పోసానిని వైసీపీనే రెచ్చ‌గొట్టిందా? దాడి జ‌రిగేలా తిట్టించిందా?

జ‌న‌సేన కీల‌క నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆయ‌న చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీ నేతలు పనికిమాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టారంటూ ప‌రోక్షంగా పోసాని కృష్ణ‌ముర‌ళిని ఉద్దేశించి అన్నారు. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహాలు వేస్తారని విమర్శించారు. జ‌న‌సేన‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్వాత నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లో ఉన్న నాదేండ్ల మనోహర్ ఇలా పోసానిని వైసీపీ నేత‌లే రెచ్చ‌గొట్టార‌ని.. పోసానిపై దాడి జ‌రిగేలా వ్యూహం ప‌న్నార‌ని ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కాస్త ఆలోచిస్తే.. నాదేండ్ల చేసిన ఆరోప‌ణ నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ వాళ్ల‌ను తిట్టారు. వైసీపీ మంత్రులు తిరిగి పీకేపై ఎదురుదాడి చేశారు. ఆ త‌ర్వాత జ‌న‌సేనాని ట్వీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేశారు. అందుకు మంత్రి పేర్ని నాని సైతం ట్విట్ట‌ర్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. అక్క‌డితే మాట‌ల‌కు మాట చెల్లు. క‌థ ముగిసిపోయింది అనుకున్నారంతా. కానీ, మ‌ధ్య‌లో పాన‌కంలో పుడ‌క‌లా పోసాని ఎంట‌రై ఇష్యూను ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇలా స‌డెన్‌గా పోసాని ఊడిప‌డ‌టం, పీకేపై తిట్ల‌పై విరుచుకుప‌డ‌టం, బూతుల‌తో కంపు కంపు చేయ‌డం.. అంతా వైసీపీ వ్యూహంలో భాగ‌మేన‌నే అనుమానం. ఎలాగంటే.... మొద‌ట సోమ‌వారం త‌న ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టి ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌గ‌న్‌ను తిట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పోసాని. కాస్త అటూఇటూగా ఓ మాదిరి నోటికి ప‌ని చెప్పారు. పోసాని ఎంట‌ర్ చేసి.. టాపిక్‌ను వాళ్లిద్ద‌రి వైపు డైవ‌ర్ట్ చేయాల‌నేది వైసీపీ స్కెచ్ అంటున్నారు. కానీ, సోమ‌వారం ఆ డ్రామా అనుకున్నంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ప‌వ‌న్ నుంచి కానీ, ఆయ‌న ఫ్యాన్స్ నుంచి పెద్ద‌గా రియ‌క్ష‌న్ రాలేదు. దీంతో.. ఇలా అయితే కుద‌ర‌ద‌నుకున్నారో ఏమో.. మంగ‌ళ‌వారం మ‌రోసారి పోసానితో ప్రెస్‌మీట్ పెట్టించారు. కానీ, ఈసారి వెన్యూ మార్చేశారు. పోసాని ఇంట్లో బ‌దులు, అంద‌రికీ తెలిసేలా.. అంద‌రూ ఈజీగా వ‌చ్చేలా.. సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు లొకేష‌న్ షిఫ్ట్ చేశారు. రెండోరోజు మ‌రింత ఘాటుగా, బండ బూతుల‌తో పోసాని విరుచుకుప‌డేలా ఎత్తుగ‌డ వేశారు.  పోసాని లైవ్ లో మాట్లాడుతుండ‌గా.. ఆయ‌న తిట్టే తిట్లు భ‌రించ‌లేక‌.. జనసేన యూత్ కార్య‌క‌ర్త‌లు పోసానిపై దాడి చేసేందుకు ప్రెస్ క్ల‌బ్‌కు పెద్ద ఎత్తున‌ వ‌చ్చారు. పోసానిపై దాడికి ప్ర‌య‌త్నించారు. పోలీసులు భారీగా మోహ‌రించి పీకే ఫ్యాన్స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో పోసాని బ‌తికిపోయారు. ఇదే వైసీపీకి కావ‌ల‌సింది. పోసానిపై దాడి చేసేలా జ‌న‌సేన‌ను ఉసిగొల్పడ‌మే వైసీపీ వ్యూహం అంటున్నారు. నాదేండ్ల చెప్పిన‌ట్టు.. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహాలు వేసారని అనుమానిస్తున్నారు.  అయితే.. ఇంట్రెస్టింగ్‌ పాయింట్ ఏమంటే.. మొదటి రోజు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. రెండోరోజున మాత్రం అందుకు భిన్నంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు ఎందుకు వచ్చినట్లు? ఇంట్లో కాకుండా ప‌బ్లిక్‌కు అందుబాటులో ఉండే ప్లేస్‌లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినట్లు?  దీని వెనుక వైసీపీ స్కెచ్ దాగుంద‌ని అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ను, జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకే పోసాని కావాలనే రెండోరోజు ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టార‌ని అనుమానిస్తున్నారు. పోసాని ఇల్లు.. ఐటీ కారిడార్‌లోని ఓ ల‌గ్జ‌రీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటుంది. అక్క‌డ‌ హై సెక్యురిటీ  ఉంటుంది. త‌న‌ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ప‌వ‌న్‌ను ఎన్ని తిట్టినా.. అక్కడకు వచ్చి ఆందోళ‌న‌ చేయ‌డం పీకే ఫ్యాన్స్‌కు అంత ఈజీ కాదు. కాస్త కష్టమైన పని. అందుకే.. వారికి అంత‌గా క‌ష్ట‌పెట్ట‌కుండా.. చాలా సులువుగా త‌న‌పై దాడి జ‌రిగేలా.. ఇష్యూను మ‌రింత ర‌క్తి క‌ట్టించి.. హాట్ హాట్‌గా మార్చేలా.. ప్రెస్‌మీట్ లొకేష‌న్‌ను త‌న ఇంటి నుంచి ప్రెస్‌క్ల‌బ్‌కు మార్చారు పోసాని. అందుకే, జ‌న‌సేన ప్ర‌ధాన నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ అలాంటి ఆరోప‌ణ చేశార‌ని అంటున్నారు. నాదేండ్ల అన్న‌ట్టు.. వైసీపీ నేతలు పనికిమాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి.. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహం వేసిన మాట నిజ‌మే అనిపిస్తోందని అంటున్నారు.    

పంజాబ్ లో రాజ్యాంగ  సంక్షోభం తప్పదా?

పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, ప్రియాంకా వాద్రా, సిద్దూను శాంతింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరో వంక సిద్దూకు మద్దతుగా మంత్రి రజియా సుల్తానా కూడా తమ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఒకరిద్దరు పార్టీ నాయకులు కూడా రాజీనామాచేశారు. మరికొందరు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.అదే నిజమయితే, పంజాబ్’ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం మరింత ముదిరి  రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.  సిద్దూ ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్న మాత్రం డైరెక్ట్ సమాధానం చిక్కని ప్రశ్నగానే మిగిలి పోయింది. కాంగ్రెస్  అధిష్టానం ఆయన కోరిన కోరికలన్నింటినీ కాదనకుండా నెరవేర్చింది. పీసీసీ అధ్యక్షపదవి అడిగారు, ఆప్పటి ముఖ్యమంత్రి పార్టీ సీనియర్ నాయకుడు, కెప్టెన్ అమరీందర్ సింగ్’కు ఇష్టం లేక పోయినా, సోనియా గాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కెప్టెన్’ను ఒప్పించి సిద్దూకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అక్కడికీ సిద్దూ సంతృప్తి చెందకపోవడంతో ముఖ్యమంత్రిని మార్చి సిద్దూ కోరుకున్న చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నిని ముఖ్యమంత్రిని చేశారు...అయినా సిద్దూ పార్టీ నాయకులు,సోనియా,రాహుల్,ప్రియాంక త్రయంలో ఏ ఒక్కరికీ మాట మాత్రంగా అయినా, చెప్పకుండా, ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నట్లుగా, సిద్దూ నిలకడలేని మనిషే అనుకున్నా ఆయన ఎందుకు రాజీనామా చేశారు, అనేది మాత్రం ఇంకా భేతాళ ప్రశ్నగానే ఉందని అంటున్నారు.  ఇతర కారణాలున్నా  ప్రధానంగా కొత్త క్యాబినెట్‌ కూర్పు పట్ల అసంతృప్తితోనే ఆయన పదవి నుంచి వైదొలగినట్టు సమాచరం.ఇటీవలే ముఖ్యమంత్రిగా నియమితులైన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని గత ఆదివారం నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. దీనికి ముందు, ఇసుక తవ్వకాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రణగుర్జీత్‌ సింగ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దని కోరుతూ కొంతమంది ఎమ్మెల్యేలు సిద్దూకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇవే ఆరోపణలపై అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గం నుంచి రణగుర్జీత్‌ సింగ్‌ ఉద్వాసనకు గురయ్యారు.అయితే సీఎం చన్ని ఆయనకు మళ్లీ మంత్రిపదవి కట్టబెట్టడాన్ని సిద్దూ అడ్డుకోలేకపోయారు. దీంతోపాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ఇంకొందరిపైనా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు.  పీసీసీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ చబేవాల్‌కు మంత్రివర్గంలో స్థానం కోసం సిద్దూ కొంతకాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే రాజ్‌కుమార్‌కు పదవి దక్కకపోగా... చన్నీకి బంధువైన అరుణా చౌధరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. అరుణా చౌధరి తన సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్టు చాలాకాలంగా ప్రచారంలో ఉంది.తాజా క్యాబినెట్‌ కూర్పులో కులాల సమీకరణ పట్ల కూడా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ జనాభాలో 30శాతం ఉన్న మజాబీ సిక్కులను పక్కనబెట్టి... తన సొంత కులానికే సీఎం చన్ని అధిక ప్రాధాన్యం ఇచ్చారని సిద్దూ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే రాహుల్‌ గాంధీ, పీసీసీ ఆమోదం తర్వాతే మంత్రివర్గం ఎంపిక జరిగిందని చన్ని మద్దతుదారులు అంటున్నారు. తాజాగా సిద్దూ, “నిజం” కోసం తుది శ్వాస ఉన్నంత వరకూ పోరాడుతానని చెప్పారు.సిద్దూ తన రాజీనామాకు సమబందించి మీడియాలో జరుగతున్న ప్రచారానికి సమాదానంగా ఈ రోజు ట్విట్టర్‌‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత ఎజెండా కోసం పోరాడలేదని, పంజాబ్ సంక్షేమం కోసమే కొట్టాడుతున్నానని, ఈ విషయంలో ఎప్పటికీ రాజీపడేదే లేదని వీడియోలో సిద్ధూ స్పష్టం చేశారు.ఎటువంటి త్యాగాలకైనా తాను సిద్ధమేనని, కాంగ్రెస్ హైకమాండ్‌ను తాను తప్పుదారి పట్టించలేనని సిద్ధూ తెలిపారు. పంజాబ్‌లో కొత్తగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు, అధికారులతో కొత్త వ్యవస్థను నడపలేమని అన్నారు. విలువల కోసం తాను పోరాడుతున్నానని, ఈ విషయంలో తాను వెనుకడుగేసేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. నిజం కోసం తుది శ్వాస వరకు పోరాడతానన్నారు.  ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందని అంటున్నారు. ఇప్పటికే సిద్దూకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇచ్చారని, ఇంకా ఆయన కోరిన విధంగా మంత్రివర్గంలో మార్పులు చేస్తే, అధిష్టానం ప్రతిష్ట ఇంకా దిగజారి పోతుందని అంటున్నారు. మరోవంక,పంజాబ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపరిపక్వ రాజకీయ అనుభవం వల్లనే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఈ స్థాయికి చేరిందని పార్టీ వర్గాల్లో చర్చ నడిస్తోంది. రాష్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అన్నా చెల్లెలు  (రాజీవ్,ప్రియాంక) అనుభవ రాహిత్యం పార్టీకి ప్రమాదకర ముప్పుగా పరిణమిస్తుందని బహిరంగంగానే హెచ్చరించారు. మరో వంక పార్టీ ఇంత సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నా,సీనియర్ నాయకులు ఎవరూ పెదవి విప్పక పోవడం కాంగ్రెస్ పార్టీ సంక్షోభానికి సంకేతమని అంటున్నారు.

