అంత్యక్రియలకు కేంద్రం మార్గదర్శకాలు పాటించాల్సిందే!

కరోనా వైరస్‌తో చ‌నిపోయిన మృతదేహాలకూ వాటి నుంచి వెలువడే ప్రత్యేక ద్రవాల్లోనూ కరోనా ఉంటుంది. అలాంటప్పుడు కరోనా సోకి మృతిచెందిన వారి దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. మృతదేహాం తరలింపు సమయంలో ఇన్‌ఫెక్షన్ సోకకుండా నిర్దేశించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 1. కరోనా సోకిన వ్యక్తి మరణించినప్పుడు డెడ్‌బాడీని పరిశీలించేప్పుడు తడి అంటని యాప్రాన్‌, గ్లోవ్స్‌, మాస్క్‌లు ఉపయోగించాలి. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంకానీ, మార్చురీకి తరలించడంకానీ చేయాలి. 2. మృతదేహాన్ని తొలగించేటప్పుడు కుటుంబసభ్యులు ఎవరైనా చూడాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తరచుగా 1% హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. 3. వ్యక్తి మరణించిన ఏకాంత గదిలో నేల, మంచం, రెయిలింగ్స్‌, పక్క టేబుళ్లు, స్టాండ్లన్నింటినీ 1% సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరచాలి. 4. మృతదేహానికి ట్యూబులు, డ్రైన్లు వంటివి ఉంటే తప్పని సరిగా తొలగించాలి. 5. మృతదేహం నుంచి ద్రవాలేవీ బయటకు రాకుండా నోరు, నాసికారంధ్రాలు సరిగా మూసిపెట్టాలి. 6. మృతదేహాన్ని లీక్‌-ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచాలి. ఆ బ్యాగును 1% హైపోక్లోరైట్‌తో శుభ్రపరచాలి. 7. రోగికోసం వాడిన వస్త్రాలన్నింటినీ బయోహజార్డ్‌ బ్యాగ్‌లో ఉంచాలి. 8. మృతదేహాన్ని తరలించే సిబ్బంది సర్జికల్‌ మాస్క్‌, గ్లోవ్స్‌తోపాటు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలి. 9. మృతదేహాన్ని తరలించిన వాహనాన్నికూడా 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. 10. సాధ్యమైనంత వరకూ శవపరీక్ష లేకుండా చూడాలి. తప్పనిసరైతే డాక్టర్లు తగుజాగ్రత్తలు పాటించాలి. 11 మృతదేహాలను 4 డిగ్రీల సెల్సియస్‌ కోల్డ్‌ ఛాంబర్స్‌లో ఉంచాలి. శవాగారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అటాప్సీ గదిలోకి పరిమిత సంఖ్యలోనే ఫోరెన్సిక్‌ నిపుణులు, సహాయక సిబ్బందిని అనుమతివ్వాలి. సిబ్బంది ఎన్‌95 మాస్క్‌లు, కళ్లద్దాలు వాడాలి. 12. మొనతేలని కత్తెరలు (రౌండ్‌ ఎండెడ్‌) మాత్రమే ఉపయోగించాలి.మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాన్ని పూర్తిగా 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రంచేసి బ్యాగ్‌లో పెట్టాలి. 13 ఏకాంత గదులు, మార్చురీ, అంబులెన్స్‌, శ్మశానవాటికల్లో మృతదేహాలను ఎత్తి, దించే కార్మికులందరికీ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా శిక్షణ ఇవ్వాలి. 14 మృతదేహానికి ఎంబామింగ్‌ చేయడానికి అనుమతివ్వకూడదు.

శారదాపీఠంలో విష జ్వరపీడా హర యాగం

* కరోనా వైరస్ ప్రబలకుండా హోమాలు * యాగంలో పాల్గొనేందుకు హిందూ ధర్మ ప్రచార యాత్ర వాయిదా * సామాజిక బాధ్యతగా యాగం చేపట్టామన్న స్వామి స్వాత్మానంద కరోనా వైరస్ నేపథ్యంలో విషజ్వర పీడా హర యాగాన్ని విశాఖ శారదాపీఠం చేపడుతున్నట్లు ప్రకటించారు ఆ పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి. బుధవారం నుంచి పీఠం ప్రాంగణంలో విషజ్వర పీడా హర యాగంతో పాటు శాంతి హోమం కూడా ఉంటుందన్నారు. సామాజిక స్పృహతో విశాఖ శారదాపీఠం ఈ యాగాన్ని చేపట్టిందన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి విశిష్ట ఆయుర్వేద గ్రంథాలను పరిశీలించి  యోగవాశిష్టంలో సూచించిన మేరకు 11 రోజులపాటు యాగాల నిర్వహణకు సంకల్పించారని తెలిపారు. యాగంలో పాల్గొనేందుకు హిందూ ధర్మ ప్రచార యాత్రను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు.  రాజమండ్రిలో మంగళవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన స్వామి స్వాత్మానందేంద్ర సామాజిక బాధ్యతగా భావించి యాగం చేపట్టామన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రపంచ శ్రేయస్సు కోరుతూ ఈ యాగానికి శారదా పీఠం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ప్రజలు కూడా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గో సేవ చేయాలని, గోధూళి ,గోపంచకం వల్ల ఎలాంటి రోగాలు రావన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు తులసి మొక్కలు నాటాలని సూచించారు. శారదా పీఠం ఆధ్వర్యంలో వనమూలికలతో కూడిన వనాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలు, ఇళ్లల్లో  ఔషధ మొక్కలు నాటాలని స్వాత్మానందేంద్ర సూచించారు. భారతదేశపు ఆచార సాంప్రదాయాల వల్లే ఈ దేశంలో ఎలాంటి రోగాలు పుట్టడం లేదన్నారు. అంటువ్యాధులన్నీ ఇతర దేశాల నుంచి వ్యాప్తి చెందుతున్నవేనని తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కే. కవిత పేరు ఖరారైంది. ఈ స్థానికి ఎమ్మెల్సీగా ఉండే ఆర్. భూపతి రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు పోటీ పడ్డారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ స్థానాన్ని కవితకే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బయల్దేరేముందు మినిస్టర్ క్వార్టర్స్ లో స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కవిత భేటీ అయ్యారు. ఆమెకు స్వీకర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యేలతో కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్‌, బిజెపి ఎన్నికల బరిలో ఉన్నప్పటీకి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత గెలుస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7వతేదీన పోలింగ్ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలయ్యారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చిన కవిత.. ఇప్పుడు తాజా నిర్ణయంతో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనబోతున్నారు. రాజ్యసభకు నామినేట్ చేస్తారంటూ వార్తలు వచ్చినా, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పాలుపంచుకొనేందుకు ఆమెకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆమె రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడుతున్న కవితకు సీఎం కేసీఆర్ మరో పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి మహిళా ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్న కవితకు మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం.

