు కలిసిన వారందరికీ పరీక్షలు చేయడంతోపాటు.. ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశంలోని 52 ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 13 నుంచి ఏప్రిల్ 15 వరకు అన్ని దేశాలకు వీసాలను రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. మన దేశంలో కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారే. ఈ నేపథ్యంలో వీసాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు అత్యవసరం అయితేనే విదేశాలకు వెళ్లాలని ప్రజలకు కేంద్రం సూచించింది. మంత్రులెవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని కేంద్రం స్పష్టం చేసింది. పొరుగున మయన్మార్‌తో సరిహద్దులు మూసేసింది. రాకపోకలు అత్యధికంగా ఉండే నేపాల్ సరిహద్దుల్లోనూ హై అలర్ట్ విధించారు. నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న చెక్ పాయింట్లను మూసివేసే దిశగా భారత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు కూడా తిరుమల దర్శనానికి వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ల ద్వారా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను రద్దు చేసుకోవడానికి కూడా టీటీడీ అవకాశం కల్పిస్తోంది. కేంద్ర‌ప్ర‌భుత్వ జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి ఆంక్ష‌ల్ని విధిస్తూ జారీ చేసిన ఉత్త‌ర్వులు మార్చి 18 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా మిగ‌తా వాటిపై ఆంక్ష‌ల్ని విధించారు. ఆర్థిక బ్యాంకింగ్ సేవలు, ఎటిఎం సేవలు, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో వుంటాయి. విద్యుత్, అగ్నిమాపక విభాగం అగ్నిమాపక కార్యకలాపాలు, పోర్ట్ / విమానాశ్రయం కార్యకలాపాలు, పోస్టల్ మరియు కొరియర్ సేవలు, జైలు / తాత్కాలిక నిర్బంధ కేంద్రం / డిపో / ఇమ్మిగ్రేషన్ /కారాగారం లో వేయడం, ఇంధన మరియు కందెనలు ఇంధన స్టేషన్లు పనిచేస్తాయి. ఉత్పత్తి, శుద్ధి, నిల్వ, సరఫరా మరియు పంపిణీ. ఆరోగ్య సేవలు ఆరోగ్య కార్యకలాపాలు / ఆసుపత్రి / క్లినిక్ / ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫార్మసీలు /సాంప్రదాయ మెడిసిన్ షాపులు /పశువైద్యుడు / డయాలసిస్ కేంద్రాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటాయి. ప్రసారం మరియు టెలివిజన్ కార్యకలాపాలు మరియు సమాచారం వ్యాప్తిపై టెలికమ్యూనికేషన్స్ సేవలు, నీటి సేవల మరమ్మతులు / నిర్వహణ / కార్యకలాపాలు కార్యాచరణ, ప్రభుత్వ సేవలు / చట్టబద్ధమైన సంస్థలు, పబ్లిక్ ఏవియేషన్, కస్టమ్ ఎక్సైజ్, ఇమ్మిగ్రేషన్ మెరైన్, వాతావరణ సేవ‌లు అందుబాటులో వుంటాయి. కిరాణా / చిన్న సరుకులకి /సూపర్మార్కెట్లు / పబ్లిక్ ఆపరేషన్లు అనుమతించబడ్డాయి. నైట్ మార్కెట్ / రైతు మార్కెట్ల‌పై, పూల్ / పబ్ / జిమ్ / బార్ / రెస్టారెంట్ / స్పా ప్రవేశంపై ఆంక్ష‌లు విధించారు. అలాగే మతం మతపరమైన సమావేశాలపై ఆంక్ష‌లు పెట్టారు. అంత్యక్రియల నిర్వహణ అనుమతించబడింది. క్లోజ్డ్ సమావేశాలు / ప్రదర్శనలు / కచేరీ /బస్కింగ్ / జుంబా / క్లబ్బులు / డిస్కో / బార్స్ /కచేరీలు / సినిమాస్ / కుటుంబం వినోద కేంద్రాలు / ఫన్ ఫెయిర్ /ఆర్కేడ్ మరియు క్లోజ్డ్ వివాహాలపై ఆంక్ష‌లు విధించారు. అలాగే విదేశీ సందర్శకుల ప్రవేశం అనుమతించబడదు.

టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలి: టీటీడీ ఈవో సింఘాల్​

ప్రతిరోజూ 'కరోనా' పరిస్థితిపై సమీక్షిస్తున్నాం శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం లేదు భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం రేపటి నుంచి శ్రీవారి ఏకాంత సేవలు నిర్వహిస్తాం 'కరోనా' కలకలం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని  ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ 'కరోనా' పరిస్థితిపై సమీక్షిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. రేపటి నుంచి శ్రీవారి ఏకాంత సేవలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీటీడీ విద్యాసంస్థలను మూసివేశామని చెప్పారు.   తిరుమలలో ఇవాళ కోవిడ్–19 లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న అరవై ఐదేళ్ల భక్తుడు దయాశంకర్ ని గుర్తించామని, స్విమ్స్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ కు చెందిన దయాశంకర్ తో పాటు నూల పది మందికి పైగా యాత్రికులు ఈ నెల 11న తీర్థయాత్రకు బయలుదేరారని చెప్పారు. ఈ క్రమంలోశ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వచ్చారని చెప్పారు.

ఎయిడ్స్ కంటే క‌రోనానే దారుణంగా వుంద‌ట‌!

కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వారి జాబితాలో సెక్స్ వర్కర్లు కూడా చేరారు. కరోనా దెబ్బకు యూరప్ లో నైట్ క్లబ్బులు మూతపడ్డాయి. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో నైట్ క్లబ్బులు బంద్ అయ్యాయి. అన్ని రెస్టారెంట్లు, కేఫ్‌లు, స్కూళ్లు, నైట్ క్లబ్బులతోపాటు రెడ్ లైట్ ప్రాంతాలను మూసివేయాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. హషీస్, కాన్నబీస్‌, గంజాయి లాంటి మాదకద్రవ్యాలను విక్రయించే డచ్ బార్లను ప్రభుత్వం ఆదేశించింది. నైట్ క్లబ్బులకు పేరు గడించిన అడల్డ్ క్లబ్బులు, రెడ్ లైట్ ఏరియాలను కూడా ప్రభుత్వం మూసివేయించింది. కాసా రోసో, పీప్‌షో, బనానా బార్, ఎరోటిక్ మ్యూజియం వంటి అడల్డ్ క్లబ్బులు మూతపడిన వాటిలో ఉన్నాయి. ముంబైలోని రెడ్ లైట్ ఏరియా కామటిపురలోని వేశ్యలపైనా క‌రోనా ప్రభావం చూపింది. సాధారణంగా వేశ్యల దగ్గరికి నిత్యం విటులు వచ్చి పోతుంటారు. అలా వచ్చిన వారి ద్వారా సెక్స్ వర్కర్లకు కరోనా సోకే ముప్పు ఎక్కువ దీంతో సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కరోనా భయాందోళనల కారణంగా విటుల రాక తగ్గిపోవడంతో.. సెక్స్ వర్కర్లకు ఆదాయం కూడా తగ్గిపోయింది. రోజువారీ ఖర్చులకు కూడా వారికి ఇబ్బంది అవుతోంది. దీంతో చాలా మంది వేశ్య‌లు తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఎయిడ్స్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయిన‌ప్పుడు కూడా ఇంత దారుణంగా లేద‌ని, పరిస్థితి ఎన్నడూ లేనంతగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయామని ముంబాయిలోని ఓ సెక్స్ వర్కర్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘కామ‌టిపుర అంతా ఎడారిలా మారిపోయింది. దీంతో తన బిజినెస్ తగ్గిపోయిందని కామటిపురకు చెందిన ఓ టైలర్ వాపోయాడు. లోకల్ సెక్స్ వర్కర్లకు దుస్తులు కుట్టి డబ్బు సంపాదించే వాడినని.. కానీ వారికే ఉపాధి లేకపోవడంతో తనకు కూడా రాబడి తగ్గిందని అతడు చెప్పాడు.

