10 లక్షల కరెన్సీ నోటు! 

10 లక్షల కరెన్సీ నోటు రాబోతోంది... అవును మీరు వింటున్నది నిజమే. మన దేశంలో ప్రస్తుతం 2 వేల కరెన్సీ నోటే అత్యధికం. కాని... ఇప్పుడు 10 లక్షల కరెన్సీ నోటు రాబోతోంది. అయితే ఆ నోటు వచ్చేది మన దేశంలో కాదు.. తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్న దక్షిణ అమెరికాలో  వెనిజులా దేశంలో. ఒకప్పుడు ఆర్థిక సంపన్న దేశంగా ఉంది వెనిజులా. చమురు, బంగారం నిక్షేపాలతో విరాజిల్లింది. కానీ అదంతా 90వ దశకానికి ముందుమాట. హ్యూగో చావెజ్ అధికారం చేపట్టాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వెనిజులాను సంక్షోభంలోకి నెట్టాయి. చమురు నిల్వలు ఉన్నాయన్న ధీమాతో ఎడాపెడా అప్పులు చేసి దుర్భర దారిద్ర్యం కోరల్లో చిక్కుకుంది. దాంతో ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నష్టనివారణ కోసమంటూ ఇష్టం వచ్చినట్టు కరెన్సీ నోట్లు ముద్రించారు. సమస్య పరిష్కారం కాలేదు సరికదా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అదే సమయంలో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. కూరగాయలు కొనేందుకు కూడా సంచుల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వెనిజులా సర్కారు ఏకంగా 10 లక్షల బొలివర్ల విలువతో కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయించింది. వెనిజులా కరెన్సీని బొలివర్ అంటారు. చమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో ధనిక దేశంగా ఉన్న వెనిజులా ప్రజలకు అన్నీ ఉచితంగా అందించేంది. అందుకోసం విదేశాల నుంచి భారీగా రుణాలు తీసుకుని విచక్షణ లేకుండా ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో వెనిజులాకు కష్టాలు మొదలయ్యాయి. అప్పుల భారం పెరిగిపోయింది. హ్యూగో చావెజ్ అనంతరం వచ్చిన నికొలాస్ మదురో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు 10 లక్షల విలువైన బొలివర్ నోటు విడుదల చేసినా పరిస్థితి మారుతుందన్న నమ్మకం లేదు.   ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... వెనిజులా తీసుకువస్తున్న 1 మిలియన్ బొలివర్ నోటు విలువ భారత కరెన్సీలో 39 రూపాయలే.. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ చిన్నదేశం ఎంత పెద్ద కష్టంలో పడిందో! ఒకప్పుడు ఆఫ్రికా దేశం జింబాబ్వే కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తర్వాత కాలంలో కాస్త కోలుకున్నట్టు కనిపించినా కరోనా దెబ్బకు మళ్లీ చతికిలపడింది. మరి వెనిజులా ఏంచేస్తుందో చూడాలి..

నిర్మల ప్రకటనపై భగ్గుమన్న విశాఖ

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నామని లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటించడంతో విశాఖ భగ్గుమంటోంది. ప్రైవేటీకరణ ఆగబోదని, నూటికి నూరుపాళ్లు జరిగే తీరుతుందన్న నిర్మల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ వాసులు. కేంద్రం ప్రకటనతో కార్మికులు ఉద్యమం ఉధృతం చేశారు.ప్రైవేటీకరణ ఆపేందుకు తక్షణ కార్యాచరణ ప్రకటించారు. రాత్రికి రాత్రే హైవే దిగ్బంధంతో విశాఖ అట్టుడుకుతోంది. కేంద్రం వెనక్కి తగ్గాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ విశాఖలో కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోదని మరోసారి రుజువైంది. దీంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సోమవారం రాత్రి  విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. నేషనల్ హైవే కూర్మన్నపాలెం సర్కిల్ దగ్గర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. కార్మికులు మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు. రోడ్డుమీద బైఠాయించడంతో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  కూర్మన్నపాలెం సెంటర్ లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం అర్థరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడించాలని ఉక్కు పోరాట సమితి పిలుపునిచ్చింది. దీంతో విశాఖ మరోసారి రణరంగంగా మారే అవకాశం ఉంది. అనకాపల్లి నుంచి విశాఖ నగరానికి వచ్చే వాహనాలను లంకెలపాలెం వద్ద నుంచి సబ్బవరం మీదుగా నగరం లోకి మళ్లిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన నేపథ్యంలో ఉక్కు పరిసరాల్లోకి వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ప్రయాణీకులు ఆందోళనలకు దిగుతున్నారు.

ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా 

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లును విచారించిన న్యాయస్థానం ఏలూరులో ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో 12 మున్సిపల్ కర్పొరేషన్లకు మార్చి 10 ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.  పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ముఖ్య పట్టణం.1886లో ఏలూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. జనాభ ప్రతాపాధికన 2005లో ఏలూరును మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అయితే ఎలూరులో పాగా వేయాలని వైసీపీ ముందు నుంచే పథకాలు రచించింది. అందులోభాగంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందుగానే రూ.50 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను హైకోర్టు నిలిపివేయంతో అధికార పార్టీకి మింగుడుపడడం లేదు.  

