తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం(సెప్టెంబర్ 18)  శ్రీవారిని 62వేల 745 మంది దర్శించుకున్నారు. వారిలో 24వేల 451 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల పది లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (సెప్టెంంబర్ 19) శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇలా ఉండగా  ఏపీ సీఎం జగన్ మంగళవారం (సెప్టెంబర్ 19) తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు, అర్చకును సంప్రదాయబద్ధంగా మంగళవాద్యాలు, వేద మంత్రాల నడుమ ఇస్తికాపాల్ స్వాగతం పలికి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు.   శ్రీవారి దర్శనం అనంతరం జగన్ కు రంగనాయకుల మండపం వద్ద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. తరువాత టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జగన్ కు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు.  ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు జగన్ వెంట ఉన్నారు.  

డామిట్ కథ అడ్డం తిరగింది! ఆందోళనలో వైసేపీ నేతలు

ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జరగని అవినీతిని జరిగినట్లు చూపిస్తూ, , వైసీపీ ప్రభుత్వం  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని  అక్రమంగా అరెస్ట్ చేసింది. గత వారం రోజులగా కేసు పూర్వాపరాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది.  అందుకే  అనకాపల్లి నుంచి అమెరికా వరకు చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే, వైసీపీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఎటూ మళ్ళీ గెలిచేది లేదని నిర్ణయానికి వచ్చిన కొందరు మంత్రులు, మరి కొంత మంది నాయకులు మినహా, మిగిలిన నాయకులు, శ్రేణులు లోలోపల కుతకుతలాడి పోతున్నారని అంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు అయితే మరింతగా  కలవర పడుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి, ముఖ్యమంత్రి జగన్ పెద్ద తప్పు చేసారని,ఆయన నిర్ణయం పిలిచి మరీ తన్నించు కున్నట్లు ఉందని అంటున్నారు.    అంతే కాదు,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కష్టాలను కొని తెచ్చుకున్నారా? చంద్రబాబు అరెస్ట్  విషయంలో జగన్ రెడ్డి లెక్క తప్పిందా? అంటే అవుననే అంటున్నారు  వైసీపే నాయకులు, అభిమానులు. చంద్రబాబును జైలుకు పంపిస్తే తమకు ఎదురుండదని, తద్వారా రేపటి ఎన్నికల్లో తమకు తిరుగుందందని జగన్ రెడ్డి ఉహించారు. అయితే, ఆయన  రచించిన, వ్యూహం బెడిసి కొట్టింది. స్వయంగా జగన్  రెడ్డే ఇప్పడు   డామిట్ ..కథ అద్దం తిరిగిందని, తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు అరెస్ట్తో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో, ఒక్క ఛాన్స్   వ్యూహంతో వైసీపీని గెలిపించిన, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ సైతం, చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ రెడ్డిని   తప్పు చేస్తున్నావ్  జగన్ అని హెచ్చరించిట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  చంద్రబాబు  రిమాండ్  కొనసాగినా, ఆయన జైల్లోనే ఉన్నా  తెలుగు దేశం పార్టీదే గెలుపని తాజా సర్వేలు సూచిస్తున్నాయని అంటున్నారు.  మరో వంక  చంద్రబాబు అక్రమ అరెస్ట్  ని వ్యతిరేకిస్తూ వేర్వేరు రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు.తెలుగు సినిమా రంగ ప్రముఖులే కాకుండా, తమిళ సినిమా రంగ ప్రముఖులు సైతం చంద్రబాబుకు అండగా నిలిచేందుకు ముందు కొస్తున్నారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, ఓపెన్ గా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడమే కాకుండా,  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్ర బాబును పరామర్శించేందుకు రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును పరామర్శించేందుకు రజనీ కాంత్ వస్తున్నారని ప్రచారం జరిగింది. నిజానికి అది ప్రచారం కాదు, నిజం. అదే విషయాన్ని రజనీకాంట్ స్వయంగా  చెప్పారు. కుటుంబ  సభ్యులతో కలిసి కోయంబత్తూరు వచ్చిన రజనీకాంత్ ను ఈ విషయమై మీడియా ప్రశ్నించింది. అందుకు.. రజనీకాంత్,  అవును  చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఈ రోజు (ఆదివారం) వెళ్లాలనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదు  అని చెప్పారు. అంటే  ప్రస్తుతానికి స్వయంగా ఆయన వచ్చినా, రాకున్నా చంద్రబాబుకు ఆయన సంపూర్ణ మద్దతు ఉండనే విషయం మరో మారు స్పష్టమైంది. దీంతో  నెల్లూరు, చిత్తూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజనీ ఫాన్స్   చంద్రబాబు కు మద్దతు తెలుపుతున్నారు.  నిజానికి,చంద్రబాబు అరెస్ట్ జరిగిన వెంటనే రజనీకాంత్ ఫోన్ చేసి నారాలోకేష్ ను పరామర్శించారు. నిజానికి, ఒక్క రజనీకాంత్ మాత్రమే కాదు  ఇంకా చాల మంది తెలుగు  తమిళ సినిమా ప్రముఖులు, చంద్రబాబు అరెస్టును తప్పు పడుతున్నారు. అయితే, తొందరపడకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని  అనేక మంది సినిమా ప్రముఖులు  ఎదురు చూస్తున్నారు.దీంతో, ముందు ముందు, మరిన్ని కష్టాలు తప్పవని వైసేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోదీజీ మాట్లాడరేం?

విషయం, సందర్భం వేరు కావచ్చు, కానీ, సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు,  ఆంధ్ర ప్రదేశ్లో ఏమి జరుగుతోందో మాకు తెలుసు అంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన , సాగుతున్న కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులకు అద్దం పడుతున్నాయి. అవును, ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీకోర్టు న్యాయమూర్తులు ఏపీలో ఏం జరుగుతోందో మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.   అంటే, ఏపీలో ఏమి జరుగుతోందో సుప్రీం కోర్టులు తెలుసు. అయినా  నాలుగున్నరేళ్ళ వైసీపీ అరాచక పాలనకు పరాకాష్టగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వ్యవహరం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం గీత దాటి ప్రవర్తిస్తున్నప్పుడు  కేంద్ర ప్రభుత్వం  జోక్యం చేసుకోవలసిన అవసరం లేదా? చంద్రబాబు అక్రమ అరెస్టు  విషయంలో, ముఖ్యంగా అరెస్ట్ తీరును, ఉభయ తెలుగు రాష్ర్టాల బీజేపీ  నాయకులు సహా పలువురు రాజకీయేతర రంగాల   ప్రముఖులు, ఖండించారు. ఖండిస్తున్నారు. కేవలం ఖండించడమే కాకుండా, దేశ,విదేశాల్లో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా యువత, ఐటీ ఉద్యోగులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు. ఎందుకు కళ్ళు తెరవదు? ఇది రాష్ట్ర ప్రజానీకాన్ని వేధిస్తున్న ప్రశ్న. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు ...  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా తెలుగు దేశం ముఖ్య నేతలు అందరినీ అరెస్ట్ చేస్తామని మంత్రులు బహిరంగంగానే బెదిరింపులకు దిగడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా   కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదని  నిలదీస్తున్నారు. మధన పడుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు అందరి వేదనకు అద్దం పడుతూ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. మీకు తెలియకుండానే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో..  మీరు జీ20 శిఖరాగ్ర సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా.. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది  అని కేఎస్ రామారావు పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. కానీ  రాష్ట్ర పౌరుడిగా, భారత పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక  భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు ప్రధాని హోదాలో మీరూ వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు విజన్ ను పొగిడారు. అమరావతి ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజధాని అవుతుందని అన్నారని కేఎస్ రామారావు ఆ లేఖలో గుర్తు చేశారు.   ఆ తర్వాత 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక మోసాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా  ప్రజావేదిక కూల్చివేతతో   విధ్వంసక పాలన ఆరంభించారు,  అమరావతిని రాజధానిగా ఉండనివ్వకూడదని ప్రకటించి.. మూడు రాజధానులంటూ ఒక పల్లవి ఎత్తుకుని.. అమరావతిని నిర్వీర్యం చేసేశారు. ప్రధానిగా మీరు  (మోడీ) శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో జగన్ తీరును మీరు ఇప్పటికీ ఖండించలేదు.  మౌనాన్ని ఆశ్రయించారు. అలాగే దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త కుదిపేసింది. రోడ్ల మీదకు వచ్చి వారు తెలిపిన నిరసనను.. ప్రధానమంత్రిగా మీరు గమనించలేదా అని ప్రశ్నించారు. నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీ రామారావు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన కృషి ఏమిటో మీకు తెలియదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే.. తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న బడబాగ్నిని మీరెందుకు గమనించలేకపోతున్నారు. లేక రాజకీయ లబ్ధి వినా ప్రధానిగా మీరింకే విషయాన్నీ పట్టించుకోరా అని నిలదీశారు.  ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి అని కేఎస్ రామారావు తన లేఖలో  ప్రధానిని కోరారు. అంతేగాక, ప్రధానమంత్రిగా మీకున్న అధికారంతో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించండి. ఆ చర్యతో తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. తక్షణం స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అని తన లేఖలో ప్రధాని మోడీని కేఎస్ రామారావు కోరారు.   నిజానికి, సినీ నిర్మాత కేఎస్ రామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై ఆయన సంతకం ఒక్కటే ఉన్నా ..  అది ఐదు కోట్ల ఆంధ్రుల సంతకమేనని చెప్పాలి. ఐదు కోట్ల ఆంధ్రుల హృదయస్పందనకు కేఎస్ రామారావు లేఖను దర్పణంగా చూడాలి. నిజానికి కేఎస్ రామారావు సంతకం చేసిన లేఖ ఆంధ్రులు, ఇరుగు పొరుగు రాష్ట్రాల తెలుగు వారిదే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి  హస్తాక్షరి ... ఆ ఒక్క సంతకం.  అందుకే  ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో  జోక్యం చేసుకోవలసిన అవసరం వుంది , ప్రాజస్వామ్యం మరింత పలచనై, ప్రజల విశ్వాసాన్ని మరింతగా కోల్పోతుందని, ప్రజస్వామ్య పరిరక్షణ వేదికలు హెచ్చరిస్తున్నాయి. 

