బీజేపీ వ్యూహం ఆగ‌మాగం.. హుజురాబాద్‌లో కింక‌ర్త‌వ్యం?

ఘ‌నంగా స‌భ పెట్టాల‌నుకున్నారు. జాతీయ నేత‌ల‌ను ర‌ప్పించాల‌నుకున్నారు. వీలైతే అమిత్‌షా.. కుదిరితే జేపీ న‌డ్డా. హుజురాబాద్‌లో బ‌హిరంగ స‌భ‌తో ఊద‌ర‌గొట్టాల‌ని భావించారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర మొద‌టి విడ‌త‌ను హుజురాబాద్‌లో ముగించాల‌ని అనుకున్నారు. అందుకు అక్టోబ‌ర్ 2న ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ స‌భ‌తో ఘ‌నంగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీకారం చుట్టాల‌ని అనుకున్నారు. కానీ, తామొక‌టి త‌లిస్తే.. ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌ట‌న‌తో సీన్‌ మ‌రోలా మారిపోయింది. అట్ట‌హాసం, మందీమార్బ‌లం.. ఏమీ లేకుండానే బండి సంజ‌య్ ఫ‌స్ట్ రౌండ్‌ పాద‌యాత్ర ముగించాల్సి వ‌స్తోంది. జాతీయ నేత‌లూ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. హుజురాబాద్ అనుకుంటే హుస్నాబాద్‌లోనే సింపుల్‌ స‌భ‌తో స‌రిపెట్టాల్సి వ‌స్తోంది. దీంతో.. ఈట‌ల రాజేంద‌ర్ త‌ర‌ఫున బీజేపీ పెద్ద‌గా హంగామా చేసి.. ఆయ‌న వెనుకు కాషాయ‌ద‌ళ‌మంతా ఉంద‌నే మెసేజ్‌ను ఘ‌నంగా చాటుదామ‌నుకుంటే ఆ ఐడియా ఇప్పుడు బెడిసికొట్టింది. ఈసీ విధించిన కొవిడ్ నిబంధ‌న‌లే వీట‌న్నిటికీ కార‌ణం. ఇంత‌కీ ఈసీ నిబంధ‌న‌లు ఏంటంటే.... * స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభలు అయితే వెయ్యి మంది వరకు, లేక సమావేశ స్థలంలో 50 శాతం సామర్థ్యంతో ఏది తక్కువైతే ఆ సంఖ్యతో సభను నిర్వహించాల్సి ఉంటుంది. సభల వద్ద హాజరైన వారి సంఖ్యను లెక్చించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.  * స్టార్‌ క్యాంపెయినర్లు కాకుండా ఇతరులు ప్రచారం చేస్తే సమావేశస్థలంలో పట్టే జనం సంఖ్యలో సగంగానీ 500 మందికి మించకుండా గానీ ఉండాలన్న నిబంధన విధించారు. ఈ సభల చుట్టూ పోలీసు వలయాన్ని ఏర్పాటు చేస్తారు.  * ఇండోర్‌ మీటింగ్‌ నిర్వహిస్తే సీటింగ్‌ సామర్థ్యంలో 30 శాతం మేరకు లేదా 200 మందికి మించకుండా వీటిలో ఏది తక్కువైతే ఆ నిబంధన మేరకు సమావేశాన్ని నిర్వహించుకో వచ్చు. సభ్యులను లెక్కించేందుకు రిజిస్టర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  * రోడ్‌షోలకు, బైక్‌, కార్లు, సైకిల్‌ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోగా ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థితోపాటు ఐదుగురు మాత్రమే ఉండాలని నిబంధన విధించారు.  * వీధి సమావేశాల్లో స్థలం అందుబాటును బట్టి 50 మందికి అనుమతి ఇస్తారు. వీడియో వ్యాన్ల ప్రచారాలకు కూడా స్థలం అందుబాటును బట్టి 50 మందికే అనుమతి ఉంటుంది.  * అభ్యర్థి, అతని రాజకీయ పార్టీ 20 వాహనాలను మాత్రమే వినియోగించుకునేందుకు ఆ వాహనాల్లో 50 శాతం సీటింగ్‌ సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.  * ఈసారి పోలింగ్‌ ముగిసే సమయానికి 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. అంటే పోలింగ్‌ జరిగే రెండున్నర రోజుల ముందే మైక్‌ ప్రచారం నిలిచిపోనున్నది.  ఎన్నికల కారణంగా కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇలా కఠినమైన నిబంధనలను విధించింది. దీంతో.. బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజు హుజురాబాద్‌లో జరపాలని నిర్ణయించారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి పాదయాత్ర ముగింపు సభను హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకార సభగా మార్చాలని ఆ పార్టీ భావించింది. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని కూడా ఆ పార్టీ ప్రచారం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు హుజురాబాద్‌ పరిధిలో ఈనెల 1 నుంచి వర్తించనున్నందున పాదయాత్ర ముగింపు సభను అక్కడ కాకుండా హుస్నాబాద్‌లో నిర్వహించాలని భావిస్తోంది. ఇంకా వేదిక ఖరారుకాకున్నా హుజురాబాద్‌లో మాత్రం సభ ఉండదని తేలిపోయింది.  బీజేపీ బ‌హిరంగ‌ స‌భ‌, జాతీయ నాయ‌క‌త్వం రాక‌తో.. త‌న గెలుపున‌కు ఎంతో బూస్ట్ వ‌స్తుంద‌నుకున్న ఈట‌ల రాజేంద‌ర్ డ్రీమ్స్‌కు ఈసీ నిబంధ‌న‌లతో చెక్ ప‌డిన‌ట్టైంది. ఇన్నాళ్లూ కాషాయ జెండాల నీడ‌లో ఒంట‌రి పోరాటం చేసిన ఈట‌ల‌కు.. కీల‌క స‌మ‌యంలో పార్టీ అండాదండా దొర‌క్కుండా ఈసీ రూల్స్ అడ్డుగోడ‌లా నిలిచాయ‌ని అంటున్నారు. దీంతో ఎప్ప‌టిలానే తన గెలుపునకు తానే క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. వచ్చే నెల రోజులూ అధికార పార్టీ దూకుడును, వ్యూహాల‌ను త‌ట్టుకొని.. ఈట‌ల రాజేంద‌ర్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి...  

ఐదుగురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు! డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టుకు సీబీఐ.. 

ఏపీలో తీవ్ర సంచలనం స్పష్టించిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం  వైద్యుడు డాక్టర్ కె.సుధాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించిన సీబీఐ హైకోర్టుకు కీలక సమాచారం ఇచ్చింది.  సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. సుధాకర్ పట్ల అధికారులు అనుచితంగా వ్యవహరించారన్న ఘటనపై దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని సీబీఐ వివరించింది. సీబీఐ వెల్లడించిన  వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు చార్జిషీట్ దాఖలుకు అనుమతి ఇచ్చింది. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామంటూ విచారణను అక్టోబర్ 24కి వాయిదా వేసింది.  నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్ సుధాకర్ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆసుపత్రిలో గ్లౌజ్లు మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపణలు చేశారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని కొద్ది రోజులు విశాఖలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు.ఆ సమయంలోనే సుధాకర్ ను కట్టేసి తీసుకెళుతున్న విజువల్స్ వైరల్ గా మారాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.  ఈ ఘటనలో డాక్టర్ సుధాకర్ పట్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ఓ వీడియోను కూడా పంపారు. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో వారు దర్యాప్తు పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు. అయితే డాక్టర్ సుధాకర్ మే నెలలో గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కారణమని, ఆయనను ప్రధమ ముద్దాయిగా చేర్చి చార్జ్ షీట్ ఓపెన్ చేయాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.  అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకే డాక్టర్ సుధాకర్ మానసిక వేదనకు గురయ్యారన్నారు. 

సీఐపై హిజ్రాల పూల వర్షం.. ఎందుకంటే...

వారినెవ‌రూ ప‌ట్టించుకోరు. వారినెవ‌రూ ప‌నిలో పెట్టుకోరు. వారిని స‌మాజం గౌర‌వించ‌దు. పాపం.. అటూఇటూ కాని మ‌నుషులు. అడుక్కోవ‌డం ఒక్క‌టే వారికి తెలుసు. అదే వారికి ఉపాధి. అలా బిచ్చ‌మెత్తి.. పైసా పైసా కూడ‌బెట్టి.. దాచుకున్న‌దంగా ఓ దొంగ దోచుకుపోయాడు. ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్టాన్ని.. ఒక్క రోజులోనే ఎత్తుకెళ్లాడు దొంగ‌. అనంత‌పురం జిల్లా విడ‌ప‌న‌క‌ల్లులో హిజ్రా అనుష్క‌కు జ‌రిగిందీ అన్యాయం. హిజ్రా అనుష్క ఇంట్లో జొర‌బ‌డి.. ఏకంగా 4 ల‌క్ష‌ల న‌గ‌దు.. ఆరున్న‌ర తులాల బంగారాన్ని దొంగ‌త‌నం చేశాడో దొంగ‌. దీంతో, స్థానిక హిజ్రాలంతా క‌లిసి వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల‌కు సైతం పాపం అనిపించిన‌ట్టుంది. ఎప్ప‌టిలా లైట్ తీసుకోకుండా కేసును సీరియ‌స్‌గా ఇన్వెస్టిగేట్ చేశారు. దొంగ‌ను ప‌ట్టుకున్నారు. డ‌బ్బు, బంగారం రిక‌వ‌రీ చేశారు. ఆ సొత్తును హిజ్రా అనుష్క‌కు అంద‌జేశారు.   దొంగ‌ను ప‌ట్టుకొని.. డ‌బ్బు తిరిగిచ్చినందుకు.. ఉర‌వ‌కొండ సీఐ శేఖ‌ర్‌ను హిజ్రాల సంఘం సన్మానించింది. పూల‌దండ‌తో స‌త్క‌రించింది. సీఐపై పూల వర్షం కురిపించారు హిజ్రాలు. సీఐ ప‌నితీరుకు హిజ్రాలు.. హిజ్రాల స‌న్మానానికి సీఐ.. ఆల్ హ్యాపీస్.   

హుజురాబాద్ బరిలో టీడీపీ.. సత్తా చాటుతామంటున్న బక్కని  

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రావడంతో ఎన్నికల వేడి పెరిగింది. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి జనంలోనే ఉన్న అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు.. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచాయి. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా... బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉండబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అక్టోబర్ 1నుంచి నామినేషన్లు షురూ కానుండటంతో.. రేపో మాపో క్యాండిడేట్ ను ప్రకటించబోతోంది హస్తం పార్టీ. అయితే హజురాబాద్ బరిలోకి టీడీపీకి వచ్చింది.  హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీడీపీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి బరిలోకి దిగే అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించి టీడీపీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు. తెలంగాణలో టీడీపీ ప్రస్తుతం పూర్తిగా బలహీనంగా ఉంది.  ఆ పార్టీలో ఉన్న నేతలంతా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలో చేరిపోయారు. ఇటీవలే ఎల్ రమణ కారెక్కారు. టీడీపీలో కీలక నేత రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే నేతలంతా వెళ్లిపోయినా.. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు టీడీపీ ముందుకు రావడం విశేషం. తెలంగాణ టీడీపీకి బక్కని నర్సింహులు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బక్కని... పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సూచనలతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. హుజురాబాద్ లో పోటీ విషయమై బక్కని నర్సింహులుతో తెలుగు వన్ మాట్లాడింది. ఈ సందర్బంగా కీలక విషయాలు చెప్పారు బక్కని. గతంలో హుజురాబాద్ టీడీపీకి కంచుకోటగా ఉందని చెప్పారు. ముద్దసారి దామోదర్ రెడ్డి, పెద్దిరెడ్డిలు వరుసగా అక్కడి నుంచి విజయాలు సాధించారని చెప్పారు. తమకు ఇప్పటికే హుజురాబాద్ లో కేడర్ ఉందన్నారు. త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని బక్కని నర్సింహులు చెప్పారు.  అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. శుక్రవారంనోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల దాఖలకు అక్టోబరు 8 చివరి తేదీ. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. నవంబరు 2న ఫలితం వెల్లడి కానుంది.  

