ది లెజండ్.. ది విజనరీ.. ది లీడర్.. ఒకే ఒక్కడు చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20 (గురువారం). సహజంగా ఎవరికైనా వయసు ముందుకు సాగుతుంది, వృధ్యాప్యం వైపు అడుగులు వేస్తుంది, కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో వయసు వెనక్కి, యవ్వనం వైపుకు అడుగులు వేస్తోందా అనిపించేలా, ఆయన వయసు పెరిగే కొద్దీ ఆయన కొత్త శక్తిని పుంజుకుని మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.    అవును, 73వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఆయనలో ఎక్కడ వార్ధక్యపు ఛాయలు కన్పించడంలేదు. అమృత మహోత్సవానికి అడుగు దూరంలో ఉన్న చంద్రబాబు నాయుడు నడకలో, నడతలో, ఆలోచనలలో ఎక్కడా వార్ధక్యపు  వాసనలు కనిపించడం లేదు. అందుకే, ఆయన ఈరోజుకు కూడా రాజకీయ రణక్షేతంలో అలుపెరగని యోదునిలా ముందుకు దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో సాగుతున్న వైసేపీ అరాచక పాలనను అంతమొందించేందుకు తెలుగు దేశం సారథిగా శంఖారావాన్ని పూరించారు. సేనలను యుద్దానికి సిద్ధం చేస్తున్నారు. నిజానికి, గత సంవత్సరం ఇదే రోజున, 72 జన్మదినోత్సవం సందర్భంగా..చంద్రబాబు నాయుడు  వైసీపీ అరాచక పాలనపై యుద్ధాన్ని ప్రకటించారు. గత సంవత్సరం మే మొదటి వారంలో కుప్పంలో బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని ప్రారంభింఛి ఎన్నికల జైత్ర యాత్రకు అప్పుడే శ్రీకారం చుట్టారు. అదే నెలలో వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు.. మహానాడు తర్వాత ప్రతి 15 రోజులకి ఒక్క జిల్లాలో పర్యటించేలా, ప్రతి నెలా రెండు జిల్లాలు చొప్పున ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి బుధవారం(ఏప్రిల్ 19) వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశం వరకూ, ప్రతి క్షణం ప్రజలు, కార్యకర్తల మధ్యనే ఉన్నారు. అంతేకాదు, వై నాట్ 175 అంటున్న ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత ఇలాకాలో,  ‘వై నాట్ పులివెందుల’ అంటూ దీటైన సవాలు విసిరారు. నిజానికి, నిన్న మొన్నటి దాకా, మీటల మీద ఆశలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు మొదలైందంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు.ఆయన సాగిస్తున్న అలుపెరగని రాజకీయ పోరాటంమే. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో, టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి జగన్ రెడ్డి ధీమా నీరుగారిపోయింది.   ఆదలా ఉంటే, ప్రస్తుతం నుంచి గతంలోకి వెళితే, చంద్రబాబు నాయుడు జీవితం గురించి ప్రత్యేకించి చెప్పవలిసింది ఏమీ లేదు. ఏదీ ఉండదు. అవును..ఆయన జీవితం తెరిచిన పుస్తకం. గడచిన నాలుగు దశాబ్దాల అవిభక్త ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర రాజకీయ చరిత్ర నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ, జీవిత చరిత్ర వేరు చేయడం కుదిరే వ్యహారం కాదు. ముఖ్యంగా 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి మొదలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డివరకు రాజకీయ ప్రత్యర్ధులు అనేక మంది వచ్చి వెళ్ళారు. చరిత్రకే పరిమితమయ్యారు. కానీ, చంద్రబాబు నాయుడు తిరుగులేని నాయకునిగా, ఇటు ముఖ్యమంత్రిగా అటు ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలో అత్యధిక కాలం సేవలు అధించిన  ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, సేవలు అందించారు.రాష్ట్ర విభజనకు ముందు తర్వాత  కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఏకైక నాయకుడుగానూ చంద్రబాబు నాయుడు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సైన్ రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా ఉన్నారు. 70 ప్లస్ వయస్సులోనూ అదే ఉత్సాహంతో, అదే దీక్షతో నవ్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.  నిజానికి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం మొదలు, అయన రాజకీయ ప్రస్థానంలోని ప్రతి మలుపు మరో సంచలనంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయిందంటే అతిశయోక్తి కాదు. కాలేజీలో చదివే రోజుల్లోనే రాజకీయ చైతన్యం ఆయనలో మొగ్గ తొడిగింది. విద్యార్థి నాయకుడిగా తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్, హిస్టరీలో  విద్యను ముగించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ఎంఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందారు.  ఈ దశలోనే క్రియాశీల రాజకీయాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. 1977లో దివిసీమ ఉప్పెన సందర్బంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను గమనించిన అగ్రనాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.  ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టడం చారిత్రాత్మకం. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, ఎన్టీఆర్‌ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి చట్టసభల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.  1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధే  లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు.   జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్‌ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.  దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్‌ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలనూ రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు.  ముఖ్యంగా, యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు.   అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి  నిరహారదీక్ష చేశారు.  రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరశన దీక్ష చేసి తెలుగు వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు.   దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా  7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచారు.   చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తూ ధైర్యం నింపుతున్నారు. అందుకే చంద్రబాబు ... కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా చరిత్ర పుటల్లో  ఒకే ఒక్కడుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

విశాఖ నుంచే పాలన.. జగన్ తాజా ప్రకటన సంకేతమేంటి?

అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహస్తున్న ఏపీ సీఎం జగన్ తీరు పట్ల సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. విపక్ష నేతగా  సందర్భాల్లో  అమరావతే రాజధాని అని విస్పష్టంగాప్రకటించారు. అంతే కాదు జగన్  ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో సాధించి తెస్తానన్నారు. పాతిక మంది వైసీపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకు వస్తానని వాగ్దానం చేశారు.   అయితే అధికారంలోకి వచ్చాకా ప్రత్యేక హోదానూ విస్మరించారు. అమరావతే రాజధాని అన్న విషయంలోనూ మడమ తిప్పేశారు. అమరావతి అభివృద్ధిని విస్మరించి మూడు రాజధానుల నాటకానికి తెరతీశారు. ఈ విషయంలో కోర్టులు అభ్యంతర పెట్టినా, అమరావతే రాజధాని అని ఏపీ హైకోర్టు విస్పష్టంగా చెప్పినా, హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించకపోయినా.. విశాఖ నుంచే పాలన సాగిస్తానంటూ ముఖ్యమంత్రి సహా ఆయన కేబినెట్ సహచరులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు బుధవారం (ఏప్రిల్ 19)న శంకుస్థాపన చేశారు. నౌపడా వద్ద పోర్టు నిర్వాసితులు కాలనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విశాఖ విషయంలో కీలక ప్రకటన చేశారు.  అందరూ మెచ్చే నచ్చే నగరంకనుకే విశాఖను రాజధానిగా ఎంపిక  చేసుకున్నామన్నారు. సెప్టెంబర్ నుంచి తాను విశాఖలోనే స్థిరపడతాను అక్కడ నుంచే పాలన కొనసాగిస్తానని విస్ఫష్టంగా చెప్పారు. వికేంద్రీకరణలో భాగమే ఇది అని చెప్పారు.  తెలంగాణ అసెంబ్లీ గడువు డిసెంబర్ లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వస్తున్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా జగన్ విశాఖ నుంచే పాలన అన్న ప్రకటనకు ముడిపెడుతూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ ముందస్తుకు వెళతారని, అది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే ఏపీ కి కూడా ఎన్నికలు జరిగేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఆయన సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన అన్న ప్రకటన చేశారంటున్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో ఉత్తరాంధ్రలో వైసీపీ ఓటమి.. విశాఖ రాజధాని ప్రతిపాదనకు అక్కడి జనం వ్యతిరేకించారనడానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో విపక్షాలపై చేసిన విమర్శలు.. తాను ఒంటరిగా పోరాడుతున్నానంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ముందస్తు సంకేతమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయ్

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు జూన్ తర్వాత ఎప్పుడైనా రావొచ్చు.  షెడ్యూల్డ్ విడుదల చేసిన తర్వాత  ఎన్నికల కోడ్ అమలులో వస్తుంది. ఎన్నికల కమిషన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖలను ఎన్నికల కమిషన్  తన ఆధీనంలో  ఉంచుకోవచ్చని తెలుస్తోంది.    అసెంబ్లీ గడువుకు ముందు ఆరు నెలలలోపు  ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించాలని ఎన్నికల కమీషన్ యోచిస్తోంది. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలో నైనా అసెంబ్లీ గడువు  ముగియడానికి ఆరునెలల ముందే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. కాబట్టి ఎన్నికల సంఘం జూన్ లో నోటిఫికేషన్ జారీ చేయవచ్చు.    రెండు రోజుల క్రితం ఎన్నికల అధికారులు ఎన్నికల సన్నాహాలను సమీక్షించారని తెలుస్తోంది.  మరో వైపు తెలంగాణలో ముఖ్యమంత్రికి ఎక్కువ సమయం అవకాశం ఇవ్వకూడదని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల నిబంధలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది.  తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత రాణించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మూడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ కు చుక్కలు చూపించాలని యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత చిక్కుకోవడం, పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ వ్యవహారాన్ని సానుకూలంగా మార్చుకోవాలని బీజేపీ యోచిస్తుంటే , 10వ తరగతి పేపర్ లీక్ లో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చిక్కుకోవడం బీఆర్ఎస్ కు సానుకూల అంశంగా మారింది.  దేశంలో సార్వత్రిక ఎన్నికలతో బాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.  తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది.  ఇదిలా వుండగా భారత ఎన్నికల కమిషన్ తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో సమీక్ష నిర్వహించింది. డిప్యూటి ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ పర్యవేక్షణలో ముగ్గురు అధికారులు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి విశ్వ జిత్ తో గత శనివారం నితీష్ కుమార్  సమీక్ష నిర్వహించారు.   

సాయిబాబాకు సుప్రీంలో చుక్కెదురు

మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్శిటీ  మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంలో చుక్కెదురైంది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సాయిబాబా నిర్దోషిగా తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సుప్రీం ఇచ్చిన ఉత్తర్వుల్లో బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభికల్ప్ ప్రతాప్ సింగ్, సాయిబాబా తరపున సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ సుప్రీం కోర్టులో వాదించారు. 2014లో అరెస్టయిన సాయిబాబా ఎనిమిదేళ్లకు పైగా జైల్లో ఉన్నారు.  గత ఏడాది అక్టోబర్ 14న బొంబాయి హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది.  జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.  సాయిబాబాతో పాటు జీవిత ఖైదు పడిన మహేశ్ కరీమాన్ టిర్కీ, పాండు పోరా నరోటే, హేమ్ కేశవదత్త మిశ్రా , ప్రశాంత్ సాంగ్లికర్ , విజయ్ తిర్కీలను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 8న ఉంటుందని సుప్రీం పేర్కొంది. బాంబే హైకోర్టు తీర్పును మహరాష్ట్ర సర్కారు సుప్రీంలో సవాల్ చేసింది.  2014లో జీఎన్ సాయిబాబా నక్సల్స్ తో సంబంధాలు ఉన్న ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.  జవహార్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ విద్యార్థి హేమ మిశ్రా అరెస్ట్ తర్వాత జీఎన్ సాయిబాబా మావోలతో సంబంధాలు బయట పడ్డాయి. 

అంతా తావీదు మహిమేనా?

వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాత్రం నిత్యం వివాదాలతో  సహవాసం చేస్తుంటారు.  ఆయన పేరుకే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్. కానీ ఆయన వైద్యంపై నమ్మకం లేదు. కరోనా తగ్గడానికి ఏసుక్రీస్తు మహిమే కారణమనీ, వ్యాక్సిన్లు, వైద్యం ఇవేమీ కాదనీ గతంలో ఒక సారి వాకృచ్చి పీకల్లోతు వివాదంలో కూరుకున్నారు. తాజాగా మంత్రించిన తావేదే సర్వ రోగ నివారిణి అంటూ వ్యాఖ్యనించి మరో సారి వివాదాన్ని ఆహ్వానించారు.  తాను చిన్న తనంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాననీ, వైద్యులందరూ చేతులెత్తేసి లాభం లేదని చెప్పారనీ, అయితే తాను తీవీదు మహిమవల్ల బతికాననీ చెప్పారు హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. ఎవరో నిరక్షరాస్యుడు, సామాన్యుడు ఈ మాట చెబితే.. అలా కాదు అదంతా మూఢనమ్మకం అని చెప్పి శాస్త్రీయంగా చికిత్సను తీసుకోవాలని చైతన్యం కలిగించాల్సిన పదవిలో ఉన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ స్వయంగా వైద్యాన్ని నమ్ముకోకండా, తావీదులను మూఢ నమ్మకాలను నమ్ముకోండంటూ ప్రజలకు చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారంటే... తన పేరుమీద ఏర్పాటు చేసిన జీఎస్ఆర్ (గడల శ్రీనివాసరావు) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ముస్లింలను అవమాన పరిచేవిగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గతంలో ఆయన క్రీస్తు దయవల్లే కరోనా నుంచి బయటపడ్డామని, క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అక్కడితో ఊరుకోకుండా ప్రపంచానికి అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమనీ  ప్రపంచం  అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమని చెబుతూ క్రైస్తవమత ప్రచారానికి నడుంబిగించాలని పిలుపు నిచ్చారు. ఆయన వ్యక్తిగత మత విశ్వాసాలను ఎవరూ అభ్యంతర పెట్టరు.. కానీ హెల్త్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆయన కరోనా మహమ్మారికి  వైద్య శాస్త్రం చేసిందేమీ లేదనీ అంతా జీసెస్ దయ అంటూ చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది.    

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్!

టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ళు, ఆఫీస్ లపై ఆదాయ‌ ప‌న్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నివాసంతో పాటు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన సినిమాలంటే ముందుగా 'పుష్ప: ది రైజ్', 'ఆర్ఆర్ఆర్' గుర్తుకొస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో 'పుష్ప-2' రూపొందుతోంది. అలాగే ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో పలు సినిమాలను కూడా నిర్మిస్తున్నారు సుకుమార్. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా రూ.1200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాల దర్శకనిర్మాతలపై ఐటీ సోదాలు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

బెయిలు దొరికినా అవినాష్ కు సుఖం లేదా?

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఐదో సారి విచారిస్తోంది. బుధవారం (ఏప్రిల్ 19) ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరి కోఠీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డిని అవసరమైతే అరెస్టు చేస్తామని సీబీఐ హైకోర్టుకు గతంలోనే చెప్పింది. దాంతో ఆయన గతంలో తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు కేసు  దర్యాప్తు చేస్తున్న బృందాన్ని సీబీఐ మార్చేసింది.  కొత్త బృందాన్ని నియమించింది.   వివేకానందరెడ్డి హత్య కేసును అప్పటి వరకూ దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీం కోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీం కోర్టు సీబీఐకి గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో సీబీఐ ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో  ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ  నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది. దీంతో కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల తరువాత కొన్ని రోజుల పాటు ఎటువంటి కదలికా లేకుండా ఉన్న కేసు దర్యాప్తు.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుతో ఒక్క సారిగా వేగంపుంజుకుంది. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన రెండు రోజులలోనే ఇదే కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ పులివెందులలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించి రిమాండ్ చేసింది. ఆ మరుసటి రోజే అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా కోరుతూ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. సరిగ్గా అదే సమయంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మళ్లీ ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయడం.. ఆ పిటిషన్ ను రెండు రోజుల పాటు విచారించిన కోర్టు.. అవినాష్ ను ఈ నెల 25 వరకూ అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వ్యులు జారీ చేసింది. అయితే ముందస్తు బెయిలు ఊరట అవినాష్ కు దక్కిందని చెప్పడానికి వీల్లేకుండా.. 25 వరకూ ప్రతిరోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ ను ఆదేశించింది. అంటే టెక్నికల్ గా అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇచ్చిన కోర్టు.. ప్రతి రోజూ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ అవినాష్ ను ఆదేశశించడం అంటే ఒక విధంగా బెయిలు ప్రయోజనం ఆయనకు దక్కనట్టేనని న్యాయ నిపుణులు అంటున్నారు.  ఇక 25 తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ వివేకా హత్య కేసు దర్యాప్తును ఈ నెల 30 నాటికి ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ విచారణ, అరెస్టు వ్యవహారం తెలుగు టీవీ డెయిలీ సీరియల్ గా కొనసాగుతుండటంతో సీబీఐ అవినాష్ కు ముందస్తు బెయిలు మంజూరు కావడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ నిర్దిష్ట గడువులోగా ఒక లాజికల్ ముగింపునకు తీసుకువస్తుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. 

రోజుకో మలుపు తిరుగుతున్న వివేకా దర్యాప్తు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు తెలుగు డైలీ సీరియల్ ను తలపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతుంది.  ఎంపీ అవినాశ్ రెడ్డి కి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపిస్తుంటే ఈ నెల 25వరకు అరెస్ట్ చేయకూడదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సురేందర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  అయితే అవినాశ్ రెడ్డి ప్రతీరోజు సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని  జస్టిస్ సురేందర్ ఆదేశాలు జారీ చేశారు. 25న  బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు పేర్కొంది. అప్పటివరకు సీబీఐ అవినాశ్ రెడ్డికి లిఖిత పూర్వక  ప్రశ్నలు అందజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమాధానాలు ఆడియో, వీడియో రికార్డులు చేసుకో వచ్చని తెలంగాణ హైకోర్టు సూచించింది.  అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా దర్యాప్తు ముగించాలని అవినాశ్ రెడ్డి లాయర్ తన వాదనలను వినిపించారు. అయితే ఈ కేసు దర్యాప్తు ఎలా చేయాలో చెప్పడానికి అవినాశ్ రెడ్డి ఎవరు అని సీబీఐ ప్రశ్నిస్తోంది. ఏ 1 గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్, ఏ 4 దస్తగిరిలను విచారించాల్సి ఉందని అవినాశ్ రెడ్డికి  బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదిస్తుంది. విట్నెస్లను అవినాశ్ రెడ్డి  ప్రభావితం చేస్తాడని సీబీఐ అనుమానిస్తుంది.  హత్య జరిగిన సమయంలో నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారో గూగుల్ టేకౌట్ గుర్తించింది. ఫోరెన్సిక్ సైతం నిర్దారణ చేసిందని సిబీఐ పేర్కొంది.  హత్య కేసులో అసలు ఉద్దేశ్యాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కారణాలు, వ్యాపార లాలాదేవీలు, అక్రమ సంబంధాలు తదితర కోణాల్లో సీబీ ఐ లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.  మరోవైపు వివేకానంద రెడ్డి కుమార్తె అవినాశ్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కోర్టులో వాదనలు వినిపిస్తుంటే అవినాశ్ రెడ్డి మాత్రం కుటుంబ కలహాలు కారణం అంటూ కోర్టులో వాదనలు వినిపిస్తు న్నారు. 