ఎమ్మెల్యేను సింహంతో పోల్చుతూ పొగడ్తలు.. అనంతలో బరి తెగిస్తున్న పోలీసు అధికారులు! 

అనంతపురం జిల్లాలో పోలీసు అధికారులు బరి తెగిస్తున్నారు. బహిరంగంగానే అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోస్టుల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి.. వైసీపీ నేతల మత్తులో జోగుతున్నారు. తాజాగా గుత్తి సీఐ రాము.. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సింహంతో పోల్చుతూ పొగడ్తల్లో ముంచెత్తడం రచ్చగా మారింది. ‘‘మన ఎమ్మెల్యే సింహంలాంటోడు. ఎవరికి ఎలాంటి సాయం చేయాలో మన ఎమ్మెల్యే సార్ చేస్తాడు. అడగక పోయినా సాయం చేసే వాడే లీడర్’’ అంటూ ఓ రేండ్ పొగిడేశారు. సీఐ రాము తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్‌లా కాకుండా అధికార పార్టీ కార్యకర్తలా సీఐ రాము మారిపోయారని జనాలు మండిపడుతున్నారు. ఇక తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము వ్యవహారం వివాదాస్పమవుతోంది. డీఎస్పీ, సీఐ తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు. ఇలాంటి అడ్డమైన దారులు తొక్కే వారి మాటలు విని అందర్నీ ఇబ్బంది పెడుతూపోతే వ్యవస్థ నాశనం అవుతుందని లేఖలో ఎస్ఐ రాయడం దుమారం రేపుతోంది.  ఉన్నతాధికారులు నిజాయితీగా పనిచేసేవారిని ప్రోత్సహించాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నారు. యూనిఫాం తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసే వారిని సపోర్ట్ చేస్తే తమ కుటుంబాలకు సమాజానికి పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డ్‌గా కూడా పనికి రాని గుత్తి సీఐ రామును తమ కులానికి చెందినవారని సపోర్ట్ చేయడం నేరం సార్ అంటూ లేఖలో ఘాటుగా నిలదీశారు ఎస్ఐ సుధాకర్.  ‘‘నన్ను సస్పెండ్ చేసినా... నేను కట్టిన 36 కేసులకు 36 ఛార్జ్ మెమోలు ఇచ్చినా గర్వంగానే ఉంటాను’’ అంటూ తాడిపత్రి డిఎస్పీ చైతన్యనుద్దేశించి ఎస్సై సుధాకర్ యాదవ్ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనం రేపుతోంది. పోలీస్ శాఖను షేక్ చేస్తోంది. 

సీఎం సారూ ఎన్నికల హామీలు ఏమాయే.. బండి రెండో ప్రశ్న పత్రం 

తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతికి సంబంధించి మంగళవారం పది బాణాలు సంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్, బుధవారం మరో కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈసారి బండి, తెరాస ఎన్నికల మేనిఫెస్టో మీద దృష్టిని కేంద్రీకరించారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లా విషయంలో తెరాస ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ఎండకట్టారు.  2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు..? ఎన్ని అమలు చేయలేదు..? దీనిపై చర్చించడానికి మీరు సిద్ధమేనా..?అని బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్’కు సవాలు విసిరారు. అలాగే, కేసీఆర్ మాటలను ఆయనకే అప్పగిస్తూ. ఇరుకైన ఇంట్లో ఆలుమగలు కాపురం చేయడమే కష్టం.. అల్లుడు బిడ్డా వస్తే తలదాచుకునేదెలా..? గత ప్రభుత్వాలు ఇరుకైన ఇళ్లు పేదలకు ఇచ్చింది.. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లో మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..?అని ప్రశ్నించారు.  అలాగే ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చింది గుర్తుచేస్తూ, జనవరి 11, 2015న వరంగల్ లో 4 నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ఈ హామీఏమైంది, ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కట్టించారు..? అని ప్రశ్నించారు. అంతే కాదు, ఇంకా తెరాస ఎన్నికల ప్రణాళిక, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలకు సంబదించి బండి సంజయ్ సంధించిన మరికొన్ని ప్రశ్నలు  1.    కేసీఆర్ సారూ… అల్లుడు, బిడ్డ వస్తే ఎక్కడ పడుకోవాలి..? డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడిస్తారు..? మీరిచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు..? 2. 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ 14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు..? ఎన్ని పేదలకు ఇచ్చారు..? వాటికి లెక్కలు చెప్పగలరా..? 3. 2018 ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు అందించడం జరుగుతుందని మీరు హామీ ఇచ్చారు. కనీసం ఒక్కరికైనా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందా..? 4.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇళ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే, అందులో ఎన్ని పూర్తి చేశారు..? వాటి వివరాలను ఇవ్వగలరా.. 5. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం మొత్తం ఎన్నిదరఖాస్తులు వచ్చాయి..? అందులో అర్హత ఉన్నవి ఎన్ని..? వాటి వివరాలు ఇవ్వగలరా..? 6. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో ఇళ్లు పొందడానికి అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం లేదు..? ఇందులో ఏమైనా మతలబు ఉందా..? 7. కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన 2.91 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తే… తెలంగాణలో పేదల కోసం మరో 10 లక్షల ఇళ్లు కేంద్రం నుండి మంజూరు చేయించే బాధ్యత బీజేపీ తెలంగాణ శాఖది. కేంద్రం మంజూరు చేసిన 2.91 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామని మీరు హామీ ఇవ్వగలరా..? 8. వందల కోట్ల రూపాయలతో మీరు ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్ ను సంవత్సర కాలంలోనే నిర్మించుకున్నారు. మీరు 2014లో నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారమే 26.31 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు రాష్ట్రంలో ఉన్నారు. 7 ఏళ్లు పూర్తవుతున్నా వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతున్నారు..? పేదల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా..? 9. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు..? ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి..? అఖిలపక్ష నేతలను తీసుకెళ్లి, నిర్మాణాల్ని చూపించే దమ్ము, ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా..? 10. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఈ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత..? ఖర్చు చేసిందెంత..? కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులెన్ని..? వాటి వివరాలను అందించగలరా..? 11.     గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు..? మిగితా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని కట్టారు..? అంటూ ముఖ్యమంత్రి పైకి  ప్రశ్నలు సంధించారు. అంతే .. ఈ ప్రశ్నల పరంపర ఇలాకొనాసగుతూనే ఉంటున్నదని, బాధ్యత గల పార్టీగా ప్రజల పక్షాన మరిన్ని ప్రశ్నలు సంధిస్తానన్నారు బండి సంజయ్

వాడిని ఎవ‌రిక‌న్నా చూపించండ్రా.. అలా వ‌దిలేయ‌కండ్రా..!

