జ‌గ‌న్ త‌ర్వాత‌ విజ‌య‌సాయినే టార్గెట్‌.. మ‌రో కేసుతో ర‌ఘురామ దూకుడు..

ర‌ఘురామ ఫుల్ ఖుషీగా ఉండి ఉంటారు. ఆగ‌స్టు 25 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. జ‌గ‌న్‌కు గుండె ద‌డ‌ పెరిగి ఉంటుంది. ఆగ‌స్టు 25 వ‌స్తుందంటేనే ఆయ‌న‌లో ఉత్కంఠ పెరిగిపోతుంటుంది. ఒకే డేట్‌. ఆ ఇద్ద‌రిలో వేరు వేరు వేరియేష‌న్స్‌. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు తీర్పు వెలువ‌రించే రోజు. ఎన్నాళ్లో వేచిన ఆ ఉద‌యం.. అతి త్వ‌ర‌లోనే ఆవిష్కృతం కాబోతోంది.  ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని.. అందువల్ల బెయిల్ రద్దు చేయాలని గ‌తంలో హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రఘురామ‌. ఈ అనూహ్య ప‌రిణామంతో జ‌గ‌న్ షాక్‌కు గుర‌య్యారు. రెండేళ్లుగా బిందాస్‌గా ఉన్నా.. స‌డెన్‌గా త‌న బెయిల్ ర‌ద్దు చేయ‌మంటే ఎలా? అంటూ ఉలిక్కిప‌డ్డారు.  అటు, ర‌ఘురామ చెప్పిన కార‌ణాలు, చూపిస్తున్న సాక్షాలు ప‌క్కాగా ఉండ‌టంతో.. జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డ్డారు. అందుకే ఇటు జ‌గ‌న్ త‌ర‌ఫు లాయ‌ర్లు.. అటు సీబీఐ న్యాయ‌వాదులు ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాల‌తో రెండు మూడు నెల‌లు ప‌బ్బం గ‌డుపుకున్నారు. కానీ, ఎన్నిసార్ల‌ని వాయిదాలు అడుగుతారు? ఎన్నిసార్లు అని కోర్టు వాయిదాలు వేస్తుంది? జ‌డ్జిమెంట్ ఇచ్చే రోజు రానేవ‌చ్చింది..  ఆగ‌స్టు 25న ముహూర్తం ఫిక్స్ అయింది. బెయిల్ ర‌ద్దు నిర్ణ‌యాన్ని సీబీఐ కోర్టుకే వ‌దిలేయ‌డంతో కేసు క్లైమాక్స్‌కు చేరింది. సీబీఐ ఎక్క‌డా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయ‌వ‌ద్దు అని అన‌లేదు. ఆయ‌న బెయిల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం లేద‌నీ చెప్ప‌లేదు. సో, మౌనం అర్థ అంగీకారం అన్న‌ట్టే అనుకోవాలా? బెయిల్ ర‌ద్దుపై సీబీఐ జోక్యం చేసుకోలేదంటే.. కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేసిందంటే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు త‌ప్ప‌దా? మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.  కేసు వేసిన‌ ర‌ఘురామ మాత్రం 100% జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని ధీమాగా ఉన్నారు. జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు అయి జైలుకెళ్లాక‌.. ఇక విజ‌య‌సాయిరెడ్డి ప‌ని ప‌డ‌తానంటూ స‌వాల్ చేస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు ఏ2 చూస్తున్నారని, మ‌రో 2 రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని రఘురామ ప్రకటించి కలకలం రేపారు. ర‌ఘురామ అన్నారంటే అన్నంత ప‌ని చేస్తారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. కోర్టులో గ‌ట్టిగా నిల‌బ‌డి.. త్వ‌రిత‌గ‌తిన విచార‌ణ జ‌రిగేలా చేసి.. ఆగ‌స్టు 25న తీర్పు వ‌చ్చేలా చేశారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌నే.. ర‌ఘురామ దూకుడును త‌ట్టుకోలేక‌పోతే.. ఇక సాధార‌ణ ఎంపీ అయిన విజ‌య‌సాయిరెడ్డి.. ర‌ఘురామ ముందు ఇంకేం నిల‌బ‌డ‌తాడు? ఆయ‌న సృష్టించే సునామీలో కొట్టుకుపోవ‌డం ఖాయం అంటున్నారు. జ‌గ‌న్ బెయిల్ రద్దు అయితే.. విజ‌య‌సాయిని సైతం మ‌ళ్లీ జైలుకి సాగ‌నంపితే.. వైసీపీ స‌ర్కారు కుప్ప‌కూల‌డం త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు. మొక్కే క‌దాని పీకేస్తే.. పీక కోసేలా ఉన్నాడంటూ ర‌ఘురామను త‌లుచుకొని నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నార‌ట జ‌గ‌న్ అండ్ విజ‌య‌సాయి.   

మద్యం డబ్బుల కోసం.. కన్నబిడ్డల్నే అమ్మేసిన దంపతులు.

రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే.. బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే.. తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు. పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు. ఈ ప్రపంచంలో అన్ని మనిషి చుట్టూ తిరిగితే మనిషి మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. మనుషులు వారి అలవాట్లు తీర్చుకోవడానికి డబ్బులు కావలి అలాగే ఆ డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా మద్యానికి బానిసైన భార్యభర్తలు డబ్బుల కోసం ఇద్దరు బిడ్డల్ని అమ్ముకున్న దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మూడో బిడ్డను కూడా అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నించగా బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఊటీ కాందల్‌ భగవతి అమ్మవారి ఆలయ వీధికి చెందిన రాబిన్‌ (29), మోనీషా (26) కొన్నా్ళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొద్ది నెలలుగా దంపతులిద్దరూ మద్యానికి బానిసయ్యాడు. ఆ మద్యానికి బానిసై మద్యం మత్తులో దొరికిన చోటల్లా అప్పులు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూడా కూలిపోయింది. అప్పటి నుండి కుటుంబ పోషణ భారమైంది. ఇక ఆ తల్లిదండ్రులు చేతులు ఎత్తేశారు. పిల్లల్ని పోషించలేక మూడేళ్ల వయసున్న పెద్ద కుమార్తెను మోనీషా సోదరి ప్రవీణకు అప్పగించారు. రాబిన్‌ మిత్రుడి సాయంతో తిరుప్పూర్‌కు చెందిన నిసార్‌బాయ్‌కి రెండో కుమార్తెను(18 నెలలు) రూ.25 వేలకు విక్రయించారు. కుమారుడి (3 నెలలు)ని సేలం ప్రాంతానికి చెందిన భూపతి-ఉమామహేశ్వరి దంపతులకు ఏకంగా రూ.30 వేలకు అమ్మారు. ఈ క్రమంలో పెద్ద కుమార్తెను కూడా విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రవీణ వద్దకెళ్లి తమ బిడ్డను ఇచ్చేయాలని గొడవకు దిగారు. దీంతో ఆమె ఆమె పిల్లల సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాబిన్ దంపతులను విచారించగా మిగిలిన ఇద్దరు పిల్లలని అప్పటిక విక్రయించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రాబిన్ దంపతులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 

వీ వాంట్‌ గోల్డ్.. ట‌ఫ్ ఫైట్‌లో నెగ్గిన సింధు..

గ‌త ఒలింపిక్స్‌లో వెండి వెలుగులు. ఈసారి ఏకంగా స్వ‌ర్ణ 'సింధు'రం సాధ్యం కావొచ్చు. ఒలింపిక్స్‌లో భార‌త టాప్ షట్ల‌ర్ పీవీ సింధు జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో అత్యంత ట‌ఫ్ ఫైట్‌ను దాటేసింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఆ మ్యాచ్‌లో య‌మ‌గుచిపై గెలిచి.. సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఫైన‌ల్ వ‌ర‌కూ ఈ దూకుడు ఇలానే కంటిన్యూ అయితే.. ఈసారి పీవీ సింధు మెడ‌లో స్వ‌ర్ణ ప‌త‌కం వ‌చ్చి చేరొచ్చు. తాజాగా ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో పీవీ సింధు జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. మరోసారి భారత్‌కు పతకం దాదాపు ఖాయం చేసింది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన సింధు.. రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. రెండో గేమ్‌ తొలి విరామానికి సింధు 11-6తో ఆధిపత్యం సాధించింది. విరామం తర్వాత యమగుచి గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో ఇద్దరి పాయింట్లు సమానంగా నిలిచాయి. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గింది . వరుస గేమ్‌లలో గెలిచిన సింధు సెమీస్‌కు చేరింది. య‌మ‌గుచి అడ్డు తొల‌గిపోవ‌డంతో.. ఇక చైనా ష‌ట్ల‌ర్ల‌కు చెక్ పెడితే స‌రి.   

