సూర్యనమస్కారాలు – ఆరోగ్యానికి సోపానాలు

రథసప్తమి వస్తోందంటే చాలు... ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడే గుర్తుకువస్తాడు. జీవానికి ఆలంబనగా, కర్మలకు సాక్షిగా ఉండే ఆ భగవానుని కొలిస్తే ఆయురారోగ్యాలలో లోటు ఉండదని పెద్దల నమ్మకం. అది ఒట్టి నమ్మకం మాత్రమే కాదనేందుకు ఆయన ఎదుట నిలబడి చేసే సూర్యనమస్కారాలే సాక్ష్యం. పైకి యాంత్రికంగా కనిపించే ఈ సూర్యనమస్కారాల వెనుక యోగశాస్త్రంలోని సారాంశం దాగి ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజుకి ఒక్క పదిహేను నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేస్తే చాలు అంతులేని ఆరోగ్యం, చురుకుదనం మీ సొంతం.     కొన్ని సూచనలు... ఉదయాన్నే నిద్రలేచి, ధారాలంగా గాలి వెలుతురు లభించే చోట ఈ ఆసనాలు వేయాలి. కాలకృత్యాలను తీర్చుకుని ఖాళీకడుపుతో వీటిని ఆచరించాలి. దుస్తులు మరీ బిగుతుగా కాకుండా కాస్త వదులుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సూర్యనమస్కారాలను చేసే సమయంలో ఒకో నమస్కారానికీ ఒకో మంత్రం ఉంది. ఆ మంత్రాలన్నీ సూర్యుని వివిధ నామాలను ప్రతిఫలిస్తాయి. అంతమాత్రాన తప్పకుండా మంత్రాలను చదువుతూ చేయాలన్న నియమం ఏదీ లేదు. కాబట్టి వీటిని కులమతాలకు అతీతంగా ఎవరైనా ఆచరించవచ్చు.     01) ఓం మిత్రాయనమః సూర్యునికి అభిముఖంగా నిటారుగా నిలబడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచి, బొటనవేళ్లు రెండూ ఛాతీకి తగిలేలా ఉంచాలి. నిదానంగా శ్వాసని తీసుకుంటూ మనసుని ఆ శ్వాస మీద కేంద్రీకరించాలి.     02) ఓం రవయేనమః చేతులను పైకెత్తి నిదానంగా వెనక్కి వంచాలి. ఆ సమయంలో నడుమూ, చేతులూ విల్లులాంటి ఆకారాన్ని తలపిస్తాయి. మన చూపులు కూడా పైకెత్తిన చేతులను అనుసరించాలి. దీనిని అర్ధచంద్రాసనం అని అంటారు.     03) ఓం సూర్యాయనమః రెండో ఆసనంలో పైకెత్తిన చేతులను, కాళ్లకు తగిలేలా పూర్తిగా కిందికి వంచాలి. వీలైతే ఈ సమయంలో ఊపిరి బిగపట్టమని చెబుతూ ఉంటారు. ఇలా చేతులను కిందకి వంచే సమయంలో తల కూడా మోకాళ్లకు తగిలేలా ఉంటే మరీ మంచిది. దీనికి పాదహస్తాసనం అని పేరు.     04) ఓం భానవేనమః పరుగుల పోటీకి సిద్ధపడినవారిలా కుడి పాదాన్ని వీలైనంత వెనక్కిలాగి, ఎడమ పాదాన్ని మాత్రం ముందుకు ఉరుకుతున్నట్లుగా సిద్ధంగా ఉంచాలి. ఈ సమయంలో తలను మాత్రం పైకెత్తి చూడాలి. దీనిని అశ్వసంచలనాసనం అంటారు.     05) ఓం ఖగాయనమః ఇప్పుడు ఎడమ పాదాన్ని కూడా వెనక్కి పెట్టి నడుము భాగాన్ని ఏటవాలుగా పైకి లేపాలి. ఈ సమయంలో మన శరీరం ఓ పర్వతాన్ని తలపిస్తుంది. అందుకే దీనికి పర్వతాసనం అని పేరు.     06) ఓం పూష్ణేనమః పర్వతాసనంలో ఉన్న శరీరాన్ని నిదానంగా నేలకు ఆన్చాలి. ఈ సమయంలో పొట్టభాగం మాత్రం నేలకు ఆన్చకుండా రెండు అరచేతులూ, కాళ్లూ, గడ్డం, ఛాతీ నేలకు ఆనేలా జాగ్రత్త తీసుకోవాలి.     07) ఓం హిరణ్యగర్భాయనమః వెల్లికిలా నేల మీద ఉన్న శరీరాన్ని శిరసు నుంచి నాభిదాకా పైకి లేపాలి. ఈ సమయంలో మన భంగిమ పడగ ఎత్తిన పాముని తలపిస్తుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగాసనం అని పేరు.     08) ఓం మరీచయేనమః ఐదో ఆసనం (పర్వతాసనం) ఇప్పుడు పునరావృతం అవుతుంది. శ్వాసను వదిలిన తరువాతే ఈ ఆసనం చేయడం మంచిది.     09) ఓం ఆదిత్యాయనమః ఈసారి నాలుగో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది. కాకపోతే ఈసారి కుడిపాదం బదులు ఎడమపాదాన్ని వెనక్కి వంచి, కుడి పాదాన్ని ముందుకు ఉంచాలి.     10) ఓం సవిత్రేనమః ఈ భంగిమలో మూడో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది.      11) ఓం అర్కాయనమః ఈ దఫా రెండో ఆసనాన్ని (అర్ధచంద్రాసనం) తిరిగి వేయాలి.     12) ఓం భాస్కరాయనమః మొదటి ఆసనంలో ఉన్నట్లుగా నమస్కార భంగిమకు తిరిగిరావాలి.  ఈ ప్రకారంలో చేసే సూర్యనమస్కారాల పరిక్రమతో శరీరంలోని ప్రతి అవయవమూ బలాన్నీ, స్వస్థతనూ పొందుతుందన్నది పెద్దల మాట. ఆ మాట నూటికి నూరు పాళ్లూ నిజమన్నది వాటిని ఆచరిస్తున్న వారి అనుభవం.     - నిర్జర.