లీట‌ర్ గోమూత్రం ధ‌ర 500 రూపాయ‌ల‌ట‌!

ఆక్సిటోసిన్ ఇంజెక్ష‌న్ ఇస్తే పాల ఉత్ప‌త్తి పెరుగుతోంది. అయితే మూత్రం ఎక్కువ‌గా రావాలంటే ఏం ఇంజెక్ష‌న్ ఇవ్వాలంటూ గోశాల‌ల నిర్వాహ‌ కులు మెడిక‌ల్ షాపుల చుట్టూ తిరుగుతున్నార‌ట‌! ఎందుకంట‌రా ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో లీట‌ర్ గోమూత్రం 500 రూపాయ‌ల ధ‌ర ప‌లుకుతుంద‌ట‌! గోమూత్రంతో క‌రోనాను న‌యం చేయ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో ఇప్పుడు గోమూత్ర పార్టీలు చేసుకోవ‌డం ఫ్యాష‌న్‌గా మారింది. ఆవు మూత్రం కోసం వ‌చ్చే వారి సంఖ్య పెర‌గ‌డంతో డిమాండ్‌కు త‌గ్గ‌ట్టు రేట్లు పెంచేస్తున్నారు గోశాల నిర్వాహ‌కులు. పాల‌సామ‌ర్థ్యం పెంచ‌డానికి ఇంజెక్ష‌న్‌లు వున్న‌ట్లు మూత్ర సామ‌ర్థం పెంచ‌డానికి ఏమైనా ఇంజెక్ష‌న్‌లు వున్నాయా అంటూ మెడిక‌ల్ షాపుల చుట్టూ తిరుగుతున్నార‌ట‌.   ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ను త‌ట్టుకోవాలంటే గోమూత్రం తాగాల‌ట‌. ఇది ఎవ‌రో డాక్ట‌ర్ చెప్పింది కాదు. అస్సాంలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ చెబుతున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు కూడా ఆవు మూత్రం, ఆవు పేడ సహాయపడతాయని ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ అభిప్రాయపడ్డారు. గోమూత్రం, ఆవు పేడతో కరోనాను కూడా తరిమేయవచ్చని నేను నమ్ముతున్నాను" అని బంగ్లాదేశ్‌కు పశువుల అక్రమ రవాణాపై చర్చ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆవును భారతదేశంలో పవిత్ర జంతువుగా పరిగణిస్తారని, అంతేకాకుండా చికిత్సా ప్రయోజనాల కోసం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉందని ఆమె అన్నారు. ఆవు పేడను సాంప్రదాయకంగా హిందూ మతపరమైన ఆచారాలు, మందులు, ఎరువు మరియు ఇంధనంతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.     కరోనాను నివారించే శక్తి కేవలం గోమూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరు అయ్యారు. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘గోమూత్ర పార్టీ’లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని అన్నారు. గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపుతారా? అంటూ సీనియర్ సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ మండిపడుతోంది. గోమూత్రం, పేడతో కరోనా వైరస్‌‌ను నయం చేయవచ్చు అంటూ చేస్తున్న ప్రచారంపై ఆమె స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు. అంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు.     తన ట్వీట్‌లో ప్రొఫెసర్ స్టేవ్ హంకే ట్వీట్‌ను కూడా జతచేశారు. అందులో ఆయన గోమూత్రంతో, పేడతో కరోనా వైరస్ వ్యాపించదు అని దానిని సేవిస్తే మరిన్ని అనారోగ్యాలను కొనితెచ్చుకున్నవారు అవుతారని.. భారతీయులకు సైన్స్ పాఠాలు అవసరం అని ఆయన ట్వీట్ చేశారు.

'సైకిల్' దిగి, ఫ్యాన్ అందుకోబోతున్న మాజీ ఐఏఎస్ రామాంజనేయులు

మాజీ పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు త్వరలో వై ఎస్ ఆర్ సి పి తీర్థం పుచ్చుకోబోతున్నారు. చంద్రబాబు నాయుడు కు అత్యున్నత సన్నిహితుడైన ఈ మాజీ ఐ ఏ ఎస్ అధికారి, కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీకి టీ డీ పి టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన రామాంజనేయులు, వై ఎస్ ఆర్ సి పి లో చేరటానికి కారణం, ఆయన బంధువు శమంతకమణి ఇప్పటికే వై ఎస్ ఆర్ సి పి లో చేరటానికి నిర్ణయం తీసుకోవటమే అని తెలిసింది. రామాంజనేయులు తీసుకున్న ఈ నిర్ణయం టీ డీ పి ని కలవరపెడుతోంది. ప్రత్యేకించి , టీ డీ పి ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో-- ఆర్ధిక పరమైన అంశాల్లో జరిగిన అవకతవకలపై రామాంజనేయులు దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఉందనీ, ఆ విషయాలు అయన బయటపెడితే, అప్పటి సలహాదార్లులలో ముఖ్యులైన కుటుంబ రావు కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇందుకోసమే, వై ఎస్ ఆర్ సి పి ముఖ్యులు ఆయనతో టచ్ లో ఉన్నారనీ, బహుశా రామాంజనేయులు కూడారెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చునని తెలుస్తోంది.  సామాన్య ప్రజలకు సైతం అందుబాటు లో ఉండే ఐ ఎ ఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న రామాంజనేయులు, పంచాయతీరాజ్ కమిషనర్ గా పని చేస్తున్న సమయంలో కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. అయినా సరే, ఆయన మీద నమ్మకముంచిన చంద్రబాబు నాయుడు ఆయనకు పదవే విరమణ తర్వాత , ఎక్స్-అఫిషియో సెక్రెటరీ హోదా కల్పిస్తూ -ఐ అండ్ పీ ఆర్ విభాగాన్ని అప్ప చెప్పారు. ఆ తర్వాత, టీ డీ పి టికెట్ పై తాడికొండ నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ, చివరకు కర్నూల్ జిల్లా నుంచి పోటీ చేయించారు. టీ డీ పి ఓటమి తర్వాత కొంతకాలం గా ఆయన ఒక ప్రయివేట్ ఐ ఏ ఎస్ స్టడీ సర్కిల్ బాధ్యతలను ప్రత్యక్షం గా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. దళితుడైన రామాంజనేయులు, తమ పార్టీ లో చేరితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు లభ్యమవుతుందనే విశ్వాసం తో వై ఎస్ ఆర్ సి పి నాయకత్వం ఉన్నట్టు సమాచారం. రక రకాల అంశాలతో రోజు వారీ తమను ఇబ్బంది పెడుతున్న తెలుగుదేశాన్ని, విధాన పరమైన అంశాల్లో ఇరుకున పెట్టాలంటే... రామాంజనేయులు వంటి వారి సేవలు పార్టీకి అవసరమనే భావన లో వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి, తెలుగుదేశం హయం లో ప్లానింగ్ బోర్డుకు సేవలందించిన కుటుంబరావు లాంటి వారి లొసుగులన్నీ రామాంజనేయులు చేతిలో ఉండటం తో, ఇది ఒక అడ్వాంటేజ్ గా మారుతుందని వై ఎస్ ఆర్ సి పి భావిస్తోంది.