విజయవాడలో 50 లక్షల నగదు పట్టివేత..

విజయవాడ లో ఓ కార్పొరేటర్‌ అభ్యర్థి బంధువు ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల సందర్బంగా అభ్యర్థుల ఇంట్లో  టాస్క్ ఫోర్స్ పక్క సమాచారం రావడంతో అధికారులు ఈ తనికీలు నిర్వహించారు. ఓ ఇంట్లో దాదాపు 50 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డబ్బు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. అమరావతి నగర్ 3వ లైన్‌లో ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మిషన్లు తీసుకెళ్లిన పోలీసులు డబ్బులను లెక్కించారు. సుమారు రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి చెందిన కార్పొరేటర్‌ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బు పట్టుబడింది. డబ్బులు పట్టుబడిన వ్యక్తి వైసీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బరువుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.   

బాలయ్యకు వైసీపీ సెగ.. హిందూపురంలో హైటెన్షన్

బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యే. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. హిందూపురంలో మాత్రం బాలయ్యకు ఎదురు లేకుండా పోయింది. మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. హిందూపురం గడ్డ.. బాలయ్య అడ్డ. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా నిలిచిన బాలయ్యకు తాజాగా వైసీపీ సెగ తగిలింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బాలయ్య. మోత్కుపల్లిలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను ప్రచారం చేయనీయకుండా అడ్డుకోవడంతో మోత్కుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది.  జై జగన్ నినాదాలు చేస్తూ బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డగించారు. వైసీపీ కార్యకర్తలకు మద్దతుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ మోత్కుపల్లి రావడంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ కార్యకర్తలకు పోటీగా, బాలయ్యకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు సైతం భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాలు మోహరించడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలను కట్టడి చేయడం పోలీసులకు సవాల్ గా మారింది. 

సీఎం జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చారంట..

