సిగ్గుంటే రాజీనామా చేసి పదవి వదిలేయాలా? శృతి మించుతున్న విమ‌ర్శ‌లు

సిగ్గుంటే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలి. ఇది చాలా మంది మంత్రులు, వైసీపీ నేతల మాట. అసలు ప్రభుత్వం ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటుందో అర్ధం కావటం ఐఏఎస్ వర్గాలు తీవ్ర అసహ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. జగన్ సి.ఎం. అయి ఏడాది కావ‌స్తున్నా ఇంకా ప్రభుత్వాన్ని చంద్రబాబే శాసిస్తున్నారనే తరహా వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను ఏమైనా పెంచుతాయా? అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వ తీరుపై ఐఏఎస్ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వరకూ ఓకే కానీ..ఐఏఎఎస్ అధికారులను కూడా ల‌క్ష్యంగా చేసుకోవ‌డం మరీ దారుణంగా ఉందని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్న వారి విషయంలో సర్కారుకు ఆ వెసులుబాటు ఉండదు. నిజంగా ఎస్ఈసీతో ఏదైనా సమస్య వచ్చినా కూడా ప్ర‌భుత్వం తన పని సాఫీగా సాగిపోయేందుకు తమ సన్నిహిత అధికారులను పంపి ప్రభుత్వ సందేశాన్ని పంపుతుంది. అవసరం అయితే కీలక వ్యక్తులు కూడా రంగంలోకి లాబింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో అప్పుడు పని ఈజీగా అయిపోతుంది. ఇది అందరూ పాటించే పద్దతి. అయితే ఈ ప్రభుత్వంలో ఎంతో మంది సలహాదారుల ఉన్నా ఏ ఒక్క అంశాన్ని కూడా స్మూత్ గా డీల్ చేసే పరిస్థితి లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.     రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరు వారాల పాటు ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన వెంటనే ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు..వైసీపీ నేతలు సామాజిక వర్గం పేరుతో ఎటాక్ చేశారు. ఇది సహజంగానే టీడీపీ వ్యతిరేకులకు, వైసీపీ అనుకూలురుకు నచ్చతుంది. చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయల రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకూ నమ్మి ఉండొచ్చు. వైసీపీ చేసిన ఈ ఉధృత ప్రచారం వల్ల టీడీపీకి, చంద్రబాబుకు కొంత నష్టం వాటిల్లి ఉండొచ్చు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ‘శృతి మించి’ చేసిన విమర్శలు ఇప్పుడు ఏపీ సర్కారు పరువును జాతీయ స్థాయిలో తీసినట్లు అయిందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా ఐఏఎస్‌, ఐపిఎస్ అధికారుల జోలికి వెళ్లి రెచ్చ‌గొడుతోంద‌నే చ‌ర్చ రాష్ట్రంలో జ‌రుగుతోంది.

