ఏపీ మంత్రికి ప్రధాని మాటంటే అసలు లెక్క లేదు!

కరోనా కేసులు మనదేశంలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే ప్రస్తుతం మనముందున్న అవకాశమని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ప్రజలెవ్వరూ ఇల్లు దాటి బయటకు రావద్దని, ఏప్రిల్ 15 వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెబుతోంది. ప్రధాని మోడీ కూడా మహాభారత యుద్ధాన్ని 18 రోజుల్లో జయించాం, కరోనాని 21 రోజుల్లో జయించలేమా?.. 21 రోజులు ఇంట్లోనే ఉండండి.. కరోనా మహమ్మారిని తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. అయితే కొందరికి కరోనా వైరస్ అన్నా, ప్రధాని మాట అన్నా లెక్క లేకుండా పోతుంది. యదేచ్చగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నవాళ్ళకి.. 'ఒరేయ్ నాయనా.. ఇంట్లోనే ఉండి మిమ్మల్ని, మీ వాళ్ళకి కాపాడుకోండిరా..' అని చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు కూడా.. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాక్ డౌన్ సమయంలో దుర్గగుడిలో హల్ చల్ చేశారు. ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి, ప్రధాని ఆదేశాలు బేఖాతర్ చేయడం చర్చనీయాంశమైంది. సామాన్య ప్రజలకు చెప్పాల్సింది పోయి.. ఇలా మంత్రి హోదాలో పూజలంటూ, పండగలంటూ తిరగటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కరోనా సోకుతుందా?. కరోనా కి మంత్రా, ఎమ్మెల్యేనా, సామాన్యుడా అన్న భేదభావం ఉండదు.. ఎవరికైనా సోకుతుంది. ఎవరైనా లాక్ డౌన్ పాటించాల్సిందేనని హితవు పలుకుతున్నారు. అన్నట్టు మంత్రి వెల్లంపల్లి.. ప్రధాని మాటని మాత్రమే కాదు.. హిందూ ఆచారాలను కూడా తుంగలో తొక్కారంటూ.. హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణించి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే ఉగాది పంచాంగ శ్రవణం వంటి క్రతువుల్లో పాల్గొనేందుకు అవకాశం లేదని పండితులు చెబుతున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లి మాత్రం లాక్ డౌన్ ని, ఆచారాలను రెండింటినీ పట్టించుకోకుండా.. దుర్గగుడిలో హల్ చల్ చేశారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇలా రాష్ట్ర మంత్రే లాక్ డౌన్ ని పట్టించుకోకుండా ప్రవర్తించడంపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు: జగన్ మోహన్ రెడ్డి 

"ఇలాంటి వైరస్ లు వందేళ్లకు ఒక సారి వస్తాయని, ఆ సందర్భాలు మనకు వస్తాయని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని నిర్ణయాలు సరైన సమయం లో తీసుకోవలసిందే. కఠిన నిర్ణయాలైనా అవి అందరూ పాటించాల్సిందే. మన వాళ్ళని, తెలంగాణా నుంచి మన రాష్ట్రం లోకి అనుమతించకపోవటం బాధ కలిగించింది. ఏప్రిల్ 14 దాకా మనం ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోతే, ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ పెద్ద కష్ట తరమైన విషయం కాకుండా ఉంటుంది. రాష్ట్ర సరిహద్దుల వద్దకు వస్తున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.....దయచేసి ఈ మూడు వారాల పటు జాగ్రత్త గా ఉండి పొమ్మని కోరుతున్నా... పొందుగల, సాగర్ చెక్ పోస్ట్, దాచేపల్లి వద్ద కూడా ఈ రోజు ఇదే పరిస్థితి ఎదురైంది.. తెలంగాణా సరిహద్దుల వైపు నుంచి వచ్చినా కూడా, తప్పనిసరిగా 14 రోజులు స్వీయ నిర్బంధం లో ఉండాల్సిందే. కేవలం ఈ మూడు వారాలు ఎక్కడి వారు అక్కడే ఉండి పొమ్మని కోరుతున్నా. తెలంగాణా ముఖ్యమంత్రి కె సి ఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆంద్ర ప్రజలకు తోడుగా, నీడగా ఉంటానని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో ఇప్పటికే పది కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇప్పటి వరకూ 27, 819 మంది విదేశాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు ఇటీవల కాలంలో. వారందరినీ కూడా సర్వీలెన్స్ లో ఉంచాంఆంధ్ర ప్రదేశ్ లో 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసాం " -ఇదీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీడియా తో మాట్లాడిన అంశాలు.