ఏపీలో వేసవి కాలం ఇంకా పూర్తిగా రాకముందే ఏపీలో మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మచిలీపట్నంలో తమ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన సీఎం జగన్ అలాగే వైసిపి మంత్రులైన ముగ్గురు నానీలపై తీవ్రంగా మండి పడ్డారు "తాడేపల్లి కోడికత్తి రెడ్డి, బందరు తాపీకత్తి నాని అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యిందని... వారు బందరు లో పీకింది ఏంటి?" అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఒకాయన కోడికత్తి డ్రామా.ఆడితే.. ఈయన తాపీకత్తి డ్రామా వేసారు తప్ప చేసింది జీరో అని విమర్శించారు. అంతేకాకుండా తాపీక‌త్తి నానీ బందరుని భ్ర‌ష్టు ప‌ట్టించాడని లోకేష్ మండిపడ్డారు. మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల ప్రచారానికి చివరోజయిన ఈరోజు (సోమవారం) లోకేష్ బందరులో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసలు నాని అంటేనే నాకెంత? నీకెంత? అని ఎద్దేవా చేశారు. సీఎం జగన ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పనిని ముగ్గురు నానీలకు అప్పగించారని... వారిలో ఒకరు బూతుల శాఖ మంత్రి.. గుడివాడ గెడ్డం గ్యాంగ్ నాని , రెండు అబద్దాల శాఖ మంత్రి బందరు నాని, మూడు అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. అంతేకాకుండా "గుడివాడ నాని సన్న బియ్యం సన్నాసి ఐతే బందరు నాని నోరిప్పితే చాలు అబద్దం అనీ ఇక కనీసం సొంత ఊరిలో ప్రజల ప్రాణాలు కాపాడలేని ఏలూరు ఆళ్ల నాని అంటూ ఎద్దేవా చేశారు. బందరు నానికి మాత్రం మాటలు పీక్స్... కానీ మ్యాటర్ మాత్రం వీక్ అని ... నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లు క‌రెంటు బిల్లు ఎక్కువొచ్చింద‌య్యా అని బందరు మంత్రి నానిని అడిగితే క‌ల‌ర్ టీవీ వాడితే క‌రెంటు బిల్లు ఎక్కువొస్తుంద‌ని చెప్పిన మెద‌డు మోకాలులో ఉన్న మంత్రి వుండ‌టం మ‌న ఖ‌ర్మ'' అని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బందరుని అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టగా.. వైసిపి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందని.. అలాగే మంచి నీటి సమస్యను తీర్చేందుకు గత ప్రభుత్వం ట్యాంకులను నిర్మిస్తే ఇప్పటివరకు వాటిని వాడుకలోకి తీసుకురాక పోవడం ఏంటీ.. నానీ గారూ.. బందరు ప్రజలకు మేం కట్టిన వాటర్ ట్యాంకుల నుంచి మంచి నీళ్లిస్తే మంచి నీళ్లే ఇచ్చారంటారు తప్ప.. టీడీపీ నీళ్లు అనో.. కొల్లు రవీంద్ర నీళ్లనో అనరు.. కదా మా మీద.. టీడీపీ మీదున్న కోపాన్ని ప్రజలపై చూపించడం తగదని లోకేష్ అన్నారు. మరోపక్క వైసిపి సర్కార్ ఇచ్చిన ఇళ్ల పట్టాలపై స్పందిస్తూ.. ఎందుకు ఆ కాగితాలతో నాలిక గీసుకోవాలా..? ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపండి నాని గారు. టిడిపి హయాంలో మచిలీపట్నంలో 4200 టిడ్కో ఇళ్ళు కట్టాం. వాటిని పేదలకు ఇవ్వలేని చేతగాని మంత్రి బందరు నాని. బందరు నుంచి ఎమ్మెల్యేగా నానిని ఎన్నుకున్నారు.. మంత్రి అయ్యాడు సరే.. అయన బందరుకేమీ చేయకపోవచ్చు.. రవాణా శాఖ మంత్రి అయ్యుండి కనీసం బందరు ఆర్టీసీ బస్టాండ్ కూడా సరి చేయలేకపోయారు. అయ్యా నానీ గారూ మీ శాఖకు చెందిన పనిని.. మీ నియోజకవర్గంలోనే చేసుకోలేపోయారు.. ఇక మీరు బందరునేం అభివృద్ధి చేస్తారు..? ఈ రెండేళ్ల వైసీపీ హయాంలో బందరులో ఈ ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పగలిగే దమ్ము నానికి ఉందా..?'' అని లోకేష్ నిలదీశారు. ''నిన్న బందరు మంత్రి నాని మాట్లాడుతూ అమరావతి లో నీరు, మట్టి, గ్రాఫిక్స్ తప్ప ఏమి లేవంటాడు. జగన్ రెడ్డి ఏమో అక్కడ 90 శాతం పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యడానికి నిధులు కేటాయిస్తా అంటున్నారు. ఇద్దరిలో సన్నాసి కానిది ఎవరో వాళ్లే తేల్చుకోవాలి. అమరావతిలో ఉన్న భవనం మీద నుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపిస్తారో లేక సన్నాసులం అని ఒప్పుకుంటారో వారే తేల్చుకోవాలి'' అని సవాల్ విసిరారు. మరోపక్క 21 నెలల్లో ఎం చేసారు అని అడిగితే.. సంక్షేమ పథకాలు అందించామంటారు. ఎవడబ్బ సొమ్మని సంక్షేమ పథకాలు ఇస్తారు. జగన్ జేబులో సొమ్మో.. నాని ఇంట్లో సొమ్మో ఇవ్వడం లేదు. ప్యాంట్ జేబులోని డబ్బులు కత్తిరించి షర్ట్ జేబులో పెడుతోంది ఈ ప్రభుత్వం.. అది కూడా సగం కోసేసి. పాదయాత్రలో పెంచుకుంటూ పోతా అన్నాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు'' అని ఎద్దేవా చేశారు. సీఎం ''జగన్ రెడ్డి పిల్లి...పిరికోడు....ఆయనకి మోడీ గారిని చూస్తే వణుకు. సీబీఐ, ఈడీ కాదు ఏకంగా ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. అందుకే స్పెషల్ స్టేటస్ అవుట్, విశాఖ ఉక్కు అవుట్, పోర్టులు అవుట్. మొన్న ఎదో ఊరెళితే ప్రజలు అడిగారట ప్రత్యేకహోదా ఎక్కడ అని? జగన్ రెడ్డి తెచ్చా కదా అన్నారంట. ఎప్పుడు సార్ అంటే మన బ్రాండ్ స్పెషల్ స్టేటస్ మందు బాటిల్ తెచ్చా కదా అన్నారంట . స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ ఇలా అబ్బో సీఎం జగన తెచ్చిన కంపెనీలు ఎన్నో. అదే బాబు హయాంలో కియా,హెచ్ సిఎల్ వంటి పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయి. జగన్ రెడ్డి హయాంలో దొంగ లిక్కర్ మాఫియా కంపెనీలు వచ్చాయి'' అని లోకేష్ విమర్శించారు .    

ముత్తూట్‌లో గోల్డ్ సేఫేనా? షేర్లు పతనం, మరి, మీ బంగారం?

యజమాని చనిపోతే సంస్థ కుప్పకూలిపోతుందా? ఏమో.. ఏమైనా జరగొచ్చు. కొన్ని సంస్థలు యజమానితో సంబంధం లేకుండా మనుగడ సాగిస్తే.. మరికొన్ని సంస్థలు ఓనర్ తో పాటు కాలగమనంలో కలిసిపోయిన ఘటనలు ఉన్నాయి. మరి, ముత్తూట్ లో ఏం జరుగుతోంది? భవిష్యత్ లో ఏం జరగబోతోంది? ఇదే ప్రశ్న ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం తనఖా పెట్టిన మదుపర్లను ఒత్తిడికి గురి చేస్తోంది. సోమవారం స్టాక్ మార్కెట్లో ముత్తూట్ షేర్లు భారీగా పతనం అవడంతో ఆ భయం మరింత పెరుగుతోంది.  ఇటీవల ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పదంగా మృతిచెందారు. తన నివాసంలో నాలుగో అంతస్తు నుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోయారు. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్  ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసును వారు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.  1993లో జార్జ్ ముత్తూట్‌ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సంస్థ భారీగా విస్తరించింది. గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ గా ఎదిగింది. సంస్థ యజమాని మరణంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ లో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాము తనఖా పెట్టిన బంగారం ఎవరి దగ్గర ఉందో? ఆ లెక్కలు ఎవరు చూస్తున్నారో? ఓనర్ లేకపోవడంతో తమ గోల్డ్ తిరిగి వస్తుందో రాదో? సంస్థ మునపటిలా కొనసాగుతుందో లేదో? ఇలా అనేక అనుమానాలు. దాని ఫలితమే.. స్టాక్ మార్కెట్లో ముత్తూట్ ఫైనాన్స్ షేర్ పతనం. ఇక బంగారం తనఖా పెట్టిన వారు సైతం పెద్ద సంఖ్యలో సంస్థ ముందు బారులు తీరారు. కుదవ పెట్టిన బంగారం విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. సంస్థ గోల్డ్ కస్టమర్ల నుంచి భారీగా ఒత్తిడి ఎదుర్కొంటుంది. ప్రజల్లో భయం మరింత పెరిగితే.. సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ తరఫున స్పష్టమైన ప్రకటన గానీ, హామీ గానీ రావాల్సి ఉంది. అప్పటి వరకూ వినియోగదారుల్లో ఆందోళన తప్పకపోవచ్చు.

