పెద్దలు చెబితే వినరా? జగన్ తో ఏపీకి జల గండమా?

ఆవేశం అజ్ఞానానికి, అజ్ఞానం అవివేకానికి, అవివేకం అనర్థానికి దారి తీస్తుందని గీతాచార్యుడు ఏనాడో చెప్పి ఉన్నాడు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు పాటిస్తున్నవాళ్లు జీవిత పోరాటంలో అనేక  విజయాలు నమోదు చేస్తున్నారు. పెడచెవిన పెట్టినవారు అపకీర్తి అనే పాతాళానికి దిగజారిపోతున్నారు. తాజాగా జగన్ సర్కారు తీసుకున్న దుందుడుకు నిర్ణయం కూడా అలాంటిదేనంటున్నారు రాజకీయ నిపుణులు.  కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కారుకు... సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి సూచించిన హిత వచనాలు కూడా రుచించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆప్తుడైన జస్టిస్ ఎన్వీ రమణ.. రెండు రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని ఆలోచించి.. ఈ సమస్యకు న్యాయపరమైన పరిష్కారం కన్నా కూర్చుండి చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదని సూచించారు. అవసరమైతే మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని కూడా ఆయన అన్నారు. ఒకవేళ న్యాయ పరమైన పరిష్కారమే కావాలనుకుంటే వేరే ధర్మాసనానికి కేసు బదిలీ చేస్తానని కూడా సీజేఐ జస్టిస్ రమణ చెప్పారు. ఇదంతా దేన్ని సూచిస్తుంది? సమస్యలో మిళితమై ఉన్న సెంటిమెంట్లు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్న అభిలాష మేరకే రమణ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా దశాబ్దాల తరబడి రెండు ప్రాంతాల రైతుల మధ్య అపనమ్మకాలు రాజేసిన ఇలాంటి జీవజలాల సమస్యను సహృదయ వాతావరణంలో కూర్చుండి మాట్లాడుకోవడం కన్నా మేలైన పరిష్కారం ఉండదని నిపుణులంతా చెబుతున్నారు. ఇలా చేస్తే పరిష్కారం కూడా త్వరగా తేలిపోతుందన్న విషయం కూడా జగమెరిగిన సత్యమే.  కానీ జగన్ మాత్రం మొండిగా న్యాయపోరాటానికే ఓటేయడం అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు తావిస్తోంది. ఎన్వీ రమణ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పట్ల ఎంతో నమ్మకాన్ని, గౌరవాన్ని కనబరచారు. వారిద్దరి కలయికలోనే ఈ సమస్యకు ఓ మంచి సొల్యూషన్ రావడానికి బీజం పడిందని భావిస్తున్నారు. అయితే జస్టిస్ రమణ సూచించిన పారదర్శకమైన సూచనను జగన్ పట్టించుకోకపోవడం ఆయనలోని మొండివైఖరికి నిదర్శనమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర సర్కారు కూడా సీజేఐ ధర్మాసనమే విచారించాలని కోరడాన్ని గమనించాలి. అయినప్పటికీ కేంద్రానికి కూడా రమణ ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని చెప్పడం ఆయనలోని స్వచ్ఛతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యాయరంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తే న్యాయపరమైన పరిష్కారం కాకుండా మధ్యవర్తిత్వమే మంచిదని చెప్పిన మాటలను జగన్ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తెలివైన పని కాదంటున్నారు జలరంగ నిపుణులు. న్యాయపరమైన విచారణ వల్ల ఏళ్లపాటు విచారణ సాగుతుందని, నీటిపంపకాల విషయంలో పెనవేసుకొని ఉన్న అనేక టెక్నికల్ అంశాల కారణంగా సమస్య కొలిక్కి రావడం అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి అసలు జగన్ కు సమస్య పట్ల చిత్తశుద్ధే లేదని, ఏపీలో జగన్ పరపతి అడుగంటుతున్న క్రమంలో వ్యక్తిగత రాజకీయాల కోసమే రెండు ప్రాంతాల మధ్య గల సున్నితమైన సమస్యను కెలుకుతున్నారని, ఈ వైఖరి వల్ల భవిష్యత్తులో ఏపీకి ఏవిధంగా లాభం జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ తెలిసితెలిసీ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

రఘువీరా రీ ఎంట్రీ నిజమేనా? ఆయనతో టచ్ లో ఉన్నదెవరు? 

ఒక వెలుగు వెలిగిన సీనీ తారలు ఫేడ్ అవుట్  అయి కొంత కాలం తెర చాటున ఉండిపోవడం, ఆ తర్వాత  మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేయడం సినిమా లోకానికి తెలిసిన విషయమే. అలాగే ఇతర రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన లేదా పదవీ విరమణ చేసిన అధికారులు ఇతర రంగాలవైపు, ముఖ్యంగా రాజకీయాలా వైపు రావడం సహజం. నిన్న మొన్ననే, ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తమ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. త్వరలోనే ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు.  సహజంగా రాజకీయ నాయకులకు అలాంటి, అవసరం, అవకాశం రెండూ ఉండవు. ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. జీవిత చరమాంకమ వరకు రాజకీయ నాయకులు రాజకీయాలే సర్వస్వంగా బతికేస్తుంటారు. అయితే, అప్పుడు అడప్పుడు కొందరు ఒక వయసు దాటిన తర్వాత ఇక రాజకీయాలు చాలని  స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పు కుంటారు. మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్ 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాత స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మధ్య ప్రదేశ్  లో అత్యంత వెనకబడిన గోండ్వా ప్రాంతంలో  అంత్యోదయ స్పూర్తితో ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థ ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 60 నిండిన తర్వాత అధికార పదవుల నుంచి తప్పు కుంటానని ప్రకటించారు కానీ, ఆయనకు ఆ అవకాశం రాలేదు. 60 ఏళ్ళు నిండకుండానే అయన 2009 లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఒకే సారి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్వేల్ మాజీ  ఎమ్మెల్యే, వైఎస్ ఆప్త మిత్రుడు డాక్టర్ శివరామ కృష్ణా రావు, ఆద్యాత్మిక జీవితంపై మక్కువ పెంచుకుని ఈ సంవత్సరం (2021) ఏప్రిల్ 2 వతేదీన రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా నిజ సన్యాసం స్వీకరించారు. స్వామి శివరామ సరస్వతి గా మారి పోయారు.   అసలు విషయం ఏమంటే, వైఎస్ మంత్రివర్గంలోనే కాకుండా ఆ తర్వాత అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన, రఘువీరా రెడ్డి, చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన, అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పూర్తిగా చచ్చుపడి పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు.ఆశించిన ఫలితం రానందుకో, ఇంకేందుకో ఆయన,2019లో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఆకక్ది నుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ నిర్మాణానికి నడుం బిగించి, దిగ్విజయంగ ఆలయ నిర్మాణం  పూర్తి చేశారు. కొద్ది రోజుల క్రితం ఆలయ నిర్మాణం పూర్తయింది. జూన్ నెలలో విగ్రహ ప్రతిష్ట ఇతర కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయ రీఎంట్రీ గురించి, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఓ వంక కాంగ్రెస్ నాయకులు రఘువీరతో టచ్ లోకి  వచ్చారు. ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వస్తున్నట్లు సమాచారం. మరో వంక దేవాలయ పున్నః నిర్మాణ పవిత్ర కార్యాన్ని పూర్తిచేసిన రఘువీరను, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభినందించారు. అలాగే జేసీ సోదరుడు, తాడిపత్రి టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి స్వయంగా రఘువీరాను కలిసి,  రాయలసీమ నీటి హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని సూచించారు. అయితే రఘువీర ఎలానూ స్పందించలేదు. మౌనంగా ఉండి పోయారని సమాచారం. ఆయన మనసులో ఏముందో ... ఆయన ఏలాంటి నిర్ణయం తెసుకుంటారో .. చూడవలసి వుంది. ప్రస్తుతానికి అయితే రఘువీర ఒక విధంగా తమ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని మరిచిపోయి, టీవీఎస్ 50 ద్విచక్రవాహనం మీద తిరుగుతూ .. రచ్చబండ రాజకీయాలకు పరిమితం అయ్యారు.  రేపు ఏమవుతుందో ..?

తెలంగాణ రాజధానిగా వరంగల్? హైదరాబాద్ యూటీ కాబోతోందా..? 

హైదరాబాద్.. తెలంగాణ రాజధాని. దేశంలో టాప్ ఐదు నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గత సంవత్సరం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా హైదరాబాద్ కు సంబంధించి కీలక అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. కొంత కాలంగా టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు మల్లన్న. వరంగల్ లో జరిగిన సభలో ఆయన  డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ విస్తరించడం వల్ల జనాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని.. అందుకే వరంగల్ ను రాష్ట్రానికి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు బీజేపీ నేతలు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని చెబుతుండటం.. ఇటు తెలంగాణకు వరంగల్ రాజధాని చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం చర్చగా మారాయి. రాష్ట్రంలో త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారు మల్లన్న. కొత్త పార్టీ కూడా పెడతారనే ప్రచారం ఉంది. అంతేకాదు తీన్మార్ మల్లన్నకు బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ ను తెలంగాణ రాజధానిగా చేయాలని ఆయన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మల్లన్న  పబ్లిసిటీ కోసమే ఇలా అన్నారా లేక హైదరాబాద్ పై ఆయనకు ఇతరత్రా ఏమైనా సమచారం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీనిపై గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పటి కేంద్ర సర్కార్ అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేండ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 వరకు ఇది వర్తించనుంది. ఇటీవల కోవిడ్ రోగులతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఆ సమయంలో హైదరాబాద్ కు మాకు హక్కులున్నాయని కొందరు ఏపీ నేతలు గట్టిగానే మాట్లాడారు. ఏపీకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాయని చెబుతున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి దేశానికి రెండో రాజధానిగా చేసే యోచనలో ఉందంటున్నారు. హైదరాబాద్ ను యూటీగా చేస్తే తెలంగాణ నేతల నుంచి వ్యతిరేకత వస్తుంది కాని..దేశానికి రెండో రాజధానిగా చేస్తే అలాంటి సమస్య ఉండబోదని కేంద్రం పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఓ జాతీయా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కూడా దేశానికి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అయితే తమకు సంతోషమేనని చెప్పారు. అందుకే ఈ దిశగా కేంద్ర సర్కార్ సీరియస్ గానే కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. అలా చేస్తే తెలంగాణ, ఏపీలోనూ తమకు లాభిస్తుందనే అంచనాలో కమలం నేతలు ఉన్నారని అంటున్నారు.  మొత్తానికి బీజేపీకి అనుకూలంగా ఉంటారనే ప్రచారం ఉన్న తీన్మార్ మల్లన్న.. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రాజధాని చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మల్లన్న ప్రకటన ఆషామాషీగా వచ్చిందేమి కాదని, దీని వెనుక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. చూడాలి మరీ.. ముందు ముందు ఏం జరగనుందో... 