ఆవిడ ఏమి అడిగారు, ఈవిడ ఏమి ఇచ్చారు? 

ఆవిడేమో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ. ఆమె ప్రధాని మంత్రి బాధ్యతలు చేపట్టకపోయినా, బాధ్యతాయుతమైన ఒక పెద్దాయన ను ప్రధాన మంత్రిగా కూర్చొబెట్టి రెండు పర్యాయాలు, కేంద్రం లో యు పీ ఏ ప్రభుత్వం పనిచేసేలా రాజకీయం నడిపిన ధీరోదాత్త వనిత. తాను ఇటాలియన్ అయినప్పటికీ, ఈ దేశపు ఆడపడుచుగానే, చాలా బాధ్యతగా ఆర్ నెలల పాటు బ్యాంకు కిస్తీలు వాయిదావేయాలనీ, దానిపై వడ్డీలు బ్యాంకులు వసూలు చేయకుండా ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, కేంద్రం లోని ఎన్ డి ఏ ప్రభుత్వం కనీసం పట్టించుకోనైనా పట్టించుకోలేదు. చాలా భారీ ఎత్తున, ప్రజల కోసం 1.70 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, "గరీబ్ కల్యాణ్ "పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. అందులో మధ్యతరగతి ఊసేది. వాస్తవానికి సోనియాగాంధీ చాలా ఉదారంగా మధ్య తరగతి బాధల పై తన గొంతుక వినిపించారు. ఇన్ని రాష్ట్రాల్లో ఓటమి, రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవటం వంటి పరిణామాల ద్వారా ఆమె రాజకీయాల పై విముఖత తో ఉంటారని అందరూ భావించారు కానీ, ఆమె మాత్రం మధ్య తరగతి ప్రజల ముఖాల్లో మందహాసం చూడాలని భావించి, చాలా సమంజసమైన విజ్ఞప్తి నే కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు.   లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ.. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు కానీ, మధ్య తరగతి గురించి మాట్లాడలేదు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు పేర్కొన్నారు. నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్‌ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్‌ యోజన్‌ ద్వారా మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న  5 కేజీలకు అదనంవీటితో పాటు కేజీ పప్పు సరఫరా చేస్తారు.పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామని కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు, కానీ, ఇక్కడా ఎక్కడా మధ్య తరగతి ని ఆమె స్పృశించలేదు. పీఎం కిసాన్‌ బీమా కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్న కేంద్రం ఇప్పుడు మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ, ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి, జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు అండ చేయటం,  ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు లాంటి చర్యలను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుందనీ,90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు ఉంటుందనీ కూడా ఆమె చెప్పుకొచ్చారు. తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు.  ఇవన్నీ సరే, దిగువ మధ్యతరగతి, ఓ మోస్తరు మధ్యతరగతి ప్రజల ఈ ఎం ఐ కష్టాల గురించి చిన్న పాటి ఊరట పొందేలా, ఈ ఎం ఐ ల వసూలు ఆరు నెలల పాటు వాయిదా వేయాలని, వాటి పై వడ్డీలను బ్యాంకులు మాఫీ చేయాలనీ కోరిన సోనియా గాంధీ విన్నపాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్ధిక మాత్రం పట్టించుకోకపోవటం మాత్రం మధ్య తరగతి ప్రజానీకానికి నిరాశ, నిస్పృహ కలిగించే విషయమే.

కొత్త‌గా మ‌రో ముగ్గురికి, తెలంగాణాలో 44 పాజిటివ్ కేసులు!

