బఠాణి బహు మేలు

  ఆకుపచ్చ బఠాణి కూరలో, రైస్ ఐటమ్స్ లో ఎలా వాడినా వాటి రుచి ప్రత్యేకంగా వుంటుంది. ఈ పచ్చి బఠాణీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే వాటిని రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా, మన ఆహరంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మంచి పోషకాలు వున్నాయి. 1. వీటిలో న్యూట్రియంట్లు, విటమిన్లు, యాంటిఆక్సిడెంట్లు సంమృద్ధిగా వున్నాయి. బీన్స్ తో పోలిస్తే కాలరీలు కూడా తక్కువ. వంద గ్రాముల బఠాణిలలో కేవలం 81  కాలరీలు మాత్రమే వుంటాయి. కొలస్ట్రాల్ అస్సలు ఉండదు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. 2. ఇక ప్రేగ్నంట్ గా వున్నప్పుడు ఈ బఠాణీ ని తరుచూ ఆహరం లో చేర్చుకోవటం ఏంతో మంచిది. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ విటమిన్లు, అధికంగా వుంటాయి వీటిలో. అవి కడుపులోని బిడ్డ ఎదుగుదలకి ఎంతో మేలు చేస్తాయి. 3. ఇక పిల్లలకి, పెద్దవారికి ఈ బఠాణీని ఆహరంలో చేర్చుకోవటం ద్వారా "సి " విటమిన్ లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. 4. ఇంకా ఈ బఠాణిల ద్వారా విటమిన్ " కె " " ఎ " కూడా లభిస్తాయి. ఎముకుల సాంద్రతని పెంచి, మెదడు పనితీరుని మెరుగు పరుస్తాయి ఆ విటమిన్లు. కంటి చూపు చక్కగా ఉండేలా చూస్తాయి. 5. వీలు అయినంత వరకు ఏదో ఒక రూపం లో పచ్చి బఠాణిని ఆహరంలో చేర్చుకోవటానికి ప్రయత్నించాలి. అన్ని రైస్ ఐటమ్స్ లో ఓ గుప్పెడు బఠాణి లని వేయటం, కూరలలో చేర్చటం వంటివి వాటి వినియోగాన్ని పెంచుతాయి. ఉడికించి చాట్ చేసి కూడా పెట్టచ్చు పిల్లలకి. ఆలు-బఠాణి, కాబేజీ-బటాని, ఇలా రకరకాల కాంబినేషన్లో ట్రై చేయచ్చు.

వరల్డ్ హెల్త్ డే: ఆహారం.. ఆరోగ్యం...

  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) పిలుపు మేరకు 2015, ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నాం. ఈ ఏడాది హెల్త్ డేని పురస్కరించుకుని మన ఆరోగ్యానికి హానికి కలిగించే ఆహార పదార్ధాలను మనం దూరం పెట్టాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తోంది. ఆహారం ద్వారా అనారోగ్యం ప్రబలకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది. ఇటీవలి కాలంలో ఆహారం కారణంగా అనారోగ్యం బాగా పెరుగుతోందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ సందర్భంగా “From farm to plate, make food safe.” అనే స్లోగన్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తోంది. ఒక ఆహార పదార్ధం తోట లేదా పొలంలో  వున్నప్పటి నుంచి అది రకరకాల ప్రాసెస్‌కి గురై మన నోటి దగ్గరకు వచ్చే వరకూ అనేక రకాల విధ్వంసాలకు గురవుతోంది. మొదట స్వచ్ఛంగా వున్న ఆహారం మనవరకూ వచ్చేసరికి అనేక రసాయన ప్రక్రియలకు గురవుతోంది. ఫలితం.. అమృతం లాంటి ఆహారం విషతుల్యమైపోతోంది. పైకి రుచిగా వున్నప్పటికీ, అలాంటి ఆహారం లోపల విషం వుంటోంది. ఈ విషయం గురించే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.   ‘‘ఆహార తయారీ అనేది పరిశ్రమగా మారిపోయిన తర్వాత, గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల ప్రపంచం చిన్నదైపోయిన తర్వాత ఏ దేశంలో తయారైన ఆహారపదార్ధాలైనా ఏ మారుమూల వున్న దేశానికి అయినా సులభంగా వెళ్ళిపోతున్నాయి. తయారీలో మాత్రమే కాకుండా ఆహార పదార్ధాల నిల్వ, రవాణా... ఇలా అనేక సందర్భాలలో ఆహార పదార్ధాలు విషపూరితం అవుతున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు మనం తినే ఆహారం ద్వారా మనలో చోటు సంపాదించుకుంటున్నాయి. ఈ విషయంలో మనం అప్రమత్తంగా వుండకపోతే అది చాలా విపరిణామాలకు దారితీసే అవకాశం వుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనర్ డాక్టర్ మార్గరెట్ చాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఆహార పదార్ధాల ద్వారా మనలోకి సరఫరా అవుతున్న బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు, రసాయనాల ద్వారా దాదాపు 200 రకాల అనారోగ్య సమస్యలకు మనుషుల్ని గురిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. కేవలం మాంసాహారాల విషయంలో మాత్రమే కాకుండా పళ్ళు, కూరగాయల ద్వారా కూడా ఇలాంటి విషాలు మన శరీరంలోకి చేరుతున్నాయని ఆయన వివరిస్తున్నారు.