మానవ వ్యర్ధాల ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం

నిర్ధారించిన హ్యాంగ్ కాంగ్ యూనివర్సిటీ పరిశోధన బృందం మానవ వ్యర్ధాల పరీక్షలు కూడా అనివార్యం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ లెక్కన మూసీ నుంచి వ్యర్ధ పదార్ధాలను మనం మున్నేరు ద్వారా , ఆంధ్రా కు తరలిస్తున్నట్టే లెక్క జహీరాబాద్ అల్లానా ఫ్యాక్టరీ నుంచి వెలువడే జంతు వ్యర్ధాలతో కలుషితమైన మంజీరా నీటినే హైదరాబాద్ వాసులు తాగుతున్నారు ఇది వినటానికి ఆశ్చర్యం గాఉన్నా, వాస్తవం. మానవ వ్యర్ధాలను పరీక్షిస్తే అందులో కరోనా వైరస్ లక్షణాలను కనుగొన్నట్టు చైనా శాస్త్రవేత్తల పరిశోధన లో తేలింది. స్టూల్ టెస్ట్ ను కరోనా వైరస్ నిర్ధారణ కోసం ఒక ప్రత్యామ్నాయ పరీక్ష గా చేయాలనీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నిజానికి కోవిడ్ -19 నిర్ధారణ కోసం చేసిన దాదాపు 14 శ్వాసకోశ పరీక్షల్లో - రిసల్ట్ నెగటివ్ వచ్చినప్పటికీ, ఆయా వ్యక్తులకు స్టూల్ టెస్ట్ (మానవ వ్యర్ధాల పరీక్ష) చేసినప్పుడు, కరోనా వైరస్ లక్షణాలు ప్రముఖం గా కనిపించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఆ రోగుల మూత్ర పరీక్షల్లో మాత్రం వైరస్ లక్షణాలు కనపడలేదు. నలుగురు పేషేంట్ల రక్తం లో మాత్రం వైరస్ డిటెక్ట్ అయినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.   కరోనా వైరస్ సోకినా అనుమానితులు- ఈ మానవ వ్యర్ధాల పరీక్షను, సలైవా, రక్త పరీక్షలతో పాటు విధిగా చేయించుకోవాలని చైనీస్ యునివర్సిటీ ఆఫ్ హ్యాంగ్ కాంగ్ నిపుణులు సూచిస్తున్నారు.     హాంగ్ కాంగ్ లో ఇటీవల ఆ యునివర్సిటీ లోని మెడిసిన్ ఫ్యాకల్టీ శాస్త్రవేత్తలు -14 మంది కరోనా బాధితులు, అనుమానితుల కు జరిపిన పరీక్షలలో ఈ నిజాలు బయటపడ్డాయని యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ చాన్ కె షుంగ్ వివరించారు. అయితే, స్ఫూటం టెస్ట్ చేయించుకున్న వారు, డీప్ త్రోట్ సలైవా టెస్ట్ కూడా తప్పని సరిగా చేయించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఆ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే, ప్రతి మిల్లీ మీటర్ స్ఫూటం కు 3.2 మిలియన్ వైరల్ లోడ్ ఉందనీ, అదే మానవ వ్యర్ధాలకైతే 12,000 వైరల్ లోడ్, డీప్ త్రోట్ సలైవా కు అయితే 10,000 వైరల్ లోడ్ ఉందనీ వెల్లడైంది. సో, భారతీయులారా ... ఈ తరహా టెస్ట్ లకు కూడా మీరు సిద్ధం కండి..... కరోనాకు దూరం కండి.     ఇక్కడ మరో విషయం ఉంది. జహీరా బాద్ దగ్గర ఉన్న అల్లానా ఫ్యాక్టరీ ద్వారా విడుదలయ్యే జంతు వ్యర్ధాలు, మాంస ఖండాలు, రక్తం అన్నీ కూడా మంజీరా నదిలో కలిసి హైదరాబాద్ చేరుకుంటున్నాయి, అదే మంజీరా నీటిని జంట నగరాల వాసులు తాగుతున్నారు. ఇప్పుడు చెప్పండి.... మనం తాగుతున్న నీరు ఎంత సేఫ్ ?

ఏపీలో మ‌రో కరోనా పాజిటివ్ కేసు

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండో క‌రోనా కేసు ప్రకాశం జిల్లా ఒంగోలులో నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలియజేసింది. అతడు నాలుగు రోజుల క్రితం వైరస్ లక్షణాలతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరగా.. పుణెకు శాంపిల్స్ పంపారు.. రిపోర్ట్స్‌లో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది శాంపిల్స్ సేకరించగా.. వారిలో 94 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మరో 13 మంది రిపోర్టులు రావాల్సి ఉందని బులిటెన్‌ ద్వారా తెలియజేశారు.   విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరికి ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. ఆ నోటీసును అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిద్-19 2020, ఐపీసీ 188 ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను కోవిద్-19 నియంత్రణ, పర్యవేక్షణ చర్యలపై జిల్లా నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.     రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్‌‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈనెల 31 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణలో కరోనా ప్రకంపనలు.... ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భూతం.. తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకేసారి 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మార్చి 18 రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను పేర్కొంది. రాష్ట్రంలో ఒక్క రోజే 9 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. బాధితులందరూ ఇండోనేషియాకు చెందిన వారిగా అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. దేశంలో తెలంగాణ ఒక్కసారిగా మూడో స్థానానికి చేరింది.     కొద్ది రోజుల కిందట మత కార్యక్రమాల కోసం ఇండోనేషియా నుంచి త‌బ్లిక్ జ‌మాత్ స‌భ్యులు భారత్‌కు వచ్చారు. ఢిల్లీ నుంచి సంపర్క్ ఎక్స్‌ప్రెస్‌లో తెలంగాణకు వచ్చిన వీరు కరీంనగర్, రామగుండం తదితర ప్రాంతాల్లో పర్యటించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో మసీదులలో బస చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ఎంత మందితో కాంటాక్ట్ అయ్యారనే విషయంపై ఆందోళన నెలకొంది. వీరిని మార్చి 16 నుంచి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ 13 పాజిటివ్ కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కాగా.. ఎనిమిది మంది ఇండోనేషియా వారే కావడం గమనార్హం.   ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంత మంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో సీఎం కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై చర్చించడానికి మంత్రులు, అధికారులతో గురువారం నాడు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందిజ కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో 3-4 రోజుల పాటు ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో 100 వైద్య బృందాలతో గురువారం ఉదయం నుంచి ప్రతి ఇంటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహిస్తామనీ, దయచేసి ప్రజలంతా వైద్యులకు సహకరించాలని మంత్రి కోరారు. మూడు, నాలుగు రోజుల పాటు అన్ని మతాల వారు ప్రార్థనా మందిరాలకు వెళ్లకూడదని ఆదేశించారు. ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నందున ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు.     కరోనా వైరస్ తీవ్రత తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని.. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భార‌త దేశంలో కరోనాకు గురైన వారి సంఖ్య ౧౪౭!

