ఫ్యాలెస్‌లో సైకో చెవులు చిల్లులుపడేలా..‘మోత మోగిద్దాం’!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ.. వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టాలంటూ ప్రజలకు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. చంద్రబాబు నాయుడుగారికి మద్దతుగా మోత మోగిద్దాం పేరిట సెప్టెంబర్ 30వ తేదీ అంటే శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు ఫ్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా.. ఏదో ఓ రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపు నిచ్చింది.  ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ప్రజలకు టీడీపీ సూచించింది. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఇంట్లోనో.. ఆపీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా.. బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేకుంటే విజిల్ వేయండి. ఓ వేళ రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియలో షేర్ చేయండంటూ పోస్టర్‌లో స్పష్టం చేసింది. .  ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దామన్నారు.   మరోవైపు ఇదే అంశంపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ట్వీట్ చేశారు. చంద్రబాబు  మీద తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేశారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి. శబ్దం చేయండి. చంద్రబాబు పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్లకి చెప్పండి. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉన్నా ఫర్వాలేదు. వాహనం పక్కకు తీసుకుని హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేయండి అంటూ ప్రజలకు విజ్జప్తి చేశారు.  మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ తనదైన శైలిలో స్పందించారు. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. చంద్రబాబుకి మద్దతుగా.. సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకోకి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి.. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంటూ.. ఆయన ప్రజలకు సూచించారు.    ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  కార్పొరేషన్  కుంభకోణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. ఆగస్ట్ 9వ తేదీన ఆయన్ని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూ దేశవిదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలు చేపడుతుండగా.. బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ తదితర నగరాల్లో ఆందోళనలు కొనసాగుతోన్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, జర్మనీ, యూరప్ తదితర దేశాల్లో సైతం తెలుగు వారు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఆందోళనలు చేపడుతున్నారు.

పాపం బాలినేని.. పొగబెట్టినా బయటకెళ్లలేని పరిస్థితి?

పాపం బాలినేని.. పేరుకేమో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆప్తుడు, బంధువు. పార్టీలోనేమో  ఆయన పరిస్థితి కరివేపాకు చందం. పోనీ బయటకి వెళ్లిపోదామంటే ఎప్పటికప్పుడు బుజ్జగింపులు. ఎలాగోలా ఉందామంటే మనస్సాక్షిని చంపుకొని ఉండలేని పరిస్థితి. మొత్తంగా బాలినేని పరిస్థితి ప్రత్యర్థి పార్టీ నేతలకు కూడా రాకూడదని అంటూ జాలిపడుతున్నారు సొంత పార్టీ నేతలు. పార్టీలో తగిన గౌరవం లేకపోవడం.. ఆ బాధను వెళ్లగక్కుతూ అల్టిమేటం జారీచేయడం.. ఇంతలోనే తాడేపల్లి నుండి పిలుపు రావడం.. అక్కడ బుజ్జగింపులు.. కాలరెగరేసుకుని బయటకు వచ్చినా  పార్టీలో ప్రాధాన్యత విషయంలో షరామామూలు పరిస్థితి.. గత నాలుగేళ్లుగా బాలినేని పరిస్థితి పార్టీలో ఇలాగే కొనసాగుతోంది.  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్‌ కీలక నేత. నాడు వైఎస్సార్.. నేడు జగన్ హయాంలోనూ ఓ వెలుగు వెలిగారు. అయితే, ఇదంతా వైసీపీ అధికారంలోకి రాకముందు మాట. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బాలినేనికి ప్రాధాన్యత  సంగతి అటుంచి కనీస గౌరవం, మర్యాదా కూడా లేకుండా పోయింది.   జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బాలినేనికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అంతకు ముందు ఆయన మంత్రి పదవిని వదులుకొని జగన్ వెంట వచ్చారు. బహుశా అందుకే  తొలి క్యాబినెట్ లో ఆయనకు అవకాశం దక్కింది. కానీ  మంత్రి వర్గ విస్తరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి జగన్ తప్పించారు. అదే సమయంలో అదే ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ ను కేబినెట్ లో కొనసాగించారు.  దీనిపై బాలినేని మనస్తాపానికి గురయ్యారు. దానిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డెక్కారు. చివరికి తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు వచ్చింది. బుజ్జగించారు. బాలినేని సర్దుకు పోయారు. ఇఖ అక్కడ నుండి వైసీపీలో ఆయనను పక్కన పెట్టేయడం ఆరంభమైంది. ఇది కాస్త తారాస్థాయికి చేరడంతో బాలినేని ఆ మధ్య అసంతృప్తికి లోనయ్యారు. కారణామేంటా అని ఆరాతీస్తే.. సొంత జిల్లాలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో కినుకు వహించారని తేలింది. ఆఖరికి పోలీసులు, ఎమ్మార్వోలు, ముఖ్య అధికారుల బదిలీల విషయంలో కూడా ఆయనకు తెలియకుండానే అన్నీ  జరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటకు చెప్పుకుని ఆవేదనకు గురయ్యారు.  అప్పట్లో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అప్పట్లో బాలినేని అసంతృప్తికి కారణం వైవీ సుబ్బారెడ్డే అని అందరికీ తెలిసిందే. నిజానికి సుబ్బారెడ్డి, బాలినేనికి ఇద్దరికీ సీఎం జగన్ తో బంధుత్వం ఉంది. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఇద్దరూ కలిసే పార్టీ కోసం పని చేసారు. కానీ, తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. అధిష్టానం సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో బాలినేని అలకబూని మీడియాకెక్కారు. దీంతో అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో అప్పటికి అది సమసిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి బాలినేనికి అదే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిలను  పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డైరెక్ట్ గా జగన్ ను కలుస్తానని హెచ్చరికలాంటి అల్టిమేటమ్ జారీ చేశారు. అయితే, పరిస్థితి చూస్తే మాత్రం బాలినేనిరి  పొమ్మనలేక పొగబెడుతున్నారనే చర్చ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్నది. ఇదంతా సీఎం జగన్ కు తెలిసే జరుగుతోందని కూడా అంటున్నారు. బాలినేనిని పక్కన పెట్టడం అనే కార్యక్రమం అంతా  సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని అంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డిని ఈజిల్లాకు ఇన్ చార్జ్ గా నియమించారు. కానీ, బాలినేనికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన అధిష్టానం.. బాలినేనే జిల్లాను చూసుకుంటారని కూడా చెప్పారు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం తేడాగా కనిపిస్తుంది. మొన్నటి వరకూ వైవీ సుబ్బారెడ్డి బాలినేనికి బల్లెంలా తయారైతే ఇప్పుడు విజయసాయిని స్వయంగా అధిష్టానమే పంపించడం చూస్తుంటే జగన్ కే  బాలినేని జిల్లాపై పెత్తనం చేయడం ఇష్టంలేదన్న అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి.  అయితే పలుమార్లు అవమానించినా బాలినేని మాత్రం పార్టీని పట్టుకు వేలాడడం ఆయన అనుచరులకు సుతరామూ నచ్చడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. చూడాలి ఇప్పటికైనా బాలినేని ఆయన దారి ఆయన చూసుకుంటారా? లేక మళ్ళీ బుజ్జగింపులకు తలొగ్గి పార్టీలోనే కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది.

అనేక యుద్ధముల ఆరితేరిన మూర్తి..స్పూర్తి చంద్రబాబు!

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు గొప్ప స్థాయి  ఉన్న నాయకుడు. రాజకీయానుభవం కానీ, పరిపాలనా అనుభవం కానీ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు. ప్రజల పట్ల అంకితభావం, కష్టపడే తత్వం ఆయనకే వుంది. చంద్రబాబుకి అవినీతి మకిల అంటించాలని రాజకీయ ప్రత్యర్ధులు చాలా మంది కోర్టుల్లో కేసులు వేసి ఆయాస పడ్డారే తప్ప అవినీతిని నిరూపించలేక పోయారు. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఎవరెన్ని కేసులు వేసినా ఆయన నిస్వార్ధ గుండె బెదర లేదు. విలువలుతో కూడిన రాజకీయాలు, సుపరిపాలన, జవాబుదారీతనం ఆయనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తాము అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కాబటి ఎదుటి వారిని మాత్రం ఎందుకు వదిలి పెట్టాలన్న దురుద్దేశ్యంతో  రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబుని అవినీతి పరుడుగా చిత్రించడం కోసం ఆధారాలు లేని అక్రమకేసు పెట్టి అరెస్టు చేసి వేధిస్తున్న వాస్తవాలు ప్రజలు గుర్తించాలి.  కేవలం కక్ష సాధించడం కోసం అధికారాన్ని ఉపయోగించి ఆధారాలు లేక పోయినా అక్రమంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చెయ్యక పోయినా పెద్ద శిక్ష వేశారని, జైలులో ఉంచి మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు, కుట్రలు, కేసులు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడుపై అభియోగం మోపే టప్పుడు అందుకు తగ్గ విశ్వసనీయ ఆధారాలు చూపకకుండా పోలీసులు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు మేరకు చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కల్పితమైన కేసు అని మేధావులు, వివిధ రాజకీయ పక్షాలు, బాహాటంగా ప్రకటించాయి. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో రెండేళ్ల కిందట కేసు పెట్టారు.  చంద్రబాబును అరెస్టు చేసి 16 రోజులు అవుతున్నా అయన తప్పు చేసినట్లు ఆధారాలు చూపలేక అవస్థలు పడుతున్నారు సిఐడి వారు. చంద్రబాబును ఎక్కడ తప్పు పట్టాలో తెలియక, ఏ ప్రశ్నలు అడగాలో అర్ధకాక ఫైళ్లు చూసుకొంటున్నారు సిఐడి అధికారులు. దీనిని బట్టి ఈ కేసు ఎంత కుట్ర పూరితమైనదో అర్ధం అవుతుంది. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలలో 45 ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. బలహీనతలతో తలదించి ఎరుగని, ఎవరి కాళ్ళకు మొక్కని నాయకుడు. ప్రజలు తలఎత్తుకొనేలా పాలించి, అందరి కోసం ఒక్కడై అహర్నిశలు చెమడోడుస్తున్న నాయకుడు ఆయన .ఆంధ్రాభ్యుదయం కోరి అవమానాలు భరిస్తున్న నాయకుడు. కఠోర శ్రమ, అకుంటిత దీక్షకు చెరగని చిరునామా చంద్రబాబు. ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకొనే శ్రామికుడు. గాంధీజి ఆశయాలను ఆలంబనగా చేసుకొని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన అరుదైన నాయకుడు చంద్రబాబు. ఎన్‌టిఆర్... తెలుగువారి ఆత్మ గౌరవ చిహ్నం అయితే, చంద్రబాబు తెలుగువారి ఆత్మ విశ్వాస ప్రతీకగా నిలిచారు. తెలుగు ప్రజల ఉద్దరణ కోసం నిరంతరం కృషి చేస్తున్న మహర్షి చంద్రబాబు. తెలుగు ప్రజలను ప్రగతి పధం వైపు నడిపించే సమర్ధ నాయకుడు. ఎదురు దెబ్బలు..పాఠాలుగా, గాయాలు.. గుణపాఠాలుగా, సమస్యలను,సంక్షోభాలను సానుకూల అవకాశాలుగా మార్చుకొన్న ఆసిధారా వ్రతుడు, గెలుపోటములకు పొంగి, కృంగిపోని స్థిత ప్రజ్ఞుడు, అవిరామ యోధుడు, అలుపెరుగని ధీరుడు చంద్రబాబు.                        అతడే ఒక సైన్యం, అతడే ఒక స్ఫూర్తి. నేటి తరానికి ఆయనొక మార్గదర్శి. సరికొత్త లక్ష్యాల తీరాల వెంట ఎగిరే విహంగం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగుజాతికి అందించిన దార్శనికుడు. జాతి నిర్మాణం వైపు ప్రజల్ని జాగృతం చేసిన నేత. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో జయాపజయాలు, మరెన్నో ఆటుపోట్లు చవిచూసినా చెక్కు చెదరని గుండె నిబ్బరం. మనోధైర్యం చంద్రబాబు సొంతం. నాలుగున్నర దశాబ్దాలుగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన నాయకుడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను ఒంట పట్టించుకుని అతి  చిన్న వయసులోనే మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు అధిరోహించి చరిత్ర సృష్టించారు. అన్ని రాజకీయ పక్షాల వైఖరికి భిన్నంగా పరిపాలన చేసి తన విజన్‌తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు చంద్రబాబు. మీ రాజకీయ అనిభవం, మార్గదర్శకత్వం పట్ల ఆకర్షితులవుతున్నాం, మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక, ఇండియాకి మార్గదర్శకులౌతారని యు,జి.కి కాకు కన్సల్ జనరల్ జపాన్ అన్నారు.                      దేశంలోనే ఇంత అనుభవం ఉండి క్రియాశీలంగా ఉన్న నాయకులు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత నవ్యాంధ్రను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా,  ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసమే విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల చంద్రబాబు పోరాట పటిమ అసాధారణ మైనది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్దిమందిలో చంద్రబాబునాయుడు ఒకరు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. సీఎం అంటే ప్రజలందరికీ చిరపరిచితంగా ఉంటారనే ధోరణి తెచ్చింది చంద్రబాబే. ఆయన 9 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారారు. వినూత్న ఆలోచనలతో దార్శనికత ప్రదర్శించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆధునీకరించారు. ఐటీ, బీటీ రంగాలను ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. గతంలో చాలామంది భారతీయ రాజకీయ వేత్తలను కలుసుకొన్నాను కానీ, ఆచరణాత్మకమైన, దృఢమైన, పారదర్శక కార్యక్రమాలను అమలు చేసిన మీలాంటి వారిని కలుసుకోవడం నూతన ఉత్తేజం అన్నారు కేన్నత్, మెంబర్ హౌస్ ఆఫ్ లార్డ్స్ యు.కె  రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ఘనత చంద్రబాబుది. యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా చంద్రబాబు వ్యవహరించి దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేయడంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకిక వాదానికి కట్టుబడి బయట నుంచి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో తన వంతు పాత్ర నిర్వహించారు.  దళిత నేత జిఎంసి బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేశారు. స్వర్జ చతుర్భుజి కింద ఫోర్‌ లైన్‌ రోడ్లు నిర్మించడానికి ఆధ్యుడిగా నిలిచారు. ఐటీ రంగం అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో చంద్రబాబునాయుడు దూరదృష్టితో ఆలోచించి ఆ రంగాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి హైటెక్ సిటీ, సైబరాబాద్‌ను నిర్మించారు. ఆయన సాంకేతిక విద్యారంగంలో తెచ్చిన విఫ్లవాత్మకమైన మార్పుల కారణంగా లక్షలాది మంది తెలుగువారు దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. దీనివల్ల దేశానికి విదేశీమారక ద్రవ్యం పెద్దఎత్తున వస్తోంది. రాష్ట్రంలో సైతం యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలను రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు. భారత జాతికి మార్గదర్శకులుగానే కాక మిత్ర దేశాల స్నేహ సంబంధాలకు దోహద పడే సమర్ధవంతమైన భారత ప్రధాన మంత్రికాగల నేతను మీలో చూస్తున్నాం అన్నారు.[రవి కరుణ నాయకే ,మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీలంక] అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన నిలిచారు. నిరంతరం ప్రజల సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. వస్తున్నా మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించారు. ఇంటి పెద్ద సమర్ధుడైతే ఆ కుటుంబం అన్ని విధాలా ముందంజ వేస్తుంది. అలాగే సమర్థవంతమైన నాయకుడుంటే ఆ ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. పట్టుదల, సేవాతత్వం వంటి లక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎదిగారు. రాష్ట్ర విభజనతో తెలుగుజాతి ప్రాభవం జాతీయ స్థాయిలో తగ్గింది. మళ్లీ తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకొచ్చే నాయకుడు ఎవరంటే ప్రజలకు మొదట గుర్తుకొచ్చింది చంద్రబాబునాయుడే. ఆయన ఆలోచనలు, దార్శనికతే మనలను ఖండాంతరాలకు తీసుకెళ్లింది. దావోస్ సదస్సులకు గడ్డ కట్టే చలిలో కూడా వెళ్ళి పలువురు దేశాధినేతలను కలుసుకొంటు పెట్టుబడులు పెడతారో లేదో తెలియక పోయినా వాళ్ళకు ప్రజెంటేషన్లు ఇస్తూ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ని పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు. మీ గొప్ప మార్గదర్శక స్పూర్తికి ప్రతి సమావేశంలోనూ మరీ ముగ్దుడనౌతుంటాను అన్నారుఎస్.ఐ గూచ్ హై కమీషనర్,కెనడా. భారతదేశ రాజకీయ నాయకులేవరికి దక్కని గుర్తింపు, అంతర్జాతీయ ప్రశంసలు పొందారు చంద్రబాబు. అటువంటి గొప్ప నాయకుడిపై తప్పుడు కేసుపెట్టి ఆనందిస్తూ క్యారెక్టర్ లేని గాలి మంద గాలి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు సమర్ధత, నమ్మకంతో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఒకవైపు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌, మరోవైపు రాజధాని లేదు. అయినా మొక్కవోని దీక్షతో బస్సులో నుంచే పాలన సాగించారు. 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటుతో పాలన మొదలుపెట్టి కేవలం 5 ఏళ్లల్లో దేశంలో ఎక్కడా అమలుకాని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో దీనినొక కేసు స్టడీగా తీసుకున్నారు. నీతి ఆయోగ్ కూడా భూసమీకరణ విధానాన్ని అభినందించింది. పోలవరాన్ని రికార్డు సమయంలో 70% నిర్మించారు. పట్టిసీమ ద్వారా 40 వేల కోట్ల విలువైన పంటను కాపాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఉపశమనం, ఫైబర్‌గ్రిడ్‌ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తన మేధస్సు, అపార అనుభవాన్ని ఉపయోగించి దేశ, దేశాలు తిరిగి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించారు.  ఆంధ్రప్రదేశ్‌ను శ్రేయోదాయక అభివృద్ది దిశగా నడిపించేందుకు చంద్రబాబు తనను తాను ఆంధ్రప్రదేశ్‌కి సమర్పించుకొన్నారని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా గడిచిన నాలుగున్నరేళ్లుగా  ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై గాంధేయ మార్గంలో ఏడు పదులు దాటిన వయస్సు లోనూ  ప్రజల కోసం అలుపెరుగని  పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఎన్నో సంక్షోభాలు, ఎన్నో కుట్రలు, ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న పార్టీని దెబ్బతీయడానికి అనేక పార్టీలు, వ్యక్తులు చెయ్యని ప్రయత్నం లేదు. తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని ప్రగల్బాలు పలికిన వారే ఫినిష్ అయ్యారు. అక్రమ కేసు పెట్టి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు కంటున్న జగత్ కిలాడీకి  ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టబోతున్నారు. మరొక ఆరు నెలల్లో తాడేపల్లి ఏడుపుల పల్లిగా మిగలబోతుంది. ఏ సమాజంలో అయితే నీతి తప్పిన అవినీతి పరులు విజయం సాధిస్తారో, ఏ సమాజంలో అయితే నేరస్థులు పూజింబడతారో, ఏ సమాజంలో అయితే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఏ సమాజంలో అయితే అవినీతి విలయతాండవం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రజలు తమకు రావాల్సిన వాటాల కోసం అర్రులు చాస్తారో ఆ సమాజం పున:సమీక్షించుకునే సమయం అసన్నమైందని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్ గార్డ్ వ్యాఖ్యలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు నాయకత్వం, ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అమృతం లభించే వరకు పాల సముద్రాన్ని మధిస్తూ వెళ్లడమే కార్యసాధకుల లక్షణం. ఆ కోవకు చెందిన వారే చంద్రబాబు నాయుడు కూడా. నిర్వరామ శ్రామికుడు అలుపెరుగని పోరాట యోదుడు, దేశం గర్వించదగిన ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు,  అటువంటి నాయకుడిని ఎటువంటి ఆధారాలు చూపకుండా కక్షతో అక్రమ కేసుపెట్టి వేదిస్తున్నది జగన్ ప్రభుత్వం. అటువంటి నాయకుడుని కాపాడుకోవాల్సింది ఆంధ్రులే. మరోసారి తప్పటడుగు వేస్తే ఆంధ్రులకు అధోగతే.                                                                                    నీరుకొండ ప్రసాద్    సీనియర్ జర్నలిస్ట్