చంద్రబాబు అక్రమ అరెస్టు.. తెలుగుదేశంకు సంక్షోభంలోనూ సానుకూలం!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య అంటే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పేద విద్యార్థులలో  నైపుణ్యం పెంపుకోసం చేపట్టిన ప్రాజెక్టులో తప్పులు వెతికి.. తీవ్రమైన సెక్షన్లను ఆపాదించి చంద్రబాబును అరెస్ట్ చేయడంపై సామాన్య జనం కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేధావుల నుండి విశ్లేషకుల వరకూ.. మాజీ అధికారుల నుండి మాజీ న్యాయమూర్తుల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుని విడుదల చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, బెంగళూర్ల, చెన్నై... ఇలా దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడెక్కి నిరసనలు తెలుపుతున్నారు.  అమెరికాలోని ప్రధాన నగరాలలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ తెలుగు వారు నిరసనలు తెలుపుతున్నారంటే చంద్రబాబుకు మద్దతు ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.  అయితే, చంద్రబాబు జైలు నుండి బయటకి వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు?  హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఏ విధంగా ఉంటుంది?   భవిష్యత్ పరిణామాలేంటి? చంద్రబాబు మరి కొంత కాలం జైలులోనే ఉండాల్సి వస్తే.. తెలుగుదేశంను ముందుకు నడిపించేది ఎవరు? ఇలా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది  ఈ పరిస్థితిని   ఒక సంక్షోభంగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మరికొందరైతే ఇది తెలుగుదేశం పార్టీకి సంక్షోభంలోనూ సానుకూలమేనని భావించాలంటున్నారు. ఎటూ ఇది అక్రమ అరెస్టు అనేది ప్రజలలోకి బలంగా వెళ్లిందనీ, తెలుగుదేశంకు, చంద్రబాబుకు ప్రజా మద్దతు దండిగా ఉందని, నాలుగేళ్ళ జగన్ కక్షపూరిత పాలన, వైసీపీ నేతల వ్యాఖ్యలు విన్న ప్రజలు ఇది కూడా జగన్ సర్కార్ కక్షపూరితంగా, అక్రమంగా వ్యవహరిస్తున్నదని బలంగా నమ్ముతున్నారు. అన్ని వైపుల నుంచీ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా, చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కనుక ఇది టీడీపీకి అనుకూల అంశమని వాదిస్తున్నారు.   భారీ సంక్షోభాలను చూసిన చంద్రబాబుకు ఈ కేసులు పెద్ద లెక్కేమీ కాదు. కేంద్రంలో చక్రం తిప్పి దేశాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆ నాయకుడు ఇప్పుడు ఈ అక్రమ కేసులకు ఉలిక్కిపడతారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో వైసీపీకి తీరని డ్యామేజీ జరిగింది. ఇంకా ఇంకా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి   అమెరికా వరకూ ఎక్కడ చూసినా చంద్రబాబు అక్రమ అరెస్టుపైనే చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టే ప్రధాన వార్తగా హైలైట్ చేస్తున్నది.  జగన్ మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు జాతీయ మీడియాకు బాగా తెలిసిన పొలిటీషియన్. దీంతో జాతీయస్థాయి మీడియా ఏపీ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఢిల్లీకి వెళ్లి అక్రమ అరెస్టును చర్చకు పెట్టారు. నేషనల్ మీడియా ఛానెళ్లలో కూర్చొని సీఎం జగన్ మోహన్ రెడ్డికి లైవ్ లో సవాళ్లు విసురుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నేతల నుండి కూడా చంద్రబాబుకు భారీ మద్దతు లభిస్తుంది.  ఏపీలో తెలుగుదేశం, జనసేన క్యాడర్ కలిసి సమష్టిగా  నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అమెరికాలో చేపట్టిన నిరసనలలో కూడా జనసేన మద్దతు దారులు కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలనే కాదు   సామాన్య జనాన్ని కూడా కదిలించింది. జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి.. పోలీసు నిర్బంధాలను కూడా లేక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు. ఇక రేపు చంద్రబాబు స్వచ్ఛంగా పులు కడిగిన ముత్యంలా బయటకు రాగానే  తెలుగుదేశం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఒక రోజు అటూ ఇటూగా చంద్రబాబుకు ఈ కేసులు బెయిలు రావడం తథ్యమని, ఆయనపై వైసీపీ అక్రమంగా బనాయించిన ఈ కేసు నిలవదని న్యాయనిపులు మీడియా చర్చలలో సోదాహరంగా వివరిస్తున్నారు. దీంతో ఎన్నికల ముంగిట జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించడం ద్వారా తన ఓటమిని, తన పతనాన్ని తానే లిఖించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జైళ్ల శాఖ డీఐజీగా బుగ్గన బంధువు.. టార్గెట్ బాబేనా?!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు కేటాయించిన నిధులలో స్కాం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి.. అర్ధరాత్రి అక్రమ అరెస్టుతో ఆయనను జైలుకు పంపింది. చంద్రబాబుపై బనాయించిన కేసులు అక్రమమని.. కనీస ఆధారాలు కూడా లేకుండా ఆయనను అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా.. కనీసం చంద్రబాబును సీఐడీ రిమాండ్ కు కూడా ఇవ్వలేదు. అయితే, చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేసు వివరాలు, నేరం జరిగిందా లేదా అన్నది ఎలా ఉన్నా ఎన్ఎస్జీ జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న వ్యక్తి భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంపై మరింత దృష్టి సారించాలి. కానీ, ఇప్పుడు ప్రభుత్వంపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కక్ష్ పూరితంగానే ఈ కేసు పెట్టారని ఇప్పటికే స్పష్టమైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక్కటే కాదు.. మరో మూడు కేసులు సిద్ధంగా ఉన్నాయని.. చంద్రబాబును జైలుకు పరిమితం చేస్తామని.. ఇక ఆయనను బయటకి రానివ్వమని వైసీపీ నేతలు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు జైల్లో విశ్రాంతి లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయంలో జైలు బ్యారక్స్ వద్ద పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆయనను నిద్రపోనివ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పెళ్లి రోజున ఆయన భార్య భువనేశ్వరిని ములాఖత్ కు అనుమతి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైల్లో ఆయనను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని   తీవ్ర విమర్శలకు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా చంద్రబాబును హింస పెట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా చర్యలకు దిగుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు ఈ అంశంలో మరో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి జైలుకు సూపరిండెంట్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లగా.. ఆయన స్థానంలో జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీగా ఎం.ఆర్.రవికిరణ్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రవికిరణ్ సమీప బంధువు కాగా.. ఇప్పుడు ఆయనకు ఈ రాజమండ్రి జైలు బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు రవి కిరణ్ కడపలో పనిచేయగా.. అదీ కూడా వివేకా హత్య కేసు నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు కడప జైలు బాధ్యతలు చూశారు. ఆ సమయంలో వివేకా హత్యకేసు నిందితులను కోర్టు అనుమతి లేకుండా ఖైదీల్ని బయటకి వదిలి జైలు కాదు గెస్ట్ హౌస్ అనేలా చేశారని విమర్శలున్నాయి. అప్పట్లో ఆయన తీరును సీబీఐ కూడా కోర్టులో తప్పు పట్టింది.  అయితే, ఇప్పటికిప్పుడు ఆయన్ను హఠాత్తుగా కోస్తాంధ్రకు తీసుకురావడం, రాజమండ్రి జైలు సూపరిండెంట్ సుదీర్ఘ సెలవుపై వెళ్లడం.. జైలు బాధ్యతలను రవి కిరణ్ చూసుకోవడం అంతా ప్లాన్ ప్రకారమే చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.   జైల్లో చంద్రబాబును ఏం చేయబోతున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన డీజీపీ రవి కిరణ్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తాను బంధువునేనని.. అంత మాత్రాన తాను ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో బంధుత్వం ఉన్నంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తానన్న ఆలోచన సరికాదని చెప్పుకొచ్చారు. కానీ, వివేకా హత్యకేసు నిందితుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. సీబీఐ కోర్టులోనే ఆయనపై ఆరోపణలు చేయడం రావడం వంటి ఘటనలతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు బలపడుతున్నాయి.   మరి ప్రభుత్వ పెద్దల వ్యూహమేంటో.. ఏ ఉద్దేశంతో జైలు బాధ్యతను రవికిరణ్ కు అప్పగించారో చూడాల్సి ఉంది.