డిసెంబరు చివరి వారంలో చైనాలో వెలుగు చూసిన క‌రోనా వైరస్ విషయంలో భారత్ మొదట్నించి అప్రమత్తత తో ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి చివరి.. మార్చి మొదటి వారాల్లో కాస్తంత ఉదాసీనత ప్రదర్శించారన్న అభిప్రాయం వుంది. ఇదే.. ఇప్పటి పరిస్థితి కారణంగా చెబుతున్నారు. ప్రపంచాన్ని అంతకంతకూ ఆక్రమిస్తున్న ఈ డెడ్లీ వైరస్ తన తీవ్రతను మ‌రింత పెంచుతోంది. తాజాగా భార‌త దేశంలో కరోనాకు గురైన వారి సంఖ్య 147కు చేరుకుంది. ఇప్పటివరకూ 147 మందిలో కరోనా వైరస్ ను గుర్తించగా.. 130 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 14 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయితే.. ముగ్గురు మరణించారు. తాజాగా వెల్లడైన గణాంకాల్ని చూస్తే..ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఆరు రోజుల క్రితం ఒక్కసారిగా 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటివరకూ రోజుకు ఐదారు కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యేవి. దీనికి భిన్నంగా మార్చి 11న అతి ఎక్కువగా ఒక్కరోజులో 20 కేసులు పాజిటివ్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసులు నిర్దారణ అయినా.. ఇంత భారీగా లేవు. ఆశ్చర్యకరంగా నిన్న 17వ తేదీ 19 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఈ రోజు ఎనిమిది కేసులు నమోదైనట్లుగా కేంద్రం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో ఆరో కరోనా పాటిజివ్ కేసు నమోదైంది. ఇతను కూడా విదేశాల నుండి ఇండియా వచ్చిన వ్యక్తే. కరోనా సోకిన వ్యక్తి బ్రిటన్ వెళ్లి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఇది తెలంగాణలో ఆరో పాజిటివ్ కేసుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకూ ఉన్న ఐదు కేసుల్లో ఒక యువకుడికి రికవరీ అవ్వడం తో... అతన్ని గాంధీ ఆస్పత్రి నుంచీ డిశ్చార్జి చేశారు. దాంతో గాంధీ ఆస్ప్రత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లో నలుగురికి ట్రీట్మెంట్ అందుతోంది.ఇప్పుడు తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం తో వెంటనే అతన్ని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ లోనూ పకడ్బందీ చర్యలు చేపట్టారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఒక కేసు మాత్రమే నమోదైంది. ఏపీలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 22 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో విశాఖలో ఐదు.. కాకినాడలో రెండు.. ఏలూరులో ఒకటి.. నెల్లూరులో ఐదు.. చిత్తూరు జిల్లాలో ఐదు.. మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున అనుమానితులుగా వున్నారు. కరోనా వైరస్ దెబ్బ‌కు ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. విదేశాల్లో వైర‌స్ తీవ్ర‌త‌పై తెలుగువ‌న్ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం. జ‌ర్మ‌నీ దేశంలోని హాంబ‌ర్గ్ నుంచి గోపి ప్ర‌సాద్ మ‌రిన్ని వివ‌రాలు అందిస్తారు.

సి.ఎం. జ‌గ‌న్ జ‌డ్జిల‌కు కూడా కులం ఆపాదిస్తారేమో!

సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రావ‌డంతో టిడిపి నేత‌లు సెటైర్లు వేసుకుంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌న‌కు అనుకూలంగా లేర‌ని ఎన్నిక‌ల సంఘానికి కులాన్ని ఆపాదించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా తీర్పు సి.ఎం.కు అనుకూలంగా రాలేదు. అయితే అక్క‌డ కూడా కులమే ప‌నిచేసి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు చెప్పిందా అని టిడిపి నేత అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ఇప్పుడు జడ్జిలకు కూడా ‘కులం’ ఆపాదిస్తాడేమోనని భయంగా ఉందంటూ సెటైర్లు విసిరారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదించిన జగన్ ఇప్పుడు ఎవరికి ఆపాదిస్తారు? ఎన్నికల కోడ్ ను సడలించడాన్ని కూడా స్వాగతిస్తున్నామని, కొత్త పథకాలు వద్దని సుప్రీంకోర్టే చెప్పిందని, దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉండే ఆంధ్రులు విమానాశ్రయాల్లో విలపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదని విమర్శించారు. అయితే ముఖ్య‌మంత్రి రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి క‌రోనా నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల్ని, అలాగే విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రుల‌ను కాపాడ‌డానికి దృష్టి పెట్టాల‌ని ఆయ‌న సూచించారు.

ఏపీలో క్యాబినెట్ విస్తరణకు చాన్స్....ప్రక్షాళన తప్పదా..?