మత్తు వైన్ లో కాదు… బ్రెయిన్ లో వుంటుందట!

  అంతా మాయ! ఈ జగమంతా మాయ! ఏంటీ… ఇదేదో వేదాంతం అనుకుంటున్నారా? అస్సలు కాదు! ప్రాక్టికల్ సైన్స్! ఇంతకీ… విషయం ఏంటంటే… మనం ప్రపంచంలో వుంటాం. కాని, నిజంగా జరిగేది ఏంటంటే… ప్రపంచం మన మనస్సులో వుంటుంది! మన మనస్సు లేదా మెదడు ఎలా భావిస్తే ప్రపంచం కూడా అలాగే వుంటుంది! అందుకే మన పెద్దలు అంతా మిథ్యా అనేశారు! మనం ఎలా భావిస్తే మన చుట్టూ పరిస్థితులు కూడా అలానే వుంటాయి! ఇందుకు వైన్ కూడా మినహాయింపు కాదు!   వైనుకు , వేదాంతానికి లింకేంటి అనుకుంటున్నారా? జర్మనీలో తాజాగా కొందరు రీసెర్చర్స్ చేసిన అధ్యయనం ప్రకారం సంబంధం వుంది! జర్మనీలోని ఓ యూనివర్సిటీలో కొందరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. దానిలో భాగంగా కొందరు వ్యక్తుల్ని ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేసే మిషన్ లో ప్రవేశపెట్టారు. తరువాత వారికి సాధారణ వైన్ తాగించారు. కాని, ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు! మార్కెట్లో కేవలం 12యూరోలు వుండే ఆ వైన్ ని 18 నుంచి 36యూరోల దాకా వెల వున్నట్టు బాటిల్స్ పై అచ్చు వేయించారు! ఆ రేట్ చూస్తూ వైన్ పుచ్చుకున్న సదరు వ్యక్తులు తమ మెదళ్లలో టేస్ట్ అదిరిపోయినట్టుగా ఫీలయ్యారట! కాని, నిజంగా వారు ప్రతీసారీ తాగింది 12యూరోలు విలువ చేసే మామూలు వైనే!   బాటిల్ పై వున్న రేటు చూసి ఒకే రకమైన వైన్ని రకరకాలుగా ఎందుకు ఫీలయ్యారు? ఎంత ఎక్కువ రేటు వుంటే అంత టేస్టీగా వున్నట్టు ఎందుకు అనిపించింది? ఎమ్ఆర్ఐ స్కాన్ లో తేలింది ఏంటంటే… వైన్ తీసుకున్న వారి మెదళ్లలో కొన్ని ప్రత్యేక భాగాల్లో అదిక ధర కారణంగా చలనం వచ్చిందట! తాము తాగుతున్నది కాస్ట్ లీ వైన్ అనే ఫీలింగ్ కారణంగా వారికి టేస్ట్ కూడా బావున్నట్టు అనిపించిందట! ఈ కారణంగానే కొన్ని కంపెనీలు కావాలని అదిరిపోయే లేబుల్స్ పెట్టి, గొప్ప గొప్ప బ్రాండ్ నేమ్స్ చూపించి అధిక ధర వసూలు చేస్తాయని రీసెర్చర్స్ అంటున్నారు!   