60 రోజుల్లో 6 సార్లు బెంగళూరుకు జగన్!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన 60 రోజుల వ్యవధిలో కనీసం అరడజను సార్లు ఆయన బెంగళూరు వెళ్లారు. ఆయన తరచుగా బెంగళూరు వెళ్లడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో జగన్ ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా ఉండకపోవడం వైసీపీ శ్రేణుల స్థైర్యం, జగన్ పై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నది.  ఇప్పటికే పార్టీ ఓటమి తరువాత వైసీపీలో ఫైర్ బ్రాండ్ లుగా గుర్తింపు పొందిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వీలైనంతగా పార్టీకీ, పార్టీ అధినేతకూ దూరం జరిగారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో జగన్ కు కళ్లు, చెవులు, నోరుగా వ్యవహరించిన సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల మీడియా కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాగే పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన పుత్ర రత్నం పిల్ల సజ్జల పోలింగ్ అయిన మరునాటి నుంచే అయిపు లేకుండా పోయారు. ఇక విపక్షాలపై విమర్శలంటూ బూతులే అన్నట్లుగా వ్యవహరించి గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాలి ఇంచుమించు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయితే బయటకనిపిస్తే అరెస్టే అన్న భయంతో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. మరో ఫైర్ బ్రాండ్ రోజా రాష్ట్రం దాటేశారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు ఇక వైసీపీ తరఫున మాట్లాడేందుకు పేర్ని నాని, అంబటి వంటి వారు తప్ప మరెవరూ కనిపించడం లేదు. చాలా మంది సీనియర్లు ఇప్పటికే పార్టీ వీడి వెళ్లిపోయారు. మరి కొందరు రాజకీయాలకే స్వస్తి పలికారు. ఈ పరిస్థితుల్లో జగన్ రాజకీయంగా ఒంటరి అన్న భావనతో తాడేపల్లిలో స్థిమితంగా గడప లేకపోతున్నారనీ, అందుకే సందు దొరికినా, దొరకకపోయినా బెంగళూరు చెక్కేస్తున్నారని అంటున్నారు. దీనికి తోడు జగన్ హయాంలో అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై దర్యాప్తు సాగుతోంది. ప్రాథమికంగా కొందరు నేతలు, అధికారుల పేర్లే బయటకు వస్తున్నప్పటికీ ముందు ముందు జగన్ కూడా విచారణ ఎదుర్కొనవలసి వస్తుందనీ, ఆ భయంతోనే సాధ్యమైనంత వరకూ రాష్ట్రం బయటే గడిపేయాలని జగన్ భావిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు.  

ఐపీఎస్ లకు పనిష్మెంట్ ఓకే.. ఐఏఎస్ లను వదిలేశారా ఎంటి?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో  రాజారెడ్డి రాజ్యాంగం అమలయ్యిందే తప్ప భారత రాజ్యాంగం కాదు అనేలా పాలన సాగింది. జనం జగన్ పాలనకు తమ ఓటుతో చరమగీతం పాడడానికి అది ఒక ప్రధాన కారణం.  చరిత్రలో ఇంత వరకూ ఏ పార్టీకీ ఎదురు కానటువంటి ఘోర పరాజయాన్ని జగన్ కు అందించి ఇంటికి సాగనంపారు.  సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి జగన్ సాగించిన అరాచక పాలనకు కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వంత పాడారు. సరే జగన్ సర్కార్ పతనమై.. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ హయాంలో  నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్  దూరంగా పెట్టింది.  జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. సరే పని అప్పగించకుండా అప్పనంగా జీతం ఇచ్చేసి ఊరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో జగన్ తో  అంటకాగి పోస్టింగులు లభించక వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ లకు రోజూ ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టాలఆదేశాలు అందాయి. అంటే వారు ప్రతి రోజూ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలి. డ్యూటీ అవర్స్ ముగిసే వరకూ పని లేకుండా కార్యాలయంలో కూర్చుని సాయంత్రం వెళ్లే ముందు మరోసారి సంతకం చేయాలి.  ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు బెయిలు మంజూరు చేస్తూ పెట్టే కండీషన్లు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. సాక్షులను ప్రభావితం చేయరాదు. కేసుకు సంబంధించి బయట ఎక్కడా నోరు విప్పకూడదు. నిత్యం అందుబాటులో ఉండాలి. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు అన్నది సాధారణంగా కండీషన్డ్ బెయిలు నిబంధనలుగా ఉంటాయి. ఇప్పుడు పోస్టింగ్ లు లేని ఐపీఎస్ లకు కూడా పోలీస్ బాస్ జారీ చేసిన ఆదేశాలు ఆ కండీషన్డ్ బెయిలులాగే ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ చెప్పారు. వారిని చూసి జాలి పడ్డారు.  ఇప్పుడు జగన్ తో అంటకాగి నిబంధనలకు తిలోదకాలిచ్చేసిన 16 మంది ఐపీఎస్ లకు  ఈ శిక్ష సమంజసమేనంటున్నారు ప్రజలు.  ఇక శాఖాపరమైన విచారణకు కూడా ఉపక్రమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎస్ ల విషయంలో తీసుకున్న చర్యను అభినందిస్తునే .. ఐఏఎస్ ల విషయం ఏమిటంటూ సర్కార్ ను జనం నిలదీస్తున్నారు.  నిబంధనలకు పాతరేసిన ఐఏఎస్ లపై చర్యలెప్పుడని ప్రశ్నిస్తున్నారు.  ఎందుకంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా సర్వీసు నిబంధనలలో  తేడాలు ఉండవు. వెయిటింగ్‌లో ఉన్న అంటే పోస్టింగులు ఇవ్వని ఐపిఎస్‌లను రోజూ ఆఫీసుకు రావాలని పోలీసు బాసు ఆదే శించారు. మరి పోస్టింగులు ఇవ్వని, వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ల విషయంలో సీఎస్ ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.   జగన్ సర్కారుతో అంటకాగిన 16 మంది ఐపిఎస్ అధికారులను ప్రతిరోజూ హెడ్‌క్వార్స్‌కు హాజర వాలన్న డీజీపీ నిర్ణయాన్ని.. ఐఏఎస్‌ల విషయంలో సీఎస్ ఎందుకు పాటించడం లేదంటూ తెలుగుదేశం శ్రేణులు కూడా నిలదీస్తున్నాయి.  జగన్ జమానాలో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌ల పట్ల ప్రత్యేక అభిమానం ఏమిటన్న సందేహాలు అధికార వర్గాలలో కూడా వ్యక్తం అవుతున్నాయి.   నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ కు వంత పాడిన  ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరితకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. వీరిలో ప్రవీణ్ ప్రకాష్ కు మాత్రం వీఆర్‌ఎస్ ఇచ్చారు. మిగిలిన వారంతా జీఏడీకి రిపోర్టు చేసి, దర్జాగా వేతనంతో కూడిన సెలవలను ఎంజాయ్ చేస్తుంటే సీఎస్ ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ ఐఏఎస్ లలో కొందరు ఇప్పటికీ వైసీపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారన్న ఆరోపణలు తెలుగుదేశం నుంచే వస్తున్నాయి.   ఈవెయిటింగ్ ఐఏఎస్ లను కూడా ప్రతి రోజూ సెక్రటేరియెట్ కు వచ్చి సంతకాలు పెట్టాలన్న ఆదేశాలు వెంటనే జారీ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   

