చంద్రబాబు అరెస్టు.. అన్ని వైపుల నుంచీ నిరసనలతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్  రాష్ట్రంలోనే కాదు , జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్లిస్తోంది. ఏపీలో జగన్ అరాచక పాలనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ జగన్ ను అన్ని విధాలుగా సమర్థిస్తూ, ఆర్థిక అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం కూడా జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ముందస్తు కోసమో, మరిన్ని అప్పుల కోసమో.. అదీ కాకపోతే వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబును జైలులోనే మగ్గేలా రూపొందించిన తన వ్యూహాలకు మద్దతు కోసమే జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలతో భేటీకి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రం భగ్గుమంటున్నా.. ఆయన మాత్రం నీరో చక్రవర్తిలా తాడేపల్లి ప్యాలెస్ లో ఏ  క్షణంలో హస్తిన నుంచి పిలుపు వస్తుందా అన్న ఎదురు చూస్తున్నారు. రోమ్ నగరం తగలడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారట. అలాగే ఏపీ భగ్గు మంటుంటే.. తన అరాచక, అక్రమ, అడ్డగోలు పాలన పట్ల జనాగ్రహం పెల్లుబుకుతుంటే జగన్ మాత్రం మౌనంగా.. హస్తిన పెద్దన కరుణకటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి.. ఏ  మాత్రం నిలబడని కేసులు పెట్టి.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ, తెలంగాణలలోనే కాకుండా తమిళనాడు, బెంగళూరు సహా ఎక్కడికక్కడ జనం, ఐటీ ఉద్యోగులు, మహిళలూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ ప్లకార్డులు చేతబట్టి సంఘీభావం తెలుపుతున్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు కూడా బాబును అరెస్టు చేసిన తీరును తప్పుపడుతున్నారు. జగన్ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శిస్తున్నారు. ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయితే.. అమరావతి కేసులో జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును ధిక్కరించి వ్యవహరిస్తున్న తీరుపై మండి పడుతూ.. తానైతే ముఖ్యమంత్రి జగన్ ను జైలుకు పంపేవాడినని పేర్కొన్నారు.  ఇక ఇలా నలుమూలల నుంచీ జగన్ సర్కార్ చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతుండటంతో కేంద్రం కూడా జగన్ విషయంలో ఇక కఠినంగా వ్యవహరించక తప్పదన్న నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎన్ఎస్జీ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, జైలులో ఆయన భద్రత తదితర అంశాలపై ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందని చెబుతున్నారు. అంతే కాకుండా  చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు రోడ్డు మార్గంతో తరలించిన తీరుపై కూడా ఎన్ఎస్జీ ఆ నివేదికలో సవివరంగా పొందుపరిచిందంటున్నారు.  అలాగే ఏ మాత్రం పటిష్ట భద్రత లేని ఏసీబీ కోర్టు హాలులో చంద్రబాబు గంటల తరబడి ఉన్న విషయాన్నీ ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందంటున్నారు. అలాగే చంద్రబాబు పర్యటనలలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు గురించి కూడా సోదాహరణంగా ఆ నివేదిక పేర్కొందంటున్నారు. ఎన్ఎస్జీ నివేదికకు తోడు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఏపీలో జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందంటూ కేంద్ర హోంశాఖకు నివేదికలు అందాయని చెబుతున్నారు.  వీటికి తోడు జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయం చూసుకుని చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా దేశ ప్రతిష్ట మసకబారేవిధంగా జగన్ వ్యవహరించారని కూడా కేంద్రం భావిస్తున్నది. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన చంద్రబాబు పట్ల ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలకు గౌరవం ఉంది. అటువంటి చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడంతో కేంద్రం ప్రతిష్ట మసకబారిందన్న అభిప్రాయం కూడా బీజేపీ అధినాయకత్వంలో వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబును నిన్న రాజమహేంద్రవరం జైలులో కలిసిన తరువాత జనసేనాని పవన్  కల్యాణ్ తెలుగుదేశం, జనసేన కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించడం కూడా కేంద్రం తన వైఖరిని పునస్సమీక్షించుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపిందని అంటున్నారు.    ఇక తెలుగుదేశం అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటములలో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ రెండు కూటములలోని భాగస్వామ్య పార్టీలూ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్ సర్కార్ అక్రమ అరెస్టును ఖండించడంతో తమ చర్యను సమర్ధించుకోలేక వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అదే సమయంలో ప్రధాని, హోంమంత్రి నుంచి అప్పాయింట్ మెంట్ కూడా లభించకపోవడంతో కేంద్రం జగన్ కు దూరం జరుగుతోందన్న సంకేతాలను ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించగానే, అలా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమహేంద్రవరం నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హస్తిన బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బీజేపీ పెద్దలనే కాకుండా, జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల అధినేతలనూ కలిసి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే పార్లమెంటు ప్రత్యేక  సమావేశాలలో చంద్రబాబు అరెస్టు తీరుపై అన్ని పార్టీల నేతలూ గళమెత్తేలా వారి సంఘీభావాన్ని కూడగట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఢిల్లీకి లోకేశ్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేశ్ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసు అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారు. అదీకాక రాష్ట్ర పరిస్థితులు, కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్ల్‌లో చర్చించేలా టీడీపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ ఎంపీలో లోకేశ్ మాట్లాడనున్నారని సమాచారం.  మరోవైపు చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమమని.. ఈ విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో.. స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షోనే అరెస్టు చేశారని వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో ఈ అంశంపై మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని లోకేశ్ నిర్ణయించిన్నట్లు సమాచారం.   ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి.. బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినన్ని అరాచకాలు దేశంలో మరెక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి.. తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని సోదాహరణగా చూపిస్తూ.... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని.. దీనిపై జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని నారా లోకేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.    అలాగే అదే సమయంలో.. ఏ మాత్రం ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై ఎలా అధికార ఫ్యాన్ పార్టీ బలవంతంగా రుద్దుతుందో కూడా ఈ సందర్భంగా వివరించనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపిన దాడులు..  మార్గదర్శి, అమరరాజా వంటి సంస్థలపై జరిగిన దాడుల గురించీ వివరించి.. రాష్ట్రంలో అరాచక పాలన గురించి నారా లోకేశ్ వివరిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిన వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 73 ఏళ్ల  చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేకుండా... రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోకుండా..  కనీసం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మరోవైపు కుదిరితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా లోకేశ్ కలిసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీ వేదికగా అందరి ముందు ఉంచాలని నారా లోకేష్ బలంగా నిర్ణయం తీసుకున్నారని.. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ హస్తిన వెళ్లినట్లు తెలుస్తోంది.

యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు జగన్ మరణశాసనం!

ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ పట్టా చేతికి రాగానే పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న ఏపీ యువత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే ముందుగా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ, నాలుగేళ్లలో వాలంటీర్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయంలో పోస్టులు ఇచ్చారు. అది కూడా వైసీపీ కార్యకర్తలకేనని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లు అయినా ఆ ఊసేలేదు. ఈ నాలుగేళ్ళలో ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఓ సారి జాబ్ క్యాలెండ్ ప్రకటించినా అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు 50కి మించలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మూడు సార్లు డీఎస్సీ ప్రకటిస్తే ఇప్పుడు జగన్ నాలుగేళ్ళలో ఒక్కటేసారి డీఎస్సీ ప్రకటించారు. అందులో కూడా యాభై లోపే  ఉద్యోగాలను భర్తీ చేశారు.  ప్రభుత్వ ఉద్యోగాల సంగతలా ఉంటే పోనీ ప్రైవేట్ ఉద్యోగాలైనా ఉన్నాయా అంటే కొత్తగా రాష్ట్రానికి వచ్చిన ఒక్క  కంపెనీ లేదు. వేల కోట్ల పెట్టుబడులు.. వందల కంపెనీలు వచ్చాయని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. నిరంతరం కొత్త కంపెనీలను ఆహ్వానించాల్సిన మంత్రులు ప్రతిపక్షాలను వేధించేందుకు, ప్రతిపక్ష నేతలను తిట్టిపోసే పనిలో ఉంటున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి అయితే.. ఉద్యోగాల గురించి అడిగితే కోడి గుడ్డు పొదగాలంటే సమయం పడుతుందని గుడ్డు సిద్దాంతాలు చెప్తున్నారు. కనీసం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను తరలిపోకుండా కాపాడుతున్నారా అంటే వాళ్ళని  వాటాలు, కమిషన్ల కోసం  వేధించి అధికార పార్టీ నేతలే తరమేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కియా పరిశ్రమ ప్రతినిధులను బెదిరించడం.. దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాకు తలమానికంగా అవతరించిన అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను కాలుష్యం పేరిట వేధించడం, ఆ కంపెనీ ఏపీని వదిలేసి తెలంగాణకు తరలిపోవడం రాష్ట్ర ప్రజలంతా చూసినదే. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేక ప్రైవేట్ రంగంలో ఉపాధి దొరకక ఏపీ యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. కొత్త సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భయపడే విధంగా ఏపీ పాలకులు పనిగట్టుకొని మరీ చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కూడా. సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలతో ఒప్పందం ద్వారా టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల 13 వేల మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 75 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 6 చోట్ల ఎక్స్లెన్స్ కేంద్రాలు, 36 శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చారు. అప్పుడు ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు తమకి అప్పుడు పెట్టిన ఖర్చును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ తమ భవిష్యత్ కుఎంత ఉపయోగపడిందో చెప్తూనే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు.  యువతకి బంగారు బాటలు వేసిన స్కిల్ డెవలప్మెంట్ సంస్థను తప్పుడు సంస్థగా ముద్ర వేసిన ఈ ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా పరిగణించాల్సిందే. ఇప్పటికే ప్రపంచ పారిశ్రామిక రంగం దృష్టిలో ఏపీ అంటే బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడు ఈ స్కిల్ స్కాం పేరుతో పూర్తిగా బ్లాక్ లిస్టులో పెట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఉద్యోగాలంటే కేవలం వాలంటీర్లు, సచివాలయాలనే చూపించే ఈ ప్రభుత్వానికి స్కిల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలలో అవినీతి కనిపించడం పెద్ద విడ్డూరం కాకపోయినా దీని పర్యవసానం మాత్రం రాష్ట్రంలో యువత అనుభవించాల్సిందే. మొత్తంగా స్కిల్ స్కాం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ యువతను నట్టేట ముంచేశారని, వారి భవిష్యత్ కు మరణశాసనం లిఖించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. జూనియర్ ఉలిపికట్టె తీరు!