ఏపీలో త్వరలో  క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో  పాటు  చాలా మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది..జగన్ సీఎం అయ్యాక  క్యాబినెట్ లో తీసుకున్న మంత్రులకు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఇచ్చారు...ఆ తర్వాత వారీ పెర్ పార్మెన్స్ ను బట్టి అవసరం అయితే పక్కన పెట్టడం లేదా  ఉంచడం అనే నిర్న‍యం తీసుకుంటాం అని చెప్ప్పారు..కానీ ప్రస్తుతం కొంత మంది మంత్రుల పనితీరుపై  సీఎం సీరియస్ గా  ఉన్నారు..కొంత  మంది పనితీరు నచ్చడం లేదు..దీంతో మార్పులు చేర్పులు  తప్పనిసరిగా  మారింది. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికవుతున్నారు..మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ..వీరు ప్రస్తుతం  ఎంఎల్సీలుగా ఉన్నారు.మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో  వీరిని రాజ్యసభకు పంపిస్తున్నారు సీఎం జగన్.....దీంతో వీరి స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది..అయితే వీరి స్థానంలో  ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తి కరంగా మారింది......సామాజిక వర్గ సమీకరణలో  ఎవరికిమంత్రి పదవులు రావచ్చు అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి..ఆ తర్వాత   మార్పులు చేర్పులు ఉండచ్చు......స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రస్తుతం వాయిదా పడ్డాయి.. దీంతో  సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ విస్తరణపై ద్రుష్టి పెట్టినట్టు సమాచారం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి   రెవిన్యూ శాఖ  ఇవ్వనున్నట్టు సమాచారం.....ఇద్దరు మహిళా మంత్రులపై  కూడా వేటు తప్పదనే  చర్చ జరుగుతోంది..అయితేే   వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు..మంత్రి  అవంతి శ్రీనివాస్ పనితీరుపై సీఎం సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది..  దీంతో  ఆయన శాఖ మారుస్తారా  లేదా ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.....మహిళా మంత్రుల్లో ఇద్దరి  శాఖలు మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది..వైజాగ్ కు సచివాలయం తరలించే లోగా  సీఎం  ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది...అన్నీ అనుకూలిస్తే ఉగాది తర్వాత ఏపీ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు  కనిపిస్తున్నాయి.

కరోనా నియంత్ర‌ణ‌కు సి.ఎం. చర్యలూ తీసుకోవటం లేద‌ట! నారా లోకేశ్ ట్వీట్

దేశమంతా అప్ర‌మ‌త్తంగా వున్నారు. అన్ని రాష్ట్రాలు పాఠశాలలు మూసేస్తున్నాయి. జనాలు గూమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదని, ప్రజలను రక్షించాలన్న బాధ్యత కన్నా ఆయనకు అధికార దాహమే అధికంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, ఇందుకు జగన్‌ ఇగోయే కారణమని, మరింత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన పడుతున్న తపన రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాలన్న దాని కంటే అధికంగా ఉందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ డిసెంబరు చివరి వారంలో చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ విషయంలో భారత్ మొదట్నించి అప్రమత్తత తో ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి చివరి.. మార్చి మొదటి వారాల్లో కాస్తంత ఉదాసీనత ప్రదర్శించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే.. ఇప్పటి పరిస్థితి కారణంగా చెబుతున్నారు. ప్రపంచాన్ని అంతకంతకూ ఆక్రమిస్తున్న ఈ డెడ్లీ వైరస్ తన తీవ్రతను పెంచుతోంది. తాజాగా దేశంలో కరోనాకు గురైన వారి సంఖ్య 147కు చేరుకుంది. ఇప్పటివరకూ 147 మందిలో కరోనా వైరస్ ను గుర్తించగా.. 130 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 14 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయితే.. ముగ్గురు మరణించారు. వాస్త‌వాల్ని దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ వైర‌స్ విజృంభించ‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కూడా కోరుకుంటున్నారు.