ఏడుకొండలవాడే దిక్కన్న పరిమళ్ నత్వానీ

కరొనపై ట్వీట్ చేసిన వై ఎస్ ఆర్ సి పి రాజ్యసభ సభ్యడు ఎంత లావు రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్  అయినా,దానితో పాటు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విజయసాయి రెడ్డి ద్వారా హఠాత్తుగా ఆత్మీయుడైపోయినా , పరిమళ్ నత్వానీ మాత్రం బాగా తత్త్వం, దైవ చింతన,  ఒంట బట్టించుకున్న పెద్ద మనిషి అనిపించుకున్నారు, తన తాజా ట్వీట్ ద్వారా. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భీతిని దాటించి, మానవ జాతిని రక్షించగలిగేది తిరుమల వెంకన్న పాదపద్మములే నంటూ, శ్రీవారి శరణాగతి మాత్రమే ఈ వ్యాధి నుంచి బయటపడే ఉత్తమ మార్గమని ట్విట్టర్ లో ప్రకటించారు.  శ్రీ వారి దర్శనం తో పులకించిపోయానంటూ, శ్రీవారి దర్శనం తాలూకు అపురూపమైన వీడియో ని కూడా ఆయన తన ట్వీట్ కు జత చేశారు. కొసమెరుపేమిటంటే, ఈ ట్వీట్ కు అయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని, విజయసాయి రెడ్డి ని కూడా ట్యాగ్ చేశారు. 

నిర్భ‌య దోషుల‌కు రేపే... ఉరి అమ‌లు!

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖారారు. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను పటియాల హౌస్‌ కోర్టు కొట్టివేసింది. దీంతో ముందుగా నిర్ణయించిన మేరకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తిహార్ జైల్లో ఉరి తీయనున్నారు. ఈ ఇదే కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్త ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్ బాలుడినంటూ పవన్ గుప్త చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌ అయినందున ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ పవన్ గుప్తా తన పిటిషన్‌లో విజ్ఞ‌ప్తి చేశాడు. నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. వారికి ఉరిశిక్ష పడుతుందో లేదోనని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక మార్చి 20వ తేదీన వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ భార్య అతడి భార్యగా ఉండడం ఇష్టం లేదు.. అతడితో విడాకులు ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. ఈ మేరకు విచారణ సాగుతుండగా ఆమె కోర్టు ఆవరణలో స్పృహ తప్పి పడిపోయింది. ఈ సందర్భంగా బీహర్ లోని పటియాలా హౌస్ కోర్టు ఆవరణ లో గురువారం విచారణ సాగుతుండగా ఆమె కుప్పకూలి పడిపోయింది. మార్చి 20వ తేదీన అక్షయ్ సింగ్ కు ఉరివేస్తే తాను వితంతువుగా ఉండాల్సి వస్తుందని అలా ఉండడం తనకు ఇష్టం లేదని ఆమె కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ వేసింది. రేప్ కేసులో తన భర్తను ఉరి తీస్తే ఆ తర్వాత వితంతువుగా సమాజంలో చెడ్డపేరుతో బతకడం తన కిష్టం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అక్షయ్ సింగ్ తో తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో 'డమ్మీ ట్రయల్' జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు. జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి తెలిపారు.

'కరోనా' ప్రభావం.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు నిలిపివేత

మూడు వారాల పాటు వ్రతాలు నిలిపివేత భక్తులకు వైద్య పరీక్షల తర్వాతే కొండ పైకి అనుమతిస్తాం నిత్యాన్నదానం కింద ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందిస్తాం 'కరోనా' ప్రభావం ప్రముఖ దేవాలయాలపైనా పడింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయంలో మూడు వారాల పాటు వ్రతాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ఆలయ ఈవో త్రినాథ్ రావు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టే నివారణ చర్యల్లో భాగంగా భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొండ పైకి అనుమతి ఇస్తామని అన్నారు. అన్నవరం ఆలయంలో నిత్యాన్నదానం కింద ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందిస్తామని వివరించారు.

తిరుమలకు రాకపోకలు నిలిపివేత

కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు మూసివేత భక్తులంతా కిందకు వచ్చిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు మూసివేత సాయంత్రం నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం బంద్ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపైకి భక్తులు వెళ్లే ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. టీటీడీ అధికారుల ఆదేశాలతో పైకి వెళ్లే ఘాట్ రోడ్డు మూతపడింది. వాహనాలు కొండపైకి వెళ్లకుండా విజిలెన్స్ అధికారులు ఆపేస్తున్నారు.  భక్తులు కొండపై నుంచి కిందకు వచ్చే ఘాట్ రోడ్డును మాత్రం తెరిచి ఉంచారు. నేటి సాయంత్రం నుంచి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కూడా నిలిపివేయనున్నారు. కొండపై నుంచి భక్తులంగా కిందకు దిగి వచ్చాక... రెండో ఘాట్ ను కూడా అధికారులు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో, సాయంత్రానికల్లా తిరుమల నిర్మానుష్యంగా మారనుంది. అయితే స్వామివారికి నిర్వహించే సేవలను మాత్రం అర్చకుల యథావిధిగా నిర్వహిస్తారు.

