పుష్ప–2 తొక్కిసలాట…ఛార్జిషీట్ దాఖలు

  సంధ్య  థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం  23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య  థియేటర్‌ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో పుష్ప–2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఈ కేసులో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు ఆ బాలుడు కోలుకోలేదు... ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చుతూ అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా, పోలీసుల దర్యాప్తు లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిసినా కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తమ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. చార్జిషీట్‌లో అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సభ్యులు, అలాగే 8 మంది బౌన్సర్లు నిందితుల జాబితాలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరతారని తెలిసినా సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండా సంధ్య థియేటర్‌కు వెళ్లడం, భద్రతా వ్యవస్థను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించడమే నేరంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లు ఛార్జిషీట్‌లో వివరించారు. ఈ తొక్కిస లాట ఘటనకు సంధ్య థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేక్షకుల నియం త్రణకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా సిబ్బందిని సముచితంగా నియమించకపోవడం, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ను పాటించకపోవడం వంటి అంశాలు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ కారణంగా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్‌పైనా అభియోగాలు నమోదు చేశారు.ఈ దుర్ఘటనలో ఓ మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  సినిమా చూడాలనే ఉద్దేశంతో థియేటర్‌కు వచ్చిన కుటుంబం ఇలా విషాదంలో మునగడం ప్రజల హృదయాలను కలిచి వేసింది. బాధిత కుటుం బానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పలు వర్గాలు ఆందోళనలు కూడా వ్యక్తం చేశాయి. చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు స్వీకరించనుండగా, కేసు తదుపరి విచారణకు వెళ్లనుంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ఎలా కొనసాగుతాయన్న దానిపై సినీ పరిశ్రమతో పాటు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భారీ జనసమూహాలు పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత.. కారణమేంటో తెలుసా?

 విజయవాడ దుర్గగుడికి  విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుర్గ గుడి విద్యుత్ బకాయిలు 3 కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వరకూ పేరుకుపోవడంతో  ఏపీసీపీడీసీఎల్‌  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.   2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ శాఖ తెలిపింది. ఈ  బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సరఫరాన పునరుద్ధరించాల్సిందిగా కోరింది.  అలాగే  అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అలాగే విద్యుత్ శాఖ బకాయిల గురించి చెబుతున్నది వాస్తవం కాదని దుర్గగుడి దేవస్థానం పేర్కొంది.  తమ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నామని పేర్కొంటూ, నెట్‌ మీటరింగ్‌ కోసం విద్యుత్‌ శాఖను పలుమార్లు కోరినప్పటికీ సాంకేతిక కారణాలంటూ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను  ఏపీసీపీడీసీఎల్‌  నమోదు చేయలేదని దేవస్థానం ఆరోపించింది.  

రకుల్ సోదరుడి డ్రగ్స్ వ్యవహారం: పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు కొరడా ఝళిపిస్తూ ఉండడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నెల రోజుల వ్యవధిలోనే  అతడు అరడజను సార్లు  డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడిం చారు. ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి నుంచి నటి రకుల్ ప్రీత్ సింగ్  సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతడు డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారీ ఆన్‌లైన్  ద్వారానే నగదు బదిలీ చేశాడన్న ఆధారాలు లభ్యమయ్యాయి. అతడి  బ్యాంక్ లావాదేవీల వివరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింఘానియా సోదరుల మొబైల్ ఫోన్లలోని వాట్స్అప్ చాట్లను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా, అందులో అమర్ సింగ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ డిమాండ్, డెలివరీ సమయం, చెల్లిం పుల వివరాలకు సంబం ధించిన సందేశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు వాట్స్అప్ చాట్లు ప్రధాన ఆధారాలుగా మారాయి. డ్రగ్స్ కొనుగోళ్ల లో అమర్ సింగ్ ఒంటరిగా కాకుండా యష్, ధరమ్ తేజ్ అనే వ్యక్తులతో కలిసి పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరంతా కలిసి డ్రగ్స్ వినియోగించినట్టు, అవసరమైనప్పుడు ఒకరికొకరు సమకూర్చుకున్నట్టు సమా చారం. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విలు అమర్ సింగ్‌కు డ్రగ్స్ డెలివరీ చేస్తున్న సమయంలోనే నిఘా పెట్టి పట్టుకున్నట్టు  వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కేసు మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ సర ఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.అసలు సింఘానియా సోదరుల నుంచి అమర్ సింగ్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎందుకు కొనుగోలు చేస్తున్నాడనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తు న్నారు. డ్రగ్స్‌ను స్వయంగా వినియోగించడానికేనా? లేక ఇతరులకు సరఫరా చేస్తున్నాడా? అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. అమర్‌ సింగ్ కు డ్రగ్స్ పార్టీలను నిర్వహించే అలవాటు ఉందని ప్రాథమికంగా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ పార్టీలకు హాజరైన వారిపై కూడా విచారణ చేపట్టే అవకాశముందంటున్నారు.ఈ కేసు ద్వారా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. 