ఏప్రిల్ 2 నుంచి మే10 వరకు దేశానికి కాలసర్పదోషం 

నివారణ కోసం విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగం యోగవాశిష్టంలోని బీజాక్షరాలను సంపుటి చేసి యాగం నిర్వాహణ విశాఖ శ్రీ శారదా పీఠం లో పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర సరస్వతీ మహాస్వామి , పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి  ఆధ్వర్యంలో విషజ్వరపీడ హరయాగం , అమృత పాశుపత యాగం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. దేశ ప్రజలు , ప్రపంచం యావత్తు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీ శారదా పీఠం ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . విషజ్వరపీడ హర , అమ్మత పాశుపత యాగం 11 రోజుల పాటు ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతుంది.  యాగ ప్రారంభం సందర్భంగా పీఠం ఉత్తరాదికారి  స్వాత్మానందేంద్ర సరస్వతీ మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశ గ్రహ మైత్రేయి సరిగా లేనందున అటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు . భారతదేశ జన్మ రాశి ధనురాశిలో గురుడు , కుజుడు , కేతువు మూడు గ్రహాల కలయిక , రెండు దున్న గ్రహాలతో గురు గ్రహ వీక్షణ వల్ల దేశంలో ఆరోగ్య పరమైన సమస్యలు సంభవిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా ఉందన్నారు. మార్చి 23 నుంచి కుజుడు మకర రాశిలో శనితో కలిసి ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయని అన్నారు . ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం ఉంది. ఈ పరిస్థితుల్లో దైవానుగ్రహ కార్యక్రమాలతో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు.  విషజ్వరపీడ హర , అమృత పాశుపత యాగం 11 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు . ఔదుంబర ( మేడి ) వృక్ష సమిదులు , సుగంధ ద్రవ్యాలు , వనమూలికలు , గోమయంతో చేసిన పిడకలు ఈ యాగంలో ఉపయోగిస్తున్నట్టు తెలిపారు . ఈ యాగధూళి ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని తెలిపారు . ఋగ్వేదం , అధర్వణ వేదాల్లోని ఆరోగ్య మంత్రాలు , యోగవాశిష్టంలోని బీజాక్షరాలను సంపుటి చేసి ఋత్వికులు ఈ యాగం నిర్వహిస్తారన్నారు .

ఖాకీ బట్టలు తీసి మేం రాజకీయాల్లోకి వస్తే మీకు పుట్టగతులుండ‌వు!

అయ్యన్నపాత్రుడిపై పోలీస్ అధికారుల సంఘం మండిప‌డుతోంది. రాజ‌కీయాలు చేత‌కాక పోతే ఇంట్లో ఓ మూల ప‌డి వుండాలే కాని పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఓ పోలీస్ అధికారిణి తమ సంఘం తరఫున అగ్గి మీద గుగ్గిలమైంది. తాము రాజకీయాల్లోకి వస్తే పుట్టగతులు ఉండవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత హెచ్చ‌రించారు. ఇటీవల నర్సీపట్నంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద పోలీసులు మొహరించారు. ఈ సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులతో అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన చెప్పినట్టు తాము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్నపాత్రుడికి, ఆ పార్టీకి పుట్టగతులే ఉండవని హెచ్చరించారు. ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయినా, అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోందని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ అంటే ఎవరి కింద పనిచేసేది కాదని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారుతాయి కానీ తాము మాత్ర ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల రక్షణకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్పైనే తప్పుగా మాట్లాడడాన్ని ఆమె ఖండించారు. దేశంలోనే అత్యుత్తమంగా పని చేస్తున్న ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతమైతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవ‌ల టీడీపీ నాయకులకు పోలీసులపై విమర్శలు చేయడం సర్వసాధారణమైంది. మే. గతంలో అనంతపురము జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను తీవ్ర దుర్భాషలాడి ఆ తర్వాత ఓ పోలీస్ అధికారితో చాలెంజ్ లు చేసుకుని ఇప్పుడు ఏకంగా ఆయన చేతిలో ఘోరంగా పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఆ పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్న విషయాన్ని టీడీపీ నాయకులకు గుర్తు పెట్టుకోవాలి పోలీసులుంటున్నారు. అన‌వ‌స‌రంగా పోలీసులను రెచ్చ‌గొట్ట‌వ‌ద్ద‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు.

కౌల‌లాంపూర్ నుంచి 200 మంది విద్యార్థులు బ‌య‌లుదేరినా ఇంకా 150 మంది ప‌డిగాపులు

కరోనా వైరస్‌ దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలను నిలిపివేయడంతో కౌలాలంపూర్‌ తెలుగు వారు చిక్కుకున్నారు. వీరిలో విద్యార్థులు, టూరిస్టులు వున్నారు. అధికారులెవరూ స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో ఫొటోలు షేర్ చేశారు. ఇండియ‌న్ హై క‌మీష‌న్‌కు వెళ్ళి త‌మ గోడు వినిపించినా అధికారుల నుంచి స్పంద‌న లేదంటున్న బాధితులు. ఎలాగైనా త‌మ‌ను ఇండియాకు తీసుకు వెళ్లండి. తిన‌డానికి తెచ్చ‌కున్న ఆహార‌ప‌దార్థ‌ల‌న్నీ అయిపోయాయి. ప్ర‌భుత్వం వెంట‌నే జోక్యం చేసుకొని స్పెష‌ల్ విమానాలు ఏర్పాటు చేసి ఆదుకోవాల‌ని బాధితులు వేడుకుంటున్నారు. మ‌రో ప‌క్క రెండు తెలుగురాష్ట్రాల్లో వున్న వారి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని బాధితుల బంధువులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. భారత్‌ నుంచి సమాచారం వస్తేనే పంపిస్తామని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదిలా వుంటే మనీలా నుంచి వ‌చ్చి కౌలాలంపూర్‌ విమానాశ్రయాల్లో చిక్కుకున్న మెడిక‌ల్ విద్యార్థులు సుమారు 200 మంది స్వ‌దేశానికి బ‌య‌ల్దేరారు. కరోనా భయంతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 350 మంది భారతీయులు కౌలాలంపూర్‌తో పాటు ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయాల్లో మంగళవారం పడిగాపులు కాశారు. చిక్కుకున్న వారిలో ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు.. తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయమే విమానాశ్రయాలకు చేరుకున్న వారంతా అర్ధరాత్రి వరకు అక్కడే వేచిచూడాల్సి వచ్చింది. చివరికి కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి దిల్లీ, విశాఖపట్నాలకు ఎయిర్‌ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రకటించారు. దీంతో ఆ విద్యార్థులకు ఊరట లభించింది. ఈ క్రమంలో తెలుగు విద్యార్థులు ఈ మధ్యాహ్నం ఎయిర్‌ ఏషియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు. అయితే మిగిలిపోయి మ‌రో 150 మంది ఇంకా కౌలాలంపూర్‌లో నే బిక్కుబిక్కు మంటూ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వం వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని వారి బంధువులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ఐఏఎస్ సిద్దార్థ్ జైన్, చంద్రబాబు కి తాబేదారు: పెద్దిరెడ్డి