మెన్స్ డే కావాలని మహిళా ఎంపీ డిమాండ్ 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఎంపీలకు సహచర మగ ఎంపీలు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా మెన్స్ డే కావాలని మహిళా ఎంపీ డిమాండ్ చేశారు. పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని బీజేపీ మహిళా ఎంపీ సోనాల్‌ మాన్‌సింగ్‌ అన్నారు. పురుషులకు ‘మెన్స్‌ డే’ నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు.  రాజ్యసభలో ఎంపీ సోనాల్‌ మాన్‌సింగి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని ఇద్దరు జర్మన్‌ దేశానికి చెందిన మహిళలు ప్రారంభించారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ భారీ సముద్ర నౌకను మహిళలే పూర్తి స్థాయిలో​ సారథ్యం వహించటం మనదేశానికి గర్వకారణమని తెలిపారు. మహిళలు పోటీతత్వాన్ని పెంచుకోవాలని, అన్నిరంగాల్లో​ పురుషులతో సమానంగా రాణించాలని పేర్కొన్నారు. మహిళలను పురుషుల్లో సగభాగమని చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

జగన్ కు తెలిసే స్టీల్ ప్లాంట్ అమ్మకం.. పార్లమెంట్ లో కేంద్రం క్లారిటీ

అయిపాయే. అంతా అయిపాయే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేతులెత్తేసింది. పార్లమెంట్ లో మళ్లీ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని మంత్రి ప్రకటించారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని కోరామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణపై సుస్పష్ట ప్రకటన చేశారు.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి పార్టీల నుంచి ఎన్ని ఒత్తిడులు వస్తున్నా కేంద్రం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి పార్లమెంట్ లో ప్రకటన చేయడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత ఎగిసిపడుతోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పై ఇప్పటికే రాష్ట్రంతో సంప్రదింపులు జరిపామని మంత్రి ప్రకటించడంతో ఇన్నాళ్లూ తమకేమీ తెలీదన్నట్టు చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడినట్టైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం సీఎం జగన్ కు తెలిసే జరిగిందని తేటతెల్లమైంది.

తోక కట్ చేస్తా.. గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్ 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు, జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ నాయకుల చిల్లర రాజకీయాలు ఇక చెల్లవన్నారు. తన  రాజకీయ జీవితంలో ఇంత చిల్లర రాజకీయాలు చూడలేదని ఆగ్రహం చంద్రబాబు వ్యక్తం చేశారు. పులివెందుల, మాచర్ల రాజకీయాలు సాగనీయమన్నారు చంద్రబాబు. అందరి తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా అన్నారు.  గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్ అని హెచ్చరించారు. గుట్కా ఎమ్మెల్యేకు మీరు ఊడిగం చేస్తే ... ఆ ఎమ్మెల్యే తాడేపల్లి వెళ్లి జగన్‌కు ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఓటు విషయంలో మరోసారి తప్పు చేస్తే మీ జీవితాలు అధోగతిపాలేనని చెప్పారు.  దేశంలోని అందరినీ ఇక్కడకు రప్పించేందుకు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఏ1 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం మూడు ముక్కలాటతో అందరినీ ఇతర ప్రాంతాలకు పంపుతున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు కన్నెర్ర చేస్తే తాడేపల్లి నుంచి పారిపోతావ్ అని హెచ్చరించారు. టీడీపీ పాలనలో రౌడీయిజం, ఉగ్రవాదం, టెర్రరిజం లేకుండా చేశామన్నారు. నేను ఓట్లు కోసం రాలేదు.. మీ భవిష్యత్తు కోసం వచ్చానని వ్యాఖ్యానించారు. ఎవరికీ భయపడకుండా ఓటు వేయండి.. మీ ఓటు దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తాడని చంద్రబాబు పేర్కొన్నారు.  

కేసీఆర్ ని తిట్టిన షర్మిల...

వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల జోరు పెంచింది. మహిళా దినోత్సవం  సందర్బంగా కేసీయార్ ప్రభుత్వంలో మహిళకు అన్యాయం జరుగుతుందని తెలంగాణల రాష్ట్ర మంత్రి మండలిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో ఆమె వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు మనుగడ కరువైయిందని. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, కానీ, ప్రస్తుత తెలంగాణలో స్త్రీలకు ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అసమానతలు ఉన్నాయని... మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.వైయస్ రాజశేఖరెడ్డి హయాంలో ఎందరో మహిళలు మంత్రి పదవులను అలంకరించారని... కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఆ ఇద్దరికీ కూడా ఐదేళ్ల తర్వాతే అవకాశం దొరికిందని అన్నారు. మహిళలు అన్నింటిలో సగం అయినప్పుడు... ఈ అన్యాయం ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. తాము చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.  దుర్గమ్మ సాక్షిగా మహిళాదినోత్సవం రోజున మహిళలపై వైసీపీ ప్రభుత్వం విజయవాడ దుర్గమ్మ సాక్షిగా మహిళాదినోత్సవం రోజున మహిళలపై వైసీపీ ప్రభుత్వం. కానకదుర్గ దర్శనానికి వెళ్లిన మహిళా రైతులపై అమానుషంగా ప్రవర్తించిన సొంత అన్న ప్రభుత్వం ఒక వైపు మహిళపై స్వతహాగా దాడి చేస్తుంటే అన్నను వ్యతిరేకించలేని చెల్లి షర్మిల తెలంగాణలో మహిళలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడం హాస్యాస్పందంగాని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. షర్మిల అలా మాట్లాడాం వెనక రాజకీయ లాభం ఉందని చెప్పకనే చెపుతుంది.  

చంద్రబాబు.. క్షుద్రపూజలు.. ఏది నిజం? ఏది ప్రచారం?

డిసెంబరు 26, 2017. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయం. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం. వారం రోజులు ఆలస్యంలో కొత్త ఏడాదిలో విషయం వెలుగు చూసింది. ఇక అంతే. యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. తెలుగు వారికి కొంగు బంగారమైన దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలేంటి అంటూ అంతా అవాక్కయ్యారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ రోజు రాత్రి ఆలయంలో అసలేం జరిగిందో దర్యాప్తు మొదలుపెట్టారు.  అప్పుడు ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారి అలాంటిదేమీ జరగలేదని ప్రకటించారు. పోలీసులు విచారణలో సీసీటీవీ ఫూటేజీ వెలుగు చూసింది. ఆ వీడియోలో అర్థరాత్రి వేళ ఆలయంలోకి ఇద్దరు పూజారులు వెళ్లడం స్పష్టంగా కనిపించింది. అందులో ఒకతను బద్రీనాథ్. ఆలయ ప్రధాన అర్చకుడు. మరోకతను దుర్గ గుడితో సంబంధం లేని వ్యక్తి. ఆ ఇద్దరు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ ఆలయంలోకి ప్రవేశించడం నేరం. ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. బద్రీనాథ్ ను ప్రధాన ఆలయం నుంచి ఉప ఆలయానికి బదిలీ చేశారు. అప్పటి ఈవో సూర్యకుమారిపైనా వేటు పడింది.  ఆ రోజు దుర్గ గుడిలో అర్థరాత్రి వేళ క్షుద్రపూజలు జరిగాయని.. లోకేశ్ ను సీఎం చేయడం కోసమే సీఎం చంద్రబాబు ఆ పూజలు జరిపించారంటూ వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. సమయం, సందర్భం లేకుండా.. మూడేళ్లుగా ఇదే ఆరోపణ. ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు మరోసారి దుర్గ గుడి తాంత్రిక పూజల ప్రస్తావన తీసుకొచ్చారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు టార్గెట్ గా మళ్లీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకే, ఆ రోజు అసలేం జరిగి ఉంటుందనే అంశం మరోసారి చర్చకు వస్తోంది.  చంద్రబాబు. నిఖార్సైన రాజకీయ నాయకుడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి పనులు చేసిన చరిత్ర లేదు. ఓ వ్యక్తిపై అభాండం వేసినప్పుడు అతను అలాంటి వాడో కాదో కాస్త ఆలోచించి నెపం మోపాలి. చంద్రబాబుకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి అంటే అపార భక్తి. ఆయన ఏదైనా కోరుకోవాలంటే వెంకన్న స్వామినే కోరుకుంటారు. అంతే తప్ప.. క్షుద్రపూజలు లాంటి చర్యలు చంద్రబాబుకు సరిపోవు. అదికూడా మహిమాన్వితమైన దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసే అపచారానికి అస్సలు పాల్పడరు. ఆయన చాలా సాత్వికుడు. మితాహారి. చాలా ఏళ్లుగా మాంసాహారానికీ దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి క్షుద్రపూజలు లాంటి భయానక తంతును నిర్వహించాడనటం అసమంజసం. అదీ లోకేశ్ కోసమట. ఆ ఘటన జరిగింది 2017లో. అప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు. 2019లో గానీ ఎలక్షన్లు జరగవు. అప్పటికి చంద్రబాబు ఏపీలో ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్నారు. టీడీపీ ఓడిపోతుందనే అనుమానం వీసమెత్తుకూడా లేదు. మరెందుకు చంద్రబాబు లోకేశ్ కోసం పూజలు చేస్తారు? వైసీపీ వాళ్ల మాటలు మరీ విడ్డూరం. లోకేశ్ ను సీఎం చేసేందుకే దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు చేశారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు 60 ఏళ్ల యువకుడు. చాలా ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉన్నారు. మరో పదేళ్లైనా రాజకీయాల్లో రాణించగలరు. అలాంటిది 2017లో ఉన్నట్టుండి లోకేశ్ ను ఎందుకు సీఎం చేయాలనుకుంటారు? లోకేశ్ ను సీఎం చేయడానికి మరోదారేదీ లేదన్నట్టు క్షుద్రపూజలనే ఎందుకు ఎంచుకుంటారు? ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? అనేది తెలుగు తమ్ముళ్ల ప్రశ్న. దుర్గ గుడి ప్రధాన పూజారికే ఈ కేసులో భాగస్వామ్యం ఉండటం.. సీసీకెమెరాల్లో ఆయన స్పష్టంగా కనిపించడం వాస్తవం. ఆ రోజు అర్థరాత్రి దుర్గమ్మ సన్నిధిలో ఏవో ప్రత్యేక పూజలు జరిగాయని తెలుస్తోంది. అయితే, అవి తాంత్రిక పూజలు అనడానికి పెద్దగా సాక్షాలు లేవు. ఆలయంలో నిష్టగా పూజలు చేసే పూజారికి.. క్షుద్రపూజల తతంగం తెలుసుండదు. వారికి చిన్నప్పటి నుంచీ వేదాలైతే నేర్పిస్తారు కానీ వారికి తాంత్రిక మంత్రాలతో అస్సలు సంబంధం ఉండదు. కాబట్టి.. ఆ రోజు రాత్రి ఆలయంలో ఏదో పూజ జరిగింది కానీ అది క్షుద్రపూజ మాత్రం అవకపోవచ్చనేది ఓ వాదన. ఆ ఘటనను అనవసరంగా చంద్రబాబుతో లింకు పెట్టి వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందనేది టీడీపీ మండిపడుతోంది. నాలుగుసార్లు దొంగ దొంగ అని ఆరోపిస్తే.. మంచి వాడిని సైతం దొంగ అని అనుకునే రోజులివి. చంద్రబాబు విషయంలోనూ ఇలానే జరుగుతోందని అంటున్నారు. పది మంది నేతలు కలిసి.. ప్రతిరోజూ పది సార్లు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే అదే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారు వైసీపీ నేతలు. అందుకే, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా దుర్గ గుడి క్షుద్రపూజలంటూ చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్నారు. అమరావతిని మూడు ముక్కలు చేసినందుకు.. బెజవాడలో అధికార పార్టీకి ఘోర పరాభవం తప్పదని తేలిపోతుండటంతో.. ఇలా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కదా.. ఆనాడు దుర్గ గుడిలో అసలేం జరిగిందో నిర్ధారిస్తే సరిపోతుందిగా? అప్పుడు ఏది వాస్తవమో.. ఏది ప్రచారమో.. తేలిపోతుందిగా? చంద్రబాబుపై ఎందుకీ అభాండాలంటూ మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