ఈ సంక్షోభంలో తెలుగుదేశం పార్టీకి ధీమా, ధైర్యం భువనేశ్వరి, బ్రాహ్మణి!

అధికార వైసీపీ కుట్ర, కక్ష పూరిత విధానాల కారణంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్టయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కూడా జగన్ సర్కార్ కేసుల పేర వేధింపులకు గురి అవుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ ను ఏపీ సీఐడీ చేర్చింది. అయితే లోకేష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్పోజ్ చేసిన ఏపీ హై కోర్టు విచారణకు సహకరించాలని ఆయనను ఆదేశించింది. అరెస్టు అవకాశం లేదు అన్నదే లోకేష్ కు దొరికిన ఊరట. అయితే విచారణ పేరిట లోకేష్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కలిగించేలా ఏపీ సీఐడీ వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. స్కిల్ కేసులో గత 20 రోజులుగా చంద్రబాబును, ఆ అరెస్టు కారణంగా నారా లోకేష్ ను ప్రజలతో మమేకం కాకుండా నిలువరించిన జగన్ సర్కార్.. ఇక ముందు కూడా తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ప్రజల వద్దకు వెళ్లేందుకు అడ్డంకులు సృష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు అంతే కాలం విపక్ష నేతగా, గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో   ప్రతి మలుపులోనూ క్రియాశీలంగా వ్యవహరించిన, దార్శనికుడిగా దేశ, విదేశాల గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబును కనీసం నోటీసులు లేకుండా, చార్జిషీట్ లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసనలు, ఆగ్రహ జ్వాలలూ వ్యక్తం అవుతున్నా ఖాతరు చేయని జగన్ సర్కార్ కు వెనుక నుంచి కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా జగన్  భుజం మీద నుంచి  బీజేపీ అగ్రనాయకులు మోడీ, షాలు తుపాకి గురిపెట్టారని చెబుతున్నారు. వారు వ్యూహాత్మకంగా ఒకదాని వెంట ఒకటిగా అమలు చేస్తున్న కుట్రలలో భాగంగానే చంద్రబాబు అరెస్టు జరిగిందనీ, నారా లోకేష్  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో వచ్చే కొన్ని రోజుల వరకూ చంద్రబాబు, లోకేష్ ఇరువురూ కూడా ప్రజలతో మమేకమయ్యేలా పర్యటనలు చేసే అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించేందుకు, అలాగే చంద్రబాబు అరెస్టుపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ప్రజలను, పార్టీ శ్రేణులనూ వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు, అరెస్టుకు వ్యతిరేకంగా వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాలను జగన్ సర్కార్ పతనం దిశగా నడిపించేందుకు.. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఒక నేత అవసరం ఉందన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతున్నది. ఒకరు ముందు నిలబడితే.. తామే పార్టీని గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రహ్మణి రూపంలో పార్టీకి ముందుండి నడిపించగల నాయకత్వం లభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబు అరెస్టుతో ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోని పలు దేశాలలో కూడా నిరసన జ్వాలలు ఎగసి పడ్డాయి. చంద్రబాబును నిర్బంధించి 20 రోజులు గడిచిపోయినా జనం ఆగ్రహావేశాలు ఇసుమంతైనా తగ్గలేదు సరికదా రోజు రోజుకూ ఇనుమడిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఏపీలో ఎమర్జెన్సీ స్థాయి నిర్బంధాలను కూడా లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తున్నారు.   అదే సమయంలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మనిలు రాజమహేంద్రవరం వేదికగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ కుటుంబ వ్యాపారం చూసుకోవడం తప్ప రాజకీయాలకు దూరంగా ఉన్న వీరిరువురూ ఇప్పుడు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వారిని కలిసి వారితో మాట్లాడుతున్నారు. రొటీన్ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా ఇరువురూ కూడా సూటిగా, ఎటువంటి తడబాటు, తొట్రుపాటు లేకుండా చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో, ఎంత అప్రజాస్వామికమో వివరిస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ధైర్యంగా ఎండగడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ, మేం ఉన్నామనీ పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. నేతలలో ధైర్యం నింపుతున్నారు. ఇరువురూ మాటలకే పరిమితం కాకుండా  చేతలలో కూడా కూడా పార్టీకి అండదండగా ఉంటామన్న ధైర్యాన్నీ, ధీమాను ఇస్తున్నారు. వారు మీడియాతో  మాట్లాడిన  సందర్భాలలో కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడుతూ పరిణితిని చాటుకున్నారు.   ప్రధానంగా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు.  ఆ సందర్భంగా మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఆమె సంక్షోభాలను అధిగమించి పార్టీని ముందుండి నడిపించగల సమర్ధ నాయకురాలిగా అందరిలోనూ విశ్వాసాన్ని కలిగించాయి.  రాజకీయాల్లో రాణించాలంటే ఉండాల్సిన పరిణితి, నిర్భీతి, నిష్కర్షగా మాట్లాడగలిగే వాగ్ధాటి ఉన్న నేతగా అంతా బ్రాహ్మణిని గుర్తించారు.  నారా బ్రాహ్మణి  తెలుగుదేశం తరఫున ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ఇదే సరైన తరుణమని పరిశీలకులు కూడా అంటున్నారు.   రాష్ష్ట్రంలో దుర్మార్గ పాలన గురించీ, జగన్ ప్రభుత్వ అరాచకత్వం గురించి ఆమె సామాజిక మాధ్యమంలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి.  ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నాయకులతో ఆమె చర్చలు జరుపుతున్నారు.  జనసేనతో పొత్తు సమన్వయానికి సంబంధించి కూడా ఆమె నేతలకు, శ్రేణులకూ దిశా నిర్దేశం చేస్తున్నారు. జనసేన నేతలతోనూ చర్చిస్తున్నారు.  అదే విధంగా నారా భువనేశ్వరి ప్రసంగాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  పార్ఠీ శ్రేణుల్ని ఉద్దేశించి ఆమె ప్రసంగాలు వారిని కదిలిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ఇద్దర్నీ బయటకు రాకుండా కేసుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినా  టీడీపీని  అత్తాకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మణి దిగ్విజయం దిశగా పార్టీని నడిపిస్తారని తెలుగుదేశం శ్రేణులు ధీమా, ధైర్యం వ్యక్తం చేస్తున్నాయి.   

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో భారీ చేరికలు

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే కొందరు బహిరంగంగా ప్రకటించగా మరికొందరు ముహూర్తం కోసం వేచి ఉన్నారు.   కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్‌ చొరవతో  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరికల విషయంలో  చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక తరహా ఫార్ములాను అనుసరించాలని ఈ చర్చల సారాంశం. ఈ ఎన్నికల్లో సిక్స్ గ్యారెంటీస్ ప్రచారంతో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు మామూలే. ప్రస్తుతం అటువంటి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు.  అందరికంటే ముందే బిఆర్ఎస్ జాబితా ప్రకటించిన కేసీఆర్ అసంతృప్తి వాదుల మీద ఫోకస్ పెట్టకపోవడంతో  కాంగ్రెస్ పార్టీకి అవకాశాలెక్కువయ్యాయి. బిఆర్ఎస్ లో రెండో శ్రేణి నేతల మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 17వతేదీన హైదరాబాద్ తుక్కుగూడ వేదికగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రజాకర్ష పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే తన కుమారుడు రాహుల్ తో ఎఐసీసీ అగ్ర నేత మల్లి ఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మల్కాజ్ గిరిలో తుక్కుగూడ తరహా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశానికి సోనియాగాంధీ పాల్గొనబోతున్నట్లు సమాచారం. అప్పుడు బిఆర్ఎస్ లో టికెట్ రానివారితో బాటు ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అనేక సర్వేలు కూడా  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకంటున్నాయి. 

