దిశ మార్చుకున్న మొంథా తుపాన్.. తీరం దాటేదెక్కడంటే?
posted on Oct 27, 2025 @ 2:41PM
ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న మొంథా తుపాన్ దిశ మార్చుకుంది. ఇప్పుడు తూపాను కాకినాడ సమీపంలో కాకుండా కోనసీమ జిల్లా శంకరగుప్తం పడమటి లంక వద్ద తీరం దేటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఉపగ్రహం నుంచి సమాచారం వచ్చిందని పేర్కొంది.
తుపాను తీరం దాటే సమయంలో దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తాయనీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తుపానుపై ఆంధ్రప్రదేశ్ ప్రభఉత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం అధికంగా ఉండే మూడు జిల్లాలలో పాఠశాలలకుసెలవు ప్రకటించింది.