కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యార్థి నేత వెంకట్.. హుజురాబాద్ పై రేవంత్ మాస్టర్ ప్లాన్!   

తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరు వెంకట్ పేరు ఖరారైంది. హుజురాబాద్ అభ్యర్థిగా వెంకట్ పేరును అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది. సోమవారం వెంకట్ నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హుజురాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గెల్లు, ఈటలలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్  అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడింది.    హుజురాబాద్ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి సైలెంటుగానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ టికెట్ రేసులో పలువురు పేర్లు వినిపించాయి. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ప్రకటన ఆగిపోయిందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం హుజురాబాద్ లో తాను పోటీ చేయడం లేదని కొండా సురేఖ ప్రకటించింది. ఆమె పెట్టిన కండీషన్లకు పీసీసీ అంగీకరించకపోవడంతోనే పోటీ పై కొండా సురేఖ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది.  కొండా సురేఖ వెనక్కి తగ్గడంతో అభ్యర్థిపై సమీక్ష చేసిన పీసీసీ పెద్దలు.. ఇటీవల కాలంలో ప్రజా ఉద్యమాల్లో చురుకుగా ఉంటున్న ఎన్ఎస్ యూఐ చీఫ్ బలమూరి వెంకట్ వైపు మొగ్గుచూపారని సమాచారం. పీసీసీ సీఫారస్ చేసిన పేరునే ఏఐసీసీ ఖరారు చేసింది. బల్మూరి వెంకట్ కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా మరింత స్పీడ్ పెంచారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా పోలీసులకు చుక్కలు చూపించారు వెంకట్. వెంకట్ కు రేవంత్ రెడ్డి అండదండలు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు. అధికార పార్టీ విద్యార్థి నేతను బరిలోకి దింపినందున... కాంగ్రెస్ కూడా అదే ప్రయత్వం చేసినట్లు కనిపిస్తోంది.  

జల జీవన్ మిషన్ ప్రారంభం.. ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం జనాదరణ రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రధాని జనాదరణ గ్రాఫ్ పడిపోతోంది. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజం. నిజమే, కావచ్చు ప్రధాని గ్రాఫ్ ఎంత పడిపోయినా, ఇంకా ఆయనదే  పైచేయిగా వుంది. రాహుల్ గాంధీ సహా ఇతర జాతీయ నేతలు ఎవరూ  ప్రజాదరణలో ప్రధాని మోడీకి దగ్గరలో కూడా లేరు. ఒక విధంగా  ప్రస్తుతం ప్రధాని ప్రజాదరణ, ‘ ఏచెట్టు లేని దగ్గర ఆముదం చెట్టే మహా వృక్షం’ అన్నట్లుగా ఉంది. అయితే ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉంటుందని అనుకోవడం కుదరదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఉహించడం కూడా కొంచెం చాలా కష్టం. అందుకే, రాజకీయాల్లో వారం రోజులు కూడా  ఎక్కువ సమయమే అంటారు.  అందుకే కావచ్చు ఓ వంక కేంద్ర ప్రభుత్వం మరో వంక బీజేపీ  పడిపోయిన ప్రధాని మోడీ ప్రజాదరణ గ్రాఫ్ ను పైకి పాకించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  మోడీ ఇమేజిని పెంచేందుకు, బీజేపీ సోషల్ మీడియా కొవిడ్ వాక్సినేషన్ సక్సెస్ స్టోరీని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పెట్రోల్, డీజిల ధరల రోజువారీ వడ్డన, గ్యాస్ బండ  మోతను భరించలేక ప్రజలు, ముఖ్యంగా మహిళలలో పెరుగుతున్న అసంతృప్తిపై నీళ్ళు చల్లేందుకు, ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభమై, ఇప్పటికీ నత్తనడకన నడుస్తున్న,‘జల్‌ జీవన్‌ మిషన్‌’ను మరోమారు తెరమీదకు తీసుకోచింది.  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ జలజీవన్ మిషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు అమలు విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌ యాప్‌’ను ప్రారంభించారు. దీంతోపాటు ‘రాష్ట్రీయ జల్‌ జీవన్‌ కోశ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎవరైనా, ఏ సంస్థయినా.. గ్రామీణ ఇళ్లలో, బడుల్లో ఇతరత్రా చోట్ల నీటి కనెక్షన్లు అందించేందుకు సాయం అందించొచ్చు. నిజానికి, మోడీ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన స్వచ్చ భారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాగానే, జలజీవన్ మిషన్ వలన ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రణత ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగింది. ముఖ్యంగా మహిళల్లో ప్రజాదరణ పెరిగేందుకు ఈ పథకం ఉపయోగిస్తుందని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఒక విధంగా మోడీ మహిళల సాధికారిత పేరిట ప్రవేశ పెట్టిన పధకాలు నిశ్శబ్ద ఓటు బ్యాంకును సృష్టించింది.   ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయా గ్రామ పంచాయతీల పెద్దలు, నీటి సమితుల ప్రతినిధులతోనూ మాట్లాడారు. తమ ఇళ్లకు నీళ్లు అందుతున్నాయని, మహిళలు తమ ఖాళీ సమయాన్ని పిల్లల చదువులకు, ఉపాధి పనులకు కేటాయిస్తున్నారని వారు ప్రధానికి వివరించారు, ఒక విధంగా ఈ కార్యక్రమం ఇదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకరంగా సాగింది. ప్రధాని మోడీ, తమదైన శైలిలో మాటల మంత్ర జలాన్ని చల్లారు. జల జేవన్ మిషన్’తో మహిళలు దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలు తప్పుతున్నాయని అన్నారు.ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తుండటంతో వారి సమయం ఆదా అవుతోందని, తద్వారా వారు సాధికారత వైపు అడుగులు వేసే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. ఇలా  జల జీవన్ మిషన్ యాప్’ను ప్రారంభించడంతో పాటుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ నల్లా నీటి సదుపాయం కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మిషన్‌ అమలుకు కేంద్రం రూ.3.60 లక్షల కోట్లు కేటాయించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల గ్రామాల్లో నీటి సమితులు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీ(వీడబ్ల్యూఎస్‌సీ)లు ఏర్పాటు చేసింది. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం అందేలా కృషి చేయడం వీటి బాధ్యత.  ఈ మిషన్‌ ప్రారంభం నాటికి దేశంలో 3.23 కోట్ల(17 శాతం) గ్రామీణ ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉండగా.. ప్రస్తుతం ఇది 8.26 కోట్ల(43 శాతం)కు చేరడం విశేషం. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు గుప్పించారు. 3 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 70ఏళ్లు పడితే .. తమ ప్రభుత్వ హయాంలో కేవలం గత రెండేళ్లలోనే 5కోట్లకు పైగా నల్లా కనెక్షన్లు ఇచ్చామని మోదీ చెప్పుకొచ్చారు. అంటే.. మళ్ళీ మాకే ఓటేయండని ... జనాలకు చెప్పకుండానే చెప్పారు. అడక్కుండానే అడిగారు. 

ప్రజా ప్రభుత్వమా... తాలిబన్ రాజ్యమా?.. రేవంత్ రెడ్డి అరెస్టుతో హై టెన్షన్..  