తెలంగాణాలో క‌రోనా ప్ర‌మాద‌ఘంటిక‌లు మారోమ్రోగుతున్నాయి. తాజాగా వెల్లడైన మూడు పాజిటివ్ కేసుల్ని చూసినప్పుడు.. ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. వైరస్ సోకిన వారి నుంచి మరొకరికి వైరస్ సోకిన వారి సంఖ్య తెలంగాణలో తొమ్మిదికి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 44కు చేరింది. తాజాగా పాజిటివ్ గా తేలిన మూడు కేసుల్లో రెండు ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలవి. వారిద్దరూ డాక్ట‌ర్లే. మరొకరు నగర శివారుకు చెందిన వారు. అయితే వీరికి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేకపోవటం ఆందోళనను కలిగించే అంశం. దోమలగూడకు చెందిన 43 ఏళ్ల వైద్యుడికి.. అతడి సతీమణి 36 ఏళ్ల వైద్యురాలికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. వీరిద్దరికి.. ప్రైమరీ కాంటాక్ట్ గా గుర్తించారు. కుత్భాల్లాపూర్ కు చెందిన మ‌రో వ్య‌క్తి కి కూడా పాజిటివ్ వ‌చ్చింది. ఇటీవల అతడు ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ మూడు కేసుల్లోనూ విదేశీ పర్యటనలు లేకుండా.. వేరే వారి నుంచి సోకటం ఆందోళ‌న క‌లిగించే అంశం. దీంతో.. వైరస్ సోకిన వారి నుంచి మరొకరికి వైరస్ సోకిన వారి సంఖ్య తెలంగాణలో తొమ్మిదికి చేరింది.

కేటీఆర్ కు ఏపీ మంత్రి గౌతంరెడ్డి ఫోన్!

హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా తరలిన జనం సరిహద్దుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండేలా చూడాలని కోరిన మంత్రి  హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు పయనమైన వారు మార్గమధ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తో ఏపీ మంత్రి గౌతంరెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ఎవరూ ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అన్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండేలా చొరవ చూపాలని కోరారు. అలాగే ఇకపై ఎవరూ ప్రయాణాలను పెట్టుకోవద్దని కోరారు. ఒక్కరు చేసే పొరపాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని... అసత్యాలను ప్రచారం  చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మిల్లి సెకెన్ చాలు కరోనావైరస్ అంటుకోవడానికి!

చైనా కాల్చివెయ్యామంటుంది. నార్త్ కొరియా చంపివేయ్యమంటుంది. రష్యా జైల్లో పెట్టమంటుంది. కానీ ఒక్క భారతదేశం మాత్రమే ఇంట్లో కూర్చొని బ్రతికిపోమంటుంది.. మాయదారి కరోనా నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుందాం! చావు బ్రతుకులు ఎక్కడో లేవు.. " ధైర్యం" లోనే బ్రతుకు ఉంది... "భయం" లోనే చావు ఉంది..! నువ్వు తప్పు చేయనంత వరకు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు..! భయపడడం మొదలు పెడితే.. నీ నీడ కూడా నిన్ను భయపడుతుంది..!! కంటి మీద కులుకు లేకుండా చేస్తున్న ఈ మాయదారి కరోనా నుండి మనల్ని మనమే కాపాడుకుందాం. క‌రోనా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకేలా మ‌నం ఉప‌యోగ‌ప‌డ‌వ‌ద్దు. అలాంటి త‌ప్పు చేయ‌వ‌ద్దు. అవును మ‌నం త‌ప్పు చేయం. ఇకెందుకు భ‌యం. ప్రభుత్వం చెప్పినట్టు ఇంట్లో ఉండి మనకు మనమే రక్షణగా ఉందాం. అలసత్వం వద్దు ప్రపంచం మొత్తాన్ని చూసాము ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారో. మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్న ప్రభుత్వనికి సహకరిద్దాం. ఢిల్లీలో ఓ మహిళ ద్వారా ఓ డాక్టర్ కు కరోనా వైరస్ సోకింది. టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. అయితే ఈ డాక్టర్ కి కరోనా సోకిన తరువాత కూడా సుమారుగా 900 మందికి పైగా ట్రీట్ మెంట్ చేసినట్టు తెలియడంతో వారందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు జరపగా - వీరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. దీన్ని నుంచి మనం తెలుసుకోవాల్సిందేమిటి? మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి నీ చుట్టూ కరోనావైరస్ ఉంది. ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతో.. ఎంతెంతో డెవలప్‌ అయిన దేశాల్లో మరణమృదంగం మోగుతోంది. సామాన్యుల నుండి అద్ధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు.

పేద‌ల‌కు కరోనా ప్యాకేజ్! జన్ ధాన్ ఖాతాల్లోకి నేరుగా జమ!

కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే జన్ ధాన్ ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తామని వెల్లడించారు. కిసాన్ సమ్మాన్ నిధి హామిలో భాగంగా.. మొదటి వాయిదాగా రూ.2వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 8.69కోట్ల రైతులు లబ్ది పొందుతారు. అలాగే సంఘటిత కార్మికులు.. కూలీ, నాలి చేసుకొనే వారు, కార్మికులు, నిరుద్యోగులు.. రైతులకు.. వితంతువులకు, పెన్షనర్లు, దివ్యాంగులు.. జన్ ధన్ యోజన ఖాతాధారులకు ప్రతి ఒక్కరికి నగదు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు వేసింది. లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ రెడీ చేయగా.. ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా.. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని.. అలాగే ఎవరి చేతిలోనూ డబ్బు లేని పరిస్థితి ఉండవద్దని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందులో భాగంగానే ఈ ప్యాకేజీతో పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఖాతాల్లో ప్రత్యక్షంగా కొంత డబ్బును జమ చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 2,000 రూపాయ‌లు ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో 8.69 కోట్ల మంది రైతులకు వెంటనే ప్రయోజనం లభిస్తుంది. ఎంఎన్‌ఆర్‌ఇజీఎ Mahatma Gandhi National Rural Employment Guarantee Act వేతన రేటును రూ .182 నుంచి రూ .202 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఒక్కో కార్మికునికి రూ .2000 పెరగనుంది. దీని వల్ల 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. వృద్దులు,దివ్యాంగులకు ప్రతీ నెలా ఎక్స్‌గ్రేషియా కింద రూ.1000 చెల్లించనున్నారు. దీనివల్ల 3 కోట్ల మంది వితంతువులు, సీనియర్ సిటిజన్లు ప్రయోజనం పొందుతారు. జన్‌ధన్ ఖాతాలను కలిగిన మహిళలకు ప్రతీ నెలా వారి ఖాతాలో రూ.500 చొప్పున వచ్చే మూడు నెలల పాటు జమ చేయనున్నారు. దీనివల్ల 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం ఉంటుంది. మూడు నెలలు పాటు ఉచిత సిలిండర్లు. దీని వల్ల 8.3 కోట్ల బిపిఎల్ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.

త‌మ వంతు స‌హాయం అందిస్తున్న ప్ర‌ముఖులు!

దేశాన్ని కరోనా మహమ్మారి కబలిస్తున్న వేళ.. జనసేనాని తనవంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ.1 కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఐదు ల‌క్ష‌ల చొప్పున, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ 10 ల‌క్ష‌ల చొప్పున‌, డైరెక్ట‌ర్ అనీల్ ర‌విపుడి ఐదు ల‌క్ష‌ల చొప్పున, రెండు తెలుగు రాష్ట్రాల‌కు సాయం ప్ర‌క‌టించారు. ఎం.పి. సి.ఎం.ర‌మేష్ కోటి రూపాయ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, 50 ల‌క్ష‌లు క‌డ‌ప జిల్లాకు త‌న‌వంతు సాయంగా విరాళం ప్ర‌క‌టించారు.

స్టూడెంట్స్ ను అలా గుంపులు గుంపులుగా రోడ్ల మీద వదిలేస్తారా: పవన్ కళ్యాణ్

హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతం వైపు బయల్దేరిన విద్యార్థులను ఆలా రోడ్డు మీద గుంపులు గుంపులుగా వదిలేస్తారా, అంటూ జన సేనాధిపతి పవన్ కళ్యాణ్ , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్న వారి గురించి, నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు ఇతర సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలు, నిత్యావసరాల కోసం ప్రజలు క్యూ కట్టడంపై తీసుకోవలసిన చర్యల గురించి ట్విట్టర్ వేదికగా ఆయన రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకు వచ్చారు. " హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నో అబ్జెక్షన్ పత్రాలతో బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ వారిని సరిహద్దుల్లో ఆపివేయడంతో నడిరోడ్డుపై ఇప్పటికీ ఇబ్బందులుపడుతున్నారు. హాస్టల్స్ మూసివేతపై రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. చదువుకొంటున్నవారు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులు ఉన్నారు. వారి వేదనను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకొని స్వస్థలాలకు చేర్చాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండమని సూచించండి. అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే కొత్త సమస్యలు వస్తాయి," అని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది అందరికీ ఎన్.95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించి, పరీక్షించే సిబ్బందికీ, సంబంధిత వైద్యులను పట్టించుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, రక్షణ దుస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్ విభాగంలో ఉన్నవారికీ వీటిని అందించడం అవసరం. వైద్యులను, ఇతర సిబ్బందిని రక్షించుకోవడం చాలా అవసరం. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య పెంచాలి. వాటిలో శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. నిత్యావసరాల కోసం రైతు బజార్లు, కిరాణా దుకాణాల దగ్గర జనం ఇప్పటికీ క్యూ కడుతున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత ఉండదు, అన్నీ అందుబాటులోకి తీసుకువస్తామనే భరోసాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం బలంగా చెబుతున్నా... రైతు బజార్లలో కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోతే ఎలా? ప్రజల ముంగిటకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకువెళ్తే రోడ్డు మీదకు జనం రావడం గణనీయంగా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కూడా జన సేన చీఫ్ సూచించారు.

సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ కీలక ప్రకటన!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 5గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే దేశం మొత్తం లాక్‌డౌన్ ఉండటం, ఏపీలో కూడా సర్వం బంద్  అయ్యాయి. ఈ క్రమంలో నిత్యావసర సరకుల రేటులు ధరలను వ్యాపారులు భారీగా పెంచేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే జనాలు, విద్యార్థులు రాష్ట్ర సరిహద్దుల దగ్గరే ఆగిపోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం మీడియా మీట్‌లో వీరిని ఉద్దేశించి కూడా జగన్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. కీలక ప్రకటన చేస్తారా..!? : అయితే ఈ విషయాలతో పాటు కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ ప్రకటన ఏమై ఉంటుంది..? ఏం ప్రకటించబోతున్నారు..? అనేదానిపై ఏపీ ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసర సరకుల పంపిణీ, నగదు పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై కూడా జగన్ మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ నటులు విరాళాలు ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయంపై కూడా జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే.. షూట్ ఎట్ సైట్ పరిస్థితులు తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రజలకు ఒకింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.

సోష‌ల్ మీడియా చివాట్లతో పైస‌లు తీస్తున్న‌సెలబ్రెటీలు!

ఇప్పుడిప్పుడే సాయం చేయడానికి జేబుల్లో చేయిపెడుతున్నారు సెలబ్రెటీలు. ఈ క్రమంలో హీరో నితిన్ 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించి ఆద‌ర్శంగా నిలిచారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం రెండు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు ప్రకటించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. మహేష్ బాబు కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రామ్‌చ‌ర‌ణ్ రూ.70 లక్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు. అయితే బాలయ్య కోటి విరాళం ఇచ్చారంటూ అక్కడ అక్కడ కొన్ని పోస్ట్ క‌నిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్ద‌బాబు, చిన్న‌బాబు, ఎవ్వరూ కరోనాకు సాయం అందించే విషయంలో ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. ఎంత సేపూ ట్వీట్ లు వేయడం, విడియోలు వేయడం తప్పించి, రూపాయి విదిల్చిన పాపాన పోలేదు. టాప్ హీరోలు సోషల్ మీడియాలో చేసే ప్రవచనాలు, విడియోలు తిరస్కరించాలని, కానీ ఖర్చులేకుండా వాళ్లు చెప్పే సొల్లు కబుర్లు, వాటిని ప్రచారం చేయడం వంటి వాటి పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ఎక్కువైయ్యాయి. ప్రజాభిమానాన్ని కోట్లకు కోట్లు కింద క్యాష్ చేసుకుంటూ, అవసరం అయినపుడు రూపాయి విదల్చని వారికి కనువిప్పు కలిగే అవకాశం వుందని సోష‌ల్ మీడియాలో కామెంట్ లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. అక్కినేని ఫ్యామిలీ కావ‌చ్చు అందరూ అదేబాపతు. చేతులు కడుక్కోండి..మూతులు కడుక్కోండి..ఇంట్లో వుండండి అంటూ విడియోల మీద విడియోలు ట్విట్టర్ లో పడేయడం. దాన్ని ఆ హీరోల పీర్వోలు వాట్సాప్ ల్లో డంప్ చేయడం. ఇదే కార్యక్రమమా అంటూ జ‌నం నిల‌దీస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. వినాయక్, శివాజీరాజా లాంటి వాళ్లు కనీసం వాళ్ల వాళ్ల స్థాయిల్లో ఏదో ప్రయత్నం చేసారు. వీరందరికన్నా రాజశేఖర్ మందుకు వచ్చారు. నేను ట్విట్టర్ లో, ఇన్ స్టాలోకి వచ్చానోచ్ అంటూ తెగ హడావుడి చేసిన మెగాస్టార్ చేసింది లేదు, ప్రకటించిందీ లేదు. అసలు కరోనా మీద ఇప్పటి వరకు ఓ స్టేట్ మెంట్ కానీ, విడియో కానీ, విన్నపం కానీ ఏదీ చేయని హీరో ఎవరు అంటే బాలయ్యే అంటున్నారు నెట్‌జ‌నులంతా. పేదలు, చిన్నవ్యాపారులు, స్వయం ఉపాధి కళాకారులకు, చేతివృత్తిదారులు కరోనా బారిన పడితే వారి వైద్య అవసరాల కోసం తమ ఫౌండేషన్‌ మెడికల్ ఫండ్‌గా రూ 1.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అనితా డోంగ్రే తెలిపారు.