విజయమ్మకు అవినాష్ బెదరింపు?.. నిజమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్  వివేకా హత్య కేసులో ఇటీవల చోటు చేసుకున్న  కీలక పరిణామాలు పులివెందులలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపాయి. హతుడు వివేకాపై కడప ఎంపీ   అవినాష్ రెడ్డి,  ఆయన తండ్రి  భాస్కరరెడ్డి చేసిన ఆరోపణలపై పులివెందులలోనే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం  అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ నోరు మెదకపక పోడం, ఖండించకపోవడంపై వైఎస్ కుటుంబీకుల పట్ల ప్రజలలో ఇప్పటి వరకూ ఉన్న గౌరవాన్ని మసకబారుస్తోందని పరిశీలకులు అంటున్నారు. అఖరికీ వైఎస్ సతీమణి, వైపీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ కానీ.. ఆమె కుమార్తె ,వెఎస్సార్ టీపీ  అధ్యక్షురాలు  షర్మిలసైతం మౌనంగా ఉండడం పట్ల ఉమ్మడి కడప జిల్లా ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  రాజకీయాల్లో విమర్శలు ప్రతీ విమర్శలు సహజమని...  కానీ తన సొంత మరిది   వివేకాపై సొంత వాళ్లే..  ఇంత దారుణంగా... అవమానకరంగా ఆరోపణలు చేస్తుంటే.. వీళ్లు మౌనంగా ఉండడం ఏమిటని వారు బల్లగుద్ది మరీ ప్రశ్నిస్తున్నారు.  అయినా ఏమాటకామాటే చెప్పాలని.. వైయస్ వివేకా హత్య కేసు ఒకానొక దశలో ముందుకు సాగకుండా.. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటే.. అలాంటి సమయంలో  షర్మిల.. నేరుగా ఢిల్లీకి వెళ్లి.. సీబీఐ కేంద్ర కార్యాలయంలో.. తన సొంత చిన్నాన్న హత్య కేసులో వాంగ్మూలం ఇవ్వడమే కాకుండా.. ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలంటూ అదే సీబీఐ కార్యాలయం ఎదుటే  మీడియా ముందు తన అభిప్రాయన్ని  కుండ బద్దలు కొట్టిందని కడప జిల్లా వాసులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. మరో వైపు పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించి.. ప్రజలతోపాటు  నిరుద్యోగుల కోసం దీక్షలు చేపట్టడమే కాకుండా.. ప్రజా సమస్యలపై పాదయాత్ర కూడా చేపట్టి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై తనదైన శైలిలో గళమెత్తి పోరాటం చేస్తున్న షర్మిల సొంత బాబాయ్ పై అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలు వేసిన నిందలను ఖండించకపోవడమేమిటని కడప జిల్లా వాసులు అంటున్నారు.  అదీకాక.. ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తొలిసారి సీబిఐ విచారణకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా  స్వయంగా లోటస్‌పాండ్‌కు  వెళ్లి.. విజయమ్మతో భేటీ అయిన తరువాతే కోఠిలోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో ఈ   భేటీపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో   విభిన్న కథనాలు అయితే వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వైయస్ విజయమ్మను వైయస్ అవినాష్‌రెడ్డి బెదిరించారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో మరోసారి సీబీఐ విచారణకు హైదరాబాద్ వచ్చిన  అవినాష్ రెడ్డి.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ... తాను వైయస్ విజయమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కోసం.. లోటస్‌పాండ్‌కు వెళ్లానని క్లారిటీ ఇచ్చారు.   మరి ఆ సమయంలో విజయమ్మ  తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు  వివేకా . ఆయనపై అటువంటి ఆరోపణలు చేయడం తప్పు అంటూ కడప ఎంపీకి ఎందుకు చెప్పలేదని అంటున్నారు. వైఎస్ వివేకాపై అవినాష్, ఆయన తండ్రి ఆరోపణలను విజయమ్మ ఖండించకపోవడంతో అవినాష్ లోటస్ పాండ్ కు వెళ్లిన సందర్భంగావ ిజయమ్మను బెదరించి ఉంటారనీ,  అందుకే ఆమె సైలెంట్‌గా ఉన్నారన్న అభిప్రాయం కడప జిల్లా వాసులలో వ్యక్తమౌతోంది.  ఈ అభిప్రాయాన్ని బలపరిచే విధంగా   కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో   వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు డేంజర్‌లో ఉన్నారని.. వారు జాగ్రత్తగా ఉండాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  

కర్నాటకలో కాంగ్రెస్ కోసం రఘువీరా ప్రచారం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి సిద్ధమయ్యారు. రాజకీయాల్లోకి పునప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటన చేశారు.  పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమైన రఘువీరా,   రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సోనియా కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. పార్టీ కీలక నేత రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు బనాయించి వేధించడం,  ఆయనకు రెండేళ్లు శిక్షపడటం, కోర్టు తీర్పు వచ్చీరాగానే  పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేయడం,  నివాస బంగళాను కూడా ఖాళీ చేయించడం వంటి పరిణామాలు బాధించాయనీ, ఇటువంటి సమయంలో  సోనియా కుటుంబానికీ,  పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని రఘువీరా అన్నారు. రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారని రఘువీరా చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతను చేపట్టాలన్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచనల మేరకు సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్  అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు.   1989 నుండి కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 10 నుండి 12 నియోజకవర్గాలలో తాను  ప్రచారం నిర్వహించడం రివాజుగా వస్తున్నదన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని, ఇక్కడి నుంచే బీజేపీ పతనం మొదలవుతుందని రఘువీరా అన్నారు.   తెలంగాణ విషయం పక్కన పెడితే.. ఆంధ్రలో కాంగ్రెస్ జాడ దాదాపుగా లేనే లేదు.. ఇలాంటి పరిస్థితిల్లో ఆయనొచ్చి చేసేదేమి లేదు. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ, ప్రశ్నిస్తామని వచ్చిన పార్టీ జనసేన.. ఈ పార్టీల మధ్య ..ఇప్పుడు కాంగ్రెస్ ను పట్టించుకునే వారు ఏరి...?