కేసీఆర్ డిన్న‌ర్ పాలిటిక్స్‌.. దావ‌త్‌ల వెనుక రీజ‌న్‌ అదేనా?

మటన్.. తలకాయ కూర.. బొటీ.. నాటుకోడి కర్రీ.. చికెన్ ఫ్రై.. చేపల కర్రీ.. ఫిష్ రోస్ట్‌.. పప్పు.. సాంబార్.. పెరుగు.. గారెలు.. స్వీటు. టేబుల్‌పై అన్ని రకాల వెరైటీస్‌. ఘుమ‌ఘుమ‌లాడుతున్నాయి. నోరూరిస్తున్నాయి. త‌న వ‌య‌సును, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను అన్నిటినీ ప‌క్క‌న పెట్టేశారు. ఏ ఒక్క వెరైటీ వ‌ద‌ల‌కుండా అన్నిటినీ టేస్ట్ చూశారు. తృప్తిగా, క‌డుపు నిండుగా విందు ఆర‌గించారు. ఇదీ కేసీఆర్ భోజ‌నం. తాజాగా నాగార్జున‌సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యే భ‌గ‌త్ ఇంట్లో సీఎం కేసీఆర్ స్వీక‌రించిన ఆతిథ్యం.   కేసీఆర్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంతా క‌లిసి టేబుల్‌పై భోజ‌నం చేశారు. ఎమ్మెల్యే భగత్ స్వయంగా వడ్డిస్తుంటే.. తమతో కలిసి కూర్చొని తినాలని ప‌ట్టుబ‌ట్టారట‌ కేసీఆర్. భగత్ సతీమణి భవానీ సీఎం కేసీఆర్‌కు ద‌గ్గ‌రుండి వంట‌ల‌న్నీ కొస‌రికొస‌రి వ‌డ్డించ‌గా.. ఆయ‌న వ‌ద్ద‌న‌కుండా, అస్స‌లు మొహ‌మాట ప‌డ‌కుండా అన్నిటినీ లాగించేశార‌ట‌. ఐట‌మ్స్ అన్నింటిని రుచి చూసిన ఆయన.. వంటలు బాగున్నాయని ప్రశంసించారు కూడా. సీఎం కేసీఆర్ కాంప్లిమెంట్స్‌తో ఎమ్మెల్యే భగత్ కుటుంబం ఫుల్ ఖుషీ.  స‌రిగ్గా.. ఇలాంటి స్ట్రాట‌జీనే కేసీఆర్ ప‌దే ప‌దే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ఎవ‌రొచ్చినా.. కేసీఆర్ ఏ ఊరికి వెళ్లినా.. భోజ‌నంతో క‌ట్టిప‌డేస్తారు. స్వ‌త‌హాగా భోజ‌న‌ప్రియుడైన కేసీఆర్‌.. మిగ‌తా వారినీ త‌న భోజ‌నంతో, ఆతిథ్యంతో ఆక‌ట్టుకుంటారు.  కేసీఆర్ చేసేవ‌న్నీ డిన్న‌ర్ పాలిటిక్సే అంటారు. ఎంత‌టి కీల‌క‌మైన రాజ‌కీయ సమావేశ‌మైనా.. భోజ‌నం బ్రేక్ ఉండాల్సిందే. ఎంత పెద్ద ప్ర‌ముఖులైనా.. ఎంత చిన్న కార్మికులైనా.. వారితో క‌లిసి భోజ‌నం చేయాల్సిందే.  ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మీటింగ్ అంటే అధికారుల‌కు సంబ‌ర‌మేన‌ట‌. సీఎం ర‌మ్మ‌న్నారంటే ప‌లువురు ప్ర‌ముఖులు, వివిధ వ‌ర్గాల నాయ‌కులు ఎగిరిగంతేస్తార‌ట‌. చెవుల్లో అమృతం పోసే మాట‌ల‌తో పాటు, జోకులు, సెటైర్లతో, అద్భుత‌మైన ప్ర‌సంగాల‌తో.. వ‌చ్చిన వారెవ్వ‌రికీ విసుగెత్త‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి కేసీఆర్‌ ఒక్క‌రే మాట్లాడుతుంటారు. ఏ స‌మీక్ష అయినా, ఏ మీటింగ్ అయినా.. దాదాపు రోజంతా ఉంటుంది. మ‌ధ్య‌లో లంచ్ బ్రేక్ త‌ప్ప‌నిస‌రి. ఆ గంటసేపు మ‌రింత మ‌జా మ‌జా. కేసీఆర్ పెట్టే లంచ్‌.. ఓ రేంజ్‌లో ఉంటుంద‌ట‌. తిన్న వాళ్లు రెండు మూడు రోజులు ఆ రుచి మ‌రిచిపోర‌ట‌. అంత బాగుంటుంద‌ట కేసీఆర్ ఆతిథ్యం.  అలాంటి ఆతిథ్యాన్నే తన ప‌ర్య‌ట‌న‌ల్లోనూ పాటిస్తార‌ట‌. మీ ఊరికి వ‌స్తా.. గ్రామ స‌మ‌స్య‌ల‌న్నీ తీరుస్తా.. మంచిగా మాట్లాడుకుందా.. అక్క‌డే క‌లిసి తిందాం.. దావ‌త్ చేసుకుందాం.. ఇలా సాగుతుంది కేసీఆర్ ద‌త్త‌త‌ గ్రామాల ప‌ర్య‌ట‌న‌. అది వాసాల‌మ‌ర్రి అయినా, చిన్న‌ముల్క‌నూర్‌, మూడుచింత‌ల‌ప‌ల్లి అయినా.. కేసీఆర్ వ‌చ్చిండ్రంటే.. దావ‌త్ ఉండాల్సిందే. ఎండ త‌గ‌ల‌కుండా మంచి షామియానాలు వేసి.. టేబుళ్లు ప‌రిచి, కుర్చీలు వేసి.. వంద‌లాది మందికి వేడివేడిగా భోజ‌నం వ‌డ్డిస్తారు. వారితో పాటే క‌లిసి కూర్చొని కేసీఆర్ సైతం అక్క‌డే భోంచేస్తారు. క‌డుపునిండా తృప్తిగా భోజ‌నంతో పాటు.. తాము కేసీఆర్‌తో క‌లిసి తిన్నామ‌నే జ్ఞాప‌కం సైతం వారికి క‌ల‌కాలం ఉండిపోతుంది. ఇక అన్నంపెట్టిన‌వాడిని, త‌మ‌తో క‌లిసి తిన్న‌వాడిని.. జ‌నాలు అంత ఈజీగా ఎలా మ‌ర్చిపోగ‌లుగుతారు.  ఇక కేసీఆర్ ఎప్పుడు వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చినా.. కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంట్లోనే విడిది చేస్తారు. అక్క‌డే భోజ‌నం చేస్తారు. ఉద్య‌మ‌కాలం నుంచి ఇదే అల‌వాటు, సెంటిమెంటు కూడా. ఆ ఇంటి భోజ‌నం అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఆ రుచి మ‌రిచిపోలేకే.. ఎప్పుడొచ్చినా అక్క‌డే దిగుతార‌ని అంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్ వ‌రంగ‌ల్‌కు ఓ వంద‌సార్లు వ‌చ్చార‌ని అనుకుంటే.. అందులో 99సార్లు కెప్టెన్ ఇంట్లోనే బ‌స‌. కానీ, ఆశ్చ‌ర్యంగా ఇటీవ‌ల మాత్రం క‌డియం శ్రీహ‌రి ఇంట్లో విందు ఆర‌గించారు ముఖ్య‌మంత్రి. బ‌హుషా, ఎమ్మెల్సీలేక‌, స‌రైన గుర్తింపులేక‌ అసంతృప్తితో ఉన్న క‌డియం.. కారు దిగి పారిపోకుండా ఉండేందుకు కాబోలు.. అలా ఆయ‌న ఇంట్లో విందు రాజ‌కీయం నెర‌పార‌ని అంటారు. ఇలా, భోజ‌నాన్ని జిహ్వ చాప‌ల్యానికి, రాజ‌కీయానికీ వాడుకునే స‌మ‌ర్థుడు కేసీఆర్‌. 67 ఏళ్లు వ‌చ్చినా.. అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా.. భోజ‌నం విష‌యంలో మాత్రం కాంప్ర‌మైజ్ కార‌ట కేసీఆర్‌. ఇష్టంగా తింటార‌ని.. రుచిగా ఉంటే అడిగి మరీ వడ్డించుకోవడానికి ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌ర‌ని అంటారు. ప‌సందైన విందులో.. దావాత్‌ల‌లో.. డిన్న‌ర్ పాలిటిక్స్‌లో కేసీఆర్‌ను మించినోడు లేడంటారు.   