How to increase your metabolism

What are Calories? Calories Are: -Units of energy your body uses to fuel its functions and activities. -Created from proteins, fats and carbohydrates (termed as macro nutrients) found in foods and beverages. -Necessary for the basic body functions like keeping the heart, brain and lungs functioning (also known as basal metabolism) -Essential to fuel activity – from the smallest hand gesture to a 5km run What is Metabolism? Metabolism basically refers to all the chemical processes that take place in the body in order to sustain life – allowing you to breathe, pump blood, keep your brain functioning and extract energy from your food. When you hear the term metabolic rate more accurately called basal (or resting) metabolic rate that refers to the number of calories your body at rest uses each day, just to keep all your vital organs functioning. The number of calories that you burn every day is directly related to your body composition. Think of your body as divided into two compartments. In one compartment is all the body fat; in the other compartment is everything that isn’t fat (e.g., bone, fluid, tissue, muscle) – that’s the fat-free compartment. The size of your fat-free compartment determines your metabolic rate, with every one pound of fat-free mass is burning about 14 calories per day. Since the fat-free compartment contains muscle tissue, one of the best things you can do to boost your metabolic rate is to strength-train to increase your lean muscle mass and supply enough protein to your body in all your meals. Remember muscle tissue burns more calories than fat tissue. Courtesy Glow with health wellness solutuions

Few Myths with meals that need to be dispelled

  Myth1: Skipping meals is a good way to lose weight! One popular approach people seem to be hearing and have unknowingly been following to lose weight is skipping a meal, usually a Breakfast. Studies show that people who skip breakfast and eat fewer times during the day tend to gain more weight than people who eat a healthy breakfast and eat portion controlled yet balanced nutrient loaded food four or five times a day. This is due to the fact that when skipping a meal, you feel hungrier and tend to overeat at the next meal and pay less attention to how full you are. Skipping meals also lowers down the metabolic rate of the body, burns more muscle rather than the fat which further slows down the process of burning calories. Myth2: If I eat anything after 8 p.m. I will put on more weight! The body burns more fat when you are more active, less fat when you are less active. But it does not store fat depending upon the time of the day. Fat storage depends on your basal metabolic rate (BMR). And in general BMR slows down as day passes by since we get less active by night and it is also not absorption time as per our body cycle. So it is not when you eat but what you eat and what your lifestyle is that makes the difference. If you want to boost BMR during evening time, include dietary fibre and good quality protein food in your evening snack so that you don’t over eat during the dinner time. Myth3 : Liquids don't add calories! Beverages can pack a surprising number of calories whether they are hot or cold! Most people who are conscious of their calorie intake make the mistake of only watching the calories in the solid foods they eat – completely ignoring the calories in the beverages they drink during the day… the tea or coffee consumed all day long (doused with cream and sugar), the sodas or colas at lunch or snack time (with free refills!), the tetra pack fruit juices (which are most often loaded with sugars and preservatives), the vodka and cranberry juice cocktails that help some people unwind at the end of the day. It may surprise people when all these are added up only to realize that they were taking close to 1000 calories a day from beverages alone. Courtesy: Glow with health wellness solutuions