నిమ్మగడ్డ పై సూపర్ బాస్ కోసం జగన్ మోహన్ రెడ్డి అన్వేషణ!

అక్బర్ బీర్బల్ కథలు, మహామంత్రి తిమ్మరుసు రాజనీతి సూత్రాలను బాగా ఒంట బట్టించుకున్న ఆంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చెక్ పెట్టె విషయం లో అవే పాత ఫార్ములాలతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషన్ లో మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉండటం తో, ప్రస్తుతం ఆ ఖాళీలను ఎలా భర్తీ చేయాలనే విషయం లో ఆయన, మాజీ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తో ఇటీవల సమావేశమయ్యారు. సుప్రీమ్ కోర్టు వెలువరించిన తీర్పు నేపధ్యం లో- ఆ ఇద్దరు సభ్యులుగా ఒక మాజీ ఐ ఏ ఎస్ ను, మరో మాజీ ఐ పి ఎస్ అధికారి ని అందులో సభ్యులుగా నియమిస్తే, 2-1 తేడాతో  కమిషనర్ నిమ్మగడ్డను కంట్రోల్ చేయాలనేది, చేయవచ్చుననేది  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ' బీర్బల్ ' ఫార్ములా.  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబుకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఓపెన్ గానే విమర్శించారు. ఆయన పైన చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేక పోవటంతో..కమిషనర్ గా ఆయన అధికారాలకు చెక్ పెట్టేందుకు నిపుణులతో కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పని చేసిన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డితోనూ జగన్ సమావేశమయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒకరే కమిషనర్ ఉండటంతో..మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉంటుందని..ఈ విధంగా చట్ట సవరణ చేసి కొత్త సభ్యులను నియమించిటం ద్వారా ఒకే కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ అధికారాలకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఒక చీఫ్ కమిషనర్ ను, మరో కమిషనర్ ను నియమిస్తే ఎలా ఉంటుదనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన గా కనిపిస్తోంది. దీనిపైన , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి    రాజ్యాంగ, న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే  ఆలోచనలో కూడా ఉన్నారు.

మాస్క్ అవసరం లేదు చేతులు శుభ్రంగా ఉంచుకుంటే చాల‌ట‌!

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పి.వి.రమేష్‌ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరూ మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని, చేతులు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునేలా లైప్ స్టైల్ మార్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కరోనా వైరస్‌ నిర్ధారణకోసం రక్త నమూనాలు పుణెకు పంపకుండా మన రాష్ట్రంలోనే పరీక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కరోనా విషయంలో ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 3 అడుగుల దూరంలో ఉంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వైరస్‌ సోకే అవకాశం ఉండదన్నారు. ''జలుబు, దగ్గు వస్తే భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండి విశ్రాంతితీసుకుంటూ ఆరుగంటలకు ఒక సారి పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుంది. తీవ్రమైన జ్వరం, దగ్గు ఉంటే 104కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం తరఫున ప్రత్యేక అంబులెన్స్‌ వస్తుంది. సమీపంలోని ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తాం. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుందని తెలుస్తోంది. బీపీ, షుగర్‌, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి'' అని రమేష్‌ కుమార్‌ వివరించారు.