దప్పికగొన్న వారి వద్దకే బావి.. సుప్రీం వ్యాఖ్య

వలస కార్మికులకు రేషన్ కార్డుల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జనాభా నిష్పత్తి లెక్కలు సరిగా లేవన్న సాకుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు రేషన్ కార్డులను నిరాకరించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.   వలస కార్మికుల సంక్షేమం కోసం ముగ్గురు సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అహ్ సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విచారణ సందర్భంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పౌరులందరికీ లబ్ది కలిగించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అదే సమయంలో   ప్రభుత్వాలు తమ విధుల నిర్వహణలో విఫలమయ్యాయని   అనడంలేదనీ, కొంత మందికి ఇప్పటికీ ప్రయోజనాలు అందడంలేదన్నది వాస్తవమనీ,  దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి, వారికి రేషన్ కార్డులు అందేలా చూడాలనే చెబుతున్నామని పేర్కొంది.  కొన్నిసార్లు.. దాహంతో ఉన్నవారి వద్దకే బావి వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.   దాహం వేస్తే..బావి దగ్గరకు వెళ్లాలి.. బావి మన దగ్గరకు రాదనే సామెతను ఉటంకిస్తూ .. సుప్రీంకోర్టు ఒక్కోసారి బావే దాహంతో ఉన్న వాడి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని చేసిన వ్యాఖ్యతోనైనా వలస కార్మికుల సంక్షేమం దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చదువుకున్న వారికే పగ్గాలు.. మోడీకి విద్యార్హతలు లేవని కేజ్రీ తేల్చేశారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా ఢిల్లీ  అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి   అరవింద్ కేజ్రివాల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధానిమోడీ లక్ష్యంగా ఢి ద్రవ్యోల్బణం లాంటి సమస్యల్లో దేశం చిక్కుకుంటే, దేశ పాలకుడు చదువుకున్నవాడా, లేదా అన్నది ప్రజలు తనిఖీ చేసుకోవాలని అన్నారు. విద్యావంతుడికే పగ్గాలు అప్పగించాలని సూచించారు. తాను చదువుకున్న ముఖ్యమంత్రినని, అందుకే ఢిల్లీలో ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని.. ఇది నచ్చని మోడీ ప్రభుత్వం.. తనపై కక్ష సాధింపుచర్యలకు దిగుతోందని ఆరోపించారు. మద్యం కుంభకోణం కేసులో తనను సీబీఐ దాదాపు తొమ్మిది గంటల సేపు విచారించిన  నేపథ్యంలో  కేజ్రివాల్ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సమావేశాన్ని  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా వ్యతిరేకించినా.. వెనక్కి తగ్గలేదు. శాసనసభలో మోడీకి, భాజపాకు వ్యతిరేకంగా ఆప్  తీర్మానం చేసింది. ప్రధానమంత్రి తన శక్తిని, ఏజెన్సీలను ఎంతగా వెచ్చించినా.. ఆప్ ఎదుగుదలను ఆపలేరని కేజ్రీ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు శాసనసభ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని కూడా ఆప్ తీవ్రంగా పరిగణించింది. దీన్ని సభాహక్కుల కమిటీకి నివేదించాలని తీర్మానించింది. ఈ విషయంలో గవర్నర్ కు సమన్లు జారీ చేయాలా లేదా అన్న విషయాన్ని కూడా కమిటీ నిర్ధారించాలని కోరింది. ప్రధాని మోడీ చదువుకోలేదని.. ఆయన సమర్పించిన  విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీలని కేజ్రీవాల్ 2016 ముందు నుంచే ఆరోపిస్తున్నారు. గుజరాత్ కోర్టు .. ఆ విషయం మీకనవసరం అంటూ తీర్పు ఇచ్చి 25,000  జరిమానా  కూడా విధించింది.  అయినా కేజ్రీవాల్ తగ్గడం లేదు. మోడీ విద్యార్హతలపై తన ఆరోపణలను కొనసాగిస్తున్నారు. 

అధినేత రుషికొండకు గుండు కొడితే.. ఆళ్ల ఉండవల్లి కొండనే మింగేస్తున్నారు!

దోపిడీ, దగా, దాడులతోనే జగన్ పాలన సాగుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనబడుతోందనీ, కానీ ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేపట్టిన ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనిని చూపించగలరా అని లోకేష్ సవాల్ విసిరారు. దేవన కొండ చెరువు వద్ద సెల్ఫీ దిగిన లోకేష్.... ఈ చెరువు ఒకప్పుడు ఎండిపోయి ఉండేదనీ.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో  చెరువును అనుసంధానం చేశామని వివరించారు.  దీంతో దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో  భూగర్భ జలాలు పెరిగి  బోర్లకు పుష్కలంగా నీరు అందుతోందన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత. ఇలా చెప్పుకోవడానికీ, చూపించడానికీ నీ పాలనలో ఒక్కటంటే ఒక్క పని చేశావా జగన్ అని సవాల్ చేశారు. ఇలా ఇదీ తమ ప్రభుత్వం సాధించిందని చెప్పుకుని సెల్ఫీ దిగే దమ్ము జనగ్ కు ఉందా అని లోకేష్ పేర్కొన్నారు. ఇక విశాఖలోని రుషి కొండకు జగన్ గుండు కొడితే.. ఆ పార్టీకే చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండనే మింగేశాడని లోకేష్ ఆరోపించారు.  ఇది మా ప్రభుత్వం ఘనత.  సహజ వనరుల దోపిడీలో వైసీపీ నేతలు ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా తయారయ్యారనీ, అందరూ ఈ విషయంలో తమ అధినాయకుడు  జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు.   సిఎం ఇంటికి కూత వేటు దూరంలో ఆళ్ల మైనింగ్ మాఫియా యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందన్నారు. అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి కొండ పై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టిడిపి నాయకులని, కార్యకర్తల్నిలోకేష్ అభినందించారు.