సమరమే..ఇక సమరమే అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కదన రంగం లోకి దూకారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఫైర్ అయితే, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి సిద్దార్థ జైన్ మీద నిప్పులు చెరిగారు. సిద్దార్థ్ జైన్ ను నాయుడు తాబేదారు గా ఆయన అభివర్ణించారు. " ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ల కుట్ర వుంది. చంద్రబాబు, రమేష్ కుమార్ లు ఎస్వీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. అనేక సందర్బాల్లో రమేష్ కుమార్ కు చంద్రబాబు సాయం చేశాడు. నిబద్దత గల ఐఎఎస్ అధికారి బాబూరావు చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడుగా వుంటే....ఆయనను మార్చి... చంద్రబాబుకు తాబేదార్ అయిన సిద్దార్ధాజైన్ ను రమేష్ కుమార్ నియమించాడు," అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాత లెక్కలు కూడా కలిపి మరీ చెప్పుకొచ్చారు. "చంద్రబాబుకు నీడలాంటి ఐఎఎస్ అధికారి సిద్దార్ధజైన్ ని ఇక్కడ నియమించడంలో కుట్ర వుంది. చంద్రబాబు ఏం చెబుతాడో అదే రాయడానికి సిద్దార్థాజైన్ ను నియమించారు. నిబద్దతగా పనిచేసే పోలీసులు, అధికారులపై సిద్దార్థాజైన్ వ్యతిరేక నివేదికలు రాస్తాడు. ఆ నివేదికల ఆధారంగా రమేష్‌ కుమార్ చర్యలు తీసుకుంటున్నాడు. చంద్రబాబు కోసం ఎస్ ఈసి రమేష్ కుమార్ ఎంత ప్రాకులాడుతున్నాడో అర్థమవుతోంది. గతంలో తన జెసిగా వున్న భరత్ నారాయణ గుప్తాను సిద్దార్థా జైన్ వేధించాడు. తన దగ్గర పనిచేసే వారిని ఒరేయ్‌ అని పిలిచే అధికారి సిద్దార్థాజైన్. చంద్రబాబు ఏం చెబితే అది చేసే అధికారి సిద్ధార్థాజైన్. ఇలాంటి వ్యక్తిని చిత్తూరు జిల్లా పరిశీలకుడుగా నియమించడంలోనే కుట్ర వుంది," అంటూ పెద్దిరెడ్డి విరుచుకు పడ్డారు. " తిరుపతిలో ఎస్సీని ట్రాన్స్ ఫర్ చేశారు...ఆయన కింద వున్న వారు బాగా పనిచేశారని అన్నారు. చిత్తూరులో కిందిస్థాయి పోలీసులను ట్రాన్స్ ఫర్ చేస్తారు.. అక్కడి ఎస్పీ బాగా పనిచేశారని చెబుతున్నారు. సిద్దార్థాజైన్ కు బుద్ది వుంటే... ఇలాంటి రాతలు రాసి ఎన్నికల కమిషన్ కు ఇస్తాడా? ఎన్నికల కమిషన్ కు బుద్ది వుంటే.. ఈ రాతల్లోని నిజానిజాలు తెలుసుకోవద్దా," అంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నామినేషన్ వేసిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన కవిత ఆమె వెంట ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కవిత సునాయాసంగా గెలుస్తారన్న టీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కు కవిత తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. 2015లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో, ఖాళీ అయిన ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. 2022 జనవరి 4 వరకు ఈ ఎమ్మెల్సీ స్థానానికి పదవీకాలం ఉంది. ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నికల బరిలో ఉన్నప్పటీకి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత గెలుస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7వ తేదీన పోలింగ్ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపడతారు.