వంద‌లాది రెడ్ల‌కు ప‌ద‌వులు.. జ‌గ‌న్‌రెడ్డికి కుల‌పిచ్చి లేదా? ఈ రెడ్ల పందేర‌మేలా?

జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి లేదట‌. ఇటీవ‌ల భ‌లే కామెడీ చేశారు పోసాని. జ‌గ‌న్ మెప్పు కోసం ఆయ‌న‌లా అన్నారేమో కానీ.. మ‌రి, నిజంగా జ‌గ‌న్‌కు రెడ్డి పిచ్చి లేదా? జ‌గ‌న్ సుక్కంపూసా? అనే డౌట్ వ‌స్తే ఓసారి సోష‌ల్ మీడియా చూస్తే స‌రిపోతుంది. జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉందో లేదో ఫుల్ క్లారిటీ వ‌చ్చేస్తుంది.  పోసాన్ ఆ మాట అన్నాక‌.. ఇదిగో జ‌గ‌న్ హ‌యాంలో రెడ్డ‌ల‌కు ద‌క్కిన ప‌ద‌వులంటూ ఓ పే..ద్ద జాబితా వైర‌ల్ అవుతోంది. అందులో.. ఏయే రెడ్ల‌కు.. ఏయే ప‌దవులు వ‌రించాయో.. ఏపీలో ఎంత మంది రెడ్లకు అంద‌లం ద‌క్కిందో.. అనే డీటైల్స్‌తో ఓ లిస్ట్ తెగ స‌ర్క్యులేట్ అవుతోంది. మ‌రి, ఆ జాబితాలో ఒక‌టి, రెండు అటుఇటూగా ఉండొచ్చు గానీ, చాలా వ‌ర‌కు క‌రెక్ట్ స‌మాచార‌మే ఉంద‌ని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ లిస్ట్ ఇదే.....  1. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి – ముఖ్యమంత్రి 2. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – మంత్రి 3. బాలినేని శ్రీనివాస రెడ్డి – మంత్రి 4. మేకపాటి గౌతమ్ రెడ్డి – మంత్రి 5. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – మంత్రి 6. గడికోట శ్రీకాంత్ రెడ్డి – చీఫ్ విప్ 7. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి – విప్ 8. కాపు రామచంద్రరెడ్డి – విప్ 9. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి – విప్ 10. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - టుడా చైర్మన్ 11. ఆర్.కె. రోజా రెడ్డి – ఏపీఐఐసి చైర్‌ప‌ర్స‌న్‌ 12. పొన్నవోలు సుధాకర్ రెడ్డి – అదనపు ఎ.జి. 13. కల్లం అజయ్ రెడ్డి – ఏపీ ప్రభుత్వ సలహాదారు 14. ధనంజయ్ రెడ్డి – సీఎం అదనపు కార్యదర్శి 15. కృష్ణమోహన్ రెడ్డి – సీఎం ఓఎస్డి 16. కె.నాగేశ్వర్ రెడ్డి – సీఎం పీఏ 17. వి.విజయసాయిరెడ్డి – పార్లమెంటరీ పార్టీ నాయకుడు 18. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి – వైసీసీ లోక్‌సభ నాయకుడు 19. పి.మిథున్ రెడ్డి – లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ 20. వి.విజయసాయిరెడ్డి – ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ 21. వైవీ.సుబ్బారెడ్డి – టీటీడీ చైర్మన్ 22. సజ్జల రామకృష్ణారెడ్డి – ప్రజా సంబంధాల సలహాదారు 23. ఆళ్ళ రామకృష్ణారెడ్డి – సీఆర్‌డీఏ చైర్మన్ 24. నరేంద్రరెడ్డి – సీఆర్‌డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ 25. కె.హేమచంద్రారెడ్డి – ఉన్నత విద్యా మండలి ఏపీ 26. వి.విజయసాయిరెడ్డి – ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి 27. సి.వి.రామకృష్ణారెడ్డి – రాయలసీమ వర్సిటీ రిజిస్ట్రార్ 28. మల్లికార్జున్ రెడ్డి – ఎస్.కె.యూనివర్సిటీ రిజిస్ట్రార్ 29. శ్రీధర్ రెడ్డి – ఎస్వీయూ రిజిస్ట్రార్ 30. రామచంద్రారెడ్డి – యోగి వేమన వర్సిటీ వైస్ ఛాన్సలర్ 31. సి.అంజనేయరెడ్డి – ఎపిఎస్‌ఆర్‌టిసి విలీన క‌మిటీ చైర్మన్ 33. కె.సి.రెడ్డి – ఆర్‌జియుకెటి ఛాన్సలర్ 34. వై.మధుసూదన్ రెడ్డి – వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి 35. జి.నాగేశ్వర్ రెడ్డి – సుప్రీంకోర్టులో ఏపీ త‌ర‌ఫు న్యాయవాది 36. విజయ్ కుమార్ రెడ్డి – ఐ & పిఆర్ కమిషనర్ 37. విఎన్ భారత్ రెడ్డి – విమానయాన సలహాదారు 38. బి.రాజేంద్రనాథ్ రెడ్డి – సభ్యుడు క్యాబినెట్ సబ్ కమిటీ 39. రామచంద్రా రెడ్డి – సభ్యుడు క్యాబినెట్ ఉప కమిటీ 40. గౌతంరెడ్డి – సభ్యుడు క్యాబినెట్ సబ్ కమిటీ 41. వి.విజయసాయిరెడ్డి – సభ్యుడు క్యాబినెట్ సబ్ కమిటీ 42. వి.ప్రభాకర్ రెడ్డి – సభ్యుడు క్యాబినెట్ సబ్ కమిటీ 43. పి.మిథున్ రెడ్డి – సభ్యుడు క్యాబినెట్ సబ్ కమిటీ 44. డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి – సభ్యుడు ఆరోగ్య సంస్కరణల కమిటీ 45. డాక్టర్ బి.సాంబశివరెడ్డి – సభ్యుడు ఆరోగ్య సంస్కరణల కమిటీ 46. ​​డాక్టర్ కె.సతీష్ రెడ్డి – సభ్యుడు ఆరోగ్య సంరక్షణ సంస్కరణల కమిటీ 47. జె విద్యాసాగర్ రెడ్డి – ఎపి ప్రభుత్వ ఐటి సలహాదారు 48. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి – ఎపి ప్రభుత్వ ఐటి సలహాదారు 49. కె.రాజశేఖర్ రెడ్డి – ఎపి ప్రభుత్వ ఐటి సలహాదారు 50. వై.ఎస్.జగన్ రెడ్డి – ఎపి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ 52. ఎంవిఎస్ నాగిరెడ్డి – ఎపి అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు 53. పి.రాఘవరెడ్డి – ఎపి అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు 53. చంద్రశేఖర్ రెడ్డి – ఎపి అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు 54. సుబ్బారెడ్డి – ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతరాజ్ 55. బి.రాజేంద్రనాథ్ రెడ్డి – విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్ష కమిటీ సభ్యుడు 56. బి.శ్రీనివాసరెడ్డి – విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్ష కమిటీ సభ్యుడు 57. కె.అజయ్ రెడ్డి – విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్ష కమిటీ సభ్యుడు 58. గోపాల్ రెడ్డి – విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్ష కమిటీ సభ్యుడు 59. వై.వి.సుబ్బరెడ్డి - టీటీడీ చైర్మన్ 60. ఎ.ధర్మారెడ్డి – టీటీడీ జేఈఓ 61. ఎల్.శ్రీధర్ రెడ్డి – సీఈవో ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 62. శ్రీనివాసులరెడ్డి – ఎస్టిమేషన్స్ కమిటీ పార్లమెంటు సభ్యుడు 63. చల్లా మధుసూదన్ రెడ్డి – చైర్మన్ ఎపి నైపుణ్య అభివృద్ధి సంస్థ 64. వి.విజయసాయిరెడ్డి – సభ్యుడు ఎయిమ్స్, మంగళగిరి 65. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి – ఎక్స్ అఫిషియో సభ్యుడు, టిటిడి (ప్రత్యేక జీవోతో) 66. ఎస్వీ.మాధవరెడ్డి – ఎపి గవర్నర్‌కు ఎడిసి 67. వెంకట్ రెడ్డి – ఎపిఎన్ఆర్టి చైర్మన్ 68. శంకర్ రెడ్డి – ఐటి డైరెక్టర్ 69. జి.దేవేందర్ రెడ్డి – డిజిటల్ డైరెక్టర్ 70. హర్షవర్ధన్ రెడ్డి అన్నపురెడ్డి – ఇ ప్రగతి దర్శకుడు 71. సుబ్రమణ్యంరెడ్డి – పికెఎం పట్టణాభివృద్ధి చైర్మన్ 72. పి.జివి ప్రసాద్ రెడ్డి – విసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం 73. టి.బైరాగిరెడ్డి – రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం 74. పాండు రంగారెడ్డి – సిటిసి డీన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం 75. కనక నర్సారెడ్డి – ఆర్డీఓ, తిరుపతి రెవెన్యూ విభాగం 76. కె.శ్రీధర్ రెడ్డి – నుడా చైర్మన్ 77. జి.ఎన్.సుబ్బారెడ్డి – ప్రెసిడెంట్, ఎపి సెక్రటేరియట్ ఏఎస్ఓ అసోసియేషన్ 78. వై.చెన్నకృష్ణారెడ్డి – ఆఫీసు బేరర్, ఎపి సెక్రటేరియట్ ఏఎస్ఓ అసోసియేషన్ 79. కోదండరామిరెడ్డి -జెడ్ సీఈఓ, చిత్తూరు 80. ఆర్.మనోహర్ రెడ్డి – ఎపి రైడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ 81. ఇ.ప్రకాష్ రెడ్డి – సూపరెండెంట్ ఇంజనీర్, పంచాయతరాజ్ 82. పి.యధుభూషణ్ రెడ్డి – ప్రాజెక్ట్ మేనేజర్, వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, కడప 83. మహేశ్వర్ రెడ్డి -సీదాప్ చైర్మన్ 84. పివిఆర్ఎం రెడ్డి – డైరెక్టర్, వాటర్‌షెడ్ డివిజన్, గ్రామీణాభివృద్ధి శాఖ 85. బి.అనిల్ రెడ్డి – డ్యూటీపై ప్రత్యేక అధికారి, పాడా 86. టి.బాపిరెడ్డి – వైస్ చైర్మన్, నుడా 87. పరమేశ్వర్ రెడ్డి – సిఎం ప్రత్యేక భద్రతా అధికారి 88. వి.విజయసాయి రెడ్డి – సభ్యుడు, లాభదాయక స్థానాలపై సంయుక్త పార్లమెంట్ కమిటీ 89. చల్లా రామకృష్ణారెడ్డి – ఎంఎల్‌సి 90. ఎం.నాగిరెడ్డి – ఎస్‌ఇ పోలవరం (ప్రమోషన్‌లో) 91. ప్రతాప్ భీమిరెడ్డి – ఎపి ఇన్వెస్ట్‌మెంట్స్ చైర్మన్ 92. జి.మనోహర్ రెడ్డి – ఎపి లా డిపార్ట్మెంట్ సెక్రటరీ 93. రత్నాకర్ రెడ్డి పండుగాయల – యుఎస్ఎలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి 94. బీరెడ్డి సిద్దార్థ్ రెడ్డి – కెడిసిసి బ్యాంక్ చైర్మన్ 95. నేను తిరుపాల్ రెడ్డి – పిఎసి చైర్మన్, దువ్వూర్, కడప 96. బి.సాంబశివారెడ్డి – ఛైర్మన్, ఎపి మెడికల్ కౌన్సిల్ 97. ఎస్.విజయకుమార్ రెడ్డి – సభ్యుడు, ఎపి మెడికల్ కౌన్సిల్ 98. ఎన్వి రమణారెడ్డి – ఎక్స్ అఫీషియో స్పెషల్ కమిషనర్, ఎపి భవన్, ఢిల్లీ 99. జె.లక్ష్మణ్ రెడ్డి – లోకాయుక్త, ఎపి 100. భూమిరేడ్డి చంద్రశేఖర్ రెడ్డి – చైర్మన్, ఎపిఎంఎస్ఐడిసి *101. వి విజయసాయి రెడ్డి* – చైర్మన్, వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ *102. మగుంట శ్రీనివాసులు రెడ్డి* – సభ్యుడు, వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ *103. పెద్ధిరెడ్డి మిథున్ రెడ్డి* – సభ్యుడు, ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ *104. వై.ఎస్ అవినాష్ రెడ్డి* – సభ్యుడు, పారిశ్రామిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ *105. అదాల ప్రభాకర్ రెడ్డి* – సభ్యుడు, పట్టణాభివృద్ధి వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ *106. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి* – సభ్యుడు, బొగ్గు, ఉక్కు శాఖల వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ *107. తుమ్మల లోకేశ్వర్ రెడ్డి* – సిఎం సాంకేతిక సలహాదారు *108. సివి.నాగార్జున రెడ్డి* – ఛైర్మన్, ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిటీ *109. మేడా మల్లికార్జున్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి *110. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* – సభ్యుడు, టిటిడి *111. బి.