బీర్ఎస్ కు ఆంధ్రా సెటిలర్స్ దూరం.. ఇది కన్ఫర్మేనా?

జోష్ మీదున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని  ఇప్పటికే టెన్షన్ పెడుతున్నది. బీఆర్ఎస్ నేతలు పైకి గాంభీర్యంప్రదర్శిస్తున్నా రోజురోజుకీ బలోపేతం అవుతున్న కాంగ్రెస్ ఆ పార్టీని గాభరాపెడుతోంది.  నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో బలంగా ఉన్నట్లు కనిపించిన బీజేపీ..  ఇప్పుడు చతికిల పడింది.  దీంతో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు గంపగుత్తగా ఆ పార్టీకే దఖలు పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.  ఇప్పటికే పార్టీ మారిన కొందరు దిగ్గజ నేతలు సొంగ గూటికి అంటే హస్తం పంచకు చేరారు.  దీంతో బీఆర్ఎస్ లో  టెన్షన్ ఒకింత తీవ్రంగానే ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి కూడా బీఆర్ఎస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది.    గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయంలో ఓ నాలుగైదు అంశాలు కీలక పాత్ర పోషించాయి. బీజీపీ, కాంగ్రెస్ మధ్య ఓటు బ్యాంకు చీలిపోవడం, ఆంధ్రా సెటిలర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడం, కాంగ్రెస్, టీడీపీ పొత్తు కలిసిరాకపోవడం, తెలంగాణ సెంటిమెంటును రగిలించడంలో కేసీఆర్ సక్సెస్ కావడం వంటివి ఆ అంశాలు అవే 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) కు అధికారాన్ని అందించి అందలం ఎక్కించాయి. అయితే ఇప్పుడు ఇందులో ఏదీ  బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ చతికిల పడింది. కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా దూసుకొచ్చింది. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారడంతో సెంటిమెంటుకు అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకుకు స్వయంగా బీఆర్ఎస్సే గండి కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును స్కిల్ స్కాం అంటూ ఏపీలోని జగన్ సర్కార్  అక్రమంగా అరెస్టు చేసిన  నేపథ్యంలో  తెలుగుదేశంతో పాటు  ఏపీ నుండి అమెరికా వరకూ  ప్రతి తెలుగువాడూ తీవ్రంగా స్పందిస్తున్నారు. స్వచ్ఛందంగా నిరసనలకు దిగుతున్నారు.  ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని చంద్రబాబు సానుభూతిపరులు, అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలోని ఉద్యోగులు, ఆంధ్రా మూలాలు ఉన్న సెటిలర్లు, టీడీపీ అభిమానులు పలువురు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు.    హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు వందలాది కార్లతో ర్యాలీ, ఫెనాన్షియల్ డిస్ట్రిక్ లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయటం వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై నిరసనల నేపథ్యంలో పలుచోట్ల తెలంగాణ పోలీసులు వారిని నిలువరించిన, వారిపై దౌర్జన్యం చేసిన  వీడియోలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. అయితే, బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కొందరు చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాకుండా ఏపీ సీఎంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం.. బాబు అరెస్టుపై హైదరాబాద్ లో ఎందుకు నిరసనలు చేస్తారు?  కావాలంటే మీ రాష్ట్రం పోయి చేసుకోండి   అంటూ వ్యాఖ్యానించారు. తమకు చంద్ర‌బాబు కేసుకు సంబంధం ఏంట‌ని, ఇక్క‌డ ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు ఎలా అనుమ‌తులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో సోషల్ మీడియాలో  ఆయన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. బాబు గురించి హైదరాబాద్ లో ఎందుకు ఆందోళన అన్న మంత్రి కేటీఆర్ కు నెటిజన్లు ఏపీలోని తాడేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ  కార్యాలయం ముందు  సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. తాడేపల్లిలో  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.  లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి ధర్నాలు ఎందుకు చేసారో చెప్తారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఆంధ్రా టెన్షన్ మొదలైందా అనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణలో 5 శాతం ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకు ఉంటుందని అంచనా. వీరిలో ఎక్కువ శాతం తెలుగుదేశం  సానుభూతిపరులే . అది గమనించే ఇన్నాళ్లు కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తూ వచ్చారు. కానీ  ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో  కేటీఆర్ సెటిలర్ల ఆగ్రహానికి గురయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించడం, ఎల్బీ న‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఏకంగా ధర్నాలో పాల్గొనడం వంటి సంఘటనలు జరిగాయి. అయినా సరే ఏపీ గొడవ ఇక్కడెందుకు అంటూ  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే  బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ప్రతికూలంగా మారాయి.  అసలే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు కేటీఆర్ వ్యాఖ్యలు గోరు చుట్టుమీద రోకటి పోటులా మారియి.  బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో సెటిలర్ల వ్యతిరేకత  గట్టి ప్రభావమే చూపే అవకాశం ఉందని అంటున్నారు. 

ఈ మౌనం.. ఏ వ్యూహం

తెలంగాణలో ఎన్నికలు ఎప్పడు? ఎంతో కాలంగా షికారులు చేస్తున్న ఈ ఊహాగానాలకు తెరపడింది. ఇంకా కొందరిలో కొన్ని అనుమానాలున్నా, సందేహాలు చాలా వరకు తొలిగి పోయాయి. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు  జమిలి, మినీ జమిలి ప్రస్తావన లేకుండా ముగిసిపోవడంతో  తెలంగాణ సహా ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో అసెంబ్లీ గడువు ముగుస్తున ఐదు రాష్ట్రాల్లో షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న భరోసా ఏర్పడింది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఎందుకో కానీ తెలంగాణలో ఉహించినంతగా ఎన్నికల సందడి కనిపించడం లేదు.   తెలంగాణ శాసన సభ గడవు, వచ్చే సంవత్సరం, (2024)  జనవరి 1తో ముగుస్తుంది. కనుక ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త శాసన సభ కొలువు తీరాల్సివుంది. అంటే  ఈ సంవత్సరం చివర్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  మరో వంక  ఇప్పటికే  ఎన్నికల సన్నాహకాలు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహక పనులు చకచకా చక్కబెడుతోంది.  ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం చేయడం, పోలింగ్ బూతుల గుర్తింపు, అధికారులు, సిబ్బంది శిక్షణ ఇత్యాది సన్నాహక క్రతువులన్నీ చాలా వరకు పూర్తయ్యాయి.  పోలీసు బదో బస్తు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అటువంటి వాటిని గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నికల నగరా మోగించేందుకు ఈసీ సిద్ధమవుతోంది.  వచ్చే నెల (అక్టోబరు) మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ లెక్కన 2018 లో జరిగినట్లే( 2018 డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది) డిసెంబర్ మెదటి లేదా  రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. అంటే ఎన్నికలకు ఇంకా నిండా  వంద రోజులు అయినా లేవు  అయినా కారణాలేమిటన్నది ఇతమిద్థంగా తెలియదు కానీ రాష్ట్రంలో  ఇంతవరకు ఎన్నికల సందడి పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా తొందరపడి ఒక కోయినా అన్నట్లుగా  ముందుగానే నాలుగు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే  అనూహ్యంగా   స్తబ్ధత కనిపిస్తోంది.  అభ్యర్థిత్వాలు ఖరారు అయిన వారు ప్రచార సన్నాహాలు ఆరంభించలేదు. అసమ్మతి గళాలు ఆగడం లేదు. అన్నిటినీ మించి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీర్  అటు జాతీయ రాజకీయ పరిణామాలపై స్పందించడం లేదు. ఇటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపైనా అయన  మౌనం వీడటం లేదు. చివరకు, కొద్ది మంది మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ  టికెట్లు ఇవ్వడంతో అనేక నియోజక వర్గాల్లో అసమ్మతి భగ్గుమంటున్నది. భంగపడిన ఆశావహులు  ఆందోళనల బాట పట్టారు.  అయినా ముఖ్యమంత్రి  స్పందించడం లేదు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  అగ్ర నేత రాహుల్ గాంధీ.  బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించినా కేసీఆర్  మౌనమే నా భాష అన్నట్లుగా ఉన్నారు.  అందుకే ఇప్పడు  రాష్ట్రంలో కేసీఆర్  మౌనం వెనక వ్యూహం ఏమిటి? అన్నది చర్చనీయాంశగా మారింది. అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే, ఆ మౌనం వెనక ఏదో దాగుందని  లేదంటే కేసీఆర్ అంత సైలెంట్ గా ఉండరని అంటున్నారు.  అయితే ఆ వ్యూహం ఏమిటన్నది మాత్రం అంతుబట్టడం లేదని అంటున్నారు. 

కాంగ్రెస్ లో మళ్లీ చేరికలలొల్లి.. రేవంత్ ది ఓవరేక్షన్ అంటూ సీనియర్ల విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ  చేరికల లొల్లి మొదలైంది. పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్న వేళ.. పార్టీలో చేరికలు రాష్ట్ర పార్టీలో విభేదాలకు కారణమౌతున్నాయి. ముఖ్యంగా తెరాస హైకమాండ్ తో విభేదించి.. ఆ పార్టీకి రాజీనామా చేసి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరడంతో మళ్లీ రాష్ట్ర పార్టీలో సీనియర్లు అలకపాన్పు ఎక్కారు. మైనంపల్లి పార్టీలో చేరకముందే తనకూ, తన కుమారుడికీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నారనీ, ఆ తరువాతే ఆయన హస్తిన వెళ్లి పార్టీ కండువా కప్పుకున్నారనీ చెబుతున్నారు. ఈ విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు  ఇంత కాలం పార్టీని నమ్ముకుని సేవలందించిన వారిని కాదని, కొత్త వారిని అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మైనంపల్లిని స్వయంగా హస్తినకు తోడ్కొని పోయి మరీ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్పించిన విధానాన్ని సీనియర్లు తప్పుపడుతున్నారు.  కేవలం మూడు రోజుల వ్యవధిలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడికి టికెట్ కన్ఫర్మ్ హామీనీ, పార్టీలో వారి చేరికనూ పూర్తి చేయడంలో రేవంత్ రెడ్డి తన స్థాయిని మించిన చొరవ చూపారని సీనియర్లు విమర్శలు గుప్పించారు.   రేవంత్ రెడ్డి తీరు ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను తుంగలో తొక్కే విధంగా ఉందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడానికి వీలుపడదు. కానీ ఇందుకు మినహాయింపుగా ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి విషయంలో కన్సిడరేషన్ ఉంటుంది. అంతే కానీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి చేరేవారికి ఆ మినహాయింపు వర్తించే అవకాశం లేదు.  అంటే ఎట్టి  పరిస్థితుల్లోనూ మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రాహుల్ లలో ఒకరికి మాత్రమే టికెట్ రావలి. కానీ రేవంత్  తన పలుకుబడి ఉపయోగించి మైనంపల్లి, ఆయన కుమారుడు ఇద్దరికీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి వీలుగా టికెట్లు ఇప్పించారని సీనియర్లు అంటున్నారు.   మైనంపల్లి కుటుంబానికి మెదక్, మల్కాజిగిరి టికెట్లు కేటాయించినట్లే తమ కుటుంబాలకు చెందిన వ్యక్తులకూ ఇవ్వాలని ఢిల్లీ హైకమాండ్ పై రాష్ట్ర పార్టీ సీనియర్లు ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.   ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్ల కోసం అప్లై చేసుకున్న కీలక నేతల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితర ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ల కుటుంబాల నుంచి రెండు టికెట్లు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు. అయితే వీరి విషయంలో స్క్రీనింగ్ కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.  అయినా అసలు తెలంగాణ కాంగ్రెస్ అంటేనే గ్రూపు విభేదాలకూ, అసమ్మతికి పెట్టింది పేరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించిన తొలి నాళ్లలో కాంగ్రెస్ లో విభేదాల సంస్కృతి పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ సీనియర్లంతా తమ విభేదాలను పక్కన పెట్టి రేవంత్ కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. ఓ దశలో రేవంత్ కూడా విసిగిపోయి పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే హై కమాండ్ రేవంత్ కు మద్దతుగా గట్టిగా నిలబడటం.. అదే సమయంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో హస్తం హవా చూపడంతో  సీనియర్లు దిగి వచ్చారు. అన్నిటికీ మించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకునే ఆశలు సజీవంగా ఉండటానికి కారణం పీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం అందరినీ సమన్వయ పరచుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన కృషే కారణమని చెప్పాల్సి ఉంటుంది. వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి వారిని రాజకీయ పోరాటానికి సమాయత్తం చేయడంలో లోకేష్ పాత్రను ఎవరైనా సరే తక్కువ చేసి చూపే అవకాశం లేదు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని బహిరంగంగా వ్యతిరేకించినా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైనా హై కమాండ్ పట్టించుకోలేదు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా అసమ్మతి రాగం ఆలపించి హైకమాండ్ పై ఒత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సరికదా? ఒక దశలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ హై కమాండ్ వెనుకాడలేదు.  రాష్ట్రంలో అధికారం కోసం అందరూ రేవంత్ నాయకత్వంలో సమష్టిగా కృషి చేసి తీరాల్సిందేనన్న విస్పష్ట సంకేతాలను ఇచ్చింది. అంతే కాకుండా కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణ పార్టీ వ్యవహారాలన పర్యవేక్షిస్తుండటంతో ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత ప్రస్ఫేటంగా కనిపించింది. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న ఈ తరుణంలో కాంగ్రెస్ కప్పులో మైనంపాటి తుపాను చెలరేగింది. ఇలా పార్టీలోకి చేరి అలా రెండు టికెట్లను మైనంపాటి తన్నుకుపోవడాన్ని, అందుకు రేవంత్ దగ్గరుండి మరీ లైన్ క్లియర్ చేయడాన్నీ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తున్నది.  