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో" అన్నట్టుగా ఉంది నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తీరు. "నందమూరి కుటుంబసభ్యులందరిదీ ఒక దారి.. నాది మాత్రం మరో దారి" అన్నట్టుగా ఆయన అడుగులు పడుతున్నాయి.  ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఎందరో తమ స్వరం వినిపిస్తున్నారు. కానీ కుటుంబసభ్యుడైన జూనియర్ మాత్రం.. తన మావయ్య చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తూ కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. నేరుగా కలవాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో స్పందించలేదేమో.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉండి ఉంటాడు, త్వరలోనే వెళ్ళి బాబుని కలుస్తాడు అని కొందరు నందమూరి అభిమానులు సర్ది చెప్పుకున్నారు. కానీ బాబు అరెస్ట్ అసలు తనకు పట్టనట్టుగా జూనియర్ విదేశాలకు చెక్కేయడం అటు నందమూరి, ఇటు టీడీపీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సైమా అవార్డుల వేడుక సెప్టెంబర్ 15,16 తేదీల్లో దుబాయ్ లో జరగనుంది. ఈ వేడుక కోసం తన కుటుంబంతో కలిసి దుబాయ్ పయనమయ్యాడు తారక్. ఇప్పటిదాకా ఆయన దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అనుకున్నారంతా. కానీ ఆయన మాత్రం ఎంచక్కా దుబాయ్ వెళ్తున్నాడు. విదేశాలకు వెళ్ళే టైం ఉంది కానీ.. బాబుని, బాబు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పే టైం లేదా?. ఆఖరికి ఇతర భాషకు చెందిన రజినీకాంత్ వంటి వారు బాబు కుటుంబానికి ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. కానీ తారక్ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఎంతసేపూ తన సినిమాలు, తన అవార్డులు, తన పేరు తప్ప.. కుటుంబం సభ్యులకి ఏం జరిగినా పట్టించుకోడా అంటూ నందమూరి అభిమానులు కాస్త ఘాటగానే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.  మాట్లాడితే తాత పేరు చెప్పుకునే తారక్.. మేలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇటీవల తన తాత పేరు మీద కేంద్రం వెండి నాణేలు విడుదల చేస్తే, ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టాడు. ముందే షూటింగ్ కి డేట్స్ ఇచ్చి ఉన్నాడేమో, తన వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి వెళ్ళలేదేమో అని అప్పుడూ అభిమానులు సర్దిచెప్పుకున్నారు. కానీ ఇప్పుడు బాబు అరెస్ట్ అయితే అసలు ఏమాత్రం పట్టనట్టు అవార్డుల ఫంక్షన్ కోసం విదేశాలకు వెళ్లిన తీరుపై మాత్రం కాస్త గట్టిగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పొత్తు ఖాయం.. విజయం తథ్యం.. బాబుతో ములాఖత్ అనంతరం పవన్ కల్యాణ్ ప్రకటన

ఇంత కాలం ఏపీలో పొత్తుపొడుపుల విషయంలో ఉన్న సందిగ్ధత, సస్పెన్స్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. స్కిల్ స్కాంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కలిసే ఉంటాయని విస్ఫష్టంగా ప్రకటించారు. రెండు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పొత్తు తన పార్టీ కోసమో, తెలుగుదేశం పార్టీ కోసమో కాదనీ, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమని చెప్పారు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడమే లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించారు.  అసలు రాష్ట్రంలో పొత్తుల గురించిన చర్చను లేవదీసిందే పవన్ కల్యాణ్ అన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పవన్  కల్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని శపథం చేశారు. ఆయన ఆ ప్రకటన చేసి చాలా కాలమైంది. అప్పటి నుంచీ రాష్ట్రంలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. ఒక దశలో క్షేత్ర స్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలలో పాల్గొన్నాయి. దీంతో రెండు పార్టీల మధ్యా పొత్తు ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది. దీనిపై వైసీపీ పలు మార్లు విమర్శలు గుప్పించింది. దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలంటూ.. పవన్ కల్యాణ్ కు సవాళ్లు విసిరింది. సింహం సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ రజనీకాంత్ సినిమాలోని పంచ్ డైలాగులతో ఎద్దేవా చేసింది. అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న మాటకే పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నారు. అదే సమయంలో ఇప్పటికే ఆయన బీజేపీ మిత్రపక్షంగా ఉండటంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2014 ఎన్నికల నాటి పరిస్థితే 2024లోనూ పునరావృతమౌతుందంటూ విశ్లేషణలు సాగాయి.  అయితే తెలుగుదేశం కూటమితో బీజేపీ చేతులు కలుపుతుందా అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కోసమే ఇప్పటి వరకూ పొత్తుపై ప్రతిష్ఠంభన కొనసాగుతూ వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత జనసేనాని వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. అరెస్టును ఖండించడం.. హుటాహుటిన బెజవాడ బయలుదేరడం, ఆయన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్ కు అధకారులు అనుమతి నిరాకరించడం, అయినా తగ్గకుండా ముందుకు సాగడం, పోలీసులు అడ్డుకుంటే రోడ్డుపైనే పడుకోవడం ద్వారా అన ఆగ్రహాన్ని ప్రస్ఫుటంగా చాటారు. సరే ఇప్పుడు రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన తరువాత బీజేపీ విషయం పక్కన పెట్టేసి జనసేన తెలుగుదేశం పొత్తు గ్యారంటీ అని విస్ఫష్టంగా ప్రకటించేశారు. దీంతో ఇక ఏపీలో  జనసేన తెలుగుదేశంతో కలిసి సాగుతుందన్న విషయం స్పష్టమైపోయింది. ఇక తేలాల్సింది సీట్ల పంపకం. ఇరు పార్టీల మధ్యా గతంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు జరిగాయనీ, మూడు నాలుగు స్థానాల విషయంలో ఒకింత ప్రతిష్ఠంభన ఉన్నా దాదాపుగా పాతిక స్థానాల వరకూ జనసేన పోటీ చేస్తుందన్న విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందనీ  వార్తలు వచ్చాయి.  ఇక ఇప్పడు బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. జనసేనాని పొత్తు ప్రకటనతో ఇక బీజేపీకి ఒక వేళ తెలుగుదేశం, బీజేపీ కూటమితో జట్టుకట్టినా  సీట్ల విషయంలో  బార్గెయినింగ్ కెపాసిటీ ఏ మాత్రం ఉండదు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక్క కారణం తప్పితే.. ఏపీలో ఆ పార్టీకి స్టేక్ లేదు. ఎంతగా లెక్కలు చూసుకున్నా రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఒక శాతం కంటే తక్కువే. అలాంటి పార్టీ కోసం తెలుగుదేశం, జనసేనలు పాకులాడతాయని భావించజాలం. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పర్యటనలకు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే జనసేనాని వారాహి యాత్ర సైతం బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగితే అధికార వైసీపీ పుట్టి మునగడం ఖాయమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ బీజేపీ ఈ కూటమిలో చేరినా.. అది ఈ కూటమికి ఏమాత్రం లబ్ధి చేకూర్చదు సరికదా? భారంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పుడు పొత్తు విషయంలో జనసేనాని బీజేపీ విషయం ఎత్తకుండా ప్రకటించేయడంతో రాష్ట్రంలో బీజేపీ ఒక చర్చించాల్సిన పార్టీగా, ఆ పార్టీ ఎటు అన్నది పెద్దగా ప్రాముఖ్యత లేని అంశంగా మారిపోయిందని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పొత్తులు ఖాయం అన్నది తేలిపోయిన తరువాత చర్చ అంతా ఈ రెండు పార్టీల మధ్యా సీట్ల పంపకం గురించే. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే జనసేన, తెలుగుదేశం మద్య సీట్ల సర్దుబాటు విషయంలో ఒక ప్రాథమిక అవగాహన కుదిరిందని అంటున్నారు.  2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందనడంలో సందేహం లేదు.  ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. జనసేన బలం ఎంతగా పెరిగినా ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు సాధించగలుగుతుంది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇప్పటికీ కష్టమే. ఆ పార్టీ పెరిగిన బలానికి అనుగుణంగా సీట్లు వస్తాయా అన్న విషయంలో పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం జరిగిందని చెప్పలేం. అయితే తెలుగుదేశం విషయం అలా కాదు.  ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన తొలి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి  గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేపట్టారు. శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణ శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం.  అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు బలంగా చాటుకుని, స్థిరంగా నిలిచింది. ఏపీలో జగన్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి అవసరమైన శక్తి, బలం, బలగం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం  మాత్రమే.   వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్   తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉందని ప్రకటించి జగన్ ఓటమిని దాదాపు ఖాయం చేసేశారనే చెప్పాలి. అయితే పొత్తులో భాగంగా జనసేన గౌరవప్రదమైన భాగస్వామ్యం అంటున్నది. అంటే ఎన్ని స్థానాలలో ఆ పార్టీకి పోటీ చేసే అవకాశం దక్కితే గౌరవ ప్రదం అన్న సంశయం అయితే పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సీట్ల సర్దుబాటుపై ప్రథమికంగా వచ్చిన అవగాహన మేరకు జనసేన పాతిక నుంచి ముఫ్ఫై సీట్లలో పోటీ చేస్తుందని, సీట్ల పంపకంలో పీటముడి పడకుండా పొత్తుకు ఢోకా లేకుండా ఉండేందుకు ఇరు పార్టీలూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చాయని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.  ఇక పాతిక ముప్ఫై స్ధానాలకు జనసేనకు కేటాయించే విధంగా ఇరు పార్టీల మధ్యా అవగాహన కుదిరినట్లేనని కూడా అంటున్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరడం వెనుక కూడా సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీల మధ్యా ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అని చెబుతున్నారు.   ఇక ఇటీవలి సర్వేలలో కూడా తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు వైసీపీ ఓటమికి రాచబాట పరిచినట్లేనని వెల్లడైన నేపథ్యంలో జనసేనాని పొత్తుపై విస్ఫష్ట ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన వాస్తవ బలం ఆధారంగా సీట్ల సర్దుబాటు ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ మౌనం..తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహం

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగనుందన్న ఉత్కంఠ  సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే ఈ అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జాతీయ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫారుక్‌ అబ్దుల్లా, శిరోమణి అకాళీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ డిప్యుటీ సీఎం, ఎంపీ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా వంటి సీనియర్‌ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ముందు ముందు మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపే ఛాన్స్ కనిపిస్తున్నది. అలాగే పలువురు జాతీయ నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరం వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన, ప్రకంపనలు సృష్టిస్తున్న చంద్రబాబు అరెస్టుపై సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ నుండి కూడా   వివిధ పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. సీనియర్ నేతలు వీహెచ్ లాంటి వారైతే చంద్రబాబు లాంటి నాయకుడిని అరెస్టు చేయడం ఏపీలో పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అయితే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబు అరెస్టుపై తీవ్ర విమర్శలు చేశారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిని కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. మరో తెలంగాణ బీజేపీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కూడా చంద్రబాబు అరెస్టును తప్పు బట్టారు. అర్ధరాత్రి వేళ అరెస్టులకు తెగబడడం ఏమిటని ప్రశ్నిచారు. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుపై నేతలు మండిపడుతున్నారు. అయితే  జాతీయ స్థాయిలో నేతల నుండి చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందన వస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకూ పన్నెత్తి మాట్లాడలేదు.  స్పందించలేదు. వారి మౌనమే ఇప్పుడు రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కూడా జాతీయ స్థాయి నేతలే. దేశ రాజకీయాలపై కూడా స్పందించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అందునా ఏపీలో కూడా బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నది. ఏపీలో బీఆర్ఎస్ క్రీయాశీలంగా ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. ఆ రాష్ట్రంలో ఏపీ బీఆర్ఎస్ శాఖఉంది. రాష్ట్ర కార్యాలయం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు.  ఇలాంటి తరుణంలో ఏపీలో ఇంతటి బర్నింగ్ ఇష్యు నడుస్తున్న వేళ, అందునా తెలంగాణ పాలిట కల్పతరువుగా మారిన హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సర్కిల్ లో  ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున బాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఐయామ్ విత్ బాబు అన్న ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. వారంతా స్వచ్ఛందంగా ఆందోళన బాట పట్టారు. ఇప్పటి దాకా ఉద్యోగులు తమ వేతనాల గురించో, ఇతర సమస్యల గురించే ఆందోళనలకు దిగడం చూశాం. కానీ ఐటీ ఉద్యోగులు తమ జీవితాలలో ఐటీ వెలుగులు నింపిన వ్యక్తి పట్ల కృతజ్ణతతో, ఆయన అక్రమ అరెస్టు పట్ల ఆవేదనతో బయటకు రావడం బహుశా ఇదే మొదటి సారి. ఇక కూకట్‌పల్లిలో చంద్రబాబు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను కేసీఆర్‌, కేటీఆర్‌ ఖండించకపోవడం పట్ల వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక అరెస్ట్పై హైదరాబాద్ సెటిలర్స్ భగ్గుమంటున్నారు. చంద్రబాబు అరెస్ట్పై  తెలంగాణ పౌరహక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ అభిమానులు నిరసనల్లో పాల్గొని అటు ఏపీ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా మండిపడుతున్నారు. అయినా కేసీఆర్, కేటీఆర్ నుండి ఎలాంటి స్పందన లేదు. జగన్ మోహన్ రెడ్డితో మైత్రి కారణంగానే కేసీఆర్ అండ్ కో ఈ అంశంపై స్పందించడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ చంద్రబాబును ఉమ్మడి శత్రువుగానే చూస్తున్నారని.. అందుకే ఈ అక్రమ అరెస్టును ఖండించడం లేదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

కళ్ళ ముందున్న సాక్ష్యాలు కనిపించవా?