WALNUTS - THE MEMORY BOOSTERS

A student’s life is filled with a lot of challenges. You are expected to be good at all the subjects. That’s not a problem at all. There is only one obstacle, when we try to live up to this expectation of people around us. That problem is called memory! No matter how hard we try some things just don’t register in our memory. If you are facing the same problem, this article is for you my friend. Here I will help you discover a simple solution to this complex problem. Do you know what that is? Walnuts! Yes, walnuts can help you improve your memory tremendously. Lets get into the details of the same. A research in the United States of America revealed that, those who consumed less than a handful of walnuts regularly were able to perform all the cognitive tests better than those who didn’t. The research was conducted on a large chunk of adult population of the American states aged between 20 - 60 years by the University of California. How are walnuts able to do this magic on human minds? This is because of a number of goodies that walnuts contain. The anti oxidants along with many vitamins and minerals, make walnuts a very good source of alpha-linolenic acid (ALA). You know what? Walnuts also give you the very essential omega 3 fatty acids that take care of not only your brain, but also your heart. This research is supported by a another one conducted by the same researchers on animals with the same result. It is also proven that walnuts have the capacity to prevent Alzheimer’s Disease in human beings. Improvements in learning skills, locomotor activity, motor coordination can be achieved just with regular intake of a handful of walnuts. Walnuts are also known to reduce anxiety behavior. So if you want to excel in exams just include walnuts in your diet... And nothing can stop you from being a topper!  -Kruti Beesam

What exactly are the benefits of drinking adequate Water?

Most often people have a tendency to reduce their water intake during winters and increase it during hot summers. However irrespective of weather changes on every single day our body needs and asks for sufficient water. So treat it well. Persons who drink good amounts of water regularly as per their body needs enjoy the following benefits. Read through and explore in your life. 1.Healthy glowing skin: A well hydrated skin prevents dry skin and formation of wrinkles. Increased water intake moisturizes the skin from inside. It maintains the elasticity of skin and gives young looks. Water acts as a fountain of youth. 2.Keeps Cardio Vascular system healthy: Researches have revealed that, drinking water regularly reduces the risk of heart diseases. The scientists say that dehydration increases the viscosity of blood and plasma which are risk factors of heart disease. 3.Good Digestion: Water is essential for digestion of food and absorption of nutrients. Well hydrated body cells function normally and efficiently. Water helps in expelling waste products produced during metabolism. It is a natural detox agent. 4.No Constipation: Inadequate consumption of water and lack of fiber in diet causes constipation. Drinking adequate water per day along with good fiber diet helps ease bowel movement and relieves constipation. 5.Eliminates dehydration: Dehydration can affect mental alertness. Frequent ingestion of water keeps the mind alert and prevents dizziness which occurs due to dehydration. 6.Regular Detoxification: In recent years our environment has been full of toxins like pesticides, industrial wastes, vehicle exhausts, contaminated food items etc. These toxins enter human body and get collected in the tissues. Drinking lot of water helps to eliminate these toxins from body. Hence drinking clean and pure water regularly in sufficient quantities helps flush these toxins and prevent diseases which arise from accumulation of these toxins. 7.Better Productivity: Your brain is mostly made up of water, thus drinking water helps you think better, be more alert and to concentrate more. 8.Less Cramps and Sprains: Proper hydration helps keep your joints and muscles lubricated, so you may less likely get cramps and sprains. 9.Reduce the Risk of Cancer: Related to the digestive system, some studies show that drinking a healthy amount of water may reduce the risks of bladder cancer and colon cancer. Water dilutes the concentration of cancer-causing agents in the urine and shortens the time in which they are in contact with bladder lining. 10.Lose Fat: Drinking water helps you lose fat because it flushes down the by-products of fat breakdown. Drinking water reduces hunger, it is an effective appetite suppressant so you will tend to eat less. Plus, water has zero calories. Apart from the benefits mentioned above, water regulates body temperature and boosts the immunity of body. So don't think twice and go ahead and keep drinking required plain water during all seasons. Remember water can never be replaced with fluids like Teas/Coffees/Arena-ted or Carbonated drinks/Dairy milk products. courtesy Glow with health wellness solutions