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు భారీ ఊరట

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఊరట లభించింది. ఈ కేసులో  లోకేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్  దాఖలు చేసిన  సంగతి విదితమే. ఈ కే సులో ఏపీ సీఐడీ లోకేష్ ను ఏ 14గా పేర్కొంది. దీంతో ఏ క్షణంలోనైనా లోకేష్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై శుక్రవారం (సెప్టెంబర్ 29)న ఏపీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా లోకేష్ కు 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో లోకేష్ ను అరెస్టు చేసే అవకాశం లేదని పేర్కొంటూ న్యాయమూర్తి ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఈ సందర్భంగా విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు సూచించింది.  కాగా వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగానే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో తనను ఏ14గా చేర్చి, అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ లోకేష్ ముందస్తు బెయిలు పిటిషన్ లో పేర్కొన్నారు. మంగళగిరి సీఐడీ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ప్రతివాదిగా పేర్కొన్నారు. స్కిల్ కేసులో తన తండ్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధంగానే తననూ అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తనను అరెస్టు చేస్తామంటా సీఐడీ చీఫ్, కొందరు వైసీపీ నేతలూ బహిరంగ ప్రకటనలు చేయడాన్ని లోకేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.  ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదనీ, సంబంధిత మంత్రిగా తాను అప్పట్లో లేననీ, ఐఆర్ఆర్ వ్యవహారంలో తానే హోదాలోనూ జోక్యం చేసుకోలేదనీ పేర్కొన్న లోకేష్ తనపై ఈ కేసులో పెట్టిన కేసు చెల్లదని పేర్కొన్నారు.   తాను యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాననీ, దానిని అడ్డుకోవడానికే అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనీ లోకేష్ పేర్కొోన్నారు.  జగన్ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం సీఐడీని పావుగా ఉపయోగించుకుంటోందన్నారు.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం   అంగుళం స్థలాన్ని కూడా సేకరించలేదనీ, ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదనీ లోకేష్ పేర్కొన్నారు, 

చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ కు మోడీ,షా అండ?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టుపై తెలుగురాష్ట్రాలే కాదు, యావద్దేశం నిరసనలతో అట్టుడికి పోతున్నది. న్యాయనిపుణులు సైతం ఆయన అరెస్టు అక్రమం అని చెబుతున్నా..గత 20 రోజులుగా ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. కోర్టులలో వాదనలు, వాయిదాల పర్వం కొనసాగుతోంది. మొత్తంగా కుట్రపూరితంగా చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కానీ.. చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ రెడ్డి కక్ష పూరిత వైఖరి, వేధించాలన్న పట్టుదలకు తోడు.. అంతకు మించి కుట్ర కోణం ఉందని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వై రల్ అవుతున్న ఒక పోస్టును తెలుగువన్ పాఠకులు, వీక్షకుల కోసం యథాతథంగా.. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న బలమైన కారణం జగన్‌రెడ్డి ‘ప్రతీకారం’ అని మాత్రమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేధావులుగా చలామణి అవుతున్న వారి విశ్లేషణల్లో కూడా అంతకుమించి కొత్త కోణం వెలికి రావటం లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ ‘న్యాయమే’ననే వైసీపీ నాయకులు, తొత్తు మేధావులు కూడా చంద్రబాబు ఏదో అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికే ప్రయాస పడుతున్నారు. చంద్రబాబును ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా పరిమితంగా పరిగణిస్తే వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఇంతకు మించి పరిణతి ప్రదర్శించలేవు. గత ఏడు దశాబ్దాల భారత చరిత్రలో, నాలుగు దశాబ్దాల  తెలుగు రాష్ట్రాల భూత, భవిష్యత్, వర్తమానాల్లో ఏ కాలంలోనూ చంద్రబాబు లేని సమాజాన్ని ఊహించడం  సాధ్యం కాదు. అటువంటి చంద్రబాబు అనే ఒక ‘వ్యవస్థ’ను కూకటివేళ్లతో శాశ్వతంగా పెకలించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఉపరితల విశ్లేషణలను పక్కనబెట్టి, రాజకీయ సామాజిక తంత్రంలో ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ (Inoculum Effect) ను ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో గమనిస్తే, పొంచి ఉన్న ప్రమాదాలు, చీకటి కోణాలు వెలుగు చూస్తాయి. చంద్రబాబు అరెస్ట్ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల ప్రేరేపణతోనే జరిగింది అనటంలో సందేహం లేదు. ఏడు పదులు పైబడిన వయస్సులో కూడ చంద్రబాబు ఆరోగ్యంగా ఉండటం, అలుపులేకుండా గంటల తరబడి ప్రసంగాలు చేస్తూ, ఊరూరా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేయటం, ప్రజల్లో అంతులేని ఆదరణ పొందుతుండటం గురించి సొంత పార్టీ నేతల నుంచి, జనసేన నుంచే గాక ఇంటలిజెన్స్ ద్వారా కూడా కేంద్రానికి సమాచారం ఉంది. నిజానికి చంద్రబాబు, తెలుగుదేశం కనుమరుగైతే గాని, భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలోకి అడుగు పెట్టలేదని మోదీకి, అమిత్ షాకు కూడా విస్పష్టంగా అర్థమైంది. పోనీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొంటే కేవలం కొన్ని సీట్లతో సరిపెట్టుకోవలసిందే. కానీ, ఆంధ్రలాంటి ప్రకృతి వనరులు అపారంగా ఉన్న ధనిక రాష్ట్రం నుంచి గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి వీలు ఉండదు. ఆ అవకాశం జగన్‌రెడ్డి వంటి తొత్తులు ముఖ్యమంత్రులుగా ఉంటేనే సాధ్యం. లేదా బీజేపీనే స్వయంగా రాష్ట్ర పగ్గాలు పడితే ఇక ఆకాశమే హద్దు. ఒకసారి తెలుగుదేశం స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తే ఆ తరువాత వైసీపీ నుంచి రాష్ట్రానికి సులభంగా విముక్తి కలిగించవచ్చు. జగన్‌రెడ్డి కేసులు కేంద్రం చేతిలో ఉన్నంత కాలం అతడిని ఉంచటమా, పీకేయటమా అన్నది బీజేపీకి మంచి నీళ్లు తాగినంత సులువు. కాబట్టి సమస్యల్లా చంద్రబాబు, తెలుగుదేశమే.చంద్రబాబును, తెలుగుదేశాన్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి ఆ స్థానంలో బీజేపీ రావాలంటే పన్నాల్సిన పన్నాగాలను జగన్‌కే అప్పచెప్పింది కేంద్రం. సామాజిక సిద్ధాంతాలలో ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ అనే సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం– ఏదైనా తీవ్రమైన సామాజిక చర్యకు ఒడిగట్టే ముందు అతి తక్కువ స్థాయిలో దానిని (తాము భవిష్యత్తులో చేపట్టబోయే దానిని) సూచనగా ప్రజలలోకి వదులుతారు. ప్రజల్లో వచ్చే స్పందనను జాగ్రత్తగా అంచనా వేస్తారు. ముందు ప్రజల్లో కొంత అలజడి, వ్యతిరేకత, తిరుగుబాటు వస్తుందని గ్రహించి పోలీసులను, అవసరమైతే పారామిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచుతారు. మొదటిసారి పొంగులా వచ్చి చల్లారిన తరువాత, వెంటవెంటనే తీవ్ర చర్యలకు దిగుతారు. ప్రజలు గతంలో చేసిన ప్రతిఘటన రెండవసారి చేయలేరు. వారు క్రమంగా ఈ తీవ్ర చర్యలకు అలవాటు పడిపోతారు. అంటే మశూచి వ్యాధి రాకుండా ముందుగా ఇచ్చే వాక్సిన్ లాంటిది అన్నమాట. అందువల్ల దీనికి ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ అని పేరు వచ్చింది. ఉదాహరణకు గుజరాత్ అల్లర్లు..  అవి అక్కడి అప్పటి ప్రభుత్వ సహకారంతోనే జరిగాయి. మోడీ తిరిగి అధికారంలోకి వచ్చారు. గుజరాత్ అల్లర్లలో ముస్లింలు దారుణ హింసకు గురైనా, ముస్లింలకు ప్రభుత్వం కావాలనే రక్షణ కల్పించకుండా దారుణాలు జరిపించినా, హిందువులు మోడీని హీరోగా భావించారు. అందుకే నేటిదాకా బీజేపీయే గుజరాత్‌ను పాలిస్తున్నది. నాడు గుజరాత్ అల్లర్లలో ఏమి జరిగిందో ప్రజలకు తెలియపర్చాలని బీబీసీ చేసిన ప్రయత్నానికి కేంద్రం ఎలా అడ్డుపడిందో తెలిస్తే గాని మనకు ఈ రాష్ట్రంలో రాబోయే రావణ కాష్టం గురించిన ఒక అంచనా, ఆలోచనా రాదు. తమకు వ్యతిరేకంగా ఏమైనా రాస్తారనిపిస్తే ఆ మీడియాని సమూలంగా నాశనం చేసి, కేసులు పెట్టి వేధించే విషయంలో మోదీకి, జగన్‌కు, కేసీఆర్‌కు తేడా ఏమీ లేదు. వీరంతా కన్నుమూసే వరకూ అధికారంలో ఉండాలని కోరుకునేవారే. అందుకు అవసరమైతే దేనికైనా సిద్ధపడతారు. వీరు అవినీతి దురంధరులు కానీ తాము ఎంతో నిజాయితీపరులమని, తమ వ్యతిరేక వర్గంలోని వారే భయంకర అవినీతిపరులని ప్రచారం చేస్తుంటారు. నెహ్రూ, గాంధీ, సోనియా అవినీతికి పాల్పడి దేశాన్ని నాశనం చేసారని మోడీప్రచారం చేస్తే, చంద్రబాబు అంత అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడని జగన్ అంటారు. గతంలో జగన్, రాజశేఖర రెడ్డి అవినీతి బాగోతాలు వెలుగుచూసినప్పుడు తొలుత నిర్ఘాంతపోయిన తెలుగు ప్రజలు అనంతరకాలంలో నిరంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తూన్నా పెద్దగా స్పందించటం మానేశారు. పైగా అందరు నాయకులు అవినీతిపరులే, వీళ్ళకోసం మనం ఎందుకు పోరాటాలు చేయాలి అని నిశ్చయించుకొంటారు. ఇలాగే  చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి నాయకులపైన నిజాయితీ లేనివారిగా ముద్ర వేస్తే వారు అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బతీయవచ్చు అన్నదే బీజేపీ, వైసీపీ పథకం. అందులో భాగంగానే పవన్ పైన ‘దత్తపుత్రుడు’, ‘ప్యాకేజీ పుత్రుడు’ వంటి ఆరోపణలు. ఎప్పుడైతే అవి పనిచేయట్లేదు అనే భావన కలుగుతుందో అప్పుడు ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’లో రాజకీయ తంత్రానికి తెరలేపుతారు. ఇందులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ముందు ముందు లోకేష్‌ను అరెస్ట్ చేస్తామని, ఉగాది తరువాత తెలుగుదేశం ఉండదని బొత్స సత్యనారాయణ వంటివారు అనటం వెనకాల ఇదే సిద్ధాంతం ఉంది. అది ఆషామాషీగా అన్నది కాదు. ఉన్నత పోలీస్ అధికారులతో సహా అందరూ ఏకపక్షంగా ప్రవర్తించటానికి కారణం కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వారికి అందుతున్న ఉప్పే. న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కత్తి పట్టడం తప్ప వేరే మార్గం లేదనడానికి కారణం కూడా చూచాయగా ఇందుకు సంబంధించిన కొన్ని శకునాలు ఆయనకు అర్థం కావటమే. సొంత బాబాయిని చంపించి నిర్భయంగా తిరుగుతున్నవాడిని మోడీకి దత్తపుత్రుడిగా అభివర్ణించిన విత్త మంత్రి నిర్మలాసీతారామన్ మాటలను విస్మరించడానికి లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ప్రజలు, రాజకీయ నాయకులు భయపడటం నిష్కారణమేమీ కాదు.