ఇంత నిర్లక్ష్యమా.. కోర్టులంటే లెక్కలేదా?  జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో వరుసగా జగన్ రెడ్డి సర్కార్ కు కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులపైనా ధర్మాసనం సీరియస్ అయింది. కొందరికి శిక్షలు కూడా వేసింది. అయినా సర్కార్ లాగే అధికారులు కూడా నిర్లక్ష్యం వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఓ కేసు విచారణలో భాగంగా జగన్ ప్రభుత్వంతో పాటు అధికారుల తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చివాట్లు పెడుతూ ఘాటు వ్యాఖ్యలతో  హెచ్చరికలు జారీ చేసింది.  ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని రాష్ట్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలియదా? అంటూ నిలదీసింది. బిల్లులపై విజిలెన్స్ విచారణలో తేలిన అంశాలు ఏమిటని ప్రభుత్వ ప్రతినిధులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఉపాధి హామీ పనుల బిల్లులకు సంబంధించి కోర్టు అడిగిన మేరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సమాధానం ఇవ్వలేకపోయారు.దాంతో హైకోర్టు ధర్మాసనం మరింత అసహనానికి లోనైంది. విచారణలో ఉన్న అంశాలపై తగినంత సమాచారం లేకుండా ఎలా వస్తారని మొట్టికాయలు వేసింది.విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రాకపోవడంపైనా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.  వాదనల సందర్భంగా  ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇప్పటిదాకా రూ.413 కోట్లు చెల్లించామని, మరో 4 వారాల్లో రూ.1.117 కోట్లు చెల్లిస్తామని తెలిపారు.అయితే ప్రభుత్వం బిల్లుల కోసం చెల్లించింది రూ.40 కోట్లేనని  పిటిషర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఏ గ్రామ పంచాయతీకి ఎంత చెల్లించారో వివరాలతో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.  

రోడ్డు ప్రమాదాల్లో అందరూ సేఫయ్యేలా కొత్త రూల్..

రోడ్డు ప్రమాదం జరిగితే ఇప్పుడెవరి ప్రాణాలకూ గ్యారెంటీ ఉండటం లేదు. కార్లలోని ఫ్రంట్ సీట్లకు పనికొచ్చేలా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారణంగా డ్రైవర్ తో పాటు ఇవతలి వైపు కూర్చుండేవారికి మాత్రమే రక్షణ లభిస్తోంది. వాళ్లు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ గలుగుతున్నారు. ఇక మిగతావారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయి వారి బంధువులకు తీరని విషాదం మిగులుస్తున్నారు. ఎంతో మంది అనాథలుగా మారిపోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రాన్రానూ ఇదో సామాజిక సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు.  ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ యువతి బోనాల పండుగ కోసం వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని ఇంటికెళ్లే సమయంలో కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆ వేగానికి కారు నాలుగు పల్టీలు కట్టిన దృశ్యం షాకింగ్ గా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కారణంగా డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా.. వెనుకసీట్లో కూర్చున్న ఈ యువతి కారులోంచి బయటపడి స్పాట్ లోనే చనిపోయింది. ఇకపై అలాంటి కష్టాలకు చెక్ పడబోతోంది. కేంద్ర రోడ్ రవాణా, స్పోర్ట్స్ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో ఈ ప్రమాదాలకు చెక్ పడబోతోంది. అన్ని ఫోర్ వీలర్ వాహన కంపెనీలు ఇకపై అన్ని సీట్లకూ ఎయిర్ బ్యాగ్స్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఫోర్ వీలర్స్ లో వెనుక ఎంతమంది కూర్చుంటారో అందరికీ కూడా సీట్ బెల్ట్స్ తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఫిక్స్ చేయాలని గడ్కరీ కోరడంతో వివిధ కంపెనీల యాజమాన్యాలు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం విశేషం. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ విచ్చుకొని శరీరం కారు బాడీకి తగలకుండా రక్షణగా ఉంటుంది. అయితే ప్రయాణికులు ఎయిర్ బ్యాగ్ వల్ల కూడా ఇంజ్యురీస్ కాకుండా సీట్ బెల్ట్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇప్పటికైతే రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారనే లెక్క మీద అంచనాలున్నాయి కానీ.. ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోయారనే విషయంలో లెక్కాపత్రం లేదు. మొత్తానికి ఈ చర్యతో వాహన ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు తగ్గుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  మరోవైపు  వాహన తయారీ సంస్థలు ఫ్లెక్సీ ఫ్యూయల్ వాడేలా ఇంజన్లు రూపొందించాలని కూడా గడ్కరీ కోరడం విశేషం. పెట్రోల్, డీజిల్ తో పాటు ఇథనాల్, గ్యాసోలిన్ వంటి ఇంధనాలు కూడా ఇంజిన్లు ఉపయోగించుకునేలా రూపొందించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. దీనివల్ల పెట్రో ఉత్పత్తుల దిగుమతి కోసం ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది. అయితే 2027 నాటికి ఇంజిన్లలో అలాంటి మార్పులు తేవడానికి సాధ్యమవుతుందని వాహన కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి.

పీకే ప్రసంగాలకు పవర్ కట్.. ఇదేం రాజకీయం సారూ! 

హుజూరాబాద్ లో గెలిచి తీరాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకోసం హడావుడిగా దళితబంధు స్కీముతో పాటు నాగార్జునసాగర్ వంటి నియోజకవర్గాలకు ఇదే అదునుగా వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇటీవలే రాజీనామా చేసి ఆ వెంటనే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు బెంగపడుతున్నాయి. దళిత-బహుజనవాదానికి కాన్షీరాం తాత్వికతను జోడించి కొత్త తరహాలో రోజుకో జిల్లాలో ప్రవీణ్ కుమార్ ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు. కేసీఆర్ మోసకారితనం, మాట మీద నిలకడ లేనితనం, కేసీఆర్  చేసే ఎలక్షన్ రాజకీయాల మీద పదునైన మాటల బాణాలు వదుల్తున్నారు. ఆయన ఉపన్యాసాల ప్రభావం యావత్ రాష్ట్రం మీద పడుతున్నా.. ఇప్పటికిప్పుడు హుజూరాబాద్ ఎన్నికలను కూడా గణనీయంగా ప్రభావితం చేసేలా ఉందన్న బెంగ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.  హుజూరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్.. తన ఉపన్యాసాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తాజాగా ప్రవీణ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. గత మూడు రోజులుగా జరుగుతున్న అన్ని సమావేశాల్లోనూ తాను మాట్లాడే సమయానికే పవర్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తను మాట్లాడకుంటా కరెంట్ కట్ చేస్తున్న పాలకులు.. రేపు తామే వారి పవర్ ను కట్ చేయబోతున్నామని ట్వీట్ చేస్తూ తాజా ఫొటోను కూడా జత చేశారు. పీకే ట్వీట్ కు ట్వీట్లు, రీట్వీట్లు పడిపోతున్నాయి. స్వేరో సైన్యంతో పాటు పీకే ఫ్యాన్స్ పెద్దఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు పవర్ కట్ చేయడం ఖాయమని కొందరు స్పందిస్తున్నారు. మరికొందరేమో.. పీకే అప్పుడే ఫక్తు పొలిటికల్ డ్రామాలు నేర్చుకున్నారని, తెలంగాణ పల్లెల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నడుస్తున్నాయని..  ఈ క్రమంలో పవర్ పోయుంటుంది తప్ప పీకేకు భయపడి కేసీఆరే తీయించినట్లు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు దేశంలో ఎక్కడా లేనట్టు తెలంగాణలో 24 గంటల పవర్, రైతులకు ఉచిత పవర్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకరిద్దరైతే... ఇలాంటి సమావేశాలు పెట్టుకున్నప్పుడు స్వయంగా ఓ జనరేటర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సార్.. అంటూ సూచిస్తున్నారు.  మొత్తానికి కరెంటు పోయిన రీజన్ ఏంటో తెలీదు గానీ.. ఈ అంశాన్ని ట్విట్టర్లో పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్న పీకే ఓట్లదృష్టిని మాత్రం పలువురు ప్రశంసిస్తున్నారు.

గంగుల‌కు ఈడీ షాక్‌.. రివేంజ్ పాలిటిక్స్‌? దూకుడు బండి..!