అబద్ధం చెప్పినా అతికి నట్లుండాలి, అలాగే అబద్ధాలు చెప్పే వారికి జ్ణాపకశక్తీ ఎక్కువ ఉండాలి కానీ  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు దడి కట్టినట్లు కూడా లేవు.. సర్కార్ జ్ణాపక శక్తి కూడా అంతంత మాత్రమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో లేని అవినీతిని చూపించేందుకు అబద్ధాల కట్టుకధలు అల్లుతోంది. పచ్చి అబద్ధాలను పక్కా నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి, నిజంగా అవినీతి జరిగినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవును, కానీ, ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని  ఏదో విధంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపాలి, అందుకోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  స్కాం ను తెరపైకి తెచ్చింది. ఆ ఒక్క  పాపపు ఆలోచనతో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఆయన బృందం కట్టు కథలు అల్లుతోంది.కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలను కప్పి పెట్టి కట్టుకధలతో అబద్ధాలను నిజం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నది.  నిజానికి, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు అదే పనిలో ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు దేశం పార్టీ నాయకులు, క్యాడర్ ను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎందరో  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. చివరకు తెలుగు దేశం ఓటర్లపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.  ప్రజా వేదిక కూల్చి వేతతో పరిపాలనకు శ్రీకారం చుట్టిన జగన్ రెడ్డి అప్పటి నుంచే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు ప్రారంభించారు. ఇందులో ఏమీ రహస్యం లేదు. ఇది  జగన్ ఎరిగిన సత్యం.  అప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను  ఏదో విధంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం సాగిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచే జగన్ రెడ్డి చంద్రుడిపై మచ్చలు వెతికే ప్రయత్నం సాగితున్నారు. అయితే గడచిన నాలుగున్నరేళ్ళుగా ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసేందుకు చేసిన కుట్ర పూరిత ప్రయత్నాలు బూమరాంగ్  అయ్యాయి. న్యాయ స్థానాల ముందు జగన్ రెడ్డి ‘స్కిల్స్’ పని చేయలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో  చంద్రబాబు నాయుడిపై అవినీతి బురద చల్లి  బద్నాం చేసేందుకు విఫల ప్రయత్నం చేసిన అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎదురైన అనుభవమే,  జగన్ రెడ్డికీ ఎదురైంది.  అందుకే  అధికారం ఆఖరి క్షణాలకు చేరుకున్న సమయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగిన మంచిని మరుగు పరిచి కుట్రపూరితంగా అవినీతి బురద చల్లేందుకు, తద్వారా చంద్రబాబు నాయుడు పై కక్ష తీర్చుకునే అకృత్యానికి  తెగబడింది. కళ్ల ముందు అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నా.. వాటిని పరిశీలించకుండా చంద్రబాబును ఇరికించడమే లక్ష్యంగా కుట్రకు తెరలేపింది.  ఇక్కడే జగన్ రెడ్డి ప్రభుత్వ జ్ణాపక శక్తి ఎంత ఘనంగా ఉందో ప్రపంచానికి తేటతెల్లమైంది కూడా. స్కిల్ డెవలప్ మెంట్ లో ఏపీ నంబర్ వన్ అంటూ ఆ చంద్రబాబు దూరదృష్టి కారణంగా దక్కిన ఫలాలను మీడియాలో జగన్ రెడ్డి ప్రభుత్వమే ప్రకటనలు విడుదల చేసింది. స్కిల్  డెవలప్ మెంట్ ప్రాజెక్టు అద్భుత ఫలితాలను ఇచ్చిందని ప్రపంచానికి చాటింది.  ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయిన జనగ్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తాను నాడు ఘనంగా ప్రకటనల రూపంలో ప్రచారం చేసిన స్కిల్ ఘనతను చెరిపివేయడానికి శతథా ప్రయత్నించి నవ్వుల పాలు అవుతోంది. ఇక విషయానికి వస్తే.. విద్యార్థులు, నిరుద్యోగుల భవితకు బాటలు వేసే స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు పెద్ద స్కామ్‌ అని, దానికి సూత్రధారి చంద్రబాబే అని జగన్‌ సర్కారు విషం చిమ్ముతోంది.  ప్రభుత్వ నిధులు రూ.370 కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవన్నీ షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరాయని గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ చేసిన ఆరోపణలనే ఇప్పుడు సీఐడీ కూడా అచేస్తోంది.  చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపింది. అయితే అదే నిజమైతే, ఇంజనీరింగ్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, నైపుణ్యాభివృద్ధి ఇన్‌స్టిట్యూట్లు ఎలా ఏర్పాటు చేశారు?  372 అత్యాధునిక సాంకేతిక ల్యాబ్‌లు స్థాపించడం, 3,37,869 మందికి శిక్షణ ఇవ్వడం, 2,394 జాబ్‌మేళాలతో  85,711 మందికి ఉద్యోగాలు కల్పించడం వాస్తవం కాదా?  స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వెబ్‌సైట్‌ చూస్తే ఈ విషయాలు తెలుస్తాయి కదా. ప్రాజెక్టులో కీలకమైన మౌలిక వనరులు, ల్యాబ్‌లు, నెట్‌వర్క్‌ కేంద్రాలను పరిశీలించకుండానే ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించింది. వాస్తవాలను దాచిపెడుతోంది. అయితే  ఇవేవీ దాచేస్తే దాగే సత్యాలు కాదు. ఎందుకంటే, ఈరోజుకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలలో శిక్షణ కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.  85,711 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో 35వేలమంది విద్యార్థులు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016-17 నుంచి 2019 వరకు 64,444 మందికి ఉద్యోగాలు వచ్చాయి. జగన్‌ సర్కారు వచ్చాక మూడున్నరేళ్లలో 21,267 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వీరిలోనూ గత ప్రభుత్వ కాలంలో (2019-20)లో శిక్షణ పొందినవారు 15,372 మంది ఉన్నారు. అంటే సీమెన్స్‌ ప్రాజెక్టు కార్యకలాపాలు, శిక్షణ ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శాఖ అధికారిక వెట్‌సైట్‌లో ఈ వివరాలను నిర్ధారించుకోవచ్చు. సంవత్సరాల వారీగా అందులో సవివరమైన గణాంకాలు ఉన్నాయి.అయితే  ఇవేవీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియవా? అంటే తెలుసు. ఇది నిలిచే కేసు కాదని జగన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు. అయినా  అబద్ధాలు, అసత్య ప్రచారంతో అందరినే నమ్మించ వచ్చనే, మొండి వైఖరీ,  మూర్ఖపు ఆలోచన, అహంకారంతో ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్ చేసింది . జైలుకు పంపింది . కానీ, అందరినీ అన్ని వేళలా మోసం చేయడం, మోసాలలో పుట్టి మోసాలలో పెరిగిన  వారికైనా సాధ్యమయ్యే పని కాదు.అందుకు మూల్యం చెల్లించక తప్పుదు.

బీఆర్ఎస్ రహస్య బంధం.. బీజేపీతోనా.. కాంగ్రెస్ తోనా?

తెలంగాణ రాజకీయాల్లో ఒక చిత్రమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు   అధికార బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం, అక్రమ సంబంధం ఉందని ఒకరిపై ఒకరు ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అధికార బీఆర్ఎస్ రహస్య మిత్రులెవరు? అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. అలాగే  రేపటి ఎన్నికల్లో జరగరానిది జరిగి  హంగ్ అసెంబ్లీ అనివార్యమై ఏ రెండు పార్టీలు చేతులు కలుపుతాయి? అనే ప్రశ్న కూడా చక్కర్లు కొడుతోంది.  కాంగ్రెస్, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ నాయకులు చాలావరకు, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల మధ్యా లోపాయికారీ ఒప్పందం ఉందనే  ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. ఆరెండు పార్టీల మధ్య పొత్తు ఉంది కాబట్టే లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితను అరెస్ట్ చేయలేదని, కాళేశ్వరం అవినీతిపై బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు ఆరోపణలు చేయడమే కానీ విచారణ జరగడం లేదని ఆరెండు పార్టీల మధ్య రహస్య పొత్తుకు ఇంతకంటే ఇంకేమి, ఆధారం కావాలని  ప్రశ్నిస్తున్నారు.  మరో వంక అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన  కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటి సీనియర్ నాయకులు కొందరు రేపు ఎన్నికల అనంతరం అవసరం అయితే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాదు పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ లో కేసీఆర్  కోవర్ట్లులున్నారని బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. జగ్గా రెడ్డి వంటి కొందరు సీనియర్లు ఇదే విషయంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అదే విధంగా పీసీసి మాజీ  చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి సైతం కోవర్డ్ కామెంట్స్  పై తీవ్రంగా స్పందించారు.  అంతే కాదు  రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే, కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేల..ఫిరాయింపులు ఆపలేమని, అది అయ్యే పని కాదని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బహిరంగంగా అంగీకరించారు. ఒక విధంగా ఆయన ముందుగానే చేతులు ఎత్తేసారు. అంతే కానీ, అధికారంలోకి రాకున్నా  ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తామని చెప్పలేక పోతున్నారు. అంతకు  మించి  నడుస్తున్న చరిత్రను చూసినా తెలంగాణ రాష్టం ఏర్పడిన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసే 25 నుంచి 30 మంది అభ్యర్ధులకు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. టికెట్ కు అప్లై చేసేందుకు, చెల్లించిన రూ.50 వేల ఫీజు మొదలు, టికెట్ కొనుక్కునేందుకు అవసరమైన, సొమ్ములు,ఎన్నికల ఖర్చులు పూర్తిగా భరించడంతో పాటు గెలిచినా, ఓడినా వారి రాజకీయ భవిష్యత్ కు బీఆర్ఎస్ హామీ ఇస్తోందని అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్ధుల మంచి చెడులు, ఆర్థిక అవసరాలు చూసేందుకు  బీఆర్ఎస్ ఒక ప్రత్యేక వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని, ఆ బాధ్యతలను కొందరు  కీలక నేతలకు అప్పగించిందని ప్రచారం జరుగుతోంది. అలాగే అటు నుంచి, బీఆర్ ఎస్ చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చీఫ్ విప్ బాల్కసుమన్, కాంగ్రెస్ లోనూ మన వాళ్ళే ఉన్నారు.  వాళ్ళు మన వాళ్ళే ... మనమే కావాలని మన వాళ్ళు కొంత మందిని కాంగ్రెస్ లోకి పంపించాము .. ఆ కాంగ్రెస్ నాయకులు కూడాఎన్నికల తర్వాత మన పార్టీలోకి వస్తారు. గతంలో చెన్నూర్’ నుచి పోటీ చేసిన ఎంపీ వెంకటేష్ మన పార్టీలోకి వచ్చారు.ఇప్పడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా రేపు మన పార్టీలోకే వస్తారు  అంటూ బహిరంగ ఉపన్యాసమే చేశారు. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత సైతం కొందరు కాంగ్రెస్ నాయకులను పొగడ్తలతో ముంచెత్తుతున్నట్లు వార్తలొచ్చాయి.  అంతే కాదు  బీఆర్ఎస్ తన రెండు దశాబ్దాల   ప్రస్థానంలో అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది. అందుకు ఒకే ఒక్క మినహయింపు బీజేపీ. ఈ 20 ఏళ్ళు పైబడిన ప్రస్థానంలో బీఆర్ఎస్. ఏ ఒక్క ఎన్నికల్లోనూ బీజేపీతో పొట్టు పెట్టుకోలేదు. అలాగే రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సహా  అన్ని పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకే ఒక్క మినహాయింపు బీజేపీ .. 2014లో  బీజేపీ టికెట్’పై ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక్కరూ పార్టీ మారలేదు. 2018లో ఒక్కరే గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో ఇద్దరు తోడైనా .. పార్టీ మారలేదు.   మరో వంక, రాజకీయ విశ్లేషకులు కూడా ఏ విధంగా చూసినా, అవసరం అయితే  బీఆర్ఎస్ , కాంగ్రెస్ తో జట్టు కడుతుందే కానీ, బీజేపీతో కలవదని, అంటున్నారు.