క‌రీంన‌గ‌ర్ లో క‌రోనా ఎంట్రీకి  పారాసిటమాలే కార‌ణ‌మ‌ట‌! 

తెలుగుభాష రాక‌పోయిన ఇండోనేషియా మత ప్రబోధకులకు రెండు తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చేసిన పారాసిట‌మాల్ పాఠం బాగా అర్థంమైవుంటుంది. అందుకే వారు పారాసిట‌మాల్ వేసుకొని ఎవ‌రికీ దొర‌క‌కుండా నేరుగా క‌రీంన‌గ‌ర్ లో వాలిపోయారు. ప్రశాంతంగా ఉండే కరీంనగర్ లో ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రబోధకులు కరోనాను వ్యాపింప చేసి అల్లకల్లోలం సృష్టించారు. అయితే తమకు వ్యాధి లక్షణాలున్నా వాటిని గుట్టుగా ఉంచి ఇండోనేషియన్లు మోసం చేశారని అధికారులు గుర్తించారు. కరీంనగర్ కు వచ్చిన ఇండోనేషియా వాసులకు అంతకు ముందే జ్వరం దగ్గుతో బాధపడుతున్నారట.. జ్వరానికి వాడే పారాసిటమాల్ తో దీన్ని మేనేజ్ చేశారని విచార‌ణ‌లో తేలింది. తమకు ఆరోగ్యం బాగా లేదని ఎయిర్ పోర్టులో గుర్తిస్తే అక్కడే ఆపేస్తారని.. ఆస్పత్రికి తరలిస్తారని వాళ్లు అనుకొని పారాసిటమాల్ ట్యాబెట్లు వేసుకొని అక్కడ చెకప్ నుంచి తప్పించుకొని తెలంగాణలో ప్రవేశించారన్న నిజం బయటపడింది. పోలీసులు వీరిని విచారించే క్రమంలో వీరు పారాసిటమాల్ ట్యాబెట్లతో మాయ చేసిన వైనం వెలుగుచూసింది. మరి వీరికి కరోనా పాజిటివ్ తేలడంతో వీరు ఎంతమందికి అంటించారు.? ఎన్ని కరోనా పాజిటవ్ కేసులు తేలుతాయనేది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇప్పుడు అక్కడ కర్ఫ్యూ రెడ్ జోన్ ప్రకటించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు కఠిన ఆంక్షలు పెట్టారు. ఇదివరకే వీరితో కలిసి తిరిగిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా వందలాది మందితో వీధుల్లో వీరు తిరిగారు.. కలిశారు. ప్రార్థనలు చేశారు. కనీసం 300 మందితో వీరు సన్నిహితంగా మెలిగారట.. ఇప్పుడు మరో పదిరోజుల్లో మరెంతమందికి కరోనా వ్యాధి తేలుతుందనే ఆందోళన కరీంనగర్ వాసుల్లో భయాందోళనకు గురిచేస్తోంది.

ఏ పీ లో హై స్కూల్ విద్యార్థులకు ' నో ఎగ్జామ్స్ '!

ఆంధ్ర ప్రదేశ్ లో హైస్కూల్ విద్యార్థులకు పరీక్షలు లేవు.6 నుండి 9 వరకు విద్యార్థులు పరీక్షలు వ్రాయకుండానే పై తరగతి కి ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు కాబట్టి-ఈ నిర్ణయం తో 6 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకూ చదివే విద్యార్థులెవరూ , ఈ ఏడాది వార్షిక పరీక్షలు రాయకుండానే, పై తరగతులకు ప్రమోట్ అవుతారు.