హుజురాబాద్ కేంద్రంగా రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఈట‌ల‌పై తెలంగాణ స‌ర్కారు భూఆక్ర‌మ‌ణ కేసులు పెడితే.. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు గ్రానైట్ అక్ర‌మ ర‌వాణాపై ఈడీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప‌రిధిలో ఈట‌ల‌పై టీఆర్ఎస్ త‌న ప‌వ‌ర్ ప్ర‌యోగిస్తే.. కేంద్ర ప‌రిధిలో గంగుల‌పై బీజేపీ ఈడీని ఉసిగొల్పింద‌ని అంటున్నారు. గంగుల కంపెనీల‌పై గ‌తంలో బండి సంజ‌య్ చేసిన ఫిర్యాదు కూడా కార‌ణమ‌ని తెలుస్తోంది. ఇలా రివేంజ్ పాలిటిక్స్‌తో తెలంగాణ రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. ఈట‌ల‌ను కారు నుంచి గెంటేయ‌డానికి అసైన్డ్ భూముల కేసును తెర‌పైకి తీసుకొచ్చింది కేసీఆర్ స‌ర్కారు. వెంట‌నే క‌మిటీ వేసి.. ఈట‌ల‌ను కేబినెట్ నుంచి వెళ్ల‌గొట్టి.. పార్టీ నుంచే వెళ్లిపోయేలా చేశారు. ఆనాటి నుంచి ఈట‌ల‌పై దాడికి మంత్రి గంగుల‌ను ముందుంచింది. రాజేంద‌ర్ బీజేపీలో చేరి.. టీఆర్ఎస్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తున్న‌ట్టున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఉండే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌-ఈడీ తాజాగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కంపెనీల‌కు నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  క‌రీంన‌గ‌ర్‌లో గ్రానైట్ అక్రమ రవాణపై ఈడీ కొరడా ఝులిపించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట మంత్రి గంగుల కమలాకర్‌‌కు ఊహించని షాక్ తగిలింది. మంత్రికి సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులిచ్చింది. గంగులకు చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులివ్వ‌డం రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్యేనంటున్నారు.  ఫెమా నిబంధనలు ఉల్లంగించారంటూ గంగుల‌పై.. గతంలో ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై తాజాగా ఈడీకి ఇద్ద‌రు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. తక్కువ పరిణామం చూపించి.. ఎక్కువ మొత్తంలో గ్రానైట్ ఎగుమతి చేసినట్టు కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదు మేర‌కు.. విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.  గనులశాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కవ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్టు ఈడీకి ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి ఆ మేర‌కు పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. లెక్క‌ల్లో చూపిస్తున్న దానికి విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్‌కు భారీ తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప‌క్కా స‌మాచారంతోనే ఈడీ రంగంలోకి దిగింద‌ని.. గంగుల క‌మ‌లాక‌ర్‌కు చెందిన గ్రానైట్ ర‌వాణా కంపెనీల‌కు నోటీసులు ఇచ్చార‌ని అంటున్నారు. కరీంనగర్ ప్రాంత‌ గ్రానైట్ అక్రమాలపై ఈడీతో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. త్వ‌ర‌లోనే ఈడీతో పాటు సీబీఐ కూడా రంగంలోకి దిగే అవకాలునట్టు తెలుస్తోంది. ఈట‌ల వ‌ర్సెస్ గంగుల మాత్ర‌మే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తోనూ గంగుల‌కు ఏళ్లుగా రాజ‌కీయ వైరం ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బండి సంజ‌య్‌.. గంగుల క‌మ‌లాక‌ర్ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఎంపీగా గెల‌వ‌డం, పార్టీ ప‌గ్గాలు చేతికి రావ‌డంతో బ‌ల‌వంతుడిగా మారిన బండి.. త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి గంగుల‌కు వ్య‌తిరేకంగా పావులు క‌ద‌ప‌డం స్టార్ట్ చేశారు. గ‌తంలోనే సంజ‌య్‌.. గంగుల గ్రానైట్ దందాపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. అందుకు కౌంట‌ర్‌గా బండి సంజ‌య్ గ్రానైట్ వ్యాపారుల నుంచి కోట్లు వ‌సూలు చేశారంటూ గంగుల వ‌ర్గం ఆరోపించింది. ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య ర‌చ్చ రగులుతుండ‌గానే.. ఈట‌ల ఎపిసోడ్ మొద‌ల‌వ‌డం.. రాజేంద‌ర్‌పైనా మంత్రి గంగుల దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఇక ఆల‌స్యం చేయ‌కుండా ఆయ‌న‌కు చెక్ పెట్టాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయ ప్రోద్బలం ఉందోలేదో తెలీదుకానీ(?).. క‌రీంన‌గ‌ర్‌-హుజురాబాద్ రాజ‌కీయం హాట్‌హాట్‌గా సాగుతున్న ఈ స‌మ‌యంలోనే గంగుల కంపెనీల‌కు ఈడీ నోటీసులు ఇవ్వ‌డం పొలిటిక‌ల్‌గా క‌ల‌క‌లం రాజేస్తోంది.   

కులాల వారీగా పదవులు, పంపకాలు! హుజురాబాద్ లో గులాబీ వ్యూహాలు..

హుజురాబాద్.. తెలంగాణలో ఇదే ఇప్పుడు సెంటర్ పాయింట్. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న కరీంనగర్ జిల్లా హజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీల మంత్రాంగంతా దానిపైనే ఉంది. పార్టీలే కాదు ప్రభుత్వ పాలన కూడా హుజురాబాద్ కేంద్రంగానే సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలన్ని ఉపఎన్నికకు ముడిపడే ఉంటున్నాయి.  2004 నుంచి హుజురాబాద్ లో గెలుస్తూ వస్తున్నారు ఈటల రాజేందర్. ఆరుసార్లు పోటీ చేయడంతో నియోజకవర్గం ఆయనకు కంచుకోటగా మారింది. అయితే ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈటల రాజేందర్.. ఈసారి మాత్రం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మరోసారి గెలిచి తన సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి తొలగించారనే సానుభూతి ప్రజల్లో ఈటలపై కనిపిస్తోంది. అటు ఈటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నిర్వహించిన సర్వేల్లో మాత్రం ఈటల వైపే మొగ్గు ఉందని తేలిందట. రెండు, మూడు సార్లు సర్వే చేసినా అదే ఫలితం రావడంతో  గులాబీ బాస్ కలవరపడుతున్నారట. అందుకే ఎలాగైనా గెలిచేందుకు సీఎం కేసీఆర్ అన్ని అస్త్రాలు బయటికి  తీస్తున్నారని అంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కులాల వారీగా లెక్కలు తీస్తూ పంపకాలకు దిగుతున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పథకాలతో తాయిలాలు ఇస్తున్నారు. పంపకాలే కాదు పదవుల్లోనూ కులాల వారీగా నియమిస్తూ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఇటీవల నామినేటెడ్ చేసిన పోస్టులన్ని హుజురాబాద్ కే దక్కాయి. ఇకపైనా దక్కబోతున్నాయని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని నామినేట్ చేయగా.. ఇటీవల కాంగ్రెస్ నుంచి కారెక్కిన హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డికి దక్కింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించగా.. అది కూడా హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్ కు దక్కింది. ప్రభుత్వ పథకాల అమలు కూడా హుజురాబాద్ కేంద్రంగానే  మొదలవుతున్నాయి.  హుజురాబాద్ నియోజకవర్గంలో  నాలుగు మండలాలు ఉండగా.. మొత్తం 2 లక్షల 29వేల పైచిలుకు ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు 64శాతం, ఎస్సీలు 20శాతం, ఓసీలు 10శాతం ఎస్టీలు 2శాతం, ఇతరులు 4శాతం ఉన్నారు. కులాల వారీగా, మాల మాదిగలు 45వేలు, కాపులు 29వేలు, పద్మశాలీలు 28వేలు, గౌడ, ముదిరాజ్‌లు 26 వేల చొప్పున, గొల్లకుర్మలు 25వేలు, రెడ్డీలు 22వేలు, ముస్లింలు 12వేలు, ఎస్టీలు 6500 ఓటర్లున్నారు. నియోజకవర్గంలో దళితుల ఓట్లు 45 వేలకు పైగా ఉన్నాయి. అందుకే వీళ్ల టార్గెట్ గానే దళిత బంధుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. దళిత బంధును పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు. ఈ స్కీం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం చేయనున్నారు. మొదట నియోజకవర్గానికి100 కుటుంబాలకే ఇవ్వాలని నిర్ణయించినా.. తర్వాత మార్చేశారు కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలకు మొత్తంఅందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 20 వేల కుటుంబాలకు సాయం చేయనున్నారట. ఈ లెక్కన 10 లక్షల రూపాయలు అందించి.. మాల మాదిగల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.  హుజురాబాద్ నియోజకవర్గంలో కాపుల ఓట్లు 29 వేలు ఉన్నాయి. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత కాపులంతా కమలానికి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ల ఓట్లపైనా ఫోకస్ చేసిన కేసీఆర్.. కాపు సామాజిక వర్గానికే చెందిన మంత్రి గంగుల కమలాకర్ ను నియోజకవర్గంలో తిప్పుతున్నారు. అంతేకాదు కాపు వర్గానికి చెందిన జమ్మికుంట మాజీ సర్పంచ్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొనగంటి మల్లయ్య పేరును టికెట్ కోసం పరిశీలిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఆయనకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని  కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. కాపుల్లో మంచి పట్టున్న మల్లయ్యతో ఆ ఓట్లకు గాలం వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 28 వేల పద్మశాలీ ఓటర్లున్నారు. ఇటీవల కారెక్కిన ఎల్ రమణతో వాళ్ల ఓట్లకు టెండర్ పెట్టారట. నియోజకవర్గానికి చెందిన పద్మశాలి వర్గానికి చెందిన నేత సరగం రవిని కూడా తన పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సరగం రవికి ప్రజల్లో మంచి పేరుంది. వీళ్లద్దరి ద్వారా పద్మశాలి ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు గులాబీ బాస్.  హుజురాబాద్ నియోజకవర్గంలో ముదిరాజులతో సమానంగా గొల్ల కుర్మల ఓట్లు దాదాపు 28 వేలు ఉన్నాయి. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని ఆలోచించడానికి ఇదే కారణమని తెలుస్తోంది. గెల్లుకు టికెట్ వస్తుందని లీకులు ఇస్తూ ఆ వర్గం మద్దతు కొట్టేయాలని చూస్తున్నారట కారు పార్టీ నేతలు. గెల్లుకు టికెట్ వచ్చినా .. రాకున్నా యాదవ ఓట్లు తమకే పడేలా.. మూడేండ్లుగా పెండింగులో ఉన్న గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇది కూడా తమకు కలిసివస్తుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గానికే చెందిన బీసీ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్‌కు బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓట్లను కౌశిక్ రెడ్డి కవర్ చేస్తారని భావిస్తున్నారు. ఆ కోణంలోనే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని అంటున్నారు. ఇక ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు.. ఎలాగు బీజేపీని ఓడించేందుకు తమకే సపోర్ట్ చేస్తారని లెక్కలు వేస్తోంది టీఆర్ఎస్. ఇటీవలే గులాబీ గూటికి చేరిన పెద్దిరెడ్డికి క్రిస్టియన్ వర్గంలో మంచి ఓటు బ్యాంక్ ఉందని చెబుతున్నారు.  ఇలా కులాల వారీగా పంపకాలు చేస్తూ, పదవులు ఇస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలతో విపక్షాలు కూడా షాకవుతున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఈటల వెంట ఉన్న నేతలకు కూడా గాలం వేస్తున్నారట గులాబీ లీడర్లు..