ఇక జనంలోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలతో రాష్ట్రం రగిలిపోతున్నాది. చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా  యువగళం పాదయాత్రకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రేక్ ఇచ్చారు. అయితేచంద్రబాబు కుటుంబం జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్లేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఇక జనంలోకి రానున్నారు. జగన్ ప్రభుత్వ అరాచక పాలనను, అక్రమ అరెస్టులు కేసులతో రాష్ట్రంలో భయానకవాతావరణం సృష్టిస్తున్న తీరునూ ప్రజలలో ఎండగట్టే ఉద్దేశంతో వీరిరువురూ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ పాదయాత్రకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు తెలుగుదేశం ముఖ్య నాయకులతో రాజామహేంద్రవరంలో నారా లోకేష్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక భువనేశ్వరి, బ్రాహ్మణి పాదయాత్రపై గురువారం (సెప్టెంబర్ 14) సాయంత్రానికి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ లోగా లోకేష్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో భేటీ అనంతరం నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. లోకేష్ తో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. కాగా ఇప్పటికే నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును జగన్ సర్కార్ వేధిస్తున్న తీరును ప్రజల కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. రెండు రోజుల కిందట జైల్లో చంద్రబాబును భువనేశ్వరి బ్రాహ్మణి కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడిన భువనేశ్వరి ఏమీ లేని ఒక కేసులో చంద్రబాబును ఇరికించి.. జైల్లో ఆయన కట్టించిన భవనంలోనే కట్టి పారేశారనీ, ఎటువంటి సౌకర్యాలూ లేవనీ, ఆయన భద్రతపై కూడా తన ఆందోళన ఉందనీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా భువనేశ్వరి జైలు నుంచి బయటకు వస్తుంటే తనలో ఒక భాగాన్ని అక్కడే వదిలేసినట్లు ఉందని అనడం అందరినీ కదిలించింది. ఆ తరువాత కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ సందర్భంగా సీఐడీ కౌంటర్ కు సమయం కోరడంతో చంద్రబాబు అరెస్టును సమర్ధించుకునేలా ఒక్క ఆధారం కూడా సీఐడీ వద్ద లేదన్న సంగతి సర్వులకూ అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు పాదయాత్ర చేయాలని, జనంలో మమేకమై జగన్ సర్కార్ దురాగతాలను, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలలో ఎండగట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అదీ కాక భువనేశ్వరి తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎక్కడకూ పోదనీ, జనంతోనే ఉంటుందనీ, తన భర్త జనం కోసమే తపిస్తున్నారనీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కష్టాలు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తారని చెప్పడమే కాదు.. చంద్రబాబు భార్యగా, ఎన్టీఆర్ కుమార్తెగా మీకు హామీ ఇస్తున్నాను అని కూడా చెప్పారు. ఆ మేరకే ఇప్పుడు ఆమె జనంలోకి రావడానికి సంసిద్ధమయ్యారు అని పరిశీలకులు చెబుతున్నారు.  

స్కిల్ త్రైపాక్షిక ఒప్పందమేనని సీఐడీ చీఫ్ ఒప్పుకోలు.. తడబాటుతో నవ్వుల పాలు!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టుకు ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. న్యాయ నిపుణులు చంద్రబాబును ఏపీ సర్కార్ అరెస్టు చేసిన తీరుపై దిగ్భ్రమ వ్యక్తం చేస్తున్నారు. సమస్త విలువలకూ తిలోదకాలిచ్చి.. అరెస్టు చేయడమే లక్ష్యం అన్నట్లుగా నమోదు చేసిన కేసులు, కోర్టులో వాదనలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వీఆర్ విత్ సీబీఎన్ అంటూ ఆందోళన బాట పట్టారు. జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా నేతలంతా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం (సెప్టెంబర్ 14) రాజమహేంద్రవరం వచ్చి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇక రోజు రోజుకూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు, నిరసనలూ జోరందుకుంటున్నాయి. చంద్రబాబు తన అరెస్టుపై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయడానికి సీఐడీ సమయం కోరడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. అసలు ఎందుకు అరెస్టు చేశారో, నిబంధనలు ఏమిటో, నమోదు చేసిన సెక్షన్లు ఏమిటో తెలియకుండానే అరెస్టు చేసి ఇప్పుడు సమర్ధించుకోవడానికి దారి లేక వాయిదాలు కోరుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఐడీ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందనీ, అడ్డగోలు అరెస్టులు కేసులతో వైసీపీ వ్యతిరేకులను, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలను విమర్శిస్తున్న వారిని వేధించడానికే పరిమితమైందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది. కోర్టులు కూడా పలు సందర్భాలలో సీఐడీ తీరును తప్పుపట్టాయి. అయినా అధికార వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో పని చేయడానికి అలవాటు పడిపోయిన సీఐడీ తీరు మారడం లేదు. చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా నిబంధనలకు తిలోదకాలిచ్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి వాంగ్మూలం ఆధారంగా అయితే చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెబుతోందో ఆ మాజీ ఐఏఎస్ అధికారే సీఐడీ ప్రకటనను తప్పుపట్టారు. ఇక టెక్ డిజైన్ సంస్థ తాము స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు పరికరాలు అందించామనీ, సీమెన్స్ తో కలిసి అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎటువంటి అవకతవకలూ లేవని ఆ సంస్థ ఎండీ కుండబద్దలు కొట్టారు. ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీమెన్స్ కు అసలు స్కిల్ తో సంబంధం లేదని చెప్పడాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి ఆధారాలతో సహా ఎండగట్టారు. అయినా వైసీపీ సర్కార్ మాత్రం పాత పాటనే పాడుతోంది. ఆధారాలు చూపమంటే దాట వేస్తూ.. సీఐడీ ఆరోపణలనే పదేపదే చెబుతూ గొబెల్స్ ప్రచారం చేస్తున్నది. అయితే తెలుగుదేశం నాయకులు ఆధారాలతో సహా బయటపెడుతుండటంతో ప్రజలకు వాస్తవం బోధపడి స్వచ్ఛందంగా చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇంతకీ అసలు స్కిల్ కేసుతో సీమెన్స్ కు సంబంధం లేదంటూ సజ్జల వంటి వారు, వారి మాటలకు వంత పాడుతున్నట్లుగా సీఐడీ   సిమెన్స్ పేరును అడ్డగోలుగా తెలుగుదేశం వాడేస్తోందనీ, ఆ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థే చెప్పిందంటూ సజ్జల మాటలనే సీఐడీ చెబుతోంది. ఇందుకు సంబంధించి వైసీపీ అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వారుస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ స్కిల్ ప్రాజెక్టుతో సీమెన్స్ కు సంబంధం లేదన్నది ఆ వార్తల సారాంశం, సీఐడీ కూడా అదే చెబుతూ వస్తోంది.  కానీ కోర్టులలో తమ అసంబద్ధ వాదన నిలవదు, అసలు వాస్తవం బయటపడుతుందన్న భయమో ఏమో కానీ.. సీఐడీ చీఫ్ మీడియా సమావేశంలో  అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ సంస్థతోనే   ఒప్పందం కుదుర్చుకుందని, ఆ సంస్థకు రూ. 58 కోట్లు అందాయని అంగీకరించారు. తమ ఆరా అంతా మిగిలిన సొమ్ముగురించేనంటూ చెప్పుకువచ్చారు.  ఇప్పటి వరకూ అసలు సీమెన్స్ కు సంబంధం లేదని వాదిస్తూ వచ్చిన సీఐడీ ఇప్పుడు టెక్ డిజన్ సంస్థలా సీమెన్స్ కూడా మీడియా ముందుకు వస్తుందోమోనన్న భయంతో  మాట మారుస్తోంది. అసలు స్కిల్ డెవలమ్ మెంట్ సెంటర్లు పని చేయలేదని చూపేందుకు  చంద్రబాబు అరెస్టు తరువాత వాటికి తాళాలు వేస్తోంది. మొత్తం మీద గుడ్డ కాల్చి ముఖాన వేసి ఆ మసి మీరే తుడుచుకోవాలన్నట్లు జగన్ సర్కార్, ఏపీ సీఐడీ తీరు ఉంది. అయితే స్వాష్ పిటిషన్ తో వైసీపీ సర్కార్ కుట్రలన్నీ తేటతెల్లం అయ్యాయి. కౌంటర్ కు వారం గడువు అడగడంతోనే సీఐడీ వద్ద ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క ఆధారం లేదని తేటతెల్లమైపోయిందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఏసీబీ కోర్టును ఆదేశించడంతో.. సీఐడీ  అక్రమంగానే చంద్రబాబు విషయంలో వ్యవహరించిందన్నది రుజువైపోయినట్లేనని న్యాయనిపుణులు అంటున్నారు. మరో వారం పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉంటే ఉండొచ్చు కానీ ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడి పులుకడిగిన ముత్యంలా  తిరిగి వస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