16 ఏళ్ళ అమ్మాయిపై 6 నెలలుగా.. 5 మంది యువకులు అత్యాచారం..

దేశంలో రోజురోజుకు ఎక్కడ చూసిన మహిళల ఆవేదనలు.. ఆక్రందన.. మహిళలపై , చిన్న చిన్న బాలికలపై వరసలు లేవు.. కూతురుని చెరబట్టిన తండ్రి.. స్నేహితురాలిని వేధించిన ఫ్రెండ్.. అక్కకు గర్భం చేసిన తమ్ముడు.. ఆఫీస్ లో బోస్  లైంగిక వేధింపులు.. ఇలా అన్ని రకాలుగా ఆడవాళ్లు వంచనకు గురవుతూనే ఉన్నారు.. వారిపై  దాడులు  రోజు రోజుకి పెరుగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు, జీవోలు తీసుకువచ్చినా దుర్మార్గాలు శిక్షలు పడిన నిత్యం మహిళలపై ఎదావిదిగా దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై  ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  6నెలల పాటు ఆ ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె నగ్నంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. 6 నెలలు నరకం చూసిన ఆ అమ్మాయి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని అనుకుంది అందుకే నోరు మెదపలేదు. చివరకు ధైర్యం చేసుకొని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్‌పై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అత్యాచారం ఘటనను వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను ఎదావిదిగా అతడి స్నేహితులకు పంపించాడు. అదే అదును అనుకున్న ఆ అబ్బాయి ఫ్రెండ్స్ తమ దగ్గర ఉన్న వీడియో వైరల్ చేస్తామని సదరు బాలికను భయపెట్టి ఐదుగురు యువకులు కలిసి  6 నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే అత్యాచారం చేసిన వీడియోలను బయట పెడతామని హెచ్చరించారు. ఈ బాధలను భరించలేక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆ ఘటన మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌ లో చోటు చేసుకుంది.    రాత్రి విందుకు పిలిచి.. అశ్లీలంగా వీడియోలు తీసి.. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా. అనే పుస్తకాలూ చూసే ఉంటారు.. అలాగే  30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చూసే ఉంటారు. ఐతే ఇది ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థం ఐంది. ప్రజల మైండ్ లో కూడా అన్ని చాలా తొరగా జరిగిపోవాలి.. ఇలా అనుకుంటే అలా జారిపోవాలి. అనే మైండ్ సెట్ తో ఉన్నారు ప్రజలు అన్నింటికంటే ముందు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని ఆలోచిస్తుంటారు.. అందుకోసం ఈజీగా డబ్బులు సంపాదించుకునేందుకు కొంత మంది యువతులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హనీట్రాప్ కేసులు బయటకు వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే కర్నాటకలోని మంగుళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంగుళూర్‌లోని ఉళ్లాల ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సప్నా, అఫ్రీన్ అనే యువతులు నివాసం ఉంటున్నారు. వారి పక్క ఫ్లాట్‌లో ఓ వ్యాపారవేత నివస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న సదరు వ్యాపారవేత్తను యువతులు రాత్రి భోజనానికి పిలిచారు. అంతకుముందు అతనితో పథకం ప్రకారం పరిచయం పెంచుకున్నారు. ఆ రోజున అతడు విందుకు రాగానే మద్యం తాగించి రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతనితో సప్నా అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను తీసుకుంది. మరుసటి రోజు తేరుకున్న వ్యాపారవేత్త తన డబ్బు, నగలను ఇవ్వాలని కోరగా, అశ్లీల వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారు. ఒక్కసారిగా షాకైన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారవేత్త ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరు యువతులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాంగ్రెస్ గూటికి పీకే .. ఇక మోడీకి మూడినట్లేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? ప్రతి పక్షాలను ఏకంచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నడుం బిగిస్తున్నారా ?  గత కొంత కాలంగా ఆయన కాలికి బలపం కట్టుకుని దేశం చుట్టివస్తున్నది అందుకేనా? అంటే అవుననే అంటున్నారు, కాంగ్రెస్ కీలక నేతలు, మీడియా విశ్లేషకులు. నిజానికి జూలై 13వ తేదీన ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాతో సమావేశమైన సందర్భంలోనే, ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్త మీడియాలో షికార్లు చేసింది. సుమారు మూడు గంటల పాటు రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అయితే  అప్పట్లో ఇటు కాంగ్రెస్ నాయక త్రయం కానీ అటు పీకే కానీ, దానిపై పెదవి విప్పలేదు. వ్యూహాత్మకంగా  ఊహాగానలకు వదిలేశారు.  అయితే, ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ. పీకేని పార్టీలోకి తీసుకునే అంశం పై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ఏకే అంటోనీ, మల్లిఖార్జున ఖర్గే, కమల్ నాథ్, అంబికా సోనీ, హరీష్ రావత్, కేసీ వేణుగోపాల్ సహా మరి కొందరితో, సుదీర్ఘంగా చర్చించారు. ఒక విధంగా మేథోమథనం సాగించారన్న వార్త  మీడియాలో హాట్ హాట్’గా షికారు చేస్తోంది. అయితే, నిజానికి ఇది కూడా పాచి వార్తే .. ఈ సమావేశం జరిగింది నిన్ననో మొన్ననో కాదు, జూలై 22 న అంటే సుమారు వారం రోజుల క్రితం కీలక నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పీకేను పార్టీలోకి తీసుకుంటే వొనగూరే లాభనష్టాలు, ఒక వేళ పీకేను పార్టీలోకి తీసుకుంటే, ఆయనకు ఏ బాధ్యత ఇవ్వాలనే విషయంలో లోతుగా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలంతా  సహజంగానే, పీకే పార్టీలో చేరితే పార్టీకి ప్రయోజనం ఉంటుందని, ఆయన వస్తానంటే, వెల్కమ్ చెపుదామని తీర్మానించారు.  ఇందుకు సంబంధించి ఎలాంటి అధికార సమాచారం లేదు. పది రోజుల నాడు జరిగిన సమావేశానికి సంబంధించిన వార్తను మీడియా ఇప్పుడు వండి వార్చి లేదా మళ్ళీ వేడి చేసి వడ్డించింది. అయితే, అప్పుడు ఎందుకు మీటింగ్ వ్యవహారానని, రహస్యంగా ఉంచారు, ఇప్పుడెందుకు లీక్ చేసారు అనేది మనం అడగరాదు. దీన్నేపీకే స్ట్రాటజీ,అంటారు. నిజానికి ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఇక ఎలక్షన్ స్ట్రాటజీ ప్రొఫెషన్’కు గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్పు కొచ్చారు. అలాగే, రాజకీయాలోకి రానని కూడా అంతే గట్టిగా చెప్పారు. “ఒక సారి జనతాదళ్ (యూ) లో వేలు పెట్టి చేయి కాల్చుకున్నాను, మళ్ళీ మరోమారు అదే తప్పు చేయను. రాజకీయాలకు నేను పనికిరాను” అని పీకే స్వీయ ప్రకటన చేశారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్లను,ఇంతలోనే గట్టున పెట్టేశారు. సో .. ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు పొలిటీషియన్ కాలేడు, అన్న గిరీశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, పీకే భవిష్యత్’లో ఉత్తమోత్తమ రాజకీయ నాయకుడు అవుతారు.కాలం ఖర్మం కలిసొస్తే, పీకీ ... పీఎం కూడా అవుతారు.    ఇక మోడీని ఓడించడమే ఎజెండాగా సాగే ఏకతా యత్నాల వలన ప్రయోజనం ఉండదని, మోదీ వ్యతిరేకత’ అన్న ఒకే ఒక అంశంతో ప్రతిపక్ష కూటమి సఫలీకృతం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పెదవి విరిచారు. ప్రతిపక్ష పార్టీలకు  కనీస ఉమ్మడి కార్యక్రమం అవసరమని కూడా ఆయన సూచించారు.అలాగే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అన్నిటికంటే, కుర్చీ ఎవరిదీ? కిస్సా కుర్సీకా? అనేదే అతి పెద్ద సమస్య అని కూడా మొయిలీ ముందుగానే హెచ్చరించారు.అలాగే, మరో సీనియర్ నాయకుడు, ప్రశాంత్ కిశోర్ పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా చివరకు ఆయనే, కుర్చీ ఎక్కుతారేమో ... అన్న చిన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. అందుకే విశ్లేషకులు ఏమో చివరకు ఏమవుతుందో .. చూడాలి అంటున్నారు .. చూద్దాం.మొత్తానికి మోడీని ఓడించడమే ఎజెండాగా పీకే దర్శకత్వంలో నడుస్తున్న డ్రామా బానే రక్తి కడుతోంది

జేసీ మొన‌గాడురా బుజ్జా.. తాడిప‌త్రిపై మ‌రోసారి టీడీపీ జెండా..