పోసాని కృష్ణ‌ముర‌ళి. నాగ‌బాబు మాట‌ల్లో మొరిగే కుక్క‌. పీకే ఫ్యాన్స్ దృష్టిలో పిచ్చి కుక్క‌. పోసాని తాను జ‌గ‌న్ అభిమానిన‌ని.. వైసీపీ మ‌నిషిన‌ని ఆయ‌నే చెప్పుకుంటారు. ఇక వైసీపీ వాళ్లంటే తెలుసుగా.. ఓ కొడాలి నాని, ఓ అనిల్‌కుమార్ యాద‌వ్‌.. ఓ పోసాని కృష్ణ‌ముర‌ళి. ఇలా ఇంకా చాలామందే ఉన్నా.. ఈ ముగ్గురూ ఓ జాతికే చెందిన వాళ్లంటారు. కొడాలి నాని, అనిల్‌కుమార్‌లు బూతుల మంత్రులగా ఫేమ‌స్ అయితే, ఆ ఇద్ద‌రూ రెండేళ్ల‌లో సంపాదించుకున్న ఆ చెత్త పేరును.. పోసాని మాత్రం ఇక్క‌రోజులోనే సాధించేశారు. అది నోరా.. సెప్టింగ్ ట్యాంకా? అనేలా దుర్గంధం వెద‌జ‌ల్లారు.  ఏం బాష అది? ఏం తిట్లు అవి?  మీడియా ముందు ఎవ‌రైనా అలా వాగుతారా?  పోసానికి ఏమైనా మ‌ర్యాద‌, ప‌ద్ద‌తి ఉందా? అంటూ స‌భ్య‌స‌మాజం చీద‌రించుకుంటోంది. అమ్మ‌-అక్క‌ల నుంచి వాడ‌లేని, విన‌లేని, రాయ‌లేని భాష‌లో బూతులు మాట్లాడి ప్ర‌జ‌లంద‌రితో ఛీ..అనిపించుకుంటున్నారు. ఏదైనా విమ‌ర్శ చేస్తే అర్థం ఉంటుంది.. ఉప‌యోగ‌మూ ఉంటుంది. చేసిన విమ‌ర్శ ప్ర‌జ‌ల్లోకి వెళుతుంది.. ఆలోచింప జేస్తుంది.. చ‌ర్చ జ‌రుగుతుంది.. ఫ‌లితం వ‌స్తుంది. కానీ, తిడితే ఏమొస్తుంది? తిట్టినోడిపైనే అస‌హ్యం పుడుతుంది. కొడాలి నాని, అనిల్‌కుమార్‌లు స్టార్ట్ చేసిన ఈ పైత్యాన్ని పోసాని పీక్స్‌కు తీసుకెళ్లారు. ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా కంపు కంపు మాట్లాడి.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. అంతా చేసి ఏం సాధించారు? అంద‌రి ముందు అబాసుపాల‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను నోటికొచ్చిన‌ట్టు తిట్టి.. అంద‌రితో తాను తిట్లు తింటున్నారు. పవన్ మీద కోపంతో.. పవన్ తల్లిని.. పెళ్లాన్ని కూడా వదిలిపెట్టనంటూ ఆయన అనేసిన మాటల పైత్యంపై చూసినోళ్లంతా మండిపడుతున్నారు. పవన్ వైసీపీ నేతల్ని తిట్టారు. వైసీపీ నేతలు ఆయన్ను తిట్టారు. సన్నాసి అని పవన్ అంటే.. పీకేను సన్నాసిన్న‌ర అంటూ పేర్ని నాని అన్నారు. లెక్క అంతవరకు సరిపోయింది. మ‌ధ్య‌లో పోసానికి ఎందుకింత‌లా పొడుచుకొచ్చిందో అర్థం కాదు. ఆయ‌నే ఇలా ఓవ‌ర్‌గా రియాక్ట్ అయ్యారా?  లేక‌, వైసీపీ వాళ్లే పోసానిని ప‌వ‌న్ మీద‌కు ఎగ‌దోశారా? అనే అనుమానం అయితే ఉంది. ఏదో వ‌చ్చాడు.. అన్నాడు.. పోయాడు.. అనేలా ఉండ‌కుండా.. అలా నోటికొచ్చిన‌ట్టు.. అమ్మ‌..నా..బూతులు తిట్ట‌డం అస‌లేమాత్రం క‌రెక్ట్ కాదంటున్నారు. పీకే ఫ్యాన్స్ పోసాని ఫ్యామిలీని టార్గెట్ చేసి తిడితే అందుకు ప‌వ‌న్ ఎలా బాధ్యులు?  ఫ్యాన్స్ అలా తిట్ట‌డం త‌ప్పే. మ‌రి, అదే త‌ప్పు పోసాని ఎలా చేస్తారు? అభిమానుల నోటి దూల‌కు ప‌వ‌న్ క‌ల్యాన్ కుటుంబాన్ని ఎందుకు బ‌లి చేయ‌డం? పవన్ ని పోసాని వ్యక్తిగతంగా విమర్శిస్తూ భార్య.. కూతురు పైనా వీరంగం వేయడంపై అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే, పోసాని తాట తీసేందుకు ప్రెస్ క్ల‌బ్‌కు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు జ‌న‌సైనికులు. పోలీసుల సాయంతో పోసాని త‌ప్పించుకున్నా.. ఆయ‌న లేపిన గ‌బ్బు..కంపును.. పినాయిల్‌తో కాదు యాసిడ్ పోసి క‌డిగాల్సి ఉంది. 

కొండా పోటీలో లేన‌ట్టేనా? రేవంత్‌రెడ్డి వ్యూహం మార్చారా?

రాజ‌కీయం ఏ రోజుకు ఆ రోజు మారిపోతుంటుంది. ఇవాళ క‌రెక్ట్ అనుకున్న‌ది.. రేపు రాంగ్ కావొచ్చు. అలానే రాంగ్ సైతం రైట్ అవ్వొచ్చు. రాజ‌కీయ‌మంటే అదే. కొన్నిసార్లు నెగ్గినా ఓడిన‌ట్టే. మ‌రొకొన్నిసార్లు త‌గ్గినా నెగ్గిన‌ట్టే. కాంగ్రెస్‌కు హుజురాబాద్ ఎన్నిక అలానే కానుందా? కౌశిక్‌రెడ్డి గోడ దూకాక‌.. హ‌స్తం పార్టీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేకుండా పోయారు. హుజురాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ పోటీ చేస్తారంటూ మొద‌ట్లో లీకులొచ్చాయి. పొన్నం త‌ర్వాత అనూహ్యంగా కొండా సురేఖ పేరు తెర‌మీదికొచ్చింది. కొండంత బ‌ల‌మున్న కొండా అయితేనే.. రేసుగుర్రంలా హుజురాబాద్‌ను గెలుచుకొస్తుంద‌ని భావించారు. రేపోమాపో కాంగ్రెస్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారంటుండ‌గా.. స‌డెన్‌గా జాబితాలో కొండా సురేఖ పేరు లేదంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజంగా కొండా సురేఖ బ‌రి నుంచి త‌ప్పుకున్నారా?  లేక‌, త‌ప్పించారా? వ్యూహాత్మ‌క‌మా? ఉద్దేశ్య‌పూర్వ‌క‌మా? ఇలా అనేక అనుమానాలు. తాను హుజురాబాద్‌లో పోటీ చేయాలంటే.. రాబోవు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి టికెట్లు కేటాయించాల‌నేది కొండా ఫ్యామిలీ పెట్టిన డిమాండ్లు. అయితే, భూపాల‌ప‌ల్లిలో గండ్ర స‌త్య‌నారాయ‌ణ కాంగ్రెస్‌లో చేరుతుండ‌టంతో ఆయ‌న‌కే టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. సో, వ‌రంగ‌ల్‌, ప‌ర‌కాల స్థానాల్లో తామే పోటీ చేస్తామంటూ కొండా దంప‌తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విష‌యంలో కాంగ్రెస్‌కూ పెద్ద‌గా అభ్యంత‌రం లేదు. గెలిచే స‌త్తా ఉన్న నాయ‌కులు కావ‌డంతో ఆ రెండు సీట్లూ ఇచ్చేందుకు పార్టీ సై అంటోంది. అయినా, కొండా సురేఖ హుజురాబాద్ నుంచి పోటీ చేయ‌ట్లేద‌నే వార్త‌లు వ‌స్తుండ‌టం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే క‌నిపిస్తోంది.  నిస్సందేహంగా కొండా బ‌ల‌మైన కేండిడేటే. కానీ, హుజురాబాద్‌లో ఆమె గెలుస్తారా? అంటే సందేహ‌మే. కేవ‌లం పోటీ చేయ‌డానికి, పోటీ ఇవ్వ‌డానికి మాత్ర‌మే అయితే.. కొండా లాంటి స్ట్రాంగ్ లీడ‌ర్‌ను అన‌వ‌స‌రంగా బ‌రిలో దింపి వారి ఇమేజ్‌ను త‌గ్గించ‌డం ఎందుక‌నేది రేవంత్‌రెడ్డి ఆలోచ‌న అంటున్నారు. అందులోని హుజురాబాద్ స్థానిక నాయ‌క‌త్వం కొండా పేరును తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. స్థానికుల‌కే టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. స్థానికంగా స‌మ‌ర్థుడైన నాయ‌కుడిని ఇప్ప‌టి నుంచే రెడీ చేస్తే.. ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌లో కాక‌పోయినా నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికైనా గెలిచేలా బ‌లం పుంజుకునే అవ‌కాశం ఉందంటున్నారు. అది కూడా క‌రెక్టే. అందుకే.. అధిష్టానానికి పంపిన తాజా జాబితాలో కొండా సురేఖ పేరు లేద‌ని అంటున్నారు. లేటెస్ట్ లిస్ట్‌లో.. క్రిష్ణారెడ్డి.. రవికుమార్.. ప్యాట రమేశ్.. సైదులు పేర్లు ఉన్న‌ట్టు స‌మాచారం.  కాంగ్రెస్‌కు ఎలాంటి ఉప‌యోగం లేని హుజురాబాద్‌ ఉపపోరులో.. పొన్నం, కొండాలాంటి పెద్ద స్థాయి నేతల్ని బరిలోకి దింపి భంగపడే కన్నా.. పోటీ చేశామా? అంటే చేశామనేలా అనిపించేలా.. ఉంటే చాల‌నే అభిప్రాయంలో రేవంత్‌రెడ్డి ఉన్నార‌ని తెలుస్తోంది. బ‌ల‌మైన నేతల్ని బరిలోకి దింపినా.. ఆస్థాయిలో ఓట్లు రాక‌పోతే.. అది పార్టీకి మ‌రింత చేటు చేస్తుంద‌ని పీసీసీ చీఫ్‌ భావిస్తున్నారు. అందుకే, కేసీఆర్‌-ఈట‌ల మ‌ధ్య సాగే హుజురాబాద్ కొట్లాట‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద‌గా చేయి పెట్ట‌కుండా.. చేయి కాల్చుకోకుండా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. కాస్త త‌గ్గి.. ప‌రోక్షంగా నెగ్గాల‌నే ఎత్తుగ‌డ అమ‌లు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ముందు పొన్నం, కొండా అంటూ కావాల‌నే హ‌డావుడి చేసి.. టీఆర్ఎస్‌, బీజేపీల‌కు అలా ఝ‌ల‌క్ ఇచ్చి.. తుద‌కు స్థానికుల్లో ఎవ‌రో ఒక‌రిని బ‌రిలో దింపి.. ఈవీఎంలో చేతి గుర్తు ఉండేలా చూసుకోవ‌డం మిన‌హా.. హుజురాబాద్ ఎన్నిక‌కు అంత‌కుమించి ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌ద‌నేది పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యూహంలా క‌నిపిస్తోంది.   

