రాష్ట్ర విభజనపై పార్టీల వికృత రాజకీయ క్రీడలు-1

  ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నరాష్ట్ర విభజన, తెలంగాణా ఏర్పాటు అనే రెండు అంశాలు అన్ని పార్టీలకు ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. ఈ వ్యవహారంలో ప్రతీ పార్టీ కూడా తాము ఈ అంశాల నుండి ఏవిధంగా రాజకీయ లబ్ది పొందగలము? ఈ సమస్యల నుండి బయటపడి, వైరి పక్షాలను దెబ్బతీయాలని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ రాజకీయ చదరంగం ఆడుకొంటున్నాయి.   ఇది ప్రజల భావోద్వేగాలతో చెలగాటమేనని వాటికీ తెలుసు. గనుకనే ఆ భావోద్వేగాలను కూడా తమ రాజకీయ లబ్ధికి నేర్పుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. రాజకీయ పార్టీల ఈ వికృత క్రీడ వలననే సమస్య మరింత జటిలమవుతోంది.   ఇందులో మొట్ట మొదటి దోషి కాంగ్రెస్ పార్టీయే. ఇంతటి క్లిష్టమయిన, సున్నితమయిన అంశాన్ని,సరిగ్గా ఎన్నికల ముందు మొదలుపెట్టడమే దాని ఆలోచన ఏమిటో స్పష్టం అవుతోంది. అయితే అది వరుస పెట్టి చేస్తున్నతప్పుల వలన అది ఆశించిన ప్రయోజనం దక్కకపోగా, రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటోంది.   తన మద్దతు ఉంటే తప్ప కాంగ్రెస్ గట్టెకలేదనే సంగతి కనిపెట్టిన బీజేపీ కూడా మాట మార్చిందిప్పుడు. బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర ఏర్పాటుకి అవకాశం లేదని గ్రహించిన కేసీఆర్ కూడా మాట మర్చితెరాస వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తుందని చెపుతున్నాడు.   ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినా ఇవ్వకున్నా తెరాసకు వచ్చేనష్టం ఏమీ లేదు. తెలంగాణా ఏర్పాటయితే సానుకూల ఓటుతో గెలవగలదు. లేకుంటే తెలంగాణా సెంటిమెంటుతో గెలవగలదు. కానీ ముందుగా పోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే.

రాష్ట్ర విభజనపై పార్టీల వికృత రాజకీయ క్రీడలు-2

  ఇక సీమాంధ్రలో పరిస్థితి దీనికి భిన్నంగాలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్దీ క్రమంగా కిరణ్ మేలి ముసుగులు తొలగిపోతుంటే, ఆయన సమైక్యవాదం ఎటువంటిదో ప్రజలకీ అర్ధం అవుతోంది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించబడుతున్న జగన్మోహన్ రెడ్డి, మొదట సమైక్యవాదం బలంగా వినిపించి, ఇప్పుడు కీలకమయిన తరుణంలో కాడి పక్కన పడేసి ఓదార్పు యాత్రలు, దేశాటనలు అనడం కూడా ఈ రాజకీయ క్రీడలో భాగమే.   వచ్చే ఎన్నికలలో యుపీయే కూటమి మెజార్టీ సాధిస్తే, కేంద్రంలో తమకు అతను మద్దతు ఇస్తాడని కాంగ్రెస్ భావిస్తే, అతను దేశాటన చేసి కాంగ్రెసేతర పార్టీలను, ప్రభుత్వాలను కూడగట్టే పనిలో ఉన్నాడు. అయితే అది విభజన సజావుగా సాగేందుకు ఎంచుకొన్న మార్గమో లేక తనపై వస్తున్న ఆరోపణలను తప్పించుకొనేందుకు ఉపాయమో ఆయనకే తెలియాలి.   ఇక తెదేపా రాష్ట్ర విభజన ప్రక్రియలో నిత్యం మారుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ తదనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకొంటూ ముందుకు సాగుతోంది తప్ప నేటికీ రాష్ట్ర విభజనపై నిర్దిష్టంగా మాట్లాడటం లేదు.   చివరికి మజ్లిస్ వంటి చిన్న పార్టీ కూడా రాష్ట్ర విభజనతో తన వోటు బ్యాంక్ చీలిపోతుందనే ఆలోచనతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతూ వచ్చి, విభజన అనివార్యమని భావించి తన సమైక్యవాదం వలన తనకే నష్టమని గ్రహించగానే ఈరోజు అఖిలపక్ష సమావేశంలో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణా ఏర్పాటుకు అంగీకరిస్తున్నామని చెప్పి, వీలయితే రాయల తెలంగాణా ఏర్పాటు చేయమని ఒక ఉచిత సలహా కూడా పడేసింది.   ఈవిషయంలో మొదటి నుండి ఖరాఖండిగా ఉన్నవి ఒక్క లెఫ్ట్ పార్టీలేనని చెప్పక తప్పదు. సీపీఎం నేటికీ రాష్ట్ర విభజనను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూనే ఉంది. సీపీఐ తెలంగాణా ఏర్పాటుని అంతే ఖచ్చితంగా సమర్దిస్తూ వచ్చింది.   అయితే ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో కానీ దేశంలో గానీ తామే స్వయంగా ప్రభుత్వం ఏర్పరిచే స్థితిలో లేవు గనుకనే అంత నిక్కచ్చిగా ఉండగలిగాయని చెప్పవచ్చును. అంతే కాక వాటి వైఖరి వలన ఆ రెండు పార్టీలకి కొత్తగా వచ్చేలాభం కానీ నష్టం గానీ ఏమీ ఉండదు కూడా. లేకుంటే అవీ ఇతర పార్టీలలాగే వ్యవహరించేవేమో!

మీ రచ్చబండ మండ!

      కాంగ్రెస్ పార్టీ లాంటి అన్నీ వదిలేసిన పార్టీ గూగుల్‌లో వెతికినా దొరకదేమో! రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని పూనుకోగానే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి తెలంగాణ పర్యటనని బహిష్కరించాలని పిలుపు ఇచ్చేశాడు. విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అయితే, ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికే రావడానికి వీల్లేదు.. ఆయన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులెవరూ తెలంగాణకు ఆహ్వానించడానికి వీల్లేదంతే అంటూ హుకుం జారీ చేశాడు. రచ్చబండలో ముఖ్యమంత్రితో కలసి పాల్గొనాల్సిన మంత్రులు మాకు వేరే అర్జెంటు పనుందని తప్పించుకున్నారు.. చివరికి అందరూ కలసి రచ్చబండనే రద్దుచేశారు. ఇంత కంగాళీ పార్టీ, ప్రభుత్వం సోమాలియాలో కూడా ఉండదేమో!     మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి అలా ప్రకటించాడో లేదో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోయారు. రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి రచ్చబండ నిర్వహణకి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. ముఖ్యంమంత్రితో రచ్చబండకి హాజరు కావలసిన తెలంగాణ మంత్రులు ‘‘మేం సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సభలో పాల్గొంటున్నాం కాబట్టి మేం రానేరాం’’ అనేశారు. ముఖ్యమంత్రి రచ్చబండలో పాల్గొంటే నానా న్యూసెన్సూ చేస్తామని కాంగ్రెస్ నాయకులే వార్నింగులు ఇచ్చారు. దాంతో ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు. వీళ్ళ రాజకీయాల గొడవేంటోగానీ, రచ్చబండ కార్యక్రమం సజావుగా జరిగితే సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్నయినా తీరేవి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చెబుతున్నాడు. మెదక్ జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమాల్లో ఈసారి సీఎం మెదక్ జిల్లాకు రెండు వందల కోట్ల రూపాయల నిధులు ప్రకటించాలని అనుకున్నారని, దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులే చెడగొట్టారని విమర్శిస్తున్నాడు. అయినా సీఎం తెలంగాణలో పర్యటించకుండా ఎవరూ చేయలేరని, త్వరలో లక్షమందితో సంగారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని, దానికి సీఎం కూడా హాజరవుతారని జగ్గారెడ్డి ప్రకటించాడు. ఈ వ్యవహారమంతా చూసి తెలంగాణ ప్రజలు మీ రచ్చబండ మండ అని గొణుక్కుంటున్నారు.  