తొడ‌కొట్టారు. ఇంటిపైకి దాడికొచ్చారు. కేసుల‌తో కుట్ర‌లు చేశారు. బ‌స్తీ మే స‌వాల్ అంటూ మీసం మెలేశారు. ఇంత‌ ఓవ‌రాక్ష‌న్ చేసినా.. జేసీ బ్ర‌ద‌ర్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పప్పులేమీ ఉడ‌క‌లేదు. తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీకి, టీడీపీకి తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. ఉత్కంఠ రేపిన తాడిప‌త్రి మున్సిపాలిటీ రెండో వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌వి కూడా తెలుగుదేశం ఖాతాలోనే ప‌డింది. కౌన్సిల్ హాల్‌కు వెళ్ల‌కుండానే.. ఇంట్లో కూర్చొని చ‌క్రం తిప్పారు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. తాడిప‌త్రిలో త‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. వైసీపీ శ్రేణుల‌కు, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు.  ఏపీ వ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగితే.. ఒక్క తాడిప‌త్రిలోనే టీడీపీ జెండా ఎగిరింది. అది జేసీ కుటుంబం స‌త్తాకి నిద‌ర్శ‌నం. టీడీపీని ఎలాగైనా దెబ్బ‌కొట్టి.. తన పట్టు నిలుపుకోవాలని తెగ ట్రై చేశారు MLA పెద్దారెడ్డి. తాడిప‌త్రి పీఠం కోల్పోయిన‌ప్ప‌టి నుంచీ ధూంధాం చేశారు. ఏకంగా జేసీ ఇంటిపైకే దాడికి వ‌చ్చారు పెద్దారెడ్డి అండ్ గ్యాంగ్. అప్ప‌టి నుంచీ ఆ రెండు వ‌ర్గాల మ‌ధ్య నువ్వా-నేనా అన్న‌ట్టు పొలిటిక‌ల్ వార్ న‌డుస్తోంది. తాజాగా, తాడిప‌త్రి మున్సిపాలిటీ రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నికల‌పై ఉత్కంఠ, ఉద్రిక్త‌త మ‌రింత పెరిగింది. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. టీడీపీ స‌భ్యుల‌తో పాటు త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న క‌మ్యూనిస్టు అభ్య‌ర్థి, ఇండిపెండెంట్ కేండిడేట్‌తో ప్ర‌త్యేక‌ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక టీడీపీదే విజ‌యమ‌ని భావించిన వైసీపీ.. వైస్ ఛైర్మ‌న్ ఎన్నికకు గైర్హాజరు కావడంతో విజ‌యం టీడీపీ ఖాతాలో పడింది.  తాడిపత్రిలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ TDPకే మద్దతు ఇచ్చారు. దీంతో TDP బలం 20కి పెరిగింది. YCPకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ గైర్హాజరుతో ఎలాంటి నెంబర్‌ గేమ్‌ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్‌ చైర్మన్‌ అయ్యారు. వైసీపీపై టీడీపీది మ‌రోసారి పైచేయి సాధించింది. తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీకి ఎదురులేద‌ని రుజువైంది.   

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు?.. ఆగ‌స్టు 25న సీబీఐ కోర్టు జ‌డ్జిమెంట్..

ర‌ఘురామ ఎన్నాళ్లో వేచిన ఉద‌యం. ఆగ‌స్టు 25న ఆవిష్కృతం కాబోతోంది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసులో ఆ రోజు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వ‌నుంది. ఇన్నాళ్లూ వాయిదాల ప‌ర్వంతో నెట్టుకొచ్చిన జ‌గ‌న్‌.. ఇప్పుడిక లాక్ అయ్యారు. సీబీఐ సైతం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో తీర్పుకు ముహూర్తం ఫిక్స్ అయింది.  జగన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ మరోసారి సమయం కోరింది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. సీబీఐ లాయ‌ర్ల అభ్య‌ర్థ‌న‌ను ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది వ్య‌తిరేకించారు. మరింత సమయం ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.  ఇక్క‌డే సీబీఐ న్యాయ‌వాది వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. బెయిల్ ర‌ద్దు అంశంలో కోర్టు విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో విచారణ ముగిసిందని, ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై సీబీఐ మొద‌టి నుంచి అర‌క‌త్త‌ర‌లో పోక‌చెక్క‌లా మారింది. బెయిల్ ర‌ద్దు చేయాలంటూ నేరుగా రాసివ్వ‌లేక‌పోయింది. అలాగ‌ని బెయిల్ కొన‌సాగించానీ చెప్ప‌లేని ప‌రిస్థితి. ర‌ఘురామ పూర్తి సాక్షాధారాల‌తో సీబీఐని ఏదో ఒక నిర్ణ‌యం చెప్పేలా చేసేందుకు బాగా ట్రై చేశారు. కానీ, సీబీఐ ఎప్ప‌టిక‌ప్పుడూ త‌ప్పించుకుంటూ వ‌చ్చింది. ఈసారి కూడా మ‌రో వాయిదా కోరింది. కానీ, ర‌ఘురామ లాయ‌ర్‌, కోర్టు అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కోర్టు విచ‌క్ష‌ణ మేర‌కే నిర్ణ‌యం తీసుకోవాలంటే సీబీఐ న్యాయ‌వాది హ్యాండ్స‌ప్ అన్నారు. దీంతో.. కేసు విచార‌ణ ముగిసింద‌ని.. ఆగ‌స్టు 25న తుది తీర్పు వెల్ల‌డిస్తామ‌ని సీబీఐ కోర్డు స్ప‌ష్టం చేసింది. బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉండ‌టంతో.. సీఎం జ‌గ‌న్‌కు ఇక‌ ద‌బిడి దిబిడే.  

10 వేలు ఇవ్వని దొర.. 10 లక్షలు ఇస్తడా? 

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటోంది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఆ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. దీంతో దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త పథకం తెచ్చారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళిత బంధు స్కీం, సీఎం కేసీఆర్ ప్రకటనలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లు ఎదురుచూసినా రాష్ట్రంలోని పేద‌ల‌కు రూ.10 వేల రుణం కూడా  ఇవ్వ‌ని పాల‌కుడు.. ఇప్పుడు ఉప ఎన్నిక ఉండ‌డంతో ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌ల సాయం ఇస్తామంటున్నార‌ని మండిపడ్డారు.    'ఏళ్లకేళ్లు పడిగాపులు పడినా పట్టుమని పది వేలు రుణమివ్వని పాలకుడు... పది లక్షల రూపాయ‌ల‌ సాయమంటూ కొత్త జిత్తుతో ఎత్తులు వేస్తున్నాడు. ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు... మళ్లీ మళ్లీ మోసపోతే మనదే తప్పు. తెలంగాణ సమాజమా ఆలోచన చెయ్' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 'పచ్చి నిజం... పచ్చి మోసం.. తన కాళ్లపై తాను నిలబడదామని, ఆత్మగౌరవంగా బతుకుదామని అప్పు కోసం చెప్పులరిగేలా తిరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు మొండి చెయ్యి చూపే దుర్మార్గం నేడు గద్దెనెక్కి రాజ్యమేలుతోంది. ఓట్ల వాసన రాగానే నోట్ల కట్టలతో స్వైరవిహారం చేస్తోంది' అని రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో విమ‌ర్శించారు. ఈనాడు దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తుంటారని, ఇలాంటి వారికి కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు సువర్ణావకాశమ‌ని అందులో పేర్కొన్నారు. ఇలాంటి రాయితీ రుణ పథకాలను తెలంగాణ‌ ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిందని చెప్పారు. 2019-20 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల జారీని నిలిపేసింద‌ని ఈనాడులో వివ‌రించారు.  కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు అందించే రుణాలకు సైతం మోకాలడ్డిందని అందులో పేర్కొంది. దీంతో వేలాది మంది నిరుపేదలకు ఈ చ‌ర్య‌ అశనిపాతంగా మారుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

రూ. 30 లక్షలకు పులి చర్మం అమ్ముతూ స్మగ్లర్లు.. పట్టుకున్న పోలీసులు.. 