టాప్ న్యూస్ @ 1PM

జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్‌ రాగానే.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. జనసేన, వైసీపీ మధ్య రచ్చ రగులుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తుండటం కాక రేపుతోంది.  -------- స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం పవన్‌పై దూషణ పర్వంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులు జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు నారాయణ స్వామి.  --------  రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను నడపాల్సింది బ్యాంకులా లేక రాష్ట్ర ప్రభుత్వమా అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు కేంద్ర నిధుల తాకట్టుతో మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కోసం బ్యాంకులను అప్పు అడగడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా డైవర్షన్ చేశారని ఆరోపించారు. ప్రతి కేంద్ర పథకానికి ప్రత్యేక ఖాతా తెరవాల్సినా, కేవలం 5 ఖాతాలతో మేనేజ్ చేయడం సూట్ కేస్ కంపెనీల నిర్వాహణ లాంటిదేనని మండిపడ్డారు. ------ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు అన్నీ పరిశీలిస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. గత ఎన్నికల్లో కాపులు తటస్థంగా ఉన్నారని...కాపులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే దేనికి దారితీస్తాయో చెప్పలేమని తెలిపారు. ఎస్వీబీసీ  చైర్మన్ పృథ్విని బయటకు పంపడం, అవంతిపై హనీ ట్రాప్ చేయడం, సామినేని ఉదయభాను ప్రతిష్ట దెబ్బ తీయడం జరిగిందన్నారు. ----- తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము  తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు. ------- విశాఖలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లా  అతలాకుతలం అయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. ఎయిర్ పోర్ట్‌లోకి నీరు రావడంతో...ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ రూపురేఖలు మార్చేస్తామని అన్నారు..ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని జేవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.  ------- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెరిగిపోతున్న గంజాయి దందాపై తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకప్పుడు పంజాబ్‌లో ఎలాంటి దందా జరిగిందో ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి దందా జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విజయశాంతి ప్రశ్నించారు.కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి గంజాయి మత్తు నుంచి యువతరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిదన్నారు.  ---- కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో గల ఎస్‌బీఐ బ్యాంక్ ముందు దళితుల క్యూ కట్టారు. తమ అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యాయో లేదో అని లబ్దిదారులు తనిఖీలు చేసుకుంటున్నారు. కొందరికి డబ్బులు అకౌంట్‌లో జమ అయినట్లు మెసేజ్‌లు రాగా...మరికొందరికి మెసేజ్ రాకపోవడంతో లబ్ధిదారులు బ్యాంక్‌కు తరలివచ్చారు. -------- దేశం కోసం కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో ప్రాణాలర్పించారని ఒక్క బీజేపీ నేత కూడా ఈ జాబితాలో లేడని ప్రతిపక్షనేత సిద్దరామయ్య పేర్కొన్నారు. బ్రిటీష్‌ వారికి గతంలో తొత్తులుగా వ్యవహరించి, నేడు కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తున్న బీజేపీ నుంచి దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నారు. బీజేపీ నేతల మనిస్థితిని తాను తాలిబాన్లతో పోల్చానని గట్టిగా సమర్థించుకున్నారు.  --------- కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వతేదీ వరకు ఢిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడాన్ని నిషేధించింది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం ఢిల్లీలో వాయికాలుష్యాన్ని నివారించేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం విధించినట్లు సర్కారు తెలిపింది. శీతాకాలంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు.  ------  

టాలీవుడ్‌కు ప్ర‌భుత్వం బెదిరింపులు!.. బాహుబ‌లి క‌లెక్ష‌న్స్‌తో బ్లాక్‌మెయిల్?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ర్సెస్ వైసీపీ ప్ర‌భుత్వం. ఇద్ద‌రి మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. రిప‌బ్లిక్ వేదిక‌గా జ‌న‌సేనాని.. ఆన్‌లైన్ టికెట్ల వ్య‌వ‌హారాన్ని ఏకిపారేశారు. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నానిని స‌న్నాసంటూ కుమ్మేశారు. త‌న సినిమాల‌ను టార్గెట్ చేశార‌ని.. ఆన్‌లైన్ టికెట్ల అమ్మ‌కాల‌తో అప్పులు తెచ్చుకునే స్కెచ్ అంటూ విమ‌ర్శించారు. ప‌వ‌న్ మాట‌ల‌కు.. మంత్రులు సైతం అదే స్థాయిలో కౌంట‌ర్లు ఇచ్చారు. మ‌ధ్య‌లో పోసాని ఎంట‌రై ర‌చ్చ‌ మ‌రింత రాజేశారు.  విచిత్రం ఏంటంటే.. ఏ ఇండ‌స్ట్రీ కోస‌మైతే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంత‌లా నోరు పారేసుకున్నారో.. అదే ఇండ‌స్ట్రీ నుంచి ప‌వ‌న్ మాట‌ల‌పై డివైడ్ టాక్ వినిపిస్తుండ‌టం ఆశ్చ‌ర్యక‌రం. రిప‌బ్లిక్ ఈవెంట్ ముగిసిన మ‌ర్నాడే.. స‌ర్కారుకు స‌పోర్ట్‌గా, ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా డైలాగులు వ‌దిలారు. మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న మంచు విష్ణు.. ప‌వ‌న్‌ మాట‌ల‌ను తాను స‌మ‌ర్థించ‌న‌ని అన్నారు. మోహ‌న్‌బాబును పీకే కార్న‌ర్ చేశారు కాబ‌ట్టి ఆయ‌న కొడుకుగా మంచు విష్ణు అలా అన్నార‌ని అనుకోవ‌చ్చు. కానీ, ఏకంగా తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ సైతం అలాంటి అభిప్రాయ‌మే వ్య‌క్తం చేస్తూ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డాన్ని ఎలా  చూడాలి? త‌మ‌కు రెండు ప్ర‌భుత్వాల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించింది. కేవ‌లం కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే అలా బ‌హిరంగ‌ ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?  ఫిల్మ్ ఛాంబ‌ర్ అలాంటి ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సిందిగా ప్ర‌భుత్వం నుంచి ఒత్తిడి వ‌చ్చిందా?  వైసీపీ స‌ర్కారు ఆదేశాల మేర‌కే ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆ స్టాండ్ తీసుకుందా? అనే అనుమానం. ఇక‌, రెండు రోజులు ఆగి సీఎం జ‌గ‌న్ ఆంత‌రంగిక మ‌నిషి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. చాలా వ్యూహాత్మ‌కంగా మాట్లాడారు. మొత్తం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను టార్గెట్ చేస్తూ.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. ఆన్‌లైన్ టికెటింగ్ అవ‌స‌రాన్ని నొక్కి చెబుతూ.. బాహుబ‌లి క‌లెక్ష‌న్స్‌ను ప్ర‌స్తావించారు. బాహుబ‌లి మూవీ విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపించార‌ని అన్నారు. ఫ‌స్ట్‌వీక్ క‌లెక్ష‌న్స్‌లో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసింద‌ని ఆరోపించారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు స‌జ్జ‌ల‌.  స‌జ్జ‌ల కామెంట్స్‌తో టాలీవుడ్ ఒక్క‌సారిగా షాక్ అయింది. తెలుగు సినిప‌రిశ్ర‌మ‌లో రాజ‌మౌళి, బాహుబ‌లిలు లెజెండ్స్‌, ట్రెండ్‌సెట్ట‌ర్స్‌. అలాంటిది బాహుబ‌లి క‌లెక్ష‌న్స్‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం ఆరోపించ‌డం.. ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌డం.. ప‌క్కా బెదిరించ‌డ‌మేన‌ని అంటున్నారు. ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు స‌పోర్ట్‌గా నిలిస్తే.. ఇలా సినిమా దందాల‌న్నిటికీ చెక్ పెడ‌తామ‌ని బ్లాక్‌మెయిల్ చేయ‌డ‌మే అని అనుమానిస్తున్నారు. త‌మ‌కు అనుకూలంగా ఉండ‌క‌పోతే.. ఇలాంటి ద‌ర్యాప్తులు ఇంకా చాలానే ఉంటాయ‌ని.. బ‌హుబ‌లి సినిమానే వ‌ద‌ల‌ని ప్ర‌భుత్వం ఇక మిగ‌తా మూవీల‌ను వ‌దిలిపెడుతుందా? మ‌రి, అలా జ‌ర‌గ‌కూడ‌దంటే ఇండ‌స్ట్రీ మొత్తం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండాల్సిందేన‌నే హెచ్చ‌రిక ధోర‌ణి అందులో క‌న‌బ‌డుతోంది. త‌మ‌ను కాద‌ని ప‌వ‌న్ వెనుక చేరి తోక జాడిస్తే.. ద‌ర్యాప్తులతో తోక క‌ట్ చేస్తామ‌నే అర్థం వ‌చ్చేలా.. సీఎం జ‌గ‌న్ త‌ర‌ఫున‌ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బాహుబ‌లి క‌లెక్ష‌న్ల పేరుతో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను బ్లాక్‌మెయిల్ చేశార‌ని అంటున్నారు.  