భారీగా పతనమౌతున్న రూపాయి, డాలర్‌తో 75 రూపాయ‌ల రికార్డ్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ఆస్టేలియా క‌రెన్సీ 6 రూపాయ‌లు త‌గ్గింది. లండ‌న్ పౌండ్ 8 రూపాయ‌లు త‌గ్గింది. కెన‌డా 4 రూపాయ‌లు త‌గ్గింది. అయితే డాల‌ర్‌, దిర్హ‌మ్‌, రియాల్ రేట్లు మాత్రం పెరుగుతూ పోతున్నాయి. ఇండియ‌న్ రూపాయితో పోల్చితే ఒక డాల‌ర్‌కు ఇండియాకు చెందిన 75 రూపాయ‌లు. రిటైల్ మార్కెట్‌లో 76 రూపాయ‌ల‌కు ఒక డాల‌ర్ ఇస్తున్నారు. అలాగే దిర్హ‌మ్ రేటు 19 రూపాయ‌ల 20 పైస‌ల నుంచి 20 రూపాయ‌ల‌కు చేరింది. అలాగే సౌదీ రియాల్ 19 రూపాయ‌ల 45 పైస‌ల నుంచి 20 రూపాయ‌ల 20 పైస‌ల‌కు పెరిగింది. కరోనా వైరస్, క్రూడాయిల్ ప్రైస్ వంటి అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి బలహీనపడుతోంది. డాలర్ మారకంతో 70 పైసలకు పైగా క్షీణించి రూ.74.96 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు ఉదయం రూ.74.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం ముగింపు రూ.74.26గా ఉంది. అంటే గురువారం దాదాపు రూ.75ను టచ్ అయింది. ఇది 80 రూపాయ‌ల వ‌ర‌కు వెళుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఫారన్ పోర్ట్‌పోలియేఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. కరోనా భయాలతో FPIలు వెనక్కి వెళ్ళడం రూపాయి బలహీనానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మార్చి నెలలో ఇప్పటి వరకు రూ.70,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఓవర్సీస్ ఇన్వెసట్టర్లు ఈక్విటీల నుండి రూ.36,200 కోట్లు, డెట్ సెగ్మెంట్ నుండి రూ.32,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కరోనా, అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి.

ఆంధ్ర ప్రాంతానికి డొక్కల కరువు పొంచి ఉందా?

  * మూడు శతాబ్దాలలో మూడు కరువుల ను ఎదుర్కున్న ఆంధ్ర ప్రదేశ్ * 1791-95, 1832-1833, 1929-39 మధ్య ఎదుర్కున్న కరువుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి * రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాల్లో-ఇలాంటి కరువును ఎలా ఎదుర్కోవాలో స్పష్టం గా రాసి ఉంది * వెంకటాద్రి నాయుడు వంటి జనహిత పాలకుల విధానాలే ఇప్పుడు మనకి శ్రీరామ రక్ష మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.     కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:   సర్ సి.పి.బ్రౌన్ గా ఆంద్ర ప్రజానీకానికి సుపరిచితుడైన ఆంగ్ల అధికారి, 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు చేసిన సేవలు, పలువురు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అలాగే, ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు కూడా పేదలకు ఆ సమయం లో అండగా నిలిచాడు వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.     కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై గా చెన్నై ప్రాంతం లో పేరున్న సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన తన దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, 1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన అప్పట్లో బ్రిటీష్ యంత్రాంగానికి రాసిన లేఖలు, తర్వాత అప్పటి బ్రిటీష్ అధికారులు తీసుకున్న నష్ట నివారణ చర్యల ప్రస్తావన కూడా ఆయన డైరీ లో ప్రముఖంగా ఉంది. అంటే, గడిచిన మూడు శతాబ్దాల కాలం లో ఆంధ్ర ప్రాంతం మూడు రకాల కరువును ఎదుర్కొని, చరిత్రలో నిలిచిపోయే విషాదాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు , కరోనా సన్నద్ధత చర్యల విషయం లో వెనుకంజ వేస్తె, ఎకానమీ రివర్సల్ జరుగుతుందని, దానివల్ల సంభవించే విపరిణామాలు వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై, తిండి గింజలకు వెతుక్కునే పరిస్థితి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య మంత్రి గారు క్వారంటైన్ నుంచి వ‌చ్చేదెప్పుడు?