విపక్షాల ఐక్య కూటమి సారథి నితీష్?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దేశ  రాజకీయాలలో ఆయనదొక విలక్షణ శైలి. కూటములు, పొత్తులతో అధికారాన్ని పదిలంగా కాపాడుకోవడమెలాగో కచ్చితంగా తెలిసిన నేత.  బీజేపీతో జట్టు కట్టినా, కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి మహాఘట్ బంధన్ ఏర్పాటు చేసినా బీహార్ సీఎంగా తన పదవిని పదిలం చేసుకోవడానికేనని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. ఎలా అయినా సరే అధికారానికి నిచ్చెనలు వేసి ఎక్కడంలో, అందుకు అనుగుణంగావ్యూహాలు రచించడం, ఎత్తులు వేడయంలో దిట్ట.  ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహాలు కూడా ప్రత్యర్థులను తేరుకోలేని విధంగా ఇరుకున పెడతాయి. ఇద్దరిలో ఉన్న తేడా ఏమిటంటే.. కేసీఆర్ మాటల మాంత్రికుడు అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ మాటలలో కాదు చేతలలో చూపిస్తాననే రకం. ఈ ఇద్దరూ కూడా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దించాలన్న వ్యూహంతోనే అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం కేసీఆర్ ఏకంగా తనకు రెండు సార్లు అధికార అందలాన్ని అందించిన తెలంగాణ సెంటిమెంటునే వదులు కున్నారు. తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్) అధినేతగా ఆయన కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఎవరూ కలిసి వచ్చేలా లేరని నిర్ధారణ చేసుకున్న తరువాత  ఆయన తెరాసను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలోకి ఒక్కసారిగా జంప్ చేసేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఆ తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాల అడుగులు నెమ్మదించాయి. లేట్ గా అడుగుపెట్టినా లేటెస్ట్  అన్నట్లుగా నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం తన ప్రయత్నాలను ప్రారంభించారు. కాంగ్రెస్ తో టచ్ లో ఉంటూనే బీజేపీయేతర పార్టీలతో పాటుగా కాంగ్రెస్సేతర పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నితీష్ చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలత వ్యక్తం అవుతోంది.   ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ,  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో చర్చలు జరిపిన నితీష్ కుమార్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీకి సిద్ధమౌతున్నారు. వాస్తవానికి బీజేపీ వ్యతిరేక పొలిటికల్ ఫైట్‌ను తొలుత తెరపైకి తీసుకొచ్చిన  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ ప్రయత్నాలలో అడుగు ముందుకు వెయ్యడంలో ఫెయిల్ అయ్యారు.. కానీ నితీష్ కుమార్ మాత్రం ఒక ప్రణాళికతో అదే ప్రయత్నంతో అడుగులు  ముందుకు వేస్తున్నారు.   కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కింగ్ మేకర్ రోల్ కోసం కాకుండా ఏకంగా కింగ్ ను అవదామన్నదే తన లక్ష్యం అంటూ బాహాటంగా తెలిసేలా వ్యవహరించి.. జాతీయ పార్టీలను దూరం చేసుకున్నారు. అయితే నితీష్ మాత్రం వ్యూహాత్మకంగా.. బీజేపీని గద్దె దించడమే లక్ష్యం అనడమే  కాకుండా.. తాను పీఎం రేసులో లేనని ప్రకటించారు. దీంతో ఆయన అటు బీజేపీ యేతర పార్టీలనే కాకుండా, బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీలను కూడా రీచ్ కాగలిగారు. జాతీయ రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడానికి ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ రెడీగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ను తమ కూటమి సారథిగా అంగీకరించేందుకు వాటికున్న అభ్యంతరాలు వాటికి ఉన్నాయి.   నితీష్ ఆ అభ్యంతరాలను అడ్రస్ చేయగలిగారు.  అందుకే జాతీయ రాజకీయాలలో యాక్టివ్ రోల్ ప్లే చేయగలుగుతున్నారు. మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే కాక.. ఆ కూటమిలోకి కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలను కూడా కలుపుకుపోయే విధంగా నితీష్ వేస్తున్న అడుగులు ముందు ముందు బీజేపీ వ్యతిరేక కూటమి సారథిగా ఆయనే ఎంపికయ్యే అవకాశాన్ని కల్పిస్తాయని, అదే జరిగితే బీజేపీయేతర కూటమి ప్రధాని అభ్యర్థిగా ఆయన తెరమీదకు వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమనీ పరిశీలకులు అంటున్నారు.

జగనన్నే భవిష్యత్ అని ఆర్కే భావించడం లేదా?

జగనన్నే మా భవిష్యత్ అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నమ్మడం లేదా? అందుకే ఆయన ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టేశారా? అంటే మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికులు ఔననే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆట్టే సమయం లేదు.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసి.. వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి ఏప్రిల్ 7న శ్రీకారం చుట్టారు. ఈ నెల  29 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంటే మరో మూడు రోజులలో జగనన్నే మా భవిష్యత్ అన్న కార్యక్రమానికి ఫుల్ స్టాప్పడనుంది. సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ఇంటింటికి వెళ్లి.. నువ్వే మా నమ్మకం జగనన్న అని ఉన్న స్టిక్కర్లను ఇళ్లకు, సెల్ ఫోన్లకు అతికిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు తీరును ఎమ్మెల్యేలు.. పర్యవేక్షించడమే కాకుండా.. వారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలకు అందుతోన్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.  ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. కానీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు కూత వేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం.. పెద్దగా కనిపించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె (ఆళ్ల రామకృష్ణారెడ్డి)  అయితే మొత్తంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇప్పటి వరకూ ఆళ్ల రామకృష్ణారెడ్డి నువ్వే మా నమ్మకం జగనన్నా కార్యక్రమంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆర్కే అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది.  ఏఫ్రిల్ 20వ తేదీతో ముగియనున్న ఈ కార్యక్రమంలో చివరి రోజున ఆర్కే వచ్చి గంటకొట్టి మంగళహారతులిచ్చేసి మ..మ..అనిపించేఅవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులుచెబుతున్నాయి.   2014 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో.. నాడు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే... పక్కా రెబల్‌గా ఉండేవారని..  కానీ 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించినా.. ఆళ్లలో మాత్రం నాటి ఊపు ఉత్సాహం పూర్తిగా అవిరైపోయింద అంటున్నారు.  అయితే 2019 ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నారా లోకేశ్‌ను ఓడించి.. ఆర్కేను గెలిపిస్తే... తన కేబినెట్‌లోకి అతడికి బర్త్ కన్ ఫార్మ్ అంటూ పార్టీ అధినేత జగన్.. అప్పటి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తమ ఎమ్మెల్యే మంత్రి అవుతాడుగా అని భావించిన మంగళగిరి ప్రజానీకం ఆర్కేను గెలిపించారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పునర్వ్యవస్థీకరణలో సైతం జగన్ ఆర్కేను కన్సిడర్ చేయలేదు. దీంతో ఆర్కేలో అసంతృప్తి  గూడు కట్టుకొని ఉందని ఆయన వర్గం పేర్కొంటోంది.  జగన్ తొలి కెబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం తనకు చోటు దక్కకపోవడంతోపాటు.. మంగళగిరికి కూతవేటు దూరంలో ఉన్న చిలకలూరిపేట నుంచి గెలుపొందిన విడదల రజినీని మాత్రం.. వైయస్ జగన్ తన కేబినెట్‌లోకి తీసుకోన్నారు. ఇలా పార్టీ మారి.. అలా వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా   మంత్రిని చేయడం.. ఆర్కేకు ఏమాత్రం మింగుడు పడని వ్యవహారంగా మారిందని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ఈ ఆర్కే.. మంగమ్మ మార్క్ శపథం సైతం చేశారనే చర్చ నియోజకవర్గంలో జోరందుకొంది.   మరోవైపు.. సదరు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత గంజి చిరంజీవిని.. ఫ్యాన్ పార్టీలో చేర్చుకున్నారు. సీఎం వైయస్ జగన్.  వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా చిరంజీవి బరిలో దిగుతారనే ఓ టాక్ సైతం వాడీ వేడిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతోన్నట్లు... ఆ క్రమంలో ఈ విషయాన్ని   పార్టీ పెద్దల చెవిలో వేసినా జగన్ లైట్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే జగనన్నే మా భవిష్యత్తు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావించడం లేదనే ఓ చర్చనియోజకవర్గంలో సాగుతోంది. 