తెలుగునేల‌పై అఘోరాలు.. ఆ శివాల‌యంలో పూజ‌లు.. ప్ర‌త్యేక‌త ఏంటి?

అఘోరాలు. రుద్రం, రౌద్రంకు ప్ర‌తిరూపాలు. స‌మాజంలో క‌ల‌వ‌ని శివ సైనికులు. కేవ‌లం శివ ఆరాధ‌నే వారికి స‌ర్వ‌స్వం. శ‌రీర‌మంతా విభూతిధార‌ణ‌. ఖండించ‌ని కేశాలు. న‌గ్న శ‌రీరాల‌తో.. చూట్టానికి భ‌క్తికంటే భ‌య‌మే ఎక్కువ క‌లిగించే సాధువులు. న‌ర‌మాంసం తింటార‌నే ప్ర‌చారం ఉన్నా అదంతా ఒట్టితేనంటారు. కాక‌పోతే, మామూలు శివ ఆరాధ‌కుల కంటే వారి స్వ‌భావం విభిన్నంగా ఉంటుంది. అలాంటి అఘోరాలు కుంభ‌మేళాలు జ‌రిగే చోటే ద‌ర్శ‌న‌మిస్తారు. మిగ‌తా స‌మ‌యమంతా వారు ఎక్క‌డ ఉంటారో.. ఏమి చేస్తారో.. ఎవ‌రికీ తెలీదు. కుంభ‌మేళా ప్రాంతం మిన‌హా మ‌రెక్క‌డా, మ‌రే స‌మ‌యంలోనూ వారి ఉనికి క‌నిపించ‌క‌పోవ‌డం కాస్త ఆశ్చ‌ర్య‌మే. హిమాల‌యాల్లో ఉంటార‌ని కొంద‌రు, కాశీలో, ఆ స‌మీపంలోని దట్ట‌మైన అర‌ణ్యాల్లో ఉంటార‌ని మ‌రికొంద‌రి అంచ‌నా. అందుకే, అఘోరాలు అంటే అంద‌రికీ కాస్త భ‌యంతో కూడిన‌ ఆస‌క్తి. తాజాగా, అలాంటి అఘోరాల బృందం ఒక‌టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచరించ‌డం ఆస‌క్తిగా మారింది. పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. అఘోరాలు వచ్చారన్న విషయం తెలుసుకొని స్థానికులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఇలా పాల్వంచ‌కు అఘోరాలు రావ‌డం.. ఆత్మ‌లింగేశ్వ‌రాల‌యంలో పూజ‌లు చేయ‌డం.. అక్క‌డే స‌హ‌పంక్తి భోజ‌నం చేయ‌డం.. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఆ విష‌యం వైర‌ల్‌గా మారింది.  పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయం చాలా పురాతనమైనది. స్థానికంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత. ఆత్మలింగేశ్వరరాలయాలు దేశంలోనే చాలా అరుదు. అందుకే, అఘోరాలు ఈ ఆల‌యానికి రావ‌డం, పూజ‌లు చేయ‌డంపై స్థానికంగా, సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.  అయితే, అఘోరాలు పాల్వంచ‌లోని ఆల‌యం సంద‌ర్శించ‌డానికే ప్ర‌త్యేకంగా రాలేదంటున్నారు. వారంతా ఇటీవ‌ల కాశీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు కాలిన‌డ‌క‌న‌ వ‌చ్చార‌ని.. మ‌ళ్లీ కాశీకి తిరిగి వెళుతుండ‌గా.. మార్గ‌మ‌ధ్యంలో పాల్వంచ ఆల‌యాన్ని సంద‌ర్శించార‌ని చెబుతున్నారు. అఘోరాలు ఎక్క‌డ శివాల‌యం క‌నిపించినా అక్క‌డ‌ పూజ‌లు చేయ‌డం సాధార‌ణ విష‌య‌మేన‌ని ఇందులో ఎలాంటి ప్ర‌త్యేక‌త లేదంటున్నారు. ఏదిఏమైనా.. అఘోరాలు పాల్వంచ‌లో కొన్నిగంట‌లు విడిది చేయ‌డం ఆ ప్రాంతంలో హ‌ల్‌చ‌ల్ చేసింది.   

ఆర్థికశాఖ ఉద్యోగుల‌పై వేటు.. జ‌గ‌న్ స‌ర్కారు రివేంజ్‌!.. స‌స్పెన్ష‌న్‌ అందుకేనా..?

అప్పుల కుప్ప‌గా మారిన ఆంధ్రప్ర‌దేశ్‌. మ‌ద్యం షాపుల ఆదాయాన్ని ష్యూరిటీగా చూపించి మ‌రీ అప్పులు తెచ్చిన ఘ‌న‌త‌. ప్ర‌భుత్వ లెక్క‌ల‌కు అప్పుల‌కు లింకు కుద‌ర‌డం లేద‌నే ఆరోప‌ణ‌. పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్‌ ప్ర‌శ్న‌ల‌కు ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న పొంత‌న‌లేని స‌మాధానాలు. బుర్ర‌క‌థ‌లు మిన‌హా.. అస‌లు క‌థ బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌నే విమ‌ర్శ‌. ఇలా ఏపీ స‌ర్కారు అడ్డ‌గోలుగా చేసిన అప్పుల‌పై పీఏసీతో పాటు ప్ర‌తిప‌క్ష‌ టీడీపీ.. ప్ర‌భుత్వ ప‌రువంతా తీసి పారేసింది. ఖ‌జానా డొల్ల‌త‌నాన్ని బ‌ట్ట‌లిప్పి న‌డిరోడ్డు మీద నిలుచోబెట్టినంత ప‌ని చేసింది. ప్ర‌తిప‌క్షం సంధించిన ఒక్కో ప్ర‌శ్న‌కు.. గుట‌క‌లు మింగ‌డం మిన‌హా స‌ర్కారు స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోయింద‌ని అంటున్నారు. ఎంతో ర‌హ‌స్యంగా సాగించిన ఆ అప్పుల లెక్క‌ల గూడుపుఠాని సంగ‌తి అస‌లు బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చింద‌నే సందేహం ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు క‌లిగింది. ఆర్థిక‌శాఖ ఉద్యోగుల‌పై అనుమానం మొద‌లైంది.  క‌ట్‌చేస్తే.. తాజాగా ముగ్గురు ఉద్యోగుల‌పై వేటు ప‌డింది. ఏపీ ఆర్థికశాఖలో ప‌ని చేస్తున్న ఇద్దరు సెక్షన్‌ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ధికశాఖలో సెక్షన్‌ అధికారులుగా పనిచేస్తున్న శ్రీనుబాబు, వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఆ ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. ఆర్థిక‌శాఖ‌లో ముగ్గురు ఉద్యోగులను స‌ర్కారు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. వేటుపై స్ప‌ష్ట‌మైన కార‌ణాలు తెలీక‌పోయినా.. ఆర్థిక శాఖ స‌మాచారాన్ని లీక్‌ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఉద్యోగ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.   

ఒలింపిక్స్ లో లవ్లీనాకు కాంస్యం.. భారత్ కు మూడో పతకం

టోక్సో ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. ఇప్పటివరకు రెండు పతకాలు రాగా.. అవి రెండు కూడా మహిళా ప్లేయర్లే అందించారు. వెయిట్ లిఫ్టింగులో మీరాబాయ్ చానుకు రజత పతకం రాగా.. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు కాంస్యం వచ్చింది. తాజాగా బాక్సింగులో లవ్లీనా బోర్గోహెయిన్ ఇండియాకు బ్రాంజ్ మెడల్ అందించింది.  ఒలింపిక్స్ లో ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్.. అద్భుతంగా ఆడి  కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల వెల్టర్ వెయిట్ (64–69 కిలోలు) విభాగంలో బరిలో నిలిచిన ఆమె.. సెమీ ఫైనల్ లో ఓడిపోయింది.   టర్కీకి చెందిన బిజెనెజ్ సర్మినెలి చేతిలో ఓటమిపాలైంది. జడ్జిలంతా ఏకగ్రీవంగా బిజినెజ్ ను విజేతగా ప్రకటించారు. మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థి బిజినెజ్ పంచ్ ల వర్షం కురిపించింది. 5–0తో ముందంజ వేసింది. తర్వాతి రౌండ్ నుంచి బోర్గోహెయిన్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఏకగ్రీవంగా బిజెనెజ్ ను విజేతగా ప్రకటించారు. ఫలితంగా గెలుపోటములతో సంబంధం లేకుండా లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని గెలిచింది.   విజేందర్ సింగ్, మేరీకోమ్ తర్వాత భారత్ కు ఒలింపిక్స్ పతకాన్ని అందించిన మూడో బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. కంచు పతకం సాధించిన లవ్లీనాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లవ్లీనాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమెను చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. లవ్లీనా విజయం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు ప్రధాని.  లవ్లీనా బోర్గోహెయిన్ ఒలింపిక్స్ పతకం సాధించడంతో... ఆమె సొంతూకు అసోంలోని ఓ మారుమూల పల్లెలో సంబరాలు జరుగుతున్నాయి. లవ్లీనా పల్లెకు ఇప్పటివరకు కనీసం రోడ్డు కూడా లేదు. కాని రెండు రోజుల క్రితమే అధికారులు యుద్ద ప్రాతిపదికన ఆ గ్రామానికి రోడ్డు నిర్మించారు.

రెచ్చ‌గొట్టిందంటూ ఎమ్మెల్సీ ఫిర్యాదు.. యువ‌తిపై కేసుతో హైడ్రామా..