దువ్వాడ ఆరోపణలపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు

  వైసీపీ బహిష్కృత నేత , ఎమ్మెల్సీ  దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తప్పుబట్టారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదని స్ఫష్టం చేశారు. తన గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తనకు దువ్వాడతో ఎటువంటి విభేధాలు లేవన్నారు.  దువ్వాడ  నిరాధారమైన ఆరోపణలు  చేస్తుండంతో తన అనుచరులు స్పందిస్తున్నారని కృష్ణదాస్ తెలిపారు కింజారపు అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తనకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఎటువంటి విబేధాలు లేని ధర్మాన క్లారీటీ ఇచ్చారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతు హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు. అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వద్ద హైవేపై కారు ఆపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.  తాను భయపడే వ్యక్తి కాదన్నారు. అయితే ఈ ఆరోపణలను కృష్ణదాస్ ఖండించారు. ఈ క్రమంలో మాధురి, కింజరాపు అప్పన్నల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఆడియోలోని మాటలు వాస్తవమేనని కృష్ణదాస్ చెప్పడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.  

సంక్రాంతి సెలవులు.. ఏకంగా 9 రోజులు!

సంక్రాంతి పండుగ ఈ సారి విద్యార్థులకు మరింత జోష్ ను మోసుకువచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు ఏకంగా 9 రోజులు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ అధికారికంగా ప్రకటన జారీ చేయకపోయినప్పటికీ.. అదే ఖాయం అన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకూ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే జనవరి 10 రెండో శనివారం  కావడం, భోగి పండుగ, జనవరి 14, సంక్రాంతి పండుగ జనవరి 15, కనుమ పండుగ జనవరి 16గా అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. సంక్రాంతి సెలవుల తేదీలను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమౌతాయి. ఇక జనవరి 17 శనివారం కావడంతో ఆ రోజును కూడా సెలవుగా ప్రకటించి సంక్రాంతి సెలవులను జనవరి 18  వరకూ పొడిగించి, విద్యాసంస్థల పున: ప్రారంభం జనవరి 19 గా ప్రకటించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. దీంతో ఈ ఏడు సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి జనవరి 18 వరకూ అంటే 9 రోజులు ఖాయంగా కనిపిస్తోంది.  

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.   

ఆ మూడు రోజులూ సర్వదర్శనాలు రద్దు.. తిరుమల తిరుపతి దేవస్థానం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల2వ తేదీ వరకూ సామాన్య భక్తులకు సర్వదర్శనాలను నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గోవింద మాల ధరించిన భక్తులకు కూడా ఆ మూడు రోజులూ  సర్వదర్శనాలకు అవకాశం లేదని పేర్కొంది. జనవరి 3 నుంచి మళ్లీ యధాప్రకారం సర్వదర్శనాలకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.  ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. లక్కీ డిప్‌ టికెట్‌ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని టీటీడీ సూచించింది. ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాలో టీటీడీవిస్తృత స్థాయిలో  ప్రకటనలు జారీ చేసింది.  అయితే టీటీడీ నిర్ణయం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది టీటీడీ ఏకపక్షంగా సర్వదర్శనాలు రద్దు చేసి.. వైకుంఠ ఏకాదశి రోజు సామాన్యులకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

శివాజీదే తప్పు.. నాగబాబు

మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్ అటు సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. మరో వైపు శివాజీ వ్యాఖ్యలపై నటి,  యాంకర్ అనసూయ,  సహా పలువురు సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివాజీ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ వ్యంగ్యంగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో  తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఒక వర్గం శివాజీ మాటల్లోని ఉద్దేశాన్ని సమర్థిస్తే, మరో వర్గం మహిళలపై మోరల్ పోలీసింగ్‌ను తీవ్రంగా ఖండిస్తోంది.శివాజీ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నటుడు, జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు.  శివాజీ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదన్నారు.  మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అనేది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదన్న నాగబాబు ఇది మోరల్ పొలీసింగ్ కిందకే వస్తుందన్నారు.  

తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు.   ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు!?

  పంచాయతీ ఎన్నికల విజయంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే జోష్ లో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.  విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందే.. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారం నాటికే మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  వచ్చే ఏడాది  మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే ఆ పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది.  ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి  మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని  ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదలా ఉంటే రాష్ట్రంలోని  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు 2025 జనవరితోనే గడువు ముగిసింది. అప్పటి నుంచీ ఇవన్నీ ప్రత్యేక అధికారల పాలనలో కొనసాగుతున్నాయి.  ఇక పోతే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,  ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో వీటికి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే.. పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ  మున్సిపాలిటీల కు మాత్రం ఇప్పుడు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.  ఇలా ఉండగా   హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌  పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసివదే. అలాగే కొన్ని  నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ సహా మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   వచ్చే ఏడాది జనవరి రెండో వారానికల్లా  ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.ఇందుకు సబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం ఎప్పుడు పచ్చ జెండా ఊపితే అప్పుడు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్రఎన్నికల కమిషన్  సిద్ధంగా ఉంది.  