క‌రోనా వైర‌స్‌కు భార‌త్ కేంద్రం కాబోతోందా... రానుంది గ‌డ్డుకాల‌మే!

కేసుల తీవ్ర‌త తో క‌రోనా వైర‌స్‌కు భార‌త్ కేంద్ర బిందు కానుంది. ఇరుకుగా వుండే ప్ర‌దేశాల్లో అంద‌రూ క‌లిసి నివ‌శించే అల‌వాటు వున్న ఇక్క‌డి ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించ‌డం సాద్యం కాదు. మ‌రో వైపు భారతదేశం తన పరిమిత ఆరోగ్య వనరులను వ్యూహాత్మకంగా ఖ‌ర్చు పెడుతోంది. ఇలాంటి నేప‌థ్యంలో వైరస్ కేసులకు సంబంధంధించి భారతదేశం ప్ర‌పంచ కేంద్ర బిందువుగా మార‌వ‌చ్చుని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనాను నియంత్రించే చ‌ర్య‌లు ప్రపంచంలోని రెండవ అత్యధిక జనాభా కలిగిన భార‌త్‌లో పనిచేయకపోవచ్చ‌ని ఆందోల‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 138 ఇన్ఫెక్షన్లు మరియు ఐదు మరణాలు రికార్డు అయ్యాయి. అయితే దేశ సరిహద్దులను మూసివేయడం, ఇన్కమింగ్ ప్రయాణికులను పరీక్షించడం మరియు పాజిటివ్ వ‌చ్చిన వారిని ప్ర‌త్యేక వార్డుల్లో పెట్టి వైర‌స్‌ను నియంత్రించ‌డానికి ప్రయత్నిస్తోంది. 17వ తేదీ నాడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ శాంపిల్స్‌కు దేశ పరీక్షా సామ‌ర్థ్యాన్ని ప్రస్తుత 500 నుండి రోజుకు 8,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. 1.3 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో అధిక జనాభా సాంద్రత వుండ‌టం వ‌ల్ల ఇక్క‌డ సామాజిక దూరం వంటి చ‌ర్య‌లు అసాధ్య‌మే. భారతదేశానికి సంబంధించినది కేసుల తీవ్ర‌త‌తో తదుపరి వైరస్ హాట్‌స్పాట్ కావచ్చు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు విదేశాల నుంచి వ‌చ్చిన వారి నుంచి ఇక్క‌డ వున్న వారికి వ‌చ్చింది. త‌రువాతి ద‌శ‌లో ఇక్క‌డ వున్న వారి నుంచి ఇక్క‌డ వున్న వారికి సోక‌నుంది.     ప్ర‌స్తుతం మొత్తం సంఖ్యల పెరుగుదల నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ 15 నాటికి “ఈ సంఖ్య 10 రెట్లు అధికంగా ఉంటుంది” అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ వైరాలజీ మాజీ అధిపతి డాక్టర్ టి. జాకబ్ జాన్ అన్నారు. ప్రతి వారం గడిచేకొద్దీ, క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌ పెద్దదిగా పెరుగుతోంద‌ని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలోని జాతీయ హెచ్ఐవి / ఎయిడ్స్ రిఫరెన్స్ సెంటర్ చీఫ్ కూడా జాన్ అన్నారు. " ఆసియాలోని ఇతర దేశాలతో పోల్చితే ఇప్పటివరకు భారతదేశం వైరస్ బారిన పడలేదు. వైరస్ వ్యాప్తిపై పోరాడటానికి భార‌త‌దేశం ఉత్తమంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. COVID-19 ను భారతదేశం ఎలా ఎదుర్కోవాలో చాలా మంది వివిధ అంశాలను హైలైట్ చేస్తున్నారు. COVID-19 తో పోరాడడంలో ముందంజలో ఉన్న వైద్యులు, నర్సులు, మునిసిపల్ కార్మికులు, విమానాశ్రయ సిబ్బంది మరియు ఇతర గొప్ప వ్యక్తులందరి మనోధైర్యాన్ని ఇది ఖచ్చితంగా పెంచుతోంది.       భారతదేశంలో అత్యధికంగా మ‌హారాష్ట్రలో 39 కేసులు న‌మోదైయ్యాయి. "మహారాష్ట్ర ప్రస్తుతం రెండవ దశలో ఉంది" అని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ముంబైలో విలేకరులతో అన్నారు. "కానీ మేము ఈ అంటు వ్యాధిని వ్యాప్తి చేయకుండా తగ్గించకపోతే లేదా ఆపకపోతే, మేము మూడవ దశకు చేరుకునే ప్ర‌మాదం వుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైర‌స్‌ను నియంత్రించాలి. అందుకే అన్ని బహిరంగ ప్రదేశాలను మూసివేయడం, విశ్వవిద్యాలయ పరీక్షలను నిలిపివేయడం మరియు ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రైవేట్ సంస్థలను కనీసం సగం మంది సిబ్బంది ఇంటి నుండి పనిచేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. "సామాజిక దూరం అనేది తరచుగా మాట్లాడే విషయం కాని పట్టణ మధ్యతరగతికి మాత్రమే బాగా పనిచేస్తుంది" అని ఆయన చెప్పారు. "పట్టణ పేదలకు లేదా గ్రామీణ జనాభాకు ఇది బాగా పనిచేయదు, ఇక్కడ కాంపాక్ట్ ప్యాక్ చేసిన ఇళ్ల పరంగా ఇది చాలా కష్టం, కానీ వారిలో చాలామంది సామాజిక దూరానికి తగిన ప్రదేశాలలో పని చేయవలసి ఉంటుంది." ప్రభుత్వ అధీకృత ప్రైవేట్ ప్రయోగశాలలను పరీక్షలు నిర్వహించడానికి అనుమతిస్తున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది. అయితే అధీకృత ప్రయోగశాలల జాబితాను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతినిధి డాక్టర్ లోకేష్ కుమార్ శర్మ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 174,000 మందికి సోకిన ఈ మహమ్మారి, మరణాలు 7000 తో అగ్రస్థానంలో ఉన్నాయి, ప్రారంభ నెమ్మదిగా దశ తరువాత పెరుగుతున్న పద్ధతి ఉంది. దక్షిణ కొరియా మరియు ఇటలీ వంటి దేశాలలో ఇది కనిపించింది - చైనా ప్రధాన భూభాగం వెలుపల ఎక్కువగా ప్రభావితమైన దేశాలు. గత నెలలో ఒక వారంలో 2,000% కేసులు పెరిగిన దక్షిణ కొరియా, క్లినిక్లు మరియు డ్రైవ్-త్రూ స్టేషన్లలో లక్షలాది మందిని పరీక్షించడం ద్వారా వ్యాప్తి మరియు మరణాలను మందగించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా 5,200 కి పైగా సంభావ్య కేసులను గుర్తించి భారతదేశంలో నిఘాలో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆలస్యంగా తెలిపింది. గత వారం ఇది చాలా వీసాలను నిలిపివేసింది మరియు ల్యాండ్ క్రాసింగ్ల ద్వారా అంతర్జాతీయ ట్రాఫిక్‌ను పరిమితం చేయాలని నిర్ణయించింది.