Where is health of our children heading towards

“Children today are sicker than they were a generation ago. From childhood cancers to autism, birth defects and asthma, a wide range of childhood diseases and disorders are on the rise. Our assessment of the latest science leaves little room for doubt; pesticides are one key driver of this sobering trend.” October 2012 report by Pesticide Action Network North America (PANNA) Today's parents are having their children’s pediatrician telling them that their 11-year-old son has Type 2 diabetes, or that their 16-year-old daughter has osteoporosis. No these are not genetic disorders! The out-of-control lifestyles created by adults over the past 30-40 years has led to a 50% increase in the diagnosis of Type 2 diabetes—the kind of obesity-related diabetes once known as "adult onset" because it wasn't usually diagnosed until the age 50 or older. "Our children today are malnourished". While childhood obesity in India is on rapid rise last two decades in urban India there are also millions of kids who are weak, low in energy and immunity. The studies have also shown how parents in India are mostly unaware that their children are underweight or overweight or obese. Most of them also assume that when they grow up as adults they will become normal. Parents in India need to be aware of the overall impact of current lifestyle in the future health of their children, and accordingly make necessary changes in the environmental factors that are in their control. They can reverse these trends if they start making their children understand importance of below items by also following themselves. * eating healthy nutritious food, * preferring plant based seasonal items free from harmful pesticides, * increasing physical activities, * discouraging unhealthy eating of junk, fatty and processed foods or carbonated drinks, * never allowing a child to skip regular meals, especially breakfast, * putting an end to the usage of food as a reward. -Lavanya Glow with Health Wellness Solutions

Truth about sugar in fruits

We sometimes hear people dismissing fruits saying they are full of sugar or loaded with carbs The truth is a fresh fruit offers so much more than the natural sugar it contains – including water, vitamins, minerals, fiber, antioxidants and phytonutrients (those naturally-occurring plant compounds that have wide ranging beneficial effects on the body). Where else can you get a package like that for about 50-75 calories per serving? Before dismissing foods as being loaded with sugar, or too high in carbs, consider not only the amount of sugar or carbs you are eating in a day, but the form of the carbohydrate, too. There is a big difference between the nutritional value of the natural and complex carbohydrates found in fruits and other plant foods and what’s found (or, more accurately, what’s not found) in the empty calories we eat from added sugars in processed food or carbonated drinks! Lets take a serving of fruit and see how much sugar are we talking about, as per nutritionist Susan Bowerman. An average orange has only about 12 grams of natural sugar (about 3 teaspoons) and a cup of strawberries has only about 7 grams – that’s less than two teaspoons. And either way, you are also getting 3 grams of fiber, about a full day’s worth of vitamin C, healthy antioxidants and some folic acid and potassium to boot – and it may only cost you about 50 or 60 calories By contrast, a 20-ounce bottle of cola will set you back about 225 calories and, needless to say, won’t be supplying any antioxidants, vitamins, minerals or fiber. You will just be gulping down some carbonated water, maybe some artificial color and flavor, and somewhere in the neighborhood of 60 grams of added sugar – about 1/3 of a cup. So called diet colas are equal culprits though they claim to be low in calories but loaded with artificial sweeteners that can harm metabolic syndrome of your body. Learn to Balance your Diet not once a while but daily! You need to provide enough of the right foods including colorful fruits and vegetables, protein, good carbohydrates and just enough good fats for the taste you want. You also need vitamins, minerals, antioxidants and fiber to provide the nutrition missing from your diet that your cells regularly need for good health, sometimes with usage of with dietary supplements.  -Lavanya Glow with Health Wellness Solutions

ఇనుము... తినుము...