జగన్ వ్యూహం ఇదేనా? కాంగ్రెస్ తో దోస్తీ కవచం అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉండగా ప్రజాపీడన పాలన సాగించారు. అందుకు ఫలితంగా అధికారం కోల్పోయారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా వైసీపీ విధానాలు మాత్రం మారలేదు. జగన్ అదే ప్రజా పీడన పంధాతో అధికారం లేకపోయినా రాష్ట్రా అభివృద్ధిని అడ్డుకోవడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలను ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా నెగటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.  ఇక మరో వైపు తన మెడపై వేళాడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. ముందు చూపుతో జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఆయన ఇండియా కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లడం వెనుక ఉన్నది ఇదే వ్యూహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఆయన ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్ వాదీ, తృణమూల్, శివసేనలకు చెందిన నాయకులు హాజరై జగన్ కు మద్దతు పలికారు. ఒక వైపు బీజేపీతో తన రహస్య మైత్రిని కొనసాగిస్తూనే.. మరో వైపు విపక్ష కూటమితో కూడా చేతులు కలిపేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న వ్యూహం ఒక్కటే. రాజకీయంగా అధికారం అన్నది ఇప్పట్లో కనీసం ఆలోచించడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండటంతో కనీసం కేసుల నుంచైనా రక్షణ ఉంటే చాలన్న భావనతో జగన్ జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు.  దీనికి తోడు బీజేపీకి రాజ్యసభలో  బలం లేదు కనుక తన పార్టీ సభ్యుల మద్దతు కోసం ఆ పార్టీ తన విషయంలో అంటే తన కేసుల విషయంలో దూకుడుగా వెళ్లదన్న ధీమా జగన్ లో కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీకి వైసీపీ అవసరం ఉంది అనడం ఇందులో భాగమే. రాజ్యసభలో అవసరమైన ప్రతి సందర్బంలోనూ మద్దతు ఇస్తాం.. అందుకు ప్రతిగా మా అధినాయకుడి కేసుల విషయంలో మీ సహకారం కావాలన్న ప్రతిపాదనే ఉందని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం పార్టీకి  పార్లమెంటులో 16 మంది ఎంపీలుంటే..  వైసీపీకి15 మంది ఎంపీలు ఉన్నారు. (రాజ్యసభలో 11, లోక్ సభలో 4) మేం ఎక్కడా తక్కువ కాదు అన్న సాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహమే ఉందని చెబుతున్నారు.  రాజ్యసభలో ఎన్డీయేకు అవసరమైన బలం లేనందున సహజంగానే వైసీపీకి కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ  ప్రయత్నిస్తుంది. స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావడానికి కారణం కూడా  ఇదే. అయితే ఈ పరిస్థితి ముందు ముందు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే నెలలో 12రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో బీజేపీ సునాయాసంగా 11 స్థానాలను గెలుచుకుంటుంది. అప్పుడు ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ పార్టీ ఎంపీల అవసరం ఉండదు.  ఇక జగన్ క్విడ్ ప్రోకో ప్రతిపాదనలను లెక్క చేయాల్సిన అవసరం ఉండదు.   దీంతో జగన్ ఇక పూర్తిగా కాంగ్రెస్ కూటమితో చెట్టాపట్టాలేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం ఒక్కటే మార్గం. తన కేసుల విషయంలో సత్వర విచారణ ఆరంభమైతే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిని కావడం వల్లనే రాజకీయ వేధింపులు అంటూ ఎదురు దాడికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ లో కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులకు మార్గం సుగమం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే జగన్ వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా? అన్న సంగతి ముందు ముందు తేలుతుంది. మొత్తం మీద ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత తన కేసుల విషయంలో రాజకీయ కవచం లేకపోవడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనీ, బయటపడే మార్గం కోసం డిస్పరేట్ గా వెతుకుతున్నారని పరిశీలకులు అంటున్నారు. 

దూకుడు పెంచిన రేవంత్ సర్కార్.. మ‌రో కీల‌క నిర్ణ‌యం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌లు అందిస్తోంది. రేవంత్ రెడ్డి, ప‌లువురు మంత్రులు ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్ర‌ముఖ‌ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో వారు భేటీ అవుతున్నారు. త‌ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. మ‌రోవైపు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పైనా ప్ర‌భుత్వం వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, గృహ‌జ్యోతి కింద ప్ర‌తీ కుటుంబానికి రెండు వంద‌ల యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అమ‌లు, రూ. 500కే గ్యాస్ సిలీండ‌ర్  ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ల‌బ్ధిదారులు ప‌థ‌కాల ఫ‌లాల‌ను అందుకుంటున్నారు. దీనికితోడు రూ.ల‌క్ష‌న్న‌ర లోపు రుణాలు క‌లిగిన రైతుల‌కు ఇటీవ‌ల ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చేసింది. ఆగ‌స్టు 15వ తేదీ నాటికి రూ.ల‌క్ష‌న్న‌ర నుంచి రూ. 2ల‌క్ష‌ల రుణాలు క‌లిగిన రైతుల‌కు రుణ‌మాఫీని చేసేందుకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించి నిధుల సమీకరణా పూర్తయ్యింది. ఇప్పుడు తాజాగా మ‌రో కీల‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టేందుకు రేవంత్ స‌ర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.  రాష్ట్రంలో ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్ర‌క‌టించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఇతర మంత్రులు, సంబంధిత శాఖా అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. తెల్ల‌రేష‌న్ కార్డు పొందేందుకు విధివిధానాల‌ను ప్ర‌తిపాదించారు. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుగా నిర్ణయించారు. కాగా, రేషన్ కార్డుల పంపిణీలో లబ్దిదారుల ఎంపికకు విధివిధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తాజాగా ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో తెల్ల రేష‌న్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని ఏళ్లుగా ఎదురు చూస్తున్న అర్హుల‌కు త్వ‌ర‌లో కార్డుల‌ను అంద‌నున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ఆరు గ్యారెంటీల‌ను అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అందించేలా రేవంత్ స‌ర్కార్ ఒక్కో అడుగు వేస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో హామీకి ప్ర‌భుత్వం త్వ‌ర‌లో శ్రీ‌కారం చుట్ట‌నుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివ‌స్తే మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం కింద  ప్ర‌తీ మ‌హిళ‌ల‌కు రూ. 2,500 చొప్పున ప్ర‌తీనెలా ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ హామీని అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణను ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. తెల్ల రేష‌న్ కార్డు ఉన్న మ‌హిళ‌ల‌ను మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కానికి అర్హులుగా ఎంపిక చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. వ‌చ్చే రెండు నెల‌ల్లో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి ల‌బ్ధిదారుల‌కు ప్ర‌తీనెలా రూ. 2500 ప్ర‌భుత్వం అందించ‌నుంది. అయితే, ఈ ప‌థ‌కంపై పూర్తిస్థాయిలో చ‌ర్చించిన తరువాత అమలు దిశగా విధివిధానాలు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌నుంది. మొత్తానికి ఒకవైపు రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ తెలుగుదేశం సారథి ఎవరు?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న ఇప్పటి నుంచి కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరి మనసులను తొలిచేస్తోంది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని చాలా లైట్‌గా తీసుకున్నవారి లైమ్‌లైట్ ఈ పదవి మీద పడింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిపిస్తూ వుండటంతో ఇలాంటి సమయంలో పార్టీ బాధ్యతలు అందుకునే అదృష్టవంతుడు / అదృష్టవంతురాలు ఎవరు అనే క్వశ్చన్ మార్కు అందరిలోనూ వుంది. ఎవరికికి తోచినట్టుగా వాళ్ళు తమ ఊహల్లో వున్న వ్యక్తి అధ్యక్ష పదవిని చేపడతారని అనుకుంటున్నారు. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది అనేది ఇంతవరకు బయటకు రాలేదు. తాజాగా శనివారం (10-08-2024) నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రావడంతో మరొక్కసారి పార్టీ అధ్యక్ష పదవి అంశం చర్చనీయాంశంగా మారింది. మరి, ఊహాగానాల్లో ఎవరున్నారు? ఆశావహుల్లో ఎవరున్నారనే అంశంలోకి వెళ్ళేముందు, గతంలోకి కొంత వెళ్ళి రావడం సమంజసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అండ్ గ్యాంగ్ తెలుగుదేశం పార్టీ మీద తమకు సాధ్యమైనంత విషప్రచారం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ... తెలంగాణలో బాంచెన్ దొరా సంస్కృతికి చరమగీతం పాడింది తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో బలహీన వర్గాలు రాజకీయాల్లో ముందడుగు వేయడానికి తోడ్పాటు అందించింది తెలుగుదేశం పార్టీ.  అలాంటి తెలుగుదేశం పార్టీ మీద ‘ఆంధ్ర’ ముద్ర వేసింది కేసీఆర్ గ్యాంగ్. ఆ తర్వాత ఎన్నికలలో గెలిచిన కొద్దిమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశామని సంబరపడింది. తెలంగాణలో తెలుగుదేశం నాయకులు పార్టీ మారిపోయారుగానీ, కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని పూజిస్తూనే వున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానం వుంది. అయితే పరిస్థితుల కారణంగా వారి అభిమానాన్ని బయటకి వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఊహించని ద్రోహం జరిగింది. ఎల్.రమణ అనే ఒక సాధారణ కార్యకర్తని నాయకుడిని చేసి, పార్టీ అధ్యక్షుడిని చేసి గౌరవిస్తే, ఆయన పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు ద్రోహం చేసి కేసీఆర్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్‌ని పార్టీ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయనకు పార్టీని బలోపేతం చేయడం కంటే, ఎప్పడు ఎన్నికలలో పోటీచేద్దామా.. ఎమ్మెల్యే అయిపోదామా.. ఇదే ధ్యాస. తెలుగుదేశం పార్టీని వాడుకుని పదవులు సంపాదించుకుందామనే ధ్యాసే తప్ప, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్న ఆలోచన ఆయనకు లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయకూడదని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ప్రకటిస్తే, కాసాని జ్ఞానేశ్వర్‌కి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. ఎన్నికలలో పోటీ చేయకపోతే పార్టీలోనే వుండనని చెప్పి ఆయన బంగారం లాంటి, బాధ్యతాయుతమైన అధ్యక్ష పదవిని వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన వేరే పార్టీలో చేరడం, ఎన్నికలలో పోటీ చేయడం, దారుణంగా ఓడిపోవడం.. అవన్నీ మనకి అనవసరం.. ఇలాంటి నేపథ్యంలో ఈసారి పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చునే వ్యక్తి పార్టీని మరింత బలోపేతం చేసే వ్యక్తి అవ్వాలే తప్ప, పార్టీ నెత్తిన ఎక్కి కూర్చునే వ్యక్తం కాకూడదు. పార్టీకి నేనేమి ఇవ్వాలి అని ఆలోచించే వ్యక్తి అవ్వాలే తప్ప.. పార్టీ నాకు ఏమిస్తుంది అని ఎదురుచూసే వ్యక్తి కాకూడదు. అందుకే, ఈసారి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే వ్యక్తి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  మరి చంద్రబాబు మనసులో ఏముందోగానీ, ఎవరి ఊహాగానాల్లో వారున్నారు. తెలుగుదేశానికి ద్రోహం చేసి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో బొక్కబోర్లా పడివున్న మల్లారెడ్డి పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారని కొంతకాలం పుకార్లు షికార్లు చేశాయి. అయితే మల్లారెడ్డి లాంటి ముళ్లకంపని తెచ్చి నెత్తిన పెట్టుకోవడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీలో ఏకగ్రీవంగా వినిపిస్తోంది.  ఇక అధ్యక్ష పదవికి వినిపిస్తున్న పేర్లను పరిశీలిస్తే, కొంతమంది నారా బ్రహ్మణి పార్టీ అధ్యక్షురాలు కావాలని ముచ్చటపడుతున్నారు. మరికొందరు హరికృష్ణ కుమార్తె సుహాసిని కన్ఫమ్ అని తమకు తెలిసినట్టే చెబుతున్నారు. అలాగే, తెలంగాణలో రాజకీయ ఉద్ధండుడు, ఎలాంటివారినైనా నోరు మూయించగల శక్తి వున్న గోనె ప్రకాశరావు అధ్యక్షుడు కాబోతున్నారన్న ఊహాగానాలు ఈమధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇంకా పొగాకు జయరాం చందర్, అరవింద్ కుమార్ గౌడ్, మాటల తూటాలు పేల్చే నన్నూరి నర్సిరెడ్డి, బక్కని నర్సింహులు, సామ భూపాల్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, భవనం షకీలా రెడ్డి, పద్మావతి, ఆనంద్, తెలుగుదేశం పార్టీ వాయిస్‌ని ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో బలంగా వినిపించిన జ్యోత్స, ఏఎస్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  ఉన్నది ఒక్క అధ్యక్ష పదవి.. ఇంతమంది ఊహావహులు, ఆశావహులు ఏంటబ్బా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే పార్టీ.. తెలంగాణ తెలుగుదేశంలో పార్టీ అధ్యక్ష పదవికి అర్హులైన వాళ్ళు ఇంతమంది వున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఇంతమంది అర్హులున్నారు.. పార్టీ అధ్యక్షుడయ్యే అదృష్టం ఎవరికి వుందో, అవకాశం ఎవరికి దక్కుతుందో, బాధ్యతలు ఎవరు మోయాల్సి వస్తుందో... మొత్తమ్మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మదిలో ఏముందో.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఒక్కటే... అదేమిటో మీకు కూడా తెలుసు.... కాలం!