అది తెలంగాణ-చత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతం. అడవి దగ్గరిలో ఉన్న గ్రామాలూ గాఢ నిద్రలో ఉన్నపుడు.. అడవిలో రాత్రి పూట కొంతమంది పులుల వేట బయలు దేరుతున్నారు. గన్స్ ఉపయోగించి పులులను చంపుతారు.. ఆ తర్వాత  వాటి అవయవాలను తీసుకుని.. వాటిని  స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా  ఏటూరు నాగారం దగ్గర పులిచర్మం అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు.. పులిచర్మం ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు మరి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  రూ. 30 లక్షలకు పులి చర్మం అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మొత్తం దందాపై పోలీసులు కూపీగా లాగుతున్నారు. పూర్తి  పోలీసుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ఇరువురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు .వారి వద్దనుంచి పోలీసులు  పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్ గడ్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని వాజేడుకు చెందిన తిరుమలేష్ సేకరించాడు. చత్తీస్గడ్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఈక్రమంలో గోదావరి నది మీదుగా పులి చర్మాన్ని తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘనతో సంబంధమున్న మిగతవారిని పట్టుకుంటామని ఎస్పీ సంగ్రాంసింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్‌ ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్ ఆలం , ఐఎఫ్ఎస్ అధికారి శివ ఆశిష్ సింహం, స్పెషల్ ఆఫీసర్ ఏటూరునాగారం ప్రశాంత్ పాటిల్, ఏటూరునాగారం సీఐ కిరణ్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, శ్యాం ప్రసాద్ సిబ్బంది అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.  ప్రభుత్వాలు వన్య ప్రాణుల పరిరక్షణ కమిటీలు వేసి.. మూగ జంతువులకు రక్షణ కలిపిస్తుంటే డబ్బులు బానిసలూ అయినా కొంత మంది లాంటి సంఘవిద్రోహ చర్యలు చేస్తున్నారు. డబ్బులు కావాలంటే ఏదైనా పని చేసుకోవాలి గానీ ఎలా నోరులేని జీవాల మీద పడి వాటి ప్రాణాలు తీసి వాటితో వ్యాపారం చేస్తే ఎంతవరకు సమంజసం.. కొన్ని నెలల క్రితం వికారాబాద్ అడివిలో కూడా కొంత హైదరాబాద్ కి చెందిన కొంత మంది జింకలను వేటాడి వాటిని చంపి తింటున్నారని వార్తలు వచ్చాయి.. మళ్ళీ ఇప్పుడు ఏకంగా పులులు చంపి వ్యాపారం చేస్తున్నారు.   

మేకపై ఐదుగురు అత్యాచారం.. ప్రధానిపై జనం ఫైర్..

ఈ ప్రపంచంలో అది పెద్ద జంతువు. మనిషి.. ఎందుకంటే.. ఎలుకని పిల్లి చంపితే పిల్లిని కుక్క చంపుతుంది.. కుక్కను మరోటి చంపుతుంది.. పులిని సింహం చంపుతుంది.. కానీ అన్నింటిని చంపుకు తినేవాడు మనిషి ఒక్కడే.. అందుకే మనిషిని మించిన జంతువు మరొకటి లేదు ఈ ప్రపంచంలో  కామం పెరిగినప్పుడు జంతువులు చాలా వైల్డ్ గా స్పందిస్తాయి.. మనిషి వాటికంటే వైల్డ్ గా స్పందిస్తాడు.. కామం అనే పురుగు మెదడులో తిరిగితే ఎంతకైనా తెగిస్తాడు మనిషి.. తాజాగా ఒక ఘోరం జరిగింది.. అదేంటో తెలుసుకుందాం..?  కామాంధులు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. చిన్న పెద్ద ఆడామగ తేడాలేకుండా  ప్రవర్తించే  ఈ కామాంధులు తాజాగా రూట్ మార్చారు. మనుషులపైనే కాకుండా మూగజీవాలపై కూడా వారి లైంగికవాంఛ తీర్చుకుంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు యువకులు ఓ మేకను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండ ఆ మేకను చంపేంసి పరారయ్యారు.. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మేకపై లైంగిక దాడికి పాల్పడి చంపేసినట్లు నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అదేంటి పాకిస్తాన్ ప్రధానికి ఏం సంబంధం అనుకుంటున్నారా..? ఈ సంఘటన జరిగింది అక్కడే కాబట్టి.  ఇటీవల ఓ అత్యాచార ఘటనపై స్పందించిన ఇమ్రాన్.. మహిళల వస్త్రధారణ కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఇమ్రాన్ మాటలపై అయన మాజీ భార్య సైతం అగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ మేక ఏ విధంగా కామాంధులను రెచ్చగెట్టింది అంటూ ఇమ్రాన్ ను నిలదీస్తున్నారు. 

రేసుగుర్రంలా కొవిడ్‌.. పైపైకి ఆర్‌-ఫ్యాక్ట‌ర్.. థ‌ర్డ్ వేవ్ సిగ్న‌ల్స్‌..

త‌గ్గిన‌ట్టే త‌గ్గింది. హ‌మ్మ‌య్యా అనిపించింది. కాస్త రిలీఫ్ ఇచ్చింది. కొన్నాళ్లు హ్యాపీ అనుకున్నారంతా. మ‌ళ్లీ పోలోమంటూ రోడ్డెక్కేసారు జ‌నాలంతా. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం.. వ్యాప్తి మంద‌గించ‌డం.. ఆంక్ష‌లు తొల‌గిపోవ‌డంతో.. వైర‌స్‌ను లైట్ తీసుకుంటున్నారు. గ‌తంలో మాదిరే విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇదే అద‌నుగా మ‌ళ్లీ పంజా విసురుతోంది కొవిడ్‌. త‌గ్గేదే లే అన్న‌ట్టు మునుప‌టిలా వేగంగా వ్యాప్తిస్తోంది. ముందు కేర‌ళ‌తో మొద‌లుపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో చెల‌రేగుతోంది. హైద‌రాబాద్‌లో భారీగా కేసులు వ‌స్తున్నాయి. తూర్పుగోదావ‌రిలోనైతే అస‌లు బ్రేకే ఇవ్వ‌లేదు క‌రోనా. ఇదంతో మూడో ముప్పున‌కు సంకేత‌మ‌ని.. ఈసారి మ‌రింత క‌ల్లోలం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు వైద్య నిపుణులు. అందుకే కాబోలు.. 100 ప‌డ‌క‌లున్న ప్ర‌తీ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ త‌ప్ప‌నిస‌రి అని ఆదేశాలు ఇస్తున్నాయి ప్ర‌భుత్వాలు. పిల్ల‌ల కోస‌మూ ప్ర‌త్యేక వార్డులు రెడీ చేస్తున్నాయి.  కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి వేగాన్ని ఆర్‌-ఫ్యాక్టర్‌ (రీ ప్రొడక్షన్‌ రేట్‌) తో కొలుస్తారు. ఈ రేషియో దేశంలో క్రమేపీ పెరుగుతోంది. ఆర్‌-ఫ్యాక్ట‌ర్‌ 1కి చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెట్రో నగరాలైన పుణె, దిల్లీల్లోనూ ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతున్నట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు తెలిపారు.  దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి అత్యంత తీవ్రదశలో ఉన్నప్పుడు ఆర్‌-ఫ్యాక్టర్‌ 1.37గా ఉండేది. ఆ త‌ర్వాత త‌గ్గుతూ వ‌చ్చి 0.78కి చేరింది. జులైలో మళ్లీ పెరుగుదల మొదలైంది. జులై 3 - 22 మధ్య ఇది ఏకంగా 0.95కి పెరగడం ఆందోళనకరం.  కొవిడ్‌ బారిన పడిన వారి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే తీరును ఆర్‌-ఫ్యాక్టర్‌ తెలుపుతుంది. ఉదాహరణకు ఇది 0.95 ఉందంటే.. కొవిడ్‌ సోకిన ప్రతి 100 మంది ద్వారా ఇన్‌ఫెక్షన్‌ మరో 95 మందికి సోకుతుందని అర్థం. అదే 1 దాటితే పరిస్థితి తీవ్రమవుతుంది. కేరళలో ఆర్‌-ఫ్యాక్టర్‌ ఏకంగా 1.11 ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపుర్‌ మినహా మిగిలిన అన్నిచోట్ల 1 దాటింది. మణిపుర్‌లో కూడా 1కి చేరువగా ఉంది.  దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య గురువారం 43 వేలు దాటింది. వరుసగా రెండో రోజు క్రియాశీలక కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన‌ 24 గంటల్లో 43,509 కొత్త కేసులు రాగా.. 640 మంది కొవిడ్‌తో చ‌నిపోయారు. వ్యాక్సినేష‌న్ జోరుగా సాగుతున్నా.. పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టం ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. వ్యాక్సిన్‌కు విరుగుడుగా వైర‌స్ రూపాంత‌రం చెంది మ‌రింత బ‌ల‌ప‌డుతోందా? అనే దిశ‌గా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. 