ఐయాం విత్ బాబు అంటూ హైదరాబాద్ లో కదంతొక్కిన ఐటీ ఉద్యోగులు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు  రాష్ట్రం, ప్రాంతం అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై బైఠాయిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బుధవారం (సెప్టెంబర్ 13)  హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన ఐటీ ఉద్యోగుల నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం, అధర్మం అంటూ వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినదించారు. దురుద్దేశపూర్వకంగా చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.  చంద్రబాబు విజన్ వల్లే తాను మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత స్థాయి జీవితాన్ని గడపగలుగుతున్నామని, ఆయన మాత్రం జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజన్ బ్యాచ్ విజన్ బ్యాచ్ ను టార్గెట్ చేసిందన్నారు.  ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. కాగా ఐటీ ఉద్యోగుల ఆందోళనతో ఆ  ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  

చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. ఆయన తప్పు చేయరు.. లోకేష్ కు రజనీకాంత్ ఫోన్

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. ఆయనను అందరూ అజాత శత్రువుగా చెబుతారు. అందరితో మంచిగా ఉంటారు. పరుష వాక్యం అన్నది ఆయన నోటి నుంచి రాదు.  రాజకీయాలలోకి ఎంట్రీ ఇద్దామని ఆయన భావించి కూడా రాజకీయాలు తన నైనాజికి సరిపడవన్న భావనో ఏమో ఆ యోచన నుంచి విరమించుకున్నారు. అటువంటి రజనీకాంత్ ను ఏపీలోని అధికార వైసీపీ వివాదంలోకి లాగింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని విజనరీగా అభివర్ణించారు.  చంద్రబాబు కారణంగానే హైదరాబాద్ లో  ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపించేలా అభివృద్ధి జరిగిందనీ, అందంతా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందన్నారు. చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాల స్నేహబంధం ఉందనీ, తన ప్రతి పుట్టిన రోజుకూ చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారనీ రజనీకాంత్ ఆ సందర్భంగా చెప్పారు. ఆ ప్రసంగంలో రజనీకాంత్  ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. కానీ చంద్రబాబును ప్రశంసించడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా  వైసీపీ రజనీకాంత్ పై విమర్శల వర్షం కురిపించింది. మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, నటుడు కం  పొలిటీషియన్ పోసాని కృష్ణ మురళి వంటి వారు రజనీకాంత్ పై అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. నువ్వు హీరోవా అంటూ హేళన చేశారు. దేశ విదేశాల్లో ఉన్న రజనీకాంత్ అభిమానులందరికీ ఆగ్రహం కలిగించారు. అయినా అప్పటికి రజనీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మేధావులూ, సామాన్యులూ కూడా రజనీకాంత్ పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు.  అయితే అప్పటికి ఊరుకున్న రజనీకాంత్ తన చిత్రం జైలర్ సినిమా వేడుకలో  మాత్రం ‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?" అంటూ వైసీపీ వారికి చురకలు అంటించారు.   మొదటి వాక్యాలను తమిళంలో చెప్పిన రజినీకాంత్.. చివరిలో మాత్రం 'అర్థమైందా రాజా' అని తెలుగులో చెప్పడం విశేషం. పోసాని మాట్లాడితే 'రాజా రాజా' అంటుంటారు. అందుకే పోసాని శైలిలోనే అర్థమైందా రాజా అంటూ వైసీపీ నాయకులకు రజినీ చురకలు అంటించారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది కూడా. మొత్తం మీద అలుంగుటయే ఎరుగని రజనీ కాంత్ కూడా వైసీపీ తీరుపై సౌమ్యంగానైనా గట్టి రిటార్డ్ ఇచ్చారు. అటువంటి రజనీకాంత్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పై స్పందించారు. తన మిత్రుడు చంద్రబాబు  గొప్ప పోరాట యోధుడు అని, ఆయన ప్రజా శ్రేయస్సుకోతం నిరంతరం పరితపించే గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనను ఏం చేయలేవని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు శ్రీరామరక్ష అంటూ లోకేష్ కు ధైర్యం చేప్పారు.  తన స్నేహితుడు చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థ ప్రజా సేవే ఆయనను క్షేమంగా బయటకు తీసుకువస్తాయన్నారు.  

ఇండియా కూటమిలో లుకలుకలు ?

2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఓటమి,  ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే  ఎజెండా గా ఏర్పడిన ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఎ… (ఇండిమా) చుక్కల కూటమి... లెక్కలు తప్పుతున్నాయా? కూటమి కలలకు శ్రీకారం చుట్టిన జనతాదళ్ (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  అడుగులు తడబడుతున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజమే. అడుగులు తడబడుతున్నది ఒక్క నితీష్ నడక, నడతలోనే కాదు. కూటమి పెద్ద దిక్కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అడుగులు కూడా తడబడుతున్నాయి. ఇప్పటికే పవార్  సమీప బంధువు (మేనల్లుడు) అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని, బీజేపీ, శివ సేన (షిండే) కూటమితో చేతులు కలిపారు. ఆ కూటమి ప్రభుత్వంలో కొలువు తీరారు.  మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా  శరద్ పవార్ ‘బంధుత్వం’ ముసుగులో అజిత్ పవార్ తో రాజకీయ బంధుత్వం కొనసాగిస్తున్నారనే  అనుమానాలు ఇండియా కూటమిలో వ్యక్తమవుతున్నాయి. పవార్ ముందు చూపుతోనే  రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని  రేపు ఎన్నికల ముందో తర్వాతో పరిస్థితులను బట్టి  ఆయన అటు మొగ్గినా, ఇటు మొగ్గినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.    మరోవంక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  ఆమ్ ఆద్మీ పార్టీ  (ఆప్ ) మరో అడుగు ముందుకేసింది. ఓ వంక ఇండియా కూటమి  బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి  అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనతో  సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుపుతుంటే, బుధవారం (సెప్టెంబర్ 13) ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో ఇండియా కూటమి కోఅర్దినేషన్, ఎలక్షన్ స్ట్రాటజీ సమావేశం జరుగుతోంది) మరోవంక, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాలలో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ఆప్   ప్రకటించేసింది.  అంతేకాకుండా. తృణమూల్, జేడీయు, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ సహా కూటమి భాగస్వామ్య పార్టీలు, కూటమి మనుగడకు సీట్ల పంపకమే కీలకమని భావిస్తున్నాయి. అలాగే  అదేదో  తేలిన తర్వాతనే ఉమ్మడి ప్రచార వ్యూహం గురించి మాట్లాడదామని అంటున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం సీట్ల సర్దుబాటు కంటే కూటమి నాయకత్వం పై నిర్ణయం అవసరమని భావిస్తోంది.    ఆదలా ఉంటే  ఇప్పడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పవార్ అడుగుజాడల్లో అయితే అడుగులు వేస్తున్నారన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నిజానికి  గత సంవత్సరం ఆగష్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీతో జట్టు కట్టినా, ఆయన మళ్ళీ  ఎప్పుడైనా బీజేపీ గూటికి చేరతారనే అనుమానాలు అప్పటి నుంచీ వినవస్తూనే ఉన్నాయి. అయితే  నితీష్ గత జనవరి, ఫిబ్రవరి నెలలలో విపక్షాల ఐక్యత వేదిక ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆయన సారధ్యంలో, ఆయనే అనుసంధానకర్తగా బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల తొలి సమావేశం  పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన  రెండవ సమావేశంలో  ఇండియాగా నామకరణం జరిగింది. ముంబైలో మూడవ సమావేశం కూడా జరిగింది కానీ  కూటమిని తమ గుప్పిట్లోకి తీసుకోవాలనే  నితీష్ కల మాత్రం ముందుకు సాగ లేదు. బ్రేక్ పడింది. కూటమిని, కాంగ్రెస్ పార్టీ తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన చేసిన నేపధ్యంలో నితీష్ కుమార్  ఇండియా కూటమితో కొంత అంటీముట్టనట్లే ఉంటున్నారు. అదలా ఉంటే ఇప్పడు తాజాగా నితీష్ కుమార్  అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20  విందు సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన అడుగులు జోడు పడవల ప్రయాణం వైపుగా పడుతున్నాయా  అనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ మాట కలిపారు. బీహార్‌లో బీజేపీతో గత ఏడాది ఆగస్టులో నితీష్ తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన కలవడం ఇదే మొదటిసారి. నితీష్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి పరిచయం చేశారు. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకున్న 'ఇండియా కూటమి' నేతలకు సహజంగానే ఇది మింగుడుపడని వ్యవహరమే. నీతీష్ మంచి రాజనీతిజ్ఞుడని, సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో కాకలు తీరిన నేత అని అందరికీ తెలిసిన విషయమే. జి-20 డిన్నర్‌కు హాజరుకావడం ద్వారా సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం తనకు ఉందని  నితీష్ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెప్పకనే చెప్పినట్టు అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జి-20 మెగా షో‌తో దేశానికి ఒరిగేదేమీ లేదని బీహార్‌లో నితీష్ భాగస్వామ పార్టీ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ గత సోమవారంనాడు పెదవి విరిచారు. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విపక్ష ఐక్య కూటమి యత్నాలకు నితీష్ సారథ్యం వహిస్తూ వచ్చారు. ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యమని నితీష్ చెబుతూ వచ్చారు. అయితే విపక్ష కూటమికి సారథ్యం వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును లాలూ ప్రసాద్ ఇటీవల ప్రతిపాదించడం జేడీయూకు మింగుడు పడటం లేదు. జేడీయూ అగ్రనేతలు కొందరు విపక్ష కూటమి పీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ప్రతిపాదించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఈ ముచ్చట ఏదీ ముంబై సమావేశంలో చోటుచేసుకోలేదు. కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం, సీట్ షేరింగ్ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మాత్రమే సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఒక్క నితీష్ మాత్రమే కాదు, అటు మమత, ఇటు కేజ్రీవాల్ .. అలాగే, ఇడియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా, ఇండియా కూటమి సారధ్య బాధ్యతలను హస్తం పార్టీకి అప్పగించేందుకు సిద్ధంగా లేరని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ  సారధ్యంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరని, అంటున్నారు.

ఎన్నికలపై తెలంగాణలో కన్ఫ్యూజన్.. పార్టీలలో అయోమయం

ఎన్నికల సమయం ముంచుకువస్తున్నా.. తెలంగాణలో మాత్రం రాజకీయ సర్కిల్స్ లోనే కాదు.. పార్టీల్లోనూ, నేతల్లోనూ కూడా ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం నెలకొని ఉంది. ఊరికి ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసిన అధికార బీఆర్ఎస్ తొందరపాటుతో రాజకీయంగా తప్పుటడుగు వేశానా అన్న మథనంలో ఉంటే.. అధికారం కోసం అన్ని విధాలుగా సమాయత్తమౌతున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. ఇక రాష్ట్రంలో అధకారమే ధ్యేయమంటూ దూకుడుగా కదులు తున్న బీజేపీలో కూడా హఠాత్తుగా అనూహ్యంగా స్తబ్దత నెలకొంది. ఇందుకు కారణాలేమిటని ఆలోచిస్తూ తలలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. కేంద్రం జమిలి ఎన్నికలవైపు మొగ్గు చూపుతోందని వస్తున్న వార్తల కారణంగానే.. రాష్ట్రంలో రాజకీయంగా ఈ అనిశ్చితి వాతావరణం ఏర్పడిందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇంతకీ జమిలి చర్చ కారణంగా అన్ని రాజకీయ పార్టీలలోనూ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో జరుగుతాయా, లేక సార్వత్రిక ఎన్నికలతో కలిపి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలలో జరిగే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలే.  కేంద్రం జమిలికే మొగ్గు చూపి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కలిసి వచ్చే రాష్ట్రాలలో కూడా ముందస్తుకు తెరతీసి పనిలో పనిగా సార్వత్రిక ఎన్నికలను కూడా ముందుకు జరిపేస్తుందా? లేక షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను వాయిదా వేసి సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుపుతుందా అన్న సందేహాలు రాజకీయ పార్టీలలోనే కాదు, పరిశీలకులు, విశ్లేషకుల్లో కూడా బలంగా వ్యక్తం అవుతున్నాయి.   ఈ సందేహాలు, అనుమానాలు నివృత్తి కావాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వరకూ ఎదురు చూడాల్సిందే. 

ఏపీలో ముందస్తా? తెలంగాణలో రాష్ట్రపతి పాలనా?

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాలలోనూ కూడా అసెంబ్లీ ఎన్నికల విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు సర్వం సన్నాహకంగా తయారైంది. ఇప్పటికే అత్యధిక అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేసింది. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల శంఖారావం మోగించేసింది. సరిగ్గా ఈ సమయంలోనే జమిలి ప్రతిపాదన కేంద్రం తెరపైకి తీసుకు వచ్చింది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం నిర్ణయించడానికి కారణం ఇదేనని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం (సెప్టెంబర్ 18) ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ఏది ఏమైనా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరిగేది అన్న విషయంపై స్పష్టత వస్తుంది అని అన్నారు. ఒక వేళ అక్టోబర్ 10వ తేదీ లోగా తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే వచ్చే ఏడాది జరిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అంటే ఒక వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడటమంటూ జరిగితే.. నిర్ణీత గడువు పూర్తయిన తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే   ఈ శుక్రవారం (సెప్టెంబర్ 15) జరగనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రత్యేక సమావేశాల్లో జమిలి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో జమిలికి కేసీఆర్ సై అన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 2018 ఎన్నికల సమయంలో  కేసీఆర్ జమిలికి సై అన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే  బీఆర్ఎస్ లో కేంద్రం జమిలిపై తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు ఏపీలో కూడా రాజకీయం రగులుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో ఒక్క సారిగా జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం భగ్గుమంది. ఆ ఆగ్రహ జ్వాలలు మరింత పెరిగి సర్కార్ ను దహించేయడానికి ముందే.. ముందస్తుకు వెళ్లి ఎలాగోలా బయటపడాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకోసమే ఆయన ఇలా లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చారో లేదో.. అలా హస్తిన పర్యటన పెట్టుకున్నారు. హస్తిన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సారి ఆయన పర్యటన అజెండా ఏపీలో ముందస్తు ఎన్నికలేనని అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇది అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో దేశం శ్రేణులు షాక్ లో ఉన్నాయనీ, ఆ షాక్ నుంచి టీడీపీ శ్రేణులు తేరుకుని.. ఆందోళనలు ఉధృతం చేయడానికి ముందే రాష్ట్రంలో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే రాజకీయంగా ఏదో మేరకు లబ్ధి చేకూరుతుందన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ రద్దు చేయాలని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారనీ, ఎటూ కేంద్రం జమిలి వ్యూహంతో ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగితే మేలని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హస్తిన నుంచి తిరిగి రాగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 21 నుంచి  ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే వాటిని మరో రెండు మూడు రోజులు పొడిగించైనా ఈ నాలుగున్నరేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా నివేదించి అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను జగన్ చేస్తారని చెబుతున్నారు. అయితే జగన్ ముందస్తు నిర్ణయానికి కేంద్రం అనుమతి, అంగీకారం తప్పని సరి కనుకనే ఆ విషయంలో కేంద్రం పెద్దల అనుమతి పొందేందుకే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు. ఇప్పికే  ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో  ఎన్నికల ప్రక్రియకు ఈసీ సన్నాహాలు మొదలెట్టేసింది. అయితే ఏపీలో మాత్రం ఈ ప్రక్రియ అధికారికంగా మొదలు కాలేదు.   ఎలా చూసినా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సాధారణ పరిస్థితుల్లో అయితే ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం లేదనీ, అయితే కేంద్రం జమిలీ ఎన్నికలపై నిజంగానే సీరియస్ గా ఉంటే.. మాత్రం ఏపీలో ముందస్తు అసాధ్యం కాదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మొత్తం మీద జమిలి చర్చ ఇరు తెలుగు రాష్ట్రాలనూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికలు వెనక్కు జరుగుతాయన్న ఆందోళనలో ఉంటే.. ఏపీలో  ముందస్తుకు అవకాశం లేకపోతే పుట్టి మునగడం ఖాయమన్న భయంలో అధికార వైసీపీ ఉంది. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరో వారం జైల్లోనే చంద్రబాబు?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో వారం రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం జైలు కు తరలించారు. కాగా ఈ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు బుధవారం (సెప్టెంబర్ 13) విచారించింది. అనంతరం ఈ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదననూ పూర్తిగా వినాలని భావించిన న్యాయస్థానం విచారణను వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 19)కి వాయిదా వేసింది.   ఏసీబీ కోర్టులో సీఐడీ చంద్రబాబును విచారించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 19 వరకూ విచారించవద్దని ఆదేశించింది. ఆ రోజు వరకూ చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది.   అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు బెయిలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ కూడా ఈ నెల 19కి వాయిదా పడింది.  