రెండేళ్లుగా నరకం చూపించారు..సీమెన్స్ మాజీ ఎండీ సంచలన వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి విదితమే. ఆయన అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలలోనూ, దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ రాజకీయనాయకులు, మేధావులూ, న్యాయనిపుణులు గొంతెత్తుతున్నారు. చంద్రబాబుకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ప్రభుత్వం కక్షపూరిత చర్యలలో భాగంగానే ఈ అక్రమ కేసులు పెట్టినట్లు అన్ని వైపుల నుండి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఉద్యోగ, ఉపాధి కల్పనలో  యువతకు అవకాశాల కోసం మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం  ఒప్పందం చేసుకుంది. 3 వేల కోట్ల రూపాయల్లో 10 శాతం  ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ పది శాతం సొమ్ము ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది ప్రభుత్వ అభియోగం. దీనిపై సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ సంస్థలో స్కాం జరిగేందుకు అవకాశమే లేదన్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్.. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం తనకు ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని కుండబద్దలు కొట్టారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించిన ఆయన.. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అసలు అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ చేస్తున్న ఆరోపణలకు అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రభుత్వ సంస్థ కాదా అని ప్రశ్నించిన సుమన్ బోస్.. తప్పుడు ఆరోపణలు చేయడం సులువని, నిరూపించడం సాధ్యం కాదన్నారు. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని.. కోర్టులకు అన్ని వివరాలు చెబుతామని ఆయన వెల్లడించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే..  ‘2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చింది. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.. వారిలో ఇప్పుడు చాలామంది మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కూడా మెచ్చుకుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే ఏపీఎస్ఎస్డీసీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపి కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉంది. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని తేల్చేశారు. ప్రభుత్వం మోపిన అవినీతి ఆరోపణల కేసు ఎలా ఉందంటే.. 'విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు.. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ చాలా విజయవంతమైన ప్రాజెక్టు.. 2016లో కేంద్రం విజయవంతమైన నమూనాగా కూడా ప్రకటించింది. ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. ఇప్పుడు కూడా చేస్తున్నాం. కియా మోటర్స్ సంస్థ కోసం మానవ వనరులకు గొప్పగా శిక్షణ ఇవ్వడంపై ఆ సంస్థ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం పలువురి జీవితాలపై ప్రభావం చూపుతుంది. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు. రెండున్నరేళ్లుగా రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో ఏర్పాటు చేసిన   ల్యాబ్‌లు కనిపిస్తున్నా.. అగ్రిమెంట్ జరగలేదని ఆరోపించడం దారుణం. ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇది స్కాంగా కనిపించడం విస్తుగొలుపుతోంది. విస్మయపరుస్తోంది. కోర్టులకు అన్ని వివరాలు చెబుతాం. సీమెన్స్ మాజీ ఎండీ మీడియా ముందుకు వచ్చి చెప్పిన వివరాలతో జగన్ సర్కార్ చంద్రబాబుపై బనాయించిన కేసు పూర్తిగా నిరాధారమైనదని తేటతెల్లమైపోయింది.  చంద్రబాబుపై కక్ష పూరితంగానే, వేధింపు చర్యలలో భాగంగానే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని మేధావులూ, ప్రజలూ చేస్తున్న ఆరోపణలు అక్షర సత్యాలని రుజువైపోయింది. 

అక్రమ కేసులకీ అసెంబ్లీని వాడుకుంటారా?

ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు 21వ తేదీన మొదలైతే ఎన్నిరోజులు జరగాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ అవుతుంది. కాకపోతే, వర్షాకాల సమావేశాలు కాబట్టి సుమారు ఐదారు రోజులు నిర్వహించే అవకాశం ఉందన్నది అంచనా.  మరి ఈ సమావేశాలలో ప్రభుత్వం ఏం ప్రతిపాదనలు చేయనుంది? ఎలాంటి నిర్ణయాలను తీసుకోనుంది? ఏపీ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఏం చెప్పనుంది? ప్రతిపక్ష పార్టీ ఈ సమావేశాలలో పాల్గొంటుందా? పాల్గొంటే ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలనుకుంటుంది? సహజంగానే ఇలాంటి చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. ఇది ఎన్నికల ఏడాది కనుక ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఏ స్థాయి హీట్ పెంచనున్నాయన్న ఉత్కంఠ కూడా నెలకొంది. అధికార పార్టీ ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి తాయిలాలు సిద్ధం చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఏపీలో ఇప్పుడు  మాత్రం పైన చెప్పుకున్న అంశాల కన్నా టీడీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ సెషన్ ను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు పరిశీలకులు విశ్లేషించింది. తమ ప్రభుత్వం అంత చేసింది.. ఇంత చేసింది అని అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పుకుంటూనే చంద్రబాబును ఒక అవినీతి పరుడిగా చిత్రీకరించేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, అస్సైన్డ్ భూములు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలకు ఇచ్చిన రాయతీలు ఇలా అన్నిటిలో తెలుగుదేశం పార్టీని కుట్రదారుగా చూపించాలని.. చంద్రబాబును దోపిడీ దారుగా చూపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నార చెబుతున్నారు. తెలుగుదేశం సభ్యులు  అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాలు తక్కువ గా ఉన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన బాటలో ఉన్న తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ సమావేశాలను పూర్తిగా తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకే వినియోగించుకోవాలని వైసీపీ పన్నాగం పన్నుతున్నదంటున్నారు. నిజానికి అసెంబ్లీ వేదికగా అవినీతి ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు. చంద్రబాబు కేసు కోర్టు మెట్లెక్కేసింది. కాకపోతే ఇంకా ట్రయల్ మొదలు కాలేదు. సీఐడీ కస్టడీకి కోరినా అక్రమ అరెస్టుతో కోర్టు ముందు వివరాలు కావాలని కోరింది. మరోవైపు చంద్రబాబు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా బెయిల్ దరఖాస్తు చేసున్నారు. రెండు చోట్లా కేసుపై విచారణలు మొదలైతే   ఈ కేసు బండారం బయట పడిపోతుంది.  అసలు ఈ కేసు నిలబడుతుందా? అన్న అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ నిలబడితే దర్యాప్తు జరిపి అప్పుడు అవినీతి జరిగిందా? లేదా అన్నది కోర్టు తేలుస్తుంది.   కానీ, జరిగిన,  జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఇందులో కుట్ర ఉందన్నది విశ్లేషకుల వివరిస్తున్నారు. మేధావులు, మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులూ కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, కక్షపూరిత రాజకీయంలో భాగమే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు, చంద్రబాబు అక్రమ అరెస్టు వల్ల ఇప్పటికే వైసీపీకి భారీ నష్టం వాటిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటిది    ప్రభుత్వం  ప్రతిపక్షంపై ఇలా తప్పుడు కేసులు పెట్టి వాటిని తిరిగి అసెంబ్లీలో చర్చ పెట్టి చర్చిస్తామని చెప్పడం.. కోర్టులు కేసును తేల్చక ముందే చట్టసభలలో దోషులుగా ముద్ర వేయాలని ప్రయత్నించడం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఎక్కడైనా కేసులు పెడితే దర్యాప్తు చేసి కోర్టులో పెట్టి శిక్షలు వేస్తారు. దీనికి పక్కా ఆధారాలు కావాలి. కానీ, ఇక్కడ అవే లేకపోవడంతో బట్ట కాల్చి మీద వేయడమే ప్రభుత్వ వ్యవహారశైలిగా భావించాల్సి వస్తున్నదంటున్నారు.   అందుకు అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని ప్రయత్నించడం ప్రభుత్వ దుర్మార్గం వినా మరొకటి కాదని చెబుతున్నారు.  అదే జరిగితే ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన అసెంబ్లీ చివరికి రాజకీయ కక్షల కేసుల కోసం చేసే దుష్ప్రచారానికి వేదిక కావడం ఏపీ ప్రజల దురదృష్టంగానే భావించాలి.

స్కిల్ స్కాంలో ఉన్నది కుంభకోణం కాదు.. జగన్ కక్షకోణమే!

అంతా మీరే చేశారు.. అవును నాన్నా అంతా మీరే చేశారు. బొమ్మరిల్లు సినిమాలో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కాస్త స్ట్రిక్ట్ గా ఉండే నాన్నలను బొమ్మరిల్లు ఫాదర్ అని పిలుచుకొనేంత ఫేమస్ అయ్యిందీ డైలాగ్. ఇదే డైలాగ్ ను కనుక ఏపీ రాజకీయాల కోణంలో చూస్తే అంతా జగనే చేశారని చెప్పుకోవాలి. ఎంతలా అంటే ఇప్పుడు ఏకంగా తన చేతిలో ఉన్న అధికారాన్ని  వెండిపళ్లెంలో పెట్టి మరీ తెలుగుదేశంకు అప్పగించేంతగా అంతా జగనే చేస్తున్నారు. అవును ఇక్కడ చెప్పుకుంటున్నది చంద్రబాబు అరెస్ట్ గురించే. స్కిల్ డెవలప్మెంట్ కేసేంటి.. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన నేరం ఏంటి? అసలు కుంభకోణం జరిగిందా? జరిగితే ఎంత మొత్తంలో ఇది జరిగింది లాంటి అంశాలన్నీ కోర్టులే తేల్చాలి. అయితే  ఇప్పుడు ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు మాత్రం అక్రమమేనని స్పష్టంగా తేలిపోయింది. రిటైర్డ్ అధికారుల నుండి న్యాయమూర్తుల వరకూ అందరూ ముక్తకంఠంతో ఈ అరెస్టును ఖండిస్తున్నారు.  కేసు పరిధి ఏంటి.. స్థాయి ఏంటి.. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి అనే అంశాలు కాస్తా ప్రజలకు తెలిసిన అనంతరం అసలు ఈ కేసు కూడా కుట్ర పూరితమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక వైపేమో అక్రమ అరెస్ట్.. మరోవైపేమో కుట్ర  అనుమానాలతో ఇప్పుడు చంద్రబాబు పట్ల అభిమానం, సానుభూతి గతం కంటే చాలా చాలా ఎక్కువగా  జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలలో ఆయనకి దక్కుతున్న మద్దతు చూస్తున్న ఏపీ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్లుకోకుండా ఉండలేకపోతున్నారు. జగన్ తన చేతులతో టీడీపీలో కదలిక తెచ్చాడని.. ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ అభిమానులందరినీ జగనే ఏకతాటి పైకి వచ్చేలా చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఈ అరెస్టుతో జనసేన-తెలుగుదేశం ఒక్కటయ్యాయి. దీంతో రాష్ట్రంలో రెండు పార్టీల కార్యకర్తల కలయిక ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కలిసి కట్టుగా చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు.  ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ అంశమే వినిపిస్తున్నది. పల్లెల్లో రచ్చ బండల దగ్గర నుండి నగరాల్లో పార్కుల వరకూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సానుభూతి వ్యక్తం అవుతోంది. పేద విద్యార్థులలో నైపుణ్యం పెంచేందుకు చంద్రబాబు సంస్థ ఏర్పాటు చేస్తే అందులో జగన్ తప్పులు వెతికి అరెస్ట్ చేయించాడని.. అది కూడా కనీస ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేయించారన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.  జగన్ తండ్రి అధికారంలో ఉండగా అక్రమ ఆస్తుల విలువతో ఈ కేసును పోలుస్తున్న మరికొందరు.. ఎవరికీ ఉపయోగం లేని సంస్థలను ఏర్పాటు చేసి వేల కోట్లు వెనకేసుకున్న వ్యక్తికి.. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సంస్థలో తప్పులు కనిపించడం పెద్ద వింతేమీ కాదని చర్చించుకుంటున్నారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుపై స్పందించి చంద్రబాబు అడ్డంగా దొరికారని చెప్పినా.. అది  గుడ్డ కాల్చి మోహన వేసే ప్రయత్నం చేయడమే తప్ప మరోటి కాదని జనం భావిస్తున్నారు. ఇదిగో ఆయన చేసిన నేరం ఇదీ అని నాలుగు మాటలు మాట్లాడలేని జగన్ అడ్డగోలుగా చంద్రబాబు తప్పు చేశాడని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ప్రజలకు అర్ధమైపోయింది.   ఒకవైపు రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన రాజకీయాలు.. మరోవైపు దేశవ్యాప్తంగా చంద్రబాబుకు పెరిగిన మద్దతు.. ఈ కేసుపై వైసీపీ నేతలు పదే పదే దోపిడీ గురించి మాట్లాడడం.. చంద్రబాబు కుటుంబం ఆయన కోసం జైలు వద్ద పడిగాపులు కాయడం.. కోర్టుల చుట్టూ తిరగడం అన్నీ టీడీపీకి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   స్కిల్ కేసులో చంద్రబాబు బయటపడినా.. మరో మూడు నాలుగు కేసులు సిద్ధంగా ఉన్నాయని వైసీపీ నేతలు ముందే చెప్పడం చూస్తున్న ప్రజలు.. ఇది కుంభకోణం కాదని కక్ష కోణం అని నిర్ధారణకు వచ్చేశారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఏ మాత్రం పట్టించుకోకుండా.. సీఎం జగన్ తెలుగుదేశం నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఈసారి జగనే తన చేతులతో తానే స్వయంగా తెలుగుదేశానికి అధికారం కట్టబెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