వేల కోట్ల బేరం.. హుజురాబాద్ ఉప సమరం

తెలంగాణ రాజకీయం మొత్తం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హుజురాబాద్ ఉప ఎన్నికను తమ రాజకీయ జీవితానికి సవాలుగా తీసుకున్నారా? అన్న విధంగా పావులు కదుపుతున్నారు. సర్వంతానై వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, చివరకు సొంత పార్టీ స్థానిక నాయకులకు సైతం ఖరీదు కట్టి కొనేస్తున్నారనే ఆరోపణలు అంతటా వినిపిస్తున్నాయి. వినిపించడం ఏమిటి కనిపిస్తున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాళేశ్వరం (స్కామ్)లో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు చకా చకా చేతులు మారిపోతున్నాయి. అలాగని ప్రత్యర్ధులు తక్కువతిన్నారని కాదు, కాషాయం కట్టగానే ఈటల పునీతుడు అయిపోయాడని బీజేపీ భావిస్తే భావించవచ్చును, కానీ, ఈటల కూడా గులాబీ గూటి పక్షే .. ఆ తానులో పీసే...అదలా ఉంట, అధికార పార్టీకి సహజంగా ఉండే అడ్వాన్టేజిని కేసీఆర్ కొంచెం ఎక్కువగా ఉపయోగించు కుంటున్నారు. అందుకే కావచ్చు జనం పై వరాల జల్లు కురిపిస్తున్నారు.ఎందుకనో అన్నీ తెలిసిన కేసీఆర్, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న అర్యోక్తిని మరిచిపోయారని పార్టీలోనే కొందరు ఆందోళన చెందుతున్నారు. అంతే కాదు, కొందరైతే, ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్  భూతద్దంలో చూసి భయపడుతున్నారని అంటున్నారు.     అదలా ఉంటే, మాజీ మంత్రి,,  ఉద్యమ నాయకుడు. అన్నిటినీ మించి, రెండు దశాబ్దాలుగా తమ వెన్నంటి. కష్ట సుఖాలు, పాప పుణ్యాలలో పాలుపంచుకున్నఈటల రాజేందర్’ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్’కు అంత ఆగ్రహం ఎందుకో గానీ, ఆయన్ని ఓడించేందుకు ఎందాకా ఆయినా వెళ్లేందుకు సిద్దమంటున్నారు. అందుకోసంగా రూ.700 కోట్లు ‘ముడుపు’ కట్టారని, అవసరం అయితే ఇంకొన్ని వందల కోట్లు కుమ్మరించేందుకు కూడా కీసేఆర్ సిద్ధంగా ఉన్నారని, మీడియా కోడై కూస్తోంది. ఇక ప్రభుత్వ కుమ్మరింతల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఒక్క దళిత బంధు పథకాన్ని దృష్టిలో ఉంచుకుని కావచ్చు,  ఒక్క అసెంబ్లీ నియోజక వర్గానికి 2 వేల కోట్ల రూపాయల  పథకమా అంటూ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనరసింహ వంటి నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో వంక  ఒక్క నియోజక వర్గంలో పార్టీ పరంగా ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నదే నిజం అయితే రాష్ట్రంలో సాగుతున్న అవినీతి పాలనకు అది అద్దం  పడుతుందని అంటున్నారు.  అదలా ఉంటే, హుజురాబాద్ పేరిట జరుగతున్న పార్టీ ఫిరాయింపులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సహజంగానే గోడ దూకుళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఫిరాయింపుల వార్తలు  కొద్దిగా ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలాంటిది ముఖ్యమంత్రి తమ వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక పరపతి మొత్తాన్ని పణంగాపెట్టి పోరాడుతున్న ఉప ఎన్నిక సందర్భంగా ఫిరాయింపులు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. చివరకు సొంత పార్టీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం గతంలో ఎప్పుడూ లేదని, తెరాస కొత్త వరవడికి శ్రీకారం చుట్టిందని అంటున్నారు.  హుజురాబాద్ ఉప ఎన్నిక క్రతువు నేపధ్యంగా చిన్నా, చితక నాయకుల ఫిరాయింపులు, బేరసారాలు పక్కన పెడితే, పెద్ద చేపల్లో పెద్ద చేప ఈటల రాజేందర్, గులాబీ గుతినుంచి కమల దళంలోకి దూకేశారు. అనివార్యంగానే కావచ్చు గులాబీ పార్టీతో ఉన్న ఇరవై ఏళ్ల అనుబంధాన్ని, తెంచుకుని  కాషాయం గూటికి చేరారు. ఇక ఆయన ఖాళీని నింపుకునేందుకు, తెరాస ఎవరినీ వదలకుండా, అన్ని పార్టీల నుంచి అయిన వాళ్ళను కానీ వారినీ అందరికీ, ఎదో ఒక రేటుకు బేరం కుదుర్చుకుని కండువాలు కప్పెస్తోంది. టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణను తెచ్చుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  టికెట్ పై పోటీ చేసి 60 వేలపై చిలుకు ఓట్లు తెచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డినీ కేసీఆర్  లాగేశారు. చివరకు ఎప్పుడో 20  ఏళ్ల క్రితం హుజురాబాద్ నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలిచి, చంద్రబాబు పుణ్యాన మంత్రి అయిన పెద్ది రెడ్డికి కూడా రెడ్ కార్పెట్ సిద్ద చేస్తున్నారు. ఈ 20 ఏళ్లలో పెద్దిరెడ్డి, ఎక్కని గడప (పార్టీ) లేదు.. కప్పని జెండా లేదు.అన్ని పార్టీలు తిరిగి చివరకు బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు అక్కడి నుంచి కారెక్కేందుకు సిద్దమయ్యారు.  ఇంత చేసినా ఈటలకు ప్రత్యర్ధి ఎవరన్నది ఇంతవరకు తేలలేదు. ఇప్పట్లో తేలే సూచనలు కూడా కనిపించడం లేదు. చివరకు, ఇప్పుడు పార్టీలో చేరిన అందరినీ, బొమ్మల కొలువులో బొమ్మల్లా పేర్చి, ఇంకెవరికో టికెట్ ఇచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. నిజానికి జరిగేది అదే, అని అంటున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్ధి అన్వేషణలోనే వుంది. నిజం అవునో కాదో కానీ, అభ్యర్ధి పేరు ప్రకటిస్తే, ఆవెంటనే కారెక్కేస్తారనే భయం వలన చేత కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించడం లేదని, గాంధీభవన్ మచ్చట్లలో విని పిస్తోంది.   మొత్తానికి, హుజురాబాద్ ఉప ఎన్నిక, రాజకీయ బేహారుల నిజ రూపాన్ని, తెర మీదకు తెచ్చింది. రాజకీయ విలువలకు పాతర వేసింది. రేపటి రాజకీయ రాక్షస క్రీడను ఈరోజే ఆవిష్కరించింది. రాష్ట్రంలో అవినీతి ఎన్ని వేల,లక్షల కోట్ల ఎత్తుకు ఎదిగిందో అద్దంలో చూపిస్తోందని అంటున్నారు.

రాహుల్‌కు 'చిరు' కోరిక‌.. సాధ్య‌మేనా?