శరీరానికి అవసరమైన మేరకు పోషకాలు తీసుకుంటేనే ఆరోగ్యం సక్రమంగా వుంటుంది.  ఏవి లోపించినా ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడక తప్పదు.  ముఖ్యంగా పోషకాల  లోపం  దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనతకు దారితీయచ్చు. నిజానికి రక్త హీనతతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని అంటున్నారు నిపుణులు. అందులోనూ పిల్లలలో రక్త హీనత ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు.  రక్త హీనతకి అసలు కారణం ఆహరంలో ఇనుము లోపించటమే. మరి మనకి అత్యంత అవసరమైన ఆ ఇనుము ఏయే ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది? పాలు, పెరుగు, తేనె, మాంసం, చేపలు, గుడ్డు సొన నుంచి  ఇనుము ఎక్కువగా లభిస్తుంది. పళ్ళలో.... అరటి పండు, ఆపిల్, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, దానిమ్మ. కూరగాయల్లో... టమోటో, ముల్లంగి, కాకర, ఉల్లిపాయ. ధాన్యాల్లో... బార్లి, జొన్నలు, వేరుశనగ, మొక్కజొన్న, గోధుమలు వంటి ధాన్యాలలో. ఇంకా.. బాదాం,శనగ పప్పు, కొబ్బరి, ఖర్జూరా, చెరకు, బెల్లం తదితరాలలో కావల్సినంత ఇనుము లభిస్తుంది. ఇక ఆకుకూరల విషయానికి వస్తే, మెంతి కూర, పుదీనా, పాలకూర, తోటకూరలలో ఒకదానిని  రోజూ తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటు ములగాకు దొరికితే అది కూడా తప్పక తినండి. ఎందు కంటే  దానిలో కూడా కావలసినంత  ఇనుము వుంటుంది కాబట్టి దానిని తింటే రక్త హీనత దగ్గరకి రాదు. -రమ

మంచి నిద్ర కావాలంటే

(ఈరోజు వరల్డ్ స్లీపింగ్ డే) నిద్ర మనిషికి అవసరమా?అయితే ఏ టైంకి పడుకోవాలి? అసలు మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి? ఇవి చాలా మందిని వేధించే ప్రశ్నలు. నిజానికి సరైన సమయానికి పడుకోక పోవడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా పసిపిల్లలు 12-18 గంటలు పడుకోవాలి. అదే మొదటి సంవత్సరంలో 14-15 గంటలు, మూడు యేళ్ళ వయస్సు దాక 12-14 గంటలు నిద్ర కావాలి, బడికి వెళ్ళే వయసులో 10-11 గంటలు, యుక్త వయస్సులో 8.5 నుంచి 9.5 గంటలు నిద్ర అవసరం. అదే పెద్ద వాళ్ళకి 7-9 గంటలు నిద్ర కావాలి అని నిద్ర శాస్త్రం చెబుతోంది. చాలామంది ఈ నిద్ర లేమి వల్ల బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని క్రమబద్ధమైన అలవాట్లు పాటిస్తే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. అందుకోసం  కొన్ని ఉపాయాలు చూద్దాం. నిద్రకు ఆహార నియమం ఎంతో అవసరం. కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక నిర్ధిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ తప్పవద్దు. పగటి వేళల్లో అతిగా టీ, కాఫీలు తాగకూడదు. ముఖ్యంగా నిద్రపోవడానికి ఒక గంటముందు అసలు తాగకూడదు. ఎందుకంటే ఇవి నిద్ర చెడగొట్టే పానీయాలు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా, బాదం పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. పడక గది ఎలాంటి దుర్వాసన లేకుండా… శుభ్రంగా ఉండేలా... చిందర వందరగా లేకుండా  చూసుకోవాలి. కొంతమందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. దీనివల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అందువల్ల పగలు నిద్ర పోవడం మానుకోవాలి. నిద్ర రానప్పుడు మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల చిన్నగా నిద్రలోకి జారుకుంటారు. నిద్రకోసం కొంతమంది నిద్రమాత్రలు వేసుకుంటారు. ఈ అలవాటు మానుకోవాలి. ఇవి ఆనారోగ్యానికి దారితీస్తాయి. రోజూ పడుకునే చోటే పడుకుంటే నిద్ర తొందరగా వస్తుంది. పదే పదే పడుకునే స్థానాలని మార్చుకోవద్దు. కొత్త ప్రదేశం వల్ల నిద్ర సరిగా రాకపోవచ్చు. అదే విధంగా నిద్రపోవడానికి గంట ముందుగా ఎటువంటి వ్యాయామం చేయకూడదు. తగినంత నిద్ర పోవడం ఎంత అవసరమో... ఎక్కువసేపు నిద్ర పోవడం అంత అనవసరం. -పావని గాదం  

కిడ్నీలను కాపాడుకోండి

    (ఈరోజు వరల్డ్ కిడ్నీ డే) మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. మనం తినే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో ప్రతి అవయవం మనకు అవసరమైనదే. అవి చక్కగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన శరీరంలో చాలా ముఖ్యమైనవి. మనం చేసే అశ్రద్ధ వల్ల ఈ కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. కొందరికి మూత్రానికి వెళ్తె మంట, మరికొందరికి మూత్రపిండాలలో ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు వచ్చాయంటే దానికి కారణం మీకు మూత్రపిండాలలో సమస్య మొదలైంది అని అర్ధం. కనుక మన మూత్రపిండాలు ఆరోగ్యంగా, మంచిగా పని చేయాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూద్దాం 1. శరీరానికి నీరు చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని శుభ్రపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కనుక తగినన్ని ధ్రవాలు తీసుకోవడం మంచిది. నీరు కిడ్నీలను శుభ్రంగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతుంది. 2. ముఖ్యంగా రోజులో ఎక్కువసార్లు మూత్రం పోయడం అలవాటు చేసుకోవాలి. ఇది కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది చాలాసేపు మూత్రాన్ని ఆపుకొంటారు. ఇది చెడు అలవాటు. ఇది మీ కిడ్నీలపై ఒత్తిడి కలిగిస్తుంది. 3. సిట్రస్ జాతికి చెందిన బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, క్రాన్ బెర్రీలు అధిక ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. అవి కిడ్నీ సమస్యలను తొలగిస్తాయి. 4. ఎక్కువ మసాలా, కారం మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి. 5. కొత్తిమీర కిడ్నీలను శుభ్రపరచడంలో సహకరిస్తుంది. కోరియండర్, పార్సిలీ, సిలాన్త్రోలు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి. 6. డయాబెటిస్ ఉన్నట్లయితే కిడ్నీలు వేగంగా చెడిపోతాయి. అందుకే డయాబెడిస్ ఉన్నవారు దానిని అదుపు చేసుకుంటే మంచిది. 7. కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని కొన్ని భంగిమలు కిడ్నీలు సవ్యంగా పని చేసేలా చేస్తాయి. 8. అధికంగా పని చేయడం వల్ల కూడా కిడ్నీలు అలసిపోతాయి. కనుక ప్రతి రోజు 8 గంటల పాటు తప్పక నిద్రపోవాలి. 9. అధిక ఒత్తిడికి గురవడం కూడా కిడ్నీలు పాడవడానికి ఒక కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా ఉండి కిడ్నీలు బాగా పనిచేసేలా చూసుకోండి. 10. అరుగుల అనేది ఒక పచ్చని ఆకు కూర అది మీ కిడ్నీల లోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అరుగుల కనుక రెగ్యులర్ గా తింటే కిడ్నీ సమస్యలతో బాధలు పడే వారికి మంచి రిలీఫ్ కలుగుతుంది.