బ్రింగ్ ఇట్ ఆన్.. లోకేష్ చాలెంజ్ కు జగన్ మైండ్ బ్లాక్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఔను.. జాతీయ మీడియాతో  లోకేష్ వరుస భేటీలు జరుపుతున్నారు.  ఇంటర్వ్యూలలో, లైవ్ డిబెట్లతో అదరగొడుతున్నారు. సూటిగా, సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా లోకేష్ మాట్లాడుతున్న తీరు.. ఆర్.టివిఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ తో లైవ్ డిబేట్ లో,  ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరు.. జాతీయ స్థాయిలో ఆయన స్థాయిని పెంచింది.  ఇంత కాలం చంద్రబాబు నాయుడి తనయుడిగా మాత్రమే చూసిన జాతీయ నాయకత్వం ఇప్పుడు ఆయనను పరిణతి చెందిన నేతగా గుర్తించక తప్పదని చెబుతున్నారు. తన యువగళం పాదయాత్ర ద్వారా ఇప్పటికే ఆయన తానేమిటో, తన సమర్ధత, సత్తా ఏమిటో రాష్ట్ర ప్రజలకు చాటారు. రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే నారా లోకేష్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీ ఆయనను టార్గెట్ చేసి ట్రోల్ చేసింది. బాడీ షేమింగ్ చేసింది. ఆయన అలవాట్లను కూడా ఎగతాళి చేసింది. పప్పు అంటూ హేళన చేసింది. అయితే వాటన్నిటినీ అధిగమించి నాడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆయన నాయకత్వ పటిమను ప్రశంసించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ తెలుగుదేశం భవిష్యత్ నేత.. ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన యువనాయకుడు. యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమౌతున్న తీరు మేధావుల నుంచీ సామాన్యల వరకూ అందరి ప్రశంసలూ అందుకుంది.  అదంతా ఒకెత్తయితే.. పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్టు చేసిన నాటి నుంచీ ఆయనలోని నాయకత్వ పటిమను, సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కొని.. వాటిని అధిగమించడమే కాకుండా సానుకూలంగా మార్చుకోవడంలో చూపిన నైపుణ్యం పరిణతిని బయటకు తీసుకువచ్చింది.   ప్రతి విషయంపైనా ఆయనకు ఉన్న సాధికారతను ప్రపంచం కళ్లకు కట్టింది. జాతీయ స్థాయి మీడియా ఆయన ఇంటర్వ్యూల కోసం, ఆయనతో లైవ్ డిబేట్ల కోసం క్యూకట్టేలా చేసింది. తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు హస్తిన చేరుకున్న ఆయన ఇప్పుడు నేషనల్ మీడియాకు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. దీంతో జాతీయ మీడియాలో ఆయనను ఇంటర్వ్యూ చేయకపోతే వెనుకబడిపోతామన్న భావన  వ్యక్తం అవుతోంది. అందుకే ఆర్టీవీ, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మీడియా సంస్థలు ఆయనతో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహించింది.  కేవలం రెండు రోజులలోనే  జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థలన్నీ లోకేష్ తో లైవ్ డిబేట్లు, ఇంటర్వ్యూలూ ప్రసారం చేశాయి.  ఇలా  మీడియా ఇంటర్వ్యూలలో బిజీబిజీగా ఉంటూనే మరో వైపు త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశా నిర్ధేశం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే జాతీయ స్థాయిలో అన్న రాజకీయ పార్టీల మద్దతూ కూడగడుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో  చంద్రబాబుు అక్రమ అరెస్టును ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలూ గళమెత్తేలా  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.  ఇంతటి బిజీ షెడ్యూల్ లోనూ.. ఎక్కడా ఆయన ముఖంలో అలసట అనేదే కనిపించడం లేదు. ఆర్.టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ తో లైవ్ డిబేట్ అంటే మహా మహా సీనియర్ నేతలే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.  తన ప్రశ్నలతో నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసి వారిని ఇబ్బందుల్లోకి నెట్టే లక్ష్యంతోనే ఆయన లైవ్ షోలు ఉంటాయని ప్రతీతి. సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా తన అరుపులు, ప్రశ్నల మీద ప్రశ్నలతో ఎటువంటి నేతనైనా డిఫెన్స్ లో పడేయడం అర్నాబ్ స్టైల్ అని పరిశీలకులు సైతం చెబుతుంటారు. అటువంటి అర్నాబ్ లైవ్ షోలో లోకేష్ ఎక్కడా తడబడకుండా,  ఆర్నాబ్ సంధించిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పిన తీరు  రాజకీయ పరిశీలకులనూ, రాజకీయ పండితులనూ మెప్పించింది.  తండ్రి చంద్రబాబు ను మించిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని పరిశీలకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.    ముఖ్యంగా వైసీపీ నేతలతో చర్చ విషయంపై అర్నాబ్ అడిగిన ప్రశ్నకు లోకేష్ బదులిచ్చిన విధానం ఆయనలోని ఆత్మ విశ్వాసానికీ, తన తండ్రి తప్పు చేయడన్న ధీమాకూ దర్పణం పట్టింది.  అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లు నటించే దద్మమ్మలతో తాను మాట్లాడనన్న లోకేష్.. జగన్ తో డిబేట్ కు సిద్ధమా అన్న అర్నాబ్ ప్రశ్నకు బ్రింగ్ ఇట్ ఆన్ అని ఒక్క ముక్కతో బదులిచ్చారు. నేరుగా జగన్ కే సవాల్ విసిరారు. ఇప్పుడు లోకేష్ అన్న బ్రింగ్ ఇట్ ఆన్ అన్న మాట నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో లోకేష్ తో ఓపెన్ డిబేట్ కు జగన్ సిద్ధమా అంటూ నెటిజన్లు సవాల్ విసురుతున్నారు.  మాట తప్పడం..మడమ తిప్పడం మాత్రమే తెలిసిన జగన్ ఈ సవాల్ ను స్వీకరించే ధైర్యం చేయరని ముక్తాయిస్తున్నారు.  

సైబరాబాద్ సృష్టికర్త అక్రమ అరెస్టును ఖండించవా కేటీఆర్!

ఏపి స్కిల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో స్కాం   ఆరోపణలతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏమో కానీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలతో కదం తొక్కారు..  తొక్కుతున్నారు.  ఇటీవల విప్రో సర్కిల్ వద్ద సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళన చేయడమే కాకుండా.. తమ సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామంటూ క్లియర్ కట్‌గా జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఐ యామ్ విత్  బాబు అంటూ చంద్రబాబుకు మద్దతుగా   ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా   ఆందోళనలు, కార్ల ర్యాలీలు సైతం చేపట్టారు.  అయితే చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్   ఆందోళనలు, ధర్నాలకు దిగడంపై  పోలీసులు గరం గరం అవుతున్నారు. ఆ క్రమంలో సదరు ఈ ఆందోళనల్లో పాల్గొన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతులు లేకుండా ధర్నాలు ఆందోళనలకు దిగితే.. కఠిన చర్యలు తప్పవని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను హెచ్చరించారు.  ఓ వేళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగితే... వారు విధులు నిర్వహిస్తున్న ఆయా కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.   అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ నగరం ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే..   నాడు చంద్రబాబు నాయుడు దార్శనికతతో చేపట్టిన కార్యక్రమాల వల్లేనని వారు  అంటున్నారు. అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఖండిచాలనీ, అది పోయి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై జులుం ఎమిటనీ నిలదీస్తున్నారు.  హైదరాబాద్‌లో ఐటీ అభివృధికి బాటలు వేసింది నారా చంద్రబాబు నాయుడు అంటూ ఇప్పటికే పలు వేదికల మీద నుంచి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  స్వయంగా ప్రకటించిన సంగతిని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక.. తెలంగాణలో ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయిల మార్క్ దాటిందంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో మీడియా సమావేశాలలో చెప్పారనీ, తెలంగాణ ఆ ఘనత  సాధించడానికి   పునాది వేసింది చంద్రబాబేననీ నెటిజన్లు నిర్ద్వంద్వంగా పేర్కొంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిలదీస్తున్న, ఆందోళనలు చేస్తున్న వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలకాలనీ, స్వయంగా కేటీఆర్ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బహిరంగ ప్రకటన చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆందోళనలో  ప్రత్యక్షంగా పాల్గొనాలనీ, తద్వారా హైదరాబాద్ నేటి ఈ స్థితికి కారణమైన చద్రబాబుకు థాంక్స్ చెప్పాలనీ సూచిస్తున్నారు.  అయినా.. హైదరాబాద్ నగరం ట్విన్ సిటీస్ స్థాయి నుంచి ట్రిపుల్ సిటీ స్థాయికి ఎదిగిందంటే.. అదంతా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమని నెటిజన్లు ఈ సందర్బంగా సోదాహరణగా వివరిస్తున్నారు.     అయితే.. తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలకు దిగితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి.. సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు.. గతంలో చంద్రబాబు వల్లే.. ఇక్కడ ఇంత అభివృద్ధి జరిగిందనే ఓ ప్రచారం అయితే ప్రస్తుతం ఊపందుకొందని.. ఆ నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయాలు.. రంగంలోకి దిగి సైబరాబాద్‌లో ఆందోళనలు, ధర్నాలు చేపట్ట వద్దంటూ.. పోలీసు ఉన్నతాధికారులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని.. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేరు ఉద్యోగులు చేపడుతోన్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాబోయ్ చంద్రబాబు.. బీఆర్ఎస్ లో వణుకు!?