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జంగ్ సైరన్ నిరసన కార్యక్రమం హైదరాబాద్ లో టెన్షన్ పుట్టించింది. ఎల్బీ నగర్ లో జంగ్ సైరన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  రేవంత్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తనను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా..? అని మండిపడ్డారు. అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి. శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాను వెళ్లడానికి ఎస్కార్ట్ ఇవ్వాలని, ఇంటి దగ్గర రోడ్డుపై బైఠాయించి రేవంత్ నిరసన తెలిపారు.   అటు ఎల్బీ నగర్ చౌరస్తాకు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. శ్రీకాంతా చారీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ సహా ఇతర పీసీసీ నేతలు పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. 

ఈట‌ల‌పై కోడి క‌త్తి త‌ర‌హా దాడి?.. హుజురాబాద్‌లో సంచ‌ల‌నం..

హుజురాబాద్ ఉప పోరు హోరెత్తుతోంది. ఈట‌ల రాజేంద‌ర్ చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని మ‌రీ నియోజ‌క‌వ‌ర్గ‌మంతా తిరుగుతున్నారు. స‌రైన తిండి లేదు.. వేళ‌కు నిద్ర లేదు.. మూడు నెల‌లుగా ఇదే తీరు. ఇక బైపోల్ డేట్ ఫిక్స్ కావ‌డంతో.. హుజురా..వార్ మ‌రింత ముదిరింది. ఈ ద‌శ‌లో సంచ‌ల‌న విష‌యాలు తెర మీద‌కు వ‌స్తుండ‌టం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈట‌ల‌, టీఆర్ఎస్ మ‌ధ్య తీవ్ర స్థాయిలో ల‌డాయి జ‌రుగుతోంది. ఈట‌ల‌ను ఓడించేందుకు అధికార పార్టీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. తాజాగా, హుజురాబాద్‌లో ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈట‌ల రాజేంద‌ర్‌పై దాడి జ‌రుగబోతోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఎవ‌రు ఈ వార్త‌ను లీక్ చేశారో.. ఈట‌ల‌పై ఎవ‌రు దాడి చేస్తారో.. ఎందుకు దాడి చేస్తారో.. ఎలా దాడి చేస్తారో.. తెలీదు కానీ.. ఈట‌ల‌పై అటాక్ కానుందంటూ ప్ర‌చారం మాత్రం జ‌రిగిపోతోంది. దాడి జ‌రిగే డేట్స్ కూడా చెప్పేస్తున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఈట‌ల‌పై అటాక్ జ‌రుగుతుంద‌ట‌. డేట్స్‌తో స‌హా చెబుతున్నారంటే ఏమ‌నుకోవాలి?  హుజురాబాద్‌లో ఈట‌ల టార్గెట్‌గా మ‌రో కోడి క‌త్తి దాడి జ‌రుగుతుందా? అనే అనుమానం. ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. కోడి క‌త్తి దాడి త‌ర‌హాలోనే రాజ‌కీయంగా లాభ‌ప‌డ‌టానికి ఈట‌ల‌నే.. త‌న‌పై తాను ఈ దాడి చేయించుకోబోతున్నారంటూ ప్ర‌చారం అవుతుండ‌టం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతోంది.  ఈ ప్ర‌చారంపై ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డుతున్నారు. కావాల‌నే త‌న‌పై ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 13, 14 తేదీలలో తన మీదన తానే దాడి చేయించుకుంటున్నా.. అంటూ మంత్రులు అంటున్నారని.. దీని వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉండే ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. తన మీద దాడికి అధికార పార్టీ నేత‌లు ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   

యాక్ష‌న్‌లోకి సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌.. రౌడీల‌కు జియో ట్యాగింగ్‌..

సైబ‌రాబాద్ సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర పేరు ప్ర‌క‌టించ‌గానే అక్ర‌మార్కులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. అబ్బో.. స్టీఫెన్ వ‌స్తే త‌మ ఖేల్ ఖ‌తం దుకాణం బంద్‌.. అంటూ తెగ వ‌ర్రీ అయ్యారు. వాళ్లు అనుకున్న‌ట్టే అవుతోంది. పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర నేర‌గాళ్లపై యాక్ష‌న్ షురూ చేశారు. సింగం మూవీలో న‌ర‌సింహ వ‌లే.. రౌడీల భ‌ర‌తం ప‌ట్టేందుకు రెడీ అయ్యారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోలీస్‌ స్టేషన్‌లో ఎంత మందిపై రౌడీషీట్‌ నమోదైంది? వారంతా ఎలాంటి నేరాలకు పాల్పడేవారు? తరచూ ప్రజలను ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వారెవరు?  భూక‌బ్జాలు చేస్తున్న‌దెవ‌రు? గంజాయి దందా జ‌రుపుతున్న‌ది ఎవ‌రు? ఇలా ప్రాంతాల వారీగా నేర‌స్తుల‌ జాబితాను సిద్ధం చేయాలని ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. నేరస్థులు, రౌడీషీట‌ర్ల ఇండ్లు, వారి అడ్రస్‌లు, లొకేషన్స్‌ను.. జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు సైబ‌రాబాద్ పోలీసులు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్థులతో పాటు.. పాత రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులను ఎస్‌హెచ్‌వోలు విడతల వారీగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇకపై నేరాలకు పాల్పడినా, పద్ధతి మార్చుకోకపోయినా ఇబ్బందులు తప్పవని త‌మ‌దైన స్టైల్‌లో వార్నింగ్ ఇస్తున్నారు.  ఇక క్రైమ్ డిపార్ట్‌మెంట్‌పైనా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌. స్టేష‌న్ల వారీగా దొంగ‌ల జాబితా దుమ్ము దులుపుతున్నారు. షాపులు కొల్ల‌గొట్టేవారు, తాళం వేసిన ఇళ్ల‌ను దోచుకునేవారు, చైన్ స్నాచ‌ర్స్‌, డైవ‌ర్స‌న్ బ్యాచెస్‌.. ఇలా పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. న‌గ‌రంపై పూర్తిస్థాయిలో ప‌ట్టు, అవ‌గాహ‌న ఉన్న అధికారి కావ‌డంతో.. సైబ‌రాబాద్‌ను మ‌రింత పీస్ ఫుల్ సిటీగా మార్చే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉన్నారు సీపీ స్పీఫెన్ ర‌వీంద్ర‌.   