షిక్కటి చిరునవ్వుల మర్మమేంటి?..ష్ గప్ చుప్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెదవుల మీద చిరు నవ్వు చెరగదు. కానీ, ఆ చిరు నవ్వుల వెనక, ఏమి దాగుంది? అ నవ్వుల మర్మం ఏమిటి అనేది   కొద్ది మందికి తప్ప అందరికీ అర్ధమయ్యే విషయం కాదు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు  ఆయన రక్త సంబంధీకులు, బంధు వర్గమే. జగన్ చిరునవ్వుల వెనక ఎలాంటి కుట్రలు, కుయుక్తులు  పురుడు పోసుకుంటున్నాయో గుర్తించ లేమని అంటారు. అది బాబాయ్ మర్డరే, అయినా, తల్లీ చెల్లిని ఆర్థికంగా, రాజకీయంగా సైలెంట్ గా దెబ్బ తీయడమే అయినా  జగన్ రెడ్డి  తన చేతికి  మరకలు అంటకుండా నవ్వుతూనే కానిచ్చేశారని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ  రాష్ట్రంలో వీస్తున్న  చంద్రబాబు ప్రభంజనాన్ని ఎదుర్కునేందుకు జగన్ రెడ్డి మరో మారు సైలెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. అందులో భాగంగానే చిరునవ్వులు చిందిస్తూనే, తెలుగు దేశం పార్టీ  జాతీయ అధ్యక్షడు,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రజలలో తిరగకుండా చేసేందుకు జగన్ రెడ్డి  కుట్రలకు  తెర తీశారని అంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని, అలాగే, ఆయన్ని జైలుకే పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు.  అదలా ఉంచితే ఓ వంక చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే, మరో వంక జగన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో అటు ప్యాలెస్ లో గుట్టు చప్పుడు కాకుండా, గప్ చుప్’గా తమ పొలిటికల్ అండ్ పర్సనల్ అజెండాలను ముందుకు తీసుకుపోతున్నారని అంటున్నారు.   ముందుగా అసెంబ్లీ తంతు విషయానికి వస్తే  సమావేశాలు మొదలైన రోజునే  పొమ్మన కుండా పొగ పెట్టి తెలుగు దేశం సభ్యులను బయటకు పంపి  అడ్డు తొలగించుకున్నారు. ఇక అక్కడి నుంచి, సభ్యత, సంస్కారం, సభా మర్యాదలను పక్కన పెట్టి, చంద్రబాబు సహా సభలో లేని సమాధానం చెప్పుకునే అవకాశం లేని సభ్యులను ఉద్దేశించి ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. సభలో లేనివారిపై ఆరోపణలు కూడదన్న సభా నియమాలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. జగనన్న మెప్పు కోసం మంత్రి రోజా, మరి కొందరు జగన్ ను ఇద్రుడు చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేశారు.  జబర్దస్త్’ రోజుల నుంచీ  రోజాకు అది  అలవాటైన విద్యే అనుకోండి. సరే అది పక్కన పెడితే..   ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ రెడ్డి గప్ చుప్ గా గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల మెడకు ఉచ్చు బిగించారు. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున ఆమోదించిన జీపీఎస్‌ బిల్లులో  33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించ వచ్చనే నిబంధన వచ్చి చేరింది, అంటే, వయసుతో సంబంధం లేకుండా 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను మెడ పట్టి బయటకు గెంటే విధంగా  కంపల్సరీ రిటైర్మెంట్  క్లాజును తీసుకొచ్చింది. నిజమే, సెంట్రల్‌ సివిల్‌ సర్వీస్‌ పెన్షన్‌ నిబంధనలతోపాటు రివైజ్డ్‌ స్టేట్‌ పెన్షన్‌ రూల్స్‌-1980లోని 44వ నిబంధన ప్రకారం... ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించవచ్చు, అయితే ఇంత కాలం కేవలం కాగితాల్లో మాత్రమే ఉన్న నిబంధనను  తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయంలో నానా యాగీ చేసిన జగన్ రెడ్డి ఇప్పడు గుట్టు చప్పుడు కాకుండా,  జీపీఎస్‌ బిల్లులో చేర్చారు. నిజానికి అధికారంలోకి వచ్చిన  వారం రోజుల్లో   సీపీఎస్‌  రద్దు చేస్తామని మాటిచ్చి ఇప్పడు జీపిఎస్ బిల్లు తీసుకురావడమే  ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడం. అలాంటిది, అందుకు అదనంగా ఇప్పడు .. వయసుతో పనిలేకుండా ఉద్యోగుల  మెడ మీడకు  సర్వీసు కత్తిని తెచ్చారు. మరో వంక  ఎవరికీ తెలియకుండా  ఎవరికీ  చెప్ప కుండా ఛార్టర్డ్ ఫ్లైట్ లో దిగిన  వివాదస్పద పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి  జగన్ రెడ్డి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. ఎలాంటి అధికారిక హోదాలేని ఆయనకు... పోలీసు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది. తాడేపల్లి ప్యాలెస్ ఆయనకు విందు ఏర్పాటు చేసింది. సుమారు రెండుగంటలకు పైగాన అయన ప్యాలెస్ లో  ఉన్నారు. ఏ అధికార హోదా లేని ఒక వ్యాపార వేత్తకు ప్రభుత్వం రాచ లాంఛనాలతో స్వాగతం పలకడం ఏమిటి?  ఆయనతో ఏమి చర్చించారు?  దీపం ఉండగానే  ఇల్లు చక్కపెట్టుకునే ఉద్దేశంతో అధికారంలో ఉండగానే,  ఆదానీకి మరిన్ని మేళ్ళు చేసేందుకు జగన్ రెడ్డి సిద్డమయ్యారా? అనే సందేహాలు పరిశీలకుల్లో  వ్యక్త మవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రం, దేశం మొత్తం  అదే విషయంపై దృష్టిని కేద్రీకరించిన సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే  జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని మింగేసే  పెద్ద స్కెచ్ ఏదో వేసినట్లే  అనుమానించ వలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. అవును  ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సభా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నవ్వులు చిందించారు  కానీ  పెదవి విప్పలేదు ఒక్క మాట మాట్లాడ లేదు. అందుకే ఈ చిరు నవ్వుల  మర్మమేమీ, అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది ? అదే ఇప్పడు రాష్ట్రం ముందున్న  పెద్ద ప్రశ్న.

బటన్ నొక్కినా సొమ్ములేవీ?.. ఏపీకి ఇక జగన్ వద్దు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన కేవలం కక్ష సాధింపులకు, బటన్ నొక్కి ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చన్న భ్రమలకే పరిమితమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా.. అధికారాన్ని మొత్తం విపక్షాలపై కేసులు, వేధింపులకు మాత్రమే వినియోగించిన జగన్ రెడ్డి.. ఎన్నికలు ముందుకు వచ్చే సరికి బటన్ నొక్కడానికీ, ఒక వేళ నొక్కినా ఆ మేరకు లబ్ధి దారుల ఖాతాలలో జమ కావడానికి నిధులు లేక బిత్తర చూపులు చూస్తున్నారు. గతంలో బటన్ నొక్కిన పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఇంకా పూర్తిగా నగదు జమకాలేదు కానీ ఇప్పుడు మరో కొత్త బటన్ నొక్కేందుకు రెడీ అయిపోయారు. వాహనమిత్ర పేరులో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో పది వేల రూపాయల చొప్పున జమ చేస్తామంటున్నారు. అయితే ఆయన బటనైతే నొక్కు తారు కానీ అందుకు సంబంధించి సొమ్ములు మాత్రం ఖాతాలలో పడేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక ఇప్పుడు తాజాగా ఆయన వాహన మిత్ర పేరుతో ఏపీలో ఆటోలు, కార్లపై  ఆధారపడే వాళ్లకు సొమ్ములు జమ చేస్తామంటున్నారు. అది కూడా రెండు లక్షల మందికి. అంటే జగన్ దృష్టిలో రాష్ట్రంలో వాహనాలు నడపడం ద్వారా జీవనోపాధి పొందేవాళ్లు రెండు లక్షల మంది మాత్రమేనా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే అదలా ఉంచితే.. వాళ్లకైనా జగన్ బటన్ నొక్కగానే సొమ్ములు వారి ఖాతాలలో జమ అవుతాయా అంటే మాత్రం ఔనన్న సమాధానం రావడం లేదు. బటన్ నొక్కుకుంటే వెళ్లడమే ముఖ్యమంత్రి పని.. అందుకు సంబంధించి సొమ్ములు జమ అవుతాయా? అయితే ఎప్పుడు అవుతాయి? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నెల కిందట జగన్ బటన్ నొక్కి పదేరం చేశానని చెప్పుకున్న  ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు ఆయా లబ్ధిదారుల ఖాతాలలో జమ కాలేదు. కానీ పీజురీయింబర్స్ మెంట్ కోసం జగన్ బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మాత్రం కొట్లలో ఖర్చయ్యింది. పందేరం చేయని డబ్బుల కోసం సభలెందుకు అంటారా?   మరి జగన్ మాట్లాడేందుకూ, విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు వేదిక కావాలి కదా? అందుకు. బటన్ నొక్కే కార్యక్రమం కోసం మాత్రమే జగన్ రెడ్డి ప్యాలెస్ దాటి బయటకు వస్తారు.  తన ప్రభుత్వ పథకాలను చెప్పుకోవడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయరు. ఎందుకంటే విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  జనాలకు సొమ్ములు పందేరం చేస్తున్నామంటే కనీసం లబ్ధిదారులైనా తన సభకు వస్తారన్న ఉద్దేశంతోనే జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు మాత్రమే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకు కూడా దారికి ఇరువైపులా పరదాలు కట్టుకుని.. తాను, లేదా తన పార్టీ ఎంపిక చేసిన వారు మాత్రమే సభకు హాజరయ్యేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ వేదిక ఎక్కుతారు. ఇక అక్కడ ఆయన వాగ్ధాటిని అడ్డుకునే వారెవరూ ఉండరన్న ధైర్యంతో ప్రభుత్వ కార్యక్రమం అని కూడా గుర్తించకుండా రాజకీయ ప్రసంగాలు చేస్తారు. తన రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించేస్తారు. తన విమర్శలను కనీసం సభకు వచ్చిన వారు వింటున్నారా? బటన్ నొక్కడం అయిపోగానే.. ప్రసంగం ప్రారంభించగానే వెనుదిరిగి వెళిపోతున్నారా అన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోరు. తన ప్రసంగం తాను కొనసాగించేసి మమ అనేస్తారు. అంతే ఆయన పబ్బం గడిచిపోతుంది. మళ్లీ మరో బటన్ నొక్కుడ కార్యక్రమంలో తప్ప ఆయన బయట కనబడరు.  బటన్ నొక్కినా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు జమ కాలేదు. అలాగే కాపు నేస్తం అంటూ బటన్ నొక్కారు. ఆ నిధుల విషయం కూడా అతీగతీ లేదు. అడుగుదామంటే బెదరింపులు.  ఇక అమ్మఒడికి ఆయన ఎప్పుడో బటన్ నొక్కేశారు. అందుకు సంబంధించిన సొమ్ముల కోసం అమ్మలు ఎదురు చూస్తూనే ఉన్నారు. విడతల వారీగా అప్పుడో కొంత మంది, ఇప్పుడో కొంత మంది అన్నట్లుగా నిధులు అక్కౌంట్లలో జమ అవుతున్నాయి.   ఇక వాహనమిత్రకు ఆయన బటన్ నొక్కి మాత్రం లబ్ధిదారులకు చేకూర్చే ప్రయోజనం ఏముంటుందని జనం అంటున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో  మహిళలకు అందాల్సిన చేయూత పథకం కోసం బటన్ నొక్కాల్సి ఉంది.  అది ఎప్పుడు అన్న విషయంలో స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో  ఏపీకి జగన్ ఎందుకు అంటూ కొత్త కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఔను జనం కూడా అదే అంటున్నారు. ఏపీకి జగన్ ఎందుకు? అవసరం లేదు అంటున్నారు.  

కాలం చెల్లిన రూ.2000 నోటు!.. ఖాతాలలో డిపాజిట్ కు ఇక ఒక్క రోజే గడువు

రెండు వేల రూపాయల నోట్ల చెలామణికి  శుక్రవారంతో గడువు ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 నవంబర్ 18న రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అప్పట్లో అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు మోడీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పటికి చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. కొత్తగా 500 రూపాయలు, రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టింది.  సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టి ఈ ఏడాది నవంబర్ 18కి ఏడేళ్లు పూర్తి అవుతుంది. అయితే పెద్ద నోట్ల రద్దు అంటూ మళ్లీ పెద్ద నోటు రెండువేల రూపాయలను ప్రవేశ పెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. రెండు వేల రూపాయల నోటును ప్రవేశ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరే అది పక్కన పెడితే  రెండు వేల రూపాయల నోటు ప్రవేశ పెట్టిన లక్ష్యం నెరవేరిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి చెలామణిని రద్దు చేసింది. వాటిని ఖాతాలలో జమ చేసుకోవడానికి చివరి గడువుగా సెప్టెంబర్ 30ని నిర్ణయించింది. దీంతో ఇక శుక్రవారం (సెప్టెంబర్ 2 నుంచి రెండు వేల రూపాయల నోటకు కాలం చెల్లినట్లే.   ఇప్పటికీ ఇంకా  ఎవరి వద్దనైనా రెండు వేల రూపాయల నోటు భద్రంగా ఉండి ఉంటే దానికి తమ ఖాతాలలో జమ చేసుకోవడానికి తుది గడువుకు ఇక ఒక్క రోజే ఉందన్నమాట. ఆ తరువాత ఎంత భద్రంగా దాచుకున్నా రెండు వేల రూపాయల నోటు విలువలేని రంగుకాగితం మాత్రమే అవుతుంది.  

ఉండవల్లి..ఊసరవెల్లి!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి ఊసరవెల్లిగా మారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత మేధావి  ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగానే ఆయన జనంలో క్రెడిబులిటీ కోల్పోయి చులకన అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంత సేపూ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ కు వత్తాసు పలికేందుకు తెలిసిన వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రువు విమర్శించారు. స్కిల్ కేసు విచారణను సీబీఐ చేపట్టాలని కోరుతూ ఉండవల్లి హైకోర్టులో కేసు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించి జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ అక్రమ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించడం జగన్ కుట్రలో భాగమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. స్కిల్ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా   ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందుగా అరెస్టు చేసేసింది. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామనీ, విచారణలో బయటకు వచ్చే అవకాశాలున్నాయనీ అంటూ కోర్టుల్లో చెబుతోంది. సెక్షన్ల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అరెస్టు అక్రమమని విస్పష్టంగా తేలిపోతున్నదని సీఐడీ చీఫ్ ఊరూరా తిరుగుతూ మీడియా సమావేశాలలో చెబుతున్న మాటలే తేటతెల్లం చేస్తున్నాయి.  అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించారు.  జగన్ సర్కార్ చంద్రబాబు జనంలో మమేకం అవ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో పన్నుతున్న కుట్రలకు ఉండవల్లి సహకారం అందిస్తున్నారు.  చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో విమర్శలు చేసిన ఉండవల్లి ఈ నాలుగున్నరేళ్లలో జగన్ మద్యం విధానాలపై ఒక్కసారి కూడా నోరు మెదపలేదు?  ఇసుక దోపిడీపై మాట్లాడింది లేదు.  రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఉండవల్లి మౌనం వహించారు. అయితే నిలవని కేసు విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాత్రం ఏకంగా సీబీఐ విచారణ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఉండవల్లి తీరు మొదటి నుంచీ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇబ్బందులలో పడినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి.. తనకు మాత్రమే సాధ్యమైన అసంబద్ధ లాజిక్ తో జనాలను కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యమన్నట్లుగా ఉంది.  సమైక్య వాదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా రాష్ట్ర విభజన సమయంలో బిల్డప్ ఇచ్చిన ఉండవల్లి.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం ప్రకటించిన ఉండవల్లి.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తూ వచ్చారు.   మార్గదర్శిపై పోరాటం అంటూ రచ్చ చేసే ఉ:డవల్లి జగన్ అరాచక పాలనపై ఒక్క సారి కూడా నోరెత్తలేదు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై మాట్లాడింది లేదు. ఏటువంటి ఫిర్యాదూ లేని మార్గదర్శిపై పోరాటం అనే ఉండవల్లి వేల మంది ఆరోపణలూ, ఫిర్యాదులూ చేస్తున్నా అగ్రిగోల్డ్ సమస్యపై ఎందుకు మాట్లాడరన్న ప్రశ్నకు ఆయన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు లేకుండా నోరెత్తరని పరిశీలకులు విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు.  ఉండవల్లికి ఒక నిశ్చితాభిప్రాయం ఉన్న దాఖలాలు లేవనీ, విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్న ఆయన ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి మద్దతు దారుగా, ఏపీలో ఆయన పార్టీకి తాను సంపూర్ణ మద్దతు ఇస్తానంటూ ముందుకు వచ్చారు. ఏకంగా జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకే కేసీఆర్ తో భేటీ అయిన రోజునే ఉండవల్లి కూడా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. ఇరువురి మధ్యా జరిగిన చర్చలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ భేటీ తరువాత ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలో బీఆర్ఎస్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తన రాజకీయగురువు వైఎస్ కుమారుడికి ప్రయోజనం చేకూర్చేందుకే కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడిన ఉండవల్లి.. విభజన వాదానికి కర్త, కర్మ, క్రియా అయిన కేసీఆర్ తో చేతులు కులిపారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి మేధావి ముసుగులో జగన్ కుట్ర రాజకీయాలకు వంత పాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అమరావతిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల జపంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ విధానాలపై పల్లెత్తు మాట అనకుండా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ కుట్రపూరితంగా నమోదు చేసిన సిల్క్ కేసులొ సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే ఆయన విశ్లేషణలూ, విమర్శల వెనుక ఉన్నది జగనేనని స్పష్టమౌతోందని పరిశీలకులు చెబుతున్నారు.  