కాంగ్రెస్ పార్టీ ఈసారి గ‌ట్టిగా ట్రై చేయాల‌నుకుంటోంది. రాహుల్‌గాంధీని ఎలాగైనా ప్ర‌ధానిని చేయాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ ఇంకా గ‌ట్టిగా ట్రై చేస్తున్నారు. యువ‌రాజు మాత్రం ఎప్ప‌టిలానే ట్విటర్‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మోదీపై త‌న స్టైల్‌లో సెటైర్లు వేస్తున్నారు. అయితే.. దేశంలో మోదీ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మ‌వుతుండ‌టంతో కాంగ్రెస్‌కు మ‌ళ్లీ క్రేజ్ పెరుగుతోంది. తృణ‌మూల్‌, డీఎంకే, ఎన్సీపీలాంటి బీజేపీ వ్య‌తిరేఖ ప్రాంతీయ పార్టీల‌కు హ‌స్తం పార్టీయే ఆశాకిర‌ణంగా క‌నిపిస్తోంది. ఇక ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో డీకే శివ‌కుమార్‌, రేవంత్‌రెడ్డిలాంటి బ‌ల‌మైన పీసీసీ చీఫ్‌లు ఉండ‌టంతో ఈసారి ఎన్నిక‌ల్లో ఈ రెండు రాష్ట్రాల్లో మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ధీమాగా ఉన్నారు. త‌మిళ‌నాడులో ఎలాగూ డీఎంకేతో పొత్తు ఉండ‌నే ఉంది. కేరళ‌లో కాంగ్రెస్ బ‌లంగా ఉండ‌టంతో పాటు సాక్షాత్ రాహుల్‌గాంధీనే అక్క‌డ ఎంపీగా ఉన్నారు. ఇలా ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిన‌హా ద‌క్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ శుభ‌శ‌కునాలే.  అందుకే, రాహుల్‌గాంధీ ఏపీపై ఇప్పుడిప్పుడే ఫోక‌స్ పెంచార‌ని అంటున్నారు. వైఎస్సార్ హ‌యాంలో గ‌త‌మెంతో ఘ‌న‌మైన ఏపీ కాంగ్రెస్‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయింది. హ‌స్తం ఖాతాలో ఓ వార్డు మెంబ‌ర్ కూడా లేని దుస్థితి. కాంగ్రెస్ పేరు పెట్టుకొని.. కాంగ్రెస్‌ నేత‌ల‌ను కూడ‌గ‌ట్టుకొని.. వేరుకుంప‌టి పెట్టుకొని.. అధికారం చెలాయిస్తున్న జ‌గ‌న్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే క‌సితో స‌రైన‌ స‌మ‌యం కోసం ఎదురుచూస్తోంది హ‌స్తం పార్టీ. కుదిరితే, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దై జైలుకెళితే.. మ‌ళ్లీ ఏపీలో బ‌ల‌ప‌డాల‌నే దిశ‌గా ఇప్పుడిప్పుడే ఆలోచ‌న చేస్తోంద‌ట‌. కుద‌ర‌క‌పోతే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. జ‌గ‌న్‌ను మ‌రోసారి జైల్లో పెట్ట‌డం ఖాయ‌మంటున్నారు. జ‌గ‌న్ జైలుకెళ్లి.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. వైసీపీలో ఉన్న పాత కాపులంద‌రినీ తిరిగి హ‌స్తం గూటికి చేర్చ‌డం ఏమంత క‌ష్ట‌మైన ప‌ని కాదంటోంది అధిష్టానం. ఇప్పుడైనా, ఎప్పుడైనా.. ఏపీలో కాంగ్రెస్ మ‌ళ్లీ బ‌ల‌ప‌డాలంటే వైఎస్సార్‌లా ఫేస్ వ్యాల్యూ ఉన్న బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఉంద‌నే భావ‌న‌లో రాహుల్ గాంధీ ఉన్నార‌ని తెలుస్తోంది. మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అంత ఛ‌రిస్మా లేక‌పోవ‌డంతో.. రాహుల్ ఆలోచ‌న అంతా చిరంజీవి చుట్టే తిరుగుతోంద‌ని అంటున్నారు. చిరు మిన‌హా మ‌రెవ‌రూ రాహుల్ కంటికి ఆన‌డం లేద‌ట‌. ఇటీవ‌ల‌, ఏపీ కాంగ్రెస్ వ్వ‌వ‌హారాల ఇంఛార్జి ఉమెన్ చాందీతో ఆ మేర‌కు రాహుల్ చ‌ర్చించార‌ని తెలుస్తోంది. ఓ సారి చిరంజీవితో మాట్లాడ‌మంటూ ఉమెన్ చాందీని రాహుల్ పుర‌మాయించార‌ని చెబుతున్నారు. అన్నీ కుదిరితే త్వ‌ర‌లోనే వారిద్ద‌రి భేటీ ఉంటుంద‌ని అంటున్నారు.  ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. రాజ్య‌స‌భ సీటు సాధించి.. కేంద్ర‌మంత్రిగా చేసిన చిరంజీవి.. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేక‌పోయినా.. టెక్నిక‌ల్‌గా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ అవ‌స‌రాల దృష్ట్యా మ‌ళ్లీ ఆయ‌న్ను యాక్టివ్ చేయాల‌ని రాహుల్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే చిరంజీవికి ఏపీ పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకూ సిద్దంగా ఉన్నార‌ట‌.  రాహుల్‌గాంధీ కోరిక ఎలా ఉన్నా.. ఆయ‌న పిలిచినంత మాత్రాన చిరంజీవి కాంగ్రెస్‌లో యాక్టివ్ అవుతారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ప్ర‌స్తుతం సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న చిరు.. రాజ‌కీయంగానూ కాస్తోకూస్తో ఉనికి చాటుతున్నారు. ఇటు త‌మ్ముడుకి, జ‌న‌సేన‌కి తెర‌వెనుక నుంచి మోర‌ల్ స‌పోర్ట్ ఇస్తున్నారు. అటు జ‌గ‌న్‌తోనూ టాలీవుడ్ స‌మ‌స్య‌ల సాకుతో ట‌చ్‌లో ఉంటున్నారు. ఒక ద‌శ‌లో చిరంజీవిని వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే టాక్ కూడా విన‌బ‌డింది. సో, ఈ కేంద్ర‌ మాజీ మంత్రికి రాజ‌కీయ వాస‌న‌లు ఇంకా పోలేద‌నే చెప్పాలి. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. మున‌ప‌టిలా చిరంజీవిని సంతృప్తి ప‌రిచే ప‌ద‌వి ఇస్తానంటే.. చిరు మ‌ళ్లీ కాంగ్రెస్ బాధ్య‌త‌లు స్వీక‌రించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అంటారుగా.. ఏమో.. గుర్రం ఎగ‌రావ‌చ్చు...   

హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్‌లో ..లవర్ గొంతుకోసి, ప్రియుడి ఆత్మహత్య..

ఓపెన్ చేస్తే.. సాయంత్రం అది హైదరాబాద్. మాదాపూర్‌. లెమన్‌ట్రీ హోటల్‌. అక్కడక్కడా కొంత రద్దీగా ఉంది. మూడవ అంతస్తులో ఉన్న 317 రూమ్ లో గొడవ పడుతున్నారు. అటువైపు వెళ్తున్న రూమ్ ‌బాయ్ లోపలి నుంచి వస్తున్న అరుపులు వినిపించాయి. అతను కంగారు పడ్డాడు. వెంటనే సిబ్బందికి చెప్పాడు. ఏమైందో ఏమో కొద్దీసేపటి వరకు రూము నుంచి ఎలాంటి మాటలు వినిపించలేదు.. అంత సైలెంట్ గా మారింది ఆ వాతావరణం. హోటల్ సిబ్బంది కి అనుమానం వచ్చింది. వెంటనే మారుతాళంతో  గది తలుపులు తెరిచి చూశారు. ఫ్యానుకి వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. అతనితో ఒక అమ్మాయి కూడా ఉండాలి కదా అని సిబ్బందికి అనుమానం వచ్చింది. సిబ్బందిలో ఒకరు బాత్ రూమ్ వైపు నడిచాడు. అక్కడ ఆ మహిళా మృతదేహం కనిపించింది.. ఒక్కసారిగా వాళ్లందరికీ చెమటలు పట్టాయి.. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరికి హోటల్ సిబ్బంది సమాచారంతో హోటల్‌కు చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సంతోషి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతుండగా, రాములు రెండు కార్లు కొనుక్కుని హైదరాబాద్‌లో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో స్వగ్రామానికి వెళ్లిన రాములుకు సంతోషితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. బుధవారం వీరిద్దరూ నగరానికి వచ్చి లెమన్‌ట్రీ హోటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న 317 నంబరు గదిలో దిగారు. నిజానికి వీరు గురువారం మధ్యాహ్నం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా, మరో రోజుకు పొడిగించారు. అయితే, గురువారం సాయంత్రం వారి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.  బాత్రూములో సంతోషి మృతదేహం నగ్నంగా పడి ఉంది. రాములు ఆమె మెడను బ్లేడుతో కోసి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె చున్నీతో రూములోని ఫ్యాన్‌కు రాములు ఉరివేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతకుముందు వీరిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని, విచక్షణ కోల్పోయి రాములు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్‌, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలు, ఓ ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్ కార్డులు లభించాయి. నిజానికి వీరిద్దరూ గతంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, పెద్దలు అంగీకరించకపోవడంతో విడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

శ‌భాష్ ల‌వ్లీనా.. ఇండియాకు మ‌రో ఒలింపిక్ మెడ‌ల్‌..