స్కిల్ స్కాం అంటూ జగన్ సర్కార్ కట్టుకథలూ.. కాకమ్మ కబుర్లూ!?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడిని   ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం, ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ వెంటనే ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఇంతకీ ఆయనను ఎందుకు అరెస్టు చేశారు. ఏ కేసులో అరెస్టు చేశారు? ఈ అరెస్టు వెనక లక్ష్యం ఏంటి?  ఆసలు ఈ కేసు ఏంటి? సెక్షన్లు ఏంటి? కుంభకోణం ఏంటి?  అందులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటన్నది  అలా ఉంచితే.. అసలు ఆయనను అరెస్టు చేసిన తీరే జగన్ కక్షసాధింపు ధోరణికి, చర్యలకు పరాకాష్టగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చంద్రబాబు అరెస్టుపై  వైసీపీ తప్ప దేశ వ్యాప్తంగా మిగిలిన అన్ని పార్టీలు, ఆయా పార్టీల నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖండిస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ సహా అన్ని పార్టీలూ జగన్ రెడ్డి కక్షపూరిత చర్యే చంద్రబాబు అరెస్టు అంటూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.  అస‌లు జ‌డ్‌+ కేట‌గిరీ భ‌ద్ర‌త, 14 ఏళ్ల‌పాటు సీఎంగా పనిచేసిన  ఉన్న‌త ప్రొఫైల్ ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబును వారాంతంలో కోర్టుకు సెలవు చూసుకొని అరెస్టు చేయడం, అదీ రాజకీయ పర్యటనలో ఉండగా అర్ధరాతి మందీ మార్బలంతో పోలీసులు దండయాత్ర చేయడంతో ఏపీలో అసలు రాజ్యాంగం ఉందా? చట్టం, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నాయా? లేక  ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు అనుగుణంగా ఆయన టార్గెట్ చేసిన వారిని నిర్బంధించే పనిలో మునిగిపోయారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్ మెట్ స్కాం కేసు విషయానికి వస్తే..  ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  3 వేల 300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3 వేల 300 కోట్ల రూపాయల్లో 10 శాతం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయలను ఆ రెండు సంస్థలకు చెల్లించింది. ఇందులో 240 కోట్ల రూపాయలను డిజైన్‌టెక్‌ సంస్థకు బదలాయించగా మిగతా సొమ్మును సీమెన్స్ కంపెనీకి బదలాయించారు. ఈ 370 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది సీఐడీ ఆరోపణ. ఈ కేసులోనే  చంద్రబాబును   అసలు ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయంలోనే చంద్రబాబుపై పదుల కొద్దీ కేసులు పెట్టారు. కానీ, న్యాయస్థానాల వద్ద ఒక్కటీ నిలబడలేదు. స్టేలు తెచ్చుకొని చంద్రబాబు మేనేజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ  నిజానికి ఆ కేసులలో విషయం లేకనే న్యాయస్థానాల వద్ద నిలవలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే. కేవలం ఓ నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు జబ్బలు చరుచుకోవటానికి, రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకుని, స్వీట్లు పంచుకోవడానికి మాత్రమే పనికొస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటి వరకూ జగన్ లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తుండగా.. రిటర్న్ చంద్రబాబును కూడా అవినీతి పరుడుగానే బురద జల్లేందుకు, ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఈ కేసు పనికి రానుంది. అంతేతప్ప ఇందులో పసలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.అదలా ఉంచితే.. ఎవరి వాంగ్మూలంతో అయితే చంద్రబాబును అరెస్టు చేశామని చెబుతున్నారో ఆ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సీఐడీ చెప్పిన దానిని నిర్ద్వంద్వంగా ఖండించారు. తన వాంగ్మూలాన్ని సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందన్న అనుమానం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం ఏదీ జరగలేదనీ, ఒక వేళ జరిగిందనుకున్నా అందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని పీవీ రమేష్ అన్నారు. కేసులో విచారణ చేయాల్సినా, అరెస్టు చేయాల్సినా ముందుగా ఆ కార్పొరేష్ ఎంపీ, కార్యదర్శులనేనని అన్నారు. తన వాంగ్మూలం ఆధారంగా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించిన చంద్రబాబును అరెస్టు చేశామని చెప్పడం అమానుషమని కుండబద్దలు కొట్టారు. దీంతో కంగుతిన్న సీఐడీ.. ఇప్పుడు పీవీ రమేష్ ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోందని కూడా విమర్శలకులు అంటున్నారు. అందుకు తార్కానంగా జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పీవీ రమేష్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన మరుసటి రోజే ఆయనను మేఘా కంపెనీ నుంచి బయటకు పంపింది.  ఇది కూడా పక్కన పెడితే.. అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందేమీ లేదని.. అది కేవలం సర్వీస్ టాక్స్ కు సంబంధించిన అంశం మాత్రమేననీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్న  డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఎండీ వికాస్‌ ఖన్వీల్కర్‌  విస్పష్టంగా చెప్పారు.  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకే కాదు, ఎవరికీ కూడా తాము సోమ్ము చెల్లించలేదనీ,  షెల్‌ కంపెనీల ద్వారా సొమ్ము తరలించారనేది పూర్తి అవాస్తవమనీ, అభూత కల్పన అనీ కుండబద్దలు కొట్టారు. అప్పటి ప్రభుత్వంతో  ఒప్పందం మేరకు పరికరాలను సరఫరా చేశామని, ఆడిటర్లను పంపితే అన్ని వివరాలనూ రశీదులతో అందిస్తామని చెప్పారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సంస్థ, సీఐడీ నివేదికలు తప్పుల తడక అని తేల్చి చెప్పారు. ఏమీ లేకుండా కేసు నమోదు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఈ కేసులో విచారణ సంస్థలు తమను సంప్రదించలేదన్నారు.  అంతే కాకుండా ప్రాజెక్టుకు సంబంధించిన  వివరాలతో కూడిన వీడియో  విడుదల చేశారు. ‘మోడీ ప్రధాని అయ్యాక జర్మనీ పర్యటనలో భాగంగా సీమెన్స్‌ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. భారత్‌లో నైపుణ్యాభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని  భావించిన ఆయన చొరవతోనే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి’ అని పేర్కొన్నారు. ‘సీమెన్స్‌ సంస్థతో ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లో మొదటి ప్రాజెక్టు చేపట్టామనీ,  ఆ రాష్ట్రంలో అయిదు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయగా ప్రాజెక్టు విజయవంతం అయ్యిందనీ, దీంతో గుజరాత్ ను చూసి పలు రాష్ట్రాలు సిమ్మెన్స్ ప్రాజెక్టును తమ తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలంటూ తమను సంప్రదించాయని వివరించారు.  అలాగే గుజరాత్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనా ప్రాజెక్టును.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని కార్యదర్శుల స్థాయి సీనియర్‌ అధికారుల బృందం అప్పట్లో పరిశీలించి, కళాశాలల్లో ప్రిన్సిపాల్స్‌, ఫ్యాకల్టీలు, విద్యార్థులు, డైరెక్టర్‌తో మాట్లాడిందనీ  వికాస్‌ ఖన్వీల్కర్‌ వివరించారు. ఆ తరువాతే ఆంధ్రప్రదేశ్‌, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థల మధ్య చర్చలు జరిగాయన్నారు. గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతోపాటు డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు కూడా శిక్షణకు సంబంధించిన ప్రయోజనాలను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.   ఒప్పందం మేరకు  కేంద్రాలు, కోర్సుల వారీగా 2.14 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 75వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కియా మోటర్‌ ఉద్యోగులకు కూడా వారి అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ అందింది.  నాలుగేళ్లపాటు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించామనీ, మా పనితీరును అభినందిస్తూ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ లేఖ ఇచ్చిందనీ, డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఎండీ వికాస్‌ ఖన్వీల్కర్‌  సోదాహరణంగా వివరించారు.   తప్పుడు ఆరోపణలతో మార్కెట్లో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, సీఐడీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.  దీంతో స్కిల్ స్కాం అంటూ ఏపీ సర్కార్, ఏపీ సీఐడీ కట్టు కథలతో.. కాకమ్మ కబుర్లతో అక్రమంగా, అప్రజాస్వామికంగా చంద్రబాబును వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.