వైకాపాకే ఓటు.. దేవుడి మీద ఒట్టేయించండి.. వలంటీర్లకు ధర్మాన ఆదేశం!

వాలంటీర్లు.. జగన్ సర్కార్ వారిని ప్రభుత్వ వేతనాలిచ్చి మరీ పార్టీ కార్యకర్తలుగా పని చేయించుకుంటోంది.  మంత్రులు, ఎమ్మెల్యేలకు జనానికి మొహం చూపించలేని పరిస్థితులు ఉండటంలో పార్టీ తరఫున వాలంటీర్లనే జనాలలోకి పంపించేందుకు వైసీపీ ఇసుమంతైనా వెనుకాడటం లేదు. ఈ విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు రెండడుగులు ముందుకు వేసి వారినే తమ ఎన్నికల ప్రచార కర్తలుగా వాడేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఏం చేసినా ఫర్వాలేదన్న సంకేతాలిస్తున్నారు. బెదరించండి.. బతిమాలండి ఏమైనా సరే జనం ఓట్లు వైసీపీకే పడాలి  అని వారికి హుకుం జారీ చేశారు. ఇంతకీ ఆయన వాలంటీర్లకు చేసిన ఉపదేశం ఏమిటంటే...  రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు వైకాపాకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని చిత్రపటంపై వారితో ఒట్టు వేయించండి అని   మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లకు ఆదేశించారు.  శ్రీకాకుళంలో  వాలంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి  మంత్రి ఈ వ్యాఖలు చేశారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించేందుకు మూడు పద్ధతులు అనుసరించాలని ఆయన వాలంటీర్లకు చెప్పారు.  ప్రజలను ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైసీపీకి వేసేవారిని, బీలో వైసీపీకి ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలన్నారు. తెదేపాకు ఓటువేసే ఒక్క కుటుంబాన్ని వైకాపా వైపు వాలంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు పడతాయన్నది ఆయన ఉవాచ. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరన్న అంశాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైసీపీ ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలి. ఎవరైనా వినకపోతే కుటుంబ పెద్దలను కలిసి మాట్లాడాలి. కొందరు కులపెద్దల మాట వింటారు. అలాంటివారిని గుర్తించి కులపెద్దలతో మాట్లాడాలి. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలి అని ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా జనంలో మా పట్ల సదభిప్రాయం లేదు. అందుకే మిమ్మల్ని వెళ్ల మంటున్నాం అని కూడా చెప్పేశారు. ఒక వేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఉండవని ధర్మాన బెదరించడానికి కూడా వెనుకాడలేదు.  వాలంటీర్లు వైకాపా కోసం కష్టపడి పనిచేయాలి. అలా చేయలేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపోండని కూడా హెచ్చరిస్తున్నారు.  అధికారంలో ఉన్న ప్రభుత్వం మేలు చేసింది.. భవిష్యత్తులో కూడా చేస్తుందని ఓటరు భావిస్తే.. తప్పకుండా ఓటేసి,  మళ్లీ ఆ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారు. ఇలా దేవుడు.. ఒట్లు..ప్రమాణాలు.. అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడితే ఎట్లా..? అని వాలంటీర్లే అంతర్గత సంభాషణల్లో విసుక్కుంటున్నారు. ఇంతకీ కొసమెరుపేమిటంటే.. ధర్మాని అత్యంత కీలకంగా భావించి ఏర్పాటు చేసిన ఈ వాలంటీర్ల సమావేశానికి దాదాపు 60 మంది వాలంటీర్లు డుమ్మా కొట్టారు. 

బీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ క్లారిటీ!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ పై అపారమైన ప్రేమకు కారణమేమిటన్నది రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎనిమిదేళ్లుగా అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచీ అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు.. రాష్ట్రంలో మారిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహనకు రాలేకపోతున్నారు. మరో సారి విపక్షంలో కూర్చోవడం కంటే.. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందని వారు భావిస్తున్న బీఆర్ఎస్ తో ఎలాగోలా పొత్తు కుదుర్చుకుంటే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.   అందుకే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులను అనుభవించిన జానా వంటి నేతలు  బీఅరేస్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. తమ పలుకుబడి అంతా ఉపయోగించైనా సరే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు ముడి వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలపై ఆశలు లేకపోవడం ఒక కారణమైతే.. ఒక వేళ అధికారంలోకి వచ్చినా ఆ క్రెడిట్ అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందన్న దుగ్ధ మరో కారణమని పరిశీలకులు అంటున్నారు. సీనియర్ల ఈ తీరు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చంద్రంగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ల ప్రకటనలకు ఇక్ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాందీ నడుం బిగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని హస్తినకు తిరిగి వేళ్లే క్రమంలో ఆయన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కొద్ది సేపు ఆగారు. ఆ సందర్భంగా తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో ఆయన ముచ్చటించారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ తో పొత్తు అంటూ ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి నేతలు చేసిన ప్రకటనలను ప్రస్తావించి.. అటువంటి అవకాశమే లేదని తేల్చేశారు. రాష్ట్రంలో ఒంటరిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే.. లక్ష్యమని విస్పష్టంగా చెప్పారు. కర్నాటక ఎన్నికలు పూర్తి కాగానే.. తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలూ కాంగ్రెస్ కు ప్రత్యర్థులేనని విస్పష్టంగా తేల్చేశారు. రాహుల్ ఈ విధంగా పార్టీ స్టాండ్ ను విస్పష్టంగా తేల్చేయడంతో ఇక సీనియర్లు ఏ విధంగా చూస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, సీనియరేతర్లు అన్నట్లుగా నిట్టనిలువుగా చీలిపోయింది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే వచ్చిన తర్వాత. గాంధీ భవన్ వాతావరణంలో కొంత మార్పు వచ్చి, నాయకుల మధ్య విభేదాలు అలాగే  ఉన్నా.. ఎవరి దారిన వారు పాద యాత్రలు, ఇతర కార్యక్రమాలలో బిజీ అయి పోయారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గాడిన పడిందని అంతా భావిస్తున్నా.. ఆ బావన తప్పు అంటూ   జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి వారు బీఆర్ఎస్ తో పోత్తు అంటూ ప్రకటనలు చేస్తూ.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటూ గుర్తు చేస్తున్నారు. జానారెడ్డి ఇటీవల పొత్తు గురించి ప్రస్తావిస్తే.. ఆయన కంటే చాలా ముందు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే  అవకాశం ఉందని అన్నారు.  బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ బీఅరేస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని  హస్తిన  వేదికగా సంచలన ప్రకటన చేసి    పార్టీలో సునామీ సృష్టించారు. అయితే ఆ తర్వాత  రాష్ట్ర ఇన్ చార్జి ఠాక్రే జోక్యం చేసుకుని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.   ఇప్పడు మళ్ళీ అదే విషయాన్ని మరో  సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పెద్దలు అంటూ  గౌరవంగా సంభోదించే మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేవనెత్తి  తేనె తుట్టెను కదిల్చారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ  సీనియర్లు  కారుతో షికారు కావాలంటున్నారు.  ఈ పరిస్థితుల్లో  రాహుల్ గాంధీ స్వయంగా బీఆర్ఎస్ తో పొత్త ప్రశక్తే లేదని స్పష్టం చేయడంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా పార్టీ నుంచి సీనియర్లు బయటకు వెళ్లడానికి దారితీస్తుందా వేచిచూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.  

ప్రముఖ చిత్రకారుడు బాలి మృతి

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్‌ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం(ఏప్రిల్ 17) విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం (ఏప్రిల్ 18)వైజాగ్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. బాలి అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. చిన్నతనం నుంచి బాలికి చిత్రలేఖనంపై ఆసక్తి మెండు.  హైదరాబాద్‌లో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా  ఉద్యోగంలో చేరినా చిత్రలేఖనంపై మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1974లో ఈనాడు విశాఖపట్నం ఎడిషన్‌లో కార్టూనిస్ట్‌గా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో స్టాఫ్‌ ఆర్టిస్ట్‌గా చేరారు.   అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్‌ పురాణం సుబ్రహ్మణ్య శర్మ  మేడిశెట్టి శంకరరావు పేరును బాలిగా మార్చారు. తెలుగు పత్రికా రంగంలో బాలి బొమ్మలు ఒక ప్రత్యేక శైలికి ఒరవడి దిద్దాయి. ఆయన బొమ్మలు ప్రచురించని తెలుగు పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు.   పలు కథలు, నవలలకు బొమ్మలు వేయడమే కాకుండా వేలాది కార్టూన్లు కూడా బాలి బ్రష్ నుంచి జాలువారాయి.  అంతర్జాతీయ కార్టూన్‌ పోటీలలోనూ బాలి కార్టూన్లు బహుమతులు పొందాయి. బాలి కుమారుడు  గోకుల్‌   ఇటీవల మంచు ప్రమాదంలో చిక్కుకొని మరణించారు.  బాలి కుమార్తె వైశాలి అమెరికాలో ఉంటున్నారు.  

తెలంగాణను నొప్పించకండి... వైసీపీ నాయకులకు పవన్ వార్నింగ్!

తెలంగాణ మంత్రి చేసిన ప్రకటనకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు చేసిన ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర మనస్థాపానికి లోనయ్యారని,  వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకులు, ప్రజలు వేర్వేరు అని , తెలంగాణ ప్రజల మనస్సులను గాయపరిచే వ్యాఖ్యలు చేయడం శోచనీయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలను ఎలాంటి వివాదాల్లో లాగొద్దని ఆయన వైఎస్ఆర్ సీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ వాఖ్యల మీద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలన్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు మీద ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడం  విడ్డూరంగా ఉందన్నారు. బొత్స వ్యాపారాలు తెలంగాణలోనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.  ఒక మంత్రి తప్పుగా మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్ ఖండించాలని పవన్ డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ఉన్నది అంటే ఉలిక్కిపడుతున్నారంటూ సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఏపీ నేతలపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడడం లేదని, పోలవరం పనులు ఎందుకు పూర్తికావడం లేదని నిలదీశారు. ఇందులో ఏమైనా తప్పుందా అని నిలదీశారు. తాను ప్రజల పక్షాన మాట్లాడానని, ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదని హరీష్ వివరణ ఇచ్చారు.  తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలేనని హరీష్ రావ్ పేర్కొన్నారు.  ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలని చెప్పానన్నారు. తాము ఆంధ్రప్రదేశ్‌ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. తెలంగాణలో అన్ని బాగున్నాయని.. ఇక్కడే ఉండండి అనీ, ఆ రోజు అన్నానన్నారు. కానీ ప్రజల్ని, ఏపీని కించ పరచే విధంగా మాట్లాడాను అని కొందరు నాయకులు ప్రచారం చేశారని , అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలాడుతున్నారని విమర్శించారు. చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాలని, పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరంలా నీళ్లు అందించాలన్నారు. పవన్ స్టేట్ మెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడినట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.