మంత్రిగారు ఇప్ప‌ట్టికే రాష్ట్రంలో రెండు పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. 102 మంది అనుమానితుల ర‌క్త‌న‌మూనాలు సేక‌రించి ప‌రీక్ష‌ల‌కు పంపారు. అయినా మీకు ఇవేమీ ప‌ట్ట‌న‌ట్లుంది. క‌నీసం ప‌క్క రాష్ట్రం తెలంగాణా ను చూసైనా ఏలూరు నుంచి బ‌య‌టికి ర‌మ్మ‌ని ప్ర‌జ‌లు పిలుస్తున్నారు. మిమ్మ‌ల్ని జ‌గ‌న‌న్న మంత్రి చేసింది క‌ష్ట కాలంలో ప్ర‌జ‌ల‌తో ఉంటార‌ని, మీరేమో మీ నియోజ‌క‌వ‌ర్గం దాటి రావ‌డం లేదు. క‌నీసం మీరు ఆరోగ్య‌శాఖ మంత్రి అన్న విష‌యం గుర్తుందో లేదు అనే అనుమానం ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంది. అమ‌రావ‌తికి వెళ్ళి క‌నిపించ‌డం ఇష్టం లేకుంటే మీరు కోరుకున్న‌ట్లు వైజాగ్ వెళ్ళినైనా స‌మీక్ష‌లు చేస్తూ జ‌నంకు ధైర్యం చెప్పండి సార్‌. బుధ‌వారంనాడు ముఖ్య‌మంత్రి వ‌ద్ద జ‌రిగిన స‌మీక్ష‌లో కూడా మీరు క‌నిపించ‌లేదు. 15వ తేదీ అంటే ఐదు రోజు క్రితం సి.ఎం. స‌మీక్ష‌లో మీరు క‌నిపించారు. అంతే. క‌రోనా భ‌యంతో రాష్ట్ర ప్ర‌జ‌లు వుంటే మీరేమో రెండు ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లు, ఒక స‌మీక్ష చేసి ఏలూరు వెళ్లిపోయారు.     క‌రోనా భ‌యం జ‌నంకు ఉండాలి కానీ మీకెందుకు సార్‌. ముఖ్య‌మంత్రి, అధికారులు అంద‌రూ మాట్లాడుతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా చంద్ర‌బాబునాయుడు స్టైల్‌లో అధికారులే న‌మ్ముకున్న‌ట్లుంది. అందుకే మీమ్మ‌ల్ని ప‌ట్టించుకోకుండా అలా ముందుకు వెళ్తున్నారు. మీరేమో క‌నీసం వైద్య శాఖ మీద అవ‌గాహ‌న పెంచుకోలేదు. అయినా ప‌ర్వాలేదు. అధికారుల్ని అడిగి తెలుసుకోని ఆ త‌రువాతే మాట్లాడండి. మ‌న ముఖ్య‌మంత్రి చెప్పిన స‌ల‌హాను మీరు తూచ త‌ప్ప‌కుండా పాటిస్తున్న‌ట్లు జ‌నం ఘోరంగా చెప్పుకుంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌జ‌ల్ని క‌రోనా వైర‌స్ భ‌య‌పెడుతుంటే మీరేమో సి.ఎం. చెప్పిన‌ట్లు పారాసిట‌మ‌ల్ వేసుకొని, బ్లీచింగ్‌ పౌడర్ చల్లుకొని ఇంట్లో గుర‌క పెట్టి నిద్దుర‌పోతే ఎలా సార్‌.

ఏపీ సీఎం జగన్‌తో డీజీపీ సవాంగ్, ఐజీ చీఫ్ మనీశ్ అత్యవసర భేటీ!

  పెరుగుతున్న అనుమానితుల సంఖ్య తదుపరి చర్యలపై సమావేశం ఎస్ఈసీ రాసినిట్టు చెబుతున్న లేఖపైనా చర్చ ఆంధ్రప్రదేశ్ లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం, అనుమానితుల సంఖ్య పెరగడంపై ఈ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ మనీశ్ తదితరులు హాజరయ్యారు.     రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వీరు అంచనా వేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర హోమ్ శాఖకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసినట్టుగా ప్రచారం జరిగిన లేఖ అంశంపైనా చర్చించారని సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమాచారం వెలువడాల్సివుంది.