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఆందోళనలకు దిగడంతో అధికార బీఆర్ఎస్ కు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం నామమాత్రమేనని అధికార బీఆర్ఎస్ ఇంత కాలం అనుకుంటూ వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం నేతలందరినీ ఏదో రకంగా బీఆర్ఎస్ గూటికి చేర్చుకున్న కేసీఆర్.. తదుపరి లక్ష్యం కాంగ్రెస్ అన్నట్లుగా అడుగులు వేశారు. కర్నాటక  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేంత  వరకూ బీఆర్ఎస్ అధినేత తాను లక్ష్యం సాధించేశాననే భావించారు. ఇక రాష్ట్రంలో  తెలుగుదేశం, కాంగ్రెస్ లు పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తరువాత బీజేపీ టార్గెట్ గా పావులు కదపడం ప్రారంభించారు. బీజేపీ నిర్ణయాలన్నిటికీ బేషరతుగా సమర్ధిస్తూ వచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యం కావాలంటే బీజేపీ బలం పుంజుకోవాలన్నట్లుగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ పనైపోయింది అనుకున్న తరువాత ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని.. కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. అన్నీ ముహూర్తం చూసుకుని చేసే కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ఎంచుకున్న ముహూర్తం బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో తిరుగే లేదనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఉనికి మాత్రంగా ఉందనుకున్న కాంగ్రెస్ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంది. అధికారమే తరువాయి అన్నంతగా చెలరేగిన బీజేపీ ఒక్క సారిగా బలహీనపడిపోయింది. అయినా కూడా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఓట్ల చీలికతో మరోసారి అధికారం తమదే అన్న భావనలో ఉన్న బీఆర్ఎస్ కు ఏపీలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆందోళనలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎలాంటి ఆర్గనైజేషన్ లేకుండా స్వచ్ఛందంగా వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు I am with Babu అంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగడం బీఆర్ఎస్ కు దిగ్ర్భమకు గురి చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం పునాదులు కదలలేదనీ, నాయకులు లేకపోయినా క్యాడర్, జనం తెలుగుదేశంతోనే ఉన్నారనీ బాబుకు మద్దతుగా హైదరాబాద్ లో వెల్లువెత్తిన నిరసనలు నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. నిజమే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని కోల్పోయింది.  తెలంగాణ సెంటిమెంట్ ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమ సమయంలో తెలుగుదేశం అంటే టీడీపీ అంటే ఏపీ పార్టీ అనే ముద్ర పడింది.   తెలంగాణ సెంటిమెంట్’ ను సొంతం చేసుకున్న బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాద్ధాటితో  తెలుగుదేశం ఆంధ్రపార్టీ అనే ముద్ర పడేలా చేయగలిగారు.  అదే సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని  రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట   తెలుగు దేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు పావులు కదిపారు. నేతలు ఒకరొకరుగా బీఆర్ఎస్ గూటికి చేరిపోవడంతో అనుకున్నది సాధిచేశానని భావించారు.  రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి  వచ్చిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చామనే ఊపులో ఉన్న తెరాస (ఇప్పటి బీఆర్ఎస్)ను,ఇచ్చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ దూకుడును ఎదుర్కుని 14.7 శాతం ఓట్లతో  15 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత  టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి కారెక్కారు. గులాబీ గూటికి చేరారు. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు.  2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, 2018లో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐతో కలిసి పోటీచేసింది. అయినా, టీడీపీ రెండు సీట్లు గెలుచుకుంది. అయితే ఓటు షేర్ 15 శాతం నుంచి మూడున్నర శాతానికి పడిపోయింది. అంతే కాదు, టీడీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కి గులాబీ గూటికి కండువా కప్పుకున్నారు.అలాగే, పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్.రమణ సహా దాదాపు సీనియర్ నాయకులంతా బీఆర్ఎస్ పంచన చేరిపోయారు. మిగిలిన వారు బీజేపీలోకి జంపయ్యారు.  అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు, శాశ్వత బాహుబలులు కూడా ఉండరు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.ఎదరు లేదు,తిరుగు లేదనుకున్న పార్టీ, నాయకుడు అనూహ్యంగా బొక్కబోర్లా పడతారు. కానీ, ఒకసారి బొక్కబోర్లా పడినంత మాత్రాన, అంతటితో ఆపార్టీ పనై పోయింది అనుకోవడం అయితే అజ్ఞానం లేదా అహంకారం తప్ప మరొకటి కాదు.   తెలంగాణలో పనైపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ బలంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్  అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్  పెట్టే స్ధాయికి చేరిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  తెలంగాణ సెంటిమెంట్ అండగా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అదే తెలంగాణ సెంటిమెంట్ ను తన చేతులతో తానే తుడిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగామార్చారు.  రాజకీయ పునరేకీకరణ అంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిబ జేఏసీ చైర్మన్ కొదండరామ్  సహా ముఖ్యనేతలు అందరిని  దూరం పెట్టారు.  అదే  సమయంలో  ఉద్యమ సమయంలో    తెలంగాణ ద్రోహులుగా తానే ముద్రవేసిన  తలసాని,  సబితా ఇంద్రారెడ్డి వంటి వారిని  చేర్చుకుని మంత్రి పదవులతో సత్కరించారు. పార్టీని  కుటుంబ పార్టీగా, రాష్ట్రాన్ని కుటుంబ సామ్రాజ్యంగా మార్చేశారు.  అయితే, తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు అన్నట్లుగా, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ ఆకాంక్ష మొదటికే మోసం తీసుకువచ్చింది.  ముఖ్యంగా 2018 అంతగా బలంగా లేని బీజేపీ, 2019 లోక్ సభ ఎన్నికల  నాటికి పుంజుకుందన్నా,   కాంగ్రెస్ పార్టీ  అధికార పార్టీని దీటుగా ఎదుర్కోనేందుకు సన్నద్ధమైందన్నా.. కేసీఆర్ జాతీయ ఆకాంక్షల పేరుతో తెలంగాణ సెంటిమెంటును పక్కన పెట్టేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక సారి రాష్ట్రంలో ఆ సెంటిమెంటు పక్కకు జరిగాక.. తెలుగుదేశం పార్టీకి కూడా రాష్ట్రంలో స్పెస్ పెరిగింది. ఆ విషయం గతంలో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుఏడెనిమిది నెలల కిందట ఖమ్మం సభతో పూరించి శంఖా రావం సక్సెస్ రుజువు చేసింది. కారణాలేమైతేనేం.. తెలుగుదేశం శంఖారావం పేరుతో ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ ఇచ్చిన ఊపును, జోరునూ ఆ తరువాత తెలుగుదేశం కొనసాగించలేదు. మరిన్ని సభలు నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించినా ఆ దిశగా అడుగులు వేయలేదు. దాంతో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరే ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. తెలుగుదేశం పార్టీని పరిశీలకులు కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరులో మూడో సారి తెలంగాణలో విజయం సాధించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని కేసీఆర్ తలపోశారు. కానీ ఏపీలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో నివురుగప్పిన  రాష్ట్రంలో తెలుగుదేశం పునాదులు చెక్కు చెదరలేదన్న సంగతి బయటపడింది. ఇప్పుడు ఇదే కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను భయపెడుతోంది. ఏపీలో అరెస్టుకు వ్యతిరేకంగానే కదా.. ఆందోళనలు అని వదిలేద్దామంటే.. ఐటీ ఉద్యోగులు ఈ  తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కార్ ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధికి పునాదులు వేసింది చంద్రబాబే అని బలంగా  చాటుతున్నారు. దాంతో తెలంగాణలో స్థిరపడిన సెటిలర్కు  మాత్రమే  కాదు.. సామాన్య జనం కూడా  ఇప్పుడు తెలుగుదేశం కేసే చూసే పరిస్థితి ఏర్పడుతుందన్నది బీఆర్ఎస్, కేసీఆర్ భయం. అందుకే ఒకింత నష్టం జరుగుతుందని తెలిసినా.. ఆ ఆందోళనలను పోలీసు బలంతో అణచివేయడానికే నిర్ణయించుకుంది. అలాగే చేస్తోంది కూడా.   అయితే స్వచ్ఛందంగా ప్రారంభమైన ఆందోళనలు అణిచివేస్తే ఆగిపోతాయనుకోవడం భ్రమే అవుతుంది. అయినా తమిళనాడు, బెంగళూరు.. ఇలా ఒక చోటని కాకుండా దేశ వ్యాప్తంగా ఐటీ నిపుణులు రోడ్లపైకి వచ్చి ఐయామ్ విత్ బాబు అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అణచివేతకు ప్రయత్నించిన కొద్దీ  చంద్రబాబుపై సానుభూతి మరింత పెరుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ ప్రభావం కచ్చితంగా ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందనీ, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని స్థానాలలోనూ ఒంటరి పోరుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. కచ్చితంగా తెలుగుదేశం చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధిస్తుందనీ, ఒక వేళ రాష్ట్రంలో హంగ్ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీదే కీలక పాత్ర అవుతుందనీ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా అదే కారణంతో చంద్రబాబుకు మద్దతుగా  జరుగుతున్న ఆందోళనలతో భయ పడుతోంది.