కేసుల మాఫీ కోసమే ఢిల్లీ టూర్లు? బయటపడిన జగన్  బండారం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ బాగోతం బట్టబయలైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రులను, బీజేపీ పెద్దలను కలుస్తున్నామన్న మాటలు... పచ్చి అబద్దాలని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా సీఎం జగన్ అబద్ధాలు బయటపడ్డాయి. పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్రమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి మాట్లాడలేదని తేలిపోయింది.  గత జనవరి 19న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. అమిత్ షాను కలిశారు. ఆ సమావేశం తర్వాత సీఎంవో ప్రకటన విడుదల చేసింది. పెరిగిన పోలవరం అంచనాలను ఆమోదించాలని అమిత్ షాను జగన్ కోరినట్లు అందులో వెల్లడించింది. అయితే అలాంటి మెమొరాండం హోంశాఖకు ఇవ్వలేదని పార్లమెంట్‌లో జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్ లాల్ తెలిపారు. పోలవరంకు సంబంధించి పెరిగిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని  పార్లమెంట్‌లో  సోమవారం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. దీనికి సమాధానమిచ్చిన జలశక్తి సహాయం మంత్రి రతన్ లాల్.. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, మెమొరాండం కూడా జగన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ పర్యటనపై జగన్ చెబుతున్నదంతా ఉట్టిదేనని బట్టబయలైంది.  సీఎం జగన్ జనవరి 19న, ఫిబ్రవరి 19న అమిత్‌ షాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై చర్చించామని చెప్పారు. కాని పార్లమెంట్ లో మంత్రి రతన్ లాల్ సమాధానంతో అదంతా ఉత్తదేనని తేలిపోయింది. జగన్ ఢిల్లీ పర్యటనలపై మొదటి నుంచి విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తన కేసుల మాఫీ గురించి మాట్లాడేందుకే జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఆ ఆరోపణలకు కౌంటరిస్తూ వస్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీకి వచ్చి పెద్దలను కలిసి లోపల ఏం మాట్లాడుతున్నారు.. బయటకొచ్చి ఏం చెబుతున్నారో అన్నది ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి బయటపడింది.  

ప్రేమించి, కడుపు చేసి.. పెళ్లంటే చంపేశాడు.. 

ప్రేమించాడు. గర్భం కూడా చేశాడు. పెళ్లిచేసుకొమ్మంటే  గర్భంతో ఉన్న 17 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు. ఝార్ఖండ్‌లోని పాలేము జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ సంజీవ్ కుమార్ కథనం ప్రకారం.. ప్రియుడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువకుడు అబార్షన్ చేయించాలని నిర్ణయించాడు. అబార్షన్ కోసం ఓ నర్స్ రూ. 10 వేలు అడిగితే సర్దుబాటు చేయలేకపోయాడు. దీంతో ఆమెను చంపడమే సమస్యకు పరిష్కారమని భావించాడు. గత నెల 21న బాలికను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో మెడపై పొడిచి చంపేశాడు. అనంతరం స్నేహితుడితో కలిసి ఆమె మృతదేహాన్ని సోనే నది ఒడ్డుకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఈ కేసులో నిన్న నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు చెప్పారు.  

వుమెన్స్ డే సాక్షిగా మహిళా రైతులపై దాష్టికం! 

ఆంధ్రప్రదేశ్ లో మరో అరాచకం జరిగింది. మహిళా దినోత్సవం రోజునే మహిళలకు ఘోర అవమానం జరిగింది.  కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్నఅమరావతి మహిళా రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర మహిళా రైతులను అడ్డుకున్న పోలీసులు.. వారికి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు.. మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. మహిళలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కొందరినైతై మంగళగిరి పీఎస్‌లో మూడు గంటలు ఉంచి తర్వాత వెంకటపాలెంవద్ద వదిలిపెట్టారు. సుమారు వంద మంది పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని మహిళా రైతులు వాపోయారు. మేమేం పాపం చేశాం.. మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నారు.. మహిళలను కింద పడేసి పోలీసులు తొక్కుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. శాంతియుతంగా పాదయాత్ర ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతుంటే పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన పొట్టపై పొడిచారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత దారుణం ఏ ప్రభుత్వంలో చూడలేదన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు అవమానం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎన్న నిర్బంధాలు విధించినా తమ ఉద్యమం అపేదిలేదని, ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకురాలు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి మహిళలకు మద్దతు తెలిపారు. జగన్‌కు పరిపాలన చేయడం చేతకావడంలేదని, ఇంత వరకు రాజధాని నిర్మాణం చేయలేదని మహిళలు విమర్శించారు. మహిళలను హింసపెడుతున్న దిక్కుమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. పోలీసులు, ఉద్యోగులను అడ్డంపెట్టుకుని డబ్బులు కుమ్మరించి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు. రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం తప్పా అని మహిళలు నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇదేనా మహిళా దినోత్సవం రోజు మహిళలకు జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ‘‘మీ పత్రికా ప్రకటనలో మహిళలకు ఉన్న స్వేచ్ఛ రాష్ట్రంలో కనపడటం లేదు. జగన్ రెడ్డి గారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా? కనీసం గుడికి వెళ్లే హక్కు కూడా లేదా? అమరావతిలో మహిళల్ని అడ్డుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని, రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదేనా మహిళా దినోత్సవం రోజు మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రకాశం బ్యారేజి పై ఉద్రిక్తత... మీద చేయి వేస్తే దూకేస్తాం...

ఎపి రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు 400 రోజులకు పైగా ఎండనక, వాననక ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా రాజధాని ప్రాంత మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతుఅండగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మహిళా రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా సీఎం జగన్, డీజీపీ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆ మహిళలు మండిపడ్డారు. ఇదే సందర్భంలో ఎవరైనా తమపై చేయి వేస్తే ప్రకాశం బ్యారేజీలో దూకుతామని పోలీసులను హెచ్చరించారు. తాము అమ్మవారి దర్శనానికి వెళుతుంటే ఈ విధంగా అక్రమంగా అడ్డుకుంటున్నారని.. వారు విమర్శించారు. అంటేకూండా ఇప్పటికే భూములు ఎలాగూ కోల్పోయామని, ఇక బతకడం అనవసరమని, ప్రకాశం బ్యారేజ్‌లో దూకి చనిపోతామని ఏవరు ఆవిడెదన ౫వ్య౫క్తం చేసారు. రాజధాని కోసం తాము నిరసన తెలుపుతుంటే ప్రజలు చూసి వెళ్లిపోతున్నారే కానీ ఎమాత్రం స్పందించడంలేదని.. ఇది సిగ్గుచేటని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు        

తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి గుండె విజయ రామారావు. తెలంగాణ మలి దశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, కేసీఆర్ తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తెలంగాణ రావాలని లేకుండేనని చెప్పారు.  ఉద్యమ ఒత్తిడితో సమైక్య ఆంధ్రలో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకున్నారని విజయరామారావు తెలిపారు. శాసనసభను నడవనీయకుండా అడ్డుకుని.. ఉద్యమం ఎగిసినట్టు చూపించి సమైక్య రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ అనుకున్నారంటూ కామెంట్ చేశారు.  వరంగల్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న విజయరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ అజెండాలు అన్ని ఉత్తీత్తవేనని.. ఓట్లు దండుకోవడం కోసమేనని తెలిపారు. తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని, ఉద్యమకారులను గెంటి వేశారని విజయరామారావు అన్నారు. ఉద్యమంలో లేని కేటీఆర్.. ఉద్యమకారుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి ని చివరి నిమిషం వరకు నమ్మించి.. ఆ టికెట్ పై పోటీ చేసి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని విజయరామారావు ఆరోపించారు.  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నవిషయం తెలియదా అని విజయరామారావు ప్రశ్నించారు. కేసీఆర్  ద్రోహం చేస్తేనే బాపురావు బిజెపి లో చేరారని చెప్పారు. పార్లమెంట్ లో మద్దతు లేకపోతే బిల్లు వచ్చేదా అని నిలదీశారు. అమెరికాలో కవితకు యాక్సిడెంట్ అయినా.. ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి  కేసీఆర్ అంగీకరించలేదన్నారు. కేసీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా కవితను తానే హైదరాబాద్ తీసుకువచ్చానని తెలిపారు. అప్పుడు కవిత ను రావద్దన్న కేసీఆర్.. తర్వాత జాగృతి పేరుతో ఉద్యమంలోకి ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. పివి ప్రతిష్టను వాదుకునేందుకే వాణిదేవీని ఎమ్మెల్సీ గా కేసీఆర్ నిలబెట్టారని విజయరామారావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ గల్లంతు అవుతుందన్నారు.  

రాజధానిలో మరో రైతు ఆత్మహత్య 

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యతోనైనా కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయాలని అతడు రాసిన లేఖలో రాసి పెట్టి చెట్టుకు ఊరి వేసుకుని రైతుల ఉద్యమానికి తన ప్రాణాలు త్యాగం చేశాడు.  ఒకటి కాదు రెండు రోజులు వంద రోజులు దాటింది. అయినా మొక్కక్కవోని దిశక్షతో  దేశ రాజధాని వడిలో ఆందోళనలు చేస్తున్న రైతులు. రైతుల చట్టాలకు ప్రభుత్వాలు తూట్లుపెడుతుందని వారి హక్కుల కోసం దేశ రైతులు ఒక్కటై ఆందోళనలు చేస్తుంటే.. ఆ ఆందోళన దేశ రైతుల కాదు అన్నట్లు క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వం సంబరాల్లో మునిగింది. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటికే పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది డిసెంబరులో పంజాబ్‌కు చెందిన న్యాయవాది , సిక్కు మత గురువు సంత్ రామ్‌సింగ్ ఉద్యమం కోసం ఊపిరి తీసుకున్నారు.   హర్యానాలోని హిసార్‌కు చెందిన రజ్బీర్ (49) రైతు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన రజ్బీర్ ఓ లేఖ రాసి టిక్రీ సరిహద్దులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు చట్టాలను రద్దు చేసి తన చివరి కోరిక తీర్చాలని అందులో ఆయన వేడుకున్నాడు. అతను రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హోమ్ మంత్రి మనవడి అరాచకం... 

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్తారు మన పెద్దలు. అలాగే కొంతమంది నాయకులు ఎంత గొప్పవారైనా ఎంత పేరు ప్రఖాయతులు తెచ్చుకున్నా వారి వారసులు మాత్రం పెద్దల పరువు తీసే పనిలో యమా బిజీగా ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మ‌న‌వ‌డు ఫ‌రాన్ అహ్మ‌ద్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడు చదివే కాలేజీలో తోటి విద్యార్థుల‌ను ర్యాగింగ్ చేస్తున్నాడ‌ని తాజాగా పోలీస్ స్టేష‌న్లో ఒక కేసు న‌మోదైంది. మా తాత హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ అని చెప్పి మరీ బెదిరిస్తూ.. త‌మ‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అతడి తోటి విద్యార్థులు పంజాగుట్ట పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. హోంమంత్రి పేరు చెప్పి అయన మ‌న‌వ‌డు చేస్తున్న అరాచకాలనుండి తమను కాపాడాలంటూ వారు పోలీసులకు విజ్ఞ‌ప్తి చేశారు. ఫ‌రాన్ చేసిన ర్యాగింగ్‌ దాడిలో గాయపడిన రియాన్ అనే ఒక విద్యార్థి మీడియా సమావేశంలో తనకు అయిన గాయాన్ని చూపాడు ఈ ర్యాగింగ్ ఘట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  హోం మంత్రి మ‌న‌వ‌డు గ‌తంలోనూ పలు వివాదాలలో ఉన్నాడు. గతంలో పోలీసు శాఖకు చెందిన ఒక వాహనంపై కూర్చొని టిక్‌టాక్ వీడియో చేసిన ఘ‌ట‌న తీవ్ర దుమారం రేపింది. ఎంత హోమ్ మంత్రి మనవడైతే మాత్రం ఇలా తోటి విద్యార్థులను హింసించి పైశాచిక ఆనందం పొందడమేంటని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.