ఏపీ పర్యటనలో పవన్ కల్యాణ్.. పోసానికి ఎలా కౌంటరిస్తారో? 

వైసీపీ, జనసేన మధ్య సాగుతున్న మాటల యుద్ధంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక పెరిగింది. జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయగా.. ఆయన వైసీపీ మంత్రులు కౌంటరిచ్చారు. ఇందులోకి ఎంట్రీ ఇచ్చిన పోసాని కృష్ణ మురళీ.. పవన్ కల్యాణ్ పై బండ బూతులతో విరుచుకుపడ్డారు. పవన్ ను టార్గెట్ చేస్తూ పోసాని మాట్లాడిన మాటలు ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. హైదరాబాద్ లో కేసుల వరకు వెళ్లింది.  పీకే, పోసాని మాటల వార్ హద్దులు దాటిన సమయంలోనే  జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఏపీలో పర్యటిస్తుండటం కాకరేపుతోంది. రెండు రోజుల పర్యటన కోసం విజయవాడ వచ్చిన పవన్ కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు జన సేనాని. నాదేండ్ల మనోహర్, ఇతర సభ్యులు, పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. స్టీల్ ఫ్లాంట్, అమరావతి, శ్రమదానం, బద్వేల్ ఉప ఎన్నిక, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై  చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. రెండు రోజులపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటన కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ మంత్రులుగా వ్యవహారం మారింది. పవన్ దూకుడుపై ప్రభుత్వ పెద్దల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే పోసానితో విమర్శలు చేయిస్తున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ లో మాట్లాడిన పోసాని కృష్ణ మురళీ.. తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మెగా ఫ్యామిలీని కూడా విమర్శించారు. పోసాని వ్యాఖ్యలపై జన సైనికులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పోసాని మాటలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.    

జగన్ పై ప్రజలే దాడి చేస్తారు.. ఏపీ డిప్యూటీ సీఎం కామెంట్స్ రచ్చ...

ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నారు. కాని ఆయనే సీఎంను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడారు.. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిపై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడటం సంచలనంగా మారింది. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ గా మారి రచ్చ రచ్చవుతోంది.. అసలు ఆయన ఈ కామెంట్ ఎందుకు చేశారో తెలుసా.. ఆయన కావాలని అన లేదు... ఏదో మాట్లాడబోతూ అలా నోరు జారారు..  అయితే  అసలే సోషల్ మీడియా ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది. చిన్న బిట్ దొరికినా అటాడేసుకుంటారు. అలాంటిది సీఎంపై ప్రజలే దాడి చేస్తారని ఉప ముఖ్యమంత్రి అంటే ఊరుకుంటారా... తెగ వైరల్ చేస్తున్నారు.. అసలు విషయానికి వస్తే.. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడింది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ప్రస్తుతం ఏపీలో పవన్ కల్యాణ్ రచ్చ సాగుతోంది. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పీకే మాట్లాడటంతో.. ఆయనకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పవన్‌ ను టార్గెట్ చేయడంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేశారు. పవన్ పై ప్రజలే దాడి చేస్తారని అనబోయి.. నోరు జారారు. జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించారు.ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడిన మాటలను జనసేన, టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. జగన్ పై ప్రజలు దాడి చేయడం ఖాయమని, వైసీపీ నేతలే ఈ విషయం చెబుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. 

మ‌రో గ్యాంగ్ రే-ప్‌.. యువ‌తికి మ‌ద్యం తాగించి.. హాస్పిట‌ల్‌లో అత్యా-చారం

దిశ‌ను న‌లుగురు మృగాలు క్రూరంగా చెరిచారు. రోజంతా కాపు కాసి.. బ‌రితెగించి బ‌లాత్కారం చేసి.. దారుణంగా పెట్రోల్ పోసి చంపేశారు. ఆ మాన‌వ మృగాల‌పై దేశ‌మంతా క‌న్నెర్ర చేసింది. తెలంగాణ పోలీసులు ఆ ఉన్మాదుల‌ను కాల్చి పారేశారు. ఆ ఎన్‌కౌంట‌ర్‌తో అలాంటి ఆలోచ‌న చేసే శాడిస్టుల్లో భ‌యం పుడుతుంద‌ని అనుకున్నారు. ఇక‌పై అత్యా-చారం అనే ఆలోచ‌న వ‌స్తేనే వ‌ణికిపోతార‌ని భావించారు. కానీ, అలా జ‌ర‌గ‌డం లేదు. దిశ ఎన్‌కౌంట‌ర్ ఉన్మాదుల‌ను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతోంది. ఆ త‌ర్వాత కూడా ప‌లు రే-ప్ ఘ‌ట‌న‌లు జ‌రగ‌డం క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ఇటీవ‌ల సైదాబాద్‌ సింగ‌రేణి కాల‌నీలో చిన్నారిని చెరిచాడు ఓ దుర్మార్గుడు. పోలీసుల చ‌క్ర‌బంధ‌నంతో ట్రైన్ కింద ప‌డి చ‌నిపోయాడు. ఇక దిశ ఎన్‌కౌంట‌ర్ కేసులో త్రిస‌భ్య క‌మిటీ ఆనాటి సీపీ స‌జ్జ‌న్నార్‌ను ఎంక్వైరీ చేస్తున్న స‌మ‌యంలోనే నిజామాబాద్‌లో మ‌రో దిశ త‌ర‌హా సామూహిక అత్యా-చార ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై గ్యాంగ్ రే-ప్‌కు పాల్పడ్డారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. యువ‌తికి మ‌ద్యం తాగించి న‌లుగురు ఉన్మాదులు ఈ దారుణానికి తెగించారు. గమనించిన హాస్పిట‌ల్‌ సెక్యూరిటీ సిబ్బంది డయల్‌ 100కు ఫోన్ చేశారు. పోలీసులు వ‌చ్చే స‌రికి ఆ న‌లుగురు దుర్మార్గులు అక్క‌డి నుంచి పారిపోయారు.  మ‌ద్యం మ‌త్తులో ఉన్న యువ‌తిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. ప‌రారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నిజామాబాద్‌లో గ్యాంగ్ రే-ప్ జ‌రిగింద‌ని తెలిసి తెలుగు రాష్ట్రాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. మాన‌వ మృగాల దారుణాల‌కు అంతెప్పుడ‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. 

టీడీపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు! డీజీపీకి ఫిర్యాదు.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ తీరు మార్చుకోవడం లేదు వైసీపీ లీడర్లు. కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య నేతకు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియా వేదికగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అంతుచూస్తామని బెదిరిస్తున్నారంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్  డీజీపీకి ఫిర్యాదు చేశారు.  టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లిన పట్టాభిరామ్ తన ఫిర్యాదును అందచేశారు. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్షమాపణ చెప్పకపోతే అంతుచూస్తామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పట్టాభిరామ్.  వైసీపీ ఎమ్మెల్యే ఉదయబాను రెండో కుమారుడు ప్రశాంత్ వ్యవహారశైలిపై మీడియా ముందు వాస్తవాలు తీసుకొచ్చినందుకే ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత డీజీపీని కోరారు.  పట్టాభిరామ్‌ కు శ్రద్ధాంజలి అంటూ పోస్టులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జగ్గయ్యపేట వైసీపీ సంగతి తెలుసుకదా అని హెచ్చరిస్తున్నారని తెలిపారు. యర్రమాను రామకృష్ణ, జోన్స్ పణితి తదితరులు తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పట్టాభి తన ఫిర్యాదులో వివరించారు.  