ఎందుకీ మౌనం.. ఏమిటా భయం.. జగన్ తీరుపై వైసీపీలో ఆందోళన

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించడంతో వైసీపీ నేతలు, ముఖ్యంగా  గత ఎన్నికలలో వెయ్యి ఓట్లు అంత కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో తమ ఓటమి ఖాయమని ఖరారు చేసుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. గత ఏన్నికలలో ఇలా వెయ్యి అంతకంటే కొంచం తక్కువ, లేదా ఎక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలు ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఉన్నాయి.   2019లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో  విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాటిలో  42 చోట్ల గెలిచిన అభ్యర్థుల మెజారిటీ వెయ్యి లోపు ఓట్లు మాత్రమే.  విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ కేవలం25 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఉభయ గోదావరిజిల్లాల నుంచి శ్రీకాకుళం,విజయనగరం,కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో  పలు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో స్వల్ప మెజారిటీలతోనే విజయం సాధించారు. ముఖ్యంగా వెయ్యి మెజారిటీ విజేతలలో అత్యధికులకు వచ్చిన మెజారిటీ 500 ఓట్లు మాత్రమే. మిగిలిన వారి మెజారిటీ కూడా 500 నుంచి 1000 ఓట్ల మధ్యనే ఉంది. 2019లో వైసీపీ,జనసేన,టీడీపీ మధ్య ముక్కోణపు పోర జరగడంతో  తెలుగుదేశం, జనసేన మధ్య భారీగా ఓట్లు చీలిపోవడంతో వైసీపీ గట్టెక్కిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించిన సంగతి విదితమే. ఇప్పుడు, టీడీపీ, జనసేన  మధ్య పొత్తు ఖరారు కావడంతో  గతంలోలా ఓట్లు చీలి వైసీపీ లబ్ధి పొందే అవకాశాలు మృగ్యమని రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  ఓట్లు చీలకపోవడం, రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వైసీపీకి గెలుపు ఆశలను దాదాపు దూరం చేసేసినట్లేనని అంటున్నారు.   గతంలోనే పవన్ కల్యాణ్ పొత్తుల ప్రస్తావన చేసిన సందర్భంలో వైసీపీ ఓటమి భయంతో వణికిపోయిందనీ, ప్రత్యర్థి పార్టీల పొత్తును వ్యతిరేకిస్తూ దమ్ముంటే ఒంటరి పోరు అంటూ సవాళ్లు విసిరిందనీ గుర్తు చేస్తున్నారు.  జగన్ వేవ్ అను ఆ పార్టీ చెప్పుకుంటున్న 2019 ఎన్నికలలోనే 42 నియోజకవర్గాలలో స్వల్ప మెజారిటీతో గట్టుక్కిన వైసీపీ.. ఇప్పుడు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో విపక్షాలు కలిసి పోటీ చేస్తుండటంతో. విజయంపై ఆశలు గల్లంతై.. ఒక జనాలను భయభ్రాంతులకు గురి చేసేలా విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగించైనా లబ్ధి పొందే వ్యూహంతో ముందుకు సాగుతున్నదని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే విపక్ష నేత అక్రమ అరెస్టు, సీఐడీ చీఫ్ చంద్రబాబుతో అరెస్టులు ఆగవు.. లోకేష్ సహా మరింత మంది నేతలను అరెస్టు చేస్తామని మీడియా సమావేశాలలోనే చెప్పడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.  జగన్ లో కూడా ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోందనీ, అందుకే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, యావద్దేశంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అన్న వర్గాల వారూ రోడ్లపైకి రావడమే కాకుండా బాబుకు సంఘీభావంగా ఆందోళనలకు దిగుతున్నా.. జగన్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని రాగానే హస్తిన పర్యటనకు బయలుదేరనున్నట్లు ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆయన హస్తినకు వెళ్లలేదు. కేంద్రం పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడమే ఇందుకు కారణమని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హస్తిన వెళ్లి జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తే ఏపీలో జగన్ ప్రభుత్వ అరాచకత్వాన్ని వివరిస్తున్నారు. అలాగే జాతీయ నేతల మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వివిధ పార్టీల నేతలు గళమెత్తేలా వారి మద్దతు కూడగడుతున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రులు కూడా  చంద్రబాబు అక్రమ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (సెప్టెంబర్ 15)న రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ ప్రసంగంలో చంద్రబాబు అరెస్టు, అందుకు నిరసనగా తన ప్రభుత్వంపై  వెల్లువెత్తుతున్న నిరసనలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. తెలుగుదేశం, జనసేన పొత్తుపై కూడా పన్నెత్తు మాట మాట్లాడలేదు.  అసలు ప్రభుత్వ కార్యక్రమానికీ, పార్టీ కార్యక్రమానికీ తేడా లేకుండా చంద్రబాబు, తెలుగుదేశంపై విమర్శలు తప్ప మరో మాట రాని జగన్ నోటి వెంట రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా బహిరంగ సభలో అందుకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాబు అరెస్టు, తదననంతర పరిణామాలతో జగన్ భయపడుతున్నారనీ, ఈ పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించడమే మేలనీ ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా చంద్రబాబు అరెస్టును సమర్ధించుకుంటూ జగన్ ఏమైనా మాట్లాడితే ఆ మాటలు బూమరాంగ్ అవుతాయంటున్నారు. ఏళ్ల తరబడి బెయిలుపై బయటకు తిరుగుతూ, అక్రమాస్తుల కేసు, కోడికత్తి కేసులలో కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా మినహాయింపు కోరుకుంటూ తిరుగుతున్న వ్యక్తి నాలుగుదశాబ్దాలకు పైగా మచ్చ లేని నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దార్శనికుడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనీ అందుకే అరెస్టు అయ్యారనీ ఎలా చెప్పగలుగుతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.  ఆ కారణంగానే జగన్ మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు.   అయితే చంద్రబాబు అరెస్టుపై జగన్ మౌనం వైసీపీ నేతలను, శ్రేణులను భయాందోళనలకు గురి చేస్తున్నది. అధినేతే మౌనం వహిస్తున్నప్పుడు తాము మాత్రం బాబు అరెస్టును సమర్ధిస్తూ మీడియాకు ఎక్కడం ఎందుకని నేతలు సైతం వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.   ప్రభుత్వాధినేతగా, అధికార పార్టీ అధినేతగా జగన్ విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై స్పందించక పోవడం ఏమిటని వైసీపీ నేతలే అంతర్గత సమావేశాల్లో ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. జగన్ మౌనం చంద్రబాబును వైసీపీ సర్కార్ అక్రమంగా, కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అరెస్టు చేసిందని వెల్లువెత్తుతున్న విమర్శలకు బలం చేకూరుస్తోందని వారు అంటున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్టుపై జగన్ మౌనం.. వైసీపీ నేతలలో ఆందోళనను పెంచడమే కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీకి తీరని నష్టం జరగడం తథ్యమన్న భావనకు వచ్చేలా చేసింది. 

పెళ్లి రోజున అరెస్ట్.. భార్య ములాఖత్’కు నో .. భగ్గుమంటున్న మహిళలు

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు అరెస్ట్ సృష్టించిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓ వంక రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎక్కడి కక్కడ  నిరసనలకు దిగుతుంటే, దేశ విదేశాల్లో ఐటీ, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు  చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు పై  మండి పడుతున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు. మరో వంక  ఢిల్లీ వెళ్ళిన తెలుగు దేశం పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  దేశ రాజధాని నుంచి  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్  చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అవినీతి, అక్రమాలను మీడియా ముందు ఉంచడంతో జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతవరకు  వివిధ కారణాల వలన చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కొంత మౌనంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు, గళం విప్పుతున్నారు. జగన్ రెడ్డి దుర్మార్గాలను తెలుసుకుని, విస్తుపోతున్నారు.  ఇప్పటికే కేంద్ర మంత్రులు సహా జాతీయ స్థాయి నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించగా ఇప్పడు తాజగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్   దురదృష్టకరమంటూ ట్వీట్టర్ (x)వేదికగా వ్యాఖ్యానించారు. అంతే కాదు ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్న నాయకుడు చంద్రబాబును స్వేచ్ఛను దూరం చేసిన తీరు అంతకంటే బాధాకరం. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు  వంటి స్థాయి ఉన్న నాయకునితో వ్యవహరించే టప్పుడు ఆయన స్థాయితో పాటు,  వయసును కూడా పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ,  వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒకరికీ  ఉండాలని ప్రజాస్వామ్యం చెబుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవంక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి మాజీ  సుజనాచౌదరి,మరో కేంద్ర మాజీ మంత్రి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా వివిధ పార్టీలకు చెందిన  నాయకులు, చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపడుతున్నారు. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే ముహూర్తం పెట్టి మరీ మానసిక, శారీరక క్షోభకు గురిచేయడం,అదే విధంగా జైల్లో చంద్రబాబుతో ములాఖత్’కు అయన సతీమణి  భువనేశ్వరికి అనుమతించక పోవడం ఏమిటని పార్టీలతో సంబంధం లేకుండా మహిళా నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక మహిళను అది కూడా రాజకీయాలకు దూరంగా  ఉన్న మహిళను వేధింపులకు గురిచేసినందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించ వలసి ఉటుందని హెచ్చరిస్తున్నారు.  మరో వంక చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రంలో  టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న  ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొంటున్న మహిళలు, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన సతీమణి భువనేశ్వరి,ఇతర కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తంగా చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం అగ్నిజ్వాలలా ఎగసి పడుతోంది. ఆయనను గద్దె దించడమే లక్ష్యమని సామాన్య జనం సైతం రోడ్ల మీదకు వచ్చి నినదిస్తున్నారు. 

ఆ ఇద్దరు కలిశారు.. ఇక ప్రభంజనమే!