ఒక్క ప‌త‌క‌మేనా? ఒకే ఒలింపిక్ మెడ‌లా? అని నిరాశ‌తో ఉన్న భార‌తీయుల‌కు గుడ్ న్యూస్‌. బాక్సింగ్‌లో ఇండియాకు ఓ మెడ‌ల్ క‌న్ఫామ్ అయింది. ఇప్ప‌టికే మేరీకోం హ్యాండ్స‌ప్ అన‌గా.. బాక్సింగ్‌లోనే మ‌రో కేట‌గిరిలోర ప‌త‌కం ద‌క్క‌నుంది.  యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఈ అస్సాం అమ్మాయి.. సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా.. కనీసం కాంస్య పతకం క‌న్ఫామ్‌. రింగ్‌లో ఇండియా అదుర్స్ అని మ‌రోసారి ప్రూఫ్ చేసింది మ‌హిళ బాక్స‌ర్‌. ల‌వ్లీనా ల‌వ్లీ ప‌ర్ఫార్మెన్స్‌తో ఇండియా ఖుషీ అవుతోంది. శ‌భాష్ ల‌వ్లీనా.

కేసీఆర్ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి? బీజేపీ నేత సంచలనం..

తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నేతల వలసలు ఊపందుకుంటున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.  దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత దూకుడు పెంచిన బీజేపీ.. అదే స్పీడును కొనసాగిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుతున్నారు. విపక్షాల దూకుడుతో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహం మార్చింది. గులాబీ లీడర్లు జోరుగా జనంలోకి వెళుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  టీఆర్ఎస్ తో పాటు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని సన్నాసి అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలను రేవంత్ రెడ్డి తిడుతున్నా.. కమలం నేతల నుంచి మాత్రం కౌంటర్లు రాలేదు. రేవంత్ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో పాటు ఎంపీలు.. కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డిపైనా విరుచుకుపడ్డారు.  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రేవంత్ రెడ్డి 20 రోజుల క్రితం ధర్నా చేస్తానంటే ఇందిరా పార్క్ వద్ద అనుమతి ఇచ్చిన సీఎం.. బీజేపీకి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ను నడుపుతున్నదెవరు? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ను నడుపుతున్నది కేసీఆరే అన్నారు అర్వింద్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నడు.. రేపు కాంగ్రెస్ టిక్కెట్లు కూడా కేసీఆరే ఇస్తడు అంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఫార్టీ గాంధీ భవన్ నుండి నడవడం లేదు.. ప్రగతి భవన్ నుండి కేసీఆర్ నడిపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన పనులకు దిగజారుతున్నారని... చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి బతుకు ఎందుకో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఒక ఉపఎన్నికలో గెలవడానికి బలుపెక్కి, బరితెగించి, నీచాలకు దిగజారారని మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న పనులకు ఆయనను ప్రజలు చీదరించుకుంటున్నారని... అయినా ముఖ్యమంత్రికి సిగ్గు రావడం లేదని అన్నారు. హుజూరాబాద్ లో కోట్లు ఖర్చు చేస్తున్నారని, కేసుల మీద కేసులు పెడుతున్నారని సంజయ్ అన్నారు. బీజేపీ జెండా కనిపిస్తే వణికిపోతున్నారని చెప్పారు. బీజేపీకి అనుకూలంగా రోజురోజుకూ సర్వే రిపోర్టులు పెరిగిపోతున్నాయని, దీంతో కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు.    ఇంతకాలం రేవంత్ రెడ్డి తమపై ఆరోపణలు చేస్తున్నా స్పందించని తెలంగాణ కమలనాధులు.. సడెన్ గా వాయిస్ పెంచడం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలన్న హైకమాండ్ డైరెక్షన్ లోనే భాగంగానే అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. 

స్కీంల పేరుతో రాబంధుల మాయ! గల్లా పట్టి లాగుదామన్న ప్రవీణ్ కుమార్..

ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్ కార్యాచరణపై మరింత క్లారిటీ ఇచ్చారు. తాను కొత్త పార్టీ పెడాతానా లేక ఇప్పుడున్న పార్టీల్ల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతానా అన్న దానిపై పరోక్ష సంకేతం ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో బహుజన సదస్సులో మాట్లాడిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. మీ సత్తా ఏంటో ఆగస్టు 8న చూపించండి అంటూ బహుజనులకు పిలుపిచ్చారు.  గల్లీ గల్లీన సెలబ్రేట్ చేసుకోండని చెప్పారు. దీంతో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు ఆగస్టు8న ప్రవీణ్ కుమార్ పార్టీ ఏంటదన్నది తేలిపోనుందని స్పష్టమైంది. కరీంనగర్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాము కరీంనగర్ కు వచ్చింది అబద్ధం ప్రచారాలు చేయడానికి కాదన్నారు. యావత్ తెలంగాణకు గుండె చప్పుడు వినిపించడానికి వచ్చామని చెప్పారు. సభకు వస్తున్న కొందరిని అరెస్ట్ చేశారన్న ప్రవీణ్ కుమార్.. తాము  చట్టాన్ని అతిక్రమించినమా? కల్లోలం సృష్టించామా? అని ప్రశ్నించారు. తామేమైనా అక్రమంగా ప్రాజెక్టుల్లో డబ్బులు సంపాదించామా? అంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఫామ్ హౌస్ లు కట్టుకున్నామా? అంటూ నిలదీశారు. ఆ డబ్బులతో మేమేమన్నా ఓట్లు కొనుక్కుంటున్నామా? అని ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  బహుజన రాజ్యం తెచ్చుకోవడానికి వచ్చామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను రిటైర్డ్ మెంట్ అయిన రోజునే ఎక్కడైతే ఎస్పీగా పనిచేసినో అదే కరీంనగర్ లోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ఒక్క ప్రవీణ్ కుమార్ రిజైన్ చేస్తేనే ఇంతగా చేస్తున్నారు.. రేపు నా బిడ్డలు ప్రతి గ్రామం నుంచి వేలాది మంది ప్రవీణ్ కుమార్ లు వస్తారంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.  అసత్యాలను, సత్యాలుగా ప్రచారం చేసే వ్యవస్థ లేకపోయినా..  ఒక్కొక్కరు అగ్నికణమవుతూ మూడు కోట్ల మంది ప్రవీణ్ కుమార్ లు వస్తారన్నారు. తాను ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు ఎంతో పేదరికంలో ఉన్నారో.. ఇప్పుడు అదే పేదరికంలో ఉన్నారన్నారు ప్రవీణ్ కుమార్. 50 ఏళ్ల మీ మేనిఫెస్టోలు ఎక్కడ పోయాయి.. పేదల బతుకుల్లో ఎందుకు మార్పురాలేదని ప్రశ్నించారు.  బహుజన రాజ్యం వస్తేనే  పేదల కన్నీళ్లు ఆగుతాయన్నారు ప్రవీణ్ కుమార్. ఆ రాజ్యం తామే సృష్టించుకుంటామని.. ఇవ్వకపోతే గల్లాపట్టి లాక్కుంటామన్నారు. ఉపాధిహామీ పథకంలో ఉద్యోగాలు కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లంటా బహుజనులేనన్నారు. దళిత సాధికారత అంటున్న కేసీఆర్ కు.. ఉద్యోగాలు పోయాక సాధికారిత ఎక్కడుందని తెలియదా అని నిలదీశారు. వందల స్కీంలతో బహుజన రాజ్యం రాకుండా చేసే రాబంధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపిచ్చారు. మన దగ్గరకొచ్చి కడుపులో తలపెడతారు.. మీకు స్కీంల ఆశలు చూపితే అమ్ముడు పోతారా? అంటూ ప్రశ్నించారు. కొత్త ప్రపంచం సృష్టించేదాకా విశ్రమించొద్దన్నారు. నాయకుల మాటలు విని అమ్ముడుపోవద్దని సూచించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చట్టబద్ధంగా, శాంతియుతంగా బహుజన రాజ్యం కోసం పోరాడుతామని తెలిపారు.  