పార్థసారథి రెడ్డి* – – సభ్యుడు, టిటిడి *112. పుట్టా ప్రతాప్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి *113. సి.బాస్కర్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి ఎక్స్ ఆఫీషియో *114. బి.కరుణాకర్ రెడ్డి* – ప్రత్యేక ఆహ్వానితుడు, టిటిడి బోర్డు *115. ఎ.జె.శేఖర్ రెడ్డి* – ప్రత్యేక ఆహ్వానితుడు, టిటిడి బోర్డు *116. కుపేందర్ రెడ్డి* – ప్రత్యేక ఆహ్వానితుడు, టిటిడి బోర్డు *117. భూమన కరుణాకర్ రెడ్డి* – సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ *118. కాటసాని రాఃభుపాల్ రెడ్డి* – సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ *119. సి.జగ్గారెడ్డి* – చైర్మన్, ప్రభుత్వ రంగ ఆర్గ్నిజేషన్ కమిటీ *120. పి.రవీంద్రనాథ్ రెడ్డి* – సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ *121. ఓం చంద్రశేఖర్ రెడ్డి* – శాశ్వత వర్కింగ్ సభ్యుడు, ఎపి అగ్రికల్చర్ మిషన్ *122. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి* – ఎపి ప్రెస్ అకాడమీ చైర్మన్ *123. చేకుపల్లి శిల్పారెడ్డి*- ఎపి హెల్త్ సలహాదారు, .ఢిల్లీ *124. చిట్టెం వెంకట్ రెడ్డి* – స్టాండింగ్ కౌన్సిల్, ఎపి మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ *125. స్వప్నరెడ్డి* – డైరెక్టర్ ఎస్వీబీసీ *126. శ్రీనివాసరెడ్డి* – డైరెక్టర్ ఎస్వీబీసీ *127. వై వి సుబ్బారెడ్డి* – ఛైర్మన్, ఎపి అథ్లెటిక్స్ అసోసియేషన్ *128. జి.వి.సుధాకర్ రెడ్డి* – సభ్యుడు, ఎపిపిఎస్సి *129.ఎన్ రాజశేఖర్ రెడ్డి* – కార్యదర్శి, ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షక కమిషన్. *130. వి.లక్ష్మణరెడ్డి* -చైర్మన్, ఎపి ఆల్కహాల్ నిర్మూలన ప్రమోషన్ కమిటీ. *131. ఎ.సాంబశివరెడ్డి* – కార్యదర్శి, ఎపి ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షక కమిషన్. *132. రామకృష్ణారెడ్డి*- వైవి విశ్వవిద్యాలయం *133. ఎన్.గోవిందరెడ్డి* – సలహాదారు, ఆర్ అండ్ ఆర్ విభాగం కమిషనర్, నీటిపారుదల శాఖ *134. ఎమ్. మధుసూధన్ రెడ్డి* – ఎండి, ఎపి మినరల్ డిసిలోప్మెంట్ కార్పొరేషన్ *135. వి.సురేందర్ రెడ్డి* – న్యాయవాది, *136. కరణ్ రెడ్డి చెరుకు* – ఉపాధ్యక్షుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *137. కొండా రాఘవరెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *138. దుర్గా సుకేందర్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *139. బోడు సాయి నాథ్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *140. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *141. జి.శ్రీధరరెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *142. కొమ్మెరా వెంకట్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *143. కోమటిరెడ్డి లక్ష్మి రెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *144. శ్రీవరరెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *145. సి.సుధాకర్ రెడ్డి* – సభ్యుడు, టిటిడి స్థానిక సలహా కమిటీ, హైడ్ *146.ఆనం రామనారాయణ రెడ్డి* – సభ్యుడు, నిబంధనల కమిటీ *147. మానుగుంట మహీధర్ రెడ్డి* – సభ్యుడు, నిబంధనల కమిటీ *148.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి* – సభ్యుడు, పిటిషన్ల కమిటీ *149. *కసు మహేష్ రెడ్డి* – సభ్యుడు, పిటిషన్ల కమిటీ *150. అళ్ళ రామకృష్ణారెడ్డి* – సభ్యుడు, పిటిషన్ల కమిటీ *151. కాకాని గోవర్ధన్ రెడ్డి* – ఛైర్మన్, ప్రివిలేజెస్ కమిటీ *152. శిల్పా చక్రపాణి రెడ్డి* – సభ్యుడు, ప్రివిలేజెస్ కమిటీ *153. మేడా మల్లికార్జున్ రెడ్డి* – సభ్యుడు, ప్రభుత్వ హామీ కమిటీ *154. కుండురు నాగార్జున రెడ్డి* – సభ్యుడు, ప్రభుత్వ హామీ కమిటీ *155. కె.చెన్నకేశవ రెడ్డి* – సభ్యుడు, నీతి కమిటీ *156. సెట్టిపల్లి రఘురామి రెడ్డి* – సభ్యుడు, నీతి కమిటీ *157. అనంత వెంకట్రామి రెడ్డి* – సభ్యుడు, నీతి కమిటీ *158. దుడ్డుకుంట్ల శ్రీధర్ రెడ్డి* – సభ్యుడు, ఫెసిలిటీస్ జాయింట్ కమిటీ *159. వై బాలనాగి రెడ్డి* – సభ్యుడు, అటవీ పర్యావరణ ఉమ్మడి కమిటీ *160. బియాపు మధుసూధన్ రెడ్డి* – సభ్యుడు, అటవీ, పర్యావరణ ఉమ్మడి కమిటీ *161.వై వెంకట్రామి రెడ్డి* – సభ్యుడు, అటవీ, పర్యావరణ ఉమ్మడి కమిటీ *162. గంగుల బిజేందర్ రెడ్డి* – సభ్యుడు, అటవీ జీవితం & పర్యావరణ ఉమ్మడి కమిటీ *163. వై.శ్రీనివాసులరెడ్డి* – సభ్యుడు, షెడ్యూల్ కులాల సంక్షేమ ఉమ్మడి కమిటీ *164. కాటసాని రామిరెడ్డి* – సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్స్ జాయింట్ కమిటీ *165. తోపుదర్తి ప్రకాష్ రెడ్డి* – సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్స్ జాయింట్ కమిటీ *166. సి.శివనాధరెడ్డి* – సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్స్ జాయింట్ కమిటీ *167. కె.పెద్దారెడ్డి* – సభ్యుడు, వెనుకబడిన కుల సంక్షేమ ఉమ్మడి కమిటీ *ఆళ్ల రామకృష్ణారెడ్డి* – సభ్యుడు, లైబ్రరీ జాయింట్ కమిటీ *169. తిప్పల నాగిరెడ్డి* – సభ్యుడు, లైబ్రరీ జాయింట్ కమిటీ *170.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి* – సభ్యుడు, లైబ్రరీ జాయింట్ కమిటీ *171. వై సాయి ప్రసాద్ రెడ్డి* – సభ్యుడు, మైనారిటీ సంక్షేమ ఉమ్మడి కమిటీ *172. శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి* – సభ్యుడు, మైనారిటీ సంక్షేమ ఉమ్మడి కమిటీ *173. పివి సిద్దారెడ్డి* – సభ్యుడు, మైనారిటీ సంక్షేమ ఉమ్మడి కమిటీ *174. పి.ద్వారకనాథ్ రెడ్డి* – సభ్యుడు, మైనారిటీ సంక్షేమ ఉమ్మడి కమిటీ *175. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి* – సభ్యుడు, మైనారిటీ సంక్షేమ ఉమ్మడి కమిటీ *176. సత్తి సూర్యనారాయణ రెడ్డి* – సభ్యుడు, మహిళలు, శిశు, శారీరకంగా చిల్కెన్డ్ మరియు సీనియర్ వెల్ఫేర్ జాయింట్ కమిటీ *177. కట్టి నరసింహ రెడ్డి* – సభ్యుడు, తెలుగు భాష & సాంస్కృతిక అభివృద్ధి కమిటీ, శాసన మండలి *178. చల్లా రామకృష్ణారెడ్డి* – సభ్యుడు, తెలుగు భాష, సాంస్కృతిక అభివృద్ధి కమిటీ, శాసన మండలి *179. జి దీపక్ రెడ్డి* – సభ్యుడు, అభ్యర్థనల కమిటీ, శాసనమండలి *180. వెన్నపూస గోపాల్ రెడ్డి* – చైర్మన్, నైతిక విలువలు కమిటీ, శాసనమండలి *181. దేవసాని చినగోవింద రెడ్డి*- ఛైర్మన్, పవర్స్ రివ్యూ కమిటీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ *182. చల్లా రామకృష్ణారెడ్డి* – సభ్యుడు, పవర్స్ రివ్యూ కమిటీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ *183. యండపల్లి శ్రీనివాసుల రెడ్డి* – సభ్యుడు, ప్రభుత్వ హామీ కమిటీ, శాసనమండలి *184.పి.మిథున్ రెడ్డి*- సభ్యుడు, సాధారణ వ్యవహారాల కమిటీ *185. సుజీత్ రెడ్డి* – డైరెక్టర్, ఎపి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ *186. అల్లా రవీంద్ర రెడ్డి* – సీఈఓ, ఎపి డ్రోన్ కార్పొరేషన్ *187. ఆర్‌సిఎం రెడ్డి* – డైరెక్టర్, ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ *188. ఎం.మహేశ్వర రెడ్డి* – డైరెక్టర్, ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ *189. సి రామ్మోహన్ రెడ్డి* – సభ్యుడు, పాలక కమిటీ, ఎంజి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం *190. ఆనం విజయకుమార్ రెడ్డి* – చైర్మన్, డిసిసిబి, నెల్లూరు *191. ఎం.రెడ్డెమ్మ* – చైర్మన్, డిసిసిబి, చిత్తూరు *192. మాధవరం రామి రెడ్డి* – చైర్మన్, డిసిసిబి, కర్నూలు *193. తిరుప్పల్ రెడ్డి* – చైర్మన్, డిసిసిబి, కడప *194. గుణిపతి సురేష్ రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, నెల్లూరు *195. చెహెర్లా చలమ రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, నెల్లూరు *196. వేమిరెడ్డి చెన్నారెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, ప్రకాశం *197. సురసాని మోహన్ రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, ప్రకాశం *198. సమకోటి సహదేవ రెడ్డి* – చైర్మన్, డిసిఎంఎస్, చిత్తూరు *199. కె.వి.నిరంజన్ రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, చిత్తూరు *200. కె.సుదర్శన్ రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, కదపా *201. ఎ.సుబ్రమణ్య రామిరెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, కదప *202. పి.పి.నాగి రెడ్డి* – ఛైర్మన్, డిసిఎంఎస్, కర్నూలు *203. బైరెడ్డి జరునకర్ రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, కర్నూలు *204. కె వమ్‌సీధర్ రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, కర్నూలు *205.పి చంద్రశేఖరరెడ్డి* – చైర్మన్, డిసిఎంఎస్, అనంతపురం *206. డి రాఘవారెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, అనంతపూర్ *207. జె వెన్నూత రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, అనంతపురం *208. సోంటిరెడ్డి నర్సిరెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, గుంటూరు *209. బాపటు వెంకటేశ్వర రెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, గుంటూరు *210. అన్నపురెడ్డి వీరరెడ్డి* – సభ్యుడు, డిసిఎంఎస్, గుంటూరు *211. ప్రతాప్ రెడ్డి భిమిరెడ్డి* – ఎపి ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధి, పెట్టుబడి ప్రమోషన్ మరియు మౌలిక సదుపాయాల బోర్డు *212. తిరుమల్ రెడ్డి* – ప్రో, డిజిపి ఆంధ్రప్రదేశ్. *213. దర్మా రెడ్డి* – svbc చైర్మన్. ఇలా 200 మందికి పైగా రెడ్ల‌కు వివిధ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కుల‌పిచ్చి ఉందో లేదో.. పోసాని కృష్ణ‌ముర‌ళినే చెప్పాలి.. ఈ జాబితాపై వైసీపీ నేతలు ఏమంటారో మ‌రి...  