జోరు వర్షంలోనే జనసేనాని శ్రమదానం.. పవన్ పర్యటనతో పోలీసులకు చుక్కలు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన పోలీసులకు సవాల్ గా నిలిచింది. తెగ టెన్షన్ పుట్టించింది. రాజ‌మండ్రిలో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్ల‌డంలో ఆ ప్రాంతంలో పోలీసులు అడుగ‌డుగున ఆంక్ష‌లు విధించారు. ఎయిర్ పోర్టు నుంచి శ్ర‌మ‌దానం చేయాల‌నుకున్న ప్రాంతానికి ప‌వ‌న్ వెంట వెళ్ల‌డానికి కొన్ని వాహ‌నాలకు మాత్ర‌మే అనుమ‌తులు ఇచ్చారు. బాలాజీపేట సెంటర్ స‌మీపంలో, హుకుంపేట-బాలాజీపేట రోడ్డు వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకున్న విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కారుపైకి ఎక్కి పోలీసుల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసులు ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది? అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేక‌లు వేశారు. అనంత‌రం బాలాజీపేట‌కు చేరుకుని శ్ర‌మ‌దానంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఆ సమయంలో సభ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అయినప్పటీకీ పవన్ వెనక్కి తగ్గకుండానే వర్షంలో నిలబడే పోలీసుల తీరును తప్పుబడుతూ నిరసనకు దిగారు. తనతో వచ్చే ర్యాలీ వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి అనుమతి ఇచ్చేవరకూ ఇక్కడ్నుంచి ‘కదిలేది లేదు’ అని పవన్ అక్కడే నిలబడ్డారు.  పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే.. ‘సీఎం.. సీఎం.. సీఎం.. ’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపి..‘ ఒక్క నిమిషం ఆగండి.. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవకండి. నేను చాలా అలసిపోయా. ఎందుకు అలసిపోయానో కూడా మీకు వివరంగా చెబుతా. సీఎం అనేది జరిగినప్పుడు అరవండి.. అప్పటి వరకూ ఒక్క మాట కూడా సీఎం అని అరవకండి.. మీ నోటి నుంచి ఆ మాటే వినిపించకూడదు. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. నేను సీఎం అవ్వాలని మీరు మనసులో దాచుకోండి.. అంతేకానీ ఇలా బయటికి చెప్పకండి..’ అంటూ సభకు తరలివచ్చిన కార్యకర్తలకు పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేలమందితో సభ ఎలా? అని ప్రశ్నించారు. కొవిడ్‌ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే ఆంక్షలు విధించామని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారని గుర్తుచేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నవంబర్‌ నుంచి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

తాట తీసి నార తీస్తా.. వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, జనసేన మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. మరోసారి వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు పని కట్టుకుని తనను దూషిస్తున్నారని... తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని చెప్పారు. తాట తీసి నారతీస్తానని హెచ్చరించారు. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే మనిషిని కాదని... పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని పవన్ తేల్చి చెప్పారు. రాజకీయాలు తనకు సరదా కాదని, బాధ్యత అని జనసేన అధినేత స్పష్టం చేశారు. జోరు వర్షంలోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ మంత్రులు, తనపై విమర్శలు గుప్పించిన సినీ ప్రముఖులకు ఈ సభా వేదికగా స్ట్రాంగ్  వార్నింగ్‌లు ఇచ్చారు. తనను వ్యక్తిగతంగా విమర్శలు, బూతులు తిట్టిన వారిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ‘నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..?. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చాను. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. టీవీల్లో నన్ను తిడితే భయపడతానని అనుకుంటున్నారా?. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు పవన్ కల్యాణ్. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చానని అన్నారు. శ్రమదానం చేయడం తనకు సరదా కాదని చెప్పారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని అన్నారు. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి  మంచిది కాదన్నారు. అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారని చెప్పారు. ఓ వైపు వర్షం.. మరోవైపు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జనసేన తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది మొదలుకుని.. బహిరంగ సభ వేదిక దగ్గరకు వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. దీంతో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం’ అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు ఏ మాత్రం తగ్గకుండా భారీగానే సభకు తరలివచ్చారు. 

కరోనా మహమ్మారికి అరకోటి మంది బలి 

ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో ఏమోకానీ, కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తాని గజగజ వణికిస్తోంది. చావన్నది లేని ఈ వైరస్ ఇంచు మించుగా గడచిన రెండేళ్లలో, లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. నిజానికి ఈ మహమ్మారి ఎన్ని ప్రాణాలను మింగేసిందో ... ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. అయితే, తాజాగా రాయిటర్స్‌ వార్తా సంస్థ వేర్వేరు మార్గాల్లో సేకరించి, విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. అంటే అరకోటిమందిని మిగేసింది. కరోనా తొలికేసు 2019 నవంబర్ 17 దక్షిణ చైనాలోని, హుబేలి ప్రావిన్స్’లో వెలుగు చూసింది. ఆ తర్వాత నెలరోజులకు, అదే ప్రావిన్స్ లోని వూహన్’లో  డిసెంబర్ 20న  శాస్త్ర వేత్తలు కరోనా వైరస్’ను గుర్తించారు. ఆ తర్వాత 2020 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కరోనాను మహమ్మారిగా గుర్తించింది.  కాగా, ఈ ఏడాదిన్నరకు పైగా ఇచుమించుగా 115కు పైగా దేశాలకు వ్యాపించిన కరోనా ఇప్పటివరకు అరకోటి మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా వెలువడిన రాయిటర్స్‌ వార్తా సంస్థ విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలో 25లక్షల మందిని వైరస్‌ బలితీసుకోగా.. మరో 25లక్షల మరణాలు కేవలం 236 రోజుల్లోనే సంభవించాయి. చాలా దేశాల్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంటే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో అగ్ర రాజ్యం అమెరికా సహ ఐదు దేశాల్లోనే సగానికి పైగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధిక మరణాలు చోటుచేసుకోగా.. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్‌, మెక్సికో, భారత్‌ దేశాల్లోనూ లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే ఈ సంఖ్య ఏకంగా 7లక్షలు దాటింది. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం ఇంకా అత్యధిక స్థాయిలోనే ఉంటున్నాయి. ఇప్పటివరకు 7లక్షల మందికి పైగా మరణించారు. అక్కడ సగటున రోజుకు 1900 మంది కరోనాతో చనిపోతున్నారు. కరోనా మరణాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5.97లక్షల మంది కొవిడ్‌కు బలయ్యారు. ఇక భారత్‌లోనూ 4.48లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 8000 కరోనా మరణాలు సంభవించినట్లు రాయిటర్స్‌ కథనం వెల్లడించింది. అంటే ఇప్పటికీ ప్రతి నిమిషానికి ఐదుగురు కొవిడ్‌తో మృత్యువాతపడుతున్నారు.అయితే, మన దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉన్నా, వాక్సినేషన్ కార్యక్రమం వేగంగగా సాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతోంది.కానీ,ముప్పు పూర్తిగా తప్పలేదు. మూడో ఉదృతి విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. సో.. కొవిడ్ నిబంధనలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.