అవును, లెక్కల్లో ఒకటికి ఒకటి కలిపితే ఖాయంగా అది రెండే..అవుతుంది. అది గణితం. కానీ, రాజకీయ, ఎన్నికల లెక్కల్లో మాత్రం అలాకాదు. సందర్భాన్ని బట్టి లెక్క మారిపోతుంది,. కుడికలు,తీసివేతలు, తీసివేతలు గుణితాలు అవుతాయి.  కొన్ని సందర్భాలలో ఒకటీ, ఒకటీ లెక్కల్లోలానే  రెండు కావచ్చు, ఇకొన్ని సందర్భాలలో  సున్నా కావచ్చు, ఇంకొన్ని సందర్భాలలో ఒకటీ ఒకటీ ... రెండు కంటే ఎక్కువ కావచ్చును. ప్లస్ ఇంటూగా మరి రెండు రెండ్లు నాలుగు ఇంకా ఎక్కవ కూడా కావచ్చును.  అవును  మనం ఇప్పడు మాట్లాడు కుంటున్నది ఆంధ్ర ప్రదేశ్ లో వేగంగా మారుతున్న ఎన్నికల లెక్కలు, రాజకీయ గణితం  గురించే.  ముఖ్యంగా  తెలుగు దేశం అధినేత,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు,మారుతున్న రాజకీయ సమీకరణాల గురించి ఇప్పుడు రాష్ట్రంలోనూ, దేశంలోనే కాదు  విదేశాల్లోనూ తెలుగు వారు  మాట్లాడుకుంటున్నారు. చర్చలు జరుగుతున్నాయి.  మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముసుగులో గుద్దులాట లేకుండా, రేపటి ఎన్నికల్లో జనసేన తెలుగు దేశం కలిసి పోటీ చేస్తున్నాయని కుండ బద్దలు కొట్టిన తర్వాత ఏ ఇద్దరు తెలుగు వారు  గ్లోబులో ఎక్కడ కలిసినా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలిసిన అనతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైలు బయట  జనసేన  తెలుగు దేశం పార్టీలు కలిసే ఎన్నికల బరిలో దిగుతాయని స్పష్టం చేశారు. అంతే కాకుండా  బీజేపీ కూడా కలిసి వస్తుందన్న విశ్వాసం కూడా పవన్ కళ్యాణ్  వ్యక్త పరిచారు. నిజానికి  ఈ ప్రకటన కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉభయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అంటే కంటే ఎక్కువగా వైసీపే పాలనతో విసిగి పోయిన సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్  చేసిన సంచలన ప్రకటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తుపెట్టుకుంటే, ఇక వైసీపీ ఓటమిని ఆపడం ఎవరి తరం కాదనే భరోసాతో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.   నిజానికి  ఈ పరిణామాలతో సంబంధం లేకుండానే  రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పవనాలు ఎప్పుడో జోరందుకున్నాయి. గడప గడపలో ఎదురైన వ్యతిరేకత, సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తెలుగు దేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం  పాద యాత్ర,  చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వస్తున్న అద్భుత ప్రజా స్పందన గమనిస్తే, వైసీపీ సర్కార్ కు  రోజులు దగ్గర పడ్డాయనే, నిజం అందరికి అర్థమైంది. అప్పటి నుంచే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతల వెన్నులో చలి మొదలైంది. ఆ భయంతోనే జగన్ రెడ్డి దింపుడు కళ్ళెం ఆశతో తప్పుడు కేసులో చంద్రబాబును అక్రమంగా ఇరికించి జైలుకు పంపారు. చంద్రబాబు సీన్ లో లేకుంటే  తెలుగు దేశం పార్టీ కకావికలం అవుతుందని  జగన్ కలలు కన్నారు.   అయితే తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలచాడు అన్నట్లుగా జగన్ రెడ్డి మాస్టర్  ప్లాన్ బూమ్ రాంగ్ అయింది.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఒకటి చేసింది. మరో వంక బీజీపీ ఇంకా నిర్ణయం తీసుకోకున్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా, కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, మరి కొందరు జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు, అలాగే  ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపే అధ్యక్షులు పురందేపురందేశ్వరి, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, డాక్టర్ కే. లక్ష్మణ్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే .. కమలం మనసులో మాట స్పష్టమవుతూనే వుంది.  ఈ అన్నిటి కంటే ముఖ్యంగా ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు  చంద్రబాబు  జైల్లో  ఉన్నారనే మాటను జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ... వైసీపీ ప్రభుత్వానికి ఉద్వాసన పలకాలనే నిర్ణయానికి  వచ్చారు. ఇప్పడు తెలుగు దేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో .. . జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పే సుముహూర్తం  కోసం ఎదురు చూస్తున్నారు.  పొత్తుకు స్వాగతం పలుకుతున్నారు.  అ ఇద్దరు కలిస్తే, ఇక ప్రభంజనమే ..అంటున్నారు . అందుకే, జగన్ రెడ్డి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఇంకేం చేసినా అధికారం అందని ద్రాక్షేనని వారు అంతర్గత సంభాషణల్లో ఎలాంటి సందేహం లేకుండా చెప్పేస్తున్నారు. 

పవన్ సవాల్.. ఉలుకూ పలుకూ లేని వైసీపీ!

పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలు కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రకటించడానికి ముందు వరకూ  వైసీపీ నేతలు టీడీపీ-జనసేన పొత్తులపై విపరీత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దమ్ముంటే జనసేన సింగిల్ గా పోటీ చేయాలని.. తెలుగుదేశం పార్టీకి జనసేన అమ్ముడుపోయిందని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని, ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడనీ వైసీపీ నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడారు. తెలుగుదేశం గురించి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురించి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి కూడా మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయతీలు ఉంటే, దమ్మూ ధైర్యం ఉంటే తెలుగుదేశం , జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు విసురుతూ వచ్చారు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారని.. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అయితే, వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ వైసీపీకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ సీఎం జగన్ మోహన్ రెడ్డికే  ఆయన దమ్మూ, ధైర్యం, నీతీ నిజాయితీలకు సవాల్ విసిరారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన పవన్‌ కళ్యాణ్ ఆ వెంటనే  మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగానే పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశంతో పొత్తుపై కీలక ప్రకటన  చేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని విస్పష్టంగా చెప్పారు. ఈ సమయంలో మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. జనసేనకు దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారన్న ప్రశ్నకు పవన్  వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానమిచ్చారు. తన పార్టీ ఎలా పోటీ చేయాలో వైసీపీ నేతలు చెప్పాలా.. లేక వాళ్లకి చెప్పి తాను తన పార్టీ  నిర్ణయాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. అసలు తన పార్టీ విధి విధానాల గురించి వాళ్లకెందుకని నిలదీశారు. అక్కడితో ఆగకుండా, జగన్ కు దమ్మూ, ధైర్యం   రాజమండ్రి రూరల్ నుంచో లేదా గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచో పోటీ చేయాలని సవాల్ చేస్తున్నాననీ, ఆయన అలా పోటీ చేయడానికి సిద్ధ పడతారా అని ప్రశ్నించారు.  ఆ ఒక్క సావాల్ లో వైసీపీ నోళ్లు మూతపడిపోయాయి. ఇప్పటి వరకూ పవన్ సవాల్ కు బదులిచ్చిన వైసీపీ నేత లేరు. పవన్ సవాల్ తో వైసీపీ సైలెంట్ అయిపోవడంతో.. రాజకీయవర్గాలలో ఇప్పుడు ఏ కొత్త చర్చ మొదలైంది. నిజానికి పొత్తులు అనేది  రాజకీయ పార్టీల ఇష్టం. తమ భావజాలం, తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కలిసి వచ్చే వారితో ఎన్నికలలో పొత్తులు కూడగొట్టుకొని వెళ్లడం తప్పేమీ కాదు. అయితే.. ఇక్కడ వైసీపీ నేతలు కేవలం రెచ్చగొట్టడమే పనిగా దమ్ము, ధైర్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ ఏకంగా జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజమండ్రిరూరల్ లేదా గోదావరి జిల్లాల్లో ఏదో స్థానం నుంచి పోటీ చేయాలంటూ చేసిన సవాల్  వెనుక వైసీపీ నోరెత్తలేని బలమైన కారణం ఉంది.  దానిపైనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేమిటంటే.. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ కుటుంబం రాయలసీమ, మరీ ముఖ్యంగా  ఉమ్మడి కడప జిల్లా  బయట  వచ్చి పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. 1978 నుంచి చూసుకుంటే కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ కుటుంబం పోటీ చేస్తుంది. పులివెందుల నుంచి 1978, 1983, 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి  విజయం సాధించారు. ఆ తరువాత 1989లో  ఆయన కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994లోనూ వివేకాయే విజయం సాధించారు.  మళ్ళీ 1999, 2004, 2009ల్లో వైఎస్  ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మృతి తర్వాత ఉప ఎన్నికలో విజయమ్మ విజయం సాధించారు. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని ప్రారంభించిన తరువాత అదే నియోజకవర్గం నుంచి  విజయమ్మ మరోసారి విజయం సాధించారు.  ఇక 2014, 2019ల్లో  జగన్‌ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించారు. పులివెందుల దాటి బయటికి వస్తే వైఎస్ వివేకా కడప ఎంపీగా గెలవగా.. తొలిసారి 2014లో వైఎస్‌ విజయమ్మ కడప జిల్లా దాటి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తే లక్షకు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. వైఎస్ సతీమణిగా.. వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ వారి సొంత జిల్లా దాటి బయట పోటీ చేసి గెలవలేకపోయారు. ఆ పరాజయంతో పోలిస్తే.. గత ఎన్నికలలో పవన్ రెండు చోట్లా ఓడిపోవడం, లోకేష్ మంగళగిరిలో  పరాజయం పాలు కావడం పెద్ద విషయమేమీ కాదు.   వైసీపీ నేతలు గురువిందల్లా పదే పదే  పదే పదే తాను రెండు చోట్లా పరాజయం పాలు కావడంపై ఇష్టారీతిన మాట్లాడుతుండటంతో పవన్ డైరెక్ట్ గా జగన్ నే కడప దాటి బయటకు రాగలవా, వచ్చి పోటీ చేసి గెలవగలవా? అని సవాల్ చేసినట్లు కనిపిస్తున్నది.  దీంతో సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డే గోదావరి జిల్లాలలో ఒక స్థానానికి పోటీ చేస్తే గెలుస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. గోదావరి ప్రాంతం వైఎస్ ఫ్యామిలీకి అనువుగాని చోటు.. ఇలాంటి చోట జగన్ సర్వశక్తులు ఒడ్డినా గెలవడం సాధ్యమయ్యే పని కాదని తెలుసు కనుకనే వైసీపీ సైలెంట్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఏపీలో రజనీకాంత్ ఎన్నికల ప్రచారం?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ అస్పష్టంగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు కొత్త కోణంలో స్పష్టమవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబును జైల్లో కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి మరీ పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరితో పాటు కమ్యూనిస్టులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ-జనసేన కూటమికి ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్ పెరిగిపోయారు. ఇటు ఈ కూటమికి సినీ పరిశ్రమలో కూడా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటు నందమూరి, మెగా కుటుంబాల హీరోలు కూటమికి మద్దతుగా ఉండనున్నారు. దీంతో పాటు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమికి అండగా ఏపీలో ఎన్నికల ప్రచారం చేస్తారన్న ప్రచారం జోరందుకుంది.  నందమూరి కుటుంబంతో పాటు చంద్రబాబుతో రజనీకాంత్ కు మంచి స్నేహ సంబంధాలున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇటు మెగా కుటుంబంతో కూడా రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది. మరోవైపు రజనీకాంత్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. త్వరలోనే బీజేపీ రజినీని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.  ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే రజనీకాంత్ ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవకపోయినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో ఉన్న సత్సంబంధాల కారణంగా వ్యక్తిగతంగా  రజనీకాంత్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తే.. మునిగిపోయే పడవను వదిలేసినట్లుగా బీజేపీ కూడా  జగన్ పార్టీకి దూరం జరిగి తెలుగుదేశం, జనసేన కూటమిలో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.   దీంతో వచ్చే ఎన్నికలలో రజనీకాంత్ తెలుగుదేశం, జనసేన కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఖాయమేనని చెబుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని, ఆయన  ఎప్పుడూ తప్పు చేయరని, చేసిన అభివృద్ధి, సంక్షేమాలే ఆయనకు రక్ష. అవే ఆయనను బయటకు తీసుకవస్తాయి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమి చేయలేవు  అంటూ లోకేష్‌కు ధైర్యం చెప్పారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ మధ్య నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు  విజన్ గురించి  వివరిస్తూ ఆయనపై   పొగడ్తల వర్షం కురిపించారు. ఆ పొగడ్తలలో రాజకీయ అంశాలేమీ లేకపోయినా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా  వైసీపీ నేతలు రజనీకాంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి ఒకింత ఆలస్యంగానైనా రజనీకాంత్ స్పందించి వైసీపీ నేతలపై చురకలు వేశారు.   ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కూడా రజనీకాంత్ స్వచ్ఛందంగా స్పందించారు. అరెస్టును ఖండించారు. ఈ పరిణాలన్నిటినీ చూస్తే వచ్చే ఎన్నికలలో విపక్ష కూటమికి రజనీ తనవంతు సహకారం అందిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రజనీకాంత్  సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవ చేయాలని భావించినా.. ఏవేవో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో రాజకీయ రంగంలో తన మార్క్ చూపాలని భావించిన రజనీకాంత్ అది కుదరక పోవడంతో ఒకింత అసంతృప్తి ఆయనలో ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.   ఈ నేపథ్యంలోనే  బీజేపీ ఆయనకు గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది.  అయితే దాని కంటే ముందు.. వచ్చే ఎన్నికలలో దక్షణాది రాష్ట్రాలలో ఆయన  ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సొంత రాష్ట్రం కర్ణాటక, ఆయన్ను సూపర్ స్టార్ ను చేసిన తమిళనాడు, తనను ఆదరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన పొలిటికల్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కూడా రజనీ ఎన్నికల ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు

మాజీ మంత్రి  గౌతు శివాజీ అరెస్ట్  పలాస లో ఉద్రిక్తత

వైసీపీ ప్రభుత్వ  అరాచకాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి.    మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ , రిమాండ్ కు చట్టవిరుద్దమని టీడీపీతో బాటు ఎన్డియే, ఇండియా కూటమిలకు చెందిన భాగస్వామ్య పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  ఈ అరెస్ట్  ను నిరసిస్తూ మాజీ మంత్రి గౌతు శివాజీ   నేత‌ృత్వంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.  ఈ ఆందోళనను భగ్నం చేయడానికి జగన్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి శివాజీని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో గౌతు శివాజీ అస్వస్థకు గురయ్యారు. ఆ వివరాలేంటో చూద్దాం... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ 3వ రోజు పలాస కేటి రోడ్లో రీలే నిరాహార దీక్షను టీడీపీ శ్రేణులు చేపట్టారు. దీక్షకు సంఘీభావం తెలుపుతున్న మాజీ మంత్రి గౌతు శివాజీ ను కాశిబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసి  పోలీస్ స్టేషన్ కు  తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో గౌతు శిరీష, టిడిపి నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీగా కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.మాజీ మంత్రి గౌతు శివాజీ పోలీస్ స్టేషన్లో అస్వస్థకు గురు కావడంతో తక్షణమే వైద్యం నిమిత్తం కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అస్వస్థకు గురైన మాజీ మంత్రి గౌతు శివాజీ కి వైద్యం పేరుతో గుర్తుతెలియని ప్రాంతానికి పోలీసులు తరలింపు....కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట గౌతు శిరీష, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన శివాజీ ఆచూకీ తెలియకపోవడం  పోలీసులకు అడిగిన చెప్పకపోవడంతో శిరీష టిడిపి నాయకులు స్టేషన్ వద్ద ఆందోళన చేపడుతుండగా శిరీష తండ్రి ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన చెందుతూ వినిపిస్తున్నారు

చంద్రబాబు అరెస్ట్.. తప్పుడు చర్య .. మాజీ ఐఏఎస్,ఐపీఎస్ ల ముక్తకంఠం

నాలుగు దశాబ్దాలు పైబడిన ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి.. 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సర్వత్రా నిరసన, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు హయాంలో  జరిగిన అభివృద్శి ఎప్పటికీ ఆదర్శంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా విభజిత ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి కోసం ఆయన ప్రణాళికలు, అమరాతి రాజధాని గురించి   ప్రపంచ దేశాలు సైతం గుర్తించి ప్రశంసలు కురిపించాయి.   మహిళలు, నిరుపేదలు, నిరుద్యోగులు, వృద్దుల సంక్షేమం కోసంఎన్నో పథకాలు. ఉద్యోగ, ఉపాధిలో దేశానికే ఆదర్శం.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పుకుంటూ పోతే అంతం అనేది ఉండదు. అలాంటి నాయకుడిని ఎఫ్ఐఆర్ లో  పేరు కూడా లేని కేసులో అరెస్ట్ చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నారు. హై ప్రొఫైల్ ఉన్న నేతను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న నిబంధనను తుంగలో తొక్కి  అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి హైడ్రామా.. వేకువ జామున అరెస్ట్ చేయడం, 24 గంటలు గడిచిచే వరకూ  న్యాయమూర్తి ఎదుట హాజరు పరచకపోవడం లాంటి పరిస్థితులను యావత్ ప్రజానీకం తప్పుపడుతుంది. చంద్రబాబు అరెస్టుపై ఏపీలోని అన్ని ప్రతిపక్షాలే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయపార్టీలూ తప్పుపట్టాయి. ఖండించాయి.  మ నేషనల్ మీడియాలో కూడా  చంద్రబాబు అరెస్టుపైనే చర్చ నడుస్తున్నది. మరోవైపు మేధావులు కూడా ఈ అరెస్టు వ్యవహారాన్ని కక్ష  సాధింపు చర్యగానే చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక , చెన్నై లాంటి  నగరాలలో యువత  చంద్రబాబుకు మద్దతుగా  నిరసనలు చేపడుతున్నారు. వీరే కాదు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారు. ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ  ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ వ్యవహరించిన విధానాన్ని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తప్పు పట్టారు. అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించే విధానంలో నిబంధనలు పాటించలేదన్నారు.  ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పూర్తి వివరాలు పంచుకున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన అరెస్ట్ మెమో ప్రకారం.. ఆయన అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. ఈ కేసులో తప్పు ఒప్పులను న్యాయస్థానాలు తెలుస్తాయని.. కానీ అరెస్ట్ సహేతుకంగా చట్టబద్ధంగా జరగలేదని నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. అరెస్టు సమయంలో ప్రొసీజర్ పాటించడంలో సీఐడీ అధికారులు విఫలమైనట్లు  వివరించారు. నమోదు చేసిన సెక్షన్లు, కేసు వివరాలను సమీక్షించిన ఆయన గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేయడం చట్టాన్ని ఉల్లఘించడమేనని పేర్కొన్నారు. అంతకు ముందు ఈ కేసులో సీఐడీ అధికారులు ప్రవర్తించిన తీరు అనుమానం కలిగించేలా ఉందని మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఆరోపించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఏర్పాటు చేసిన సమయంలో  ఈయనే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కాగా.. అప్పుడు నిధులు కూడా ఈయన చేతుల మీదుగానే విడుదల అయ్యాయి. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన పీవీ రమేష్.. తన స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతి  కలిగించిందన్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదని విస్పష్టంగా చెప్పారు. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతోందనీ, తాను చెప్పిన విషయాలను  సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని సందేహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం.. మరి వారి పేర్లు ఎందుకు లేవని నిలదీశారు. సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మి నారాయణ కూడా పలు మీడియా ఛానెళ్ల చర్చా కార్యక్రమాలలో మాట్లాడుతూ.. సీఐడీ పీసీ చట్టంలోని 17ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని.. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో అది జరగలేదన్నారు. ఇప్పుడైనా గవర్నర్ అనుమతిస్తేనే ఆ సెక్షన్ ఈ కేసు వర్తిస్తుందని.. లేకపోతే ఆ సెక్షన్ పని చేయదని వివరించారు ఈ సెక్షన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా చంద్రబాబుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వీరే కాదు.. వీరి బాటలో మరికొందరు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయన అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.