దువ్వాడ శ్రీనివాస్‌ని జగన్ ఓదార్చాలి!

శవం దొరికితే చాలు.. ఓదార్పు పేరుతో పీక్కుతినడానికి రెడీ అయిపోతున్న వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు జస్ట్ ఫర్ ఛేంజ్ మరో ఓదార్పు యాత్ర చేపట్టాలి. అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. ఆయన ప్రస్తుతం ఓదార్చాల్సింది ఎవర్నో కాదు.. తన పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని. ‌ భర్త, ముగ్గురు ఆడపిల్లలు వున్న దివ్వెల మాధురి అనే వైసీపీ నాయకురాలిని పాపం దువ్వాడ శ్రీనివాస్ ఎంతో పెద్దమనసుతో, చక్కగా తన ఇంట్లోనే పెట్టుకుని ఆదుకుంటుంటే, ఓర్వలేని అతని భార్య, కూతుళ్ళు గొడవ పడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ని రోడ్డు మీదకి లాగుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇద్దరూ రాసుకుని పూసుకుని తిరుగుతూ వుంటే, గుళ్ళో గోపురాలకు వెళ్తుంటే, విహారయాత్రలకు చెక్కేస్తుంటే చూసి ఓర్చుకోలేని దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతుళ్ళు వాళ్ళిద్దరికీ సంబంధం వుందని అన్యాయంగా ఆరోపించారు. దివ్వెల మాధురి కుటుంబం మొత్తం మాధురిని తిట్టారు. దాంతో దివ్వెల మాధురి బాగా హర్టయింది. ఆ తర్వాత దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఒక హోటల్ గదిలో కలిశారు. ‘‘ఏంటి సార్ ఈ అన్యాయం.. అన్నెం పున్నెం ఎరుగని నా మీద మీ భార్య లేనిపోని ఆరోపణలు చేస్తోంది. మనిద్దరం కలసి గుళ్ళూగోపురాలకి, విహారయాత్రలకి తిరిగామే తప్ప అంతకన్నా ఏమైనా చేశామా? నేనేమో సంప్రదాయిని.. మీరేమో సుద్దపూస. అలాంటి మనిద్దరికీ సంబంధం వుందని మీ భార్య వాణి ఆరోపిస్తోంది. నా కుటుంబంలో నేను బద్నామ్ అయిపోయాను. ఇక నాకు చావే శరణ్యం’’ అని వెంటనే తాడుతో ఉరేసుకోబోయింది. ఉరితాడులో తల పెట్టేసి కిందకి దూకేసింది. అది చూసి బిత్తరపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఉరితాడుకి, దివ్వెల మాధురి గొంతుకి మధ్య తన చేతిని అడ్డుగా పెట్టాడు. ఆ తర్వాత చాలా తంటాలు పడి ఆమెని ఉరితాడు నుంచి తప్పించి కిందకి దించాడు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని ఆమెని వారించాడు. నీకు ఎవరూ లేకుండా పోయారు కాబట్టి నీకు అండగా నేనుంటాను అని మాటిచ్చాడు. అప్పటి నుంచి ఆమెను తన ఇంట్లోనే వుంచుకుంటూ ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇద్దరు వివాహితులు వేరేవాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా తప్పుకాదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందంట. ఆ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, ఇద్దరూ  ‘అడల్ట్రీ’ అనే సంబంధం పెట్టుకుని సంతోషంగా జీవిస్తుంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు నానా రచ్చ చేస్తున్నారు. ఒక మంచి పని చేస్తుంటే ఇలా రచ్చ రంబోలా అవుతున్నందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంత హర్టయ్యాడో ఏం పాడో.. మరోవైపు ఆ నిప్పులాంటి మహాతల్లి దివ్వెల మాధురి కూడా ఎంత బాధపడుతోందో ఏంటో! దివ్వెల మాధురి జగన్‌కి ఆల్రెడీ తెలుసు. 2022 అక్టోబర్‌లో ఆమెని జగన్‌కి దువ్వాడ శ్రీనివాస్ పరిచయం చేసి, పార్టీలో చేరిస్తే, జగన్ వెంటనే ఆమెకి శ్రీకాకుళం జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇచ్చేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు అమె కూడా హర్టయి వుంటుంది కదా.. అందుకే ఆ ఇద్దరు పవిత్ర ప్రేమ పక్షులను ఓదార్చడానికి జగన్ అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. బెంగళూరు నుంచి టెక్కలికి ట్రావెల్ చేసే సమయంలోనే, ఈ ‘కేసు’లో టీడీపీని ఎలా ఇరికించవచ్చో కూడా ఆలోచించాలి. 

విడదల రజిని కొత్త పంచాయితీ!

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన సైబరాబాద్ మొక్క విడదల రజిని అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు విడుదల రజని అవినీతి లీలలు చాలా బయటపడ్డాయిగానీ, ఇప్పుడు ‘అవినీతి’ అని అనలేముగానీ, ‘అన్యాయం, అక్రమం’ అనడానికి అర్హత వున్న ఒక కొత్త పంచాయితీ బయటపడింది. పల్నాడు జిల్లా యడ్లపాడులో కోటయ్య అనే రైతుకి చెందిన మూడెకరాల భూమిని విడదల రజిని తన మరిది గోపీనాథ్ పేరు మీద కొనుగోలు చేశారు. ఎంచక్కా రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. ఇంకా పాతిక లక్షల రూపాయలు తర్వాత ఇస్తాం అన్నారు. విడదల రజిని గారి తాలూకు కదా అని సదరు రైతు అప్పట్లో ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు రైతు కోటయ్య తన డబ్బు పాతిక లక్షలు ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకుండా విడదల రజిని అండ్ కో రేపు మాపు అని తిప్పుతున్నారు. దాంతో కోటయ్య డైరెక్ట్.గా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వచ్చేశాడు. ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నాడు. మరి ఈ ఫిర్యాదు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒక్క విడదల రజిని విషయం మాత్రమే కాదు..  వైసీపీ ఐదేళ్ళ రాక్షస పాలనలో నష్టపోయినవారు. వైసీపీ నాయకుల చేతిలో మోసపోయిన వారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు చేరుకుని ఫిర్యాదులు చేస్తున్నారు. అక్రమ కేసులు తొలగించాలని కొందరు, గత ప్రభుత్వం వల్ల నష్టపోయామని మరికొందరు.. ఇలా వైసీపీ ప్రభుత్వ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు.

ఇరాక్‌లో ఇక చిన్నారి పెళ్ళికూతుళ్ళు!

ఇరాక్‌లో అమ్మాయిలకు పెళ్ళి చేయడానికి కనీస వయసును 9 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ బిల్లు ఆమోదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ ‘లా’ను సవరించే ఉద్దేశంతో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మీద ఇరాక్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి బిల్లునే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఈసారి మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశంలో వున్నట్టు లేదు. ప్రస్తుతం ఇరాక్‌లో అమ్మాయిల వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలుగా వుంది. ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టయితే, అమ్మాయిల పెళ్లి వయసు 9 ఏళ్ళకు, అబ్బాయిల పెళ్ళి వయసు 15 ఏళ్ళకు తగ్గుతుంది. అప్పుడు ఇరాక్‌లో బాల్య వివాహాలు చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అభ్యంతరం వుండదు. ఇది బాల్య వివాహాలు పెరగడానికి కారణం కావడంతోపాటు, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన అభివృద్ధి కుంటుపడుతుందని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు అంటున్నాయి. అంతే కాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే బాలికల విద్య, ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని, చదువు మధ్యలో ఆపే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని అంటున్నాయి. చిన్న వయసులోనే గర్భందాల్చడం, గృహహింస వంటివి పెరుగుతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లిటిగేషన్ క్వీన్ పూజా ఖేడ్కర్!

తప్పుడు సర్టిఫికెట్లతో ఐఏఎస్ అయి, ఆ తర్వాత సర్వీసులో వుండగా ఓవర్ యాక్షన్ చేసి, ప్రస్తుతం పరారీలో వున్న పూజా ఖేడ్కర్ పెద్ద లిలిగేషన్ క్వీన్ మాదిరిగా వుంది. చట్టంలో వున్న లొసుగులను ఎలా ఉపయోగించుకోవాలి, పై పదవులలో వున్నవారిని ఎలా ప్రభావితం చేయాలనే పాయింట్లలో పూజా ఖేడ్కర్ పీహెచ్‌డీ చేసినట్టుంది. అందుకే వేలికి వేస్తే కాలికి వేసి, కాలికి వేస్తే వేలికి వేసి ఐఏఎస్ అయింది. అనుకున్నది సాధించినప్పటికీ, పద్దతిగా వుండకపోవడంతో అమ్మగారి గుట్టు రట్టయిపోయింది. ఆమె ఐఏఎస్ హోదా రద్దు కావడంతోపాటు భవిష్యత్తులో కూడా ఆమె యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో హాజరు కావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక ఆమెని అరెస్టు చేయడం ఒక్కటే మిగిలి వుంది. అయితే పరారీలో వున్న పూజా ఖేడ్కర్‌ తన లాయర్ల ద్వారా గేమ్ నడిపిస్తోంది.  తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం మీద పూజా ఖేడ్కర్ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె లాయర్ కోర్టులో వాదన వినిపిస్తూ, ‘‘పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన విషయం ఇంతవరకు నా క్లయింట్‌కి తెలవదు. దానికి సంబంధించిన ఉత్తర్వులు నా క్లయింట్‌కి అందలేదు. మీడియా ద్వారా మాత్రమే ఈ విషయం తెలిసింది. తనకు ఉత్తర్వులు అందిన తర్వాత నా క్లయింట్ ట్రైబ్యునల్‌ని ఆశ్రయిస్తుంది’’ అని అన్నాడు. ఇక్కడే పూజా ఖేడ్కర్ అతి తెలివితేటలు బయటపడుతున్నాయి. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వుంది. ఆమె ఎక్కడ వుందో తెలియదు. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్టు నోటీసులు ఇద్దామంటే ఆమె పత్తాయే లేదు. ఈ లిటిగేషన్ క్వీన్ ఒకపక్క తప్పించుకుని తిరుగుతుంది.. మరో పక్క తనకు నోటీసులు అందలేదని కోర్టుకు చెబుతుంది. పాప తెలివితేటలు మామూలుగా లేవు!

నాగార్జుసాగర్ నిర్మాణానికి నారు, నీరు పోసిందెవరు?

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త  వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గురించి తెలుసుకోవాలంటే  ఆయన కంటే  ముందు తరాలకు  చెందిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  గురించి తెలుసుకోవాలి!  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761, ఏప్రిల్ 27న జగ్గ భూపతి, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. క్రీస్తు శకం 1413 నుండి తీరాంధ్ర ప్రాంతంలో ఒక భాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశానికి చెందినవాడు వేంకటాద్రి నాయుడు. నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో  జగ్గయ్యపేట అనేది  తన తండ్రి పేరు   జగ్గ భూపతి పేరు మీద నిర్మించిన పట్టణం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నదికి కుడివైపున ఉన్న అచ్చంపేటను తన తల్లి అచ్చమాంబ పేరు మీద అచ్చంపేటగా నిర్మించాడు.  నాటి అమరావతి నగర  నిర్మాత కూడా వేంకటాద్రి నాయుడే! తన రాజధాని  చింతపల్లి నుండి  అమరావతికి మార్చి అమరావతి శివాలయంతో పాటు  మొత్తం 108 దేవాలయాలు  కట్టించాడు. మంగళగిరి నరసింహ స్వామి గుడి గోపురం  కట్టించింది కూడా  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడే!  ఆ గోపురం దేశంలోనే రెండో అతి పెద్ద గోపురంగా నిలిచింది అని చెబుతారు.  అమరావతి  అమరలింగేశ్వర స్వామి  సేవలో గడుపుతూ 1817, ఆగష్టు 17న శివైక్యం చెందారు.  ఆ రాజవంశానికి  చెందిన  వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆయనే ముక్త్యాల రాజాగా ప్రసిద్ధి. నాగార్జునసాగర్ కథలో ఆయనే హీరో..!  జగ్గయ్యపేట  అసెంబ్లీ నియోజకవర్గ నుంచి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ అలియాస్ ముక్త్యాల రాజా. ముక్త్యాల రాజాని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ప్రజలకు శాశ్వితంగా ఉపయోగేపడే పని చేయాలన్న తపనతో తలంపుతో  నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణం ఆలోచన వాసిరెడ్డి ప్రసాద్‌దే కావడం విశేషం.  మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులతో కలసి వుండగా  కృష్ణానది నీటిని తమిళ ప్రాంతానికి  తీసుకుపోవడానికి నాటి తమిళ కాంగ్రేస్ నాయకులు ప్రయత్నాలు  మొదలు పెట్టారు. అందులో భాగంగా  కృష్ణా,  పెన్నా నదులను అనుసంధానం  చేయడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు.  విషయం తెలుసుకున్న  వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ ఆంధ్రలో   తొమ్మిది జిల్లాలలో ప్రతి వూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి కేంద్ర  ప్రభుత్వానికి పంపారు.  మాచర్ల నుండి దట్టమయిన అడవుల గుండా నందికొండ వరకు వెళ్ళి!  డ్యాంకు అనువైన స్థలం చూశాడు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచేత ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించాడు. కానీ మద్రాసు ప్రభుత్వం ప్రసాద్ ప్రయత్నాలకు అన్నివిధాలుగా  అడ్డుపడింది. వాసిరెడ్డి  మాత్రం  పట్టువదలని  విక్రమార్కుడిలా  కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు  ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీ సభ్యులు అడవులల్లో పడి  మేం నందికొండకు చేరుకోలేం!  కార్లు కనీసం జీపులో వెళ్ళటానికి అనువైన దారి కూడా లేదు  అనే సాకుతో పక్కన పడేశారు. వాళ్ళు  అలా  చేయడానికి  వారిని  ఎవరు ప్రభావితం చేసి వుంటారు? తమిళ కాంగ్రెస్ నాయకులు.   మరి నాటి  మన సీమ సింహాలు  ఏం చేశాయి?  ప్రత్యేక  తెలుగు రాష్ట్రం కోసం  పొట్టి శ్రీరాములు అనే  మహానీయుడు  56 రోజులు  కూడు లేకుండా  అమరణ నిరాహార దీక్ష  చేసి  అమరజీవి  అయ్యే వరకు  సీమసింహాలు  ఏం చేసాయో  నాగార్జున  సాగర్  ప్రాజెక్టును  పక్కన పెట్టినప్పుడు కూడా అదే చేసాయి.  పౌరహక్కులు,  అందరికీ  చదువు, నీరు పారి  బీడు భూములు  పచ్చటి  పంట పొలాలుగా  మారిపోతే  ప్రజలు  బాగుపడిపోతారు.  పెత్తందార్ల  ఆటలు  సాగవు కదా!  పచ్చటి  పంట పొలంలో  పేదలకు  వ్యవసాయ కూలిపని  దొరికితే వారి పిల్లలు  బడికి పోతారు!  మరి పెత్తందార్లకు  పాలేర్లు  దొరకరు.  ఒక్కపూట  జొన్న  రాగి ముద్ద కోసం  పెత్తందార్ల వెంట కత్తులు పట్టుకుని  ఎవరు నిలబడతారు! అందుకోసం మనకు పోలవరం  వద్దు  పులిచింతల వద్దు  సాగర్  వద్దు  ఇదీ అనాటి  పెత్తందార్ల కాలకూట  వికృత  రాజకీయం.   రాజా వాసిరెడ్డి ప్రసాద్ పిచ్చోడు కదా! వేల రూపాయల తన సొంత డబ్బు ఖర్చు పెట్టి  ఇరవై ఐదు గ్రామాలనుండి ప్రజలను   స్వచ్చంద్ర సామాజిక   కార్యక్తర్తలను సమీకరించి వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి  కార్లు వెళ్ళటానికి  వీలుగా  దారి ఏర్పాటు చేయించాడు.  ఖోస్లా కమిటీ సభ్యులు నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టడానికి   ఇంతకన్నా మంచి చోటు వుండదని తేల్చారు .   ఢిల్లీ వెళ్లి ఆనాటి ప్రధాని నెహ్రు,  పటేల్ వంటి పెద్దలను కలిసి ప్రాజెక్ట్  గొప్పతనం వివరించి, నాగార్జున సాగర్ నిర్మాణంపై  ప్రభుత్వ పెద్దల దృష్టి పడేటట్లు చేశారు. ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టాడానికి   ఢిల్లీలో ప్రయత్నాలు మొదలైయ్యాయి. వాసిరెడ్డి  ప్రసాద్ పలుమార్లు  ఢిల్లీ వెళ్ళి ఆచార్య ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య లాంటి  వారిని ఇతర  పార్లమెంటు సభ్యులను కలిసి, ఖోస్లా కమిటీ రిపోర్టు  ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరినీ విసిగించే పనిలో పడ్డాడు.  అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశాడు. ఎట్టకేలకు 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్‌  శంకుస్థాపన జరిగింది.    ప్రాజెక్టుకు  నాగార్జున అని  ఎందుకు పెట్టారు.?  అక్కినేని  నాగేశ్వర్రావు  కొడుకు పేరు అని  కొందరు  అనుకునే  ప్రమాదం  వుంది. ఒకటి 2వ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజవంశం తూర్పు దక్కన్‌లోని శాతవాహనుల రాజధానిగా ఉన్న నాగార్జునకొండ పురాతన బౌద్ధ క్షేత్రం. త్రవ్వకాల్లో 30 బౌద్ధ విహారాలు, వేల సంవత్సరాల  చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు శాసనాలు లభించాయి. కొన్నింటిని ఇప్పుడు సాగర్ జలాశయం మధ్యలో ఉన్న దీవిగా ఉన్న నాగార్జునకొండకు తరలించారు. మరి కొన్నింటిని సమీపంలోని ప్రధాన భూభాగమైన అనుపు గ్రామానికి తరలించారు.   ఇది బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు  నడయాడిన  ప్రాంతం.   గౌతమి  పుత్ర  శాతకర్ణికి  రాజగురువు  ఆచార్య  నాగార్జునుడు.   ఆయన  పేరు మీద  నాటి  నెహ్రు ప్రభుత్వం   నాగార్జున  సాగర్  అని  పేరు పెట్టింది.   శంకుస్థాపన  సమయంలో నెహ్రూ  మాట్లాడుతూ ఇటువంటి  సాగునీటి  ప్రాజెక్టులు  భారతదేశానికి  ఆధునిక  దేవాలయాలు  అని  వ్యాఖ్యనించారు.   పాపం  పిచ్చోడు  నెహ్రు   ఒక  భారీ గుడి కట్టి   ఈ దేశానికి ఇది  చాలు  ఇంకేం  అవసరం లేదు అని చెప్పకపోవడం  అమాయకత్వం  కాక  మరేమిటి?   ఎవరి కావాలండీ   ప్రాజెక్టులు,  అభివృద్ది !   మనకు  మన  కులపోడు  ముఖ్యం   మన  మత పోడు  ముఖ్యం  అదే కదా  నడుస్తున్న  భారత  దేశ చరిత్ర! సరే  అసలు  విషయానికి  వద్దాం. వాసిరెడ్డి  ప్రసాద్ యాభై రెండు లక్షల రూపాయలు మాచింగ్ గ్రాంటుగా ప్రాజెక్టు నిర్మాణానికి  విరాళం ఇచ్చాడు. 55 వేల  ఎకరాలు  పాజెక్టు కోసం  దానం ఇచ్చాడు . నాటికి  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి ఆనకట్ట... నాగార్జున సాగర్ డ్యామ్. ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు. కేఎల్ రావ్‌గా  ప్రసిద్ది. ఆయన పర్యవేక్షణలో  పూర్తిగా స్థానిక పరిజ్ఞానంతో నిర్మించబడిన  సాగర్  1967న 4 ఆగస్టు నాటి  ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కుడి ఎడమ కాలువలకు రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు. రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్  కల సాకారం  అయి 57 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్క్రిప్ట్ రాసే సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేశారు . ఏం చేస్తున్నారు మిత్రమా అని అడిగితే నాగార్జునసాగర్ నిర్మాణం జరిగి నేటికి  57 సంవత్సరాలు రాజు గారు   వార్త ప్రిపేర్ చేస్తున్నాను అని చెబితే !  సాగర్  నిర్మాణంలో  కమ్మవారి  పాత్ర  చెప్పొద్దు! నా ఫ్రెండ్  జగన్ రెడ్డికి తెలిస్తే  తెలిస్తే సాగర్ కూల్చే  ఏర్పాటు చేస్తాడు అని కామెంట్ చేశారు.

బందరు పిచ్చోడికి అలా అర్ధమైందట!

ఓటమి తరువాత వైసీపీ నేతలకు మైండ్ పోయినట్లుంది.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా వేగంగా వెస్తున్న అడుగులతో వాళ్లకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. దీంతో  వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రామా అన్నా వారికి బూతుగానే వినిపిస్తోంది. ఆ కోవలో వైసీపీ అధినేత జగన్ తరువాత ముందుగా చెప్పుకోవలసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గురించి.  పార్టీ ఓటమి తరువాత వైసీపీ తరఫున మాట్లాడేవాళ్లే కరవయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం, బూతులతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే  రోజా, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వంటి వారంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇక జగన్ తరఫున మాట్లాడడానికి, మీడియా ముందుకు రావడానికి వైసీపీకి పేర్ని నాని ఒక్కరే మిగిలినట్లు కనిపిస్తున్నది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు, జనసేన అధినేతపై నోటికొచ్చిందల్లా మాట్లాడేవారు.  ఇంత మాట్లాడిన ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే ధైర్యం మాత్రం లేకపోయింది. అందుకే మచిలీపట్నం నుంచి తాను తప్పుకుని తన వారసుడిని నిలబెట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పేర్ని నాని కుమారుడు కిష్టు కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో, అహంకారపూరిత వైఖరితో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలయ్యారు. అది వేరే  సంగతి. ఇప్పుడు పేర్ని నాని అవసరం ఉన్నా లేకపోయినా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు.   తాజాగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం (ఆగస్టు5) కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన తొలి కలెక్టర్ల సమావేశం ఇది. ఆ సమావేశంలో చంద్రబాబునాయుడు పాలనా పరమైన అంశాలలో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో వేగంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధామ్యాలును వివరించారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. అందులో తప్పేమీ లేదు. కలెక్టర్లు ఉన్నది కూడా ప్రజలకు సేవ చేయడానికే కదా? అలాగే స్థానిక సమస్యల సత్వర పరిష్కారం విషయంలో ప్రజా ప్రతినిథులతో సమన్వయం చేసుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిథులతో  ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారం విషయంలో వేగంగా పని చేయాలని సూచించారు. అందులోనూ తప్పేమీ లేదు. కానీ పేర్ని నానికి మాత్రం ప్రజా పాలన సజావుగా సాగడమే తప్పుగా కనిపించింది. చంద్రబాబు తమ పార్టీ నేతలు ఏం చెబితే అది చేయాలని కలెక్టర్లను ఆదేశించారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలా కలెక్టర్ల సమావేశం పూర్తయ్యిందో లేదో ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పేర్ని నాని.. తన ఫేక్ ప్రాపగాండాను ఆరంభించేశారు. చంద్రబాబు కలెక్టర్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారంటూ గుండెలు బాదేసుకున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అధికారులు, రాజకీయ నాయకులు ఆ ప్రజల సమస్యలపై సమన్వయంతో పని చేయాలనడం తప్పెలా అవుతుందో పేర్ని నానికే తెలియాలి. అయితే వైసీపీ స్టైలే ఇది.. ఫేక్ ప్రచారంతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. 2014 నుంచి 2019 వరకూ అదే చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మొదలెట్టేశారు. అయతే ఒక సారి నమ్మి మోసపోయిన జనం మరోసారి ఇటువంటి ప్రాపగాండాను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మరన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు.  

బంగ్లాదేశ్‌లో విధ్వంసం వెనుక పాక్.. భార‌త్‌కు ఎదురుదెబ్బే!