మనిషి సుఖం, దుఃఖం, కష్టం, నష్టం అన్నీ మనసులోనే వుంటాయని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు. పాశ్చాత్యులు కూడా అన్ని ఫీలింగ్స్ బ్రెయిన్లోనే వుంటాయని ఒప్పుకుంటారు! కానీ, ఈ తాజా పరిశోధనతో మరో కొత్త విషయం తేలింది! అదేంటంటే… మత్తు వైన్ లో కాదు నిజంగా మెదళ్లలో వుంటుంది! దానికి ఒక్కసారి అధిక ధర వల్ల అద్భుతమైన టేస్ట్ లభిస్తుంది అన్న మత్తు ఎక్కించామంటే… ఇక మంచి నీళ్లు తాగినా మందు తాగినట్టే అనిపిస్తుంది! ఇదే మనసు చేసే మాయ అంటే!

తండ్రి పోలికలతో పుడితే ఆరోగ్యం

ఇంట్లో పసిపిల్లలు ఉంటే చాలు...  వాళ్లని చూడ్డానికి వచ్చిన వాళ్లందరినీ ఒకే ఒక్క ప్రశ్నతో చావగొట్టేస్తాం. ఆ ప్రశ్నేమిటో ఈపాటికి తోచే ఉంటుంది కదా! అదేనండీ... ‘పిల్లవాడిది తండ్రి పోలికా తల్లి పోలికా?’ అని. పిల్లలు నా పోలిక అంటే నా పోలిక అంటూ భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధాలే జరుగుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే... పిల్లలు కనుక తండ్రి పోలికతో ఉంటే వాళ్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదట! అమెరికాలో బింగామ్టన్‌ అనే ఓ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. బిడ్డ పోలికలకీ, ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వీళ్లు ఓ పరిశోధన నిర్వహించారు ఇందుకోసం పదీ, వందా కాదు ఏకంగా 715 కుటుంబాలని ఎన్నుకున్నారు. ఈ పరిశోధన కోసం బిడ్డ ఒక చోట తండ్రి మరో చోట ఉండే కుటుంబాలని ఎంచుకున్నారు. తండ్రి తన కుటుంబాన్ని చూసేందుకు ఎన్నిసార్లు తిరిగివస్తున్నాడో తెలుసుకునేందుకే అలాంటి కుటుంబాలను ఎంచుకున్నారన్నమాట. పిల్లలు తండ్రి పోలికతో ఉంటే... వాళ్ల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ కలుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. దాంతో వాళ్లతో పాటు ఎక్కువ రోజులు గడిపేందుకు ఇష్టపడతాడట. ఇలాంటి తండ్రులు నెలలో నెలలో దాదాపు రెండున్నర రోజుల పాటు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లు తేలింది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం అంటే, వాళ్ల మంచిచెడులను కూడా జాగ్రత్తగా గమనించుకోవడమే కదా! అందుకే ఏడాది గడిచేసరికి తండ్రి పోలికలు ఉన్న పిల్లలు మరింత ఆరోగ్యంగా కనిపించారట. -Niranjan  

తేనెని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా!