కొండా సురేఖ పోటీకి సిద్ధమేనా? హుజురాబాద్ లో రేవంత్ వ్యూహమేంటీ?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈటల రాజేందర్ రాజీనామాతో జరగబోతున్న ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే పార్టీలు దూకుడు పెంచాయి. బైపోల్ ను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీ తమ బలగాలను అక్కడే మోహరించింది. ముందుగానే అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. దళిత బంధు స్కీంతో ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా కైవసం చేసుకునే పనిలో పడింది గులాబీ పార్టీ. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా హరీష్ రావు హజురాబాద్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. ఈటలతో ఉన్న నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కారెక్కేలా ఆయన పావులు కదుపుతున్నారు. తన కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో గెలిచి సీఎం కేసీఆర్ కు షాకివ్వాలని చూస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ కేంద్రంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. అందుకే షెడ్యూల్ రాకముందే ఓ రౌండ్ ప్రచారం చేసేసారు ఈటల. పాదయాత్రతో కొన్ని గ్రామాలు తిరిగారు. షెడ్యూల్ రావడంతో బీజేపీ రాష్ట్ర నేతలంతా ప్రచారం చేయబోతున్నారు. ప్రజా సంగ్రామ్ యాత్ర చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... అక్టోబర్ 2న హుజురాబాద్ లో తన తొలి దశ యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో భారీ సభ పెట్టి.. ఆ వేదిక నుంచే ఉప ఎన్నికల ప్రచార శంఖారావం పూరించాలని బీజేపీ భావిస్తోంది. బండి సంజయ్ సభను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటిలను ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ నేతలు కూడా హుజురాబాద్ లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్, బీజేపీలు దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా సైలెంటుగానే ఉంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలతో అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. కాని అత్యంత కీలకమైన ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ పై మాత్రం ఫోకస్ చేయలేదు. మిగితా పార్టీలు అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని కూడా తేల్చలేదు. షెడ్యూల్ కూడా రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి హుజురాబాద్ వెళ్లకపోవడంతో... ఉప ఎన్నికపై ఆయన స్టాండ్ ఏంటన్నది తెలియడం లేదు. హుజురాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా రేవంత్ రెడ్డి మాత్రం హుజురాబాద్ గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.  ఇప్పుడు  హుజూరాబాద్​ ఉప ఎన్నిక షెడ్యూల్​ రావడంతో కాంగ్రెస్​లో హడావుడి మొదలైంది. ఈనెల 30న భూపాలపల్లిలో జరిగే సభలో అభ్యర్థి ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ నేతృత్యంలోని కమిటీ కొద్ది రోజుల క్రితమే నాలుగు పేర్లను హైకమాండ్ పరిశీలనకు పంపింది. బయోడేటా, బలాబలాల వివరాలతో నివేదిక ఇచ్చింది. కవ్వంపల్లి సత్యనారాయణ (ఎస్సీ-మాదిగ), కొండా సురేఖ (బీసీ -పద్మశాలి), పత్తి కృష్ణారెడ్డి (రెడ్డి), ప్యాట రమేశ్ (బీసీ -మున్నూరు కాపు) పేర్లను పంపినట్లు సమాచారం. భూపాలపల్లిలో పట్టున్న నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్​లో చేరుతున్న సందర్భంగా 30న భారీ సభ జరగనుంది. అభ్యర్థి ప్రకటనకు దాన్ని సరైన వేదికగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం గతంలో జరిగింది. కొండా దంపతుల సామాజిక వర్గాలు నియోజకవర్గంలో బలంగా ఉండటం తమకు లాభిస్తుందని హస్తం నేతలు అంచనా వేశారు. పోటీకి కొండా సురేఖ కూడా అంగీకరించిందని, అయితే కొన్ని కండీషన్లు పెట్టిందనే ప్రచారం జరిగింది. తర్వాత సీన్ మారిపోయింది. కొండా అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకించారని, దామోదర రాజనర్సింహ కమిటి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనే చర్చ బయటికొచ్చింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో కరీంనగర్​లో జరిగిన సమీక్షలో లోకల్​లీడర్లు కొండా అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. దాంతో అభ్యర్థి ఎంపికకు కమిటీ వేయగా 19 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది ఆసక్తిగా మారింది. కొండా సురేఖను ఖరారు చేస్తారా లేక లోకల్ లీడర్ ను బరిలోకి దింపుతారా అన్నది ఈనెల 30న తేలనుంది. కొండా సురేఖను ప్రకటిస్తే... కాంగ్రెస్ సీరియస్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఈటల రాజేందర్ తో కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఆయనకు కాంగ్రెస్ లోపాయకారిగా మద్దతు ఇవ్వవచ్చనే చర్చ కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకే ఈటలకు లాభించేలా హుజురాబాద్ లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థి నిలపవచ్చని కూడా చెబుతున్నారు. మొత్తంగా రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక వస్తున్న తొలి ఎన్నిక కావడంతో.. ఆయన ఎలాంటి వైఖరి అవలంభిస్తారని రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.

ఎంపీ భ‌ర‌త్, ఎమ్మెల్యే రాజాల‌కు జ‌గ‌న్ వార్నింగ్‌.. ఓవ‌ర్ చేస్తే యాక్ష‌న్ త‌ప్ప‌దు..

ఎంపీ మార్గాని భ‌ర‌త్ వ‌ర్సెస్ ఎమ్మెల్యే రాజా. కొన్నిరోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. అధికార పార్టీ నేత‌లే ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో రాజ‌మండ్రిలో ర‌చ్చ రంభోలా చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మాట‌ల యుద్ధం స్టేట్ వైడ్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ ప‌రువంతా పోయింది. ఎంపీపై ఎమ్మెల్యే అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. క్రిమిన‌ల్స్‌, రౌడీషీట‌ర్స్‌ను వెంటేసుకుని దందాలు చేస్తున్నారంటూ ఎంపీ భ‌ర‌త్‌ను ఎమ్మెల్యే రాజా విమ‌ర్శించ‌డం.. రాజాపై భ‌ర‌త్ సైతం కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేయ‌డంతో.. వారిద్ద‌రి ర‌గ‌డ తాడేప‌ల్లికి చేరింది.  ఎంపీ, ఎమ్మెల్యేల కుంప‌టిని చ‌ల్లార్చే ప‌నిని తూర్పుగోదావ‌రి జిల్లా ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించింది పార్టీ అధిష్టానం. కానీ, వారిని కాంప్ర‌మైజ్ చేయ‌డం సుబ్బారెడ్డి వ‌ల్ల కూడా కాలేదు. వైవీ స‌మ‌క్షంలోనే భ‌ర‌త్‌, రాజాలు నువ్వెంతంటే నువ్వెంతంటూ తిట్టుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. వైవీ సుబ్బారెడ్డి రెండు విడ‌త‌లుగా భ‌ర‌త్‌, రాజాల‌తో మాట్లాడి.. విడివిడిగా వారి నుంచి వివ‌ర‌ణ తీసుకున్నారు.  మంగ‌ళ‌వారం రోజంతా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రాజ‌మండ్రి పంచాయితీ కొన‌సాగింది. భ‌ర‌త్‌, రాజాల‌ను కాంప్ర‌మైజ్ చేయ‌డం త‌న వ‌ల్ల కావ‌టం లేద‌ని వైవీ సుబ్బారెడ్డి చేతులెత్తేయ‌డంతో.. ఇక త‌ప్పేలా లేద‌ని సీఎం జ‌గ‌న్ నేరుగా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. సీన్‌.. సీఎం ద‌గ్గ‌రికి షిఫ్ట్ అయింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై జ‌గ‌న్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే క‌ఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంకోసారి మీడియా ముందు గొడ‌వ ప‌డితే యాక్ష‌న్ త‌ప్ప‌ద‌ని.. ఏదైనా ప్రాబ్ల‌మ్స్ ఉంటే పార్టీ అంత‌ర్గత వేదిక‌ల్లో మాత్ర‌మే మాట్లాడాల‌ని గ‌ట్టిగా చెప్పార‌ట సీఎం జ‌గ‌న్‌. దీంతో.. రాజ‌మండ్రి వైసీపీ వ‌ర్గ‌పోరు ప్ర‌స్తుతానికి స‌మ‌సిపోయిన‌ట్టే అంటున్నారు.   

పవన్ పై పచ్చి బూతులతో విరుచుకుపడ్డ పోసాని..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన ఆరోపణలు చేశారు. పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పోసానిపై ఆయన అభిమానులు బెదిరింపులకు పాల్పడ్డారట. దీంతో  పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న బెదిరింపులతో మీడియా ముందుకొచ్చిన పోసాని.. జనసేనానిపై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు  అమ్మనా బూతులు తిడుతూ వేలాది మెసేజ్ లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని అన్నారు. పవన్ ను విమర్శిస్తే ఆయన అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారో.. వైఎస్ జగన్ అభిమానిగా తాను అలానే స్పందించానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఇదే పవన్ విమర్శిస్తే 'తుకడా' చేస్తానని హెచ్చరించారని.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికెళ్లి ధర్నా చేశారా? లేక ఆయనకు బెదిరింపు మెసేజీలు పంపించారా? అని నిలదీశారు. పవన్ ఫ్యాన్స్ సైకోలుగా వ్యవహరిస్తున్నారని.. బూతులు తిడుతున్నారని.. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని పోసాని మండిపడ్డారు. తన  కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ ప్రెస్ మీట్ పెట్టి తన అభిమానులకు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తాను అతని కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడితే తెలుగుదేవం పార్టీ సీనియర్ నేత లోక్ సభ సభ్యుడు కేశినేని ఆయన కుమార్తెపై వివాదాస్పద కామెంట్స్ చేశారని పోసాని ఆరోపించారు. రాజకీయాలకు కుటుంబ సభ్యులకు ఏం సంబంధం ఉందని చిరంజీవి బాధపడ్డారని అన్నారు. మంత్రి కురసాల కన్నబాబు దీనికి సాక్షి అని పోసాని అన్నారు.కురసాల తన ఎదురుగా చిరంజీవి ఆవేదన చెందడాన్ని తాను తట్టుకోలేకపోయానని అన్నారు.  నేరుగా కేశినేని ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడానని చెప్పారు.  కేశినేని నానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. వారిని ఎవరైనా ఏమైనా అంటే బాధపడరా? అని నిలదీశానని చెప్పారు. దీంతో కేశినేని నాని పశ్చాత్తాప పడ్డారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా ఒక కుమార్తె ఉన్నదని.. రేపొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని.. పవన్ కు రక్తకన్నీరు తప్పదని జోస్యం చెప్పారు.  నీ ఇంట్లో ఉండేవాళ్లే ఆడవాళ్లా..? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు.  తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే తాను కూడా పవన్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని పోసాని కృష్ణ మురళీ హెచ్చరించారు.  ఇక ఓ పంజాబీ అమ్మాయిని కడుపు చేసి రూ.5 కోట్లు ఇచ్చి వాళ్ల నోరు మూయించావ్ అని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు ఆమెకు కెరీర్ ఇస్తానంటే ప్రామిస్ చేసి మోసం చేశాడు.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని  బెదిరించాడు. అందుకు 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడట.. అని పోసాని సంచలన కామెంట్స్ చేశారు. నాకు తెలిసింది చెప్పానని వివరించారు. మానసిక రోగంతో ఆ అమ్మాయి ఎలా డిప్రెషన్ లోకి వెళ్లిందో తెలుసన్నారు. 