త‌ప్పుల త‌డ‌క‌గా ఇంట‌ర్ క్వ‌శ్ఛ‌న్ పేప‌ర్లు.... విద్యార్థుల భ‌విష్య‌త్‌తో చెల‌గాట‌మాడుకున్న ఇ

మార్చి నెల 4వ తేదీ నుంచి ఇంటర్‌‌ పరీక్షలు మొదలయ్యాయి. ఫస్టియర్ ప‌రీక్ష‌కు 4,80,531 మంది, సెకండియర్ ప‌రీక్ష‌కు 4,85,345 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే తెలంగాణా ఇంట‌ర్ బోర్డు లీల‌లు చూసి విద్యార్థులు, వారి త‌లిదండ్రులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌, సెకండియ‌ర్ క్వశ్చన్ ​పేపర్లను చూసిన‌ట్లైతే ఇంట‌ర్ బోర్డు అధికారుల నిర్ల‌క్ష్యానికి ప‌రాక‌ష్ట‌గా క‌నిపిస్తోంది. ఫస్టియర్‌‌, సెకండియర్‌‌ తేడా లేకుండా ప్రతి క్వశ్చన్‌‌ పేపర్లోనూ మిస్టేక్స్‌‌ కనబడ్డాయి. అక్షరాల్లో తప్పులు, ఒక పదానికి బదులు ఇంకో పదం అచ్చవడం, వాక్య నిర్మాణాల్లో లోపాలతో స్టూడెంట్లు బేజారయ్యారు. ఇప్పటివరకూ జరిగిన ప్రతి క్వశ్చన్‌ పేపర్లోనూ తప్పులొచ్చాయి. కొన్ని చిన్న తప్పులైతే, ఇంకొన్ని ప్రశ్న అర్థాన్నే మార్చేశాయి. ఈసారి ఇంగ్లిష్ పేపర్–2తో ఎక్కువ తప్పులొచ్చాయి. 17వ తేదీ జరిగిన ఫస్టియర్ కామర్స్ పేపర్‌‌లోనూ చాలా తప్పులొచ్చాయి. ఇంగ్లిష్ –2 పేపర్‌‌లో 14వ ప్రశ్నను అటెంప్ట్‌‌ చేసిన వాళ్లకు 4 మార్కులు కలపాలనుకుంటున్నట్టు బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ చెప్పారు. సంస్కృతం సెకండియర్ పేపర్‌‌లో 13వ ప్రశ్నలో బిట్​నెంబర్ 1లో హారిస్‌‌కు బదులు హరిసా అని పడింది. 15వ క్వశ్చన్‌‌లో బిట్ నెంబర్ 1లో యథాశక్తికి బదులు యసశక్తి అని ప్రింట్ అయి వుంది. సెకండియర్ ఇంగ్లిష్​ పేపర్ -2లో 5వ ప్రశ్నలో బిట్ నెంబర్ ఏలో WHY బదులు WHAT అని వచ్చింది. 7వ ప్రశ్నలోని పేరా2లో DISCIPLINE కు బదులుగా DISIPLINE అని,12వ క్వశ్చన్ లో TURN A DEAF EAR బదులు TURN TO DEAF YEAR అని పడింది. 17వ ప్రశ్నలో FELICITATION బదులుగా FELICILATION అని వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 14 కూడా బ్యాంక్​ వివరాలు లేకుండానే బ్యాంకు వివరాలివ్వాలని ప్రశ్నను అసంపూర్తిగా ఇచ్చారు. 10వ ప్రశ్న బిట్ నెంబర్ 1 కూడా తప్పుగా వచ్చింది. ఫస్టియర్ బాటనీ -1 ఉర్దూ మీడియంలోని 6వ ప్రశ్నలో మాష్మియాట్‌‌కు బదులు షామియాట్ అని వచ్చింది. 13వ ప్రశ్నలో సన్ఫీకి బదులు మన్ఫీ అని వచ్చింది. సెకండియర్ బాటనీ ఉర్దూ మీడియం పేపర్లో 2వ ప్రశ్నలో షరీక్ ఆమీల్‌‌కు బదులు షరీక్ మిల్ అని వచ్చింది.13వ ప్రశ్నలో జాడ్ కరీచికి బదులు జాడ్ కార్తీచి అని ఉంది.     సెకండియర్ హిస్టరీ తెలుగు మీడియం పేపర్లో 8వ ప్రశ్నలో కుతుబ్​షాషీ పేరుకు బదులు తుక్కుబ్ షాహీ అని వచ్చింది. హిస్టరీ ఉర్దూ మీడియంలో 33వ ప్రశ్నలో షరీఫానాకు బదులు ముష్రిఫానా అని వచ్చింది. ఫస్టియర్ ఎకనామిక్స్ తెలుగుమీడియంలో 4,15 ప్రశ్నల్లో జాతీయ ఆదాయానికి బదులు జాతీయదన్ని అని పడింది. 23వ ప్రశ్నలో వెబ్లిన్‌‌కు బదులు వెబ్లెన్ అని ఉంది. ఎకనామిక్స్ ఉర్దూ మీడియం(ఓల్డ్) 8వ ప్రశ్నలో ముతానియత్‌‌కు బదులు ముస్తాన్నియత్ అని, 13వ ప్రశ్నలో ‘బార్డర్ నిజాం కియాహై’ కి బదులు బజార్‌‌కి దర్జా బండికి వాజహత్ కిజియే అని పడింది. సెకండియర్ ఫిజిక్స్ తెలుగు మీడియం పేపర్‌‌లో 2వ ప్రశ్నలో అనిశ్చితత్వకు బదులు అనిచ్చితత్వ సూత్రం అని వచ్చింది. ఫస్టియర్ కెమిస్ర్టీ తెలుగు మీడియంలో 15వ ,16వ ప్రశ్నల్లో, ఇంగ్లిష్​మీడియంలో 14వ ప్రశ్నలో తప్పులొచ్చాయి. కామర్స్ పేపర్‌‌లో (న్యూ) ఇంగ్లిష్ మీడియంలో 27వ ప్రశ్న, తెలుగు మీడియంలో 16వ ప్రశ్నలో తప్పులు దొర్లాయి. కామర్స్​ (ఓల్డ్) తెలుగు మీడియంలో 18, 19, 22, 23, 31వ ప్రశ్నల్లో తప్పులొచ్చాయి. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ప‌ట్ల ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని విద్యార్థుల త‌లిదండ్రులు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