హుజురాబాద్ కు కేటీఆర్ దూరం.. కారణం ఇదేనా? 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. తొలి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. హుజురాబాద్ ఎన్నికను సవాల్ గా తీసుకుంది టీఆర్ఎస్. తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ఈటల రాజేందర్ ను ఓడించాలనే కసితో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనే+ స్వయంగా ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ లో తిరుగుతున్నారు. అయితే మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తుండగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మాత్రం హుజురాబాద్ వైపు వెళ్లడం లేదు. నిజానికి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు. కరీంనగర్ జిల్లా పరిధిలోనే హుజురాబాద్ ఉన్నా... కేటీఆర్ మాత్రం అక్కడ కనిపించడం లేదు. పార్టీకి అత్యంత కీలకం కావడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి కీలకమైన ఎన్నిక జరుగుతున్నా... కేటీఆర్ హుజురాబాద్ లో ప్రచారం చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అయితే కేటీఆర్ హుజురాబాద్ వెళ్లకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు.  సీఎం కేసీఆరే కావాలని కేటీఆర్ ను హుజురాబాద్ ప్రచారానికి దూరం పెట్టారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరిగింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఆయన లింకులు బయటపడ్డాయని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కేటీఆర్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వర్షాలకు వరదలతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్ని అతలాకుతలం అయ్యాయి. వరద నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. ఉపఎన్నికలో కేటీఆర్ ప్రచారంలోకి దింపితే అంతిమంగా జనాల వ్యతిరేకత పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపుపై ప్రభావం చూపుతుందని కేసీయార్ కు రిపోర్టు వచ్చిందట. అందుకనే  కేటీఆర్ ను హుజురాబాద్  దూరం పెట్టేసి మొత్తం బాధ్యతను మేనల్లుడు హరీష్ రావు మీదే కేసీఆర్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు విషయంలో కేసీయార్ ఎలాంటి ఛాన్స్ తీసుకోదలచుకోలేదని అర్ధమైపోతోంది. కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నా... అత్యంత కీలకమైన ఉప ఎన్నికలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రచారం చేయకపోవడం పలు విమర్శలు తావిస్తోంది. హుజురాబాద్ లో ఓడిపోతాయమని తెలుసు కాబట్టే కొడుకు కేటీఆర్ ను ప్రచారం చేయమని కేసీఆర్ చెప్పడం లేదనే టాక్ కూడా ఉంది. దుబ్బాక తరహాలోనే పార్టీ ఓటమి భారాన్ని హరీష్ రావుపై నెట్టే ప్రయత్నం జరుగుతుందనే చర్చ కూడా సాగుతోంది.  

కొత్త పార్టీ దిశగా కెప్టెన్.. పంజాబ్ లో కాంగ్రెస్ షేక్!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. అయినా, గత కొంత కాలంగా రాజకీయ చిక్కుముళ్ళలో చిక్కుకుని, అంతు చిక్కని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పంజాబ్ రాజకీయం దుస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో సిద్దూ రగిల్చిన చిచ్చు ఎంతకీ చల్లారడం లేదు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నసుదీర్ఘ అనుబందాన్ని తెంచుకుని బయటకు వచ్చిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్,అవమాన భారంతో రగిలి పోతున్నారు. సిద్దూను ఓడించి తీరతానని శపథం చేశారు. మరో పక్షం రోజుల్లో కొత్త ప్రాతీయ పార్టీ పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన పార్టీ పెడితే,కొందరు ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటుగా అకాలీ దళ్, బీజేపీ మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు కొందరు ఆయన పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.   ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం అమరీందర్ సింగ్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ జోవల్’ను కలవడం, సహజంగానే కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది.మాజీ ముఖ్యమంత్రి అమిత్ షాను కలవడంతో, ఆయన లౌకికవాదం మైల పడిపోయిందని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్, ఆరోపించారు. అలాగే, కెప్టెన్ అమరీందర్ సింగ్, సైద్ధాంతిక అనుబంధం లేని వ్యక్తులతో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. దీంతో చర్చ మరో మలుపు తిరిగింది. హరీష్ రావత్ వ్యాఖ్యలను కెప్టెన్ తీవ్రంగా ఖండించాఋ. రావత్ విమర్శ కాంగ్రెస్ పార్టీ దయనీయస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు.నిజానికి, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం జాతీయ స్థాయిలోనూ కల్లోలం సృష్టిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు, జీ 23 అంటే,జీ హుజూర్’ కాదని కపిల్ సిబల కుండ బద్దలు కొట్టారు.ఆయన ఇంటిమీద కాంగ్రెస్ కార్యకర్తలు దడి చేశారు. ఈ దాడిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఖండించారు  అదొక వివాదం ఆలా నడుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు కూడా అమరీందర్ సింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న  నిర్ణయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యంత దగ్గరి చుట్టం, చాలా దగ్గరి మిత్ర పక్షం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ),పంజాబ్ పరిణామాలను, బీహార్’లో కన్హయ్య కుమార్’ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ముడివేసి వ్యంగ్య విమర్శలకు దిగింది. కన్హయ్య కుమార్, కాంగ్రెస్ పాలిట మరో నవజ్యోతిసింగ్ సిద్దూ అవుతారని, ఆర్జేడీ సీనియర్ నాయకుడు, శివానంద తివారీ ఎద్దేవా చేశారు. కురువృద్ద కాంగ్రెస్ పార్టీని, కన్హయ్య కుమార్ సర్వనాశనం చేస్తాడని ఆర్జేడీ నేత అన్నారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ, ఆ పార్టీని కన్హయ్య కాదు, ఇంకెవరు వచ్చినా రక్షించ లేరు అని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే  మిత్ర పక్షం కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, తప్పుడు వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పార్టీ సిద్దాంతం పట్ల నిబద్దతగల సీనియర్ నాయకులను వదులుకుని, సిద్దూ, కన్హయ్య వంటి నిబద్దత లేని, నాయకులు కానీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా  కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వు కుంటోందని తివారీ అన్నారు.   కాంగ్రెస్ నాయకత్రయం మాత్రం పార్టీలోచీలిక వచ్చినా ఓకే కానీ, సీనియర్ నాయకుల వత్తిళ్ళకు తలోగ్గేది లేదని అధికార ప్రతినిధుల ద్వారా స్పష్టమైన సంకేటాలనే ఇస్తోంది.అమరీందర్ సింగ్’ ను పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిని, మూడుసార్లు పీసీసీ అధ్యక్షుని చేసిందని, అయినా, ఆయన పార్టీలో తనకు అవమానం జరిగిందని అనడం విడ్డూరంగా ఉందని రావత్ అన్నారు. అయితే, అమరీందర్ సింగ్ ఆయనకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. సిద్దూ, పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నెలల తరబడి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నతనను సోషల్ మీడియాలో ఇతరత్రా ఎంతగా విమర్శించినా, దుర్భాషలాడిన, దుయ్యబట్టినా , చివరకు ప్రభుత్వ విధానాలను విమర్శించినా ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం అవమానించడం కాదా, అని కెప్టెన్ ప్రశ్నించారు. అంతేకాదు, తనంతట తానుగా రాజీనామాకు సిద్దమైనప్పుడు కాదని, అంతలోనే తనకు తెలియకుండానే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, సాగనంపాలనుకోవడం అవమానం కాదా, అని కూడా ఆయన ప్రశ్నించారు.కాగా,జరుగతున్న పరిణామాలను గమనిస్తే, పంజాబ్ రాజకీయలు ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో, 1969 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, మరో మారు పార్టీలో అదే స్థాయిలో చీలిక వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని, శేఖర్ గుప్తా సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.

ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా... రేవంత్ కు ఎమ్మెల్యే గండ్ర సవాల్ 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్లు మొదలు కావడంతో రాజకీయ వేడి పెరిగిపోయింది. పార్టీలు దూకుడు పెంచాయి. గురువారం భూపాలపల్లిలో జరిగిన సభలో టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. తన  భార్య జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తుందని చెప్పారు. తమ జీవితం ప్రజా సేవకే అంకితమన్న గండ్ర.. తన సవాల్ ను ధమ్ముంటే రేవంత్ రెడ్డి స్వీకరించాలని సవాల్ చేశారు. పొద్దున్న లేస్తే ఏసీబీ కోర్టులో నాంపల్లి కోర్టులో ఉండే రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.  చిలుక పలుకులు పలుకుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకుని దండయాత్ర చేసిన సంగతి తెలంగాణ ప్రజలెవరు మర్చిపోలేదన్నారు గండ్ర, రేవంత్ కు రైఫీల్ రెడ్డి గా కూడా నామకరణం చేయడం జరిగిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. ఆమెను బలి దేవత అని రేవంత్ రెడ్డి విమర్శించారని చెప్పారు.  2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 లక్షలు పట్టుకుని ఒక్క MLA దగ్గరికి బేర సారాలకు పోయి అడ్డంగా దొరికిన గజ దొంగ రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే గండ్ర. అడ్డంగా దొరికిన దొంగ తనను అమ్ముడుపోయాడని విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు.  మిస్టర్ రేవంత్ ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా.. త్వరలో  జరుగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన నా MLA పదవికి,నా భార్య జడ్పీ చైర్పర్సన్ పదవి కి రాజీనామా చేసి మా రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతా అంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ చేశారు భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. 

టాప్ న్యూస్ @ 7PM

ఏపీలో డ్రగ్స్ ఛాలెంజ్ కాకపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమరవాణాపై వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు హైదరాబాద్ రామంతపూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వచ్చారు. డ్రగ్స్ పరీక్షకు రావాలంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఏపీ టీడీపీ నేతలు సవాల్ విసిరారు. డ్రగ్ టెస్టుకు రాకుండా వైసీపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. ----------- టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నమోదైన అట్రాసిటీ కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్‌, ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వీవీ సతీష్‌ తెలిపారు. న్యాయవాది సతీష్‌ వాదనలతో కోర్టు ఏకీభవించింది.  --------- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ లేవనెత్తిన అంశాలకు సీఎం జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోందని, బద్వేల్ ఉపఎన్నికలపై రెండు పార్టీ కలిసి ముందుకు వెళ్తాయని మాధవ్ చెప్పారు. --------- బద్వేల్‌ ఉపఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా తమకు నష్టం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలని సూచించారు. యాక్షన్ అనగానే చేయడానికి ఇది సినిమా కాదని ఎద్దేవాచేశారు. గోతులు పూడ్చి ఫొటోలుదిగే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని తప్పుబట్టారు -------- టిడ్కో ఇళ్ల కేటాయింపు అంశం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాన్ని కుదిపేసింది. రెండున్నరేళ్లయినా ఇంకా ఇళ్లు కేటాయించని అంశాన్ని టీడీపీ కార్పొరేటర్లు ప్రస్తావించడం, దీనిపై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బూతులు మాట్లాడటంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 202 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు -------- ఏపీ రాష్ట్రంలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఇటీవల బూతుల పురాణం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలను ఒలంపిక్స్‌లో బూతు ఆటలు ఆడితే, వైసీపీకి స్వర్ణపథకం, జనసేనకి రజత పథకాలు వస్తాయని తులసిరెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే.. ఈ రెండు పార్టీల నాయకులు పోటీ పడి బూతులు తిట్టుకోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు ------ హరితహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా హరిత నిధి ఉపయోగపడుతుంద్ననారు. హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. --------- నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడడంతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ----- పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే ఆయన భార్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటియాలా ఎంపీగా ఉన్న ప్రెణీత్ కౌర్‌ కూడా పార్టీ వీడతారా అనే అనే ప్రశ్నలు అనేకం వచ్చాయి. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడనని, పార్టీలోనే కొనసాగుతానని కౌర్ స్పష్టం చేశారు. ------- టాలీవుడ్ దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య  అల్లుడు, కేంద్రమాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ , యం.పీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. ------

గుత్తాకు మరో ఎదురు దెబ్బ.. ఆయన ఖేల్ ఖతమేనా? 

తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీ మొదలు, తెరాస వరకు ఆయన  ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించారు. నల్గొండ లోక్ సభ నియోజక వర్గం నుంచి 2004లో టీడీపీ టికెట్ పైన, 2009 కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి, రెండు సార్లూ గెలిచారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాసలో చేరారు. 2018 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సీనియారిటీ గుర్తించారు. గుత్తాను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.ఆవెంటనే కొద్ది రోజులకే  (2019 సెప్టెంబరు 11న) శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం  2021, జూన్ 3న ముగిసింది. నిజానికి, ఈ పాటికి ఎప్పుడోనే ఆయన మళ్ళీ ఎన్నిక కావలసింది. కానీ, కొవిడ్ కారణంగా మండలి ఎన్నికలు వాయిదా పడడంతో గుత్తా ప్రస్తుతానికి ఏమీ కాకుండా, ఏమీలేకుండా, మాజీగానే మిగిలి పోయారు. అడపా తడపా కేంద్ర ప్రభిత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని, పనిలో పనిగా రాష్ట్ర బీజేపీ నాయకులకు విమర్శించి, వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.  గుత్తాకు ఇప్పుడు మరో కష్టం వచ్చిపడిందని అంటున్నారు. న‌ల్గొండ‌-రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో పాడిరైతుల స‌మాఖ్య  డైరీ  ప్ర‌భావం చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. జిల్లా రాజకీయ నాయకులు డైరీ  సమాఖ్య తొలి రాజకీయ అడుగుగా భావిస్తారు. ప్రతి గ్రామంలో డైరీ సమాఖ్య  సభ్యులు ఉంటారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీకి  డైరీ సమాఖ్యతో విడదీయరాని బంధమే ఉందని అంటారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా, ఏ పార్టీలో ఉన్నా డైరీ అధ్యక్ష పదవి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు గుత్తా గుప్పిట్లోనే ఉంది. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సోద‌రుడు గుత్తా జితేంద‌ర్ రెడ్డే సుదీర్ఘ కాలంగా డైరీ  చైర్మ‌న్ గా చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు, జిల్లామంత్రి జ‌గ‌దీష్ రెడ్డి, గుత్తా మంత్రి ఆశలను మొగ్గలోనే తుంచేశారు డైరీ చైర్మ‌న్ ప‌ద‌వి గుత్తా జితేంద‌ర్ రెడ్డికి కాకుండా గంగుల కృష్ణారెడ్డికి దక్కేలా చేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అండ‌దండ‌ల‌తోనే ఇదంతా జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏమటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు.   నిజానికి మంత్రి పదవి ఆశ చూపితేనే గుత్తా తెరాసలో చేరారు. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే, మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్సీ పదవి అయినా రెన్యువల్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఆయన తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్త పరిచినట్లు సామాచారం. ఈనేపధ్యంలో ఆయన మరో మారుపార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఈ సారి ఏ గూటికి చేరతారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు...ఇంతవరకు గుత్తా పద్మ మోపని పార్టీ అయితే ఒకటే ఉంది .. అది బీజేపీ. కానీ, జిల్లా రాజకీయ లెక్కలు  బీజేపీ కంటే, కాంగ్రెస్ పార్టీనే సేఫ్ అని చెపుతున్నాయి. అయితే  అదయినా, ఇదయినా  ఎమ్మెల్సీ ఇష్యూ అటో ఇటో తేలిన తర్వాతనే ... అంతవరకు గప్ చిప్... అంటున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరులు.