TOP NEWS @ 7pm

1. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు కలిశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. 2. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కులపిచ్చి బాగా ముదిరిపోయిందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రంలో కేవలం 4 శాతమున్న తన వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ఓట్లతోనే సీఎం అయ్యారనే వాస్తవాన్ని జగన్ విస్మరిస్తున్నారన్నారు.  3. టీజేఎస్ చైర్మన్ కోదండరామ్‌పై పోలీసుల అనుచిత వైఖరిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు రేవంత్‌రెడ్డి హెచ్చ‌రించారు.  4. వరి వేస్తే ఉరి అని చెబుతున్న కేసీఆర్‌కు వరి కొనమని ఎవరు చెప్పారు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజ కొంటమన్న కేసీఆర్.. ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. నా భాషకు గురువు కేసీఆరే.. కేసీఆర్‌ను గద్దె దించేదాక భాష మార్చుకోనని చెప్పారు బండి సంజ‌య్‌. 5. సోమవారం రాత్రి నుంచి తనను ఫోన్లు, మెసేజ్‌లతో పీకే ఫ్యాన్స్ తిడుతున్నారంటూ పోసాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘ఫ్యాన్స్‌తో గ్రూపును పెట్టుకున్నాడు. ఫంక్షన్లకు తన ఫాన్స్‌ను పంపిస్తున్నాడు. నువ్వు సద్దాం హుస్సేన్ లా నియంతవా? పవన్ కల్యాణ్ ఒక సైకో‘‘.. అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు పోసాని.  6. పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరికునేది లేదని పీకే ఫ్యాన్స్ హెచ్చ‌రించారు. పవన్ కల్యాణ్ సైకో కాదని, పోసానినే సైకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోసాని ప్రెస్‌మీట్ పెట్టిన ప్రెస్‌క్లబ్ ద‌గ్గ‌ర పీకే ఫ్యాన్స్ భారీగా చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పవన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.  7. నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరు జాప్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు 2017-18లో చేపట్టిన పనులకు ఇప్ప‌టి వరకు బిల్లులు మంజూరు చేయలేదంటూ హైకోర్టులో 100 మంది పిటిషన్లు వేశారు. విచారణ పేరుతో బిల్లులు ఇవ్వకపోవడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  8. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూసీ వరద ఉధృతితో మూసారాం బాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ చేశారు. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీలో వరద ఉధృతి పెరిగింది.   9. సీపీఐ నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధినేత కన్హయ్య కుమార్, గుజరాత్‌లోని వడగావ్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ దేశంలోని సంస్కృతిని చరిత్రను భవ్యిష్యత్‌ను నాశనం చేయడానికి ఒక భావజాలం చాలా ప్రయత్నిస్తోంది. అందుకే త‌న‌కు కాంగ్రెస్ భావజాలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని క‌న్హ‌య్య అన్నారు.  10. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయ‌డం ఆ పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని సిద్ధూ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఓ దళితుడు చేపట్టడాన్ని కాంగ్రెస్ నేత సిద్ధూ సహించలేకపోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ విమ‌ర్శించింది.   

హద్దులు దాటిన పోసాని, పీకే వార్.. దాడులతో హై టెన్షన్..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మధ్య సాగుతున్న వివాదం హద్దులు దాటేసింది. వ్యక్తిగత విమర్శలు దాటి కుటుంబ సభ్యులకు వరకు వచ్చింది. పచ్చి బూతులు నాట్యం చేస్తున్నాయి. చివరకు దాడుల వరకు వచ్చింది.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణ మురళీపై దాడికి జనసైనికులు ప్రయత్నించడం హై టెన్షన్ పుట్టించింది.  తెలంగాణ పోలీసులు స‌రైన స‌మ‌యంలో స్పందించడంతో పోసాని క్షేమంగా బయటపడ్డారు. లేదంటే పీకే ఫ్యాన్స్ చేతిలో పోసాని భౌతిక దాడికి కూడా గుర‌య్యేవారే. పోసాని ప్రెస్ మీట్ కు ముందే ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌చ్చి హంగామా చేసినా.. పోలీసులు వారిని నిరోధించారు. ఆ త‌ర్వాత పోసాని అక్క‌డి నుంచచి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో ఎక్క‌డున్నారో గానీ.. ఒక్క‌సారిగా ప‌లువురు ప‌వ‌న్ ఫ్యాన్స్ పోసానిపై దాడికి య‌త్నించారు. అయితే అప్ప‌టికే భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఈ దాడిని నివారించారు. పవన్ కల్యాణ్ వైసీపీపై ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది.వైసీపీ స‌ర్కారుపై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఓ వైపు ఏపీ మంత్రులు వ‌రుస‌బెట్టి కౌంట‌ర్లు ఇస్తుండగానే.. సోమ‌వారం  మీడియా ముందుకు వ‌చ్చి  కౌంటర్ ఇచ్చారు పోసాని. ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ వ్యాఖ్య‌ల్లో వ్య‌క్తిగ‌త అంశాలు అంత‌గా లేకున్నా.. ఓ యువ‌తిని ప‌వ‌న్ గ‌ర్భ‌వ‌తిని చేశారంటూ పోసాని నోరు జారారు. ఈ కామెంట్లు విన్నంత‌నే.. ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోసానిని బండ బూతులు తిట్ట‌డం మొద‌లెట్టార‌ట. అంతేకాకుండా నేరుగా పోసానికే ఫోన్ చేసి బెదిరింపుల‌కు దిగార‌ట‌. ఈ సంద‌ర్భంగా పోసాని ఫ్యామిలీ మెంబ‌ర్ల ప్ర‌స్తావ‌న‌ను తీసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ అస‌భ్య‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశార‌ట‌.  వీరి మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం మంగ‌ళ‌వారం నాడు హ‌ద్దులు దాటేసింది. మీడియా ముందుకు వ‌చ్చిన పోసాని.. ప‌వ‌న్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ రాయ‌డానికి వీల్లేని ప‌ద‌జాలంతో దూషించారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా జ‌రుగుతున్న పోసాని ప్రెస్ మీట్ ను లైవ్‌లో చూసిన జ‌న‌సైనికులు, ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్క‌రొక్క‌రుగానే అక్క‌డికి చేరుకున్నారు. ప‌రిస్థితిని ముందుగానే అంచ‌నా వేసిన పోలీసు అధికారులు అప్ప‌టికే అక్క‌డికి భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు జ‌న‌సైనికుల‌ను పోలీసులు అప్ప‌టికే అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించినా.. స‌రిగ్గా పోసాని బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఆయ‌న‌పైకి దూకారు. అయితే అప్ప‌టికే అక్క‌డ మోహ‌రించిన పోలీసులు వారిని అదుపు చేసి వారి దాడి నుంచి పోసానిని కాపాడారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి పీకే ఫ్యాన్స్‌, జ‌న‌సైనికుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించిన పోలీసులు.. పోసానిని పోలీసు ఎస్కార్ట్ తో అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఈ సందర్భంగా పీకే ఫ్యాన్స్ దాడితో పోసాని పోలీసు వ్యాన్‌లో చ‌ప్పుడు చేయ‌కుండా కూర్చుండిపోయారు. ఆ త‌ర్వాత మీడియాతో మ‌రోమారు మాట్లాడిన పోసాని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌ను త‌న‌పైకి దాడికి ప్రోత్స‌హించార‌ని ఆరోపించారు. త‌న‌కు ఏం జ‌రిగినా దానికి ప‌వ‌నే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తాను పోలీసు కేసు పెట్ట‌నున్న‌ట్లుగా కూడా పోసాని సంచ‌ల‌న కామెంట్ చేశారు. దీంతో పీకే వర్సెస్ పోసాని వివాదం పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్క‌నుంద‌న్న మాట‌. మ‌రి ఈ వివాదం ఏ మేర ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను సృష్టిస్తుందో చూడాలి..

జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉందా? పోసాని స‌వాల్‌కు స‌మాధానం ఇదేనా!