మే లోపు అయితేనే వైజాగ్ వస్తాం...ప్రభుత్వానికి చెప్పనున్న ఉద్యోగులు

ఏపీ కి 3 రాజధానులు ప్రకటన దగ్గరనించి వైజాగ్ కు సచివాలయ తరలింపు చర్చనీయాంశంగా మారింది...ఈలోపు అమరావతి లో ఆందోళనలు జరగడం స్థానిక ఎన్నికలు రావడం కూడా జరిగాయి...ఇప్పుడు స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడడం తో  వైజాగ్ షిప్టింగ్ అంశం చర్చనీయాంశంగా అయ్యింది  ..సచివాలయ ఉద్యోగులు వైజాగ్ వెళ్లడానికి  ఇప్పటికే  ప్రభుత్వం తో  చర్చలు  జరిపారు...మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు...తాజాగా సచివాలయంలో ఉద్యోగుల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతోంది..ఈ సమావేశం లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  మే 31 లోపు సచివాలయం తరలించాలని ఉద్యోగులు కోరనున్నారు..ఆ తర్వాత కష్టం అనే అభిప్రాయం ప్రభుత్వం  దృష్టి కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు...మే తర్వాత స్కూళ్లు. కాలేజీ లు తెరుస్తారు..దీని వల్ల మే లోపు వెళితే  అడ్మిషన్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది  అనే అభిప్రాయం చెప్పనున్నారు...దీంతో పాటు ఉద్యోగులు వైజాగ్ వెళ్ళడానికి రెడీ గా ఉండాలనే విషయం కూడా  చెప్పనున్నారు..మరి ప్రభుత్వం ఉద్యోగుల కు ఏమి చెప్తుంది అన్నది చూడాలి..

కరోనా ఎఫెక్ట్‌.... పలు రైళ్లు రద్దు

భువనేశ్వర్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది..ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌ పూరీ మధ్య నడిచే ఎనిమిది ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.. ప్రత్యేక రైళ్లతో పాటుగా మరో 23 రైళ్లను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.. దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్‌ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని.. అందుకే ఈ నెల 31 వరకు ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. రద్దు అయిన రైళ్ల వివరాలు... 11008 – పుణె-ముంబయి దక్కన్‌ ఎక్స్‌ప్రెస్‌– మార్చి 18 నుంచి 30 వరకు 11007 – ముంబై-పుణె డెక్కన్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 31 వరకు 11201 - ఎల్‌టీటీ-ఏజేఎన్‌జే ఎక్స్‌ప్రెస్‌ - మార్చి 23, మార్చి 30 11202 – ఏజేఎన్‌జే-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ – మార్చి 20, మార్చి 27 11205 - ఎల్‌టిటి-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 21 మరియు మార్చి 28 న మాత్రమే 11206 - నిజామాబాద్-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 మరియు మార్చి 29 న మాత్రమే 22135/22136 - నాగ్‌పూర్-రేవా ఎక్స్‌ప్రెస్ - మార్చి 25న మాత్రమే 11401 - ముంబయి-నాగ్‌పూర్ నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు 11402 - నాగ్‌పూర్-ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 నుంచి మార్చి 31 వరకు     11417 - పుణె-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 26, ఏప్రిల్ 2న 11418 - నాగ్‌పూర్-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 27న 22139 - పుణె-అజ్ని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 28న 22140 - అజ్ని-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 22, 29న 12117/12118 - ఎల్‌టిటి-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు 12125 - ముంబయి-పుణె ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు 12126 - పుణె-ముంబయి ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు 22111 - భూసవల్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 29 వరకు 22112 - నాగ్‌పూర్-భూసావల్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 30 వరకు 11307/11308 - కలబురగి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు 12262 - హౌరా-ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 24, మార్చి 31న మాత్రమే 12261 - ముంబయి-హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 25, ఏప్రిల్ 1న మాత్రమే 22221 - సీఎస్‌ఎంటీ-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 23, 27, 30న మాత్రమే 22222 - నిజాముద్దీన్-సీఎస్‌ఎమ్‌టీ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 24, 26, 31న మాత్రమే

సామాన్యుడిపై క‌రోనా చావుదెబ్బ‌!

ఆర్థిక వ్యవస్థకు క‌రోనా పెను సవాల్‌గా మారుతుందా? చైనా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప‌త‌నం చేసిన 'కరోనా వైరస్' అక్కడితో ఆగకుండా ఇతర దేశాలకూ పాకి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకూ పెను సవాల్ విసురుతోంది. కరోనా వైరస్ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఎలా ఉండ‌బోతోంది. త‌ల‌చుకుంటేనే వ‌ణుకు పుడుతోంద‌ని సామాజిక విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌ట్టికే ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశీయ వాహన రంగం కొంతకాలంగా నిస్తేజంగా ఉంది. సగటు భారతీయుడి కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. మన దేశం చాలా ఉత్పత్తుల విషయంలో చైనాపైనే ఆధారపడి ఉంది. అక్కడ పలు రంగాల్లో ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా రవాణా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చైనా చతికిలపడితే మన ప‌రిస్థితి ఏమిటి? మన దేశం దిగుమతి చేసుకుని టాప్ 20 ఉత్పత్తుల్లో అధిక భాగం చైనా నుంచే వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగం విషయానికొస్తే 45 శాతం ఉత్పత్తులు చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఆర్గానిక్ కెమికల్స్ కూడా 60 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ఇక ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగించే ముడి వస్తువులు 70 శాతం చైనా నుంచి దిగుమతి అవాల్సిందే. అలాగే వాహన రంగంలోనూ 25 శాతానికిపైగా మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇది వాస్త‌వ ప‌రిస్థితి. క‌రోనా దెబ్బ‌కు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు 156 బిలియన్ల నష్టం వాటిల్లిందని, ఇది గ్లోబల్‌ జీడీపీలో 0.2 శాతానికి సమానమని ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏడీబీ తెలిపింది. కరోనా కారణంగా ఒక్క చైనాకే 103 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ఈ నష్టం విలువ ఆ దేశ జీడీపీలో 0.8 శాతానికి సమానం. మిగతా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లిన నష్టం విలువ 22 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఏడీబీ ఏసియా దేశాలకు 40 లక్షల డాలర్ల సాయం ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఈ వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఏడాది ఏసియా పసిఫిక్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు 21,100 కోట్ల డాలర్లు నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ రేటింగ్‌ ఏజెన్సీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. చైనా గ్రోత్‌రేటుపై 3 శాతం వరకు ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. కరోనా కార‌ణంగా ఇండియా టూరిజం సెక్టార్‌ నష్టం 84.2 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.623 కోట్లు) వరకు ఉండొచ్చని ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌(ఏడీబీ) తెలిపింది. పరిస్థితులు మరింత విషమిస్తే నష్టం 252 మిలియన్ డాలర్ల వరకు చేరవచ్చని చెబుతోంది. చైనాలో ఏర్ప‌డిన సంక్షేభంతో మన దేశంలోని షిప్పింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్ తదితర రంగాలన్నీ కుదేలయ్యాయి. కారణం వాటికి అవసరమయ్యే ముడిసరుకులు, దిగుమతులు చైనా నుంచి తగ్గిపోవడమే. దీంతో మన ఫార్మా రంగంలో ఉత్పత్తి, సరఫరాలకు సంబంధించి తీవ్ర కొరత ఏర్పడింది. మన దేశంలో మందుల తయారీలో ఉపయోగంచే ముడిసరుకులు అంటే ఏపీఐలు, బల్క్ డ్రగ్స్‌ చాలావరకు చైనా నుంచే దిగుమతి అవుతాయి. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం క‌న్పిస్తోంది. ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది ఆదాయం దారుణంగా ప‌డిపోయింది. రోజు సంపాదించుకుని తినే వారి ప‌రిస్థితి అయితే ద‌య‌నీయంగా త‌యారైంది. క‌రోనా సోక‌క‌పోయినా క‌రోనా సెగ‌కి ఎంత మంది బ‌లి అవ్వాల్సి వుందో.

'సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ను పూర్తి చేసిన పీవీ సింధు

‘కరోనా’ సోకకుండా ప్రజలను అప్రమత్తం చేసే ‘సేఫ్ హ్యాండ్స్’ ఛాలెంజ్‌ను పీవీ సింధు పూర్తి చేసింది. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. పలువురు సెలెబ్రిటీలు కూడా తమ వీడియో సందేశాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ షట్లర్ పీవీ సింధు కూడా తగు సూచనలు చేశారు. హైదరాబాద్ లో అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హద్దా విసిరిన ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా సింధు ఓ ట్వీట్ చేశారు. కేథరిన్ హద్దా కు ‘థ్యాంక్స్’ చెప్పిన సింధు, ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కచ్చితంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఈ సందర్భంగా మరో ముగ్గురికి సింధు ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు ఈ ఛాలెంజ్ విసిరింది. కేవ‌లం శుభ్ర‌త పాటించ‌డం వ‌ల్లే అన్ని ర‌కాల వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. దీనిపై ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న పెర‌గాల్సి వుంది.

నా రాష్ట్రానికి ఏమైంది..తెలుగోడి గోడు...

ఆంధ్రప్రదేశ్ లో సమీప భవిష్యత్తులో ఏం జరగబోతోంది? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పల్లెలు కులాల వారిగా చీలిపోనుందా? దశాబ్దాలుగా ప్రశాంతంగా, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఉన్న గ్రామాల ప్రజలు చలో సినిమాలోలా కంచెలు వేసుకు బతకాల్సిన పరిస్థితులు రానున్నాయా?  ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే ప్రతిఒక్కరి మెదడుని తొలుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కొన్ని విచిత్ర పరిస్తితులను గమనిస్తే పై ప్రశ్నలు నిజమయ్యే అవకాశాలు చాలా కనపడుతున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ ముఖ్యమంత్రీ మాట్లాడని విధంగా జగన్ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం..రాజే మొదలు పెట్టాక అయన మెప్పు కోసం మంత్రులు, నాయకులు పోటీ పడి ఇష్టం వచ్చిన బాషలో ఒక రాజ్యంగ బద్ద పదవిలో ఉన్న అధికారిని కులం పేరుతో నానా దుర్భాషలాడటం ప్రజలంతా చూశారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు సాక్షాత్తు ఒక కులానికి చెందిన పెద్దల వ్యాఖ్యలతో నిట్టనిలువునా చీలి పోయే స్థితులు అనివార్యమయ్యాయి. మేము అధికారంలోకి వస్తే కులాలు చూడము, ప్రాంతాలు చూడము అని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలా మాట్లాడితే.. ఇవి ఎక్కడికి దారితీస్తాయోనని ప్రజలు భయం గుప్పిట చిక్కుకున్నారు. ప్రధానంగా పల్లెల్లో అధిక ప్రభావం చూపగల రెండు కులాల మద్య పెద్దలు సృష్టిస్తున్న విభేదాలు పరిస్తితులను నివుగప్పిన నిప్పులా మార్చాయని అంటున్నారు.  నిజానికి రెడ్డి కులానికి, కమ్మకులానికి మధ్య గొడవులు లేవు. ఆధిపత్య పోరు లేదు. ఒకవిధంగా రెండూ ఆధిపత్య కులాలే. 83 వరకు రెడ్లే ఎక్కువగా అధికారంలో ఉన్నారు. వారికి కమ్మ కులస్తులు సంపూర్ణ సహకారం అందించిన విషయం తెలిసిందే. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి. వీళ్ళలో ఎవరూ కమ్మ కులాన్ని వ్యతిరేకించలేదు. దానికి ముందే ముఖ్యమంత్రులైన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి. 90వ దశకంలో ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఇలా అందరూ ఆన్ని కులాలతో  పాటుమరో ఆధిపత్య కులమైన కమ్మ కులాన్ని కూడా ఒకేలా చూశారు. కమ్మ కులస్తులు కూడా ఆయా ముఖ్యమంత్రులకు యధాశక్తి సహకరించారు.  1983లో కమ్మ కులస్తుడైన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయనకు అన్ని కులాలతో పాటు రెడ్డి కులస్తులు కూడా పూర్తి సహకారం అందించారు. ఎక్కడా కుల ప్రసక్తి రాలేదు. ఆ మాటకొస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే ఆత్మగౌరవ నినాదంతో కానీ కుల ప్రాతిపదికన కాదన్న విషయం తెలుగు ప్రజలకు స్పష్టంగా తెలిసిందే.  కానీ, వినాశనం , అధికారం అనే ఆలోచన తప్ప మరో ధ్యాస లేని ఒకే ఒక్క కుటుంబం పనిగట్టుకొని కమ్మ కులం మీద విషం చిమ్మటం మొదలు పెట్టిందని కొందరు అంటున్నారు. ఆ కుటుంబం మొదటి తరం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. కమ్మ కులాన్ని వ్యతిరేకించటం ఆయనకు దగ్గర కావటానికి ఒక సులువైన మార్గం అనేలా పరిస్థితి తయారయ్యింది. ఆయన కూడా అలాగే చేరదీశాడు. కేవలం రెడ్డి కులస్తులనే కాకుండా, మిగతా కులాలు కూడా కమ్మ కులాన్ని వ్యతిరేకించేలా ప్రోత్సహించిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఆ కుటుంబం రెండో తరం అధికారంలోకి వచ్చాక, ఆ వ్యతిరేకత కాస్తా ద్వేషంగా మారే స్థాయికి తీసుకెళ్ళాడని, ఆ ద్వేషాన్ని బహిరంగంగానే ప్రోత్సహించాదాని, ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయనే ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు. ఆయన ఆదరణ పొందటం కోసం రెడ్డి కులస్తులు కానివాళ్ళు కూడా కమ్మ కులాన్ని ద్వేషించటం, ఆ ద్వేషాన్ని ఆయన ప్రోత్సహిస్తుండటంతో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కులాల కుంపటిలా తయారయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకే ఒక కుటుంబం రెడ్డి, కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టింది. కేవలం ఆ కుటుంబం వల్లే శతాబ్దాలుగా కలిసున్న ఈ రెండు కులాలు ఒకరినొకరు ద్వేషించుకోనే స్థాయికి వెళ్ళారని విశ్లేషిస్తున్నారు. పల్లెల్లో ఈ రెండు కులాలకు వెన్ను దన్నుగా, అనుచరులగా ఉంటున్న వెనుకబడిన, దళిత కులాలను కూడా ఆ కుటుంబం ఎంత తెలివిగా వాడుకుంటుందో అర్థం చేసుకోవాలంటున్నారు. దళితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు అనటంలో సందేహం లేదు. అందుకే వారు ఆధిపత్య కులానికి క్రైస్తవ ముసుగు వేసుకొని వారిని ఆకర్షించడమే కాకుండా, వారిలో మరో ఆధిపత్య కులమైన కమ్మ కులం పట్ల ద్వేషాన్ని వారిలో పెంచి పోషిస్తున్నారని అంటున్నారు. ఇక్కడ దళితులు, వెనుకబడిన వర్గాల వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆధిపత్య కులాల పట్ల వెనుకబడిన వర్గాల, దళితులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ, ఒక ఆధిపత్య కులాన్ని మోస్తూ, మరో ఆధిపత్య కులాన్ని ద్వేషిస్తే అది వెనుకబడిన వర్గాలకు, దళితులకు ఏ విధంగా  లాభం కలుగుతుందో వారే ఆలోచించుకోవాలని సామజిక విశ్లేషకులు అంటున్నారు. వెనుకబడిన వర్గాలకు, దళితులకు అధికారం రావాలా అంటే.. ఖచ్చితంగా రావాలి. కానీ, వారు తమ శక్తిని ఒక ఆధిపత్య కులాన్ని మోయటానికి, ఒక ఆధిపత్య కులాన్ని ద్వేషించటానికే పరిమితం అయితే వారు కేవలం ఆయుధాలుగానే మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. ఆ ఆయుధం ధరించిన ఒక ఆధిపత్య కులపోడు, మీ మీద అధికారం చెలాయిస్తూనే ఉంటాడు. ఈ కులాల కుమ్ములాటలో భాగం అయితే నష్టం తప్ప లాభం ఉండదన్నది సుస్పష్టం.  కేవలం ఒకే ఒక కుటుంబం ఒక పథకం ప్రకారం రెండు ఆధిపత్య కులాల మధ్య మంట పెట్టింది. సరిగ్గా గమనిస్తే, ఇప్పుడు వారే మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య అగ్గి రాజేశారు. ఈ మంట దావానలంలా వ్యాపించి ఎన్ని జీవితాలు ఛిద్రం అవుతాయోనని తరాలుగా రాజకీయాలు చూస్తున్న పెద్దలు, ఉజ్వల రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్న విజ్ఞులు ఆవేదన చెందుతున్నారు.

కాపర్ తో కరోనా వైరస్‌ను చెక్ పెట్టవచ్చా?

అవునంటున్నారు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు. కాపర్ వాడితే కరోనా వైరస్ నిమిషాల్లోనే చనిపోతుందట! ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ను కాపర్ తో చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌. కాపర్ మన చెంత ఉంటే కరోనా మన దరి చేరే అవకాశమే లేదంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ సౌతాంఫ్టన్ లోని ఎన్విరాన్మెంటల్ హెల్త్ కేర్ ఫ్రొఫెసర్ బిల్ కీవిల్. కరోనా వైరస్ నాలుగు నుంచి ఐదు రోజుల వరకు జీవించగలదు. అయితే ఆ వైరస్... రాగిపై, మరియు ఇత్తడి వంటి కాపర్ మిశ్రమాలపై ల్యాండ్ అయితే మాత్రం కొన్ని నిమిషాల్లోనే చనిపోతుందట‌. ఆసుపత్రులలో రాగిని తిరిగి తీసుకురావడానికి సమయం ఆసన్నమైందని కీవిల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మహమ్మారిలతో (గ్లోబల్ పాండమిక్స్) నిండిన అనివార్యమైన భవిష్యత్తు దృష్ట్యా మనమందరం ఆరోగ్య సంరక్షణలో, ప్రజా రవాణా, ఇళ్లలో కూడా రాగిని ఉపయోగించాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్(COVID-19)ను ఆపడానికి చాలా ఆలస్యం అయితే, భవిష్యత్తులో వచ్చే మహమ్మారి గురించి ఆలోచించడానికి సమయం మించిపోలేదని ఆయన అన్నారు. భారత్ లో వేల సంవత్సరాల నుంచి ఏదైనా ద్రవాలు తీగేందుకు కాపర్ కప్ లను ఉపయోగిస్తుంటారని ఆయన తెలిపారు. కాపర్ సాధారణన,నిష్క్రియాత్మ(ఎదురుతిరగని),యాంటీమైక్రోబయాల్ మెటీరియల్ అని ఆయన అన్నారు. ఇది కరెంట్ లేదా బ్లీచ్ అవసరం లేకుండానే దాని ఉపరితలాన్ని స్వీయ-క్రిమిరహితం చేస్తుందన్నారు. ఇన్ ఫ్యూయంజా,ఈ కోలి వంటి బ్యాక్టీరియా, MRSA వంటి సూపర్ బగ్స్ లేదా ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆరోగ్య భ‌ద్ర‌తను దృష్టిలో పెట్టుకొని కాప‌ర్ వినియోగం పెంచాల‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు సూచిస్తున్నారు.

ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ ఇక క‌రోనా పరీక్షలు!

దేశంలోని 52 ల్యాబ్‌ల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇక నుంచి అధీకృత ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ కరోనా వైరస్ పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వుంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ కేవలం గాంధీ హాస్పిటల్‌లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలో తిరుపతి స్విమ్స్‌లో, విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో, అనంతపురంలోని జీఎంసీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఉన్న సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలోని వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్‌ లేబొరేటరీలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించారు. రూ. 23 లక్షలతో రియల్‌ టైమ్‌ పోలిమెరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ పరికరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. త్వరలోనే కాకినాడ ఆర్ఎంసీ ల్యాబ్‌లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. కరోనా అనుమానితులకు ప్రభుత్వం ఉచితంగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. కానీ ఒక్కోసారి టెస్ట్ చేసినందుకు గానూ రూ.6 వేలకుపైగా ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది. ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు అందుబాటులోకి వస్తే.. వాటిల్లో నిర్ధారణ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు కొర‌త‌!

తెలంగాణలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పడిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తలసేమియా బాధితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొద్ది రోజులుగా రక్తదానం చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. కరోనా భయంతో హాస్పిటల్స్, ఆరోగ్య శిబిరాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. గతంలో ఐటీ కంపెనీలు, కాలేజీల్లో రక్తదాన క్యాంపులు నిర్వహించి, రక్తం సేకరించేవారిమని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వీటిని మూసివేయడంతో పూర్తిగా రక్త నిల్వలు తగ్గిపోయాయి.. దీని వల్ల ముఖ్యంగా చిన్నారులు, తలసేమియా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర డాక్టర్ కేపీ రెడ్డి అన్నారు. తెలంగాణా ప్ర‌భుత్వం క‌రోనాపై సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగా ష‌ట్ డౌన్ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో జ‌నం బ‌య‌ట‌కు రావ‌డం పూర్తిగా త‌గ్గిపోతోంది. ముఖ్యంగా హార్ట్ పేషంట్ల‌కు స‌ర్జ‌రీలు చేయ‌డానికి కూడా ర‌క్తం అవ‌స‌రం అయిన‌ప్పుడు దాత‌లు క‌రువైపోతున్నార‌ని ఆసుప‌త్రుల నిర్వాహ‌కులు చెబుతున్నారు. హైద‌రాబాద్‌తో పాటు మొత్తం తెలంగాణాలోని ఇతర బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విశాఖ శారదాపీఠంలో యోగవాసిష్టం యాగాలు 

కరోనా వైరస్ నిర్మూలన కోసం 11 రోజులపాటు సాగనున్న యజ్ఞయాగాదులు యాగం నేపథ్యంలో విశాఖ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర వాయిదా రాజమండ్రిలో యాత్ర ముగించుకుని విశాఖ బయలుదేరిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సామాజిక స్పృహతో ఈ యోగ వాసిష్ఠం సూచించిన యాగం చే పట్టినట్టు స్వామి స్వాత్మానందేంద్ర 'తెలుగు వన్ '  కు చెప్పారు. శాస్త్ర గ్రంధాల్లో సూచించిన మేరకు యాగం నిర్వహిస్తామన్నారు.  ఆరోగ్యకరమైన సమాజమే విశాఖ శారదాపీఠం ఆకాంక్ష  అని స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు. నిజానికి  యోగవాసిష్ఠం లో కర్కటి ఉపాఖ్యానం అని ఒక అధ్యాయం ఉంది.  కర్కటి అనేది  ఓ మహారాక్షసి . దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు. ఇలా కాదు;  భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకే సారి మింగ గలిగితే ఎంత బాగుండు ! అప్పుడు కానీ నాకు కడుపు నిండదు – అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది. ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది. హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు. “ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయం లోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోం చేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువుద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే  దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నాడు.  అవేమిటంటే ,  తినకూడని వాటిని తినేవారిని, చెయ్యకూడని పనులు చేసేవారిని , చెడు ప్రదేశాల్లో ఉండేవారిని , శాస్త్రవ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను  సుబ్బరంగా  హింసించి ఆరగించవచ్చు.మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో   పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ ఎస్కేప్ రూట్ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికావ్యాధి కోరలనుంచి తప్పించుకోగలరట!   వేల సంవత్సరాల కిందటి  యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో, పక్క వాటాలోనో  కాపురంపెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కప్పలు, పాములు తినే చైనా వాళ్ళూ , ఎద్దు మాంసం లేనిదే  ముద్దదిగని తూర్పు, పడమర  దేశాల వాళ్ళూ , మతం పేర రక్తపుటేర్లు పారించిన వాళ్ళూ కరోనా కోరల్లో నజ్జు అవుతున్నారు. వాటికన్ , మక్కా లాంటి క్షేత్రాలే మనిషి జాడలేకుండా మూతపడి , ఇటలీలాంటి దేశాలు మొత్తానికి మొత్తం దిగ్బంధమై , చైనావాళ్ళు పైకి చెప్పుకోలేని ఘోరకలితో గొల్లుమంటూ ప్రపంచమంతటా హాహాకారాలు దద్దరిల్లుతున్నా , ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం చేతులెత్తేసిన స్థితిలో పాత పురాణం లో బ్రహ్మ చెప్పిన ఈ విషూచికా మంత్రమే  రేపు బాధిత జనాలకు తారకమంత్రం అవుతుందేమో?! ఎవరు చెప్పగలరు ? ఈ సంగతి తెలిస్తే ఏ అమెరికా వాడో  ఈ విషూచికా మంత్రానికి అర్జెంటుగా పేటెంటు కొట్టెయ్యడా ?! అయితే, ఈ మంత్రం ద్వారా, 11 రోజుల పాటు జరిగే యాగం -కరోనా వైరస్ బారి నుంచి క్షేమంగా ప్రజలను బయటపడేయటం కోసం ఉద్దేశించిందేనని శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు.

11 రూపాయ‌ల‌కే కరోనా తాయెత్తు!

మాస్కు కంటే త‌న తాయెత్తే ప‌వ‌ర్‌ఫుల్ అంటున్న దొంగ‌బాబా కరోనా వైరస్ మన దేశంలో దొంగ బాబాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాయత్తు కట్టుకుంటే కరోనా దరిచేరదంటూ ప్రచారం మొదలెట్టాడు యూపీలో దొంగ బాబా అహ్మద్ సిద్ధిఖ్‌. అంతా అమాయక ప్రజలు ఆ బాబాల దర్శనం కోసం క్యూ క‌ట్టారు. తాయత్తు కట్టుకుంటే కరోనా వచ్చినా ఎగిరిపోతుందంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న దొంగబాబాకు యూపీ పోలీసులు క‌ట‌క‌టాల వెనుక‌కు నెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. చేతికి తానుకట్టే మంత్రించిన తాయెత్తుతో కరోనా పారిపోతుందంటూ అహ్మద్ సిద్ధిఖీ అనే ఓ దొంగబాబా ఏకంగా బోర్డు పెట్టే తామెత్తులు అమ్మాడు. మందులు ఎలాగు లేవు క‌నుక తానే కరోనా వ్యాపారానికి తెరలేపాడు. ఒక్కో తాయెత్తు ధర కేవ‌లం 11 రూపాయ‌లు మాత్ర‌మేనంటూ స్థానికంగా విస్తృతంగా ప్ర‌చారం చేసుకున్నాడు. ఇంకేముంది. అమాయక ప్రజలు క్యూలైన్లు కట్టి మరీ తాయెత్తు కట్టించుకుంటున్నారు. మాస్కులకంటే ఇదే బెటర్ అనుకుంటున్న ప్రజలు.. తాయెత్తు కట్టుకుంటూ మోసపోతున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో.. ప్రజలను మోసం చేస్తున్నా బాబా అవతారమెత్తిన సిద్ధిఖీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.