రేవంత్‌రెడ్డిని కాద‌ని బీజేపీలోకి తీన్మార్‌ మ‌ల్ల‌న్న‌.. కార‌ణం అదేనా?

చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. క్యూ న్యూస్ అధినేత‌. ఒక‌ప్పుడు తెల్లారితే చాలు.. త‌న యూట్యూబ్‌లో కేసీఆర్ స‌ర్కారును కుమ్మేసేవారు. ప‌దునైన మాట‌ల‌తో, ఘాటైన విమ‌ర్శ‌ల‌తో స‌ర్కారుపై చెల‌రేగిపోయేవారు. కొన్ని వారాలుగా మ‌ల్ల‌న్న వాయిస్ లేదు. క్యూ న్యూస్‌లో మున‌ప‌టి జోష్ లేదు. కార‌ణం తెలిసిందే. మ‌ల్ల‌న్న‌పై కేసుల మీద కేసులు పెట్టి.. బెయిల్ మీద బ‌య‌ట‌కు రాకుండా చేసి.. జైల్లోనే మ‌గ్గేలా చేస్తున్నారు. ఆఫ్ ది రికార్డ్ స‌మాచారం ప్ర‌కారం.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ మ‌ల్ల‌న్నను జైల్లోనే ఉంచుతార‌ని అంటున్నారు. ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్ ఉమేశ్‌చంద్ర బెయిల్ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికినీ.. ప్ర‌భుత్వం బ‌లంగా కేసులు మోపి.. సాధ్య‌మైనంత కాలం మ‌ల్ల‌న్న‌ని జైలుకే ప‌రిమితం చేసేలా చేస్తోంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన ఆయ‌న‌.. ఇప్పుడు వ్యూహం మార్చారు. ఒంట‌రిగా పోరాడితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. అధికార ప‌క్షంపై యుద్ధం చేయ‌డానికి త‌నొక్క‌డి బ‌లం స‌రిపోద‌ని ఆల‌స్యంగా గుర్తెరిగారు. అందుకే, త‌న‌కు అండా-దండాగా ఉండేలా జాతీయ పార్టీ ఆశ్ర‌యం కోరుతున్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న ముందు రెండు మూడు పొలిటిక‌ల్ ఆప్ష‌న్స్ ఉన్నాయి. ఒక‌టి.. తానే సొంతంగా పార్టీ పెట్టి.. కేసీఆర్‌పై ఒంట‌రి పోరాటం చేయ‌డం. కానీ, మిగ‌తా ప్ర‌తిప‌క్షాలు సైతం బ‌లంగా ఉన్న ఈ త‌రుణంలో సామాన్యుడైన మ‌ల్ల‌న్న‌కు అది అంత ఈజీ కాదు. పైగా స‌ర్కారు త‌న‌ను అడుగ‌డుగునా టార్గెట్ చేస్తున్న క్ర‌మంలో.. భారీ ఆర్థిక వ‌న‌రులు, కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తు లేకుండా పార్టీ స్థాపించి మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్ట సాధ్యం. అందుకే, సొంత పార్టీతో సొంతంగానే ఎద‌గాల‌నే ఆలోచ‌న ఉన్నా.. ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో అది వ‌ర్క‌వుట్ కాద‌ని భావించి ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకున్నారు. ఇక మ‌ల్ల‌న్న ముందున్న మ‌రో ఆప్ష‌న్.. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్‌లో చేర‌డం. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి, మ‌ల్ల‌న్న‌కి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇన్నాళ్లూ తెర‌వెనుక మ‌ల్ల‌న్న‌కి రేవంత్‌రెడ్డి స‌పోర్ట్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయినా, కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు మ‌ల్ల‌న్న‌. ఎందుకంటే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువే. మోదీ వేవ్ ఇప్ప‌టికీ బాగానే వీస్తోంది కాబ‌ట్టి.. వ‌చ్చే సారి కూడా కేంద్రంలో బీజేపీదే అధికారం అంటున్నారు. ఇక తెలంగాణ‌లో హోరాహోరీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీల ట్ర‌యాంగిల్ వార్‌లో విజ‌యం ఎవ‌రినైనా వ‌రించొచ్చు. ప‌క్కాగా ఈ పార్టీ గెలుస్తుంద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరితే.. రాష్ట్రంలో మ‌ళ్లీ టీఆర్ఎస్సే గెలిస్తే..? త‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అందుకే, ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా కేంద్రంలో ప‌క్కాగా అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న బీజేపీ అయితే త‌న‌కు సేఫ్‌గా ఉంటుంద‌ని.. అలా అయితే తెలంగాణ‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. జాతీయ పార్టీ బీజేపీ సాయంతో సుర‌క్షితంగా ఉండొచ్చ‌నేది మ‌ల్ల‌న్న మ‌త‌ల‌బు అంటున్నారు.  ఇక ప‌లువురు రాష్ట్ర బీజేపీ నేత‌లు మొద‌టి నుంచీ మ‌ల్ల‌న్న‌కి మ‌ద్ద‌తుదారులుగా ఉన్నారు. V6, వెలుగు అధినేత వివేక్ వెంక‌ట‌స్వామి, ఈట‌ల రాజేంద‌ర్‌లు మ‌ల్ల‌న్న‌కి స‌పోర్ట్‌గా నిలిచేవారు. మ‌ల్ల‌న్న జైలుకెళ్లిన‌ప్పుడు వివేక్ ఆయ‌న ఇంటికెళ్లి మ‌రీ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఇక త‌న క్యూ న్యూస్‌లో ఎల్ల‌ప్పుడూ కేసీఆర్ స‌ర్కారును విమ‌ర్శించే మ‌ల్ల‌న్న‌.. కేంద్ర వైఫ‌ల్యాల‌పై ఒక్క‌సారి కూడా ప్ర‌శ్నించిన దాఖ‌లాలు లేవు. అందుకే, బీజేపీవాదులు రెగ్యుల‌ర్‌గా క్యూ న్యూస్‌ను ఫాలో అవుతుంటారు.  అటు.. మ‌ల్ల‌న్న‌కు ఈట‌ల రాజేంద‌ర్ సైతం ఫుల్ క్లోజ్ అంటారు. ఈట‌ల‌ మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ప్ర‌భుత్వం, పార్టీకి చెందిన అంత‌ర్గ‌త విష‌యాల‌ను మ‌ల్ల‌న్నకు లీక్ చేసే వార‌ని.. ఆ విష‌యాల ఆధారంగానే క్యూ న్యూస్‌లో స‌ర్కారును ఏకిపారేసే వార‌ని అంటారు. ఇటీవ‌ల‌ మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన‌ప్పుడు సైతం ఈట‌ల రాజేంద‌ర్ ఆయ‌న‌కు ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా భారీ సాయ‌మే చేశార‌ని చెబుతారు. ప్ర‌భుత్వ సెక్యూరిటీ క‌న్నుగ‌ప్పి మ‌రీ.. మ‌ల్ల‌న్న‌ను ఈట‌ల క‌లిసేవార‌ని అంటారు. ఈట‌ల‌పై కేసీఆర్ వేటు వేయ‌డంలో ఇలాంటి విష‌యాలు కూడా కార‌ణ‌మే. ఈట‌ల‌తో మ‌ల్ల‌న్న‌కు అంత క్లోజ్‌నెస్ ఉంది కాబ‌ట్టే.. ఆయ‌న సల‌హా మేర‌కే.. మ‌ల్ల‌న్న బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.      కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే.. సామాన్యుడైన మ‌ల్ల‌న్న ఇక‌పై అస‌మాన్యుడు అవుతారు. కేసుల దూకుడు కాస్త త‌గ్గే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ అధిష్టానానికి రాసిన లేఖ‌లో మ‌ల్ల‌న్న భార్య సైతం ఇదే విజ్ఞ‌ప్తి చేశారు. కేసుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. కేసీఆర్‌ను బ‌లంగా వ్య‌తిరేకించే.. గ‌ట్టిగా గొంతు వినిపించే మ‌ల్ల‌న్న వంటి వారు చేరడం.. తెలంగాణ‌ బీజేపీకి సైతం అద‌న‌పు బ‌ల‌మే. మ‌ల్ల‌న్న‌+బీజేపీ కాంబినేష‌న్‌.. కేసీఆర్‌కు ఇబ్బందిక‌ర‌మే. 