కూలిన పార్వతి బ్యారేజీ పక్క గోడ.. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రమేనా? 

కాళేశ్వరం ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ప్రాజెక్ట్. దాదాపు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ తో రికార్డ్ స్థాయిలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే  కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డులతో పాటు వివాదాలు అలాగే ఉన్నాయి. తెలంగాణ కలల ప్రాజెక్ట్ అని గులాబీ లీడర్లు చెబుతుండగా... తెలంగాణ రాష్ట్రానికి గుది బండ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయం, నిర్మాణం, నిర్వహణ, నాణ్యతపైనా వివాదాలు నడిచాయి. నాసిరకం నిర్మాణాలు చేపట్టారనే విమర్శలు వచ్చాయి. కమీషన్లు తీసుకుని అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లతో లాలూచీ పడ్డారనే విమర్శలు వచ్చాయి. అయితే విపక్షాల ఆరోపణలను అధికార పార్టీ నేతలు ఖండిస్తూ వచ్చారు.  విపక్షాలు ఆరోపించినట్లే ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో గోదావరి నదిపై 3 బ్యారేజీలు నిర్మించిన సర్కారు వాటి నాణ్యత విషయం లో ఏదో ఓ చోట వాటి డొల్లతనం బయట పడుతూనే ఉంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం వద్ద ప్రతిష్టాత్మక  నిర్మాణ ప్రాజెక్టు పార్వతి బ్యారేజ్ లోని 74వ గేటు సమీపంలో  భారీ వర్షాలకు పక్క గోడ కూలిపోయింది. పార్వతి బ్యారేజీ నిర్మాణాన్ని 'నవయుగ' నిర్మాణ సంస్థ చేపట్టింది. అయితే బుధవారం రాత్రి పార్వతి బ్యారేజీ  పైన ఉన్న రోడ్డు కుంగి పోయి  సైడ్ వాల్ కొంతమేర కూలిపోయింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో ఇదే సిరిపురం వద్ద 'మేఘా' నిర్మాణ సంస్థ నిర్మాణం చేసిన  సరస్వతి పంప్ హౌస్ లోని పైపు లైన్ భూమి నుండి పైకి లేచింది.   కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో వరుస లోపాలు కనిపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు నాణ్యతపై ఇక్కడి ప్రాంత ప్రజల్లో  పెద్దఎత్తున చర్చ కొనసాగుతుంది. నాసిరకం నిర్మాణాల వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని జనాలు చెబుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు  భారీ ప్రాజెక్టుల నాణ్యత విషయం లో దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గోడ కూలిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టి పనులు పూర్తి చేయాలని మంథని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 

వంగ‌వీటి రంగా ఎపిసోడ్‌తో.. ప‌వ‌న్ త‌న‌ను తాను పోల్చుకున్నారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచి ఎమోష‌న్‌లో ఉండాలే కానీ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతారు. బాగా బుక్స్ చ‌దివే అల‌వాటు ఉండ‌టం.. బాగా స‌మాజాన్ని, మ‌నుషుల్ని, కుల‌మ‌తాల్ని, రాగాధ్వేషాల్ని, రాజ‌కీయాల్ని విస్తృతంగా అధ్య‌య‌నం చేసిన అనుభ‌వం ఉండ‌టంతో.. ఏ విష‌యంలోనైనా చాలా స్ప‌ష్ట‌మైన అభిప్రాయాల‌ను, లోతైన ఆలోచ‌నారీతుల‌ను క‌లిగి ఉంటారు. ప‌లుమార్లు ఆయ‌న ప్ర‌సంగాల్లో ప‌లు అంశాల‌ను త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణాత్మ‌కంగా మాట్లాడ‌టం మ‌నం చూశాం. తాజాగా, మంగ‌ళ‌గిరి మీటింగ్‌లోనూ ప‌వ‌న్‌.. వంగ‌వీటి రంగా ఉదంతం ప్ర‌స్తావిస్తూ.. కొన్ని మౌళిక ప్ర‌శ్న‌లను సంధించారు. టాపిక్ రంగాదేనైనా.. అందులో న‌ర్మ‌గ‌ర్భంగా త‌న‌కు జ‌రిగిన ఉదంతాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించార‌ని అంటున్నారు. ఇంత‌కీ రంగా గురించి జ‌న‌సేనాని ఏమ‌న్నారంటే.... ‘‘వంగవీటి రంగా బతికి ఉన్న రోజుల్లో నెల్లూరు, చెన్నైలో ఉండేవాడిని. నా కజిన్ మెహర్ రమేశ్ గుడ్ల వల్లేరులో చదువుకునే వాడు. ఒకసారి ఇంటికి వచ్చేశాడు. సెలవులు కాదుకదా ఎందుకు వచ్చావు? అని అడిగితే.. కులాల గొడవలు జరుగుతున్నాయి.. పాలిటెక్నిక్ కాలేజీ మూసేస్తే వచ్చానని చెప్పాడు. నాకు అప్పటి నుంచి ఈ గొడవలేంటి? ఎందుకు ఉంటాయి? అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. రంగా చనిపోయినప్పుడు విజ‌య‌వాడ‌ నెల రోజులు తగలబడిపోతున్నది చూశాను. అవన్నీచూసి.. ఎందుకిలా అయిపోయిందని అనుకున్నా. .తర్వాత తర్వాత అర్థం చేసుకున్న కొద్దీ.. అందరికి అర్థమైందే నాకు అర్థమైంది’’ ‘‘నాకు వచ్చిన మౌలికమైన ప్రశ్న ఏమంటే.. రంగా సభలు పెడుతున్నప్పుడు క్రిష్ణా నది తీరమంతా నిండిపోయేదని. మరి.. అలాంటి రంగా.. అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి నాకు ప్రాణ భయం ఉందని ఆయన సత్యాగ్రహం చేస్తుంటే.. నాకు వచ్చిన సందేహం ఏమంటే.. క్రిష్ణా నది తీరమంతా నిండిపోయేంత జనం వచ్చారు కదా? వీరిలో రోజుకు వంద మంది ఆయన పక్కన ఎందుకు కూర్చోలేకపోయారు? అనిపించింది. ఏమై పోయారు వీరు? ఒక సభకు వచ్చారు..అలాంటి వారు ఆయన పక్కన కూర్చొని ఎందుకు రక్షించుకోలేకపోయారు? అన్నది ఈ రోజుకు నన్నుపట్టి పీడించే ప్రశ్న’’ అని అన్నారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.  నిజ‌మే. అంత‌మంది అభిమానులున్న రంగాకు.. రోజుకు వంద‌మంది ర‌క్ష‌ణ‌గా ఉండిఉన్నా.. ఆయ‌న బ‌తికుండే వారుగా? ప‌వ‌న్ ప్ర‌శ్న స‌రైన‌దే. స‌రే రంగా విష‌యం వ‌దిలేద్దాం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సంగ‌తికి వ‌ద్దాం. రంగాలానే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సైతం విశేష అభిమానగ‌ణం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పీకేకు ఉన్నంత మంది ఫ్యాన్స్ మరే సినీ హీరోకీ, పొలిటిక‌ల్ లీడ‌ర్‌కీ లేరు. 150 సీట్ల‌కు పైగా గెలిచిన జ‌గ‌న్ కంటే కూడా ప‌వ‌న్‌కే ఎక్కువ సంఖ్య‌లో డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటార‌నేది నిజం. జ‌గ‌న్‌కు ఓట‌ర్లు ఉన్నారేమో గానీ, అభిమానులు మాత్రం ప‌వ‌న్‌కే చాలా చాలా ఎక్కువంటారు. ఇక రంగా చావును, ప‌వ‌న్ ఓట‌మిని పోల్చి చూస్తున్నారు విశ్లేష‌కులు. ప‌వ‌న్ అన్న‌ట్టే.. రంగాకు ర‌క్ష‌ణ‌గా అభిమానులు ఉండి ఉంటే.. అన్న‌ట్టే.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌పోర్ట్‌గా ఫ్యాన్స్ ఓట్లేసి ఉంటే.. ప‌రిస్థితి ఇలా ఉండ‌క‌పోయేది క‌దా అంటున్నారు. జ‌న‌సేనాని తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయి ఇంత‌టి దారుణ ప‌రాభ‌వాన్ని మూట క‌ట్టుకోక‌పోయేవారుగా అని ప్ర‌శ్నిస్తున్నారు. రంగాకు జ‌నం తోడుండి ఉంటే.. అన్న‌ట్టుగానే.. ప‌వ‌న్‌కు ఫ్యాన్స్ ఓట్లేసి గెలిపించి ఉండుంటే.. అంటున్నారు. రంగా విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ లేవ‌నెత్తిన మౌళిక ప్ర‌శ్న‌.. జ‌న‌సేనాని అభిమానుల విష‌యంలోనూ అప్లై అవుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. 