బంగ్లాదేశ్‌లో విధ్వంసం వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందా.. రిజర్వేషన్ల వివాదంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనల్లోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరిపోయారా.. రాడికల్స్, పాకిస్థాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్ విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్ చేసి వంద‌లాది మంది చావుకు కార‌ణ‌మ‌య్యారా.. అంటే అవున‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పాకిస్థాన్ అనుకూల ఉగ్ర‌వాద సంస్థ‌లు రిజ‌ర్వేష‌న్ నిర‌స‌న‌ల వెనుక దేశంలో విద్వంసం సృష్టించ‌డంతో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్పాయి. దీంతో బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా దేశం వ‌దిలి పారిపోవాల్సి వ‌చ్చింది. అయితే, బంగ్లాదేశ్‌లో తాజా ప‌రిణామాలు భార‌త్ కు ఎదురుదెబ్బేన‌ని అంటున్నారు. ఎందుకంటే.. అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ పార్టీ భారత్ దేశానికి అనుకూలంగా ఉంటూ వ‌స్తున్నది.  ఈ కార‌ణంగా పాక్ టెర్రరిస్ట్ సంస్థ ఐఏఎస్ రంగంలోకి దిగి పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్‌ ప్రభుత్వ ఏర్పాటు కావాలని కుట్ర‌ల‌ను అమ‌లు చేసింది. ఇదే స‌మ‌యంలో తెర‌పైకి వ‌చ్చిన రిజర్వేషన్ల అంశాన్ని అవకాశంగా మలుచుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో,   బీఎన్‌పీ, జమాత్‌ పార్టీ బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయ‌ని పరిశీలకులు అంటున్నారు‌. అదే జ‌రిగితే.. పాకిస్థాన్‌, చైనాతోపాటు బంగ్లాదేశ్ కూడా భార‌త్ దేశానికి శ‌త్రు దేశంగా, పక్కలో బల్లెంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి.  బంగ్లాదేశ్ లో ఈ ప‌రిస్థితి త‌లెత్తడానికి రిజ‌ర్వేష‌న్ల అంశం కార‌ణం. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంకోం పోరాడిన‌వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ హ‌సీనా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దం అయింది. స్వాతంత్ర్య పోరాటంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అవామీ లీగ్ పార్టీ (హ‌సీనా పార్టీ) మ‌ద్ద‌తుదారుల‌కే అది ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌నే వాద‌న మొద‌లైంది. దీంతో రిజ‌ర్వేషన్లు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ నెల‌రోజులుగా విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఈ నిర‌స‌న‌ల‌ను లైట్‌గా తీసుకోవ‌డంతో అవి  దేశం మొత్తం విస్త‌రించాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌ద్ద‌తుతో దేశ‌ వ్యాప్తంగా ప్ర‌జ‌లు రోడ్ల‌పైకివ‌చ్చి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు ఉధృతం చేశారు. ఈ క్ర‌మంలోనే పాకిస్థాన్ అనుకూల ఉగ్ర‌వాద సంస్థ‌లు రంగంలోకి దిగి నిర‌స‌న‌ల మాటున విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు, నిర‌స‌న‌కారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి. నెల రోజుల ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో దాదాపు 300 మందికి పైగా మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజ‌ర్వేష‌న్లు 30శాతం నుంచి 5శాతంకు త‌గ్గించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. హ‌సీనా ప్ర‌భుత్వంకూడా అందుకు అంగీక‌రించిన‌ప్ప‌టికీ.. నిర‌స‌నకారులు శాంతించ‌ లేదు. హ‌సీనా రాజీనామా చేయాల‌ని ప‌ట్టుబ‌డుతూ పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ్డారు. ఈ తతంగం మొత్తాన్ని వెన‌క‌నుండి న‌డిపించింది పాకిస్థాన్ అనుకూల ఉగ్ర‌వాద సంస్థ‌లేన‌ని అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.   ప్రధాని హ‌సీనా ఇటీవ‌ల మాట్లాడుతూ.. రిజ‌ర్వేష‌న్లకు నిర‌స‌న‌గా ఆందోళ‌నకారుల విధ్వంసం వెనుక ఉగ్ర‌వాదుల ప్ర‌మేయం ఉంద‌ని పేర్కొన్నారు కూడా.  ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి బంగ్లాదేశ్ ప్ర‌దాన ప్ర‌తిపక్ష నేష‌న‌లిస్ట్  పార్టీతో పాటు, ఇటీవ‌ల‌ నిషేధానికి గురైన జ‌మాతే ఇస్లామి పార్టీ దేశంలో విధ్వంసానికి కార‌ణ‌మ‌ని హ‌సీనాతోపాటు ఆమె పార్టీ ప్ర‌తినిధులు కూడా చెబుతూ వ‌చ్చారు. అయినా, దేశంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం కావ‌డంతో.. నిరసనకారుల హింసాకాండ మరింత పెచ్చరిల్లింది.    ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించేవరకూ వెళ్లింది. పరిస్థితి చేయి దాటి పోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మొద‌ట భార‌త్ వ‌చ్చిన ఆమె.. త‌రువాత లండ‌న్ వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ లో దేశంలో సైనిక పాల‌న న‌డుస్తున్నది. ఈ విష‌యాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ అధికారికంగా ప్రకటించారు. తమ దేశంలో సైనిక పాలన ఉంటుందని, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు  కృషి చేస్తామని తెలిపారు.  హ‌సీనా దేశం విడిచి వెళ్లిపోవ‌డంతో ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ స్పందించారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా కుటుంబ స‌భ్యుల ఒత్తిడి మేర‌కే హ‌సీనా దేశం విడిచిన‌ట్లు వెల్ల‌డించారు. తిరిగి ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెప్పారు. హ‌సీనా దేశం విడిచి వెళ్లిన త‌రువాత ప్ర‌ధాని అధికారిక నివాస‌మైన‌ గ‌ణ‌భాబ‌న్ ను ఆందోళ‌న‌కారులు ముట్ట‌డించి విధ్వంసం సృష్టించారు. ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేశారు. బంగ్లా ప‌రిణామాల‌పై భార‌త్ నిశితంగా ప‌రిశీలిస్తుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ అత్య‌వ‌స‌ర భేటీ అయింది. పొరుగుదేశంలో తాజా ప‌రిస్థితులు, స్థానికంగా చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై స‌మీక్ష జ‌రిపిన‌ట్లు తెలిసింది బంగ్లాదేశ్ లో నెల‌కొన్న‌ ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో భార‌త్ - బంగ్లాదేశ్ మ‌ధ్య వాణిజ్యానికి తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. నిత్యావ‌స‌రాలు మిన‌హా మిగిలిన వాణిజ్యం నిలిచిపోయింది.

జగన్‌తో అంటకాగారుగా.. అనుభవించండి!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపి అరాచకాలకు కొమ్ముకాశారనే ఫిర్యాదులున్న రాజంపేట, తుళ్లూరు డివిజన్ల డీఎస్పీలు వీఎన్కే చైతన్య, ఈ.అశోక్ కుమార్ గౌడ్లపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు వేసింది. ఇద్దరికీ ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సీహెచ్. ద్వారకాతిరుమలరావు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతికదాడులకు దిగారని విమర్శలున్నాయి. తాడిపత్రిలో బాధితులు చైతన్యపై 23 ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. రాజంపేటకు బదిలీపై వెళ్లి, అక్కడా అదే అరాచకాలు కొనసాగించారు. అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. జేసీ ఇంట్లో పనిచేసే దళితుడు, దివ్యాంగుడైన కిరణ్‌కుమార్‌ని ఇష్టానుసారం కొట్టారు.  ఇటువంటి రాక్షస పోలీసులపై చర్యలకు ఎన్ని రోజులు పడుతుంది.  చంద్రబాబుకు వున్న సహనం బాధిత ప్రజలకు  కూటమి కార్యకర్తలకు లేదు.  తప్పుడు అధికారులపై  కఠినంగా  ఉక్కుపాదం మోపి, ఒంటి మీద  ఖాకీ యునిఫాం తీయించకపోతే  రాక్షస పోలీసులకు  సాదారణ పోలీసులకు  తేడా ఏంటి  అని  ప్రజలు  ప్రశ్నిస్తున్నారు.  డీఎస్పీచైతన్యను కేవలం బదిలీ చేయడానికి  50 రోజుల సమయమా?  పైగా  ఆ నిర్ణయం  పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు చైతన్యను బదిలీ చేశారు. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశం అవటానికి  50 రోజులు సమయం పట్టిందన్నమాట.  అంటే  అర్థం ఏంటి?  డీజీపీ  ద్వారకా తిరుమలరావు ప్రజలు ఆశించినంత వేగంగా పని చేయడంలేదు  అని అనుకోవాల్సిన పరిస్థితికి  అద్దం పడుతోంది.   మరో డీఎస్పి అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో  వైసీపీకి కొమ్ముకాశారనే ఫిర్యాదులున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని తీవ్రంగా వేధించారు. ఆయన్ని బహిరంగంగా హెచ్చరించారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు అశోక్ కుమార్ గౌడ్ తుళ్లూరు డీఎస్పీగా నియమితులయ్యారు. ఎన్డీయే విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారిపట్ల అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదులున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో వైసీపీ మూకల దాడిపై కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక సీఐ, మరో ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి మంగళగిరి రూరల్ సీఐ భూషణంతోపాటు అప్పట్లో రూరల్ ఎస్సైలుగా పని చేసిన లోకేశ్, క్రాంతికిరణ్‌ను కూడా సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మంగళగిరిలోనే రెండు నెలలకు పైగా ఎస్సైలుగా పనిచేసిన విజయకుమార్ రెడ్డి, రమేష్ బాబులపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశించారు. కేసు నమోదులోనే ఎన్నో లోపాలున్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు. నాటి రూరల్ సీఐ భూషణం దర్యాప్తును అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేశారు. కొత్తగా వచ్చిన ఎస్పీ సతీష్ కుమార్ ఇటీవల మంగళగిరి రూరల్ స్టేషన్‌కి వెళ్లి సమగ్రంగా పరిశీలించి, లోపాలను గుర్తించారు. దాడి జరగ్గానే పోలీసులు ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనంతరం దర్యాప్తులోనూ జాప్యం ప్రదర్శించారని ఆయన తేల్చారు. ప్రత్యక్ష సాక్షులుగా కూరగాయలు అమ్ముకునేవారి పేర్లను సీఐ భూషణం, పెట్టారని తెలుసుకుని ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. 2021లో కేసు నమోదైతే నిందితులను గుర్తించి, అరెస్టు చేయకుండా సీఐ భూషణం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్పీ తన నివేదికలో తప్పు పట్టినట్లు తెలిసింది.

నాకు రెస్పెక్ట్ కావాలి మొర్రో!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ వైసీపీ  శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్ వేయాలని శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్‌కి విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది చెబుతున్నందున దీనిపై వివరాలు సమర్పించాలంటూ అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. వ్యాజ్యం విచారణార్హతకు లోబడి ఈ ఉత్తర్వులుంటాయని పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల మంత్రి  పయ్యావుల కేశవ్‌కు  నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మంగళవారం ఉత్తర్వులిచ్చారు.  అసెంబ్లీలో ప్రతి పక్ష నేత హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పైమంగళవారం జరిగిన విచారణలో ఆయన తరఫున  న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు పిటిషనర్ అర్హుడని చెప్పగా, న్యాయమూర్తి స్పందిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేనందున, వ్యాజ్యంపై లోతైన విచారణ జరపాల్సి ఉందన్నారు. ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తామన్నారు. శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, 'అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. కౌంటర్ వేసేందుకు మాకు సమయమివ్వండి. వ్యాజ్యం లోతుల్లోకి వెళ్లే ముందు విచారణార్హతను తేల్చాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కేశవ్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడం అభ్యంతరకరం' అని వాదించారు. ప్రతిపక్ష నేత హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించగా, 'స్పీకర్' అని ఏజీ బదులిచ్చారు. జగన్ తరపు  న్యాయవాది శ్రీరామ్ వాదనలు  కొనసాగిస్తూ ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని స్పీకర్‌కి వినతిపత్రమిచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకరుకు న్యాయస్థానం నోటీసు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. మహారాష్ట్రలో స్పీకరుకు సుప్రీం కోర్టు నోటీసు ఇచ్చిన సందర్భముంది. ఈ కేసులోనూ స్పీకర్ కార్యదర్శికి నోటీసు ఇచ్చి మా విజ్ఞప్తిపై ఏ నిర్ణయం తీసుకున్నారో స్పష్టత కోరాల'ని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. స్పీకర్‌కి జగన్ విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నందున ఏం నిర్ణయం తీసుకున్నారో చూద్దామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీచేశారు.  అయితే ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. న్యాయవ్యవస్థ తన పరిధి దాటి శాసన వ్యవస్థలోకి ఎలా చొచ్చుకు రాగలుగుతుంది అనేది ప్రశ్న..! అసెంబ్లీకి అధిపతి స్పీకర్. శాసన వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ.  కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జ్యూడిషరీ శాసన వ్యవస్థ నిర్ణయాలని తప్పుపడుతుంది అది ఎప్పుడూ...  ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అని అనుకున్నప్పుడు.  ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు . జగన్ పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదు అనేది ఏజీ దమ్మాలపాటి వాదన.  స్పీకర్ చేయాల్సిన నిర్ణయాన్ని కోర్టే చేసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించండి అని స్పీకర్ ను ఆదేశిస్తుందా..? ఒకవేళ ఆదేశిస్తే స్పీకర్ ఆ అంశాన్ని పక్కన పెడితే ఏమవుతుంది ? స్పీకర్‌ని హైకోర్టు బోనులోకి పిలిపించి నిల్చోపెడుతుందా? అంటే అది రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు పడ్డట్టే లెక్క.  ప్రతిపక్ష నాయకుడు అనేది చట్టబద్ధమైన స్థానం తప్ప 10% రూల్ అనేది చట్టంలో లేదు. భారత పార్లమెంటు సభలలో ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక చట్టబద్ధమైన పదవి. ఈ పోస్ట్ పార్లమెంట్ చట్టం, 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల కోసం  ప్రతిపక్షంలో సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు హోదాగా నిర్వచించింది. ఆ గుర్తింపు స్పీకర్ లేదా  చైర్మన్ ద్వారా గుర్తించబడుతుంది.  మోడీ మొదటిసారి ప్రధాని అయిన 2014 నుంచి 2019 వరకు  రెండోసారి ప్రధాని అయిన 2019 నుండి  2024 వరకు  నాటి పార్లమెంట్ స్పీకర్  కాంగ్రెస్ పార్టీకి  ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు! పది సంవత్సరాల పాటు  కాంగ్రెస్‌కు  ప్రతిపక్ష హోదా లేకుండానే  ప్రజా క్షేత్రంలో  పోరాటం చేసింది.  మొన్న జరిగిన  ఎన్నికల్లో  ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ సాధించింది.  రాహుల్ గాంధీ  నాకు  రెస్పెక్ట్ కావాలి అని  గోల గోల చేయలేదే!  కోర్టు మెట్లు ఎక్కలేదే!  కాని  ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం  జగన్  రెడ్డి  నాకు  రెస్పెక్ట్ కావాల్సిందే అని  కోర్టుకు ఎక్కారు.  ప్రజలే  ఇవ్వని  రెస్పెక్ట్ కోసం కోర్టు ద్వారా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. రెస్పెక్ట్ అనేది కొనుక్కుంటేనో కోరుకుంటేనో  వచ్చేది కాదు! అది ఎదుటి వారు ఇచ్చేది అనే సూక్ష్మం జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోవటం విషాదం.  అదేదో సినిమాలో  బ్రహ్మానందం నాకు  రెస్పెక్ట్ కావాలని  ప్రేక్షకులను  నవ్విస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి ఒక పక్కా లెక్క ముందస్తు ప్రణాళిక వ్యూహం ఉంటాయి. దీంట్లో జగన్ ఎత్తులు పై ఎత్తులు ఏంటో జరగబోయే పరిణామాలేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

అబ్దుల్ కలామ్ కంటే జగనే గొప్పా?.. వీళ్లింక మారరా?

వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింది. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పినా వారిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్ర‌పంచంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంటే గొప్ప‌వారు ఎవ‌రూ ఉండ‌ర‌న్న రీతిలో కొంద‌రు వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో తాజాగా ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ప‌ట్ల వారు అభ్యంత‌రం తెలుపుతున్నారు. గత ప్రభుత్వ  హయాంలో విద్యాశాఖ‌లో అమ‌లు చేసిన ప‌థ‌కాల‌కు జ‌గ‌న‌న్న పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాల పేర్లు మార్చేసింది. కొత్త పేర్లు పెట్టింది. దేశంలో, రాష్ట్రంలో ప‌లు రంగాల్లో గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల పేర్ల‌ను ఆ ప‌థ‌కాల‌కు పెడుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, కొంద‌రు వైసీపీ నేత‌లు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలోని ప‌లు రంగాల్లో గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల కంటే మా జ‌గ‌న‌న్నే గొప్ప‌.. మా జ‌గ‌న‌న్న పేరుపై ఉన్న ప‌థ‌కాన్ని ఎందుకు తీసేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. మా ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత మ‌ళ్లీ జ‌గ‌న‌న్న పేరుతో ప‌థ‌కాలు అమ‌లు చేస్తామంటూ   వివిధ ఛాన‌ళ్ల డిబేట్ల‌లో  ఆవేశపడిపోతున్నారు.   వైసీపీ నేత‌ల తీరు పట్ల ప్రజలలో అసహనం వ్యక్తం అవుతోంది.  వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యాశాఖ‌లో జ‌గ‌న‌న్న అమ్మఒడి, జ‌గ‌న‌న్న విద్యాకానుక‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, మ‌న‌బ‌డి నాడు- నేడు, స్వేచ్ఛ‌, జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింది. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాల‌కు పేర్ల‌ను మార్పు చేసింది. దేశానికి విశేష సేవ‌లందించిన ప‌లువురు భార‌త‌మాత ముద్ద‌బిడ్డ‌ల పేర్లతో ఆ పథకాలకు నామకరణం చేసింది.  స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌, అబ్దుల్ క‌లాం, డొక్కా సీత‌మ్మ తదితర గొప్పగొప్ప వారి పేర్లను ఆయా పథకాలకు పెట్టింది.   జ‌గ‌న‌న్న అమ్మఒడి పథకానికి త‌ల్లికి వంద‌నంగానూ  , జ‌గ‌న‌న్న విద్యాకానుక‌ పథకానికి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విద్యార్థి మిత్రగానూ పేర్లు మార్చింది. అలాగే  జగనన్న గోరు ముద్ద పథకాన్ని  డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నంగా మార్పు చేసింది, మ‌న బ‌డి నాడు- నేడు పథకానికి మ‌న బ‌డి - మ‌న భ‌విష్య‌త్తు గా పేరు మార్చింది. స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా మార్చింది.  జగనన్న ఆణిముల్యాలు పథకం పేరును అబ్దుల్ క‌లాం ప్ర‌తిభ పుర‌స్కారంగా మార్పు చేసింది. ఈ విష‌యాన్ని విద్య, ఐటీ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా తెలియ‌జేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నిప్ర‌జ‌లు స్వాగతిస్తున్నారు. విద్యాశాఖ‌కు సంబంధించిన ప‌థ‌కాల‌కు ప్ర‌ముఖుల పేర్లు పెట్ట‌డం ముదావహం, శుభపరిణామం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా గోప్పవారి పేర్లు ఆయా పథకాలకు పెట్టడం ద్వారా  వారి జీవిత చ‌రిత్ర‌ల గురించి విద్యార్థుల‌కు పూర్తి అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంద‌ని విద్యావేత్త‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం ప‌ట్ల అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నా కొంద‌రు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు తొల‌గించార‌ని తెగ‌బాధ‌ప‌డిపోతున్నారు. అబ్దుల్ క‌లాం, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ కంటే జ‌గ‌న్ గొప్ప‌వాడు అన్న‌రీతిలో మాట్లాడుతున్నారు.  విద్యాశాఖ‌లోని ప‌థ‌కాల‌కు పేర్లు మార్పుపై జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న సంతోషాన్ని ఎక్స్ ద్వారా తెలియ జేశారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని అన్నారు. ప‌థ‌కాల‌కు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లు పెట్ట‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు  జనసేనాని అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించేలా గొప్పగొప్ప మహానుభావుల పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు చంద్ర‌బాబు, లోకేశ్ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఊరందరిదీ ఒకదాని.. ఉలిపికట్టది ఒక దారి అన్నట్లుగా కొంద‌రు వైసీపీ నేత‌లు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.  మా జ‌గ‌న‌న్న పేరును ఎందుకు తొల‌గించారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఓ అడుగు ముందుకేసి మ‌ళ్లీ మా ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంది. అప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న‌న్న పేర్లు పెడ‌తామంటూ చెబుతున్నారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌ను జనం చీద‌రించుకుంటున్నారు.

బెంగ‌ళూరులోనే జగన్ మకాం.. శ‌వం ఉంటేనే ఆంధ్రాకు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాన‌సిక స్థితి స‌రిగా లేన‌ట్లు క‌నిపిస్తోంది. హ‌త్య‌లు, దాడుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించిన ఆయ‌న‌కు ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాక్ త‌గిలింది. ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని నిర్ద్వంద్వంగా తేల్చేశారు. అధికారంలో ఉన్న‌ప్పుడే జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితిపై కొంద‌రు వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఘోర‌ ఓట‌మి త‌రువాత ఆయ‌న ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థంకావ‌డం లేద‌ని ఆ పార్టీ నేత‌లు తలలుబాదుకుంటున్నారు. నూత‌నంగా అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం  ప్ర‌భుత్వానికి పాల‌నాప‌రంగా స‌ర్దుబాటు కావ‌టానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. దీంతో ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏ పార్టీ అయినా క‌నీసం ఓ ఆర్నెళ్లు త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేసేందుకు స‌మ‌యం తీసుకుంటుంది. త‌ద్వారా ఆ స‌మ‌యంలో అధికార పార్టీ వ్య‌వ‌హార‌శైలిని బ‌ట్టి రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు వ్యూహాల‌కు ప‌దునుపెడుతుంటారు. కానీ, జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తున్నారంటూ జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతున్నారు. ఓ ప‌క్క రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంతో ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటే.. జ‌గ‌న్, కొంద‌రు వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అధికారం కోల్పోయిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని భ‌యం వెంటాడుతోంది. ఐదేళ్ల కాలంలో తానుచేసిన అరాచ‌క పాల‌న‌ను గుర్తుచేసుకుంటున్న జ‌గ‌న్‌.. కూట‌మి ప్ర‌భుత్వంకూడా అదే ప‌ద్ద‌తిని పాటిస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు‌. కానీ, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధే ల‌క్ష్యంగా పాల‌న‌పై దృష్టిపెట్టారు. రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉంటే పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకొస్తార‌ని, త‌ద్వారా ఉపాధి అవ‌కాశాలు పెరిగి, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉండ‌టంతో కేంద్రం నుంచి వీలైన‌న్ని ఎక్కువ‌ నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా చంద్ర‌బాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిని చూసి త‌ట్టుకోలేపోతున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్ లో ఉండ‌లేక పోతున్నారు‌. దీంతో చీటికిమాటికి బెంగ‌ళూరులోని ఆయ‌న ప్యాలెస్‌కు వెళ్తున్నాడు.  అధికారం కోల్పోయిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే రెండు సార్లు బెంగ‌ళూరులోని ఆయ‌న ప్యాలెస్‌కు వెళ్లారు. కొద్దిరోజులు అక్క‌డే ఉన్నారు. ఇటీవ‌ల రాష్ట్రానికి వ‌చ్చిన ఆయ‌న‌.. శ‌వ రాజ‌కీయం పూర్త‌యిన త‌రువాత‌.. మ‌ళ్లీ స‌తీస‌మేతంగా బెంగ‌ళూరు వెళ్లారు. బెంగ‌ళూరులో జ‌గ‌న్ వెళ్లేది ఆయ‌న‌ సొంత ఇంటికే అయినా.. అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారి కూడా అక్కడకు వెళ్ల‌ని జ‌గ‌న్‌ ఇప్పుడు చిటికీ మాటికీ బెంగళూరు వెళ్ల‌డానికి కార‌ణం ఏమిట‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వర్గాల్లో జ‌రుగుతోంది. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. ప్ర‌జ‌లు ఘోరంగా ఓడించ‌టాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు..   చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన 50రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ ప్యాలెస్ కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోనే ఉంది. ప్ర‌స్తుతం ఆ ప్రాంతం నిత్యం ర‌ద్దీగా మారింది. తనకు నచ్చని అమరావతి రాజధాని పనులు తన కళ్లముందే వేగంగా జరుగుతుండటంతో జగన్ ఓర్వలేకపోతున్నారు. అందుకే అక్కడ ఉండలేకపోతున్నారని   వైసీపీ నేతలే చెబుతున్నారు. ఈ కారణంగా జగన్ బెంగళూరులో  ప్యాలెస్ లోనే మకాం వేస్తున్నారు.   బెంగళూరు నుంచే రాష్ట్రంలో ఘర్షణలకు జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలుగుదేశం కూటమి పార్టీల్లోని నేతలు ఆరోపిస్తున్నారు. తద్వారా శవ రాజకీయాలతో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని దేశ ప్రజలను నమ్మించేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ఏపీ వైపు చూడకుండా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.    జగన్ కు తాడేపల్లితోపాటు హైదరాబాద్ లోనూ ఓ ప్యాలస్ లాంటి నివాసం ఉంది. గతంలో ఎక్కువగా జగన్ హైదరాబాద్ లోనే నివాసం ఉండేవారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. తెలంగాణ   ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటమే కారణం. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడిగా జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భంగాల్లో రేవంత్ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం గ‌త ఐదేళ్ల జగన్ పాలనలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో ఎప్పుడైనా త‌న‌ను అరెస్టు చేయొచ్చ‌ని కూడా జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు‌. ఏపీలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా తనకు ఇబ్బంది ఉంటుందని భావిస్తున్న జగన్.. బెంగళూరులో ఉండటమే సేఫ్ గా భావిస్తున్నారు. బెంగళూరులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే, అక్కడి డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉన్నారు. డీకేతో వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా జగన్ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీకి కేవలం శవ రాజకీయాలు చేయడానికే మాత్రమే జగన్ వస్తారన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

ఏపీ అసెంబ్లీలో తమాషా సంఘటన!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమాషా సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళు లేచి నిల్చోండి అన్నారు. దాంతో పవన్ కళ్యాణ్‌తో సహా మెజారిటీ సభ్యులు లేచి నిల్చున్నారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వీళ్ళని లోపల వేయాలని కేసులు పెట్టింది. కానీ ప్రజలు వీళ్ళని అసెంబ్లీకి పంపించారు అని అన్నారు. ఆ తర్వాత కేసులేవీ లేని వాళ్ళు లేచి నిల్చోండి అని అడిగారు. అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే లేచి నిల్చున్నారు. ‘మీరు అదృష్టవంతులు’ అని చంద్రబాబు ఈ సందర్భంగా చమత్కరించారు.