ఎక్క‌డ‌నైనా ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఫిర్యాదులు చేయ‌డం చూస్తుంటాం. కానీ, అక్క‌డ సంథింగ్ డిఫ‌రెంట్‌. స్వ‌యానా అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అది కూడా ఓ యువ‌తిపై. అందులోనూ సోష‌ల్ మీడియాలో రెచ్చ‌గొట్టిందంటూ కంప్లైంట్‌. పోస్టులు పెట్ట‌డ‌మే నేర‌మ‌న్న‌ట్టు పోలీసులు సైతం వెంట‌నే కేసు క‌ట్టేశారు. మ‌హిళ అని చూడ‌కుండా స్టేష‌న్‌కు త‌ర‌లించారు. రాత్రి స‌మ‌యంలో కూడా సీఐడీ కార్యాల‌యంలోనే ఉంచారు. ఆమె టీడీపీ స‌పోర్ట‌ర్ కావ‌డం వ‌ల్లే ఇలా వేధిస్తున్నారంటూ ప్ర‌తిప‌క్షం భ‌గ్గుమంది. ఇటు ఎమ్మెల్సీ, అటు సీఐడీ తీరుపై మండిప‌డింది. రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టే విధంగా.. ఓ కులాన్ని అవమానించేలా సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. విచారణను గుంటూరు సీఐడీ రీజినల్‌ కార్యాలయానికి దర్యాప్తు నిమిత్తం పంపారు. సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్‌ కేసు విచారిస్తున్నారు. విచార‌ణ‌లో భాగంగా తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలు బొలినేని జ్యోతిశ్రీని అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ రీజనల్‌ కార్యాలయానికి తరలించారు. ఆమెను విచారించి సాయంత్రానికి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేస్తారని భావించారు. సాయంత్రం 6 గంటలు దాటినా జ్యోతిశ్రీని విడుదల చేయకపోవటంతో టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని సంజీవ్‌కుమార్‌ను కలిసి వివరాలు అడిగారు. అప్పిరెడ్డి ఫిర్యాదు మేరకు 153ఎ, 120 రెడ్‌విడ్‌ 505(2) సెక్షన్‌ కింద సీఐడీ రాష్ట్ర కార్యాలయం కేసు నమోదు చేయటంతో జ్యోతిశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరుస్తామ‌ని చెప్పారు.  జ్యోతిశ్రీ మాట్లాడుతూ.. గంటలో పంపిస్తామని తీసుకువచ్చి రాత్రి వరకు నిర్బంధించారని తెలిపారు. తాను పార్టీపరంగా పోస్టింగ్స్‌ పెట్టానని, ఎవరినీ కించపరచలేదని, కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళను రాత్రి పూట సీఐడీ కార్యాలయంలో ఉంచడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

జగన్ సర్కార్ కు షాక్.. దేవినేని ఉమాకు బెయిల్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది.  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ వచ్చింది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సుమారు వారం రోజుల పాటు ఆయన్ను జైల్లోనే ఉంచారు.ఈ కేసులో బుధవారం ఉదయం ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండూరులో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజక వర్గంలో మైనింగ్ వివాదం రచ్చ రాజేసింది. గత మంగళవారం మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన కారుపై దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో మైనింగ్‌ను పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. ఉమ కారుపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులపనే అని దేవినేని అరోపించారు.అయితే పోలీసులు మాత్రం దేవినేని  ఉమాపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  అర్ధరాత్రి దేవినేని ఉమాను జి.కొండూరు పోలీసులు అరెస్టు చేశారు.  దేవినేనిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో హైడ్రామా నడిచింది. స్టేషన్‌ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు. తాను ఫిర్యాదు ఇస్తానని, తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు తీసుకునే దాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు. కారును తొలగించి, ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్‌ను కూడా తెప్పించారు.అది వీలు కాకపోవడంతో చివరకు కారు అద్దాన్ని తొలగించి.. ఆ తర్వాత కారు డోరు తెరిచారు. అనంతరం ఉమాను అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించుకుని వేకువజామున 1.15 గంటలకు తరలించారు. దేవినేని ఉమా అరెస్ట్, పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించి.. ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు. 

పవన్ కు బై బై .. జగన్ కు ఝలక్!  ఏపీలో కమలం కొత్త ప్లాన్? 

దేశంలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. బీజేపీ యేతర పార్టీలన్నీ, ఎవరికీ వారు కమల దళాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా 2024 ఎన్నికల్లో మోడీని గద్దె దించాలని గట్టి పట్టుమీడున్నాయి. బీజేపీ 2024 ఎన్నికల నాటికి దక్షిణాదిలో పట్టు పెంచుకునేందుకు తద్వారా ఉత్తరాదిలో సీట్ల పరంగా వచ్చే నష్టాన్ని కొంత వరకైనా తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇంత వరకు, ఒక్క కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాలపై పార్టీ ఎక్కడి కక్కడ. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రంగా ప్రత్యేక వ్యూహాలతో పావులు కదుపుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు కూడా ఇందులో భాగంగానే జరిగిందని అంటున్నారు.  దక్షిణాది వ్యూహంలో భాగంగానే, కమల దళం తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడిఎంకే కూటమి విజయం సాధించలేక పోయినా, బీజేపీ కొంత పట్టును అయితే సాధించగలిగింది. నాలుగు సీట్లు గెలిచింది. అసెంబ్లీలో కాలు పెట్టింది. తమిళనాడులో అంతర్భాగంగా ఉండే పుదుచ్చేరిలో అధికార పీఠాన్ని చేరుకుంది. మరోవంక కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి పార్టీ   అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్. మురుగన్’ కు స్థానం కల్పించింది. ఆయన స్థానంలో, మాజీ ఐపీఎస్ అధికారి, (2011 కర్ణాటక క్యాడర్)  యువకుడు (37 ఏళ్ళు)  అన్నామలైకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అన్నామలై 2019లో ఐపీఎస్ కు రాజీనామా చేసి, పార్టీలో చేరారు. ఆయన సారధ్యంలో పార్టీ ముందుకు సాగుతోంది. ఏఐడిఎంకేతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తోంది. స్టేట్’లో జూనియర్ పార్టనర్ అయినా, ఏఐడిఎంకేకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తోంది. పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారంలోనూ బీజేపీ పెద్దలు పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఏఐడిఎంకే కీలక నేతలు మాజీ ముఖ్యమంత్రి  పళని స్వామి, పంన్నీర్ సెల్వం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.అలాగే, బీజేపీ అగ్ర నేతలతో సమావేశమై రాష్ట్రంలో కూటమిని బలోపేతం చేసే అంశంపై మాత్రమే కాకుండా పార్టీ (ఏఐడిఎంకే) అంతర్గత సమస్యలు, ముఖ్యంగా శశికళ సృష్టిస్తున్న అలజడి పై చర్చించారని సమాచారం.   ఇంతవరకు అంతగా పట్టించుకోని తెలుగు రాష్ట్రాలపై  ముఖ్యంగా ఏపీ పై కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపధ్యంలో, మూడో ప్రత్యాన్మాయంగా ఎదిగే ప్రయత్నంలో భాగంగా రెండు సంవత్సరాల క్రితమే బీజేపీ, మాజీ మిత్రపక్షం జన సేనను మళ్ళీ దగ్గరకు తీసుకుంది. ఉభయ పార్టీలు కలిసి ఉధ్యమాలు చేయాలని, ప్రాంతీయ పార్టీల పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, జనంలోకి తీసుకు వెళ్ళాలని,2024లో జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో జెండాలే కాకుండా అజెండాలు కూడా వేరు కావడంతో గడచిన రెండు సంవత్సరాలలో రెండు పార్టీల ఉమ్మడి పోరాటం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉండిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ  ఉమ్మడి పోరు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.ఈ నేపధ్యంలో, ఇరు పార్టీల మద్య దూరం పెరిగింది. మరో వంక బేజేపీ కేంద్ర నాయకత్వం మారిన పరిస్థితుల్లో, పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి ముందు, పార్టీని పటిష్ట పర్చుకోవాలని, పొత్తుల విషయం ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చని రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ముఖ్యంగా పార్టీ కోర్ ఇష్యూస్ మీద కాన్సంట్రేట్ చేయాలని, ఇందుకు కోసంగా అవసరం అయితే జనసేనతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  జనసేన దూరంగా ఉన్నా, కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు సంబందించిన బీజేపీ ఒంటరిగానే పోరాటం చేసింది.టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర సోమువీర్రాజు ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయమై ఆందోళనలు చేపట్టారు.చివరకు ఈ వివాదాల నేపథ్యంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకు  వ్యతిరేకంగా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో  కాషాయ దళంలో జోష్ పెరిగింది. ఈ ఊపులోనే కావచ్చు సోము వీర్రాజు బీజేపీ చేస్తున్న ఆందోళనలకు జనసేన కలిసిరావడం లేదని బహిరంగంగా ఆరోపించారు.  ఆంధ్ర ప్రదేశ్ పై బీజీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది అనేందుకు సంకేతమా అన్నట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. పొత్తుల విషయాన్నిపక్కన పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలన, ముఖ్యంగా అద్వాన్న స్థితికి చేరిన ఆర్థిక పరిస్థితి, దేవాలయాలపై జరుగతున్న దాడులు, క్రైస్తవీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు చేపట్టాలని ఆయన గట్టిగా సూచించారు. ఈ నేపధ్యంలోనే, ఇటీవల కాలంలో బీజేపీ, ఆందోళన బాట పట్టింది. ముందు పార్టీ క్యాడర్’లో ఉత్సాహాన్ని నింపి, క్రియాశీలంగా ఉద్యమాలు నిర్వహిస్తే, ఎన్నికల సమయంలో పొత్తుల పై  నిర్ణయం తీసుకోవచ్చని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఈ వాస్తవాన్ని గ్రహించే, జగన్ ప్రభుత్వం పొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో జాగ్రత్త పడిందని అంటున్నారు. ఏమైనా, ఏపీ బీజేపీలో కొద్దో గొప్పో కదలిక అయితే వచ్చింది, ఎంతవరకు నిలుస్తుందో .. ఏమవుతుందో ముందు ముందు గానీ తేలదని, పరిశీలకులు బావిస్తున్నారు.