హైకోర్టులో దేవినేని బెయిల్ పిటిషన్.. కడిగిన ముత్యంలా వస్తారన్న చంద్రబాబు 

మాజీమంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే ఉమాను కక్షపూరితంగా అరెస్ట్ చేశారని అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన ఉమా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చంద్రబాబు అన్నారు.   కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్‌ చూసివస్తున్న దేవినేని కారుపై వైసీపీ  కార్యకర్తలు మంగళవారం దాడి చేయగా.. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు ఆయన్నే నిందితుడిగా చేర్చారు. పైగా  హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఉమ సహా 18 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఆయన్ను మాత్రమే అరెస్టు చేశారు. వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పుతూ.. చివరకు బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మైలవరం సివిల్‌ జూనియర్‌ జడ్జి కోర్టు ముందు హాజరుపరిచారు. నూజివీడు, గన్నవరం సబ్‌జైళ్లు ఖైదీలతో నిండిపోవడంతో చివరకు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో మాజీమంత్రి దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులను పోలీసులు మోపారు. ఈ సెక్షన్లకు ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు. ఉమాపైనే దాడి చేసి ఆయనపైనే కేసులు నమోదుచేయటంపై అభ్యంతరం తెలిపారు. పలు సాంకేతిక ఆధారాలను న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం అడ్మిట్ చేసుకుంది. రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు గుంటుపల్లి వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ డ్రైవర్‌ దాసరి సురేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు ఉమా, మరో 17 మందిపై 18 సెక్షన్లు.. ఐపీసీ 109, 120బి, 147, 148, 149, 188, 307, 323, 324, 332, 341, 353, 427, 506 ఐపీసీ 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌), 3(2)(వి), ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్‌, 3 ఈడీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీకి చెందిన ఆరుగురిపైనా కేసులు పెట్టామని చెబుతున్నప్పటికీ.. వారి పేర్లను వెల్లడించలేదు. 

ఆక‌లి చావుల త‌ర‌ఫున‌.. ష‌ర్మిల ఆర్బాట‌పు దీక్ష‌లా?

వాళ్లు ఆక‌లితో అల‌మ‌టించారు. వాళ్లు ఉద్యోగం కోసం ఏళ్ల పాటు ఎదురుచూశారు. క‌ష్టాలు పెరుగుతున్నాయి. కన్నీళ్లు ఇంకుతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు మాత్రం రావ‌టం లేదు. నియామ‌కాల కోసం కొట్లాడి సాధించుకున్న‌ తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు ఆక‌లి చావులే మిగిలాయి. ఇక త‌మ వ‌ళ్ల కాదంటూ.. ఇక సెల‌వంటూ ప‌లువులు విద్యావంతులు ప్రాణాలు వ‌దులుతూ తెలంగాణ త‌ల్లికి క‌డుపుకోత క‌లిగిస్తున్నారు.  బంగారు తెలంగాణ‌లో నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల పోరుబాట ప‌ట్టారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న తెలుపుతున్నారు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం దీక్ష‌కు దిగుతున్నారు. ఒక్కో వారం ఒక్కో ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తున్నారు. వారిని ఓదారుస్తున్నారు. అక్క‌డే ఒక్క‌రోజు దీక్ష చేప‌ట్టి స‌ర్కారుకు నిర‌స‌న జ్వాల‌ తాకేలా చేస్తున్నారు. కొన్ని వారాలుగా సాగుతోంది ష‌ర్మిల నిరుద్యోగ దీక్ష‌. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఆయా కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డం.. ఓదార్చ‌డం వ‌ర‌కూ ఓకే. కానీ, ఆమె దీక్ష చేస్తున్న విధాన‌మే అదోలా ఉందంటున్నారు. శిథిల‌మైన‌ ఇండ్లు.. చితికిన బ‌తుకులు.. ఆక‌లి మంట‌లు వాళ్ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైతే.. ష‌ర్మిల వాళ్ల ఇళ్ల ద‌గ్గ‌రే ల‌గ్జ‌రీగా దీక్ష‌లు చేస్తుండ‌టాన్ని త‌ప్పుబ‌డుతున్నారు కొంద‌రు. అట్ట‌హాసంగా దీక్షా శిబిరం వేసుకొని.. మందీమార్బ‌లం పోగేసుకొని.. బాడీగార్డుల‌ను వెంటేసుకొని.. అదేదో ప్రైవేట్ ఈవెంట్‌లా.. క్లాస్‌గా, కాస్ట్‌లీగా దీక్ష‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ష‌ర్మిల‌ దీక్షల‌పై సోష‌ల్ మీడియాలో మ‌రింత కామెంట్లు వినిపిస్తున్నాయి. దీక్ష అంటే ఏదో ఒక టెంటు వేసుకొని.. కింద ఓ కార్పెట్ ప‌రుచుకొని.. సింపుల్‌గా దీక్ష కానిచ్చేస్తుంటారు. ఇన్నాళ్లూ తెలంగాణ ప్ర‌జ‌లు అలాంటి దీక్ష‌లే చూశారు. వాటికే అల‌వాటుప‌డ్డారు. కానీ, ష‌ర్మిల రాక‌తో దీక్ష‌ల్లోనూ రిచ్‌నెస్ చూపించ‌వ‌చ్చ‌ని అనిపిస్తోందని అంటున్నారు. ఎన్ని ల‌క్ష‌లు పెట్టి కొన్నారో.. అత్యంత మందంగా ఉండే స్పింగ్ కాయిల్ ప‌రుపుపై మేడ‌మ్ ఆసీనుల‌వుతున్నారు. ఆ ప‌రుపు మ‌ధ్య‌లో దిండ్ల‌తో మ‌రో సింహాస‌నం లాంటి సెట‌ప్‌. రెండు చేతులు ఆనించేందుకు రౌండ్ పిల్లోస్‌.. వెన‌క్కి ఒరిగేందుకు నాలుగైదు మెత్త‌ని దిండ్లు.. చిక్క‌ని నీడ‌.. చ‌క్క‌ని గాలివీచే ఏర్పాట్లతో.. ల‌గ్జ‌రీగా దీక్షాశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విలాస‌వంత‌మైన సెట‌ప్‌ను.. ఆ గ్రామ‌స్తులు క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారు. ఇంత కులాస‌వంత‌మైన‌ దీక్షావేదిక‌పై దొర‌సానిలా కూర్చొని.. కేసీఆర్ దొర‌త‌నం గురించి ప్ర‌శ్నిస్తే.. ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకుంటారా?   ఇదంతా అన్న జ‌గ‌న‌న్న నుంచి కాపీ కొట్టిన స్టైల్‌. కొల్ల‌గొట్టిన వేల కోట్ల అవినీతి సొమ్ముతో.. ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ సైతం ఇలాంటి ఖ‌రీదైన దీక్ష‌లే చేసేవారని గుర్తు చేస్తున్నారు. అట్ట‌హాసంగా దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి.. డ‌బ్బులిచ్చి జ‌నాల‌ను త‌ర‌లించి.. జెండాల‌తో, మైకుల‌తో హోరెత్తించేవారని అంటారు. అచ్చం.. అన్న అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ.. చెల్లెమ్మ ష‌ర్మిల‌మ్మ కూడా అలాంటి ల‌గ్జ‌రీ దీక్ష‌లే చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే.. అది ఆంధ్ర‌. అక్క‌డ అలాంటివి ఆమోదిస్తారేమో కానీ.. పేద‌రికం ఆన‌వాళ్లు అధికంగా ఉండే తెలంగాణ‌లో ఇలాంటి ఫోజులు కొడితే ష‌ర్మిల రాజ‌కీయ‌ సినిమా స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌చ్చు. దీక్ష‌లు అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యే అవ‌కాశ‌మూ ఉంది. తెలంగాణ కోడ‌లిన‌ని వాదిస్తే స‌రిపోదు.. ముందు తెలంగాణ మ‌ట్టి వాస‌న గ్ర‌హించాల‌ని.. చెమ‌ట ప‌ట్టిన బ‌తుకుల‌ను అర్థం చేసుకోవాల‌ని.. కొత్త‌గా వ‌చ్చిన పాత కోడ‌లికి సూచిస్తున్నారు అస‌లైన తెలంగాణ‌వాదులు. ఇందిరాపార్కు ద‌గ్గ‌ర ఉన్న దీక్షా స్థ‌ల్‌ని ఆద‌ర్శంగా తీసుకొని.. లోట‌స్ పాండ్ పోక‌డ‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయేలా దీక్ష‌లు చేస్తేనే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని.. లేదంటే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు