అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం

  నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్న క్రాక గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన బాధితులు గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్ వారి అంత్యక్రియలకు హాజరై, వింజమూరు మండలంలోని గొల్లవారి పాలెం నుంచి తిరిగి విజయవాడకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  గాయపడిన వారిలో సుమలతకు తలకు తీవ్ర గాయం కాగా, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మౌనిక, కృష్ణ, కృష్ణ చైతన్య, మరో మహిళ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మౌనికకు కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కావలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

సైబర్ నేరగాళ్లు చేతిలో చిక్కిన మెగాస్టార్ చిరంజీవి

  గతంలో ఓ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్  చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన విషయం తెలిసిందే.. హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కాడు. తన ప్రతిష్ట అంతా పోయింది అంటూ మెగాస్టార్ చిరంజీవి పోలీసులను ఆశ్రయించారు.  సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న మెగాస్టార్  డిప్ ఫేక్ బారిన పడ్డాడు. సైబర్ కేటుగాళ్లు  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు మరియు వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు... అంతటి తో ఆగకుండా ఈ కేటుగాళ్లు మార్నింగ్ చేసిన అశ్లీల ఫోటోలు, వీడియోలను వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసి వైరల్ చేశారు.  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది గమనించిన మెగాస్టార్ చిరంజీవి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నా తన ప్రతిష్టను దెబ్బతీశారని.... అట్టి వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొ న్నారు. అంతేకాకుండా చిరంజీవి హైదరాబాద్ సిపి సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసా  గించారు. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ సీపీ  చిరంజీవి డీపీ ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి యొక్క ఫోటోలు వీడియోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి అన్నారు. మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేస్తాం. ఇలాంటి డీపీ ఫేక్ సెలబ్రిటీలు కేసులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు. అదే విధంగా చాదర్ ఘాట్ కాల్పుల కేసులో పురో గతి ఉంది. త్వరలో అన్ని వివరాలు వెల్లడి స్తామని హైదరాబాద్ సీపీ  సజ్జనార్ వెల్లడించారు

మొంథా తుపాన్ పై రియల్ టైం అప్ డేట్స్.. సీబీఎన్

మొంథా తుఫాన్‌ ప్రభాభం, తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైమ్‌లో  అప్ డేట్స్ అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.  తుపాన్  ప్రభావంపై మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం నుంచి గంటగంటకూ.. తుఫాన్ బులిటెన్లు విడుదల చేస్తూ ప్రజలను  అప్రమత్తం చేయాలని సూచించారు. స చివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై చంద్రబాబు సోమవారం (అక్గోబర్ 27) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార  వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలచెప్పారు. తుఫాన్ ప్రభావం  అధికంగా  ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3,211 జెనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని  నిర్దేశించారు. ఎక్కడా కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాలబారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వారికి పాతిక కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలన్నారు.  ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ. దూరంలో ఉన్న మొంథా తుఫాన్...16 కి.మీ వేగంతో తీరానికి చేరువ అవుతోందని... దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తర, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయని... మంగళవారం కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించినట్లు తెలిపారు.  తుపాను కారణంగా రహదారులు కోతకు గురైనా, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడినా వెంటనే పునరుద్ధరించేలా మెటీరియల్, మిషనరీ సిద్ధం చేయాలని, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాను అనంతరం అంటువ్యాధులు సోకకుండా పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.      తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు సందేశాలు పంపించి అవగాహన పెంచాలి. తిత్లీ, హరికేన్, హుద్‌హుద్ తుఫాన్ల  అనుభవాన్ని ఇందుకు వినియోగించాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.   

కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపేనా?

కల్వకుంట్ల కవిత జనం బాట పాదయాత్రను శనివారం (అక్టోబర్ 25) నిజమాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలలో పర్యటించనున్నారు. సరిగ్గా ఐదేళ్ల కిందట తాను ఎక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారో సరిగ్గా అదే నియోజకవర్గం నుంచి ఆమె తన కొత్త రాజకీయ బాట పట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగంలో.. సొంత పార్టీయే తనను దగా చేసిందని చెప్పుకొచ్చారు.  బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా తనకు వ్యతిరేకంగా చేసిన కుట్రవల్లనే తాను నిజామాబాద్ లో పరాజయం పాలయ్యానన్నారు. జనం కాదు.. తనను సొంత పార్టీయే ఓడించిందని చెప్పుకున్నారు.   తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తనకు అపార గౌరవం ఉందని చెప్పిన కవిత.. ఆ కారణంగానే పార్టీలో తనకు ఎన్ని అవమానాలు జరిగినా నిశ్శబ్దంగా ఉన్నాననీ, అయితే ఇప్పుడు.. తనను పార్టీ నుంచి బయటకు పంపేశారనీ, అందుకే తిరిగి తన ప్రజల వద్దకు వచ్చానన్నారు.   ఈ సందర్భంగా కవిత తన ప్రసంగంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ ప్రధానంగా ఆమె ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులే లక్ష్యంగా సాగింది. వారిరువురూ అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ సందర్భంగా వారి అవినీతిని ప్రశ్నించిన కారణంగానే తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకున్నారు. చర్విత చరణమే అయినా కవిత.. తాను తెలంగాణ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాను కోత్త రాజకీయపార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. తాను స్వతంత్రంగా, స్వంతంగా రాజకీయాలలో రాణించాలని భావిస్తున్నట్లు చెప్పిన కవిత, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  అయితే ఒకే  సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పిస్తూ ఆమె ఎవరిని బెదరించాలని చూస్తున్నారో అవగతం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు.కవిత తెలంగాణ రాజకీయాలలో బలీయమైన శక్తిగా ఎదుగుతారా? లేదా వేచి చూడాల్సిందేనంటున్నారు.  

ప్రొఫెసర్ పావనమూర్తి కన్నుమూత

  తొలితరం అంబేద్కరైట్, బుద్ధిస్ట్ ప్రొఫెసర్ చింతకాయల పావనమూర్తి (88) ఈ ఉదయం విశాఖపట్టణంలో కన్నుమూశారు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన స్వస్థలం యానాం. పావనమూర్తి  ద్వారా ఎంతోమంది అంబేడ్కర్ని, బౌద్దాన్ని చదువుకుని క్షేత్రస్థాయి ఉద్యమకారులుగా, మేధావులుగా మారారు. ఆయన ప్రభావం గోదావరి జిల్లాలు, కళింగాంధ్రలో ఎక్కువగా వుంటుంది. చాలామంది ప్రముఖులు పావన మూర్తి  శిష్యులం అని గర్వంగా చెప్పుకుంటారు.  అంబేద్కరైట్స్ కి విశాఖ అనగానే గుర్తుకొచ్చేది పావనమూర్తి ! అంబేడ్కరైట్ భావజాల వ్యాప్తి కోసం మేధో రంగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ప్రజ్ఞ, సత్యపాల్ ఆయన కూతురు, అల్లుడు తొలితరం అంబేద్కరైట్, బౌద్ధధమ్మ ప్రచారకులు ఒక తరాన్ని ఉద్యమకారులుగా, బుద్ధి జీవులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో నడిపిన ప్రభావశీలి ప్రొఫెసర్. సి. పావనమూర్తికి పలువురు మేధావులు నివాళులర్పించారు  

దేవుడితోనూ రాజకీయాలు.. జోగి రమేష్ ఒట్లను ఎవరైనా నమ్ముతారా?

వైసీపీ నేతలు రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడికి వెళ్లి ప్రమాణం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా, ఇంకా చెప్పాలంటే.. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్.. నకిలీ మద్యం కేసులో తాను నిర్దోషిననీ, తనకేమీ తెలియదనీ బుకాయిస్గున్నారు. అసలు ఈ కేసులో  ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియనే తెలియదనీ గట్టిగా చెబుతున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. అద్దేపల్లిజనార్దన్ రావుతో జోగి రమేష్ సంబంధాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావుతో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జోగి రమేష్ తన బుకాయింపులను కొనసాగిస్తున్నారు.  నకిలీ మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ అడగకుండానే.. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి మరీ ప్రమాణం చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాల్ చేసినప్పటికీ వాళ్లు స్పందించపోవడంతో తాను వచ్చి ప్రమాణం చేశానని చెబుతున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే దుర్గమ్మ కాళ్ల వద్దే ఉరేసుకుంటానని ఈ సందర్భంగా జోగిరమేష్ అన్నారు.  అయితే ఇక్కడ ఆయన ప్రమాణాలు, ప్రతిజ్ణలను జనం నమ్మే పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్ధనరావు పోలీసు కస్టడీలో విషయం మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. ఇందులో సందేహాలకు అతీతంగా జోగి రమేష్ ప్రమేయాన్ని అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించేశారు. ఈ నేపథ్యంలోనే జోగు రమేష్ దేవుడి మీద ప్రమాణాలంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీ అధికారంలో  ఉన్న సమయం నుంచీ జోగి రమేష్ నేతృత్వంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్ల అద్దేపల్లి చెబుతున్నారు. అప్పటి లెక్కలు బయటపెట్టడమే కాకుండా.. తాజా నకిలీ మద్యం కుంభకోణం వ్యవహారంలో జోగురమేష్ తో తాను చేసిన చాట్ల స్క్రీన్ షాట్లను కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ బుకాయింపులను, ప్రమాణాలను, ప్రతిజ్ణలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.  

జూబ్లీ బైపోల్.. నవీన్ యాదవ్ తండ్రి బైండోవర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. సరిగ్గా ప్రచారం జోరందుకున్న వేళ నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైం బోవర్ చేశారు. ఈ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పలువురిని పోలీసులు బైండోవర్ చేశారు. చిన్న శ్రైశైలం యాదవ్ సహా దాదాపు వంద మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఇలా బైండోవర్ అయిన వారిలో అత్యధికులు అంటే 74 మంది వరకూ బోరబండపోలీసు స్టేషన్ పరిధిలోని వారే కావడం గమనార్హం.   బైండోవర్ అంటే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న అనుమానం ఉన్న వ్యక్తులను ఎన్నికల సమయంలో ముందస్తు జాగ్రత్తగా తహశీల్దార్ లేదా ఆర్డీవో ఎదుట హాజరు పరిచి.. ఆ వ్యక్తి చేత లిఖిత పూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించబోనని బ్యాండ్ పైపర్ పై రాయించుకుంటారు. ఆ తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తారు. జూబ్లీ ఎన్నికల వేళ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రిని పోలీసులు బైండోవర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

మొంథా తుపాను ఎఫెక్ట్... పలు రైళ్లు రద్దు

  మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖ మీద ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 43 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే ఉదయం నుంచి ఏపీలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొంథా తుఫాన్ పరిస్థితిపై  ప్రధాని మోదీ ఆరా తీశారు. చంద్రబాబుకు ఫోన్ చేసి తుపాను పరిస్థితిని తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో కేంద్రం పూర్తిస్థాయిలో  సహకరిస్తుందని ప్రధాని భరోసానిచ్చారు. సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మొంథా తుపాను కాకినాడకు సుమారు 680 కిలోమీటర్ల దూరంలో వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం వైపు కదులుతోందని, రేపు రాత్రికి కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో ఈ రోజు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రతి గంటకు తుపాను కదలికలను పర్యవేక్షిస్తూ, వర్షాలు, వరదల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పంట నష్టం జరగకుండా కాలువ గట్లను బలపరచాలని స్పష్టం చేశారు.

దిశ మార్చుకున్న మొంథా తుపాన్.. తీరం దాటేదెక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న మొంథా తుపాన్ దిశ మార్చుకుంది.   ఇప్పుడు   తూపాను కాకినాడ సమీపంలో కాకుండా కోనసీమ జిల్లా శంకరగుప్తం పడమటి లంక వద్ద తీరం దేటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఉపగ్రహం నుంచి సమాచారం వచ్చిందని పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తాయనీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తుపానుపై ఆంధ్రప్రదేశ్ ప్రభఉత్వం అప్రమత్తమైంది.  తుపాను ప్రభావం అధికంగా ఉండే మూడు జిల్లాలలో పాఠశాలలకుసెలవు ప్రకటించింది.  

మొంథా తుపాన్.. సన్నద్ధతపై చంద్రబాబుకు మోడీ ఫోన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెను ప్రభావం చూపనున్న మమొంథా తుపానును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉంది? కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అడిగారు. ఇందుకోసం ఆయన స్వయంగా  చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని మోడీ భరోసా ఇచ్చారు. కాగా తుపాను సన్నద్ధత, కేంద్ర బృందాలు అందిస్తున్న సహకారం, ప్రాణ, ఆస్తినష్టం కనిష్ఠానికి పరిమితమయ్యేతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా చంద్రబాబు మోడీకి వివరించారు. తుపాను ప్రభావం రాష్ట్రంపై మరీ ముఖ్యంగా కోస్తాపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.  తుపాను మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీ పంలో తీరం దాటే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే కోస్తా వ్యాప్తంగా తుపాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది.  ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం, బుధవారం (అక్టోబర్ 28, 29) పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

గుర్తులపై అభ్యంతరాలు..ఓటమి అంగీకారమేనా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే నెల 11 ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక బరిలో ఎంత మంది నుంచున్నా.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉందన్నది నిర్వివాదాంశం. మూడు పార్టీలకూ కూడా ఈ ఉపఎన్నికలో విజయం చావో రేవో అన్నట్లుగానే పరిణమించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికలో విజయం తమ పాలనకు లిట్మస్ టెస్టుగా భావిస్తుంటే.. ఉనికి, సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నిలో గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్న బీజేపీకి.. జూబ్లీ ఉప ఎన్నికలో గెలుపు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కోసం మూడు పార్టీలూ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమను గెలుపు బాటలో నడిపిస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తుంటే.. బీఆర్ఎస్ పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ అయితే మోడీ కరిష్మాపై ఆధారపడి బరిలోకి దిగింది. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రచారంలో బీఆర్ఎస్ అధికార పార్టీపై విమర్శల దూకుడు పెంచింది. అదే సమయంలో ఎన్నికల గుర్తుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. అదే ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోందా అన్న అనుమానాలు కలిగేలా చేస్తోందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తులపై చేస్తున్న అభ్యంతరాలేమిటయ్యా అంటే..  స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన చపాతీ రోలర్, సబ్బు డిష్, కెమెరా, రోడ్ రోలర్, షిప్ వంటి వి బీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారును పోలి ఉన్నాయని చెబుతోంది. దీని వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాదిస్తోంది. ఆ అయోమయం కారణంగా ఓటర్లు కారు  గుర్తుకు వేయాల్సిన ఓటును పైన చెప్పిన వాటిలో దేనికో ఒక దానికి వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇదే ఆ పార్టీలో ఓటమి భయాన్ని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈవీఎంలో గుర్తుతో పాటు అభ్యర్థి పేరు, ఫొటో కూడా ఉంటాయి కనుక అయోమయానికి ఎక్కడ అవకాశం ఉందని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. ఓటమి భయంతోనే గుర్తుల అయోమయం అంటూ బీఆర్ఎస్ అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదని ఎద్దేవా చేస్తున్నాయి.  పోలింగ్ కు ముందే ఓటమికి సాకులు వెతుకుతున్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని అంటున్నాయి. 

జలవివాదాలతో ప్రభుత్వాల రాజకీయం.. ఏబీవీ

నీటి వివాదాలను ప్రభుత్వాలే రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు.   రాయలసీమ ప్రాంతంలోని నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26)    కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.   కడప ,చిత్తూరు జిల్లాల జీవనాడి అయిన గాలేరు నగరి సుజల స్రవంతి నిధుల కొరత,  అటవీ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల నాలుగు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తోందని విమర్శించారు.  హంద్రీనీవా రెండో దశ అనుసంధానం పేరుతో కండలేరు -కరకంపాడి ఎత్తిపోతల పథకం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 100శాతం  గ్రావిటీ కలిగిన ప్రాజెక్టన్నారు.  గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, రాజోలి ప్రాజెక్టుల పూర్తికి, పంట కాలువల నిర్మాణానికి నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న  ప్రభుత్వం పోలవరం బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో 85 వేల కోట్ల రూపాయలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ ప్రాజెక్టు  రాష్ట్ర ప్రజల పై అదనపు భారాన్ని మోపడానికి తప్ప మరెందుకూ పనికిరాదన్నారు.   గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాల వివాదాలకు ఆజ్యం పోయడమేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఈపీసీ విధానం అమలు చేసేవారని కానీ ప్రస్తుతం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు నిర్మాణం, అనుమతులు కూడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే ప్రాజెక్టు మొత్తం ప్రైవేటుపరం చేసి దోపిడీకి ద్వారాలు తరచడమేనని విమర్శించారు.  

అనుమతి లేకుండా చిరుఫొటోలు ఉపయోగిస్తే చర్యలు.. కోర్టు ఉత్తర్వులు

ఏఐ సాయంతో  సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలతో సెబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకోవడానికి తెగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సెలబ్రటీల ప్రతిష్ఠకు కూడా భంగం కలిగిస్తున్నారు.  ఏఐ పుణ్యమా అని ఏవి ఫేకో, ఏవి ఒరిజినలో  తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడటంతో సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఇదుర్కొంటున్నారు.  ఇప్పటికే ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు న్యాయ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవికోర్టును ఆశ్రయించారు.  తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వాయిస్ ఉపయోగించడాన్ని నిషేధించాలంటూ సిటీ సివల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో సిటీ సివిల్ కోర్టు చిరంజీవికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చిరు టీమ్ కీలక ప్రకటన విడుదల చేస్తూ.. చిరు అనుమతి లేకుండా ఆయన ఫొటోలు వాయిస్ ఉపయోగించడం, ఏఐ క్రియోషన్ వంటివి చేస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.   గతంలో ఓ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్  చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన విషయం తెలిసిందే... హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అందుకు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు కూడా.   సైబర్ నేరగాళ్లు  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు మరియు వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు... అంతటి తో ఆగకుండా వీటిని వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసి వైరల్ చేశారు. దీంతో చిరంజీవి  అట్టి వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మొంథా తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో బీచ్ లు మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది ఏపీవైపునకు దూసుకువస్తున్నది. దీని ప్రభావంతో  ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని పోర్టులలోనూ ఐదో నంబర్ ప్రమాద హచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై తీవ్రప్రభావం చూ   అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దాదాపు అన్ని బీచ్ లనూ మూసివేశారు. విశాఖ రుషికొండ, సాగర్ నగర్ బీచ్ లను మూసివేశారు. పర్యాటకులెవరూ తీరప్రాంతానికి రావద్దన్న స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.   ఈ తీవ్ర తుపాను మంగళవారం  సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  తీవ్ర తుపాను నేపథ్యంలో భారత సైన్యాన్ని తీర ప్రాంతాలలో సహాయక చర్యల కోసం సన్నద్ధం చేశారు.  ఇప్పటికే  తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలలో విప్త్తు సహాయక బృందాలను తరలించారు.  తుపాను కదలికలను, తీవ్రతను ఆర్టీ నిరంతరం పరిశీలిచి పరిస్థితిని సమీక్షిస్తున్నది.   తుఫాన్ గాలులు, అలల తీవ్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలకు తోడు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

శ్రీశైలంలో భక్తుల రద్దీ.. ముక్కంటి దర్శనానికి 3 గంటల సమయం

కార్తీక సోమవారం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది.  కార్తీక సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తారు.   శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి   దర్శనానికి  మూడు గంటలకు పైగా సమయం పడుతోంది.  సోమవారం (అక్టోబర్ 27) తెల్లవారు జామునుంరే భక్తులు  పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే శని, అది, సోమవారాలలో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయా అభిషేకాలు మాసంతం నిలుపుదల చేశారు. అలానే మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఒక సోమవారం (అక్టోబర్ 27) భక్తుల రద్దీ దృష్ట్యా  శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు   తెలిపారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అటువంటి తిరుమల దివ్వక్షేత్రంలో సోమవారం (అక్టోబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (అక్టోబర్ 26) శ్రీవారిని  మొత్తం 80 వేల 21 మంది దర్శించుకున్నారు. వారిలో  పాతికవేల 894 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 90 లక్షల రూపాయలు వచ్చింది. 

కోస్తా జిల్లాలపై మొంథా తుఫాను ప్రభావం : హోం మంత్రి

  ఏపీ వ్యాప్తంగా  మొంథా తుపాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లు ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హోం మంత్రి పేర్కొన్నారు. తుపాను పరిస్థితులపై విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన హోం మంత్రి, 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.  అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశిస్తూ, హోం మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తుపానుపై అప్రమత్తంగా ఉన్నారని. భారీ హోర్డింగ్‌లను ముందుగానే తొలగిస్తున్నామని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆస్తి నష్టం తగ్గించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాంకేతికతను వినియోగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో 6 ఎన్డీఆర్‌ఎఫ్‌, 13 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు హోం మంత్రి వెల్లడించారు.  కోస్తా జిల్లాలన్నింటిపైనా తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా కాకినాడ పరిధిలోని ఆరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.   మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుపాను అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

చత్తీస్‌గఢ్‌లో 21 మంది మవోల లోంగుబాటు

  చత్తీస్‌గఢ్ కేష్కల్ డివిజన్‌లోని కిస్కోడో ఏరియా కమిటీకి చెందిన సెక్రటరీ ముకేశ్ సహా 21 మంది మావోయిస్టులు లోంగి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో 13 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. లొంగుబాటు సమయంలో 18 ఆయుధాలను మావోలు పోలీసులకు అప్పగించారు. ఆపరేషన్ కగార్‌తో భారీగా ఎత్తున మావోలు లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలైట్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే.   లొంగిపోయిన వారిలో కేశ్‌కాల్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ముకేష్‌, నలుగురు డీవీసీఎంలు (డివిజన్‌ వైస్‌ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఏఎంసీ (ఏరియా కమిటీ సభ్యులు)లతో పాటు ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.  బస్తర్‌రేంజ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ సుందర్‌రాజ్‌ మాట్లాడుతూ.. మావోయిస్టులు తాము అనుసరిస్తున్న మార్గం వ్యర్థమని భావించి.. వారి జీవితాలను పునర్నిర్మించుకునేందుకు జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని ఎంచుకున్నారన్నారు. ఆయుధాలను విడిచిపెట్టిన 21 మందిలో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారన్నారు. వారంతా సాయుధ పోరాటాన్ని వీడి శాంతి, పురోగతి మార్గంలో వెళ్లాలనుకుంటున్నారని పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.