జగన్ సర్కార్ వేధింపులు, కక్ష సాధింపులు! ఏపీకి అమ‌ర‌రాజా గుడ్‌బై? 

కొత్తవి రావు.. పాతవాటిని ఉండనీయరు. వేధిస్తారు.. రాజకీయ కక్ష  సాధింపులకు దిగుతారు. ఇంకేం వేలాది మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇదీ ఆంధ్రప్రదేశ్ లోని జగనన్న పాలనలో నెలకొన్న పరిస్థితి. చంద్రబాబు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు కూడా.. మీకో దండం.. మీ పాలనకో దండం అని చెబుతూ ఏపీకి గుడ్ బై చెప్పేస్తున్నాయి. తాజాగా  రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు, కక్ష సాధింపులు భరించలేక ‘అమరరాజా’ సంస్థ పొరుగు రాష్ట్రం వైపు చూస్తోందన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరీ ముఖ్యంగా ఈ సంస్థ కార్యకలాపాలకు కేంద్రమైన చిత్తూరు జిల్లాలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది  ఏపీకి బ్రాండ్ ఇమేజ్ గా ఉంది అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌. అది కంపెనీ కాదు.. ఉద్యోగాల గ‌ని. అది సంస్థ కాదు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తి. బ్యాట‌రీ త‌యారీరంగంలో దేశంలోకే నెంబ‌ర్ 2. బిలియ‌న్ డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన సంస్థ‌. ట్యాక్స్‌ రూపంలో దేశ ఖ‌జానాకు 2400 కోట్లు జ‌త చేస్తున్న ఘ‌న‌త‌. ఏపీ ప్ర‌భుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర ప‌న్నులు క‌డుతున్న అక్ష‌య పాత్ర‌. అలాంటి బంగారు బాతులాంటి సంస్థ‌పై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు క‌క్ష్య‌క‌ట్టిందంటున్నారు. కంపెనీ యాజ‌మాన్యం టీడీపీ, 'క‌మ్మ‌' వార‌నే ఏకైక కార‌ణంతో అమ‌ర‌రాజాపై కుట్ర‌లు చేస్తోందనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సంస్థ స్థాపించి దాదాపు 4 ద‌శాబ్దాలు అవుతోంది. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం అమ‌ర‌రాజాకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది.  గ‌ల్లా అరుణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నా కుట్ర‌లు ఆప‌లేదు. గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నార‌ని కాబోలు.. కుతంత్రాలు ఆప‌డం లేదు. ఇటీవ‌ల పొల్యూష‌న్ బోర్డు అధికారుల‌ను అమ‌ర‌రాజా క‌ర్మాగారంపైకి పాల‌కులు ఉసిగొల్పారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కంపెనీ వ‌ల్ల కాలుష్యం క‌లుగుతోంద‌ని.. వెంట‌నే మూసేయాలంటూ నోటీసులు ఇచ్చారు. 36 ఏళ్లుగా ఉన్న ఫ్యాక్ట‌రీ విష‌యంలో ఇప్పుడే పొల్యూష‌న్ గుర్తుకొచ్చిందా? అమ‌ర‌రాజా ఏ చిన్నాచిత‌కా బ‌డ్డీ కొట్టో కాదు. అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీ. నిబంధ‌న‌లు, త‌నిఖీలు ప‌క్కాగా ఫాలో కావాల్సిందే. అంత సిల్లిగా ఏమీ న‌డ‌వ‌దు క‌ర్మాగారం. కావాల‌నే, ఇబ్బందులు సృష్టించార‌ని, పొల్యూష‌న్ బోర్డుతో చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఇదంతా రాజ‌కీయ ప్రోత్బ‌లంతో జ‌రిగింద‌ని పారిశ్రామిక వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయినా, స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. అన్నంత ప‌నీ చేసేవారే. కంపెనీని మూసేసేవారే. కానీ, న్యాయం, చ‌ట్టం అంటూ ఉంటాయిగా. స‌ర్కారే సుప్రీంకాదుగా. అందుకే, కోర్టుకెళ్లి మ‌రీ ఆ ఆదేశాల‌ను అడ్డుకుంది యాజ‌మాన్యం. ఇలా ఒక‌టి కాక‌పోతే ఇంకోటి.. ప్ర‌భుత్వం నుంచి వ‌రుస‌గా వ‌స్తున్న ఇబ్బందుల‌తో విసిగిపోయిన యాజ‌మాన్యం.. ఇక ఏపీలో ఉండ‌టేమంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను ఉండ‌నిచ్చేలా లేరంటూ.. పొరుగు రాష్ట్రానికి వ‌ల‌స వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.   అంత పెద్ద కంపెనీ వ‌స్తానంటే.. ఎవ‌రైనా వ‌ద్దంటారా? అందుకే, రెడ్ కార్పెట్ ప‌రిచి మ‌రీ త‌మ రాష్ట్రానికి రమ్మంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. సీఎం స్టాలిన్‌తో అమ‌ర‌రాజా యాజ‌మాన్యం ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని.. చెన్నై శివార్ల‌లో స్థ‌లం కూడా కేటాయించిన‌ట్టు.. అక్క‌డ ముమ్మ‌ర ప‌నులు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే అనుకున్న‌ట్టే సాగితే.. మ‌రో 3 నెల‌ల్లోనే దేశ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ అమ‌ర‌రాజా కంపెనీ చిత్తూరు నుంచి త‌మిళ‌నాడుకు త‌ర‌లిపోనుంది. ఇది ఆంధ్రులుగా మ‌నంద‌రికీ అవ‌మాన‌క‌ర విష‌య‌మే.  ఏపీపై అమ‌ర‌రాజాకు ఉన్న అనుబంధం, అభిమానం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌లోని  ప్ర‌ధాన కార్యాలయాన్ని తిరుపతికి త‌ర‌లించింది అమరరాజా. ఎందుకంటే, తాము చెల్లించే పన్నులు.. త‌మ సొంత‌ రాష్ట్రానికే దక్కాలనే కార‌ణం. 1985లో గల్లా రామచంద్ర నాయుడు స్థాపించిన అమ‌ర‌రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌.. వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ద‌శ‌బ్దాలుగా దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మాన‌మై వెలుగుతోంది. వాహన బ్యాటరీలు , బ్యాటరీ ఛార్జర్స్, ఎలక్ట్రానిక్స్ , పారిశ్రామిక బ్యాటరీలు , డిజిటల్ ఇన్వర్టర్స్, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ , ఆహార ఉత్పత్తులు , ట్రిక్కేల్ ఛార్జర్స్, యూపిఎస్, విద్యుత్ వ్యవస్థ ఉత్పత్తి, షీట్ మెటల్.. ఇలా ప‌లు ప్రొడ‌క్ట్స్ త‌యారు చేస్తోంది. కంపెనీలో దాదాపు 16వేల మంది ప‌ని చేస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ సంకలనం చేసిన ఆసియా లో "'బెస్ట్ అండర్ ఎ బిలియన్" 2010 జాబితాలో అమర రాజా బ్యాటరీస్ ఒక‌టి. సామాజిక సేవ‌లోనూ అమరరాజా గ్రూప్ త‌న‌వంతు పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ఉపాధి, అభ్యసన-విద్య, సామాజిక పునరావాసం, గ్రామీణ అభ్యున్నతి వంటి రంగాలలో కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.  ఇలా ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఉద్యోగ‌, ఉపాధి, సామాజిక సేవ‌లో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమ‌ర‌రాజా కంపెనీపై కేవ‌లం టీడీపీ, 'క‌మ్మ' అనే కార‌ణాల‌తో కుట్ర‌లు చేస్తూ మ‌నుగ‌డ సాగ‌నివ్వ‌కుండా వేధిస్తూ.. పొల్యూష‌న్‌ను సాకుగా చూసి ఏకంగా ఫ్యాక్ట‌రీనే మూసేయాల‌నే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌ ప్ర‌య‌త్నాల‌తో అస‌హ‌నానికి లోనైన అమ‌ర‌రాజా యాజ‌మాన్యం.. త‌న పుట్టింటిని వ‌దిలి వెళ్లేందుకు బాధ‌తో సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు స‌ర్కారు అక్కున చేర్చుకుంటుండ‌టంతో.. అక్క‌డికి త‌ర‌లివెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతోంద‌ని తెలుస్తోంది. ప‌న్నుల రూపంలో ఏటా వెయ్యి కోట్ల‌కు పైగా జ‌మ చేస్తూ.. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీని కాల‌ద‌న్నుకొని.. జ‌గ‌న్ స‌ర్కారు ఏం సాధించిన‌ట్టో? రాజ‌కీయ లాభం కోసం ఇలా రాష్ట్ర‌, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌డం జ‌గ‌న్‌రెడ్డికే చెల్లిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ఏపీవాసులు. 