నేను సీఎం జ‌గ‌న్ పాలేరునే.. పేర్ని నాని దిగ‌జారుడుత‌నం..

అవును, నేను సీఎం జ‌గ‌న్ పాలేరునే.. అని మంత్రి పేర్ని నానినే స్వ‌యంగా మీడియా ముఖంగా గొప్ప‌గా ప్ర‌క‌టించుకున్నారు. ఇంత‌కంటే దిగ‌జారుడు త‌నం ఇంకేమైనా ఉంటుందా? అంటూ సోష‌ల్ మీడియా ఏకిపారేస్తోంది. ప్ర‌జ‌లంతా క‌లిసి.. ఆయ‌న్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఇందుకేనా?  తాడేప‌ల్లి ప్యాలెస్‌లో పాలేరు ప‌ని చేయ‌డానికా? జ‌గ‌న్ ఆడే రాజ‌కీయ క్రీడ‌లో.. పాలేరులా, బానిస‌లా, క‌ట్ట‌ప్ప వార‌సుడిలా.. పొలిటిక‌ల్ డ్రామా ర‌క్తి క‌ట్టించేందుకా ఆయ‌న్ను ఓట్లేసి గెలిపించింది? అంటూ నిల‌దీస్తున్నారు ప్ర‌జ‌లు. ఈ మాట ప‌వ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకే అన్నార‌నుకున్నా.. వాస్త‌వంలో కూడా చాలా మంది మంత్రులు పాలేరులుగానే ప‌ని చేస్తున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉంద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం అనేది ప్ర‌జ‌ల స‌మూహం. మంత్రిమండ‌లి అనేది ప్ర‌జ‌ల‌ను ప‌రిపాలించే స‌మూహం. ఫ‌స్ట్ అమాంగ్ ది ఈక్వ‌ల్స్ అన్న‌ట్టు.. ముఖ్య‌మంత్రి మిగ‌తా మంత్రుల కంటే కాస్త ఎక్కువ‌. అంతే. రాజ్యాంగం ప్ర‌కారం మిగ‌తా మంత్రులంతా స‌మాన‌మే. కానీ, ఈరోజుల్లో ఆ రాజ్యాంగ స్పూర్తి ఎక్క‌డుంది?  సీఎం అంటే సూప‌ర్ బాస్‌లా త‌యారైంది. ముఖ్య‌మంత్రి చెప్పిందే వేదం. ఆయ‌న మాటే శాస‌నం. మిగ‌తా మంత్రులంతా ఆయ‌న‌కు ఊడిగం చేసే పాలేరులే అన్న‌ట్టు త‌యారైంది పరిస్థితి. డ‌మ్మీల‌ను మంత్రులుగా, ఉప ముఖ్య‌మంత్రులుగా పెట్టుకోవ‌డం పొలిటిక‌ల్ స్ట్రాట‌జీగా మారింది.  ఏపీలో అనేక మంది మంత్రులు.. అస‌లు ఏ శాఖ‌కు మంత్రులో, వారిన‌స‌లు ఎందుకు మంత్రుల‌ను చేశారో, మంత్రిగా చేసేందుకు వారికున్న అర్హ‌త‌లేంటో.. సామాన్యుల‌కు ఓ ప‌ట్టాన అర్థం కాదు. కేవ‌లం కుల‌, మ‌త‌, ప్రాంత‌.. లెక్క‌ల బేరీజుతోనే చాలా మంది మంత్రులు, ఉప‌ముఖ్య‌మంత్రులూ అయ్యారు కానీ, వారికి ఏ కోశాన ఆ అర్హ‌త లేద‌నేది జ‌నం అభిప్రాయం. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో ప‌డి ఉండ‌ట‌మే.. బాస్ చెప్పిన‌ట్టు చేయ‌డ‌మే.. వారి ప‌ని. ఆ విష‌యం నిస్సిగ్గుగా మంత్రి పేర్ని నానినే ఒప్పుకోవ‌డం మ‌రింత శోచ‌నీయం. ఎలాంటి సిగ్గు-ఒగ్గు లేకుండా.. అవును, నేను సీఎం జ‌గ‌న్ పాలేరునే అని పేర్ని నాని ప్ర‌క‌టించుకోవ‌డం రాజ‌కీయాల్లో ప‌త‌న‌మ‌వుతున్న విలువ‌ల‌కు నిద‌ర్శ‌నం.

టాప్ న్యూస్ @ 1PM

రాష్ట్ర ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలపై చర్చించారు.పెండింగ్ నిధులు, ప్రాజెక్ట్‌ల జాప్యంపైనా భేటీలో చర్చించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలోని ఎంపీలు కనకమేడల, అయోధ్య రామి రెడ్డి, మార్గాని భారత్, గోరంట్ల మాధవ్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, వంగా గీత, సత్యవతి, ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్ప, బ్రహ్మానంద రెడ్డి, తలారి రంగయ్య, అనురాధ హాజరయ్యారు.  --------- గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు నమోదైంది. భూ వివాదంలో ఆయనపై చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలకో ఎంపీ  గల్లా జయదేవ్ సహా 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ------- రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి కౌలు చెల్లించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది వి వి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కొంతమందికి కౌలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదని  న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు వచ్చే గురువారంలోపు ఇవ్వాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది ------- కృష్ణా జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ రైతు యాత్ర నిర్వహిస్తోంది. రైతు యాత్రలో పసుపు శ్రేణులు కదం తొక్కాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. వేలాది మంది పాల్గొన్న రైతు యాత్రను బైక్ ర్యాలీతో మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు.  ----------- విశాఖపట్నంలో రోడ్లను బాగు చేయాలంటూ శ్రమదానం చేస్తూ సీపీఎం నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్వర్ణ భారతి స్టేడియం ఎదుట ప్రధాన రహదారిపై గుంతలను పూడ్చి..రోడ్లను మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం కార్పొరేటర్ గంగారావు, పార్టీ నగర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లను పూడ్చి వేస్తున్న సమయంలో సీపీఎం నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు ------ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను బీజేపీ పార్టీ ప్రకటించింది. హుజురాబాద్ ఉపఎన్నిక టార్గెట్‌గా ముందుకెళ్తోన్న సంగ్రామ యాత్ర ముగింపు సభను అక్టోబర్ 2న హుస్నాబాద్‎లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. అయితే.. షెడ్యూల ప్రకారం హుజురాబాద్‎లో ముగింపు సభ అనుకున్నారు. కానీ..ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో సభను హుస్నాబాద్‎లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. --------- జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‎తో రైతు ఎతీశ్వర్‌రెడ్డి(40) మృతి చెందాడు. ఈ ఘటన గొవిందుపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. పొలం దగ్గర మొక్కజొన్న పంటకు అడవి పందులు రాకుండా వేసిన విద్యుత్ కంచె తీగలకు తాకిన అన్న శంకర్ రెడ్డిని కాపాడబోయి తమ్ముడు ఎతీశ్వర్ రెడ్డి పక్కనున్న కంచె మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.  ----- తెలంగాణ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాకిచ్చారు. పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై అతివేగంగా వెళ్లినందుకు ఆయన వాహనానికి ఓవర్‌స్పీడ్‌ చలానాలు విధించారు. సోమేష్ కుమార్‌ అధికారిక వాహనం(టీఎస్09ఎఫ్ఏ0001)కు రూ.3వేలు చలానా విధించారు. విషయం తెలియగానే అధికారులు జరిమానా చెల్లించారు.  ------ పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి రాళ్లతో దాడి చేశారు. పోసానిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. దీంతో భయాందోళనకు గురైన వాచ్‌మెన్.. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాచ్ మెన్ ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ------- ఈక్వెడార్ దేశంలోని పెనిటెన్షియారియా డెల్ లిటోరల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 116 మంది మరణించారు. ఈక్వెడార్ జైలు కాంప్లెక్సులో ఖైదీలు తుపాకులు, గ్రనేడ్లతో ఘర్షణ పడ్డారు. మెక్సికన్ డ్రగ్స్ ముఠాల వల్ల ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని జైలు అధికారులు చెప్పారు.జైలులో జరిగిన అల్లర్లలో 116 మంది మరణించారని, వీరిలో ఆరుగురిని శిరచ్ఛేదం చేశారని నేషనల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది

కేంద్రమంత్రులతో కోమటిరెడ్డి భేటీల వెనుక అసలు కారణం అదేనా?