వలసలు వైసీపీలోకి - మేలు టీడీపీకి... క్లారిటీ వస్తోందా?

గత కొన్ని రోజులుగా వైసీపీలో కి భారీ స్థాయిలో  టిడిపి నాయకులు క్యూ కడుతున్నారు.. వాస్తవంగా అయితే ఇది టిడిపికి కొంత ఇబ్బంది కర పరిణమామే.. అయితే టిడిపి ఈ విషయంలో  సంతోషం వ్యక్తం చేస్తోంది..ఈ వలసల వల్ల అసలు ఏదీ నకిలీ ఏదీ అనేది త్వరగా తెలిసి పోతుంది అంటున్నారు  టిడిపి నాయకులు...సొంత పార్టీలోనే ఉంటూ పక్క పార్టీ అయిన వైసీపీతో టచ్ లో ఉండేకంటే పార్టీ మారితే తమ దగ్గర అసలు సరకు బయట పడుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అంటి పెట్టుకుని ఎవరు ఉంటారు అనేది ఒక క్లారిటీ వస్తుందంటున్నారు....ఇప్పటికే కొంత మంది ఎంఎ‌ల్ఏలు  వైసీపీతో టచ్ లో  ఉన్నారు .. ముగ్గురు ఆల్రడీ సీఎం జగన్ ను కలిసారు..అయినా  కూడా టీడిపి అంతా మన మంచికే అన్నట్టుగా వ్యవహరిస్తోంది....... వలసలు కొనసాగితే  ఉన్నవారితో  ఈ నాలుగేళ్లు  కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చే అనే ఆలోచనలో టిడిపి వర్గాలున్నాయి......ఎంఎల్ఏలు జారిపోయినా  ద్వీతీయ శ‌్రేణీ నాయకులు చేయి దాటినా   తమ పక్కన ఉన్న వారితోనే  రాజకీయం చేయచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం....ఇప్పుడు వైసీపీలో కి నేతలు క్యూ కట్టినా  వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించడం కష్టమవుతుంది అనే ఆలోచనలో టిడిపి ఉంది...నియోజక వర్గాల పునర్ వ్యవస‌్తీకరణ లేదు కాబట్టి వచ్చిన వారందరికి సీట్లు ఇవ్వడం కష్టమనే ఆలోచన టిడిపిది....దీంతో  ఎంత మంది వెళ్లినా  అసంత్రుప్తి ఖాయం అనే ఆలోచనలో టిడిపి వర్గాలున్నాయి.....అయితే ప్రస్తుతం టీడిపి పరిస్థితి స్థానిక ఎన్నికలను సజావుగా ఎదుర్కోవడం పైనే ఆధారపడి ఉంది..తర్వాత వలసలపై ద్రుష్టి పెట్టనుంది టిడిపి.

ఇరాన్‌లో 254 మంది భారతీయులకు కరోనా..!

ఇరాన్‌లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో ఆదివారానికి 13,938 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 724 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. విదేశాల్లోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ కొత్తగా ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది 254 మంది షియా ముస్లింలు జియార‌త్ ఆధ్యాత్మిక‌యాత్ర కోసం ఇరాన్ వెళ్ళి క‌రోనా బారిన ప‌డిన‌ట్లు కేంద్ర‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇరాన్‌లో చిక్కుకున్న వీరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇరాన్‌లో ఈ వైర‌స్ బారిన ప‌డి ఇప్పటి వరకు 724 మంది మరణించారు. ఇరాన్‌కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది షియా యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్‌లో కరోనా వైరస్ మరణాలు, కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటి వరకూ 234 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. వీరిలో 131 మంది విద్యార్థులు, 103 మంది యాత్రికులు ఉన్నారు. వైరస్ భయంతో విమానాశ్రయాలు, ఓడరేవులను ఇరాన్ మూసివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేసింది. దీంతో అక్కడ దాదాపు 2,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న వారిని జైసల్మేర్‌లో ఏర్పాటుచేసిన శిబిరానికి తరలించారు. . శిబిరాల్లో ఉన్నవారికి సైనికులు స్వచ్ఛందంగా సేవలు అందజేస్తున్నారు.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి తరుఫున ఏఐసీసీ నుండి వచ్చిన సుప్రీం కోర్టు సీనీయర్ లాయర్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్‌ వాదించారు. డ్రోన్‌ కేసులో అరెస్ట్ అయి గత 14 రోజులుగా రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులోనే ఉన్నారు. తొలుత బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన అభియోగాలు, ఎఫ్‌ఐఆర్, కేసును పూర్తిగా కొట్టివేయాలనే పిటిషన్‌లతో పాటు బెయిల్‌ పిటిషన్లను దాఖలు చేయగా. బెయిల్ ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రూ.10 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని కూడా ఆదేశించారు. అయితే, తనపై నమోదైన ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలన్న మరో పిటిషన్‌ను మాత్రం కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ ఫాంహౌజ్‌పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించిన ఆరోపణలపై ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగరేసి కెమెరాతో చిత్రీకరించడం నేరమని రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించేందుకు తాను డ్రోన్ ఎగరేసినట్లు చెప్పారు. అయితే, రేవంత్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపింస్తున్నారు. గోపన్ పల్లి వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరుక్కున్నందుకు, ప్రతిచర్యగా ఆయన జీవో 111 అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు.

అతి ప్ర‌మాద ద‌శ‌కు అమెరికా, బ్రిట‌న్! పరిస్థితి దయనీయం!

అమెరికా, బ్రిటిన్‌లు కరోనావైరస్‌ దెబ్బకు అతలాకుతలమవుతున్నాయి. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్‌ గణిత జీవశాస్త్ర ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ ఆధ్వ‌ర్యంలో ఓ బృందం క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌పై ఇటలీ నుండి సేకరించిన కొత్త డేటాను ఉపయోగించి అధ్య‌మ‌నం చేసింది. బ్రిటిష్ అధ్యయనం ప్ర‌కారం అమెరికాలో 22 లక్షలు, యూకెలో 6 ల‌క్ష‌ల మరణాలు సంభ‌వించ‌వ‌చ్చ‌ని వారు అంచ‌నా వేశారు. ఈ నేప‌థ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు సిద్ధ‌మైంది. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ దేశ స‌రిహ‌ద్దుల్ని మూసివేశారు. అంతే కాదు సామాజిక జీవితాన్ని మూసివేసారు. 70 ఏళ్లు పైబడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని వేరుచేసి ప్ర‌త్య‌కంగా వుంచుతున్నారు. క‌రోనా వైరస్ కారణంగా యు.ఎస్ మరియు యూరోపియన్ నగరాల‌న్నీ మూసివేయబడ్డాయి. వైర‌స్‌ వ్యాప్తిని నియంత్రించడానికి అనుమానిత కేసులను ఇంటిలోనే ఒంటరిగా ఉంచి చికిత్స చేస్తున్నారు. సామాజిక దూరం పాటించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా పెట్టుకుంటున్నారు. "ఇది సమాజంగా మరియు ఆర్థికంగా మనపై భారీ ఒత్తిడిని కలిగిస్తుంది" అని ఫెర్గూసన్‌తో కలిసి పనిచేసిన ఇంపీరియల్‌లోని అంటు వ్యాధి ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ అజ్రా ఘని అన్నారు. లండన్లోని యూనివర్శిటీ కాలేజ్ గ్లోబల్ గ్లోబల్ ఎపిడెమియాలజీ నిపుణుడు టిమ్ కోల్బోర్న్ మాట్లాడుతూ, అధ్యయనంలో అంచనాలు "కఠినమైన సమయం, గ‌డ్డు కాలాన్ని" సూచిస్తున్నాయి. రానున్న ప్ర‌మాద‌ఘంటిక‌ల్ని దృష్టిలో పెట్టుకొని స్థితిని మార్చ‌డానికి బ్రిటీష్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ దారుణ‌మైన మహమ్మారి వైరస్ గురించి మనకు చాలా తక్కువగా తెలుసు, దానిని నియంత్రించే అన్ని విధానాలకు ఒక పరిమాణం సరిపోదు" అని పియోట్ చెప్పారు. "ఎప్పటికప్పుడు మారుతున్న అంటువ్యాధికి ప్రతిస్పందనను స్వీకరించడానికి మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ అవగాహనకు మేము సిద్ధంగా ఉండాలి. కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ రాకున్నా, బయటకు వెళ్లకుండా ఎందుకు ఉండాలి? అనుకునేవాళ్లు ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. Social distancing పాటించకపోతే ఈ pandemic లో వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగి healthcare systems ని overload చేస్తుంది. ఆ పరిస్థిలో డాక్టర్లు, ICU beds, ventilators సరిపోక ప్రాణనష్టం ఎక్కువ జరుగుతుంది. Social distancing పాటించడం వల్ల ఒకేసారి ఎక్కువ మందికి వైరస్ సోకకుండా నివారించవచ్చు. తద్వారా వీలయినంత మందికి వైద్యం అందించే వీలు ఉంటుంది. pandemic curve ని flatten చేయడం ద్వారా వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గకపోయినా దేశం లోని వైద్య వ్యవస్థ ఒకేసారి overload కాకుండా ఉంటుంది.

అనుకున్న దొక్కటి.... అయిందొక్కటి

సుప్రీంకోర్టు లో రాష్ట్ర  ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు. దీంతో పాలక వై ఎస్ ఆర్ సీ పీ నిరాశకు గురైంది.  ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం, స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం వాదనలు విన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం. ఈ వ్యవహారం పై చీఫ్ సెక్రటరీ కి, ఎన్నికల కమిషనర్ కు మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. హైకోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా, అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాల నీ కూడా కోరింది. పంతాని కి పోయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టు లో చుక్కెదురైంది.