థర్డ్ వేవ్ రమ్మంటే వస్తుంది.. కానీ పొమ్మంటే పోదు

కరోనా ఫస్ట్ వేవ్ చెప్పీ చెప్పకుండా వచ్చింది. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడంతో ఇతర దేశాలతో పోల్చి నప్పుడు మన దేశంలో ముప్పు కొంత తక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వాల మాట విన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు పాటించారు.  కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్వయంగా ప్రధాన మంత్రి మీడియా ద్వారా మాస్క్ ధరించండి .. భౌతిక దూరం పాటించండి .. చేతులు శుభ్రంగా ఉంచుకోండి .. అని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరం మేరకు  కఠిన చర్యలూ తీసుకున్నారు.  మరోవంక లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకున్నాయి. అలాగే, స్వచ్చంద సంస్థలు, సామాన్య ప్రజలు ఎవరికి వారు చేతనైన మేరకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇలా, సామాన్య ప్రజల నుంచి ప్రధాని వరకు అందరూ ఒకటిగా భారతీయులు కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేశారు. ఇలా సామదానదండోపాయాలు ఉపయోగించడంతో పాటుగా ఉమ్మడి కృషి ఫలితంగా ఫస్ట్ వేవ్ ముప్పును  కొంతలో కొంత తగ్గించుకోవడంలో మన దేశం కొంత మేరకు అయినా సఫలమైంది. అదే సెకండ్ వేవ్ వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. సెకండ్ వేవ్ వస్తుందని ముందుగానే తెలిసినా, ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. రాజకీయ కార్యకలాపాల్లో, ముఖ్యంగా బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కుంభమేళా ఇతర సామూహిక కార్యక్రమాల విషయంలో కట్టు తప్పడంతో కరోనా సెకండ్ వేవ్ ఒక విధంగా ప్రళయాన్నే సృష్టించింది. అంతా అయి ప్రభుత్వాలు కళ్ళు తెరిచే సమయానికి జరగరాని నష్టం జరిగిపోయింది. మనదేశంలో 2020 జనవరి 3 వ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. ఆగష్టు 3, 2021 నాటికి ఆ సంఖ్య 31,726,507 చేరింది. ఇంతవరకు 4,25,195 మంది కరోనా బాధితులు చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది సెకండ్ వేవ్’ లో చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 41.5శాతం మాత్రమే కాగా.. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 54.5శాతానికి పెరిగింది. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ , అత్యవసర మందులు అందక ఎవరూ చనిపోలేదు. కానీ సెకండ్ వేవ్’ లో మరణాల సంఖ్య పెరగడానికి ఆక్సిజన్, మందుల కొరత కూడా ఒక ప్రధాన కారణం అయింది. ఫస్ట్ వేవ్’లో లేని బ్లాక్, ఎల్లో ఫంగస్ వంటి ప్రాణాంతక ఉప విపత్తులు,కొత్త వేరియంట్స్ సెకండ్ వేవ్ లో పుట్టుకొచ్చాయి.  ఇప్పటికే దేశంలో 10 రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఉదృతంగానే వుంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎక్కువ నష్టం కలగచేయడానికి ఇంకా ఎన్ని కారణాలు ఉన్నా, ఉమ్మడి  ‘స్వయంకృత’ అపరాధం అన్నిటినీ మించిన మూల కారణం. అదే ప్రధాన ముద్దాయి. ప్రభుత్వాలు  తిలాపాపం తలాపిడికెడు పంచుకున్నాయి. ప్రభుత్వాలే కాదు మనం అందరం అందుకు బాధ్యులమే ..  తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నట్లుగా మూడోవేవ్‌ రావా లా.. వద్దా.. అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. నిజం,  కరోనా థర్డ్ వేవ్ ఈ ఈనెలలో వస్తుందా, మరో నెల ఆగుతుందా, అసలు రాకుండానే పోతుందా, వచ్చినా పెద్దగా ప్రభావం చూపదా, వంటి ప్రశ్నలు అన్నిటికీ ప్రజల ప్రవర్తనే సమాధానంగా నిలుస్తుంది. వైరస్‌ వ్యాప్తి తీరు ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పింది అక్షర సత్యం. అయితే సెకండ్ వేవ్’లానే థర్డ్ వేవ్  థర్డ్ వేవ్’ ను కూడానిర్లక్ష్యం చేస్తే, థర్డ్ వేవ్’ మహా ప్రళయంగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. థర్డ్ వేవ్ లో వచ్చేది, ఇప్పటికీ అమెరికా సహా అనేక దేశాల్లో స్థైర్య విహారం చేస్తున్న, డెల్టా వేరియంట్‌ , ఈ వేరియంట్ వల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సో .. థర్డ్ వేవ్ రావాలా వద్దా అనేది ... మన చేతుల్లోనే వుంది .. రమ్మంటే వస్తుంది .. కానీ పొమ్మంటే పోదు... పోయేటప్పుడు వట్టి చేతులతో పోదు ... చిక్కిన ప్రాణాలను చిక్కినట్లు ప్రాణాలను మూట కట్టుకుని పట్టుకు  పోతుంది. అందుకే.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వింటున్నారా...   కరోనా ఫస్ట్ వేవ్ చెప్పీ చెప్పకుండా వచ్చింది. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడంతో ఇతర దేశాలతో పోల్చి నప్పుడు మన దేశంలో ముప్పు కొంత తక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వాల మాట విన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు పాటించారు.  కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్వయంగా ప్రధాన మంత్రి మీడియా ద్వారా మాస్క్ ధరించండి .. భౌతిక దూరం పాటించండి ... చేతులు శుభ్రంగా ఉంచుకోండి .. అని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరం మేరకు  కఠిన చర్యలూ తీసుకున్నారు.  మరోవంక లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకున్నాయి. అలాగే, స్వచ్చంద సంస్థలు, సామాన్య ప్రజలు ఎవరికి వారు చేతనైన మేరకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇలా, సామాన్య ప్రజల నుంచి ప్రధాని వరకు అందరూ ఒకటిగా భారతీయులు కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేశారు. ఇలా సామదానదండోపాయాలు ఉపయోగించడంతో పాటుగా ఉమ్మడి కృషి ఫలితంగా ఫస్ట్ వేవ్ ముప్పును  కొంతలో కొంత తగ్గించుకోవడంలో మన దేశం కొంత మేరకు అయినా సఫలమైంది. అదే సెకండ్ వేవ్ వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. సెకండ్ వేవ్ వస్తుందని ముందుగానే తెలిసినా, ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. రాజకీయ కార్యకలాపాల్లో, ముఖ్యంగా బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కుంభమేళా ఇతర సామూహిక కార్యక్రమాల విషయంలో కట్టు తప్పడంతో కరోనా సెకండ్ వేవ్ ఒక విధంగా ప్రళయాన్నే సృష్టించింది. అంతా అయి ప్రభుత్వాలు కళ్ళు తెరిచే సమయానికి జరగరాని నష్టం జరిగిపోయింది. మనదేశంలో 2020 జనవరి 3 వ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. ఆగష్టు 3, 2021 నాటికి ఆ సంఖ్య 31,726,507 చేరింది. ఇంతవరకు 4,25,195 మంది కరోనా బాధితులు చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది సెకండ్ వేవ్’ లో చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 41.5శాతం మాత్రమే కాగా.. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 54.5శాతానికి పెరిగింది. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ , అత్యవసర మందులు అందక ఎవరూ చనిపోలేదు. కానీ సెకండ్ వేవ్’ లో మరణాల సంఖ్య పెరగడానికి ఆక్సిజన్, మందుల కొరత కూడా ఒక ప్రధాన కారణం అయింది. ఫస్ట్ వేవ్’లో లేని బ్లాక్, ఎల్లో ఫంగస్ వంటి ప్రాణాంతక ఉప విపత్తులు,కొత్త వేరియంట్స్ సెకండ్ వేవ్ లో పుట్టుకొచ్చాయి.  ఇప్పటికే దేశంలో 10 రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఉదృతంగానే వుంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎక్కువ నష్టం కలగచేయడానికి ఇంకా ఎన్ని కారణాలు ఉన్నా, ఉమ్మడి  ‘స్వయంకృత’ అపరాధం అన్నిటినీ మించిన మూల కారణం. అదే ప్రధాన ముద్దాయి. ప్రభుత్వాలు  తిలాపాపం తలాపిడికెడు పంచుకున్నాయి. ప్రభుత్వాలే కాదు మనం అందరం అందుకు బాధ్యులమే ..  తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నట్లుగా మూడోవేవ్‌ రావా లా.. వద్దా.. అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. నిజం,  కరోనా థర్డ్ వేవ్ ఈ ఈనెలలో వస్తుందా, మరో నెల ఆగుతుందా, అసలు రాకుండానే పోతుందా, వచ్చినా పెద్దగా ప్రభావం చూపదా, వంటి ప్రశ్నలు అన్నిటికీ ప్రజల ప్రవర్తనే సమాధానంగా నిలుస్తుంది. వైరస్‌ వ్యాప్తి తీరు ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పింది అక్షర సత్యం. అయితే సెకండ్ వేవ్’లానే థర్డ్ వేవ్  థర్డ్ వేవ్’ ను కూడానిర్లక్ష్యం చేస్తే, థర్డ్ వేవ్’ మహా ప్రళయంగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. థర్డ్ వేవ్ లో వచ్చేది, ఇప్పటికీ అమెరికా సహా అనేక దేశాల్లో స్థైర్య విహారం చేస్తున్న, డెల్టా వేరియంట్‌ , ఈ వేరియంట్ వల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సో .. థర్డ్ వేవ్ రావాలా వద్దా అనేది ... మన చేతుల్లోనే వుంది .. రమ్మంటే వస్తుంది .. కానీ పొమ్మంటే పోదు... పోయేటప్పుడు వట్టి చేతులతో పోదు ... చిక్కిన ప్రాణాలను చిక్కినట్లు ప్రాణాలను మూట కట్టుకుని పట్టుకు  పోతుంది. అందుకే.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వింటున్నారా...

ఉదయం అవార్డ్.. సాయంత్రం సస్పెండ్! రాసలీలల ఎస్ఐ కథ పెద్దదే? 

తెలంగాణలో సంచలనం రేపిన , పోలీసు శాఖలో ప్రకంపనలు స్పష్టించిన మహిళా దళిత ట్రైనీపై లైగింక వేధింపుల కేసులో ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని  సస్పెండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ వేటు పడింది. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని.. మహబూబాబాద్‌ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశించారు.  మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తనపై అర్ధరాత్రి అత్యాచారం చేశారని దళిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయడం సంచలం రేపింది. సోమవారం రాత్రి తనను అడవిలోకి తీసుకువెళ్లి బలత్కారం చేసినట్లు కుటుంబసభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు ఆరోపించింది.  తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దళిత యువతి కావడమే తన బిడ్డ చేసిన పాపమా? అని కుటుంబ సభ్యులు రోధించారు. దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని ఉత్తమ పనితీరుకు గాను అవార్డు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఉదయమే జిల్లా ఎస్పీకి అతనికి అవార్డు అందించారు.