కరోనా ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి కేంద్రం ఆర్దిక సహాయం ప్రకటించింది. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, వలస కార్మికులకు -ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం కింద 1. 70 లక్షల కోట్ల ప్యాకేజి  ప్రకటించారు. ఆకలి చావులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వెల్లడించారు. లాక్ డౌన్ తో దెబ్బతిన్న పేదలు, రోజు కూలీల కోసం కూడా కేంద్రం ప్యాకేజ్ ప్రకటించింది.  వైదులు, నర్సులు, పారిశుధ్య కార్మికులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, ఇన్స్యూరెన్స్ మొత్తం ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల వంతున ఉంటుందని వివరించారు.

ఆరు నెలల పాటు ఈ ఎం ఐ లు, వడ్డీ లు వసూలు చేయవద్దు: సోనియా గాంధీ

నెలసరి చెల్లింపులు (ఈ ఎం ఐ ) లను ఆరు నెలలు పాటు వాయిదా వేయాలని, అలాగే బ్యాంకులు ఆ ఈ ఎం ఐ లపై వసూలు చేసే వడ్డీ ని కూడా మాఫీ చేయాలనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రకటించిన 21 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్ ను స్వాగతించిన సోనియా, కరోనా వైరస్ పై దాడి లో భాగంగా- కొన్ని ఆర్ధిక, ఆరోగ్య పరమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సిందిగా ప్రధాని కి విజ్ఞప్తి చేశారు. ఈ ఆపత్కాలం లో జాతి మొత్తం ఒకే తాటి పై నిలబడి, కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి, కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణ సహకారం అందిస్తుందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. అలాగే, దినసరి వేతన కార్మికులకు, నరేగా వర్కర్లకు, భవన నిర్మాణ కార్మికులకు, రైతులకు, అసంఘటిత రంగ కార్మికులకు నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.

హోంశాఖ విడుదల చేసిన తాజా నిబంధనలు!

రక్షణ ఆర్మ్ డ్ ఫోర్స్, ట్రెజరీ, పెట్రోలియం, సీఎన్జీ, ఎల్పీజీ, పీఎన్జీ విపత్తుల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, పోస్టు ఆఫీసులు పనిచేస్తాయి. ఆర్బీఐ, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్, కాగ్ అధికారులు, పెట్రోలియం ప్రాడక్ట్స్, ఫారెస్ట్ అధికారులు పనిచేస్తారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, మెడికల్ షాపులు, మందులు వైద్య పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, వైద్య పరికరాలు వస్తువులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ యూనిట్లుక్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, అంబులెన్స్ ల సేవలు పనిచేస్తాయి. ఈ రంగంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నింటికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు. బ్యాంకులు ఏటీఎంలు ఇన్స్ రెన్స్ ఆఫీసులు నడుస్తాయి. పాలు నిత్యవసర సరుకులు కూరగాయలతోపాటు చేపలు మాంసం దుకాణాలు తెరిచే ఉంటాయి. టెలికమ్యూనిషన్లు ఇంటర్నెట్ సర్వీసులు బ్రాడ్ కాస్టింగ్ కేబుల్ సర్వీసులు ఐటీ సర్వీసులు కొనసాగుతాయి. పోలీస్ సివిల్ డిఫెన్స్ ఫైర్ కలెక్టర్ కార్యాలయాలు విద్యుత్ శానటరీ మున్సిపాలిటీలు నడుస్తాయి. లాక్ డౌన్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. వస్తువుల ఉత్పత్తి ప్రొడక్షన్ యూనిట్లు క్లోజ్ చేశారు. ప్రజారవాణా పూర్తిగా బంద్. పరిశ్రమలన్నీ మూత. విమానా రైలు రోడ్డు రవాణా నిలిచిపోవాలి.

తనను కూడా నాలుగు పీకి బాధ్యతలు నేర్పమన్న నాగబాబు

నాగబాబు మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. ప్రజలు హక్కులే కాదు, బాధ్యతల గురించి కూడా మాట్లాడటం, వాటిని అలవాటు చేసుకోవటం నేర్చుకోవాలని ట్విట్ట్టర్ వేదికగా సూచించాడు. " ఒక న్యూస్ ఛానెల్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది."మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు"అక్షర సత్యం ...ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.నేర్చుకుంటాం..." అంటూ అయన చేసిన ట్వీట్, బాధ్యత రహితంగా ఉండే ప్రజానీకానికి హెచ్చరికలా , ఆయన ట్వీట్ పని చేస్తుందని ఆశిద్దాం.