హోలీ...ఇలా చేస్తే జాలీ

  హోలీ...ఇలా చేస్తే జాలీ   హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు. ఈ హోలీ పండుగ రోజు ఒకరికొకరూ రంగులు పూసుకుంటూ పిల్లలూ, పెద్దలు అనే తేడా లేకుండా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ రంగులు పూసుకునేప్పుడు చాలా బాగానే ఉంటుంది కానీ, అవి వదిలించుకోవాలంటేనే నానా తంటాలు పడాల్సి వస్తుంది. అలా కాకుండా హోలీ ఆడేముందే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రంగుల వల్ల చర్మం పాడవకుండా ఉండటమే కాకుండా తొందరగా వదిలిపోతాయి. ఆడటానికి ముందు: * రంగులు పూసుకోవడానికి ముందు కాళ్లు, చేతులు,  నూనె రాసుకోవాలి. * పొడవాటి దుస్తులు ధరించాలి. దీనివల్ల ఒంటికి రంగులు తక్కువ అంటే అవకాశం ఉంది. ఆడిన తరువాత: * హోలీ ఆడిన తరువాత ముందు ఒళ్లంతా చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ముందు ఆయిల్ రాసుకోవడం వల్ల రంగులు తొందరగా పోయే అవకాశం ఉంది. * లెమన్ మంచి బ్లీచ్ గా పనిచేస్తుంది. దీనితో ముఖానికి రబ్ చేసుకోవచ్చు   * ముఖం మీద ఉన్న ఆయిల్ పోవాలంటే కొంచం పెరుగు, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. * జుట్టుకు అంటుకున్న రంగులు పోవాలంటే హెర్బల్ షాంపూలు వాడటం మంచిది. మన ఇంట్లో వాడే సీకాకాయ, రీటా, ఆమ్లా లాంటివి వాడితే ఇంకా మంచిది. * ఒకవేళ జుట్టుకు రంగు వదిలించడం కష్టమైతే ఒక కప్పు పెరుగులో  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని కలిపి దానిని తలకు పట్టించి కొంచెం సేపు మర్ధనా చేసి తలస్నానం చేస్తే రంగు పోతుంది.

మీ వంటింట్లో హార్ట్ స్పెషలిస్టులు...

గుండెని ఆరోగ్యంగా ఉంచే ఓ నాలుగు సూపర్ ఫుడ్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆరోగ్యానికి మంచివని తెలిసినా మనం తేలిగ్గా తీసుకునే ఆ ఆహార పదార్థాల గురించి ఈమధ్య ఓ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.... అవేంటంటే.... మన రక్తంలోని ఎర్రరక్త కణాలు ఎలా వుంటాయి?  ఒకదానితో ఒకటి పేర్చినట్లు వుంటాయి. కొన్ని అతుక్కోకుండా జారిపోతుంటాయి. అలా ఉంటేనే ధమనులు చక్కగా పని చేస్తాయి. గుండె వ్యాధులు రాకుండా వుంటాయి. అయితే డయాబెటిస్‌తో బాధపడేవాళ్ళలో  ఇవి  ఒకదానితో ఒకటి అతుక్కునే ప్రమాదం ఎక్కువ.  అందుకే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా  ఎక్కువ . అయితే ఈ సమస్యని నివారించటంలో టమాటో సహాయపడగలదు అంటున్నారు ఆస్ట్రేలియన్ నిపుణులు. వీరు కొంతమందికి రోజూ ఓ కప్పు టమాటో రసం మూడు వారాలపాటు ఇచ్చారుట. వాళ్ళలో రక్తం పలుచబడటం గమనించారు. అంటే కణాలు ఒకదానితో ఒకటి అతుక్కునే గుణం తగ్గింది అన్నమాట. కాబట్టి టమాటోలు మంచి  ఆహరంగానే కాకుండా ఔ షధంలా కూడా పని చేస్తాయి అంటున్నారు వీరు. సో ఇది టమాటోలు దొరికే సీజనే కాబట్టి రోజూ ఓ కప్పు టమాలో రసం తాగండి... గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక  రోజుకి ఓ మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బలని అలా నోట్లో వేసుకునే అలవాటు చేసుకోండి చాలు. అవి మీ గుండెలోని కొవ్వు పని పట్టే పని చూసుకుంటాయి అంటున్నారు ఆహార నిపుణులు. గుప్పెడు శనగలు మీ గుప్పెడు గుండెని జాగ్రత్తగా కాపాడతాయంటే నమ్ముతారా?  కానీ ఇది నిజం. రోజూ ఒక 50 గ్రాముల శనగలు తింటే చాలు... అవి చెడ్డ కొలెస్ట్రాల్‌ని, ట్రైగ్జిజరైడ్లని తగ్గిస్తాయి.  దాంతో గుండెపోటు వచ్చే ముప్పు 24 శాతం తగ్గినట్టే. సోయా కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ని  తగ్గిస్తుంది. కాబట్టి రోజూ సోయాని ఏదో ఒక రూపంలో తీసుకోవటానికి ప్రయత్నించండి అంటున్నారు ఆహార నిపుణులు. -రమ