పోసాని కృష్ణ‌ముర‌ళి.. జనసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కార్న‌ర్ చేసే ప్ర‌య‌త్నంలో సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ముఖ్య‌మంత్రి చాలా మంచోడంటూ భ‌జ‌న చేసే కార్య‌క్ర‌మంలో.. జ‌గ‌న్‌కు కుల పిచ్చి ఉందని నిరూపిస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. పోసాని ప్ర‌శ్న విన్న వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఎవ‌రిని పట్టుకొని ఏమ‌ని ప్ర‌శ్నిస్తున్నారంటూ అవాక్క‌య్యారు. జ‌గ‌న్‌కు కుల పిచ్చి లేదా? ఆ విష‌యం ఆయ‌న వీరాభిమాని పోసానికి తెలియ‌దా?  లేక‌, తెలీన‌ట్టు న‌టిస్తున్నారా? అంటూ నిల‌దీస్తున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉందా? లేదా? అనే అంశంపై ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.  చంద్ర‌బాబు-క‌మ్మ‌.. జ‌గ‌న్ నోటి నుంచి ప‌దే ప‌దే వ‌చ్చే మాట‌. జ‌గ‌న్‌-రెడ్డి.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దే ప‌దే విమ‌ర్శించే డైలాగ్‌. చంద్ర‌బాబుకు నిమ్మ‌గ‌డ్డ‌కు.. చంద్ర‌బాబుకు రామోజీరావుకు.. చంద్ర‌బాబుకు ఆంధ్ర‌జ్యోతి మీడియాకు.. చంద్ర‌బాబుకు కొవాగ్జిన్‌కు.. క‌మ్మ బంధంతో ధృడ‌మైన సంబంధం అంట‌గ‌ట్టి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున ఘ‌నుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనే విమర్శ ఉంది. ఇక త‌న‌కు మ‌రో ప్ర‌త్య‌ర్థి అయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను.. కాపు కులంతో ఫెవికాల్ బంధంతో అతికించిందీ జ‌గ‌నే. ఇలా, ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా, నిర్ల‌జ్జ‌గా.. క‌మ్మ-కాపు రాజ‌కీయం చేస్తున్న పాల‌కుడు జగన్ అంటారు. అలాంటి జ‌గ‌న్‌కు.. రెడ్ల‌పై కుల‌పిచ్చి ఉందా? అని పోసాని అమాయ‌కంగా ప్ర‌శ్నించడం విచిత్రంగా ఉందనే టాక్ వస్తోంది. దీనికి ప‌వ‌న్‌క‌ల్యాణే స‌రైన స‌మాధానం చెప్ప‌గ‌ల స‌మ‌ర్థుడని, జ‌గ‌న్ పేరును జ‌గ‌న్‌రెడ్డి అని ఫిక్స్ చేసిన పోటుగాడు ప‌వ‌ర్‌స్టార్‌ అంటున్నారు.  ఇక‌, జ‌గ‌న్‌కు రెడ్ల‌పై కుల‌పిచ్చి ఉందా లేదా అనేది అస‌లు క్వ‌శ్చ‌న్‌. జ‌గ‌న్‌కు కుడి-ఎడ‌మ భుజాల్లా ఉంటున్న విజ‌య‌సాయి, స‌జ్జ‌ల ఇద్ద‌రూ రెడ్లే. ఆర్థిక‌మంత్రి బుగ్గ‌నా రెడ్డే. ఇక పెద్దిరెడ్డి నుంచి రోజారెడ్డి వ‌ర‌కూ అనేక మందికి కీల‌క‌ మంత్రిప‌ద‌వులు, కార్పొరేష‌న్ ప‌దవులు క‌ట్ట‌బెట్టింది జ‌గ‌న్‌రెడ్డీనే. ఏపీవ్యాప్తంగా ఇసుక మైనింగ్ అంతా అయోధ్య‌రామిరెడ్డికే. ఇక మెఘా కృష్ణారెడ్డితో ఆయ‌న బంధం చెప్ప‌నవ‌స‌ర‌మే లేదు. ప్రాజెక్టులు, ప‌నులు, కాంట్రాక్టులు.. ఆఖ‌రికి ఏపీలో మాత్ర‌మే ల‌భ్య‌మ‌య్యే లిక్క‌ర్ బ్రాండ్ల స‌ర‌ఫ‌రాలో రెడ్ల‌దే అధిప‌త్యం. ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న అధికారులు, ప‌వ‌ర్‌సెంట‌ర్‌లు.. ఇలా అంత‌టా రెడ్డి..రెడ్డి..రెడ్డినే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షులు ప్రొ.కొలిక‌పుడి శ్రీనివాస‌రావు లెక్క‌ల ప్ర‌కారం.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో 950 మంది రెడ్ల‌కు ప‌ద‌వులు ద‌క్కాయంటే న‌మ్మాల్సిందే.  మ‌రి, రెడ్ల‌పై ఇంత‌టి స్వాభిమాన‌మున్న జ‌గ‌న్‌రెడ్డికి.. చంద్ర‌బాబు-క‌మ్మ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-కాపు అంటూ కుల‌ రాజకీయం చేయ‌డం గురివింద గింజ త‌న‌కింద ఉన్న న‌లుపు ఎర‌గ‌ద‌నే సామెత‌లా ఉందంటున్నారు. అంద‌రికీ తెలిసిన ఈ విష‌యం పోసాని కృష్ణ‌ముర‌ళికి మాత్రం తెలీద‌ను కోవాలా?  లేక‌, త‌న స‌హ‌చ‌ర క‌మెడియ‌న్ పృథ్వీరాజ్‌కు గ‌తంలో ఇచ్చిన‌ట్టు త‌న‌కూ ఏ ఎస్వీబీసీ ఛైర్మ‌న్ పోస్టో.. మ‌రేదైనా ప‌ద‌వో ఇవ్వాల‌నే తాప‌త్ర‌యంతోనే జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉందని నిరూపిస్తారా? అంటూ పోసాని కావాల‌నే ఇలా జ‌గ‌న్‌రెడ్డికి వంత పాడుతున్నారని అంటున్నారు.

జోరు వాన‌లో.. పెరుగు కోసం వెళ్లి.. చావు కొనితెచ్చుకొన్న టెక్కీ..

అధికారుల అల‌స‌త్వం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిర్ల‌క్ష్యం.. రెండూ క‌లిసి మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో ప‌డి గ‌ల్లంతైన ర‌జ‌నీకాంత్ ఉదంతం విషాదాంత‌మైంది.  42 గంట‌ల సుదీర్ఘ సెర్చ్ ఆప‌రేష‌న్ త‌ర్వాత అత‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ర‌జ‌నీకాంత్ డ్రైనేజీలో ప‌డుతున్న వీడియో వైర‌ల్ కావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. శనివారం రాత్రి గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపిశెట్టి రజనీకాంత్ (42) మృతదేహం.. సోమవారం నెక్నాంపూర్‌ చెరువులో దొరికింది. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్న ఆ కుటుంబంలో విషాదం నింపింది. జోరు వాన‌లో ఇంటి నుంచి ఎందుకు బ‌య‌ట‌కు వెళ్లాడు?  చావు నోట్లో ఎలా చిక్కుకున్నాడు? అనే డీటైల్స్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  పాపం.. రాత్రిపూట పెరుగు కోసం బయటకు వచ్చాడ‌ట రజనీకాంత్. వాన ప‌డితే హైద‌రాబాద్ య‌మ డేంజ‌ర్ అని తెలిసి కూడా ఆ సాఫ్ట్‌వేర్ పెరుగు కోసం అంత సాహ‌సం ఎందుకు చేశాడో మ‌రి. హైద‌రాబాద్ గురించి గొప్ప‌లు చెప్పుకునే టీఆర్ఎస్ పాల‌న‌లో డ్రైనేజీలు అలా తెరిచి ఉంటాయ‌ని మ‌రిచిపోయిన‌ట్టున్నాడు. 9 గంటల సమయంలో పెరుగు కోసం బయటకు వచ్చిన ర‌జ‌నీకాంత్‌... పెరుగు ప్యాకెట్‌ తీసుకుని రాత్రి 9.14 గంటల సమయంలో గోల్డెన్‌టెంపుల్‌ ఎదురుగా ఉన్న డ్రైనేజీ మీద ఉన్న దారి మీదుగా ఇంటికి వెళ్తూ మురుగుకాల్వలో పడిపోయాడు. అప్పటికే భారీగా వరద ప్ర‌వాహం ఉండ‌టంతో వెంట‌నే కొట్టుకుపోయాడు. సమీపంలోని ఓ వ్యక్తి వరదను తన సెల్‌ఫోన్లో వీడియో తీస్తుండగా రజనీకాంత్ డ్రైనేజీలో ప‌డటం,  కొట్టుకుపోవడం రికార్డయింది. ఆ వెంట‌నే అత‌ను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. డ్రోన్ కెమెరాల‌తోనూ సెర్చ్ చేశారు. ఆ నాలా కలిసే నెక్నాంపూర్‌ చెరువులో ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. మూడోరోజు సోమవారం మధ్యాహ్నం నెక్నెంపూర్‌ చెరువులో గుర్రపుడెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. దుస్తుల ఆధారంగా మృతుడిని గుర్తించారు. 42 గంటల పాటు నీటిలోనే ఉండటంతో ముఖం, శ‌రీరం గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయింది. పెరుగు కోసం బయటకు వెళ్లకుండా ఉన్నా ర‌జ‌నీకాంత్ తమకు దక్కేవాడని కుటుంబ‌స‌భ్యులు విల‌పిస్తున్నారు.