సీఎం జగన్‌తో అదానీ రహస్య భేటీ? ఏ బిగ్ డీల్ కోసమో?

ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే పారదర్శకత ఉండాలి.  భరత్ అనే నేను సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇదే కదా అనుకుంటున్నారా? ఔను నిజమే కానీ.. అచ్చం అలాంటి డైలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే  అప్పటికి ఆయన సీఎం కాలేదు. కానీ,  ఆయన సీఎం అయ్యాక మాత్రం ఆ డైలాగ్ మర్చిపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? నాడు సినిమా డైలాగులు చెప్పిన జగన్ ఇప్పుడు పారదర్శకత, జవాబుదారీ తనం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రభుత్వం విడుదల చేసే జీవోలు రహస్యం. ఆయన నిర్ణయాలు రహస్యం. చివరాఖరికి ఆయన భేటీలూ రహస్యంగానే సాగిస్తున్నారు. మొత్తంగా జగన్ రహస్య పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు తెలియజేయాలి. ప్రతి అంశాన్ని జనాలకు వివరిస్తూ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు.. మేం  ప్రజలకు చెప్పేదేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. అసలు కనీసం సీఎంను ఎవరు కలుస్తున్నారో.. ఎందుకు కలుస్తున్నారో.. వ్యక్తిగతంగానే ఈ భేటీలు జరుగుతున్నాయా? లేక ప్రభుత్వ పరమైన విధానాల కోసమే జరుగుతున్నాయా అన్న కనీస సమాచారం కూడా ప్రజలకు తెలియజెప్పడం లేదు.   సీఎం జగన్మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ  భేటీ అయ్యారు. ఈ భేటీకి తాడేపల్లి  ప్యాలెస్ వేదికైంది. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్ కూడా చేశారు. అయితే  ఇంత సడన్‌గా ఏపీకి అదానీ ఎందుకొచ్చారు? అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి మరీ వీఐపీ హోదాలో ఆయనను తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్లడంతో విషయం  బయట పడింది. ఏపీలో వ్యాపార సంబంధ వ్యవహారాలపై మాట్లాడేందుకు వచ్చారని వైసీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. కానీ, అదానీ ఎందుకొచ్చారన్నది మాత్రం స్పష్టంగా చెప్పే వారే లేరు.  జగన్ ఇప్పటికే అదానీకి అప్పనంగా కోట్ల రూపాయిలు విలువచేసే ప్రాజెక్టులు కట్టబెట్టారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు రాసిచ్చేశారు. విశాఖలో డేటా సెంటర్ పేరుతో కొండల్ని కట్టబెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా ఇచ్చేయాలనుకున్నా.. చివరికి అదానీ సమస్యల్లో ఇరుక్కోవడంతో వెనక్కి తగ్గారు. ఇప్పటికే సంప్రదాయేతర విద్యుత్ ఒప్పందాల పేరుతో అదానీకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరి ఇంకా ఏపీలో ఏం మిగిలుందని ఈ రహస్య భేటీ జరిగిందన్నదా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా మరో బిగ్ డీల్ ఏదైనా జరగబోతోందా అంటే నెటిజన్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అధికార వర్గాలలోనూ, రాజకీయవర్గాలలోనూ ఇదే చర్చ జరుగుతోంది.  గౌతం అదానీకి మన రాష్ట్రంలో రహస్య పర్యటనలు చేయడం కొత్తేమీ కాదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటికే చాలా సార్లు రహస్యంగా వచ్చారు.  సీఎం జగన్ తో పలు దఫా రహస్య చర్చలు కూడా జరిపి వెళ్లారు. గతంలో కూడా ఆయన ఎందుకొచ్చారు? ప్రభుత్వ పని మీదనా? వ్యక్తిగత పని మీదనా అన్న విషయాలను సీఎంవో కానీ.. క్యాంప్ ఆఫీస్ వర్గాలు కానీ ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ సారి కూడా భేటీపై అధికారిక ప్రకటన వచ్చే అకాశం లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే, అదానీ స్వయంగా వచ్చి జగన్ తో డిన్నర్ చేసి వెళ్లారంటే ఖచ్చితంగా అది బిగ్ డీల్ అన్నది అర్ధమవుతుంది.  ఏ విషయమైనా దాచేస్తే దాగదులే అన్నట్లుగా  ఈ భేటీ ఏ బిగ్ డీల్ కోసం అన్నది ఇవాళ కాకున్నా రేపైనా బయటపడక మానదు. 

ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?.. వైసీపీ కొత్త నినాదం

 ఏంటో పాపం ఎన్ని పేర్లు మార్చినా ఏపీలో వైసీపీకి సౌండ్ పెరగడం లేదు. గడప గడపకి వైసీపీ, జగనే మా నమ్మకం, వైనాట్ 175 ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజలపై రుద్దాలని చూశారు. కానీ, ప్రజలు వాటిని  పట్టించుకోలేదు. గడప గడపకి కార్యక్రమంలో అయితే ఇళ్లకు వెళ్లిన వైసీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించారు. మంత్రులు అని కూడా చూడకుండా ఏం సాధించారని నిలదీశారు. నాలుగేళ్ళ మీ పాలనలో నరకం చూశామంటూ మొహాల మీదనే తిట్టిపోశారు. ఆ దెబ్బతో చాలా మంది నేతలు మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం ఏమో ఏదోకటి నచ్చ జెప్పండి.. ఒక్కో కుటుంబానికి ఎంత ఇచ్చామో లెక్కలు చెప్పి ప్రజలను మచ్చిక చేసుకోండి అంటూ ఆదేశించినా.. ప్రజల వద్దకు వెళ్లిన నేతల పప్పులు ఉడకనేలేదు. ఇంతిచ్చామని వైసీపీ నేతలు లెక్కలు చెప్తే.. గత ప్రభుత్వం ఏం చేసిందో గణాంకాలతో సహా చూపిస్తూ జనం వైసీపీ నేతలను కడిగి పారేశారు.  ఎన్ని పథకాలు తెచ్చినా.. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. చేశామని చెప్పుకుంటున్నా ప్రజలలో వ్యతిరేకతే తప్ప సానుకూలత ఇసుమంతైనా కనిపించకపోవడంతో  వైసీపీ వ్యూహకర్తలు కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. అలా ఇప్పుడు వైసీపీ నుండి వచ్చిన మరో పథకమే 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?'. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్సీలతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ ఈ కార్యక్రమంపై ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. త్వరలో చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించిన రిషిరాజ్.. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంపై పలు వివరాల్ని వెల్లడించగా.. ఈ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ.. ఇదే ప్రయోజనాలు కొనసాగాలంటే మళ్ళీ జగనే కావాలని ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, జగనన్నగృహ సారథులను భాగస్వాములుగా చేసుకుంటూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జగన్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరులో గడప గడపకు ప్రోగ్రాం ముగించనున్నట్లు చెప్పిన వ్యూహకర్తలు.. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని.. అందుకు పునాది  'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి'? కార్యక్రమం ఉంటుందని చెప్పారని అంటున్నారు.  నవంబరు నుండి కొత్త కొత్త కార్యక్రమాలతో నేతలంతా నిత్యం ప్రజల మధ్యనే ఉండేలా ఐప్యాక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో నేతలకు చెప్పిన జగన్.. ఇక నుండి ఎన్నికల వరకూ నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని కోరారని చెబుతున్నారు. కాగా, వైసీపీ కొత్త కార్యక్రమంపై ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో ట్రోల్స్ మొదలయ్యాయి. 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి' అంటూ వైసీపీ కార్యక్రమం రూపొందిస్తుంటే ప్రత్యర్ధులు 'ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో' వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీ పరిపాలన మొదలు పెట్టిన రోజులలో కరకట్టపై ఉన్న ప్రజా వేదిక కూల్చివేత నుండి రంగుల కోసం వృధా చేసిన ప్రజా ధనం, అన్న క్యాంటీన్ల మూసివేత, మద్యం ధరలు పెంచి చేసిన ప్రజా దోపిడీ, ఇసుక కోసం ప్రజలు పడిన,పడుతున్న పాట్లు, రాష్ట్రంలో కొరవడిన ఉపాధి, కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు, వైన్ షాప్ ల వద్ద టీచర్ల కాపలా, మాస్కులు అడిగిన వైద్య సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులు, ఎమ్మెల్యేలు.. మంత్రుల బూతు పురాణాలు, అసెంబ్లీలో వైసీపీ నేతలు వేసిన వెకిలి వేషాలు, రాష్ట్రంలో  గుంతల మయంగా మారిన రోడ్లు, మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన కుట్రలు, అటకెక్కిన పోలవరం నిర్మాణం, సీపీఎస్ రద్దు పేరిట ఉద్యోగులకు చేసిన మోసం, జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను నిలువునా ముంచిన తీరు ఇలా అన్నిటినీ వివరిస్తూ ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో ఆ పోస్టులలో సవివరంగా పెడుతూ వైసీపీ గాలి తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో   వైసీపీకి ఈ కొత్త నినాదం ఏమేరకు పనికి వస్తుందో చూడాలి. ఇది కూడా మరో గడపగడపకూ కార్యక్రమంలాగే అభాసుపాలు కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జనంలోకి లోకేష్.. అరెస్ట్ కు సర్కార్ కుట్ర?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి యువగళం పాదయాత్ర  ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం ఏపీ  అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. లోకేష్ సైతం టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ రోజున యువగళం పాదయాత్ర ఎక్కడ ఆగిందో ఇప్పుడు తిరిగి అక్కడ నుంచే ప్రారంభం కానుంది. అయితే, లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టక ముందే అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతున్నదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసి, జగన్ సర్కార్ కక్షపూరిత చర్యలను ఎండగడుతూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్న లోకేష్ త్వరలోనే రాష్ట్రానికి వచ్చి యువగళం పాదయాత్ర పునఃప్రారంభించనున్నారు. అయితే, జగన్ ప్రభుత్వం లోకేష్ ను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసులు పెట్టి లోకేష్ పేరుని చేర్చిన ఏపీ సీఐడీ అధికారులు తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చారు. అంతే కాదు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దీని మీద పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఆయనతో పాటు అప్పటి మంత్రి నారాయణపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే యాంటిసిపేటరీ  బెయిల్ తెచ్చుకున్నారు. కాగా, లోకేష్ పాదయాత్రను పున:ప్రారంభించాలని చూస్తున్న నేపథ్యంలో యాత్ర ప్రారంభించకుండానే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో మరో హడావిడి మొదలైంది. ఇప్పటికే చంద్రబాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేష్ కూడా అరెస్ట్ అయితే   ఏపీ రాజకీయాలు  మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఇప్పటికే చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతీకార చర్యగా పరిశీలకులు తేల్చేశారు. ప్రజలు కూడా దీనిపై అనేక రకాలుగా చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు, సీఐడీ కేసుల విచారణ చూస్తున్న సామాన్య ప్రజలు ప్రభుత్వం చేతిలో వ్యవస్థలు పావులుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ అరెస్టు చేస్తే కక్ష పూరితంగానే   ప్రభుత్వం ఈ కుట్రలకు తెగబడుతుందని ప్రజలు నిర్ధారణకు వచ్చేస్తారు. ఇప్పటికే జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనం, తెలుగుదేశం శ్రేణులు లోకేష్ అరెస్టు అవుతారనే ప్రచారం నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎక్కడికక్కడ దీక్షలు చేపడుతూ నిరసనలు తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు లోకేష్ అరెస్టుతో ఎలాంటి నిర్ణయాలకు దిగుతారన్నది అంచనా వేయడం కూడా కష్టమే.  ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు అరెస్టుతో వస్తున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ.. లోకేష్ అరెస్ట్ కి కూడా ప్రయత్నిస్తున్నదంటే టీడీపీకి వస్తున్న సానుభూతి ఎన్నికలలో తనను ఏమీ చేయలేదని భావిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్ అరెస్టుతో టీడీపీని దెబ్బకొట్టి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నటు భావిస్తున్నారు. అధినాయకత్వాన్ని దెబ్బకొట్టి క్యాడర్ లో నిరాశను పెంచి తాను లబ్ది పొందే కుట్రలో భాగమే ఈ అరెస్టులని విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ అరెస్టులు.. ప్రభుత్వ నిర్ణయాలు రోజురోజుకూ ప్రజలలో అసంతృప్తి, అగ్రహాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలోనే ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసన దీక్షలు చేపడుతున్నారు. జగన్ ప్రభుత్వ కక్షపూరిత నిర్ణయాలపై ప్రజలలో చర్చ జరిగేలా చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత నషాళానికి ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

తుగ్లక్, హిట్లర్, గోబెల్స్‌కు ప్రతిరూపం జగన్ ?

ఏది సత్యం, ఏది అసత్యం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అంశాలను ప్రజలు గుర్తించాల్సి వుంది. మరోసారి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబుని అవినీతిపరుడుగా చిత్రించేందుకు ఏటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి.. అన్యాయంగా  జైలులో పెట్టించి..  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తున్న దగా నాయకుడి చరిత్ర ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్ధిక ఉగ్రవాదానికి పాల్పడిన ఆర్ధిక నేరస్థుడు ఎటువంటి నేరానికి పాల్పడని మచ్చలేని నాయకుడిపై అవినీతి ఆరోపణలు చెయ్యడం సిగ్గు చేటు. గాలి మంద గాలి ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో అవినీతికి పాల్పడి, ఏ స్థాయిలో కూడా నీతికి, నిజాయితీకి విలువ లేకుండా చేసి తెలుగువారంటే అంతా మోసం, దగా అన్న భావన ప్రపంచానికి కల్పించిన జగన్ రెడ్డి.. చంద్రబాబుని అవినీతి పరుడుగా చిత్రించడం చూసి ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకం ఛీ  కొడుతున్నారు. రెండవ సారి అధికారంలోకి రావడం కోసం ఆధారాలు లేని కేసులు పెట్టి చంద్రబాబును అవినీతి పరుడు గా చిత్రించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అవినీతి అంటూ చంద్రబాబుపై జగన్ గ్యాంగ్ చేస్తున్న రాద్దాంతం అంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే తప్ప మరొకటి మాత్రం కాదు. ఏ విధంగా అయినా ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందటానికేనని అర్ధమవుతుంది.  ఒక పక్క రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడి కూడా అవినీతి గురించి సుద్దులు చెప్పడం అంటే అంతకన్నా మోసం మరోకటి లేదు. వైఎస్ఆర్ హయాంలో అంతా ప్రజల కోసమేనంటూ నిష్టగా సాగిన అవినీతి యజ్ఞంలో కొల్లగొట్టబడిన ప్రజాధనాన్ని నిగ్గు తేల్చడానికి దర్యాప్తు సంస్థలు ఎంతగా శ్రమ పడ్డాయో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలంతా సైతం చూశారు. రూ.43 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఏకంగా పెద్ద బొర్రే పెట్టినట్లు సిబిఐ తేల్చి 17 ఛార్జి షీట్లు వేసింది. అన్నీ ఛార్జిషీట్లలోను వైయస్ జగన్‌ని మొదటి ముద్దాయిగా తేల్చింది. తండ్రి అధికారానికి అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసి, రాష్ట్రాన్ని మాఫియా మయం చేసి లక్ష కోట్ల ప్రజాధనం దిగమింగిన ఘనుడీ జగన్ రెడ్డి. జగన్ ఆర్ధిక నేరాలు పలు దేశాలకు సైతం విస్తరించాయని న్యాయస్థానాలు సైతం నివ్వెరపోయాయి. అవినీతిపరులను దీప స్తంభాలకు ఉరి తీయాలని తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు చట్టబద్దంగా అలా ఆదేశించే వీలు లేకపోయిందంటూ కొన్నేళ్ళ క్రితం బాధ పడింది, అలాగే చైనా జాతీయుడిగా వైయస్ జగన్ ఇంత దోపిడీకి పాల్పడి వుంటే అక్కడ అతనికి నిర్ధాక్షిణ్యంగా మరణ శిక్ష అమలు జరిగేది. ప్రపంచంలో మరే ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో అయితే జగన్ బతుకు శంకరగిరి మాన్యాలు పట్టి వుండేది. అయినా జగత్ కిలాడి అయిన జగన్ రెడ్డి తానే నిజాయితీ పరుడుగా అమాయక జనం చెవిలో పూలు పెడుతున్నాడు.  గతంలో ముంబయిని వణికించిన మాఫియా శక్తుల్లో అరుణ్ గావ్లీ ఒకడు. తరువాత అరుణ్ గావ్లీ 1997లో అఖిల భారతీయ సేన పేరిట ఓ రాజకీయ పార్టీ స్థాపించి 2004 లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే అతడి పాపం పండి నేడు జైల్లో వున్నాడు. సమాజానికి చీడ పురుగుల్లాంటి అరుణ్ గావ్లికి, జగన్ గ్యాంగ్‌కి ఎందులోనూ తేడా లేదు. తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాక ముందు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వుందని మొర పెట్టుకున్న కుటుంబం,  కర్నాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్ హ్యాండ్ విద్యుత్ ప్లాంట్ 1998లో ఎవరి దగ్గరో కొని 2004 వరకు దాంతో కుస్తీలు పడుతున్న పుత్రరత్నం దశ  అయిదేళ్లలో తిరిగి వేల కోట్ల రూపాయల విలువ చేసే బహుముఖ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందంటే అది అంతా రాష్ట్రాన్ని ఏడాపెడా దోచిన దురాగతం కాదా? జగన్ బొక్కింది గాలికి పోయే పేలాల పిండి కాదని, ప్రజలకు దక్కాల్సిన వేల కోట్ల ప్రజాధనమని జగన్ గ్యాంగ్ గుర్తించాలి,  జలయజ్ఞం, గనులు, సెజ్‌లు, కారిడార్లు, పోర్టులు, నాలెడ్జ్ హబ్‌లు, లేపాక్షి, ఒడిస్సీ, ఎకనామిక్ సిటీలు, రస్ అల్ ఖైమా, ఎమ్మార్..  ఇలా రాజావారి కన్ను పడ్డ ప్రతిదీ కుంభకోణమే. ఏమీ జరగని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో జరిగిపోయిందని తన ముందుకు వస్తే నోరు పట్టే వారిని, వెనక్కి వస్తే దోచేళ్లు పట్టేవారిని ఊరూరు పంపించించి ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ప్రచారం చేయిస్తున్నాడు.  తన తండ్రి వైఎస్ఆర్ వివిధ రూపాల్లో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సత్ పరిపాలనా సూత్రాలను, రాజ్యాంగ యత్రాంగాలను కాల రాసిన భ్రష్ట చరిత్ర వైఎస్‌ఆర్‌ది. జగన్ దాచింది అంతా జనాన్ని దోచిందే. రాష్ట్ర సర్వతొ ముఖాభివృద్దికి దోహద పడాల్సిన వనరులతో హవాలా నడిపి లెక్కలేనన్ని బినామీ కంపెనీలతో చట్టం కళ్ళు కప్పి నేర పూరిత కుట్రలకు పాల్పడిన జగన్ నేడు పత్తిత్తు మాటలు చెబుతున్నారు. రాజకీయ డ్రామాలు రక్తి కట్టించడంలో జగన్ అభినవ నటుడు ,ఆయన జగన్నాటకం ముందు పగటి వేషం అనేక కళారూపం వెనకబడి పోయింది. ఎంతగా నటిస్తే అంతగా రాజకీయం పండుతుందని జగన్ ఆశ. ప్రజల్ని ఏదో విధంగా మోసం చెయ్యడమే ఆయన లక్ష్యం. చట్ట బద్ద పద్దతుల్లో, ప్రజ్ఞా పాటవాలతో ఎవరు ఎదిగినా.. ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎల్లవేళలా రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎల్లలెరుగని కుంభకోణాలతో జన ఖజానాకు చెందాల్సిన సమస్తాన్ని తన కుటుంభానికి దోచిపెట్టిన తీరు నభూతో... అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాదనం దోపిడి తప్ప ప్రజాసేవ అంటే ఏమిటో తెలియని జగన్...  జనం కోసమే పుట్టినట్టు జగన్నాటకాలు ఆడుతున్నాడు.  అక్రమంగా తన తండ్రి తవ్విపోసిన మంది సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకొని నీతులు చెప్పడం సిగ్గు చేటు. నాలుగేళ్ల క్రితం వరకు ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిబడిన పెద్దమనిషి, ఆస్తులు జప్తు చేయించుకున్న జగన్ రెడ్డి.. చంద్రబాబు అవినీతి పరుడుని  ప్రజలను నమ్మించడానికి ఎన్నో..ఎన్నేన్నో అవస్థలు పడుతున్నారు. ముస్సోలినీ, సద్దాం హుసేన్, ఇడీ అమీన్, హిట్లర్ ఆలోచనల ప్రతి రూపమే వైయస్ జగన్ అని చెప్పాలి. అధికార గర్వంతో, లెక్కలేని తనంతో, రాక్షస పాలన సాగిస్తున్నారు. అహంకారులకు గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రతిపక్షానికి, పౌరులకు రాజ్యాంగం కల్పించింది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19ని అడ్డుకొనే చట్టమే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు శాంతి యుతంగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు నిర్వహించరాదంటూ అనుమతి నిరాకరించడం దుర్మార్గపు చర్య. జగన్‌ పరిపాలనలో ప్రజాస్వామ్యానికి  పెడరెక్కలు విరిచే వికృతం విశ్వరూపం దాల్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు, దర్నాలు, దీక్షలు నిర్వహించే హక్కు కూడా లేకపోతే ఇది ప్రజా స్వామ్యమా? జగన్ స్వామ్యమా?  రాష్ట్రం ఏమన్నా జగన్ జాగీర్ అనుకొంటున్నారా? జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 144  సెక్షన్, 30 యాక్టు నిరంతరం అమలు చేస్తూనే వున్నారు. తానూ ప్రతి పక్షంలో వున్నప్పుడు అనేక  రోజులు రోడ్లపై పాద యాత్రలు, దీక్షలు చేశారు? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకొంటే జగన్ రెడ్డి పాద యాత్ర  చేసే వారా? స్వాతంత్రోద్యమంలో కానీ, 1975 నాటి ఎమర్జెన్సీలో కానీ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఏపీలో నయా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లారా చూసిన పెద్దలు చెబుతున్నారు. ఇందిరాగాంధీ  ఎమర్జెన్సీ విధించినా, పౌర హక్కులను కాలరాసినా ప్రజలు  రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపినా  పోరాటాలు ఆగలేదు. కానీ ఇప్పుడు ఊరూరా పోలీసులే. హౌస్‌ అరె‌స్టులు చేస్తూ ఇళ్లనే జైళ్లుగా మార్చేస్తున్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టడం అంటే  రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్ధం అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్యులనూ వేధిస్తున్నారు. లాఠీ చార్జీ చేయడం, నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జగన్‌ ఏలుబడిలో జగన్ రెడ్డి  రాజ్యాంగం అమలవుతోంది. ఐపీసీ కాదు. వైసీపీ చట్టం అమలవుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీలో మాత్రమే రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు హరించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీకి మించిన అణచివేత కొనసాగుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ బోర్డర్‌ను తలపించే విధంగా వందల మంది పోలీసులను, పారా మిలటరీ బలగాలను మోహరింప చేయడం దారుణం. అక్రమ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు కుటుంబానికి  మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి బయలుదేరిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని అడ్డుకోవడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం సర్వ శక్తులు ఒడ్డింది. అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేశారు. ఎక్కడిక్కడ కార్లను ఆపేసి, రోడ్డు పక్కకు నిలిపేశారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అంటూ ప్రశ్నలు సంధించి మరీ వేధించారు. అయినా హైదరాబాద్‌లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు పట్టువదలని విక్రమార్కుల్లా అడ్డంకులు ఛేదించుకొని రాజమండ్రికి చేరుకొని నారా బ్రాహ్మణిని కలసి తమ మద్దతు తెలిపారు.    జగన్ ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక, అక్కసుతో, దుర్భుద్దితో చంద్రబాబు అరెస్ట్‌కు ప్రతిగా జరుగుతోన్న నిరసనలు, దర్నాలు, దీక్షలు, ర్యాలీలను అడ్డుకొంటున్నది. ప్రతిపక్షాల స్వేచ్చకు గోరీ కట్టే  నిరంకుశ ధోరణికి సమాధి కట్టకపోతే ప్రజాస్వామ్యం  మనుగడ సాగించదు. స్వార్ధంతో ఎంతటి నీచ చర్యకైనా వెనకాడని విపరీత మనస్తత్వం గల జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికార పీఠం అధిష్టించిన జగన్ రెడ్డి ఆ ప్రమాణాన్ని పాతాళంలో పాతరేశారు. జగన్ ఫాసిస్ట్ క్రూర మనస్తత్వానికి అధికారం తోడు కావడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుంది. ప్రభుత్వం మాదే, వ్యవస్థలు మావే, మేము చేసిందే చట్టం, మేము చేసేదే పరిపాలన అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఎవ్వరూ ఎదురు రాకూడదని, తమకు అందరూ భయపడాలని నిరంకుశంతో, నిర్భందాలతో పాలన సాగిస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దానిని ఎవ్వరు అతిక్రమించరాదని . సభలు, సమావేశాలు, ప్రదర్శనలు జరిపే హక్కు రాజకీయ పక్షాలకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలకులు నిరంకుశంగా, నా ప్రభుత్వం నా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తుంటే ప్రజలు, ప్రతిపక్షం మాత్రం చట్టాలను, జీవోలను ఎందుకు గౌరవించాలి?   రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రంలో పాలన లేనప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్ ఉపేక్షించ రాదు. ప్రజాస్వామ్యాన్ని చెల్లని కాసుగా మార్చిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిదే. అఖిల భారత సర్వీస్ అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని,  చట్టాలను కాపాడతామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని ఐ ఏ ఎస్,ఐపిఎస్ అధికారులు  గుర్తించకపోవడం బాధాకరం.  ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఐదేళ్లకొక సారి మారుతోంటాయి. వీరు మాత్రం 60 ఏళ్ళు పదవుల్లో కొనసాగుతారు. అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాoగ నిర్మాతలు కల్పించిన హక్కులు, అధికారాలు సామాన్యమైనవి కావు. కానీ చట్టానికి,రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాధ్యత లేకుండా పనిచేస్తూ వ్యక్తి గుర్తింపు కోసం, ప్రమోషన్లకు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనలకు సభలకు, ర్యాలీలకు అనుమ్మతులు నిరాకరించడం, ముందస్తు అరెస్ట్‌లకు పాల్పడటం, గృహ నిర్బంధాలు వంటి నిరంకుశ చర్యలతో పాలన సాగిస్తున్నారు. అధికార పార్టీ దన్నుతో పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ రెడ్డి అహంకారంతో, ప్యూడలిస్ట్ స్వభావంతో పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వ, వేధింపులు, సాధింపులు, నియంతృత్వంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి అడుగులకు మడుగులోత్తుతూ ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించడం మంచిది కాదని గుర్తించాలి. రాష్ట్రంలో పోలీసులు నేరం చేసిన వారిని కాపాడుతున్నారు. భాదితుల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజలకు విధేయులుగా వుండాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులకు విధేయులుగా వున్నామని నిరూపించుకోవడానికి పోలీసు వ్యవస్థ అంతులేని ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నది. ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపొయారు. జగనొక లెక్క కాదు. ప్రజలు ఇప్పటి వరకు సహనంతో  వున్నారు. ఇంక ప్రజలు సహించే పరిస్థితి లేదు. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ గ్యాంగ్ అంతా సిద్ధంగా ఉండాలి. ప్రజాస్వామ్య పెడరెక్కలు విరిచే ధోరణిని అరికట్టాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక హిట్లర్, ఒక తుగ్లక్, ఒక గోబెల్స్‌లకు ప్రతిరూపంగా అయిన పరిపాలన సాగుతుందని,ప్రజలు,ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు.  నీరుకొండ ప్రసాద్ 9849625610

జగన్‌రెడ్డి గానుగెద్దులా ఐపీఎస్, ఐఏఎస్‌లు?