క‌రోనా దెబ్బ‌కు 2.5 కోట్ల ఉద్యోగాలు హాంఫ‌ట్

క‌రోనా సెగ ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. రోడ్ సైడ్ వ్యాపారాలు 80 శాతం వ‌ర‌కు పూర్తిగా ప‌డిపోయాయి. ఆదాయం లేక‌పోవ‌డంతో మూడు పూట‌ల తినే ప‌రిస్థితి లేదు. రోజు సంపాదించుకుని తినే వారి ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా మారుతోంది. గ‌తంలో క‌ర్ఫ్యూ వున్న ప‌రిస్థితులు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని చిన్న వ్యాపార‌స్థులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆటో, ట్యాక్సీవాలా ఆదాయం కూడా పూర్తిగా ప‌డిపోతోంది. ఓలా, ఊబ‌ర్‌ల‌కు బిజినెస్ చాలా త‌క్కువ‌గా వ‌స్తుంద‌ట‌. ఎయిర్ పోర్ట్ బిజినెస్ అయితే అస‌లే లేదు. ఇండియాలో కొంత బెట‌ర్‌గా వున్న‌ప్ప‌ట్టికీ ఇత‌ర దేశాల్లో ప‌రిస్థితి ఘోరంగా వుంద‌ట‌. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉద్యోగాలు పోయే పరిస్థితి నెల‌కొందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తెలిపింది. దాదాపు 2.5 కోట్ల (25 మిలియన్లు) ఉద్యోగులు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8,600 కోట్ల డాలర్ల నుండి 3.4 లక్షల కోట్ల డాలర్ల మేర ఆధాయాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది.     అండర్ ఎంప్లాయిమెంట్ కూడా పెరిగే అవకాశముందని ILO ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కారణంగా వర్కింగ్ హవర్స్ తగ్గి, వేతనాలు తగ్గి ఈ పరిస్థితికి కారణం కావొచ్చునని పేర్కొంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. అంతర్జాతీయంగా పరస్పర సహకార విధానాల ద్వారా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ILO తెలిపింది. కార్మికులను సంరక్షించేందుకు, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అలాగే ఉద్యోగాలు, ఆదాయలకు మద్దతిచ్చేందుకు అత్యవసర, పెద్ద ఎత్తున సమన్వయ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

ఇండోనేషియా జ‌మాత్ క‌రీంన‌గ‌ర్‌లో ఎంత మందిని క‌లిసింది?

కరీంనగర్ సంఘ‌ట‌న‌తో తెలంగాణా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే రోజు 7 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం తెలంగాణా భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందం ఈ మహమ్మారిని కరీంనగర్‌కు తీసుకొచ్చింది. మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరిన త‌బ్లిక్ జ‌మాత్ కు చెందిన 10 మంది సభ్యుల బృందం మార్చి 14వ తేదీ ఉదయం రామగుండం చేరుకుంది. ఆ తర్వాత రోజు కరీంనగర్‌కు వచ్చింది. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. దీంతో కరీంనగర్‌లో టెన్షన్‌ నెలకొంది. వైరస్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కరీంనగర్‌లో ఆంక్షలు విధించింది. ఇండోనేసియా బృందం కలెక్టరేట్‌కు సమీపంలోనే బసచేసింది. దీంతో మూడు కిలోమీటర్ల మేర ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. నగరంలో దుకాణాలు తెరుచుకోలేదు. పదో తరగతి పిల్లలు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నారు.     ఇండోనేసియా బృందం ఎవరెవరితో సన్నిహితంగా తిరిగారన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. 8మంది వీరితో బాగా క్లోజ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వారిని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఆ 8మంది ఎక్కడెక్కడ, ఎవరెవరితో తిరిగారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌కు వంద ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. వారు ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క‌రీంన‌గ‌ర్ సంఘ‌ట‌న‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడో పెద్ద పరీక్ష ఎదురైంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా 13కు చేరుకున్నాయి. త‌బ్లిక్ జ‌మాత్ రోజు వారీ కార్య‌క్ర‌మాల్లో భాగంగా స్థానిక ముస్లింల‌లో ఇస్లాం గురించి బోధించ‌డానికి ముస్లిం ప్రాంతాల్లో తిరుగుతూ వుంటారు. ఇండోనేషియా నుంచి వ‌చ్చిన జ‌మాత్ ఢిల్లీ నుంచి నేరుగా క‌రీంన‌గ‌ర్ జిల్లాకు వ‌చ్చారు. వారికి గైడ్‌గా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి వ‌చ్చాడు. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో ఎస్ 9 బోగీలో వీరు ప్రయాణించారు. రామగుండం చేరుకున్న వారు తర్వాత కరీంనగర్ కు చేరుకున్నారు. మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా వచ్చిన వారిలో ఒకరికి మంగళవారం కరోనా పాజిటివ్ గా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఈ టీంలోని మిగిలిన పదిమందిని (తొమ్మిది మంది ఇండోనేషియా జాతీయులు.. మరొకరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు) తరలించి.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.   తొలుత కరోనాను గుర్తించిన ఇండోనేషియా వాసి నిమోనియాతో బాధ పడుతున్నాడు. అతడ్ని వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఇండోనేషియా నుంచి ఢిల్లీ.. అక్కడ నుంచి రామగుండం.. ఆ తర్వాత కరీంనగర్ కు చేరుకున్న వారు ఎంతమందిని కలిశారు? ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? అన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి రామగుండం వరకు ప్రయాణించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ బోగీలో 82 మంది ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. వీరంతా ఇప్పుడెక్కడ ఉన్నారు? వారి ఆరోగ్యం ఎలా ఉంది? అన్న అంశాన్ని లెక్క తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు

కరోనాపై పోరాటంలో చైనా విజయం సాధించింది. ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని చైన్నా అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది. వూహాన్ లో కొత్త కేసులు లేవని, పాజిటివ్ వచ్చిన వారు కూడా చికిత్స తరువాత ఇళ్లకు వెళుతున్నారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కాగా, వూహాన్ లో దాదాపు కోటి మందికి పైగా ప్రజలను, అత్యంత కఠినమైన నిర్ణయాలతో జనవరి 23 నుంచి ఇళ్లకు మాత్రమే పరిమితం చేశారు. హుబేయ్ ప్రావిన్స్ ను మూసివేసి, దాదాపు 4 కోట్ల మందిని లాక్ డౌన్ చేసిన చైనా, వారి అవసరాలు తీరుస్తూ, వైరస్ పూర్తిగా చచ్చిపోయేంత వరకూ ఆంక్షలను కొనసాగించింది. చైనాలో మృతుల సంఖ్య 3,245కు చేరిందని కమిషన్ పేర్కొంది.   మొత్తం 81 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, ప్రస్తుతం 7,263 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు. ఈ నెల 10న వూహాన్ లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్ ను తాము జయించినట్టేనని ప్రకటించారు. కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంది. చైనాలో పోలీసు అధికారులు కరోనా ప్రిడేటర్లుగా మారిపోయారు. స్మార్ట్ హెల్మట్లను ధరించి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీధుల్లో వెళ్లే పాదాచారుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో ఈ స్మార్ట్ హెల్మట్ల ద్వారా వారి శరీర ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్నారు. షెన్ జాన్ ఆధారిత కంపెనీ కుయాంగ్-చి టెక్నాలజీ ద్వారా స్మార్ట్ హెల్మట్లను డెవలప్ చేసింది. జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఎవరికైనా అసాధారణ శరీర ఉష్ణోగ్రతలు ఉంటే వెంటనే ఈ స్మార్ట్ హెల్మెట్లు పసిగట్టేస్తాయి. వీటి సిగ్నల్ ద్వారా ఆయా బాధితులను గుర్తించి వారిని ప్రత్యేక కరోనా వార్డులకు తరలిస్తున్నారు.     స్మార్ట్ హెల్మట్లతో పోలీసు అధికారులు కరోనా వైరస్ బాధితులను గుర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పీపుల్స్ డెయిలీ తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. వీడియోలో పోలీసు అధికారులు స్మార్ట్ హెల్మట్లతో పెట్రోలింగ్ నిర్వహించడం కనిపిస్తోంది. ఈ స్మార్ట్ హెల్మట్లలో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే డిటెక్టర్లు, కోడ్ రీడ్ కెమెరాలు ఉన్నాయి. జనం మధ్యలో ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే వారిని వెంటనే coronavirus epidemicను ఈ స్మార్ట్ హెల్మట్లు గుర్తిస్తాయి. ఐదు మీటర్ల దూరంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వెంటనే ఈహెల్మట్ల నుంచి అలారం మోగుతుంది. అంతే.. ఆ వ్యక్తిని తీసుకెళ్లి ప్రత్యేకవార్డుల్లోకి తరలిస్తున్నారు.