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కు దూరమవడం ఖాయమైనట్టేనా? రేవంత్ పీసీసీ చీఫ్ గా ఎన్నికవడాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. పీసీసీ పదవి తమకే కావాలని పట్టుబడుతూ వచ్చారు. అయితే హైకమాండ్ మాత్రం ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా ఓ స్థిరమైన నిర్ణయం తీసుకొని రేవంత్ కే పట్టాభిషేకం చేసింది. దీంతో ఇక కాంగ్రెస్ లో తాము ఇమడలేమన్న నిర్ధారణకు కోమటిరెడ్డి వచ్చినట్లేనా అన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో, బీబీనగర్ లోని ఎయిమ్స్ అభివృద్ధి పేరుతో కేంద్రానికి దగ్గరవుతూ... అదే సమయంలో కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేలా ఆయన చేసిన  వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకులను ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ దూకుడుతో టీఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తోందన్న అంచనాలు పెరుగుతున్న క్రమంలో కోమటిరెడ్డి స్ట్రాటజీ రేవంత్ అండ్ టీమ్ ను బలహీనపరచేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ కావడం నల్గొండ జిల్లా రాజకీయాల్లోనే గాక కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. భువనగరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోమటిరెడ్డి కోరారు. తన అభ్యర్థన మేరకు, అడిగిందే తడవు రూ. 800 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినందుకు కేంద్రమంత్రికి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరువాత అంతటి ప్రాధాన్యత బీబీనగర్ ఎయిమ్స్ కు ఉంది. హైదరాబాాద్ కు అతి దగ్గరలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్ రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్లే అభివృద్ధికి నోచుకోవడం లేదని, అందుకే దాని అభివృద్ధి కోసం తాను కేంద్రమంత్రిని కలిశానని కోమటిరెడ్డి అంటున్నారు. ఈ సంస్థను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాననీ హామీ ఇస్తున్నారు.  దాదాపు 20 నిమిషాల వీరి భేటీ తరువాత కోమటిరెడ్డి ఎంతో  ఆనందంగా తిరిగిరావడం, తన కృషి  ఫలించిందని సంతృప్తి వ్యక్తం చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అభివృద్దికి నోచుకోకుండా ఉన్న‌ ఎయిమ్స్ పై చాలా సార్లు  కేంద్ర మంత్రులను, ఇతర ఉన్న‌తాధికారుల‌ను కోమటిరెడ్డి క‌లిసి విన్న‌వించారు. ఈ క్రమంలోనే ఇటీవల నూతనంగా ఆరోగ్య శాఖ బాధ్యతలు స్వీకరించిన మన్సుఖ్ మండవీయను కలిసి బీబీనగర్ ఎయిమ్స్ పరిస్థితిని వివరించారు.  అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం రూ. 776.13 కోట్లు భ‌వ‌నాల‌ నిర్మాణానికి కేటాయించింది. అలాగే మరో రూ. 23.50 కోట్లు ఎయిమ్స్ నిర్వహణ కొరకు మంజూరు చేశారు. దీంతో ఎయిమ్స్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఆరోగ్యపరంగా, అది కూడా కోవిడ్ విజృంభించిన తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని దశల్లోనూ విఫలమైన తరుణంలో ఎయిమ్స్ కు సర్వహంగులూ సిద్ధించే శుభఘడియలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చాశంగా మారింది.  మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ లో ముఖ్యమంత్రిని మార్చడం, పంజాబ్ పాలనలో తనదైన ముద్ర వేసుకొని అన్ని పక్షాల నుంచి ప్రశంసలు అందుకున్న అమరీందర్ సింగ్ ను తప్పించడం, పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అనూహ్యంగా నవ్ జోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరువు పోతోంది. అదే సమయంలో ఛత్తీస్ గఢ్ సీఎంకు వ్యతిరేకంగా మరో వర్గం ఢిల్లీలో ల్యాబీయింగ్ చేస్తుండడంతో రాహుల్ గాంధీ అపరిపక్వత మరోసారి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా బీజేపీ వైపు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా బీజేపీ పెద్దలతో సఖ్యంగా కనిపించడం సహజంగానే తాజా రాజకీయాలపై పుకార్లకు తావిస్తోంది.  హుజూరాబాద్ కు త్వరలో ఉపఎన్నిక జరుగుతున్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగడంపై పునరాలోచన చేస్తున్నారా.. లేక నిజంగా బీబీనగర్ ఎయిమ్స్ కు నిధులు రాబట్టేందుకే ఆయన పర్యటనను పరిమితం చేశారా... అదే నిజమైతే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంటివారితో కాకుండా ఒక్క కోమటిరెడ్డిని మాత్రమే ఎక్స్ పోజ్ చేస్తూ నిధులు విడుదల చేయడంలో మర్మమేంటి అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఇలాంటి అనుమానాల నేపథ్యంలో కోమటిరెడ్డి తాజా అడుగులు ఎలా పడతాయి.. ఎటువైపు మొగ్గు చూపుతాయో రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 

పోసాని ఇంటిపై అర్థ‌రాత్రి రాళ్ల దాడి.. రెచ్చిపోయిన దుండ‌గులు..

అర్థ‌రాత్రి. 2 గంట‌ల స‌మ‌యం. అంతా సైలెన్స్‌. గ్రామ‌సింహాల ఘోంకారాలు త‌ప్పా మ‌రెలాంటి శ‌బ్ద‌మూ లేదు. అలాంటిది స‌డెన్‌గా ఓ అగంత‌కుల ముఠా పోసాని కృష్ణ‌ముర‌ళి ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మైంది. పోసానిని బండ‌బూతులు తిడుతూ.. ఆయ‌న ఇంటిపై రాళ్ల దాడి చేశారు. నానావీరంగం సృష్టించారు. దుండ‌గుల రాళ్ల దాడి, అరుపుల‌తో వాచ్‌మెన్ హ‌డ‌లిపోయారు. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడ‌లోని పోసాని ఇంటిపై అర్థ‌రాత్రి జ‌రిగిన దాడి తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. పీకేను పోసాని ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా బండబూతులు తిట్ట‌డంతో జ‌న‌సైనికులు ఆరోజే ఆయ‌న‌పై దాడికి య‌త్నించారు. పోలీసుల అండ‌తో పోసాని బ‌య‌ట‌ప‌డ్డారు. ఇక మంగ‌ళ‌గిరి మీటింగ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం రెచ్చిపోయారు. త‌న‌పై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే.. తాట తీస్తాం, తోలు వ‌లుస్తాం, బ‌య‌ట‌కు లాక్కొచ్చి తంతాం.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే స్పూర్తిగా తీసుకున్నారో ఏమో.. పీకే చెప్పిన‌ట్టే చేశారు కొంద‌రు అగంత‌కులు. అర్థ‌రాత్రి పోసాని ఇంటి కొచ్చి.. నోటికొచ్చిన‌ట్టూ తిడుతూ.. రాళ్ల‌తో దాడి చేశారు. వాచ్‌మెన్.. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వాచ్ మెన్ ఫిర్యాదుతో పోలీసులు స్పాట్‌కు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే, పోసాని కృష్ణమురళి కుటుంబం కొన్ని నెలల క్రిత‌మే ఆ ఇల్లు ఖాళీ చేసి.. వేరే చోట నివాసం ఉంటోంది. ఆ విషయం తెలియని దుండగులు, పోసాని ఎల్లారెడ్డిగూడలోని ఇంట్లోనే ఉంటున్నారనుకుని దాడికి పాల్పడ్డారు. దాడి చేసింది ప‌వ‌న్ ఫ్యాన్స్ అని అనుమానిస్తున్నారు.   

అన్న‌, చెల్లికి పీకేనే అడ్వైజ‌ర్‌.. దొందు దొందేనా?

అదో జ‌గ‌న్నాట‌కం. అస‌లేమీ అర్థం కాదు. అన్నాచెల్లిల మ‌ధ్య ఏముందో ఎవ‌రికీ తెలీదు. బ‌య‌ట‌కు మాట్లాడుకోరు. విడిపోయామంటారు. ఆస్థిగొడ‌వ‌లతో వేరుప‌డ్డామంటారు. అలిగి పుట్టింటి నుంచి అత్తారింటికి వ‌చ్చేశానంటుంది. తండ్రి స‌మాధి సాక్షిగా ఎడ‌ముఖం- పెడ‌ముఖం పెట్టుకుంటారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ. తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ. ఏందో.. ఈ రాజ‌కీయ డ్రామా. కొంద‌రు ష‌ర్మ‌ల జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణ‌మే అంటే.. మ‌రికొంద‌రు కేసీఆర్ బాణ‌మ‌ని.. బీజేపీ బాణ‌మ‌ని.. ఎవ‌రికి తోచిన విశ్లేష‌ణ‌లు వాళ్లు చేశారు. ఆ గుస‌గుస‌లు అలా సాగుతుండ‌గానే.. తెలంగాణ కోడ‌లినంటూ వైఎస్సార్‌టీపీ స్థాపించేశారు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం నిరుద్యోగ దీక్ష చేస్తూ.. చిత్త‌శుద్ధి చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ అంతంత మాత్ర‌మే. తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు కొల్ల‌గొట్టే ప‌ని ఆశించినంత మేర వ‌ర్క‌వుట్ అవ‌డం లేదు. మంచి పేరున్న నేత‌, కాస్త ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయ‌కుడు.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఆ పార్టీలో చేర‌లేదు. ఓ మీడియా సంస్థ స‌హాయంతో మాత్ర‌మే ఎలాగోలా రాజ‌కీయ బండి లాక్కొస్తున్నారు ష‌ర్మిల‌.  ఇక‌, ఇలాగైతే వ‌ర్క‌వుట్ కాద‌ని.. దేశంలోకే టాప్ మోస్ట్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్‌ను హైర్ చేసుకున్నారు. డ‌బ్బుకు డోకా లేక‌పోవ‌డంతో.. భారీ మొత్తానికే ఒప్పందం కుదుర్చుకున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు మీడియా సంస్థ‌ల‌కు, మీడియా ప్ర‌ముఖుల‌కు పెద్ద మొత్త‌మే స‌మ‌ర్పించుకున్న ష‌ర్మిల‌.. ఇక పీకే.. క‌న్స‌ల్టెన్సీకీ క‌ళ్లు తిరిగే పైకం ఇచ్చేందుకు డీల్ కుదిరింది. ఆ వెంట‌నే పీకే టీమ్ లోట‌స్‌పాండ్‌లో వాలిపోయింది. మేడ‌మ్‌తో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిగాయి. తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు, మిగ‌తా ప్ర‌తిప‌క్షాల బ‌లాబ‌లాలు, ఇక్క‌డి స‌మ‌స్య‌లు, ఇక్క‌డి భావోద్రేకాలు, అనుచ‌రించాల్సిన వ్యూహాలు ఇలా అన్నిటిపైనా ప్రాధ‌మిక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఆ మేధోమ‌ధ‌నం ఓ కొలిక్కి వ‌చ్చాక‌.. ఇక వ‌చ్చే రెండేళ్ల‌లో వైఎస్సార్‌టీపీ అనుస‌రించాల్సిన ఎత్తుగ‌డ‌ల‌ను పీకే టీమ్ రెడీ చేయ‌నుంది.  ఆస‌క్తిక‌రంగా స‌రిగ్గా ఇదే స‌మ‌యంలోనే అటు ఏపీలో వైఎస్సార్‌సీపీ కోసం వ‌ర్క్ చేసేందుకు ప్ర‌శాంత్ కిశోర్ బృందం రంగంలోకి దిగింది. వారం గ్యాప్‌లో రెండు రాష్ట్రాల్లో, రెండు వేరు వేరు పార్టీల‌కు, అందులోనూ విభేదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం అవుతున్న అన్నాచెల్లిల కోసం పీకే టీమ్ ప‌ని చేయ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్‌. అయితే, పీకేతో ఎవ‌రికి వారే వేరు వేరుగా డీల్ కుదుర్చుకోలేద‌ని.. ఇటు తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీకి, అటు ఏపీలో జ‌గ‌న్ పార్టీకి ప‌ని చేయాల‌ని.. రెండు డీల్స్ కాబ‌ట్టి పొలిటిక‌ల్ డిస్కౌంట్ ఇవ్వాల‌ని బాగానే బేరం ఆడార‌ని అంటున్నారు. చెల్లి కోస‌మూ అన్న‌నే సంప్ర‌దింపులు జ‌రిపార‌ని చెబుతున్నారు. 1+1 డీల్‌తో పీకే టీమ్‌ను వైఎస్ ఫ్యామిలీ హైర్ చేసుకుంద‌ని తెలుస్తోంది. దీంతో, అన్నా-చెల్లిల మ‌ధ్య గొడ‌వ‌ల‌నేది వ‌ట్టి డ్రామానేనా? తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోడానికి కావాల‌నే త‌మ మ‌ధ్య విభేదాలున్నాయ‌నేలా సీన్ క్రియేట్ చేశారా? అనే అనుమానం క‌లుగుతోంది.  అందుకు, మ‌రింత బ‌లం చేకూర్చేలా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల త‌న‌కు అన్న‌తో అంత‌పెద్ద‌గా గొడ‌వ‌లేమీ లేవ‌ని.. కూర్చొని మాట్లాడుకుంటే స‌మ‌సిపోతాయ‌ని.. జ‌గ‌న్ త‌న‌తో ట‌చ్‌లోనే ఉన్నాడ‌ని, రెగ్యుల‌ర్‌గా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నామ‌ని తేల్చేసింది. దీంతో, ఇదంతా తెలంగాణ‌లో చెల్లిని రాజ‌కీయంగా సెట్ చేయడానికి జ‌గ‌నన్న ఆడుతున్న పొలిటిక‌ల్ డ్రామానేన‌ని.. ష‌ర్మిల జ‌గ‌న్ వ‌దిలిన బాణ‌మేన‌ని తేలిపోతోంద‌ని అంటున్నారు. 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు.. చిత్తూరు జిల్లాలో భూవివాదం..

తెలుగు దేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు నమోదైంది. భూ వివాదంలో ఆయనపై చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలకో ఎంపీ  గల్లా జయదేవ్, ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు, ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువమాఘం గ్రామంలో దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం భవనాలు నిర్మించారు. ఆ భవనాలకు ఆనుకుని ఉన్న తన పొలాన్ని ఆక్రమించుకున్నారని... భారీగా ప్రహరీ గోడ నిర్మించారని రైతు గోపీకృష్ణ ఆరోపిస్తున్నారు. తన భూమి కోసం 2015 నుంచి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం లేకపోవడంతో 2 నెలల క్రితం కోర్టును ఆశ్రయించానని తెలిపారు.కోర్టు ఆదేశాలతో ఎంపీ గల్లా జయదేవ్ తదితరులపై ఐపీసీ 109, 120బీ, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ 156(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సల నాయుడు, ఎం.మోహన్ బాబు, గ్రామ సర్పంచ్, కార్యదర్శి, లాయర్ చంద్రశేఖర్ పై కేసులు నమోదు చేశామని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ తెలిపారు. 

పీకే డైరెక్షన్.. పోసాని యాక్షన్! బూతులు వింటూ జగన్ రెడ్డి ఎంజాయ్?

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య సాగుతున్న మటాల యుద్ధం హద్దులు దాటింది. వ్యక్తిగత దూషణలు శృతి మించాయి. పవన్ కల్యాణ్ పై బండ బూతులతో విరుచుకుపడుతున్నారు వైసీపీ మంత్రులు, నేతలు. ఇక ఈ వివాదంలో ఎంటరైన పోసాని కృష్ణ మురళీ... పీకేపై మాట్లాడిన పచ్చి బూతులు ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. పవన్ తో పాటు కుటుంబ సభ్యులపైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పోసాని. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ బూతు పురాణంపై జనాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతగా దిగజారి బూతులు తిట్టడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయితే ఈ గొడవ వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ వస్తోంది. వైసీపీ నేతలు ప్లాన్ ప్రకారమే ఈ దాడి కొనసాగిస్తున్నారని, తమ రాజకీయ వ్యూహంలో భాగంగానే వైసీపీ నేతలు పవన్ ను రెచ్చగొడుతున్నారని అంటున్నారు.  తాజాగా పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య సాగుతున్న వార్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ ఉందని ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్ కళ్యాణ్ గారి తల్లి, భార్య, కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదని అచ్చెన్న ప్రశ్నంచారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నడిపే పార్టీ నేతలపై ఉంటుందని అన్నారు.  రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పకుండా దాటవేసి బూతులు, తిట్లతో మహిళా లోకాన్ని బజారుకీడ్చడాన్ని ఏమంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు అచ్చెన్నాయుడు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో? అన్నారు. బూతులు, జుబుత్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను, ప్రజా ప్రయోజనాలను బలిపెట్టకూడదన్న అచ్చెన్న.. రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజా స్వామ్య స్పూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే సరైన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారిందన్నారు ఏపీ టీడీపీ చీఫ్. డ్రగ్ మాఫియాతో వైసీపీ నేతలు చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు దోపిడి చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ డ్రగ్స్ మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. హెరాయిన్ తో పాటు, గంజాయి, గుట్కా, తలనీలాలు, ఎర్రచందనం, బియ్యం, శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలతో దోపిడి పెరిగిపోయిందన్నారు అచ్చెన్నాయుడు. విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజీల్ ధరలు, ఇసుక రేట్లు, మద్యం రెట్లు, ఆస్తి పన్ను, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైసీపీ నేతలు కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పీకే ఎపిసోడ్ లో బీజేపీ మౌనం.. కమలంతో జనసేన కటీఫ్? 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం మహా జోరుగా సాగుతోంది. సినిమా టికెట్ల వ్యవహరంగా మొదలైన మాటల యుద్ధం, మలుపులు తిరిగి రాజకీయ రచ్చకు దారి తీసింది.  ఒక్కసారిగా రాజకీయ మలుపు తీసుకుంది. మరో వంక  పోసానీ కృష్ణ మురళీ ఎంట్రీతో మాటల యుద్ధం బూతుల యుద్ధంగా మారిపోయింది. మొత్తానికి,రెండు పార్టీల మధ్య సాగుతున్నమాటల యుద్ధంలో  వ్యక్తిగత విమర్శలు, వికారాలు అన్నీ బయటకు వస్తున్నాయి.  మంత్రులు కూడా మర్యాద గీతను దాటి  పవన్ కళ్యాణ్’పై  వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారారు. దేవుని సన్నిది అని కూడా చూసుకోకుండా ఏడూ కొండల పైన సాక్షాత్తు అమాత్యులు బూతులు మాట్లాడేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అందులోనూ మంత్రివర్గ పక్షాళన, సమయం సమీపిస్తున్నదేమో, మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. మరో వంక  పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ  నాయకులు, కార్యకర్తలు, పవన్ ఫాన్స్ మాత్రమే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి, ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న మాటాల యుద్దంలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పే పరిస్థితి లేదు. దొందూ ..దొందే ...ఇద్దరూ బూతు భాగోత్తుములే అందులో ఏ సందేహం లేదు.  రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా జనసేన మిత్ర మిత్రపక్షం బీజేపీ స్పందించక పోవడం దేనికి సంకేతం? బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందనే విషయంలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి, బీజీపీ, జనసేన మిత్ర పక్షాలే అయినా రెండు పార్టీల మధ్య సంయోధ్యత లేదనే విషయం తిరుపతి ఉప ఎన్నికలలోనే తేలిపోయింది. ఆ తర్వాత కూడా రెండు పార్టీలు కలిసి కూర్చున్న సందర్భాలు కూడా ఇంచుమించుగా లేవనే చెప్ప వచ్చును. మారిన పరిస్థితులలో బీజేపీ, వైసీపీకి దగ్గరవుతోందనే అనుమానలున్నాయి.తెలుగు దేశం పార్టీ నాయకులు పలు సందర్భాలలో, ఇందుకు సంబందించిన కొన్ని ఆధారాలను బయట పెట్టారు. మరోవంక బీజేపీతో లాభం లేదని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించిన జనసేన, 2024 ఎన్నికల్లో   టీడీపీతోకలిసి పోటీచేసే అవకాశం ఉందని ఉభయ పార్టీల్లోనూ వినవస్తోంది. నిజానికి,మొన్నటి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో లోపాయికారీ ఒప్పందాలు కుదిరాయి. ఫలితంగా జనసేన వోటు షేర్ పెరిగింది. సో .. ఈకారణంగా కూడా బీజేపీ మౌనం వహించిందనే అనుమానాలు కూడా లేక పోలేదు. మరో వంక పోసానికృష్ణ మురళీ హద్దులు దాటి చేసిన దాడిని, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గట్టిగా ఖండించారు. పోసాని మురళి పెయిడ్‌ ఆర్టిస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. పోసాని భాష,. ఆయన మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న టీడీపీ నేత.. పోసాని చేత ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ మాట్లాడిస్తోందనే అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బహిరంగంగా ఎందుకు వారించడంలేదని ప్రశ్నించారు. అయితే ఇంత కథ నడిచిన తర్వాత, ఏమనుకున్నారో ఏమో, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సీన్ ‘లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్’పై వైసీపీ నాయకులు చేసినవ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్‌  విషయంలో వైసీపీ నాయకులు గీత దాటి దుర్భాషకు దిగుతున్నారని అన్నారు. విమర్శను తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలన్నారు. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకమని చెప్పారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలని సెటైర్లు వేశారు జీవీఎల్ న‌ర‌సింహారావు.ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జీవీఎల్ వ్యాఖ్యలను సమర్ధించారు. ఆయన చేసిన ట్వీట్ ను ఈయన రీట్వీట్ చేశారు. అయితే బీజేపీ, జనసేనల మధ్య ఇప్పటికే పెరిగిన దూరం తాజా దుమారంతో మరింత పెరిగింది. నిజానికి, జనసేన బీజేపీతో  విడాకులకు ఎప్పుడోనే సిద్దమైంది. ముహూర్తం ఖరారు కావడమే మిగిలిందని.. ఆరెండు పార్టీలలో కీలక పదవుల్లో ఉన్నవారే అంటున్నారు. 

కేటీఆర్ ప్రధాని అయితే సీఎం ఎవరో? 

తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే  కేసీఆర్ సీఎం పదవి తీసుకోరని ప్రచారం జరిగింది. తర్వాత కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారనే చర్చ బయటికి వచ్చింది. మూడేండ్లుగా ఇది సాగుతూనే ఉంది. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగినా... ఎన్నికలు జరిగినా ఈ అంశం తెరపైకి వస్తుంది. కాని ఇది ప్రచారంగానే మిగిలిపోతోంది. కొన్ని సార్లు సీఎం కేసీఆరే స్వయంగా ముఖ్యమంత్రి మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అయినా కేటీఆర్ పట్టాభిషేకంపై ప్రచారం మాత్రం ఆగలేదు.  సీఎం కేసీఆర్ వరుస ఢిల్లీ పర్యటనలతో మరోసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అంశం ప్రచారంలోకి వచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తారనే చర్చ సాగుతోంది. అయితే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం సాగుతుండగా.. జీవన్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రి పదవికే గురి పెట్టారు. దేశ భవిష్యత్ ప్రధాని కేటీఆరేనని జోస్యం చెప్పారు. మరో 20, 30 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావడం పక్కా అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ఈ దెబ్బతో తమకు భవిష్యత్ లేదని కాంగ్రెస్, బీజేపీలు కలత చెందుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలో ఇలాంటి లీడర్ ఉండటం గ్రేట్ అని జాతీయ స్థాయిలో కేటీఆర్ పై చర్చ నడుస్తుందని కూడా చెప్పారు జీవన్ రెడ్డి. కేటీఆర్ కాబోయే ప్రధాని అంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం ఉన్న సమయంలో ప్రధానమంత్రి అవుతారని ఎందుకు చెప్పారన్న దానిపై రకరకాల వాదనలు వస్తున్నాయి. కేటీఆర్ ఇప్పట్లో సీఎం అయ్యే అవకాశాలు లేకపోవడం వల్లే పీఎం అంటూ జీవన్ రెడ్డి కామెంట్ చేశారని అంటున్నారు. కేటీఆర్ కాకుండా మరొకరిని సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఎమ్మెల్సీ కవిత కూడా సీఎం కేసులో ఉన్నారని, కుటుంబంలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ముఖ్యమంత్రి మార్పు జరగడం లేదని గతంలో ప్రచారం కూడా జరిగింది.  ఇక కేటీఆర్ ను ప్రధానిగా చెప్పడం ఏంటనే ప్రశ్న కూడా వస్తోంది. కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జీవన్ రెడ్డి అతిగా మాట్లాడారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే సాగుతోంది. విపక్షాలు మాత్రం జీవన్ రెడ్డి ప్రకటనపై సెటైర్లు వేస్తున్నాయి. సీఎం సీటుకు దిక్కు లేదు ప్రధానమంత్రి అవుతారా అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో విపక్షాలు దూకుడు పెంచాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజవ దండోరా యాత్రలతో దూసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమా కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీంతో తమకు మరోసారి అధికారం రావడం కష్టమని గులాబీ నేతలు గ్రహించడం వల్లే... ఇప్పుడు కొత్తగా పీఎం అంటూ ప్రకటనలు చేస్తున్నారనే చర్చ కొన్ని వర్గాల నుంచి వస్తోంది. కేటీఆర్ పీఎం అవుతారని చెప్పడం ద్వారా.. పరోక్షంగా సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పకనే చెప్పారనే చర్చ కూడా సాగుతోంది. 

వైసీపీ ఎమ్మెల్యేపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్ లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు ఉచ్చు బిగిసుకుంటోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ శ్రేణులు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాయి. మాజీ ముఖ్యమంత్రిపై దౌర్జన్యానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని కోరాయి.  ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటవిక పాలన సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అయినా పోలీసులు అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగానే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్ దండయాత్రగా రావడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై  టీడీపీ వర్గాలు సీరియస్ గా స్పందించాయి.జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. తాజాగా  రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు లేఖల రూపంలో ఫిర్యాదులు చేసింది.  టీడీపీ గ్రామ కమిటీల్లోని నేతలు తీర్మానాలు చేసి సంతకాలు చేసిన లేఖలను పోస్టు ద్వారా పంపినట్లు టీడీపీ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. సెప్టెంబరు 17న చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్, అతని అనుచరులు దండయాత్రగా రావడం రాష్ట్రంలోని రాక్షస పాలనకు పరాకాష్ఠ అని పేర్కొంది. ఈ దాడికి డీజీపీ, సీఎంల మద్దతు ఉందని జోగి రమేశ్ బహిరంగంగా ఒప్పుకున్న విషయాన్ని ప్రస్తావించిన టీడీపీ.. డీజీపీని రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. సీఎం నేతృత్వంలో ఇలాంటి దాడి జరగడం ప్రజాస్వామ్యానికే చీకటి రోజని టీడీపీ అభిప్రాయపడింది.  ప్రతిపక్ష నేతలను బెదిరించడం, ఇళ్లపై దాడులు చేయడం వంటి హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదని టీడీపీ నాయకులు అన్నారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. టీడీపీ నేతల ఫిర్యాదు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ నేతలు మాత్రం జోగి రమేష్ పై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాయి.   

కేటీఆర్ మిస్సింగ్.. హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్ల క‌ల‌క‌లం..

తెలంగాణ‌లో అతిభారీ వ‌ర్షాలు. హైద‌రాబాద్‌లో కుండ‌పోత వాన‌. కేసీఆర్ ప్ర‌భుత్వం ఏకంగా ఒక‌రోజు సెల‌వు కూడా ఇచ్చేసింది. వ‌ర‌ద ఉధృతి కార‌ణంగా భాగ్య‌న‌గ‌రంలోని ముషారాంబాగ్ బ్రిడ్జిని సైతం మూసేశారు. ముసీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. ముసీ గ‌ట్టు మీద ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఎప్ప‌టిలానే లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ వ‌ర‌ద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మూడు రోజులుగా న‌ర‌కం చూస్తున్నారు జ‌నాలు. మ‌రి, ఇంత జ‌రిగితే ప‌ట్ట‌ణ‌శాఖ మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌రేం? గ‌త‌సారి హైద‌రాబాద్‌కు వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు కేటీఆర్ న‌గ‌రంలో విస్తృతంగా చ‌క్క‌ర్లు కొట్టారు. కుటుంబానికి 10వేలు కూడా ఇచ్చారు. అదికూడా కొంద‌రికే. అప్పుడు జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌లు ఉండ‌టంతో అలా చేశారంటూ అంతా విమ‌ర్శించారు. ఇప్పుడు ఎన్నిక‌లు లేవు కాబ‌ట్టి ఇటు వైపు కూడా చూడ‌టం లేదంటూ హైద‌రాబాదీలు మండిప‌డుతున్నారు. ఇక జిల్లాల్లోనూ ఇదే తీరుగా ఉంది ప‌రిస్థితి. త‌న సొంత ఇలాఖా సిరిసిల్ల నీట‌మునిగితే వెళ్లి చూశారు కానీ.. మిగ‌తా జిల్లాలు జ‌ల‌మ‌య‌మైతే ప‌ట్టించుకోరా అంటూ మంత్రి కేటీఆర్‌ను నిల‌దీస్తున్నారు బాధితులు.  ఇక భాగ్య‌న‌గ‌ర వాసులు మ‌రో అడుగు ముందుకేసి.. త‌మ‌దైన స్టైల్‌లో నిర‌స‌న తెలిపారు. ‘కేటీఆర్ మిస్సింగ్’ అంటూ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో పోస్ట‌ర్లు అంటించారు. ఎక్క‌డ వ‌ర‌దుంటే అక్క‌డ కేటీఆర్ మిస్సింగ్ అనే వాల్ పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తుండ‌టం అధికార పార్టీని క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. పోనీ, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టిద్దామా అంటే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఇంకెన్నాళ్లీ దుస్థితి అంటూ నిల‌దీసే ప‌రిస్థితి ఉంది. ఆ భ‌యంతో మంత్రి కేటీఆర్‌ అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదంటున్నారు. ఆయ‌న రాక‌పోయే స‌రికి కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్ట‌ర్ల‌తో త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు వ‌ర‌ద బాధితులు.  మ‌రికొంద‌రు క్రియేటివ్ పీపుల్స్ ఆ పోస్ట‌ర్ల‌కు వ‌ర‌ద విజువ‌ల్స్ కూడా జ‌త చేసి.. మీమ్స్‌తో వీడియోలు రెడీ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు. అవి తెగ వైర‌ల్ అవుతుండ‌టంతో కేటీఆర్ ఫుల్‌గా బ‌ద్నామ్ అవుతున్నారు. పోతే ఓ లొల్లి. పోక‌పోతే ఇంకో లొల్లి. ఇదేందిబై అంటూ కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి బ‌య‌ట‌కు రావ‌ట్లేదని అంటున్నారు.   

హుజూరాబాద్ లో నిర‌స‌న‌ నామినేషన్లు.. కారుకు గండమేనా? 

హుజూరాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడంతో, రాజీకీయ పార్టీల పరుగులు మొదలయ్యాయి. ముందు నుంచే నువ్వా ... నేనా అన్నవిధంగా పోటా పోటీగా ప్రచారం సాగిస్తున్న తెరాస, బీజేపీ ప్రచారాన్ని మరింత ఉదృతం చేశాయి. హుజూరాబాద్’ను గెలిచి తీరాలని పట్టుమీదున్నఅధికార తెరాస మంత్రి హరీష్ రావు సారధ్యంలో అన్ని స్థాయిలలో సేనలను మొహరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరిని రంగంలోకి దింపింది.ఇక డబ్బు మూటలు, ‘మందు’ మార్బలం సంగతి అయితే చెప్పనక్కరలేదు. మరో వంక బీజేపీ,పార్టీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్’ని ముందు పెట్టి, కమల దళం వెనకనుంచి  వెనకనుంచి ప్రచారం సాగిస్తోంది. హుజూరాబాద్’లో పోటీ, రెండు పార్టీల మధ్యకాదు, ఇద్దరి వ్యక్తుల మధ్య అనే విధంగా బీజేపీ ప్రచార వ్యూహాన్ని నడిపిస్తోంది. మరోవంక  కాంగ్రెస్ పార్టీ కూడ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధిని ఖరారు చేసి, కదన రంగంలోకి దూకేందుకు సిద్దమవుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటన్నది, ఇంకా స్పషం కాలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో హుజూరాబాద్’లో పోటీకి సంబంధించి పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే ప్రధాన పార్టీల బలాలు బలహీనతలు,ప్రచార, ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నా, ఈ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమం నుంచి, తెరాస వ్యతిరేక అజెండాతో  పుట్టిన పార్టీలు, అదే విధంగా ఇటీవల కాలంలో, వైఎస్సార్ కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోదరి షర్మిలా పెట్టిన వైఎస్సార్టీపీ, దళిత బహుజన వాదంతో రాజకీయ అరంగేట్రం చేసి, బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి, ప్రవీణ్ కుమార్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయి అనేది కూడా చాలా కీలకంగామారింది. అయితే, ఇందులో చాలా వరకు పార్టీలు, ఉద్యమ సంస్థలు పార్టీ (బీజేపీ) తో సంబంధం లేకుండా ఉద్యమ స్పూర్తితో ఈటల రాజేందర్’కు ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు బహ్విస్తున్నారు. ఈటల బీజేపీలో చేరి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయడం ఇష్టం లేకున్నా, శతృవు, శతృవు మిత్రుడు అనే నానుడి ఆధారంగా, తెరాసను ఓడించే సత్తా ఉన్నఈటలకు మద్దతు ఇవ్వాలని మెజారిటీ ప్రజాసంఘాలు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చాయని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే, కాంగ్రెస్ అభ్యర్ధి, కాంగ్రెస్ వ్యూహం స్పష్టమైతేనే కానీ, ఎవరు ఎటు అనేది స్పష్టం కాదని అంటున్నారు.    తెలంగాణ ఉద్యమంతో గానీ, తెలంగాణ ప్రజల సెంటిమెంట్స్’తో కానీ సంబంధం లేకుండా, వైఎస్సార్ సంక్షేమ పథకాలు, రాజన్న పాలన ప్రచార అస్త్రాలుగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల హుజూరాబాద్’లో పోటీ చేయడం లేదు. అయితే, ఆమె తాను సాగిస్తున్న నిరుద్యోగ పోరాటంలో భాగంగా, నిరుద్యోగ యువకులను బరిలో దించుతున్నారు. అయితే, ఆమె లక్ష్యం నిరుద్యోగులను గెలిపించడం కాదు, నిరుద్యోగుల నిరసనను తెలియ చేసేందుకు, ఎంతమంది నిరుద్యోగ యువకులు ముందు కొస్తే అంతమందికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని షర్మిల ప్రకటించారు. కాగా, తాజాగా ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారైన నేపధ్యంలో,  నామినేషన్లు వేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, యువకులు, ఇతరులకు సహకరిస్తామని వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టీపీ వెల్లడించింది. ఈ మేరకు  పార్టీ నామినేషన్ల కో ఆర్డినేటర్ బొమ్మ భాస్కర్ రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.  అయితే నిరుద్యోగ యువకులు పెద్ద సంఘ్యలో బరిలో దిగితే, అది పరోక్షంగా అధికార తెరాసకే మేలు చేస్తుందని,విశ్లేషకులు అంటున్నారు. నిజానికే ఉప ఎన్నికల్లో ఒక్క నిరుద్యోగ యువకులు మాత్రమే కాదు, కాంట్రాక్టు లెక్చరర్స్, ఇతర వృత్తి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో నిరశన నామినేషన్లకు సిద్ధ మవుతున్నారు. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు.