మంత్రి గుడివాడతో ముద్రగడ భేటీ..వైసీపీలోకి కన్ఫర్మ్?

ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు సెగలు రేపుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. సామజిక వర్గాల లెక్కలేసుకొని  మరీ రాజకీయంగా అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు కాపు సామజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు తెలుగుదేశం, వైసీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పొత్తుగా వెళ్తాయనే ప్రచారం గట్టిగా జరుగుతున్న  సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ వ్యవహారం ఇంకా తేలలేదు కానీ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ వర్గాలు పొత్తు ఖరారైనట్లేనని భావిస్తున్నాయి. ఇరు పార్టీల శ్రేణులూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేస్తున్నాయి కూడా.  దీంతో వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ-జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగమే ముద్రగడ పద్మనాభంను మళ్ళీ ఫోకస్ లోకి తేవడం. కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని పవన్ కు ముద్రగడ సవాల్ కూడా విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు  రాసారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ముద్రగడ మీద తీవ్ర విమర్శలు గుపపించారు. అంతేకాదు  కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారని ముద్రగడ పేర్కొంటే.. జనసేన కార్యకర్తలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో ముద్రగడ అటాక్ అప్పుడే మొదలైంది. ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో.. వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశమవ్వడం మొదలు పెట్టారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ  ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలవగా.. ఇప్పుడు హఠాత్తుగా విశాఖకు వచ్చిన ముద్రగడ.. గాజువాకలో మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ అయ్యారు. అమరనాధ్ తో ముద్రగడ భేటీ వివరాలేవీ వైసీపీ నేతలు  బయటకి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ భేటీ వెనక ముద్రగడ రాజకీయ పునఃప్రవేశం, వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీకి దిగడం వంటి రాజకీయాలు అంశాలే ఉన్నాయని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్నది.  ముద్రగడ తెలుగుదేశం హయాం నుంచే వైసీపీకి టచ్ లో ఉన్నట్లు గోదావరి జిల్లా రాజకీయాలలో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్ కాగా.. ఇక ఇప్పుడు ఆయన  ఓపెన్ అయిపోయారనీ, ఇక  వైసీపీలోకి జంప్ చేయడానికి రెడీ అయిపోయారనీ తెలుస్తున్నది. ఇప్పటికే ముద్రగడను కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు రాయబారం కూడా నడిపినట్లు చెబుతున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాధ్ తో భేటీ వెనక కూడా కారణం ఇదే అయి ఉండవచ్చని చర్చ జరుగుతున్నది. నిజానికి ముద్రగడ,గుడివాడ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో కాపు ఉద్యమానికి మద్దతుగా గుడివాడ అమరనాధ్ తండ్రి, మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాధరావు నిలిచారు. ఆయనకూ ముద్రగడకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో స్నేహితుని కుమారుడు మంత్రి అయిన గుడివాడను ఇప్పుడు ముద్రగడ కలిశారు. ఇక ముద్రగడ వైసీపీలోకి వస్తే పిఠాపురం సీటు ఇస్తారని తెలుస్తున్నది. ఎలాగో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు ప్రజలలో పెద్దగా పాజిటివ్  ఇమేజ్ లేదనీ,  దీంతో ఆయన్ని సైడ్ చేసి ముద్రగడని నిలబెడతారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పిఠాపురం కాకపోతే  కాకినాడ నియోజకవర్గం నుంచి ముద్రగడను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.   ఒకవేళ ముద్రగడ పోటీ కి విముఖత చూపితే.. కుమారుడిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు.  మొత్తానికి ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

బీజేపీకి మద్దతు విషయంలో జగన్ తహతహ ఎందుకంటే?

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా అంత తొందరపడటం లేదు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలా, వ్యతిరేకంగా ఓటు వేయాలా అన్న విషయంలో జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కనీసం పార్టీ ఎంపీల సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించలేదు. అంతెందుకు ఇంకా కేంద్రం వైసీపీని కానీ, జగన్ ను కానీ, వైసీపీని కానీ కోరనే లేదు. అయినా జగన్ ఎక్కడ లేని తొందర  ప్రదర్శించారు. అవిశ్వాస తీర్మానానికి  వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసేశారు. అంతేనా ఢిల్లీలో అధికారాల నియామక నియంత్రణను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను చట్టబద్ధం చేసేందుకు ఈ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్న బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేశారు. కనీసం కేంద్రం కోరే వరకూ కూడా ఎదురు చూడలేదు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ విధానాలపై కేంద్రం పెద్దలు, బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోవడం లేదు.. తనను కాదు అన్నట్లుగా దులిపేసుకుంటున్నారు. పై రెండు విషయాలలో జగన్ కేంద్రం వద్ద దాసోహం అన్నట్లుగా వ్యవహరించిన తీరును బట్టి చూస్తే కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో కూడా జగన్ బేషరతు మద్దతు ఇచ్చేందుకు ఒక్క క్షణమైనా ఆలస్యం చేయరని అవగతమైపోతోందని పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి ఒక్క విజ్ణప్తి అయినా చేసేందుకు ధైర్యం చేయని జగన్ కేంద్రం కోరకుండానే మద్దతు ప్రకటించడం చూస్తుంటే.. ఆయనలోని బెదురు అవగతమౌతోందని అంటున్నారు. ఆ బెదురు కేంద్రానికి ఆగ్రహం వస్తే తనపై కేసుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందనేనని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు.  ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కూడా గుర్తిస్తున్నట్ల కనిపించదు.  తాను తనా అంటే తందానా అనే వ్యక్తి నేతృత్వంలో ఏపీలో ఉన్న ప్రభుత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముందన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరు ఉంది. ఇన్నేళ్లలో అంటే ఈ నాలుగేళ్ల కాలంలో బీజేపీ ఒక్క రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తప్ప మరే సందర్భంలోనూ జగన్ సర్కార్ మద్దతు కోరింది లేదు. అయితే బీజేపీ నోరెత్తి అడగాలా? నేను లేనూ అన్నట్లుగా జగన్ ప్రతి సందర్భంలోనూ  ప్రకటిస్తూ వస్తున్నారు.  ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి మరీ ఉపసంహరించుకున్న రైతు చట్టాలకూ జగన్ బేషరతుగా మద్దతు ఇచ్చారు.   వ్యవసాయ విద్యుత్ మోటార్ల విషయంలోనూ అంతే. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందుగానే జగన్ పాలిత ఏపీలో ఆ విధానాన్ని అత్యుత్సాహంగా అమలులోనికి తీసుకువచ్చి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఆర్డినెన్స్‌ విషయంలో కూడా అంతే మద్దతు కోసం బీజేపీ వైసీపీని కోరలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ బిల్లు వల్ల భవిష్యత్ లో తమ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న ఆలోచనలో ఉన్నాయి. కానీ జగన్ కు అటువంటి ఆలోచన, ఆందోళనా ఇసుమంతైనా లేదు. మోడీ నిర్ణయించారు. నేను సరే అన్నాను అంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విపక్ష కూటమి ఇండియా   పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని బీజేపీ ఇంకా అడగనైనా లేదు.. మీరు అడగాలా.. నాకు తెలియదూ అన్నట్లు జగన్ వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రకటించేశారు. ఏపీలో జనసేన జగన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అంతే కాదు ఆ పార్టీ బీజేపీకి మిత్రపక్షం.  కేంద్రం నుంచి ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఏపీలో ఉన్నది అవినీతి ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.  పార్లమెంటు వేదికగా  రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేదని కేంద్ర మంత్రులు కుండబద్దలు కొట్టేశారు. వైసీపీని కేంద్రం ప్రతి విషయంలోనూ కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నా.. జగన్ కు చీమ కుట్టినట్లైనా ఉండటం లేదు. అవసరానికి అప్పు... కేసుల నుంచి రక్షణ ఉంటే చాలు రాష్ట్రం ఏ గంగలో మునిగితే  నాకేం అన్నట్లుగా జగన్ తీరు ఉంది. 

జగన్ విధానాలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే: రఘురామ కృష్ణం రాజు

 జగన్  ప్రభుత్వ విధానాలన్నీ నేరపూరితమైనవే.. రాజ్యాంగ ఉల్లంఘనలే. కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం తీసుకున్న రుణాలన్నీ నిభందనలకు విరుద్ధమే. జగన్ ముఖ్యమంత్రిగా అనుసరించిన విధానాలను వ్యాపారులెవరైనా చేసి ఉంటే వారు జైలుకెళ్లి ఉండేవారు.  ఇందుకు గాను వారికి పదేళ్లకు తక్కువకాకుండా శిక్ష పడేది.  ఈ మాటలు అన్నది ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు . జగన్ ప్రభుత్వం రుణాల పేరిట చేస్తున్నదంతా పెద్ద మోసం అంటూ  వివరించారు. రచ్చబండలో భాగంగా మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ ను ఆర్థిక అక్రమార్కుడిగా అభివర్ణించారు.  జగన్ రాజ్యాంగంలోని 266/1, 293/3 అధికరణలను అతిక్రమించారని అన్నారు.  భవిష్యత్ ఆదాయంపై ఇప్పుడే ఈ స్థాయిలో భారీ అప్పులు చేస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.   రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న అప్పులపై తాను గతంలోనే ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి కి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖలు రాసినట్లు చెప్పిన రఘురామకృష్ణం రాజు దురదృష్ట వశాత్తూ కేంద్రం తన లేఖలను పట్టించుకోలేదన్నారు. దీంతో తాను కోర్టును ఆశ్రయించాననీ, అయితే కోర్టుకు వెళ్లడంలో జాప్యం జరిగిందంటూ కేసు కొట్టేసిందని వివరించారు.  ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పేరిట గతంలో 38.142 వేల కోట్ల రూపాయల అప్పులను చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తన  పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన 48 గంటల వ్యవధిలో మరో 12 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు రెడీ అయ్యిందన్నారు.  ఎక్సైజ్ టాక్స్ పేరిట కొత్త టాక్స్ వేసి మరీ ఏపీ ఎస్ డి సి పేరిట జగన్ సర్కార్ పాతిక వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నదన్నారు.  జగన్ విధానాల కారణంగా వచ్చే ఎన్నికలలో ఆయన ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  ఆ ప్రభుత్వానికి మద్యం ధరలను తగ్గించే అవకాశం ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు.   బటన్ నొక్కి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ వాస్తవానికి చేస్తున్నది దోపిడీ మాత్రమేనని విమర్శించారు.  భవిష్యత్తులో మద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది లేదు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట జగన్మోహన్ రెడ్డి నగదు ఇచ్చేదీ లేదన్నది జనం గ్రహించాలని చెప్పారు. 

తెలంగాణలో బీజేపీ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు

తెలంగాణలో బీజేపీ పరిస్థితి బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న ఆ పార్టీ ఆకాంక్ష మేరకు పార్టీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అసలు తెలంగాణలో బీజేపీ అధికారం కోసం పోటీ పడుతోందన్నంతగా జోష్ పెంచుకోవడానికి కారణం ఎవరు ఔనన్నా కాదన్నా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడంలో సందేహం లేదు. అయితే బండి స్పీడ్, జోరు అందుకోలేని కొందరు ఆయనకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. వీరిలో అత్యధికులు తొలి నంచీ పార్టీలో ఉన్న వారు కాకుండా.. మధ్యలో వారి వారి రాజకీయ అవసరాల కోసం పార్టీలోకి వచ్చి చేరిన వారేనని పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీ అధిష్ఠానం కూడా ఎలాగోలా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చాలన్న ఉద్దేశంతో సైద్ధాంతిక విలువలకు తిలోదకాలొదిలేసి పార్టీలోకి ఎవరు వస్తానన్నా ఓకే అన్నట్లుగా గేట్లు బార్లా తీసేసింది. దీంతో సిద్ధాంతాన్ని నమ్ముకుని   అధికారం సంగతి ఆలోచించకుండా పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి ఈ పరిస్థితి రుచించలేదు. దాంతో వారు పార్టీలో క్రియాశీలంగా ఉండకుండా కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీకి బలం పెరుగుతోందన్న బిల్డప్ అవ్వడానికి  ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు నానా హడావుడీ చేశారు. అయితే బండి జోష్ వారికి ఇబ్బందికరంగా పరిణమించడంతో  ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. చేరికలపైనే విజయం ఆధారపడి ఉందని భావించిన  అధిష్ఠానం బండిని తప్పించి ఇప్పటికే  మూడు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డికి నాలుగోసారి  పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. మొదటి రెండు సర్లూ ఆయన ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.  రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ బీజేపీకి ఆయనే తొలి అధ్యక్షుడు.  అయితే గత మూడు సందర్భాలలోనూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన కిషన్ రెడ్డికి పార్టీ కీలక సమయంలో మరోసారి రాష్ట్ర అధ్యక్షపదవిని కట్టబెట్టడంపై పార్టీ వర్గాల్లోనూ ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతున్నది.   ఇప్పుడు  తాజాగా మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి గతంలో కంటే క్లిష్ట పరిస్థితులు స్వాగతం పలుకుతున్నాయనడంలో సందేహం లేదు. పార్టీ మాజీ అధ్యక్షుడి అసంతృప్తి, అలాగే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఆశించిన ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల సహాయ నిరాకరణ, కర్నాటక ఎన్నికల తరువాత  కాంగ్రెస్ లో పెరిగిన జోష్ తో డీలా పడిన  కమలం కార్యకర్తలు,  రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో కరవైన పార్టీ నిర్మాణం ఇవన్నీ కూడా కిషన్ రెడ్డికి సవాళ్లనే చెప్పాలి. పైగా పార్టీ హైకమాండ్ తిమ్మిని బమ్మి చేసైనా, బమ్మిని తిమ్మిని చేసైనా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్న పరిస్థితుల్లో కిషన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెడతారన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.  

బ్రేకింగ్.. బ్రేకింగ్... వరద ముంపులో మల్యాల, కొండాయి గ్రామాలు

 ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన మెరుపు  వరదలతో తెలంగాణ   ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జంపన్న వాగు వరద ఉధృతికి కొండాయి, మల్యాల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఏడుగురు గల్లంతయ్యారు.  ఇక  ఏపీలో మున్నేరు వాగు ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తుండడంతో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద ఉద్ధృతి కారణంగా ఐతవరం వద్ద నిన్న సాయంత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ ఉదయం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మున్నేరుకు ప్రస్తుతం 1,92,000 క్యూసెక్కుల వరద వస్తుండగా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు.  మరోవైపు, నిన్న సాయంత్రం నుంచి వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బెస్ట్ లీడర్ నారా లోకేష్.. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే

ఏపీలో ఇప్పుడున్న ప్రథమ శ్రేణి రాజకీయ నేతలలో చంద్రబాబు అందరికంటే సీనియర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన స్టేచర్, అనుభవం, దార్శనికతతో సాటి రాగల నేత ఏపీలో ఆయన వినా మరొకరు ఇప్పుడు లేరని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.. ఇక, ఆయన తరువాత ఇప్పుడున్న నేతలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంచు మించు సమకాలికులుగా చెప్పుకోవచ్చు. అందుకేఈ నేతలలో బెస్ట్ ఎవరన్నఅంశంపై తెలుగువన్  ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సినీ హీరోగా భారీ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను కాదని నెటిజన్లు నారా లోకేష్ కు ఓటేశారు. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో   నారా లోకేష్ ప్రజా నేతగా  అత్యధిక ఓట్లను దక్కించుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెస్ట్ లీడర్ గా అత్యధికులు నారా లోకేష్ కు ఓటేశారు. ఈ సర్వేలో నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అప్షన్లుగా ఇవ్వగా అత్యధిక శాతం మంది నారా లోకేష్ కు ఓటేశారు. బెస్ట్ లీడర్ గా నారా లోకేష్ కు 62 శాతం మంది ఓటేయగా.. 24 శాతం మంది పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ గా ఎన్నుకున్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ లీడర్ అంటూ కేవలం 14 శాతం మంది మాత్రమే ఓటేశారు. తెలుగు వన్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో స్వల్ప వ్యవధిలో 53 వేల మంది నెటిజన్లు పాల్గొన్నారు. దీంతో నెటిజన్లలో నారా లోకేష్ పట్ల నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిజిటల్ మీడియాను ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. అలాంటి వర్గంలో నారా లోకేష్ కరిష్మా ఏంటో ఈ సర్వే ద్వారా బయటపడుతుంది. ఈ సర్వేలో నారా లోకేష్ పట్ల నెటిజన్లు చూపిన నమ్మకం వెనక ప్రస్తుతం ఆయన సాగిస్తున్న యువగళం పాదయాత్ర కూడా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ స్టామినా ఏంటో ఆంధ్ర ప్రజానీకానికి అర్థమైంది. అనితర సాధ్యం అనదగ్గ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర   ప్రారంభించిన లోకేష్.. జగన్ సర్కార్ గుక్కతిప్పుకోలేని విధంగా విమర్శల బాణాలను సంధిస్తూ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్రకు ముందు లోకేష్ వేరు.. ఇప్పుడు లోకేష్ వేరు అనేలా ఆయన పొలిటికల్ గా మేకోవర్ అయ్యారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను, అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరిని ప్రజలకు వివరిస్తూ లోకేష్ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ సర్వే రూపంలో బయటపడిందని చెప్పవచ్చు. అయితే, నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగడం వెనక కఠోర శ్రమ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. రాజకీయంగా లోకేష్ తొలి అడుగు వేయకుండానే ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. బాడీషేమింగ్, ఆయన నడక, మాట ఇలా   కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రత్యర్ధులు శృతి మించి ఆయన్ను తూలనాడారు. దానికి ఉల్లిక్కి పడని లోకేష్ ఇప్పుడు ఇలా పని తీరుతోనే సమాధానం చెప్పారు. ముందుగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టిన లోకేష్.. గర్జించే సింహంలా ఇప్పుడు ఇలా లక్షల మంది ప్రజా సైనికుల ముందు బెరుకు లేకుండా ప్రత్యర్థులను సూటిగా చీల్చి చెండాడుతున్నారు. మొత్తంగా ఇదీ మీ లోకేష్ అంటూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. దాని ఫలితమే ఈ ఆన్ లైన్ సర్వేలో నెటిజన్లు జయహో లోకేష్ అని మద్దతు తెలిపారని చెప్పడానికి సందేహం అవసరం లేదు.

అసెంబ్లీ బరిలోకి లక్ష్మీ పార్వతి.. పోటీ ఎక్కడ నుంచంటే?

దివంగత సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ భార్యగా ల‌క్ష్మీపార్వ‌తి అందరికి సుపరిచితురాలే. ఎన్టీఆర్ ను ఆమె ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆయనకు అసలు లక్ష్మీపార్వతి ఎలా దగ్గరయ్యారన్నది లోకానికి తెలిసిన కథే. అది పక్కన పెడితే ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు.   ఎన్టీఆర్ జీవించి ఉన్న కాలంలోనే రాజ‌కీయాల్లో కాళ్ళూ, చేతులు పెట్టిన లక్ష్మీపార్వతి ప్రత్యక్ష రాజకీయాలలో కూడా పోటీ చేశారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ నుండి పోటీ చేసిన లక్ష్మీ పార్వతిని ప్రజలు అప్పట్లో ఓడించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఆమె ఎక్కడా పోటీలో నిలబడలేదు. అయితే వైసీపీ పంచన చేరి చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆమె ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం  ఏపీ తెలుగు, సంస్కృత అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్నారు. ఇప్పటి వరకూ కేవలం చంద్రబాబు కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నందుకే ఆమెకి పదవి ఇచ్చారన్నది పరిశీలకుల విశ్లేషణ.  అయితే ఇప్పుడు   లక్ష్మి పార్వతి ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కసారైనా చట్టసభలకు వెళ్లాలన్నది ఆమె చిరకాల వాంఛ. ఈ క్ర‌మంలో  త‌న ఉద్దేశాన్ని సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర   ప్రస్తావించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి  ఆమెకు జగన్   గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ గెలిచిన స్థానాలలో ఎక్కడో ఒక చోట నుండి లక్ష్మీ పార్వతి పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.   ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం హిందూపురం నుండి ఎన్టీఆర్ కుమారుడు  బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ నుండి 2014లో నవీన్ నిశ్ఛల్, 2019లో ఇక్బాల్ బాలయ్యపై పోటీ చేసి ఓడిపోగా ఇప్పుడు ఇక్కడ నుండి లక్ష్మీ పార్వతిని రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందని అంటున్నారు.   ఈ మధ్యనే వైసీపీ హిందూపురం ఇంచార్జి పదవిని మహిళా నేత టీఎన్ దీపికకు అప్పగించింది. దీంతో బాలయ్య దీపికపై పోటీ చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే టీడీపీ కూడా ఇక్కడ మహిళా నేతనే దించాలని ఆలోచన చేస్తూ బాలయ్య కుమార్తె, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిని ఇక్కడ నుంచి రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.  ఇప్పుడు వైసీపీ నుండి దీపికాను తప్పించి లక్ష్మీ పార్వతిని రంగంలోకి దించాలని వైసీపీ యోచిస్తోందంటున్నారు. అదే జరిగితే హిందూపురం   రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతుందనడంలో సందేహం లేదు. 

ఇండియా కూటమి కెప్టెన్ ఎవరు?

ఈ నెల 18న బెంగుళూరులో ఏర్పాటైన ఇండియా కూటమికి సారథ్యం వహించే నేత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాబట్టి యుపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ  పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 2004 నుంచి యుపీఏ చైర్ పర్సన్ గా ఉంటున్న సోనియాగాంధీ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గత పది  రోజుల నుంచి ఇండియా కూటమికి నేత ఎవరు అనే చర్చ కొనసాగుతోంది.2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బలమైన ఎన్డీఏ కూటమిని మట్టి కరిపించి అధికారంలో తీసుకురావడంలో సోనియా ముఖ్య భూమిక వహించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 26 ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 'ఇండియా' పేరుతో ఏర్పడిన ఈ కూటమికి నాయకత్వం వహించేది ఎవరని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు మార్లు సమావేశం అయినప్పటికీ కూటమికి నాయకుడిని ఎన్నుకోవడంపై ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం ఈ విషయంపైనే బీజేపీ సహా ఎన్డీయే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాల కూటమిని ముందుండి నడిపించే నాయకుడే లేడని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఇండియా కూటమికి నాయకుడు ఎవరన్న ప్రశ్నకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే స్పందించారు. ఇండియా కూటమికి నాయకుడంటూ ఎవరూ లేరని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించేందుకు తామంతా కూటమిగా ఏర్పడ్డామని, కూటమిలోని పార్టీల ఉమ్మడి లక్ష్యం అదేనని వివరించారు. కూటమికి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం అంతగా లేదని చెప్పారు. జనాలకు పెద్దగా తెలియని వ్యక్తులు కూడా అవకాశం రాగానే తమలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అందరి మెప్పును పొందారని చెప్పారు. చరిత్రలో ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ హఠాన్మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని ఉద్ధవ్ గుర్తుచేశారు.

స్నీడ్ న్యూస్ 2

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద.. తెరుచుకోని నాలుగు గేట్లు 11.నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి  700 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.  ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా.. అందులో నాలుగు గేట్లు తెరుచుకోలేదు. దీంతో  14 గేట్ల ద్వారా వాటికి  నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే ముంపు తప్పదన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ............................................................................................................................................................... శ్రీశైలం ప్రాజెక్టుకు పోెటెత్తుతున్న వరద 12.  విస్తారంగా కురుస్తున్న వర్షాలతో  శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయానికి  816.20 అడుగులకు చేరుకుంది.  ............................................................................................................................................................ విశాఖలో భారీ వర్షాలు 13. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలమైంది.    మున్సిపల్‌ స్టేడియం, పోర్టుకు వెళ్లే మార్గం జలమయమైంది  ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. సమాన్లు నీటిలో కొట్టుకుపోయాయి.  ............................................................................................................................................................... సీతారాంపురంలో వరద 14.భద్రాద్రికొత్తగూడెం జిల్లా  సీతారాంపురం పంచాయతీ హార్జా తండా చప్టాపైనుంచి పారుతున్న వరద నీటిలో ఆటో కొట్టుకుపోయింది. ఈ ఆటో నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత సైలెన్సర్ లో కి నీరు పోయి ఆగిపోయింది.  ఆటో డ్రైవర్, అందులో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఆటో మాత్రం కొట్టుకు పోయింది.  ................................................................................................................................................... ములుగులో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు 15. ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ములుగుకు వెడుతున్న బస్సుఈ ఉదయం ములుగు స‌మీపంలోని గట్టమ్మ జాకారం మధ్యలో భారీ వరద తాకిడికి కొంతదూరం కొట్టుకుపోయి పొలాల మధ్య లో నిలిచిపోయింది. బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ................................................................................................................................................ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం 16. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. పరకాల భూపాలపల్లి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే  హనుమకొండ ఎటురునాగారం ప్రధాని రహదారిపై రాకపెకలు స్తంభించిపోయాయి. ........................................................................................................................................................ భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం 17. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.  ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు పొంగి పొర్లడంతో  గ్రామంలోకి నీరు చేరింది. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు. ......................................................................................................................................................... రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాలేదు 18.కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు ఆగిపోడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడమే కారణమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి  లిఖితపూర్వక సమాధానంలో  రాష్ట్ర ప్రభుత్వం  వాటా సొమ్ము ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు  సాగవని  స్పష్టం చేశారు. ............................................................................................................................................................... ఏపీలో భారీ వర్షాలు 19. ఏపీలోని ఆరు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ........................................................................................................................................... బిగ్ బాస్ కు సెన్సార్ 20. బిగ్‌బాస్‌ రియాల్టీ షో   ప్రసారానికి ముందు సెన్సార్‌  చేయకపోతే ఎలాగని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నించింది.   బిగ్‌బాస్‌ షో పై తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండుపిల్ లను విచారించిన హైకోర్టు  పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ   విచారణను   వాయిదా వేసింది.

వరాలతో బిఆర్ఎస్ ప్రభుత్వానికి నిధుల లేమి

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండటంతో  తెలంగాణాలో బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది.   అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన పథకాలను అమలు చేసేందుకు ఉత్తర్వులిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నారు. వారికిపెన్షన్లు పెంచుతున్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు తగిన  చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల   తెలంగాణ ప్రభుత్వం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందిజ అప్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి  అవకాశాలు తక్కువ. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. అందుకే కార్పొరేషన్ల నుంచి అదనపు అప్పుల కోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇటీవలె పలు మార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు.  అప్పుల కోసం అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఆర్బీఐ ద్వారా ప్రతీ నెలా నాలుగైదు వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని విక్రయిస్తున్నారు. ఇవి చాలకపోవడంతో గ్యారంటీ అప్పులు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీనికి కేంద్రం, ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి కొన్నినియమ నిబంధనలను ప్రవేశ పెట్టాయి. గ్యారంటీ అప్పు ఎట్లా తీరుస్తారనేది నివేదిస్తేనే కొత్తగా అప్పులు తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి.  ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించడం, నిధుల కొరత మొదలవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. కనీసం గ్యారంటీ అప్పులనైనా పథకాలకు మళ్లించాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీములకు కూడా ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు. జూన్ మొదటి వారంలో అమలు చేయాల్సిన రైతుబంధు జులై నెల చివరి దశకు చేరుకున్నా పూర్తి కాలేదు. ఇప్పటి దాకా 5 ఎకరాల లోపు ఉన్న పట్టాదారులకు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందింది. ఇంకో రూ.2,500 కోట్లు అయితేనే రైతుబంధు పూర్తవుతుంది. ఇక జులైలోనే మొదలుపెడుతామని చెప్పిన దళితబంధు, గృహలక్ష్మి స్కీముల అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. బీసీ చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం స్కీమ్ గందరగోళంగా మారింది. మొదటిదశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికే ఇచ్చారు. బీసీ బంధు ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాధికారుల మధ్య సఖ్యత కుదరక బీసీ బంధు నిలిచిపోయింది.  విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఆ ఉద్యోగులను మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉద్యోగులుగా మార్చారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బిఆర్ఎస్ ప్రభుత్వం నిధుల లేమికి గురైనట్లు తెలుస్తోంది.

.పోలవరం పూర్తి చేసేది తెలుగుదేశమే,, తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే

పోలవరం ఎవరు పూర్తి చేస్తారు? అంటూ తెలుగువన్ ఆన్ లైన్ లో నిర్వహించిన పోల్ కు అద్భుత స్పందన లభించింది. మొత్తం కేవలం ఒక్క రోజు వ్యవధిలో 63వేల మంది ఈ పోల్ లో పాల్గొనగా వారిలో 84 శాతం మంది పోలవరం పూర్తి చేయడం అన్నది తెలుగుదేశం వల్లే అవుతుందని నిర్ద్వంద్వంగా చెప్పారు. కేవలం 12 శాతం మంది వైసీపీ పోలవరం పూర్తి చేస్తుందన్నారు. ఈ జాతీయ ప్రాజెక్టును బీజేపీయే పూర్తి చేస్తుందని 5శాతం మంది అభిప్రాయపడ్డారు. దార్శనికత ఉన్న నేత చంద్రబాబు మాత్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగరన్నది అత్యధిక ఆంధ్రుల అభిప్రాయమని తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులైనా, ప్రగతి అయినా, పురోగతి అయినా ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమౌతుందన్నది ఏపీలో మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ ఆన్ లైన్ పోల్ సర్వేలో ద్వారా అత్యధికులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. కేవలం పోలవరం తెలుగుదేశం మాత్రమే పూర్తి చేస్తుందంటూ టీడీపికీ టిక్ పెట్టడమే కాకుండా మెసేజీల ద్వారా తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.   రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావాల్సిందేనన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ పోల్ లో తేలింది. అసలు పోలవరం పురోగతి మందగించడానికీ, ప్రాజెక్టు పరిస్థితి ఈ రోజిలా తయారవ్వడానికి వైసీపీయే కారణమని పలువురు మెసేజీల రూపంలో ఈ పోల్ లో కుండబద్దలు కొట్టిన చందంగా చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ పోలవరంను నిర్వీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి.. అభివృద్ధి కార్యక్రమాలను కచ్చితంగా, లోపరహితంగా చేయగల ఒకే ఒక్క దార్శనికుడు చంద్రబాబు మాత్రమేనని చెప్పడమే కాకుండా.. ఏపీ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని పేర్కొన్నారు.  రివర్స్ టెండరింగ్ వల్ల  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో 628 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.. కానీ జగన్ సర్కార్ ప్రతిదీ రివర్స్ లోనే చెప్పిందన్నది  కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తానికి అదనంగా 500 కోట్ల రూపాయలు చెల్లించడంతోనే తేటతెల్లమైందంటున్నారు.  తెలుగుదేశం హయాంలో పోలవరం పనులు  చేపట్టినప్పుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉంది. కానీ రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ సర్కార్ మరో సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించే సమయానికి జగన్ సర్కార్ తీసుకు వచ్చిన కొత్త ఇసుక విధానం మేరకు టన్ను ఇసుకకు 375 రూపాయల చొప్పున చెల్లించాలసి వచ్చింది. దీంతో రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అన్న జగన్ సర్కార్ మాటలు డొల్లగానే మిగిలిపోయాయంటూ నెటిజన్లు పోలవరంపై తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో పేర్కొన్నారు.  

 ఇండియా కూటమికి దగ్గరౌతున్న కెసీఆర్ 

కొన్ని రోజులుగా బిజెపికి బీ టీంగా పనిచేస్తున్న బిఆర్ఎస్  సడెన్ గా ప్లేట్ మార్చింది. విపక్ష కూటమి ఏర్పాటు చేసిన పాట్నా, బెంగుళూరు సమావేశాలకు దూరంగా ఉన్న బిఆర్ఎస్ ఎన్డియేపై అసమ్మతి నోటీసు ఇచ్చి కొత్త రాజకీయ సమీకరణాలకు ఆజ్యం పోసింది. ఐదేళ్ల క్రితం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కెసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్  మోదీ వెంట ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ను వ్యతిరేకించిన కెసీఆర్ పార్టీ లోకసభలో ప్రవేశ పెట్టిన అసమ్మతి నోటీసుతో తిరిగి విపక్ష కూటమి ఇండియాకు చేరువ కావాలని చూస్తున్నారు. మణిపూర్ హింసను నిరసిస్తూ బిఆర్ఎస్  మోదీప్రభుత్వంపై అసమ్మతి నోటీసు ఇచ్చింది. బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు లోకసభలో అసమ్మతి నోటీసు జారీ చేశారు. ఆయన వెంట ఎంఐఎం కూడా ఉంది. ఇటీవలె బిఆర్ఎస్ కు దూరమైన ఎంఐఎం మణిపూర్ హింసపై ప్రవేశపెట్టే అసమ్మతి నోటీసుకు మద్దత్తుగా నిలిచింది.ఎంఐఎం కూడా అసమ్మతి నోటీసు ఇచ్చింది. ఎంఐఎం మాత్రం కాంగ్రెస్ కు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.భాగ్యలక్ష్మి వివాదంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ నుంచి ఎంఐఎం వైదొలగింది. ఎంఐఎం మొదటి నుంచి కాంగ్రెస్ కు దగ్గరగా ఉండేది. తిరిగి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చూస్తుంది. లిక్కర్ స్కాంలో కెసీఆర్ కూతురు కవిత పేరు ఉండటంతో కొన్ని రోజులుగా బిజెపిని కానీ, మోదీ ప్రభుత్వాన్ని కెసీఆర్ పల్లెత్తు మాట అనడం లేదు. బిజెపికి  బిఆర్ఎస్ బీటీంగా మారిపోయిందని ప్రచారం జరిగింది. కవిత అరెస్ట్ ను అడ్డుకోవడానికి కెసీఆర్ స్వయంగా బిజెపి అధిష్టానంతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్  ను మార్చడానికి ఎక్కువ దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అసమ్మతి నోటీసు కెసీఆర్ హైడ్రామా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉత్తుత్తి అసమ్మతి నోటీసు అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు.  దక్షిణాదిలో కర్ణాటక నుంచి  విక్టరీ సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా గెలవవచ్చు అని పలు సర్వేలు చెబుతున్నాయి. కెసీఆర్ తెప్పించుకున్న సర్వేలో కూడా కాంగ్రెస్ విక్టరీ ఉండటంతో కర్ణాటక ఫలితాల తర్వాత కెసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది. ప్రతీ సారీ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.

స్పీడ్ న్యూస్ 1

ప్రేమ జంటకు శ్మశానంలో వివాహం 1. ఓ ప్రేమ జంటకు స్మశానంలో అతి వైభవంగా వివాహం జరిగిన అరుదైన ఘటన    శిర్డీ సమీపంలోని రహతా గ్రామంలో జరిగింది.  స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పని చేస్తున్న వ్యక్తి కుమార్తె ప్రేమ వివాహాన్ని ఆమె పుట్టి పెరిగిన చోటే చేయాలన్న తలంపుతో  ఆ జంట వివాహం శ్మశానంలో   అంగరంగ వైభవంగా జరిపించారు. ............................................................................................................................................... పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధం : యునెస్కో 2. ప్రపంచవ్యాప్తంగా  పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని యూనెస్కో సూచించింది. మనుషుల మధ్య సంబంధాలను  డిజిటల్ టెక్నాలజీతో భర్తీ చేయకూడదని అభిప్రాయపడింది. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వాలు స్కూళ్లల్లో మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల వినియోగంపై నిషేధం విధించాయి. .............................................................................................................................................................. ముత్యాల జలపాత సందర్శనకు వెళ్లి చిక్కుకున్న పర్యాటకులు 3.  ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 84 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న ఉదయం ఈ జలపాతం చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా  భారీ వర్షాలకు వాగు ఉప్పొంగింది. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.  డయల్ 100 ద్వారా పర్యాటకులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. ....................................................................................................................................................... బీజేపీ నుంచి జిట్టా సస్పెన్సన్ 4. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది.   చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా ఇటీవల   బీజేపీలో   గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని, అందుకే పార్టీకి మానసికంగా దూరమయ్యాయనీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్ఠానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ....................................................................................................................................................... జగన్ ఓ కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ : లోకేష్ 5. జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఒంగోలులో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన జగన్ ను కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గా అభివర్ణించారు. దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక నాయకుడు జగనే అంటూ విమర్శించారు. ......................................................................................................................................................... ఏపీలో బాలికలు, మహిళల అదృశ్యం 6. ఆంధ్రప్రదేశ్ లొ  2019- 2021 మధ్య 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. దీనిపై జనసేనానిని కేంద్రం విడుదల చేసిన గణాంకాలను కాదనగలరా జగన్ అంటూ ట్వీట్ చేశారు. ................................................................................................................................................... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వనమాలే: షర్మిల 7. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో కేసీఆర్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ వనమాలే అంటే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు   తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  అన్నారు. ......................................................................................................................................................... అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదు: కిషన్ రెడ్డి 8.కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లఅాడిన ఆయన  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేని చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. .................................................................................................................................................. సీఎస్ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్ 9.తెలంగాణ వ్యాప్తంగా వచ్చే  48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్‌ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని  ఆదేశించారు. .......................................................................................................................................................... భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 10. భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం  50.2 అడుగులకు చేరింది  రికార్డు స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో రాత్రి 12 గంటల సమయానికే 350 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదయింది.

అవిశ్వాసంలోనూ ఇందిరమ్మదే రికార్డు!

స్వాతంత్ర భారత రాజకీయాల్లో దివంగత ప్రధాని ఇందిరా గాంధీది ప్రత్యేక స్థానం. ఒకటీ రెండూ కాదు అనేక విషయాల్లో ఆమె చరిత్రను సృష్టించారు.  అవును  ప్రస్తుతం దేశంలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న అవిశ్వాస తీర్మానం చర్చలోనూ ఇందిరా గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధానిగా ఇందిరా గాంధీ రికార్డుల కెక్కారు. అవును. ఇంత వరకు స్వాతంత్ర భారత చరిత్రలో ప్రతిపక్ష పార్టీలు  27 సార్లు అవిశ్వాసం ప్రవేశ పెడితే, ఒక్క ఇందిరా గాంధీ ప్రభుత్వంమే 15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కుంది. అదొక రికార్డు అయితే, అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్న అన్ని (15) అన్ని సార్లు ఇందిర ప్రభుత్వమే నెగ్గింది.  అంతే కాదు.దేశంలో ఇంతవరకు   ప్రభుత్వాలు 27 సార్లు అవిశ్వాసం తీర్మానం ఎదుర్కున్నా, కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ప్రభుత్వం కూలి పోయింది, మిగిలిన అన్ని సందర్భాలలోనూ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంది. మొదటిసారి 1979లో మొరార్జీ దేశాయ్.. రెండవసారి  1999లో అటల్ బిహార్ వాజ్‌పేయ్‌లు ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధానిగా రికార్డుకెక్కిన ఇందిరా గాంధీ మాత్రం అన్ని సందర్భాలలో సభ విశ్వాసం పొందారు. విజయం సాధించారు. అదలా ఉంటే, స్వాతంత్ర భారత తొలి ప్రధాని జవహర లాల్ నెహ్రూ  ... మొట్టమొదటి సారిగా 1963 (మూడవ లోక్ సభ)లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్నారు. నెగ్గారు. అయితే 1952 లోక్ సభ నిబంధనలలో  అవిశ్వాస తీర్మానం నిబంధనలు పొందు పరిచిన తర్వాత 1963 అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన జేబీ కృపలానీ నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.అంతకు ముందు తొలి రెండు సభల్లో అవిశ్వాసం అవసరం రాలేదు. ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రయత్నం  చేయలేదు.   అదలా ఉంటే, కృపలానీ ప్రవేశ పెట్టిన తొలి అవిశ్వాస తీర్మానాన్ని  నెహ్రూ స్వాగతించారు. తీర్మానం పై  నాలుగు రోజుల పాటు, 21 గంటలకు పైగా జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు, చరిత్ర పుటల్లో నిలిచి పోయాయి.  అవిశ్వాస తీర్మానం లక్ష్యం, అధికారంలో ఉన్న పార్టీ గద్దె దింపి,తాము అధికారంలోకి రావడం, అయితే. ప్రస్తుత తీర్మానం లక్ష్యం అది కాదు... అటువంటి అంచనాలు కానీ, ఆశలు కానీ లేవు. అయినా, చర్చ ఆసక్తి దాయకంగా, ప్రయోజనకరంగా సాగింది. అందులో అవాస్తవాలున్నా, నేను వ్యక్తిగతంగా చర్చను స్వాగతిస్తున్నాను. అంతే కాదు, మనం అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెట్టుకోవడం మంచిదని భావిస్తున్నాను అంటూ చరిత్రలో నిలిచి పోయే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఆ తర్వాత 1964లో లాలబహదూర్ శాస్త్రి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కుంది. ఇక అక్కడి నుంచి 1964 – 1975 మధ్యలో 15 మార్లు లోక్ సభలో అవిశ్వాస తీర్మానాలపై  చర్చ జరిగింది.  అందులో మూడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన తీర్మానాలు అయితే, మిగిలిన 12 ఇందిరా గాంధీ ఖాతాలో చేరాయి. ఇవిగాక, 1981- 1982 మధ్యలో ఇందిరా గాంధీ మరో మూడు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కున్నారు. దిగ్విజయంగా దాటేశారు. ఆవిధంగా తొలి అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్న  నెహ్రూ కోరుకున్న విధంగా, ఆయన కుమార్తె  ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కుని.. నెగ్గారు. చరిత్రను సృష్టించారు.

అవిశ్వాస తీర్మానం ఫలితం తెలిసిందే ... అయినా ఆసక్తి

మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టి, ఐదు రోజులుగా సభా కార్యక్రమాలను స్తంబింప చేసిన విపక్ష కూటమి, ఐఎన్డీఐఎ (ఇండియా), ఆఖరి అస్త్రాన్ని సంధించింది. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు  అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌‌ ఇచ్చిన  నో కాన్ఫిడెన్స్   నోటీసును స్పీకర్ ఆమోదించారు. అన్ని పార్టీలతో చర్చించి అవిశ్వాస తీర్మానం పై చర్చకు తేదీని ఖరారు చేస్తారు. అయితే, పార్టీల సంఖ్యా బలాలను  బట్టి చూస్తే  కాంగ్రెస్ పార్టీ  ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  లోక్ సభలో ఎన్డీఎకు 332 మంది సభ్యుల బలముంది. ఎన్డీఎ సఖ్యా బలంలో సగం సంఖ్యా బలం అయినా లేని ఐఎన్డీఐఎ కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనేది అందరికీ తెలిసిన నిజం. మరో వంక 22 మంది సభ్యులున్న వైసీపీ ఇప్పటికే, ఎన్డీఎకు మద్దతు ప్రకటించింది. అందుకే అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనే విషయం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా, కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కూడా తెలుసు. నిజానికి, ఇండియాగా పిలుచుకుంటున్న విపక్ష ఐఎన్డీఐఎ కూటమిలో 26 పార్టీలు ఉన్నా, కూటమి ఎంపీల సంఖ్య 140 దాటదు. సో ... కాంగ్రెస్ ఎంపీ  గౌరవ్‌ గొగొయ్‌‌ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. ఈ విషయం కాంగ్రెస్ సహా కూటమి నేతలు అందరికీ తెలిసిందే అయినా, అవిశ్వాస తీర్మానం ద్వారా  మణిపూర్ హింసాకాండతో పాటుగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ఉద్దేశంతోనే  కాంగ్రెస్ పార్టీ  అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.  అదలా ఉంటే, కాంగ్రెస్ సభ్యుడు గోగోయ్ నోటీసు ఇచ్చేందే తడవుగా స్పీకర్ ఆమోదం తెలపడంలో మతలబు ఏమిటనే ప్రశ్న ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిస్తోంది. విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఆలోచన చేస్తున్నాయని తెలిసిన వెంటనే, బీజేపీ కోర్  కమిటీ సమావేశమై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే అనుసరించవలసిన వ్యూహం పై క్షుణ్ణంగా చర్చిన్నట్లు తెలుస్తోంది. అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాతనే విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే, ఏమి చేయాలనే విషయంలో ప్రభుత్వం, అధికార కూటమి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, కాంగ్రెస్ సభ్యుడు నోటీసు ఇచ్చిందే తడవుగా స్పీకర్  ఆమోదం తెలిపారని అంటున్నారు.  మణిపుర్  సహా ఈశాన్య భారతంలో పరిస్థితుల పూర్వపరాలను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన హింసాత్మక సంఘటలను సవివరంగా దేశం ముందుంచడంతో పాటుగా  విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలలో జరుగతున్న పరిణామాలను ఎండగట్టి తద్వారా విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలను ఇరకాటంలోకి నెట్టే వ్యూహంతోనే బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తోందనే విశ్లేషణలు  వినిపిస్తున్నాయి.  మరో వంక విపక్ష కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుందని, తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని యోచిస్తోంది. అందుకే, ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే 2019 ఎన్నికలకు ముందు  2018లో యూపీఏ కూటమి మద్దతుతో ఏపీకి నిధుల విషయంలో టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఎన్డీఎకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో మోదీ ప్రభుత్వం సంఖ్యాబలాన్ని చాటుకుంది.  ఇప్పడు మళ్ళీ మరో మారు ఎన్నికలకు సంవత్సరం ముందు మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం యాదృచ్చికమే అయినా  ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ముఖ్యంగా, అవిశ్వాస తీర్మానం పై చర్చలో ఎవరిది పైచేయి అవుతుంది అనేది మరింత ఆసక్తి రేకిస్తోంది. అలాగే విపక్ష కూటమికి ఇది మరో పరీక్ష కానుందనే అభిప్రాయం కుడా రాజకీయ వరగాల్లో వినవస్తోంది. మరో వంక   ఇదే అంశంపై విపక్ష కూటమిలో లేని బీఆర్ఎస్  ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. అంతే కాదు, కాంగ్రెస్ తీర్మానానికి తమ మద్దతు లేదని కూడా ప్రకటించారు. రాష్ట్రపతి, ఉప రాష్టపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపిన బీఆర్ఎస్  అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కు దూరంగా ఉన్నట్లు చెప్పుకునేందుకు... ప్రత్యేకంగా నోటీసు ఇచ్చింది అంటున్నారు. ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం అవుట్ కం ఏమిటనేది క్లిస్టర్  క్లియర్’గా అద్దంలో ప్రతిబింబంలా స్పష్టంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, దాన్ని ప్రభుత్వం ఆమోదించి, చర్చకు సై  అనడం దేశంలో రాజకీయ వేడిని, ఆసక్తిని రేకెత్తిస్తోందని  చెప్పవచ్చును.

వివేకా హత్య కేసుతో సజ్జలకేం పని

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుంది? శిక్ష ఎవరికి పడుతుంది? ఎప్పటికి తీర్పు వస్తుంది? అన్న విషయాలను పక్కన పెడితే.. సీబీఐ దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్.. అందులోని అంశాలు, సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రభుత్వం, పోలీసుల అండతో అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కర్నాలులో సృష్టించిన అరాచకం వీటన్నిటినీ బట్టి హత్య ఎందుకు జరిగిది? ఎలా జరిగింది? దీని వెనుక ఉన్నది ఎవరు అన్న విషయంలో ప్రజలకు సందేహాలకు అతీతంగా ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని పరిశీలకులు విశ్లేషించి మరీ చెబుతున్నారు. సీబీఐ చార్జిషీట్ తో వెలుగులోకి వచ్చిన అంశాల అనంతరం సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ కుమార్ దర్యాప్తును సమీక్షించాలంటూ అవినాష్ రెడ్డి లేఖ.. వివేకా హత్య వల్ల నష్టపోయినది జగనేనంటూ సజ్జల పెట్టిన ప్రెస్ మీట్ పై దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందంటూ నెటిజన్ లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అన్నిటికీ మించి ఏపీ సీఎం సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగు చూసిన తరువాత వివేకా హత్య కు మోటివ్ ఏమిటన్న విషయంలోనూ సందేహాలకు తావులేకుండా పోయిందని అంటున్నారు.  ఇంతకీ వివేకా హత్య కేసు విషయంలో డాక్టర్ సునీత సీబీఐకు ఏం చెప్పారంటే.. తన తండ్రి హత్య విషయంలోతాను మీడియాతో ఏం మాట్లాడాలన్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించాలని వైఎస్ జగన్ సతీమణి భారతి తనకు చెప్పారనీ, అది తనకు కొంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ అంగీకరించాననీ, సజ్జల ప్రెస్ మీట్ లో జగన్ తో పాటు అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించాలని సలహా ఇవ్వడంతో తనకు అనుమానం వచ్చిందనీ సునీత పేర్కొన్నారు.  సునీత, సజ్జల స్వయంగా తన ఇంటికి వచ్చి మరీ ఈ విషయం చెప్పారని సునీత పేర్కొన్నారు. ఆ తరువాత సజ్జల  ఈ అంశానికి ముగింపు పడేలా  ప్రెస్‌మీట్ పెట్టాలని దాని తరువాత ఈ అంశంపై మరింత చర్చ జరగే అవకాశం ఉండకూదని సూచించారని సునీత వివరించారు.  2019లో జరిగిన ఈ విషయాలన్నీ సునీత వాంగ్మూలంలో ఉన్నాయి. ఇవి సీబీఐ కోర్టుకు సమర్పించడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చా యి. అలా బయటకు రాగానే జగన్ కోటరీలో కంగారు మొదలైంది. యథా ప్రకారం ప్రభుత్వ సలహాదారు, సకల శాఖల మంత్రి మీడియా ముందుకు వచ్చి.. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కు ఉన్న ఇంగితం కూడా సీబీఐకి లేకుండా పోయిందంటూ.. తన దైన స్టైల్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ వివేకా హత్యకేసును ఎలా దర్యాప్తు చేసి ఉండాల్సిందో చెప్పుకొచ్చేశారు. వైసీపీ అధినేత జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా ఆయన పార్టీ నేతలంతా తెలుగుదేశం అధినేత జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని తరచూ విమర్శలు గుప్పిస్తారు.. అయితే వివేకా హత్య కేసులో దర్యాప్తును అడ్డుకునేలా.. జగన్ అండ్ కో  వ్యవహరించిన తీరు ఆ దర్యాప్తు సంస్థపై ఎంత తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిందో.. అందరూ ప్రత్యక్షంగా  చూశారని పరిశీలకులు సోదాహరణగా విమర్శిస్తున్నారు. కడప జిల్లాలో దర్యాప్తు  అధికారుల కదలికలను సైతం వివేకా హత్య కేసు నిందితులు ప్రభుత్వం, పోలీసుల అండతో ఎలా నియంత్రించారో అందరికీ తెలిసిందే. దీంతో ఏపీలో కేసు దర్యాప్తు  తీరు సరిగ్గా సాగే అవకాశాలు లేవంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ తెలంగాణకు మార్పించారు. ఏపీలో దర్యాప్తు ముందుకు సాగదన్న సునీత వాదనను సీబీఐ కూడా సుప్రీంలో సమర్ధించింది. ఇక కేసు తెలంగాణకు మారిన తరువాత దర్యాప్తులో పురోగతి సాధించినప్పటికీ.. దర్యాప్తు అధికారిపై వరుస ఆరోపణలతో హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారి మారడం వెనుక అవినాష్ ప్రభృతుల ఒత్తిడి ఉందన్న వాదన చాలా చాలా బలంగా వినిపించింది. సరే మొత్తం మీద  అవినాష్ రెడ్డి ఇంత వరకూ అరెస్టు కాకుండా ఉండటం వెనుక మేనేజింగ్ స్కిల్స్ పాత్ర ఉందన్నది విశ్లేషకుల మాట. పదే పదే కోర్టులను ఆశ్రయించడం, దర్యాప్తు సంస్థలపైనా, వివేకాహత్య కేసులో బాధితులపైనా పదే పదే ఆరోపణలు చేయడం ద్వారా వ్యవస్థలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా దర్యాప్తును ఏళ్లబడి సాగదీయగలగారని అంటున్నారు.   ఇన్ని చేసినా సీబీఐ చార్జిషీట్ లో విషయాలు బయటకు రావడంతో ఇప్పుడు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రంగంలోకి దిగారు.. నాలుగేళ్ల కిందట తాను భారతికి ఫోన్ చేసిన మాట్లాడిన దాన్ని పట్టుకుని  కొత్త కథ అల్లుతున్నారని చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు.  అంతే కాకుండా వివేకా హత్యకు గురికావడం వల్ల నష్టపోయినది జగనే అని చెప్పడానికి శతధా ప్రయత్నించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో నారాసుర రక్త చరిత్ర అంటూ ఊరూవాడా ఏకం చేసిన సంగతిని విస్మరించి.. ఈ నాలుగేళ్లలో వివేకా హత్యకు కారణాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తదితరులు ఎన్ని అంశాలను తెరమీదకు తెచ్చారో తెలిసిందేననీ, ఇప్పుడు సజ్జల మీడియా ముందుకు వచ్చి.. వివేకా హత్య వల్ల నష్టపోయింది జగనేనంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.   సజ్జల అయినా.. అవినాష్ రెడ్డి అయినా  ఏదైనా చెప్పుకోదలచుకుంటే  కోర్టుకు చెప్పుకోవచ్చు. కానీ కోర్టుల ఎదుట చెప్పుకునే అవకాశాన్ని కాదనుకుని మరీ  మీడియా ముందుకు ఎదుకు వస్తున్నారని న్యాయనిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇంతా చేసి సునీత వాంగ్మూలం బయటకు వచ్చిన తరువాత సజ్జల గంట సేపు   ప్రెస్ మీట్ లో  చెప్పినదేమిటంటే.. వివేకా గౌరవాన్ని.. పరువు ప్రతిష్టలను కాపాడటానికి తాము ప్రయత్నిస్తున్నామని మాత్రమే. సునీత దంపతులే హంతకులనీ,  వివేకా స్త్రీలోలుడనీ  నిందలేస్తూ  ఇంత కాలం ప్రచారం చేసిందెవరో జనం అప్పుడే మరిచిపోయి ఉంటారని సజ్జల ఎలా భావించారన్న ఆశ్చర్యం అందరిలో వ్యక్తం అవుతోంది.  సామాజిక మాధ్యమంలో అయితే సజ్జల ప్రెస్ మీట్ ప్రసంగంపై ఓ రేంజ్ లో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసులో నిందితులెవరన్నది  ఇప్పుడు రహస్యం కాదనీ, కేవలం కోర్టులు శిక్ష విధించడమే మిగిలిందని నెటిజన్లు అంటున్నారు. 

సిట్టింగులలో సీనియర్లకు నో అసెంబ్లీ టికెట్!.. జగన్ యోచన?

 ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ   తమ పార్టీలో ఏం జరుగుతున్నది? రానున్న ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందన్న క్లారిటీ పార్టీ నేతలకు, శ్రేణులకు ఇచ్చేశారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని కూడా కుండబద్దలు కొట్టేశారు. ఎమ్మెల్యేలతో పాటు మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ల విషయంపై కూడా ఫోకస్ పెట్టారు.  గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ  22 మంది ఎంపీలు విజ‌యం  సాధించగా, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రెబల్ గా మారారు. ఇక వైసీపీకి ఇప్పుడున్న 21 మందిలో నలుగురు ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎంపీగా పోటీ చేయ‌లేమ‌ని, అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా అధిష్టానానికి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో అనకాపల్లి ఎంపీ బీశెట్టి స‌త్య‌వ‌తి, అరకు ఎంపీ గొట్టేటి మాధ‌వి, విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. దీనికి వైసీపీ నుండి ఎలాంటి స్పందనా రాకపోవడంతో  వారు చాలా కాలంగా ఈ నలుగురు పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాలలో వైసీపీ కొత్త వారి  కోసం వేట మొదలు పెట్టింది. మరో నలుగురు ఎంపీలను   ఈసారి అసెంబ్లీకి పంపాలని  జగన్ స్వయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అలాంటి వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉన్నారు. మొత్తంగా ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులను దించాల్సి ఉండగా.. మరో ముగ్గురు ఎంపీలు వారి మూడు స్థానాలలో ఓటమి చూడడం ఖరారని నివేదికలు రావడంతో వారిని కూడా మార్చాలని జగన్ భావిస్తున్నారు.  అంటే మొత్తంగా 21 మందిలో పది మంది పాత వారికి మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వనుండగా 11 మంది   స్థానాలలో కొత్త వారిని దించనున్నారు.  కాగా, ఈసారి వైసీపీ సీనియర్ నేతలను పార్లమెంట్ కు బరిలో దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్రాలో విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లి లేదా విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు, కాకినాడ లోక్ సభ స్థానం నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఏలూరు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, నెల్లూరు నుంచి  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లను లోక్ సభ కు పంపాలని జగన్ భావిస్తున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇప్పటికే ఆయా నాయకులకు  పార్టీ నుండి ఆదేశాలు కూడా వెళ్లాయంటున్నారు.  కాగా, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ నుంచి, హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ని కర్నూల్ జిల్లాలో ఆయన సామాజికవర్గం అధికంగా ఉన్న సీటు నుంచి ఎమ్మెల్యేగా, విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని ఎచ్చర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు కసరత్తులు మొదలు పెట్టగా.. ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని ఆలోచన చేస్తున్న మిగతా ఎంపీల అసంతృప్తిని ఎలా చల్లార్చాలా అని మల్లగుల్లాలు పడుతున్నారంటున్నారు. జగన్ నిర్ణయం రుచించని వారు రెబల్స్ గా మారుతారన్న ఆందోళన కూడా పార్టీలో వ్యక్తమౌతోందంటున్నారు. 

రాములమ్మ బిజెపికి గుడ్ బై?

బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను పార్టీని వీడేది లేదని  గతంలో స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలపై  ఆమె స్పందిస్తున్నారు.  బిజెపి ప్రభుత్వాన్ని  ఇరకాటంలో పెట్టే ట్వీట్స్ఈ మధ్య కాలంలో ఎక్కువగా  చేస్తున్నారు. కానీ విజయశాంతి  బీజేపీలోనే ఉంటానని చెబుతున్నారు. తాజాగా మణిపూర్ హింసపై విజయశాంతి స్పందించారు. విజయ శాంతి పెట్టే ట్వీట్ మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రతి పక్ష కూటమి ఇండియా లోక సభలో అవిశ్వాస తీర్మానం పెట్టే నేపథ్యంలో విజయశాంతి ట్వీట్ కలకలం రేపింది. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సోషల్ మీడియా  విజయశాంతి ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాములమ్మకు చాలా రోజుల తర్వాత మణిపూర్ అంశం గుర్తుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మణిపూర్ అంశంపై సోషల్ మీడియాలో స్పందించారు. మణిపూర్‌లో చాలా రోజులుగా ఘోరాలు జరుగుతున్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందించలేదు అని విజయశాంతి బాహాటంగానే  స్పందించారు. దీంతో ఆమె ఆ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశ్యం తన అసంతృప్తి అని వేరే చెప్పనక్కర్లేదు.  బీజేపీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం  చేస్తున్నాయి.  ఇటీవల బీజేపీలో రాములమ్మ మాటే వినిపించడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి పదవులు వస్తున్నాయి. అయినా రాములమ్మకు ఓ పదవి ఇద్దామని అధిష్టానం కూడా అనుకోవడం లేదు. సమావేశాలకూ పిలవడం లేదు. దీంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఇటీవల కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పటికీ అక్కడ ఎక్కువ సమయం వెచ్చించలేదు. వెంటనే వచ్చేశారు. ఎందుకంటేఅక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడన్నసాకు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేతే అన్న విషయం ఆమె మర్చిపోయారు.  సొంత పార్టీ నేతలు విస్మయానికి గురయ్యేలా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేటప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిలో ఉండేవారు. బీజేపీలో చేరాక అసలు ఆమె పదవి ఏంటో ఎవరికీ తెలియడం లేదు. సినీ గ్లామర్ తప్పితే పొలిటికల్ గ్లామర్ విజయశాంతికి లేదనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బిజెపి టిక్కెట్ ఆమెకు దొరకడంం కష్టమే.