ఎంఐఎం వెరైటీ విధానం!

      హైదరాబాద్‌లో రాజకీయంగా మంచి పట్టు వున్న ఎం.ఐ.ఎం. పార్టీ రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరిస్తున్న విధానం చాలా వెరైటీగా, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొదటి నుంచీ రాష్ట్రం సమైక్యంగా వుండాలని వాదిస్తూ వచ్చిన ఎం.ఐ.ఎం. మీద తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం ఏర్పడింది. విభజనవాదులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చేసే ప్రయత్నాలను ఎం.ఐ.ఎం. అడ్డుకుంటుందన్న నమ్మకం అందరిలోనూ పెరిగింది.     అయితే ఆమధ్య ఎం.ఐ.ఎం. అకస్మాత్తుగా తన విధానాన్ని మార్చుకుంది. ‘‘రాష్ట్రం సమైక్యంగానే వుండాలి. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రాయల తెలంగాణ ఏర్పడాలి’’ అని ఒక విచిత్రమైన వాదనని తెరమీదకు తీసుకొచ్చింది. దాంతో సమైక్యవాదులందరూ ఈ వాదనను ఎలా అర్థం చేసుకోవాలో అర్థంకాక కన్ఫ్యూజ్ అయిపోయారు.  రాయల తెలంగాణ ఏర్పాటయితే ఎం.ఐ.ఎం.కి ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేకపోయినా అలాంటి స్టేట్‌మెంట్ ఎం.ఐ.ఎం. నేతల నుంచి ఎందుకొచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. విభజన తప్పదంటే హైదరాబాద్‌లో సీమాంధ్రులు ప్రశాంతంగా ఉండాలంటే హైదరాబాద్‌ని యూటీ చేయాలన్న డిమాండ్ తెరమీదకి వచ్చినప్పుడు... మీ ప్రశాంతత సంగతి మాకెందుకు.. హైదరాబాద్‌ని యూటీ చేయడానికి మేం ఒప్పుకోం అని ఎం.ఐ.ఎం. తేల్చిపారేసింది. ఎం.ఐ.ఎం.కి తమమీద మీద అభిమానం లేకపోతే లేకపోయింది.. కనీసం జాలీ దయా కూడా లేకుండా పోయాయే అని సీమాంధ్రులు బాధపడుతున్నారు. ఈమధ్యకాలంలో ఎం.ఐ.ఎం. తన రాయల తెలంగాణ నినాదంలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. రాయల తెలంగాణ అంటే మొత్తం తెలంగాణ జిల్లాలు, నాలుగు రాయలసీమ జిల్లాలతో ఏర్పడేది కాదట. పది తెలంగాణ జిల్లాలు ప్లస్ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో ఏర్పడిన రాయల తెలంగాణ ఏర్పడితేనే ఎం.ఐ.ఎం. ఒప్పుకుంటుందట. రాయలసీమలోని రెండు జిల్లాల మీద ప్రేమ ఎందుకో, మిగతా రెండు జిల్లాలు చేసిన పాపమేమిటో ఎం.ఐ.ఎం. నాయకులకు తప్ప ఎవరికీ అర్థంకాని విషయం. మొత్తమ్మీద రాష్ట్ర విభజన ఇష్యూలో తెలుగు ప్రజలను అయోమయానికి  గురిచేయడానికి ఎం.ఐ.ఎం. కూడా తనవంతు కృషి చేస్తోంది.

ఆ మాట ఎందుకన్నాడో!

      మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఫెయిల్... ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఫెయిల్... దిగ్విజయ్ సింగ్ ఎక్కడ లెగ్గు పెట్టినా తాను ఫెయిలవుతూ, లెగ్గు పెట్టిన ప్రదేశాన్నీ ఫెయిల్ చేస్తూ మిస్టర్ ఫెయిల్యూర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడా పనికిరానివాడు రాజకీయాల్లో పనికొస్తాడని అంటారు. రాజకీయాల్లో కూడా పనికిరాకుండా పోయిన దిగ్విజయ్ ఇంకెక్కడ పనికొస్తాడో ఏంటో!   ఈమధ్యకాలంలో దిగ్విజయ్ చేస్తున్న కామెంట్లు, కొడుతున్న పంచ్ డైలాగ్స్ వింటుంటే ఫ్యూచర్లో దిగ్విజయ్ సింగ్ సినిమా రైటర్‌గా ట్రై చేస్తే బెటరేమోననిపిస్తోంది. ఎప్పుడు మీడియావాళ్ళు మాట్లాడించినా ‘‘అన్ని పార్టీలూ ఒప్పుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించింది’’ లాంటి రొటీన్ డైలాగ్స్ కొడుతూ వుంటాడు. ఇతను ఇలా రొటీన్‌గా మాట్లాడేస్తూ ఉంటాడులే అనుకుని ఫిక్సయితే, సడన్‌గా సమైక్యవాదుల గుండెల్లో బాంబులు పేలే డైలాగ్ కొడతాడు. ఆ బాంబుల ధాటికి విలవిలలాడుతున్న సమైక్యవాదులను చూసి విభజనవాదులు సంతోషిస్తూ వుంటారు.  అయితే వాళ్ళ సంతోషం కూడా ఎక్కువకాలం నిలవదు. వాళ్ళకి షాక్ తగిలే డైలాగ్ ఒకటి దిగ్విజయ్ కొట్టడంతో వాళ్ళు కూడా విలవిలలాడుతూ వుంటారు. ఇలా డైలాగుల మీద డైలాగులు కొడుతూ అటు సమైక్యవాదులని, ఇటు విభజనవాదులని మాటలతో కొడుతున్న దిగ్విజయ్ సింగ్ భవిష్యత్తులో  సినిమాల్లో పంచ్ డైలాగుల రచయితగా స్థిరపడతాడని ఆశిద్దాం. సరే ఆయనగారి ఫ్యూచర్ ఎలా వున్నా, ప్రెజెంట్‌లో ఆయన కొట్టిన ఓ పంచ్ డైలాగ్ విభజనవాదులని కంగారుపెడుతోంది. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ళ తర్వాత విభజనవాదులు పశ్చాత్తాపపడతారు’’ అని దిగ్విజయ్ సింగ్ సార్ అన్నారట. ఆ మాట దిగ్విజయ్ ఎందుకన్నాడో, అలా అనడం వెనుక అసలు ఉద్దేశమేంటో అర్థంకాక విభజనవాదులు అదరిపోతున్నారు. పదేళ్ళ తర్వాత తెలంగాణవాదులు పశ్చాత్తాపపడే పరిస్థితులని క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఏదైనా మెలికలు పెట్టబోతోందా అనే అనుమానం విభజనవాదులను పట్టి పీడిస్తోంది. అందుకే కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రతి అంశాన్నీ భూతద్దంలో చూసి విభజనవాదులు బెదిరిపోతున్నారు.