  మనకి అందుబాటులో ఉన్న పదార్థాల్లో తేనెని మించిన మందు లేదు. దగ్గు తగ్గాలన్నా, డైజషన్‌ బాగుపడాలన్నా, నేచురల్ యాంటీబయాటిక్‌లా పనిచేయాలన్నా... తేనె గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తుంది. తేనెలో ఉండే ప్రొటీన్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ ఒంటికి కావల్సిన బలాన్ని కూడా అందిస్తాయి. తేనెలో ఫ్రక్టోజ్‌ అనే షుగర్‌ ఉంటుంది. ఇది ఒకేసారి ఒంట్లో కలిసిపోకుండా, నిదానంగా కలుస్తుంది. దాని వల్ల ఒబెసిటీ కూడా అదుపులో ఉంటుంది. కానీ తేనెని దేనిలో కలిపితే effectiveగా ఉంటుందో మీకు తెలుసా! - పరగడుపునే ఓ చెంచాడు తేనెని గోరువెచ్చటి నీటిలో తీసుకుంటే చాలా ఉపయోగం. గోరువెచ్చటి నీటిలో తేనె పూర్తిగా కరిగిపోతుంది. నాలుక దగ్గర నుంచి కడుపు దాకా అన్ని అవయవాలను ఇది కవర్‌ చేసేస్తుంది. క్రమం తప్పకుండా ఇలా తీసుకోవడం వల్ల లివర్లో ఉన్న toxins అన్నీ బయటకి వెళ్లిపోతాయి. క్రమంగా కొవ్వు కణాలు కూడా కరగడం మొదలుపెడతాయి. - అవకాశం ఉంటే తేనెని గోరువెచ్చని నీటితో పాటు నిమ్మరసం కూడా కలిపి తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్‌ C ఉంటుందన్న విషయం తెలిసిందేగా! చాలామందికి రోజూ, కావల్సినంత విటమిన్ C అందదు. నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఆ లోటు తీరిపోతుంది. ఒంట్లో ఇమ్యూనిటీ పెరగాలన్నా, గుండెజబ్బుల సమస్య తగ్గాలన్నా, చర్మంలో గ్లో ఉండాలన్నా C విటమిన్ చాలా అవసరం. అంతేకాదు! నిమ్మరసంలో ‘గ్లూటధియోన్‌’ అనే పదార్థం ఉంటుందట. ఇది శరీరాన్ని detoxify చేసేందుకు, బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. - గోరువెచ్చటి నీటిలో ఓ స్పూన్‌ తేనెతో పాటు చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకున్నా మంచిదే! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటాబాలిజం రేట్‌ని పెంచుతుంది. దానివల్ల కొవ్వు కణాలు త్వరగా కరిగిపోతాయి. పైగా ఆహారం కూడా త్వరత్వరగా జీర్ణమైపోతుంది. - వెచ్చటి నీళ్లలోనే కాదు, గోరువెచ్చని పాలల్లో తేనె కలిపి తీసుకున్నా ఉపయోగమే! పాలల్లో ఎన్ని విటమిన్స్‌ ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇందులో తేనె కూడా కలిపడం వల్ల respiratory problems తో పాటు చాలారకాల digestion problems కూడా తగ్గిపోతాయి. తేనె, పాల కాంబినేషన్‌ రాత్రిపూట తీసుకోవడం వల్ల నిద్ర కూడా త్వరగా పడుతుంది.   

DIABETES ఉన్న చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారమివ్వాలి?

  మధుమేహానికి వయస్సుతో నిమిత్తం లేదు. పిల్లలకు కూడా వచ్చేస్తుంది. దానికి కుటుంబ నేపథ్యం ఓ కారణమైతే... ఆహారపు అలవాట్లు మరో కారణం. అంతేకాదు.. అధిక బరువు కూడా షుగర్ వ్యాధికి కారణమవుతోంది. పిల్లలకు షుగర్ వచ్చిందని తెలియగానే పెద్దల్లో ఎక్కడలేని కంగారు కనిపిస్తుంది. నిజానికి కంగారు అనవసరం. ముందు దానిపై మనం అవగాహన పెంచుకోవాలి. పిల్లలకు అందించే ఆహారం ఎంత మోతాదులో ఉండాలి, ఎప్పుడెప్పుడు వారు ఆహారం తీసుకోవాలీ... ఎంత తీసుకోవాలి.. ఈ విషయాలపై మనకు అవగాహన వస్తే చాలు. షుగర్ ని నియంత్రించడం పెద్ద పనేం కాదు. అంతేకాదు... ఆ అవగాహన పిల్లల్లో కూడా తీసుకురావాలి. అప్పుడు వాళ్లు డయాబెటీ అయినా.. చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. మిగతా పిల్లలతో పోటీగా ఎదగగలుగుతారు. అసలు పిల్లల్లో మధుమేహం కనిపిస్తే... మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మందులు ఎలా వాడాలి? ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఒక్కసారి క్లిక్ అనిపించండి.  https://www.youtube.com/watch?v=JVNNJVQrS-0

ఒక్క నెలలో మీ బరువు తగ్గిపోయే చిట్కా..

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య- అధిక బరువు. మనం తినే ఆహారం దగ్గర్నుంచీ చేసే పని వరకూ అన్నీ అధిక బరువుకే దారి తీస్తున్నాయని మనకి తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అప్పుడో చిట్కా అప్పుడో చిట్కా ప్రయత్నించి చూస్తేనే ఉంటాం కానీ... అవేవీ పని చేయడం లేదని నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఎక్కువ నీళ్లు తాగడం దగ్గర నుంచీ రాత్రి తిండి మానేయడం వరకూ ఒబెసిటీ తగ్గించుకు మనం పాటించని చిట్కా అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనం వినబోయే ఒక పద్ధతి నిజంగానే అధిక బరువుని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో ఉపయోగించే రెండు వస్తువులూ ఇంటింటా కనిపించేవే! అవే దాల్చిన చెక్క, తేనె. ఇప్పుడంటే దాల్చిన చెక్కని మసాలాల్లో మాత్రమే వాడుతున్నారు కానీ, దానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ దగ్గర నుంచీ డెంటల్‌ సమస్యల వరకూ దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఓ వరంలా పనిచేస్తుందట. మన ఒంట్లో కొవ్వు కణాలను కరిగించేందుకు, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అంతేకాదు! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటబాలిజంను పెంచుతుంది. దాని వల్ల అప్పటివరకూ పేరుకున్న కొలెస్టరాల్‌ కూడా కరిగిపోతుంది. దాల్చిన చెక్క బాగా వేడి చేస్తుందని పెద్దలు చెప్పడానికి కారణం ఇదే! ఇక తేనె సంగతి చెప్పేదేముంది! తేనె వల్ల లివర్‌ పనితీరు మెరుగుపడి, షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాని వల్ల ఇంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. అందుకనే ఒక నెల రోజుల పాటు దాల్చినచెక్క, తేనె కలిపి తీసుకుంటే... ఒబెసిటీ సమస్య దూరమైపోతుందని చెబుతున్నారు. దీని కోసం గోరువెచ్చటి నీరు ఉన్న ఒక కప్పులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్‌ తేనె కలిపి తీసుకోవాలి. పరగడుపునే ఖాళీ కడుపు మీద ఈ టానిక్‌ తీసుకుంటే మరీ మంచిది. కానీ కొంతమందికి దాల్చిన చెక్క పొడి వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు, రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. అధిక బరువు వల్ల కేవలం అందం మాత్రమే దెబ్బతినదు. మన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ బరువుతో పాటు పలకరించే అనారోగ్య సమస్యల గురించి తెలసిందే! అందుకే ఈ చిన్న చిట్కాతో మీ బరువు తగ్గించేసుకోండి. లైఫ్‌ ని హ్యాపీగా గడిపేయండి. నిర్జర