కరోనా చికిత్స కేంద్రంగా బెజవాడ

కృష్ణా జిల్లాలో రోజురోజుకూ అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఓపీ సేవలతోపాటు సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, సైకియాట్రి, డయాలసిస్‌ ఇలా అన్ని రకాల వైద్యసేవలను అందిస్తూ జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన విజయవాడ కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వ్యాధి చికిత్సా కేంద్రంగా (కరోనా ఆసుపత్రి)గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1050 మంచాలతో కూడిన ఈ పెద్దాసుపత్రిలో ఇక నుంచి పూర్తిగా కరోనా వైరస్‌ బాధితులకు మాత్రమే వైద్యసేవలందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.  ప్రస్తుతం ఇక్కడ ఆయా విభాగాల్లో ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగుల్లో ఆరోగ్యం మెరుగుపడిన వారిని డిశ్చార్జి చేసి ఇంటి దగ్గరే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రానికే కొన్ని వార్డులు ఖాళీ అయిపోయాయి. సీరియస్‌ కండిషన్‌లో ఉన్న రోగులను మాత్రం అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, వారికి అక్కడ వైద్యసేవలను కొనసాగించనున్నారు. డయాలసిస్‌ అవసరమైన రోగులు కూడా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందే. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ దాదాపు రెండు వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. ఇలా వచ్చే వారికి నగరంలోని పటమట, కొత్తపేట, రాజీవ్‌నగర్‌ల్లో ఉన్న అర్బన్‌ ఫ్యామిలీ హెల్త్‌ సెంటర్లలో ఓపీ సేవలను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనంగా ప్రత్యేక అల్లోపతి డిస్పెన్షరీ ఏర్పాటు చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నాలుగు హెల్త్‌ సెంటర్లకు వచ్చే ఓపీ పేషెంట్లలో ఎవరికైనా ఎమెర్జెన్సీ వైద్యసేవలు, శస్త్రచికిత్సలు అవసరమైతే వారిని అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యసేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెబుతున్నారు. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చేస్తున్నందున ఇక నుంచి కరోనా పాజిటివ్‌, ఆ వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని సగభాగం నుంచి కరోనా కేసులను విజయవాడ ప్రభుత్వాసుపత్రి (కరోనా ట్రీటింగ్‌ సెంటర్‌)కి తీసుకువచ్చి ఇక్కడ చికిత్స అందిస్తారని వైద్య అధికారులు చెబుతున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రసూతి, చిన్నపిల్లల విభాగాలు.యథావిధిగా కొనసాగనున్నాయి.

డాక్ట‌ర్ చివ‌రిచూపు..గేట్ వెలుపల నుంచే వీడ్కోలు!

ఈ నిస్సహాయ కళ్ళు తేమగా ఉన్నాయి. చనిపోయే ముందు ఇంటికి వచ్చి, గేట్ వెలుపల నుండి పిల్లలను చూసి వెళ్లిపోయాడు మరియు తరువాత అతను ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు. అతను తన పిల్లలను తన చేతితో కూడా తాకలేకపోయాడు. ఈ చిత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఈ పదునైన చిత్రం చూసైనా అప్ర‌మ‌త్తంగా వుండండి. ఇండోనేషియాకు చెందిన డాక్టర్ హైడియో అలీ యొక్క చివరి చిత్రం ఇది, కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు కరోనాకు సోకింది. తాను ఇకపై బ్ర‌త‌క‌లేడ‌ని, చావుత‌ప్ప‌ద‌ని భావించినప్పుడు, అతను ఇంటికి వెళ్లి, గేటు వెలుపల నిలబడి, తన పిల్లలను మరియు గర్భిణీ భార్యను చివరిసారిగా చూస్తూ, ఆపై వెళ్లిపోయాడు, ఈ చిత్రాన్ని అతని భార్య తీసింది. అతను తన పిల్లలను హృదయపూర్వకంగా చూడటానికి మరియు వారి వీడ్కోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు, అతను చాలా దూరంగా నిలబడ్డాడు, తన బీబీ పిల్లలకు వైరస్ రావాలని అతను కోరుకోలేదు. డాక్టర్ హైడియో అలీ మానవుడిగా దేవదూత అని నిరూపించాడు, అలాంటి వైద్యుడికి వందనం.