చెప్పుదెబ్బలు - చీపురు దెబ్బలు!

      కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన సూచనలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎన్నికలలో ఏం చేయబోతున్నారని అక్కడి ప్రజల్ని అడిగితే, చెప్పులతో కొట్టి, చీపుళ్ళతో తన్ని ఊడ్చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు మానసికంగా సిద్ధమైనట్టే కనిపిస్తోంది. భవిష్యత్తులో తాము కాంగ్రెస్‌ని ఎలా దెబ్బ తీయబోతున్నామన్న దానికి సమైక్యవాదులు ఆల్రెడీ శాంపిల్ చూపించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి చెప్పులు విసిరారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో సీమాంధ్ర నుంచి ఊడ్చిపారేయడానికి సీమాంధ్ర మహిళలు చీపుళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. సీమాంధ్రలో చీపుళ్ళు సిద్ధమవుతున్నాయి.     ఢిల్లీలో మాత్రం ఆల్రెడీ కాంగ్రెస్‌ పార్టీని ఊడ్చేయడానికి చీపుళ్ళు సిద్ధమయ్యాయి. చీపురుకట్ట గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఢిల్లీని మురికికూపంగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు ఊడ్చిపారేసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకి అందుతున్న చందాల విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించింది. తమకు అందిన చందాల వివరాలను బయటపెట్టింది. అందులో కొన్ని ప్రవాస భారతీయుల నుంచి అందిన చందాలు కూడా వున్నాయి. విదేశాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిన చందాలపై విచారణ జరిపించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది తమమీద విజయం సాధించబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్ మార్కు విచారణ జరిపి, ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగమని అభివర్ణిస్తున్నారు. రాజకీయ పార్టీలకు లభించే చందాలను బహిర్గతం చేయాల్సన అవసరం లేదనీ గొంతెత్తి చాటి, పార్లమెంటులో బిల్లు కూడా ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ చందాలపై విచారణ జరిపించాలనుకోవడం విచిత్రంగా వుందని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొడుతున్నారు. తన పార్టీ చందాలపై విచారణ జరిపించే ముందు కాంగ్రెస్ పార్టీ తనకు వస్తున్న చందాలను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. చందాల బహిర్గతం విషయంలో కాంగ్రెస్ కిక్కురుమనడంలేదు.

సీమాంధ్ర చెవిలో కాంగ్రెస్ పువ్వు!

      రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ప్రజల్ని దారుణంగా మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలు మీ మోసాలు సాగవంటూ సీమాంధ్రులు వందరోజులకు పైగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సీమాంధ్రులను శాంతింపజేయనిదే రాష్ట్ర విభజన సజావుగా సాగదన్న విషయం కాంగ్రెస్ హైకమాండ్‌కి అర్థమైంది. దాంతో సీమాంధ్రుల చెవుల్లో పూలు పెట్టి, శాంతపరిచే కార్యక్రమాలు చేపట్టింది.   మూడు రోజుల క్రిందటి వరకూ సీమాంధ్రులు కూడా మనుషులేనా అన్నట్టు వ్యవహరించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్రులకు అనుకూలంగా ఉందన్న సంకేతాలను లీకుల రూపంలో  బయటపెడుతోంది. ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ నాయకత్వానికి ఇచ్చిన నివేదికలో సీమాంధ్రులకు అనుకూలంగా అనేక అంశాలు ఉన్నట్టు క్రియేట్ చేసింది. అలాగే భద్రతకి సంబంధించి నియమించిన టాస్క్ ఫోర్స్ కూడా సీమాంధ్రులకు అనుకూలంగా ఉండే విధంగా నివేదిక సమర్పించినట్టు కలరింగ్ ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చేసిన వాదనే పైచేయి సాధించినట్టు, పరిస్థితులు సీమాంధ్ర ప్రాంతానికి అనుకూలంగా మారుతూ ఉండటంతో భేటీలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు లీకులు పంపించింది. ఇవన్నీ చూసి సీమాంధ్ర ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ తాము అనుకున్నంత చెడ్డది కాదని భావించి, కాంగ్రెస్ మీద వున్న ఆగ్రహాన్ని తగ్గించుకుంటారని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. తమ చేతి నుంచి జారిపోయిన సీమాంధ్రులను మళ్ళీ తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగమే ప్రస్తుత పరిణామాలని విశ్లేషకులు అంటున్నారు. వీటన్నిటి తోడు ముఖ్యమంత్రి కిరణ్ తాజాగా రాష్ట్రాన్ని విభజించాల్సి రావడం పట్ల దిగ్విజయ్ చాలా బాధపడిపోతున్నారని చెప్పడం కూడా సీమాంధ్రుల చెవుల్లో పూలు పెట్టే కాంగ్రెస్ వ్యూహంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కార్చడం కాదు.. గుండెలు బాదుకుని రోదించినా వారిని సీమాంధ్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు.

కాంగ్రెస్ అతితెలివితో ఎన్నికలలో తేదేపాకు లబ్ది

  రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకి, ముఖ్యంగా తెరాస,తేదేపాలకు చెక్ పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, తను ప్రదర్శిస్తున్నఅతితెలివికి, దురాశకి తానే బలయిపోవచ్చును.   కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను ఎంతగా దిక్కరిస్తున్నప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు చెప్పట్టకపోగా, ‘అతను క్రమశిక్షణ గల కాంగ్రెస్ విదేయుడని, అధిష్టానం గీసిన గీతను దాటబోడని, విభజన ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఆయన అంగీకరించాడని’ సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. అయితే ఆయన మాటలను కిరణ్ కుమార్ రెడ్డి ఖండించినప్పటికీ, సజావుగా సాగిపోతున్నవిభజన ప్రక్రియను గమనిస్తే దిగ్విజయ్ సింగ్ మాటలు నిజమేనని అర్ధం అవుతోంది.   ఈవిధంగా విభజన ప్రక్రియ సజావుగా పూర్తి చేసిన తరువాత ముందే అనుకొనట్లుగా ఆయన తన సమైక్య చాంపియన్ ట్రోఫీ పట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడి కొత్త పార్టీతో ప్రజల ముందుకు రావచ్చును. ఇది కాంగ్రెస్ వ్యూహంలో భాగమయినట్లయితే అప్పుడు సీమంధ్రలో కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, వై.కాంగ్రెస్ అని మూడు కాంగ్రెస్ పార్టీలు మేకతోలు కప్పుకొన్న నక్కలా ప్రజల ముందుకు వస్తాయి.   అందులో కిరణ్, వై కాంగ్రెస్ రెండూ పాజిటివ్ ఓట్లకు గాలం వేస్తే, కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా తెదేపాకు చెక్ పెట్టవచ్చునని కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది.   అయితే సరిగ్గా ఇదే కారణంతో ప్రజలు ఈ మూడు కాంగ్రెస్ పార్టీలను తిరస్కరించి, తేదేపాకు పట్టం కట్టే అవకాశం చాలా ఉంది. ఈ మూడు కాంగ్రెస్ పార్టీలలో దేనికి ఓటేసినా కూడా అవి అంతిమంగా మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలోనే జమా అవుతాయి.   రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని గట్టిగా శిక్షించాలని భావిస్తున్న ప్రజలు ఈ మూడు మేకవన్నె కాంగ్రెస్ పార్టీలను పక్కన బెట్టి, సమర్ధమయిన పాలన అందించిన తేదేపాకు ఓటేయవచ్చును. మంచి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకొన్న చంద్రబాబుకి అటువంటి ఇమేజ్ కలిగి ఉన్నమోడీ కూడా ఒకవేళ తోడయినట్లయితే తెదేపా విజయావకాశాలు మరింత మెరుగుపడవచ్చును. ఇక అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నిసాగనంపి మళ్ళీ ప్రత్యామ్నాయ పార్టీకి అధికారం అప్పగించే అలవాటు కారణంగా కూడా తేదేపాకు విజయవకాశాలున్నాయి.   బీజేపీ వైపు చూస్తున్న కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిస్తే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయం. ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలే ఆ పార్టీ కొంప ముంచడం మాత్రం ఖాయం.

సోనియా, మోడీలను భయపెడుతున్న 'ఆమ్ఆద్మీ'

      ఢిల్లీలో బలంగా ఉన్న కాంగ్రెస్, బిజెపిలను 'ఆమ్ఆద్మీ' కలవరపెడుతున్నాడు. కాంగ్రెస్, బిజెపిలతో ఈ కొత్త పార్టీ హోరాహోరీగా పోరాడుతుందని ఇప్పటికే వివిధ సర్వేలు నిర్దారించడంతో భవిష్యత్ రాజకీయాలలో 'ఆమ్ఆద్మీ' ప్రభావం పై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతో౦ది.   ఇప్పుడున్న రాజకీయపార్టీలు అనుసరిస్తున్న పద్దతులకు భిన్నమైన పద్దతులు అనుసరించడం ద్వారా 'ఆమ్ఆద్మీ' పార్టీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. నీతి నీజాతి పరులు, సమర్ధులు అనే వారికీ ప్రాధాన్యం ఇచ్చి అభ్యర్ధులను ఎంపిక చేయడంతో పాటు, నిరాడంబరంగా ఆ పార్టీ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్, బిజెపిలకు చెమటలు పట్టిస్తోంది.   ప్రజల వద్దకు ప్రజలు అనే భావంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్రజలకు అర్ధంకాని భారీ వాగ్ధానాలతో లేనిపోని ఆశలు సృష్టించకుండా, నిత్య జీవితంలో వారికి ఎదురవుతున్న సమస్యలకు ఎలా పరిష్కారం చూపగాలమో చెబుతున్నారు. ప్రధాన పార్టీలు చేస్తున్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణాలను ప్రస్తావిస్తూ 'ఆమ్ఆద్మీ' ప్రధాని పై విమర్శలు చేస్తున్నారు. వ్యవస్థలో మార్పు రావాలాని మీరు కోరుకుంటున్నారా? లేదా ? అని ప్రజలను స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు.   అక్రమంగా సేకరించిన డబ్బుతో కాంగ్రెస్, బిజెపిలు ఒక్కో ఓటుకు భారీ ఎత్తున డబ్బు చెల్లించే అవకాశం ఉందని...అయితే ఓట్ల కోసం డబ్బులు, చీరలు ఇస్తే తీసుకోండని ప్రజలకు చెప్పడం ఆసక్తికరం. అదంతా ప్రజల డబ్బెనని, అందువల్ల ఆ పార్టీలు ఇచ్చినవి తీసుకొని ఓటు మాత్రం 'ఆమ్ఆద్మీ' పార్టీకి వేయాలని కోరుతున్నారు. మద్యం అనారోగ్యం కాబట్టి దానిని తీసుకోవద్దని సూచిస్తున్నారు.   'ఆమ్ఆద్మీ' పార్టీ ఢిల్లీలో పోరాడుతున్న తీరు దేశవిదేశాల్లోని వారికి ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. పోలింగ్ కి దూరంగా ఉండే ఐటీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు వంటి వారిలో 'ఆమ్ఆద్మీ' పట్ల కలుగుతున్న ఆసక్తి వల్ల ఢిల్లీలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోందని మేధావి వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్ర విభజనపై రోజుకో కొత్త ముడి

  రాష్ట్ర విభజన అంశం కంటే, ఇరుప్రాంతల నేతలు చేస్తున్నవివాదస్పద వ్యాఖ్యల వలన ఇప్పటికే జటిలంగా ఉన్నఈ సమస్య క్రమేపి మరింత జటిలంగా మారుతోంది.   ఇరుప్రాంతల నేతలు తమ రాజకీయ మైలేజి పెంచుకోవడానికో, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే తాము తమ ప్రజల, ప్రాంతం మేలుకోరుతూ వీర పోరాటం చేస్తున్నామని చాటుకొనే ప్రయత్నంలోనో లేక వేరే ఇతర కారణాలతోనో చేస్తున్న చిన్నచిన్న వ్యాఖ్యలు, విమర్శలు, డిమాండ్స్ పై, రెండోవైపు వారు తీవ్రంగా స్పందిస్తుండటంతో ప్రతీ అంశం కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవలసి రావడంతో రాష్ట్ర విభజన ఊహించిన దానికంటే ఇంకా చాలా క్లిష్టంగా మారుతోంది. కానీ, తాము ఆ విధంగా స్పందించకపోయినట్లయితే కేంద్రం ఎదుటవారిని మంచి చేసుకొనే ప్రయత్నంలో వారికి ఆయాచితంగా అన్నీఇచ్చేసి తమ ప్రాంతానికి అన్యాయం చేస్తుందనే భయం వల్ల కూడా అందరూ తలో రాయి వేస్తూ క్లిష్టమయిన విభజన అంశాన్ని మరింత క్లిష్టంగా మార్చుతున్నారు.   అయితే, ఈ విషయంలో వారికంటే ముందు కాంగ్రెస్ అధిష్టానాన్నే ఎక్కువ తప్పు పట్టవలసి ఉంటుంది. ఒకసారి తెలంగాణా ప్రాంతం వారిని, మరోసారి సీమాంధ్ర ప్రాంతం వారిని మంచి చేసుకొనే ప్రయత్నంలో రోజుకో కొత్త ప్రతిపాదన చేస్తూ ఇరు ప్రాంతాల ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.   ఇంతవరకు రాష్ట్ర విభజనలో జలవనరులు, ఉద్యోగాలు, హైదరాబాద్ అంశాలే క్లిష్టమయినవిగా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు వాటికి కొత్తగా భద్రాచలంపై ఎవరికి హక్కులు ఉండాలనే అంశం కూడా వచ్చి జేరింది. అంటోనీ కమిటీ హైదరాబాదు ఆదాయంపై పదేళ్ళపాటు ఇరుప్రాంతాలకి జనాభా ప్రాతిపదికన హక్కులు ఉండాలని ప్రతిపాదించడంతో సహజంగానే తెలంగాణా నేతలలో వ్యతిరేఖత మొదలయింది.   ఈవిధంగా రోజుకొక కొత్త అంశంపై తెరపైకి తెస్తూ దానిపై పీట ముడులు వేసుకొంటూ పోవడం వలన, తెలంగాణా ప్రక్రియలో మరిన్ని అడ్డంకులు పెరిగి చివరికి రాష్ట్ర ఏర్పాటు వాయిదాపడినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే, ఇక ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే కూటమిపై, అప్పటి రాజకీయ పరిస్థితులు, అవసరాలు, పొత్తులు, ఒత్తిళ్ళు వంటివి తప్పక ఉంటాయి గనుక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో మరింత జాప్యం జరుగవచ్చును.   రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర ప్రజలు, నేతలు ఇందుకు సంతోషించవచ్చును. కానీ, తెలంగాణా ప్రజలకు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. గనుక తెలంగాణా కాంక్షిస్తున్న నేతలు మీడియా ముందు కొంత సంమయనం పాటించుతూ, తమ అధిష్టానంతో నేరుగా మాట్లాడటం మేలేమో.

The Capital Conundrum

  The issue of bifurcation appears to be any body’s guess. But if the bifurcation does happen, which City in Andhra and Rayalaseema area will be that Hot City? It seems as tough as selecting the City for Hosting Olympics! As in the case of presenting their credentials for allowing them to host Olympics, even the Cities and Towns are vying with each other for that coveted status with their qualifications.   Though it is evident that, given a choice of making a decision, the majority of Andhra people want the state to be united, in their hearts, nevertheless they are also thinking what if the State is divided? With the Congress going steadfast in the case of bifurcation, the issue of where the capital is going to be located is slowly gaining currency.   The issue is also important in the sense that the entire discussion of whether the state should be divided or not is getting focused only on Hyderabad. The city of Hyderabad, a sleeping beauty just a few decades back has become into a bustling metropolis with around 75 lakhs population. Its’ indeed a stark reality that the City of Hyderabad, where in the people of Andhra and Rayalaseema region have put in their fortunes, is the bone of contention.   The fact that the place where normal people have put their hard earned money to acquire a flat of a house or a plot, suddenly is not going to be their States capital and they are going to be just staying there is difficult to digest. But, the issue is that these people have put their money in the city just because they came here migrating from their place for good livelihood. T   he same migration will also happen tomorrow to the new capital. Its beyond doubt that the new capital of Andhra irrespective of the proposed regulation not to make it clutter, will be bustling. The population will definitely make the area grow in leaps and bounds, with their needs of housing, education, markets, clothing, infrastructure, industries, IT, Biotech..what not!!   The provision of Raj Bhavan, Assembly, Council, Secretariat, High Court, various government buildings, Airport, Higher education institutes, more Universities, four and six lane roads, IT, infrastructure, Pharma, industries, parks, housing…etc etc will make the City a Dream City in the next one and half to two decades. All this means, enough of construction work to feed the appetite of various construction firms, for which Andhra is famous for. The number of jobs that all these initiatives will create and the amenities required for them will spur good amount of economic activity around the city.   All this will augur well for the new Capital City. Then why not any city vies for that coveted tag of Capital City then?   Any Capital in the Indian context has been a driving force for the economy of that area. It will be foolhardy at least in the present times, to think of growth without having a great capital city!! In this scenario, the Capital City of Andhra, if formed, has acquired enormous importance.   Then now the discussion centers on the probable Cities / Towns of Andhra which will become the capital. Right from the Political capital of Andhra Pradesh, Vijayawada, to the Port City of Andhra Pradesh, Vishakapatnam, to the Spiritual Capital of Andhra Pradesh, Tirupati, every City is vying for the status.   In between these cities, Ongole, with the tag of having vast government lands, Kurnool, being the capital of previous Andhra State, Rajamundry, with its varied heritage are competing for the capital status.   We will discuss the viability and the credentials of each of the Capital City contender in detail in the coming days. (To be continued)   (By: Neelayapalem Vijay Kumar)

మోడీ.. జర భద్రం!

      ఇప్పుడు దేశమంతా నరేంద్ర మోడీ వైపు ఆశగా చూస్తోంది. తమను కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తప్పించే ఏకైక శక్తి నరేంద్ర మోడీ అని దేశ ప్రజలు భావిస్తున్నారు. మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో వున్న కొన్ని లోపాలను ప్రజలు క్షమించడం ప్రారంభించారు. బీజేపీ మీద వున్న మతతత్వ ముద్రను మోడీ తుడిచేస్తారని భావిస్తున్నారు. 2014 ఎన్నికలలో మోడీని ప్రధాని చేయడం కోసం ఎదురు చూస్తున్నారు.   గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్న మోడీ దేశానికి ప్రధాని అవడం కొన్ని శక్తులకు ఇష్టం లేదు. ఆయన్ని దేశానికి ప్రధానమంత్రి కాకుండా చేయడానికి, అవసరమైతే వ్యక్తినే కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద శక్తులు మోడీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్నీమధ్య పాట్నాలో మోడీ మీటింగ్ సందర్భంగా జరిగిన బాంబు పేలుళ్ళు! మోడీకి తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర నిఘా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మోడీకి భద్రత పెంచాలని భారతీయ జనతాపార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే బీజేపీ విజ్ఞప్తిని కేంద్రం లైట్‌గా తీసుకుంది. మోడీకి ఆల్రెడీ ఎన్.పి.జి. భద్రత వుందని, ఆ భద్రత స్థాయిని ఎన్.పి.జి.కి పెంచాల్సిన అవసరం లేదని కేంద్రం సమాధానమిచ్చింది. అయితే బీజేపీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. కేంద్రం మోడీకి ఉద్దేశపూర్వకంగానే భద్రత పెంచడం లేదని ఆరోపిస్తోంది. మోడీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు వుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచడానికి నిరాకరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ భద్రత విషయంలో కేంద్రం అలసత్వంతో వ్యవహరించడం భావ్యం కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ దేశానికి మోడీ అవసరం ఎంతో వుంది.. తనకోసం కాకపోయినా.. కాంగ్రెస్ కబంద హస్తంలో ఇరుక్కుపోయిన ఈ దేశాన్ని కాపాడ్డం కోసమైనా మోడీ.. జర భద్రం!

కాంగ్రెస్‌కి ఆటలైపోయింది!

      తెలుగు ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటోంది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండేది ఇంకా నాలుగైదు నెలలే కాబట్టి ఈలోపు సాధ్యమైనంత ఎక్కువగా ఆడుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు తెలుగు ప్రజల గుండెలు మండిపోయేలా చేస్తోంది. తెలుగు ప్రజలు ఈ ఆవేదనలో వున్నా కనికరించని కాంగ్రెస్ పార్టీ తన ఆటలు కంటిన్యూ చేస్తోంది.   కేంద్రం నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా సమైక్య రాష్ర్టాన్ని కోరుకుంటున్నారో లేక అధిష్ఠానం ఆడమన్నట్టు ఆడుతున్నారో గానీ, మొదటి నుంచీ సమైక్యవాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టెక్నిక్కులను అర్థం చేసుకోలేని సామాన్య ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యవాదిగానే నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, తెలుగు ప్రజల మెడమీద గుదిబండ అయిన దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అంగీకరించారని ప్రకటించడం తెలుగు ప్రజల్ని హతాశులను చేసింది. ఒక్క పూటలో ముఖ్యమంత్రి ఇలా ప్లేటు తీప్పేశారేంటా అని బాధపడేలా చేసింది. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని, తాను రాష్ట్ర విభజనకు అంగీకరించానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని ప్రకటించారు. ఏంటీ డ్రామాలు? ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొంత ప్రాపర్టీనా? ఒకపక్క తెలుగు ప్రజల గుండెలు మండిపోతూ వుంటే ఇలాంటి చెలగాటాలు ఆడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు పద్ధతి కాదు. దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలుచుకుంటే తనని తరిమికొట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చేసుకుంటే మంచిది. తెలుగు ప్రజలతో ఇంకా ఆడుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆటలని తెలుగు ప్రజలు త్వరలో కట్టిస్తారు.

రాహుల్ చచ్చు తెలివి!

      ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ కన్‌ఫమ్ అయిపోయింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ నెత్తిన తెల్లగుడ్డేనన్న విషయం అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను ప్రధాని కాలేమోనన్న భయం రాహుల్ గాంధీని పట్టి పీడిస్తోంది. ఆ భయంతోనే తానేం మాట్లాడుతున్నాడో తనకే అర్థంకాని స్థితిలో వున్నాడు. జనాన్ని బుట్టలో పెట్టడానికి మామూలు తెలివితేటలు పనికిరావని చచ్చు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు.   చచ్చు తెలివితేటలంటే జనానికి చావుల పేరు చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నించడం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో వుంది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. మొన్నామధ్య జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, దేశం కోసం తన నాయనమ్మ, తన తండ్రి చనిపోయారని,  తనను కూడా తీవ్రవాదులు చంపే అవకాశం వుందని ప్రకటించిన రాహుల్ అందరి చేతా తలంటి పోయించుకున్నాడు. తన కుటుంబంలో జరిగిన మరణాలని, తనకున్న ప్రాణభయాన్ని సాకుగా చూపి ఓటర్ల నుంచి సానుభూతి పొందాలని రాహుల్ ప్రయత్నించడాన్ని ఎవరూ హర్షించలేదు. చావుల ప్రస్తావన తెస్తే ఒకసారి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తినా రాహుల్ గాంధీలో మార్పు రాలేదు. మరోసారి తన చచ్చు తెలివితేటలు ప్రదర్శించాడు. ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆమధ్య జరిగిన మావోయిస్టుల దాడి సంఘటనని ప్రస్తావించాడు. ఛత్తీస్‌ఘడ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, మావోయిస్టుల దాడిలో కేంద్ర మాజీ మంత్రి వి.సి.శుక్లా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడితోపాటు చాలామంది కాంగ్రెస్ పార్టీవాళ్ళు చనిపోయారని అన్నాడు. ఇంతటి ప్రాణ త్యాగాల పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటేయాలన్నాడు. మావోయిస్టుల దాడిలో జరిగిన మరణాలను ప్రస్తావించి ఓటర్ల నుంచి సానుభూతి పొందడానికి రాహుల్ ప్రయత్నించడం మరోసారి వివాదాస్పదం అయింది.

ఓడే పందెంకోడి అంబటి!

      ఉపయోగపడినంత వరకు ఉండనీయ్... పనికిరాడనుకుంటే బయటకి తరిమేయ్.. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి ఇప్పటికే చాలా మంది నాయకులను ఆ పార్టీ బయటకి సాగనంపింది. ఆమధ్య జగన్-సోనియాగాంధీకి వున్న అండర్‌స్టాండింగ్ విషయంలో నోరుజారిన ఎంపీ సబ్బం హరికి జగన్ పార్టీ జెల్ల కొట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినప్పటికీ జగన్‌కి బాహాటంగా మద్దతు పలికిన సబ్బం హరికి జగన్ చెల్లుచీటీ రాస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ అలా జరిగిపోయింది. ఎవరూ ఊహించని దానిని చేయడమే జగన్ సార్ అపజయ రహస్యం.   నిన్నగాక మొన్న కొండా సురేఖమ్మని కూడా పార్టీ వదలిపోయేలా పొగపెట్టారు. పార్టీలో హెరాస్‌మెంట్ తట్టుకోలేక కొండా సురేఖ వైసీపీకి గుడ్ బై కొట్టేసింది. జగన్ పార్టీ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న కొండా సురేఖకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చివరికి దక్కిన గౌరవం అది! పార్టీ అభివృద్ధి కోసం పాటు పడిన వాళ్ళకి జరుగుతున్న అవమానాలను చూస్తున్న సీనియర్ నాయకులు తమకి కూడా ఆ గతి ఎప్పుడు పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలో  త్వరలో పడబోయే వికెట్ అంబటి రాంబాబుదేనని తెలుస్తోంది. పసలేని పార్టీ విధానాలను పెద్ద గొంతుతో వినిపించే అంబటి రాంబాబుని గతంలో జగన్ కొంతకాలం కంట్రోల్‌లో పెట్టాడు. పార్టీలో తనకంటే ఎదిగిపోతున్న అంబటిని చాలావరకు అదుపుచేశాడు. అయితే అంబటి కంటే గట్టి వాయిస్ పార్టీలో లేకపోవడంతో ఆయన ‘సేవలు’ తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించుకుంటున్నాడు. అంబటి వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నాడు. సత్తెనపల్లి ఏరికోరి సత్తెనపల్లి ఇన్‌ఛార్జ్ పదవి కూడా తీసుకున్నాడు. అయితే ఆ నియోజకవర్గంలో జగన్ సర్వే జరిపిస్తే ఆ నియోజకవర్గంలో అంబటి ఆరు నూరైనా గెలవడని రిపోర్ట్ వచ్చింది. దాంతో వచ్చే ఎన్నికలలో అంబటికి సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఖరారైపోయింది. అంబటి మాత్రం నత్తెనపల్లి విషయంలో రాజీపడటం లేదు. ఈ నేపథ్యంలో అంబటి పార్టీని వీడటం కానీ, ధిక్కార స్వరం వినిపిస్తున్న అంబటిని పార్టీ నుంచి తొలగించడం గానీ జరగడం ఖాయమని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. పందెంలో గెలవని కోడిని ఎలా బలి చేసేస్తారో అంబటి కూడా త్వరలో అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీడలో వుండి, ఎన్నికలలో టిక్కెట్లు ఆశిస్తున్న అందరి నియోజకవర్గాల్లో జగన్ సర్వే చేయించాడట. తప్పకుండా గెలుస్తారని రిపోర్ట్ వచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లిచ్చి, గెలవరని తెలిసిపోయిన వారిని పార్టీ నుంచి సాగనంపాలని జగన్ డిసైడ్ అయ్యాడట. తమకు టిక్కెట్ రాదని అర్థం చేసుకున్న చాలామంది వైసీపీ నాయకులు పార్టీ నుంచి సైడైపోవాలని అనుకుంటున్నారట.

టీజీ గారి అతి తెలివి!

      విభజనవాదులు ఎవరికైనా అదనపు తెలివితేటలు కావాలంటే రాష్ట్రమంతి టీజీ వెంకటేష్ దారి దగ్గర పొంగి పొర్లుతున్న అతి తెలివి తేటల నుంచి అప్పు తీసుకోవచ్చు. పేరులో టీజీ వున్నా సమైక్యవాదినని చెప్పుకునే టీజీ వెంకటేష్ రాష్ట్రం విడిపోదని సీమాంధ్ర ప్రజలని చాలాకాలం మభ్యపెట్టాడు. సీమాంధ్రలో వున్న ఇలాంటి పెద్దమనుషుల మాటలు నమ్మిన సీమాంధ్రులు ఇప్పుడు నిండా మునిగిపోయారు. తెలంగాణకి అడ్డుపడతా... ఊడబొడిచేస్తా అని ఏవేవో స్టేట్‌మెంట్స్ ఇచ్చి వార్తల్లో ఒక వెలుగు వెలిగిన టీజీ వెంకటేష్, కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాక సైలెంటైపోయాడు.     ఇంతకాలం సమైక్య హీరోలా పోజులు కొట్టి, పులిలా గర్జించిన టీజీ వెంకటేష్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం వంటింట్లో పిల్లిలాగా మ్యావ్ అంటున్నాడు. తాజాగా టీజీ మాట్లాడిన మాటలు సమైక్యవాదుల రక్తం మరిగేలా చేస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం గట్టిపట్టుదలతో ఉండటానికి కారణం సమైక్య ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్లే కారణమట. సమైక్యవాదులే కేంద్రం రెచ్చిపోయి హడావిడిగా విభజన చేయడానికి నూటికి నూరుశాతం కారణమట. ఇంతకీ సమైక్య ఉద్యమంలో జరిగిన అల్లర్లు ఏమిటయ్యా అని అడిగితే, సమైక్యవాదులు రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, సోనియాగాంధీకి సమాధి కట్టడం.. ఇవేనట! తాము చేసిన విజ్ఞప్తులకు కరిగిపోయి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రక్రియను నిలిపేసేదేనట! కానీ, సీమాంధ్రులు పైన పేర్కొన్న అల్లర్లు చేయడం కారణంగానే సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా హర్టయిందట. అందువల్లే తమ మాట వినకుండా విభజన చేసేస్తున్నారట. ఇలాంటి వంకర మాటలు మాట్లాడడానికి టీజీకి నోరెలా వస్తోందోనని సమైక్యవాదులు మండిపడుతున్నారు. టీజీ వెంకటేష్‌లో నిన్నటి వరకూ నిద్రపోయిన మరో వాది కూడా బయటికొచ్చాడు. ఆ వాదిపేరు రాయల తెలంగాణ వాది. రాయలసీమలో చాలామంది రాయల తెలంగాణని కోరుకుంటున్నారంటూ తానేం కోరుకుంటున్నాడో చెప్పకుండానే చెప్పేశాడు. ఇంతకాలం ఇలాంటి నాయకుడిని నమ్మినందుకు సీమాంధ్రులు చెంపలేసుకోవాలి.  

ఉద్యమానికి ‘వంద’నం!

      రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటూ సీమాంధ్ర ప్రజలు చేస్తున్న శాంతియుత ఉద్యమం వంద రోజుల మైలురాయిని దాటింది. భారతీయ ఉద్యమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఈ వందరోజుల్లో లిఖించింది. గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్యోద్యమం తర్వాత అంత శాంతియుతంగా, అంత ప్రభావవంతంగా, అంత ఐకమత్యంగా జరుగుతోన్న ఉద్యమం ఇదేనని దేశమంతా కీర్తిస్తోంది. ఉద్యమమంటే ఇలా వుండాలని, దేశంలోని ఏ ఉద్యమకారులకైనా సీమాంధ్రులు చేస్తున్న ఈ ఉద్యమం స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసలు లభిస్తున్నాయి.   ఉద్యమమంటే హింస, ఆస్తుల ధ్వంసం, పోలీసుల మీద దాడులు, రాళ్ళు విసరడం అనుకునేవాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకునేలా సీమాంధ్రుల ఉద్యమం విజయవంతంగా కొనసాగుతోంది. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నాయకుడు లేని ఉద్యమం. ప్రతి ఒక్క తెలుగువాడూ నాయకుడై నడిపిస్తున్న ఉద్యమం.. రాజకీయ నాయకుల ఊహలకు అందని ఉద్యమం. రాజకీయ నాయకులకు నో ఎంట్రీ అని స్పష్టంగా చెప్పిన ఉద్యమం. శాంతియుతంగా, స్ఫూర్తివంతంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని చూసి విభజనవాదులు నోళ్ళు తెరిచారు. కుళ్ళుబుద్ధితో ఎన్నో ఆరోపణలు చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని చులకన చేస్తూ ఎన్నో కామెంట్లు చేశారు. ఉద్యమం మొదలైన దగ్గర్నుంచీ ఇది చల్లారిపోయే ఉద్యమమంటూ అవాకులు చవాకులు పేలారు. ఇప్పుడు వందరోజులు పూర్తిచేసుకున్న ఉద్యమాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థంకాక, ఎలా విమర్శించాలో బుద్ధికి తట్టక గప్‌చుప్‌గా ఉండిపోయారు. సీమాంధ్రలో ఉద్యమం ఒక్కరోజున కూడా విశ్రమించలేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఎక్కడ విన్నా సమైక్య హోరే! ఒక్క లాఠీ కూడా విరక్కుండా, ఒక్క లాఠీఛార్జ్ కూడా జరక్కుండా, ఒక్క గొడవ కూడా జరగకుండా జరుగుతున్న సమైక్య ఉద్యమానికి పోలీసులు కూడా సెల్యూట్ చేస్తున్నారు. పట్టు విడవకుండా, మడమ తిప్పకుండా వంద రోజులుగా సమైక్య హోరు ఢిల్లీకి చేరేలా చేస్తున్న సమైక్య ఉద్యమకారులకు వందనాలు!  

టీ కాంగీయుల వెటకారం!

      సీమాంధ్రుల మీద వెటకారాలు పోయే విషయంలో, వాళ్ళని తిట్టిపోసే విషయంలో టీఆర్ఎస్ నాయకులు, టీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా వున్నారు. టీఆర్ఎస్సోళ్ళు సీమాంధ్రులని ఒక తిట్టు తిడితే, మేం మాత్రం తక్కువా అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకటిన్నర తిట్లు తిడతారు. ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించే విషయంలో కూడా టీఆర్ఎస్, టీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా వెటకారాలు పోయారు. రెండ్రోజుల క్రితం జీఓఎంకి నివేదిక ఇచ్చిన టీఆర్ఎస్ అందులో తమ గొంతెమ్మ కోర్కెలన్నీ వివరంగా పొందుపరిచింది. సీమాంధ్రులు అసలు మనుషులే కాదు.. వాళ్ళకేమీ హక్కులు అవసరం లేదన్నట్టుగా వెటకారాలు పోయింది.     ఇప్పుడు తాజాగా టీ కాంగ్రెస్ నేతలు ఆ బాధ్యతని తీసుకున్నారు. వాళ్ళు కూడా జీఓఎంకి ఓ నివేదిక సమర్పించారు. వాళ్ళు కూడా ఆ నివేదికలో టీఆర్ఎస్‌ని మించిన వెటకారాలు పోయారు. ఆ నివేదికలో తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ళ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకి జాతీయ హోదా కల్పించాలన్నారు. తెలంగాణలో వైద్య, ఉద్యాన, మహిళా, పశు సంవర్ధక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. శంకర్‌పల్లి, నేదునూరు విద్యుత్ కేంద్రాలని వెంటనే ప్రారంభించాలన్నారు. వీటితోపాటు ఇంకా బోలెడన్ని కోరికల లిస్టు ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రత్యేక రాష్ట్రం కావాలి.. ఇంకా బోలెడన్ని కోర్కెలు తీర్చాలి. బాగుందయ్యా.. చాలా బాగుంది!  సరే ఈ కోరికల సంగతి పక్కన పెడదాం.   ఆ నివేదికలో సీమాంధ్రులని అవమానించే కోరికలు చాలా వున్నాయి.  సీమాంధ్రులకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు చాలా ఎక్కువైపోతుందట. సాధ్యమైనంత తక్కువకాలం వాళ్ళని హైదరాబాద్‌లో ఉంచాలట. అది కూడా హైదరాబాద్ మొత్తం ఉమ్మడి రాజధానిగా కాకుండా ఏదో ఒక మూల ప్రాంతాన్ని వాళ్ళకి కేటాయించి, ఆ ప్రాంతానికే వాళ్ళని పరిమితం చేయాలట. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణని ఇచ్చేసి, సీమాంధ్రులని తరిమేయడమే కాకుండా, తెలంగాణకే ప్రత్యేకంగా భారీ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలట. మొగుణ్ణి కొట్టి మొగసాలకొచ్చి ఏడ్చినట్టు సీమాంధ్రులని హైదరాబాద్ నుంచి తరిమేసి అన్యాయం చేయాలనుకుంటున్నదీ వాళ్ళే... మాకు ఇంకా న్యాయం చేయాలని మొత్తుకుంటున్నదీ వాళ్ళే!

తెలంగాణ తల్లి లొల్లి!

        తెలంగాణ ప్రజలకి కేసీఆర్ కుటుంబమే ఇప్పుడు పెద్ద దిక్కయిపోయింది. తెలంగాణ నాలుగు దిక్కుల్లో ఏ దిక్కులో చూసినా కేసీఆర్ కుటుంబమే కనిపిస్తోంది. తెలంగాణ మొత్తం తమ కుటుంబం జాగీరులాగా కేసీఆర్ ఫ్యామిలీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వ్యూహరచనలు చేస్తోంది. మొన్నీమధ్య జరిగిన బతుకమ్మ ఉత్సవాలనే చూడండి. ఎక్కడ చూసినా కేసీఆర్ కూతురు కవితమ్మే. కవితమ్మ ఎక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నా ఛానెళ్ళన్నీ పోటీపడి లైవ్ కవరేజ్ ఇచ్చాయి.   టీఆర్ఎస్ వాళ్ళచేత సీమాంధ్ర ఛానెళ్ళంటూ తిట్లుతినే ఛానెళ్ళు కూడా కేసీఆర్ ఫ్యామిలీని మంచి చేసుకోవడానికేమో అన్నట్టుగా కవితమ్మ పాల్గొన్న బతుకమ్మ వేడుకలని ఒక్కక్షణం కూడా మిస్ కాకుండా కవర్ చేశారు. కవితమ్మ చేసిన బతుకమ్మ వేడుకల మీద ప్రత్యేక ప్రోగ్రాములు రూపొందించారు. ఈ హడావిడి అంతా చూసి సామాన్యుడు ఇవి బతుకమ్మ ఉత్సవాలా.. కవితమ్మ ఉత్సవాలా అని సందేహపడిపోయాడు. ఇప్పుడు లేటెస్టుగా మరో పాయింట్ వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రతిష్టిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాలు కవితమ్మ పోలికలతో వుంటున్నాయట. విగ్రహాలను తయారు చేస్తున్న శిల్పులు మెహర్బానీ కోసం మోడల్‌గా కవితమ్మనే ఎంచుకున్నారో, లేక టీఆర్ఎస్ నాయకత్వం నుంచి అలాంటి ఆదేశాలు ఏవైనా అందాయో గానీ తెలంగాణ తల్లి విగ్రహాల్లో కవితమ్మ పోలికలు ఉట్టిపడుతున్నాయట. అది చూసి జనం నోళ్ళు నొక్కుకుంటున్నారట. తెలంగాణ తల్లి విగ్రహాల్లో కవితమ్మ పోలికలు కనిపిస్తూ ఉండటాన్ని ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందకృష్ణ మాదిగ వ్యతిరేకిస్తున్నారు. విగ్రహాల్లో కవితమ్మ పోలికలు ఉండటంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని లేనిపోని ఆడంబరాలతో రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిరాడంబరంగా ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తల్లిలో కనిపించాల్సిన పోలికలు కవితమ్మవి కావని.. చాకలి ఐలమ్మవని ఆయన అంటున్నారు.