పచ్చదనం కోసం హరిత నిధి.. కేసీఆర్ ప్రకటనతో మొదలైన విరాళాలు 

హరితహారం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ అని… తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్‌.  హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. అలాగే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు రూ.25 ఇవ్వాలని తెలిపారు. రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు చేయాలని వెల్లడించారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు, అలాగే… స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హరితనిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే విరాళాలు మొదలయ్యాయి. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్. హరితనిధికి ప్రజా ప్రతినిధులందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు  సహకరించాలని కోరినందుకు ప్రకృతి ప్రేమికుడిగా హర్షిస్తున్నానని చెప్పారు. ప్రకృతి ప్రేమికుడిగా గ్రీన్ ఫండ్ కోసం ప్రతి నెల 5000 విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఎంపీ సంతోష్ కుమార్ 

19 మందిని రే*ప్ చేసిన పోలీస్‌.. సైకో ఉమేశ్‌రెడ్డికి ఉరి క‌న్ఫామ్‌..

వాడు పోలీస్ కాదు.. ఖాకీ దుస్తుల్లో ఉన్న సైకో కిల్ల‌ర్‌. ఒక‌రు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 19 మంది మ‌హిళ‌ల‌పై అత్యా-చారానికి తెగ‌బ‌డ్డాడు. వారిలో కొంద‌రిని దారుణంగా చంపేశాడు. వారి మృతదేహాలపై కూడా లై*గిక దాడి చేసేవాడు. ఆ ఉన్మాది పేరు బీజే ఉమేశ్ అలియాస్ ఉమేశ్‌రెడ్డి. క‌ర్ణాట‌క‌కు చెందిన‌ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌.  19 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, పలువుర్ని హత్యచేసినట్టు ఉమేశ్ రెడ్డి‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఉమేశ్‌ వ్యవహారం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూశాయి. ఉమేశ్‌రెడ్డి ఏకంగా 19 మందిపై హ‌త్యా-చారం చేశాడ‌ని తేల్చారు. అందులో కొంద‌రిని హ‌త్య చేసిన‌ట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆధారాలు సేకరించి అత‌న్ని కోర్టులో హాజ‌రుప‌రిచారు.  ఉమేశ్‌పై 11 కేసుల్లో విచారణ పూర్తయి శిక్షలు పడగా.. మరో 8 కేసుల్లో తీర్పు రావాల్సి ఉంది. తాజాగా, నరహంతకుడు ఉమేశ్‌రెడ్డి (48)కి కర్ణాటక హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ఆరు వారాల సమయమిచ్చింది.  కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 19 మందిపై అత్యా-చారానికి పాల్పడి.. పలువుర్ని హత మార్చినట్లు కోర్టు విచారణలో తేలింది. బెంగళూరు పరిధిలోని పీణ్యలో 1998లో ఓ మహిళపై హత్యా-చారానికి పాల్పడిన కేసులో 2006లో సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని 2011లో కర్ణాటక హైకోర్టు సమర్ధించింది. అయితే, తన కుమారుడికి ఉరిశిక్ష రద్దుచేసి, యావజ్జీవిత ఖైదు విధించాలంటూ అతడి తల్లి గౌరమ్మ 2013లో రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నారు. అందుకు రాష్ట్రపతి తిరస్కరించారు.  ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని 2016లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. ఈ విషయంలో హైకోర్టునే సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది. సెషన్స్‌ కోర్టు విధించిన ఉరి శిక్ష‌ను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.  

పోసాని ఇంటిపై దాడి చేసిందెవరు? పోలీసుల విచారణలో ట్విస్టులు.. 