న్యూ ఇయర్ వేడుకల్లో జీరో డ్రగ్స్ విధానం..అధికారులకు సీపీ సజ్జనార్ ఆదేశం

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎటువంటి ఉదాశీనతా వలదని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టాలన్నారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం (డిసెంబర్ 26)న  హెచ్-న్యూ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సీపీ సజ్జనార్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.   ఈ సందర్భం గా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగించిన తరువాత దాడులు చేసి కేసులు నమోదు చేయడం కాదనీ, తక్షణమే అంటే ఇప్పటి నుంచే   హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించి డ్రగ్స్ వినియోగానికి అవకాశం లేకుండా చేయాలన్నారు.  అలాగే  సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా పెట్టాల న్నారు. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలపై దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. డ్రగ్స్ సరఫరాదారులు, డ్రగ్ ఎడిక్ట్స్ పై  నిఘా ఉంచాలని ఆదే శించారు.  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని సీపీ ఆదేశించారు. సమయ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. న్యూఇయర్ సందర్భంగా కీలకమైన ప్రాంతాలలో పటిష్టమైన చెక్‌పోస్టులు, బ్యారి కేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.   అదే సమయంలో  నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వేడు కలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.పోలీసులంతా సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచించారు.

డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు

డ్రగ్స్ కేసులో తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగల్  దర్యాప్తు ముమ్మరం చేసింది. డ్రగ్స్ క్రయవిక్రయాలు చేసే వారిపై కొరడా ఝళిపిస్తున్నది.ఈ క్రమంలోనే  ప్రముఖ నటి రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్ అజ్ఞాతంలోకి  వెళ్లాడు.  ఈగల్ బృందం, మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ  డ్రగ్స్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకు న్నారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులు విచారణలో  తమ నుంచి తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసే నలుగురి పేర్లు వెల్లడించారు. ఆ నలుగురిలో ఒకరు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడని తేలింది. అతడికి డ్రగ్స్ డెలివరీ ఇచ్చే సమయంలోనే ఈగల్ ఆపరేషన్ లో ఈ వ్యాపారులు అరెస్టయ్యారని తెలిసింది.  ఇలా ఉండగా  రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్  గత ఏడాది కూడా డ్రగ్స్ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులకు దొరికాడు, ఆ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇద్దరు డ్రగ్స్ వ్యాపారుల అరెస్టుతో అతడి పేరు బయటకు వచ్చింది. వ్యాపారుల అరెస్టు విషయం తెలియగానే అమర్ ప్రీతి సింగ్ పారారయ్యాడని తెలుస్తోంది.   ఈగల్ బృందం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం (డిసెంబర్ 26) తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో భారతీయ వైజ్ణానిక సమ్మేళన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిం చారు. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం సీనియర్ నేత ఎన్టీఆర్ రాజు ఇటీవల తిరుపతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజు కుమారుడు, తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన చంద్రబాబు,  వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలులర్పించారు.  

సమస్యలపై మంత్రిని నిలదీస్తూనే ఆగిన రైతు గుండె

రాజధాని అమరావతిలోని మండడం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మునిసిల్ శాఖ మంత్రి  నారాయణ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు.   రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తుండగా   ఘటన జరిగింది.  అమరావతిలో ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న రైతులతో జరిగిన సమావేశంలో  పాల్గొన్న రైతు దొండపాటి రామారావు  తమ సమస్యలపై తొలుత ప్రశాంతంగానే మాట్లాడారు. అయితే మధ్యలో తీవ్ర ఆవేదనకు, ఆవేశానికీ లోనయ్యారు.   ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకేచోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా తమ ఇళ్లు పొలాలూ తీసుకుని రోడ్డున పడేస్తారా అంటూ మంత్రిని నిలదీశారు.  ఆ వెంటనే   గుండెపోటుతో కుప్పకూలిపోయారు.  దీంతో అక్కడున్న అధికారులు, రైతులు రామారావుకు వెంటనే సీపీఆర్ చేశారు. ఆ వెంటనే అతడిని మంత్రి కాన్వాయ్ వాహనంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు అయితే..  అప్పటికే  ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. నిర్వాసిత రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.  భూ సమీకరణలో భాగంగా రాములు ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు. ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు కోల్పోతున్న వారి జాబితాలో ఆయన ఇల్లు కూడా ఉంది.