జగన్‌రెడ్డి ఆదేశాలకు తలొగ్గి గాను గెద్దుల్లా పని చేస్తున్నారు ఐఏఎస్, ఐపిఎస్‌లు అధికారులు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి సీఐడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రతిపక్షనాయడు చంద్రబాబుపై కేసులు పెట్టడానికి పరుగెత్తుకు వస్తున్నారు. అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిర్ణయించడం తప్ప రోడ్డు వేయలేదు. కనీసం దాని కోసం భూ సేకరణ కూడా చేయలేదు. రోడ్డే లేకుండా రూ.2 వేల కోట్ల కుంభకోణం అంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆయన ఆదేశాలతో ఆధారాలు లేకుండా ఊహలతో సిఐడి అధికారులు కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి  తలుచుకుంటే కనీస ఆధారాలు లేకపోయినా ఎవరిపైన అయినా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించ వచ్చునని జగన్మోహన్‌ రెడ్డి రుజువు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించి ఏ ఆధారాలు చూపకుండా ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో నిర్బంధించారు. మళ్ళీ ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోఅరెస్టు అయి జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డ్ ఎలైన్‌మెంట్ కేసులో సిఐడి అధికారులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతుండగానే సంబంధం లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్డ్ కేసులో లోకేష్‌ను నిందితుడుగా చేర్చారు. ఒక దాని తర్వాత మరొకటి అన్నట్లు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును, లోకేష్‌లను ప్రజల్లోకి వెళ్లకుండా చెయ్యడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కుట్రలకు తెర లేపింది.  ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో సీఐడీ మోపిన కేసుపై తెలుగుదేశం పార్టీ  సవివరంగా  నివేదిక విడుదల చేసింది.  సీఐడీ తప్పుడు ఆరోపణలకు నిర్దిష్టంగా సమాధానాలిచ్చింది. ఇది రాజకీయ ప్రేరేపితం,కల్పితం తప్ప వాస్తవాల ఆధారంగా పెట్టిన కేసు కాదని స్పష్టం అవుతున్నది. ఊరూ పేరూ లేని వారి తరపున థర్డ్‌ పార్టీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయవచ్చా? అలా అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిర్ణయం వల్ల తమకు నష్టం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతారా? వాటి వల్ల అయాచితంగా లబ్ధి పొందిన వారు ఎవరో నిర్ధారించకుండా కేసులు పెట్టుకుంటూ పోతే అధికార యంత్రాంగం పని చేయగలదా? స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలదా? పరిపాలన పక్కన పెట్టి చంద్రబాబు, లోకేష్‌లను ఏయే కేసులలో ఇరికించేందుకు, కేసులను శోధించడమే జగన్‌ ప్రభుత్వం దినచర్యగా మారింది.       ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రజా రాజాధాని నగర నిర్మాణానికి సింగపూర్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. ఆ తర్వాత రాజధాని నగర ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కోసం సీఆర్‌డీఏ ఆరు నెలలకు పైగా సంప్రదింపులు జరిపింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పూర్తి పారదర్శకంగా జరిగింది. దాదాపు 1100 మందిని సంప్రదించి వారి అభిప్రాయాలు క్రోడీకరించి రూపొందించారు. అయినా ముఖ్యమంత్రి జగన్ మెప్పుకోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరాధార అసంబద్ధ ఆరోపణలతో సిఐడికి పిర్యాదులు చేస్తూనే వున్నారు. అమరావతిని అటకెక్కించి, మాస్టర్ ప్లాన్‌ను తుంగలో తొక్కేశారు. గీతల్లోనే ఉన్న ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌పై అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ప్రభుత్వం సీఐడీ కేసు పెట్టడం చూస్తే  జగన్ రెడ్డి ఎంత కక్షతో రగిలి పోతున్నారో అర్ధం అవుతుంది. ఇంత వరకు ఇన్నర్ రింగ్‌ రోడ్డు విషయంలో ఆరోపణలు రాలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత అసలే లేదు. గతంలో అలైన్‌మెంట్‌ నిర్ణయించినప్పుడు గానీ. ఆ తర్వాత గానీ వచ్చిన అభ్యంతరాలు కూడా లేవు. అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ సిఐడి కార్యాలయం అడ్డాగా మారింది. సిఐడికి గాలి పోగేసి.. గాలి కేసులు పెట్టడం అలవాటుగా మారింది. కేసులు పెట్టడానికి ఏమి దొరక్క ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అవినీతి అంటూ మరొక నాటకానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ పిర్యాదు చెయ్యడమే ఆలస్యం విచారణ లేకుండా ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పని చేస్తున్నదీ సిఐడి.  రాజధాని అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా దాదాపు 30 వేల ఎకరాల భూమిని సమీకరించడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా జరిగిందని దేశవ్యాప్తంగా ప్రశంసలు సైతం వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆ పని చేశారు కనుక రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట భూ కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని ఎత్తుకున్నారు  సీఐడీ అధికారులు ఏదో ఒక కేసు నమోదు చేయడం, దానిపై చంద్రబాబు కోర్టులను ఆశ్రయించవలసి రావడం జరుగుతూనే ఉంటుంది. అత్యున్నతమైన ఐపిఎస్‌ల, ఐఏఎస్‌ల వ్యవస్థ జగన్‌రెడ్డి ఇంటి ముందు గానుగెద్దులుగా పని చేస్తున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల్లో విలువలు క్షీణించి ముఖ్యమంత్రి అభీష్ట కామ్యార్ధ సిద్ది కోసం గులాం గిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చారు. అఖిల భారత సర్వీస్ చట్టం ప్రకారం ఈ అధికారులకు విశేషాధికారాలు వున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని. చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తూ, నిజాయితీతో రాజ్యాంగ నిబంధనలు పాటీంచాల్సిన అవసరాన్ని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు గుర్తించడం లేదు.  అఖిల భారత సర్వీస్ అధికారులకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కులు. అధికారాలు సామాన్యమైనవి కావు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకొన్నా అడ్డుపడే అధికారం బిజినెస్ రూల్స్ రూపంలో ఐఏఎస్‌లకు దాఖలు పడింది. నిబంధనలు ఒప్పుకోవంటూ ముఖ్యమంత్రుల పార్మెంట్‌నే సున్నితంగా తిరస్కరించిన అధికారుల శకం అంతరించి రాజకీయ బాసులతో కలసి అవినీతి మడుగులో ఈదులాడటం, ప్రతిపక్షాలను వేధించడం, సభలను అడ్డుకొనే సంతతి నేడు ప్రజాస్వామ్య నవనాడులను కుళ్లబొడుస్తోంది.. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి   లేదు. ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్, ఐఫిఎస్ అధికారులు సహకరిస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం నేలబారుగా వ్యవహరించి దేశంలోనే అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దెందుకు నడుం బిగించే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది.          నిబద్దతతొ పనిచేసే యంత్రాంగం అంతరించి స్వామి కార్యంతొ పాటు స్వకార్యాన్ని సాధించుకొంటూ తరిస్తున్నారు. ప్రతిష్టాత్మక సివిల్.సర్వీస్ వ్యవస్థలో రుగ్మతలు రూపు మాపి.. విలువలు పునరుద్దరించాలని. తాము కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్దరించు కొవాలని, దాపరికం లేని విధానాలు అవలంభించాలని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సదస్సులో  తీర్మానించి ఏళ్ళకు ఏళ్లు గడిచింది. ప్రభుత్వానికి చుక్కానిగా  వ్యవహరించవలసిన సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహర శైలి మార్చి వ్యవస్థనే రాజకీయ సాధనంగా దిగజార్చిన వైనం తాలుకా దుష్పలితాలు జగన్ పాలనలో కళ్ళకు కడుతున్నాయి. అధికారులు రాజకీయ దినుసులుగా మారడం వల్లనే పాలనలో నైతిక ప్రమాణాలు  దిగజారాయి. నేడు జగన్ పాలనలో ఐ.ఏ.ఎస్. ఐపిఎస్‌ల ప్రతిష్టకు గ్రహణం పట్టించారు. జగన్ పాలనలో పౌరసేవలు రాజకీయ సర్వీసులుగా మారిపొయిన వాస్తవాలు ఎన్నో కళ్ళకు కడుతున్నాయి. ఒత్తిళ్లను  ప్రతిఘటించ లేని ఐ.ఏ.ఎస్. ఐ. పి.ఎస్‌లు సర్వీస్‌లో కొనసాగడం వల్ల ఎవరికి ప్రయోజనం.  ప్రజల, రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాకుండా తమ ప్రయోజనాలే పరమావధిగా వ్యవరించడం అఖిల భారత సర్వీస్ వ్యవస్థకే అవమానకరం. పాలకులకు గులాంగిరి చేసే బదులు ప్రజలకు. విధేయులుగా ఉంటే ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులను ఎవరూ ఏమి చేయ్యలేరు. అంతేకాదు.. అటువంటి వారికి ప్రజలే అండదండగా ఉంటారన్నది మాత్రం వాస్తవం.  గతంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు పై పెత్తనం చెయ్యడానికి రాజకీయ నాయకులు భయపడే వారు. ఆయా అధికారులు కూడా నిబద్దతతో నిజాయితీగా ప్రజల కోసం కష్టపడే వారు. ఇప్పుడు పోస్టింగులు కోసం అడ్డమైన పనులు చెయ్యడానికి కూడా ఆలిండియా సర్వీస్ అధికారులు వెనకాడటం లేదు. కీలక పోస్టింగ్‌ల కోసం పాలకుల అడుగులకు మడుగులోత్తే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగానే ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు ప్రభుత్వానికి ఉపయోగ పడుతున్నారు. తన పేరిట జీఓలు జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వ కార్యదర్శులైన ఐఏఎస్‌లకు గవర్నర్ వ్యవస్థ కట్టబెట్టడం వారిపై ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. తమపై అంతటి నమ్మకంతో అధికారం కట్టబెట్టిన విషయాన్ని ఐఏఎస్‌లు విస్మరించడం ఎంత వరకు సమంజసం? ముఖ్యమంత్రి చెప్పాడని నిబందనలకు విరుద్దంగా జీఓలు జారీ చేసే పక్షంలో అందుకు ఐఏఎస్ అధికారులు ఎందుకు? సాధారణ ఉధ్యోగులు కూడా సరిపోతారు కదా? జగన్ పాలనలో ఐపిఎస్‌లు.. వై పీఎస్‌లుగా, ఐఏఎస్‌లు.. అయ్యా ఎస్‌లుగా మారి పోయ్యారు. ప్రభుత్వం ఇష్టాను సారం, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత ఐఏఎస్ అధికారి నెలబారుగా వ్యవహరించడం భాధ్యతా రాహిత్యం. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అధికారులు పాలకులకు విధేయులుగా మారడం వల్లనే జగన్ పాలనలో  ఐఏఎస్, ఐపిఎస్‌ల పని తీరు పూర్తిగా మసక బారింది.      ఐఏఎస్ అధికారులను కోర్టుకు పిలిపించడమే కాదు న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. తమ ఆదేశాలను లెక్క చెయ్యని అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీ  ఒత్తిళ్లకు లొంగి పోయి తప్పులు చేస్తూ హైకోర్టుతో చీవాట్లు తిని, శిక్షలు వేయించుకొని అఖిల బారత సర్వీసుల వ్యవస్థను చులకన చేశారు. ఆ మధ్య రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు అయ్యేలా చూడాలంటూ రాష్ట్ర డీజీపీని హైకోర్టుకు పిలిపించి మరీ చెప్పాల్సి వచ్చిందంటూ  పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. పోలీసు అధికారులు, అధికారుల్లా కాకుండా జగన్ జేబు సంస్థగా మారడం వల్లనే ఈ దుస్థితి. పోలీసు వ్యవస్థను అదుపు చెయ్య లేకపోతే డిజిపి రాజీనామా చేయాలని కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. గతంలో కూడా అధికారంలో వున్న పార్టీలకు ఐఏఎస్,ఐపిఎస్‌లు అనుకూలంగా వ్యవహరించడం సహజమే. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి  వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను, ఐఏఎస్‌ల వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి  లేదు. ఆంధ్రప్రదేశ్ అస్త వ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది.  రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు సహకరిస్తున్నారు. ఐ ఏ ఎస్ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలను గుడ్డిగా ఆచరించే విధానానికి స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. సొంత ప్రయోజనాల కోసం నెలబారుగా వ్యవహరించి అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చ కండి. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దడానికి ప్రయత్నించాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే ఐపిఎస్‌లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.                                                                                                                                                                    నీరుకొండ ప్రసాద్  9849625610