జనసేన, వైసీపీ మధ్య రాజుకున్న వివాదం ఇంకా మండుతూనే ఉంది. పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైసీపీ నేతలు మాటల దాడి కొనసాగిస్తున్నారు. అటు జనసేన లీడర్లు కూడా అధికార పార్టీపై మండిపడుతున్నారు. ఇక పవన్ కల్యాణ్, పోసాని కృష్ణ మురళీ రచ్చ రగులుతూనే ఉంది. పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో.. వివాదం కేసుల వరకు వెళ్లింది. పోసాని ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు చేస్తున్న విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని కృష్ణ మురళీ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు. బైకులపై వచ్చిన యువకులు ఇంటిపై రాళ్లు విసిరారని పోసాని ఇంటి వాచ్ మన్ పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో పోసాని ఇంట్లో లేడు. ఆయన కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కేవలం ఆఫీసు అవసరాలకు మాత్రమే దీనిని వాడుతున్నారు. పోసాని వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో  విచారణ చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.  పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని పోలీసులు ఇంటిని పరిశీలించారు. రాళ్ల దాడిలో పోసాని ఇంటి తలుపుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంట్లో  కొన్ని రాళ్లను కూడా పోలీసులు గుర్తించారు. దాడి జరిగిన సమమంలో ఇంట్లోని పనివాళ్లు భయంతో లోపలికెళ్లి దాక్కున్నట్లు తెలిపారు. కొందరు రాళ్లు రువ్వడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారని పనివాళ్లు పోలీసులకు తెలిపారు. కొందరు యువకులు  నానా హంగామా చేశారని స్థానికులు చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు పోసాని ఇంటి పరిసరాలను పరిశీలించారు. అయితే వారికి ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించలేదు. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదా..? లేక దాడి చేయడానికి వచ్చిన వారే తీసేసారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.  ఇక దాడి జరిగిన తరువాత పోసాని మరోసారి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. జనసేన నాయకులు మాత్రం ఈ దాడికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు, పోసాని వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని ఆయనతో పవన్ పై ఏపీ  అక్కడి ప్రభుత్వం విమర్శలు చేయిస్తోందని ఆరోపించారు. పోసాని ఇంటిపై దాడి వెనుక కూడా వైసీపీనే ఉందని జనసేన నేతలు ఆరోపించారు. జనసేనను ఇరికించేలా కుట్రలు చేశారని జనసేన నేతలు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో విచారణ జరుపుతున్న పోలీసులకు ఎలాంటి క్లూలు లభించలేదు. దీంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. పోసాని ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడం ఆసక్తిగా మారింది.  హైదరాబాద్ లో పోలీసులు వేలాదిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోసాని ఇల్లు ఉన్న ఎల్లారెడ్డి గూట పూర్తి రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోట సీసీ కెమెరాలు ఎందుకు లేవన్నది ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. పోసాని ఇంటి పరిసరాల్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలను కావాలనే ఎవరైనా తొలగించారా అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించాలంటే సీసీ కెమెరా పూటేజీ చాలా అవసరం అంటున్నారు పోలీసులు.  

టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ.. అందుకేనా వైసీపీ బెదురు?

మంత్రి కొడాలి నాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌వాల్ విసిరారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ.. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ల‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసి.. ద‌మ్ముంటే జగ‌న్‌ను గ‌ద్దె దింపాల‌ని స‌వాల్ చేశారు కొడాలి నాని. ఆయ‌న ఊరికే చేశారా? లేక‌, త‌న‌కొచ్చిన స‌మాచారం మేర‌కే అలా అన్నారా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఆ డిటైల్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.. బీజేపీతో జ‌న‌సేన తెగ‌దెంపులు. ఈ మ‌ధ్య చాలా వెబ్ పోర్ట‌ల్స్‌లో ఈ టైటిల్ క‌నిపిస్తోంది. బీజేపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య దూరం పెరిగింది.. తిరుప‌తిలో జ‌న‌సేన బీజేపీకి స‌పోర్ట్ చేయ‌లేదు.. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకీ బై బై చెప్పేస్తారు.. అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వండివారుస్తున్నారు. ఆ ప్ర‌చారం అలా జ‌రుగుతుండ‌గానే.. బ‌ద్వేల్‌లో ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఎంపిక కోసం ఆ రెండు పార్టీలు క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. సో, వారి మ‌ధ్య దూరం ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా.. ఆ రెండు పార్టీలూ ఇప్ప‌ట్లో విడిపోవ‌ని అర్థ‌మైపోతోంది.  ఇక టీడీపీతో జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనేదే కీల‌కం. ప‌వ‌న్ క‌ల్యాణ్‌-వైసీపీల మ‌ధ్య పొలిటిక‌ల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. వైసీపీకి ఇప్పుడు ప్ర‌ధాన శ‌త్రువు జ‌న‌సేన‌నే అనే రేంజ్‌లో ఆ రెండు పార్టీల మ‌ధ్య జ‌గ‌డం న‌డుస్తోంది. స్వ‌త‌హాగా ఆవేశ‌ప‌రుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. ఈసారి జ‌గ‌న్‌కు గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కానీ, జ‌న‌సేన బ‌లం అంతంత‌మాత్రం. కొన్ని జిల్లాల‌కే ప‌రిమితం. ఇక బీజేపీకంటే జ‌న‌సేన‌నే కాస్త బెట‌ర్‌. ఆ లెక్క‌న జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసి పోటీ చేసినా.. వైసీపీని గ‌ద్దె దింప‌డం అంత ఈజీ కాక‌పోవ‌చ్చు. ఆ ల‌క్ష్యం నెర‌వేరాలంటే.. టీడీపీతో పొత్తు ఒక్క‌టే మార్గం.  ఏపీలో సంస్థాగ‌తంగా టీడీపీ అత్యంత బ‌లంగా ఉంది. నిస్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. టీడీపీకే మెజార్టీ స్థానాలు ఖాయం. వైసీపీని దెబ్బ‌కొట్ట‌గ‌ల ఏకైక పార్టీ తెలుగుదేశ‌మే. ఎంత‌కాద‌న్నా.. జ‌న‌సేన‌, బీజేపీలు అత్యంత న‌మ్మ‌ద‌గిన పార్టీ టీడీపీనే. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌లు అన‌ధికారికంగా పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలు గెలుచుకున్నాయి కూడా. జ‌న‌సేన‌, బీజేపీ కేడ‌ర్ సైతం టీడీపీతో పొత్తు కోరుకుంటోంది. గ‌తంలోనూ ఆ మూడు పార్టీలు క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. అప్ప‌ట్లో కాస్త పొర‌పొచ్చ‌లు వ‌చ్చినా.. అవి మ‌ళ్లీ రిపీట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువే. అందుకే, బ‌ల‌మైన శ‌త్రువు, ఉమ్మ‌డి ల‌క్ష్య‌మైన వైసీపీకి గుణ‌పాఠం చెప్పాలంటే.. టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీల మైత్రి అవ‌స‌ర‌మ‌నే విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఆ మేర‌కు ఆయా పార్టీల్లో అంత‌ర్లీనంగా చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. పార్టీల అధిష్టానంపై కిందిస్థాయి నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. అధినేత‌లు సైతం ఆ దిశ‌గా ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ విష‌యం తెలిసే.. మంత్రి కొడాలి నాని అలా స‌వాల్ చేశార‌ని అంటున్నారు. జ‌న‌సేన పార్టీ బీజేపీ, టీడీపీతో పొత్తుపెట్టుకునైనా.. సీఎం జ‌గ‌న్‌ను మాజీ చేయగ‌ల‌దా అంటూ స‌వాల్ చేయ‌డం వెనుక అస‌లు కార‌ణం అదే అంటున్నారు.  ఆ మూడు పార్టీలు గ‌త ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసుంటే.. వైసీపీకి ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోయేది. విడివిడిగా పోటీ చేశాయి కాబ‌ట్టే.. ఓట్లు చీలి.. వైసీపీ సీట్లు ఎగ‌రేసుకుపోయింది. గ‌త ఎల‌క్ష‌న్స్‌లో జ‌రిగిన పొర‌బాటు ఈసారి జ‌ర‌గ‌కుండా చూస్తారా?  వైసీపీ దుర్మార్గ‌పు పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిపిస్తారా? జ‌గ‌న్‌ను గ‌ద్దె దించి.. ఏపీని కబంధ‌హ‌స్తాల నుంచి కాపాడుతారా?  చూడాలి ముందుముందు ఏం జ‌రుగుతుందో..