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు  రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ గ్రౌండ్స్‌పై  అన్ ఫిట్‌గా గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత అన్ ఫిట్ పొందిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో వారిని సర్దుబాటు చేయనున్నారు.  గతంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో వందలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ అన్‌ఫిట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు ఆరామస్తాన్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన  ఫోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తులో  భాగంగా సిట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరా మస్తాన్ ను   విచారించింది. ఆరా పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థా పకుడు ఆరా మస్తాన్‌ను  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ శుక్రవారం విచారించింది. ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.    ఆరా మస్తాన్ గత కొన్నేళ్లుగా   రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్‌ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?  లేదా? ఒక వేళ జరిగితే అందుకు ఎవరు ఆదేశించారు? అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.  సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడారు.  నూతన సిట్   ఆదేశాల మేరకే  తాను విచారణకు హాజరయ్యానన్న ఆరా మస్తాన్.. గతంలో పోలీసులు అడిగన ప్రశ్న లనే మళ్లీ అడిగారని చెప్పారు.  2020 నుంచే తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానం ఉందనీ, ఇదే విషయాన్ని సిట్ అధికారుల చేప్పానన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ పోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తును వేగవంతం చేసిందన్న ఆరా మస్తాన్..  నూతన సిట్ ఆధ్వర్యంలో ఈ కేసుదర్యాప్తు మరింత సమగ్రంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.   

29 నుంచి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. ఎన్ని రోజులో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుంది. ఈ శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు.  బయట అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ  సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.  అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే అంశం కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక పోతే.. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించి, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు, వాటికి అంతే ఘాటుగా రేవంత్ ప్రతివిమర్శలు చేయడమే కాకుండా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేయడం నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా  రేవంత్ సవాల్ ను స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష నేత అయిన కేసీఆర్ సభకు వస్తారా? లేక డుమ్మా కొడతారా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

పెట్రోల్ బంక్ లోకి దూసుకు వెళ్లిన ఓమ్ని వ్యాన్

  మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ అన్నోజిగూడ ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న ఓ ఓమ్ని వ్యాన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు భయపడిపోయి వెంటనే కిందకు దిగి పరుగులు తీశారు. అయితే, మంటలు అంటుకున్న సమయంలో డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అదుపు తప్పిన ఓమ్ని వ్యాన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వైపు దూసుకెళ్లింది. మంటలతో వస్తున్న వాహనాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై నీళ్ళు, అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో పెట్రోల్ బంక్ సిబ్బంది, వాహన దారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతు లకు గురయ్యారు.  కొద్దిసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాను పెట్రోల్ బంకులోకి దూసుకు వస్తున్న సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేనిచో ఊహకందని ప్రమాదం జరిగేదని స్థానికులు అంటూ.‌... పెట్రోల్ బంక్ సిబ్బందిని అభినం దించారు.

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రికార్డు బ్రేక్... అత్యధిక ప్రేక్షకులు హాజరు

  ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్  రికార్డు బద్దలుకొట్టింది. బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు మ్యాచ్ వీక్షించడానికి 94,199 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు 93,013 మంది ప్రేక్షకులు వచ్చారు. ఈ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ బ్రేక్ చేసింది. ఇదే ఇప్పటివరకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నమోదైన అత్యధిక ప్రేక్షకుల రికార్డ్.  మొత్తంగా క్రికెట్ చరిత్రలో 2022 ఐపీఎల్ ఫైనల్‍ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరయ్యారు.  ఆ క్రమంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తన రికార్డు తానే బద్దలుకొట్టింది. యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌‌ను వీక్షించడానికి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలిరోజు టెస్ట్ మ్యాచ్ వీక్షించడానికి ఏకంగా 94,199 మంది క్రికెట్ అభిమానులు వచ్చారు. దీంతో గ్రౌండ్‌లో స్టాండ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అంతకుముందు ఈ మ్యాచ్‌కు 93,422 మంది ప్రేక్షకులు వచ్చినట్లు MCG గ్రౌండ్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.  ఆ తర్వాత గంట వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది అభిమానులు పెరిగినట్లు ప్రకటించింది.కాగా, 2015 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ వీక్షించడానికి 93,013 మంది అభిమానులు వచ్చారు. ఆ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్ట్ అధిగమించింది. ఇదే కాకుండా 2013లో జరిగిన బాక్సింగ్‌డే టెస్టుకు కూడా భారీ సంఖ్యలో (91,112 మంది) క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.  MCG మొత్తం సామర్థ్యం 1,00,024. మరోవైపు, క్రికెట్ గ్రౌండ్లలో అత్యధిక మంది ప్రేక్షుకులు హాజరైన రికార్డ్ గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఉంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ఏకంగా 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ స్టేడియం కెపాసిటీ 1,32,000. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షుకులు వచ్చిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలన నమోదైంది. ఒకే రోజు 20 వికెట్లు నేలకూలాయి. ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.