అంతా అయిపోయాకా ఇప్పుడెందుకీ యాత్ర?

జూలై 9న జ‌గ‌న్ మామిడి టూర్ సీజన్ అయ్యాకా వచ్చి ప్రయోజనమేంటంటున్న రైతులు చిత్తూరు జిల్లా మామిడి వ్య‌వ‌హారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై  9న జ‌గ‌న్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వ‌చ్చి ఇక్క‌డి రైతుల‌ను ప‌ర‌మార్శించ‌నున్నారు. కార‌ణం ఈ రైతుల‌కు త‌గిన ధ‌ర లేక అవ‌స్థ  ప‌డుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా  వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్ర అంటే తెలియందేముంది. వైసీపీ శ్రేణులు, నేతలు రెచ్చిపోయి ప్రకటనలు గుప్పించేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టేస్తున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా వంటి వారు జగన్ వస్తున్నాడనే సరికి తెలుగుదేశం కూటమి నేతలు వణికి పోతున్నారంటూ మాట్లాడేస్తున్నారు. అయితే రైతులు మాత్రం జగన్ ఓదార్పు అంటూ చేయనున్న యాత్రపై పెదవి విరుస్తున్నారు.  సీజన్ అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్ర‌యోజ‌న‌మేంట‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మా హ‌యాంలో మేం రూ. 4 వేలు స‌బ్సిడీ ఇచ్చాం.  మీ హ‌యాంలో  మీరేం ఇచ్చార‌ని నిల‌దీస్తున్నారు స్థానిక తెలుగుదేశం లీడ‌ర్లు.  ఈ రాజకీయ‌ పోరాటాల‌ను అటుంచితే.. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకు ఇంత క‌ష్టం ఎలా వ‌చ్చిందో చూస్తే.. ఇక్క‌డ టేబుల్ ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. తోతాపురి ర‌కాల‌ను ఎక్కువ‌గా పండించారు. కార‌ణం ఈ ప్రాంతంలో ఏకంగా 60 వ‌ర‌కూ గుజ్జు ప‌రిశ్ర‌మ‌లున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మామిడి రైతులు అధిక శాతం ఈ ర‌కాల‌నే పండించారు. దానికి తోడు ఈ ఏడాది వ‌ర్షాలు  కూడా స‌కాలంలో ప‌డడంతో మామిడి దిగుబ‌డి భారీగా పెరిగింది. దీంతో డిమాండ్ త‌గ్గింది. ఇదంతా అలా ఉంచితే.. ఇప్ప‌టికే ల‌క్ష క్వింటాళ్ల మామిడి గుజ్జు అలాగే నిల్వ ఉండి పోయింది. అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం దృష్ట్యా ఈ గుజ్జును ఎగుమ‌తి చేయ‌లేక పోతున్నారు. స్థానికంగా అమ్మ‌గ‌లిగే ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌లు కొంటాయ‌న్న భావనతో పండించిన తోతాపురిని ఎవ‌రూ కొన‌డం లేదు. ఆల్రెడీ ఉన్న నిల్వ‌ల‌ను అమ్ముకోలేక పోవ‌డంతో.. గుజ్జు ప‌రిశ్ర‌మ‌లు మామిడిని కొన‌డం ఆపేశాయి. దానికి తోడు ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ సిండికేట్ గా ఏర్ప‌డి.. మేలో తెర‌వాల్సిన ఫ్యాక్ట‌రీలు ఇంకా తెర‌వ‌కుండా నానుస్తున్నారు. దీంతో దిక్కు తోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయాడు మామిడి రైతు.  వీట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మామిడి రైతును ఆదుకోవ‌డంలో భాగంగా ఏకంగా 250 కోట్ల రూపాయ‌ల‌ను  కేటాయించింది. ఇదే అద‌నుగా భావించిన మాజీ సీఎం జ‌గ‌న్ ఇక్క‌డా రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఆరాట‌ప‌డుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కార‌ణం ఏమిటంటే జగన్ రావడం వల్ల అనవసర అలజడి తప్ప మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతులు, మార్కెట్ యార్డు ప్రతినిథులు తెగేసి చెప్పడమే.  అది ఆయ‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం పోరాటమైతే..  ఇక్క‌డ రైతులది జీవ‌న పోరాటం. వారి క‌డ‌గండ్ల‌ను కూడా జ‌గ‌న్ క్యాష్ చేసుకోడానికి రావ‌డం తమకు సుతరామూ ఇష్టం లేదంటున్నారు స్థానిక మామిడి రైతులు.

దిగి రానున్న టోల్ చార్జీలు!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.    ఎప్పుడో  2008లో టోల్‌ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్‌ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. ఈ సవరింపుల కారణంగా  సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ రహదారుల మార్గాల్లో టోల్‌ ఫీజు లెక్కింపు పద్ధతి మారుతుంది. ఈ మార్పు కారణంగా టోల్ చార్జీలు దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వాణిజ్య వాహన యజమానులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది.   వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారుల విభాగాలకు టోల్ రేటు తాజా సవరింపులతో 50 శాతం వరకూ తగ్గుతుంది.  

క‌మ‌లం ద‌క్షిణాది జపం?

ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్, ద‌గ్గుబాటి  పురంధ‌రేశ్వ‌రి, వ‌న‌తీ శ్రీనివాస‌న్.. ఈ ముగ్గురికీ కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌నున్న‌ట్టు స‌మాచారం. నిర్మ‌లా సీతారామ‌న్ ఆల్రెడీ ఆర్ధిక మంత్రిగా సుప్ర‌సిద్ధం. ఆమెను జాతీయ అధ్య‌క్షురాలిని చేస్తే.. అత్యంత కీల‌క‌మైన‌ ఆర్ధిక శాఖ నిర్వ‌హ‌ణ ఎవరికి అప్పగించాలన్నదొక చర్చ?  ఎందుకంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తరువాత అత్యంత కీలకమైన శాఖ ఆర్థిక శాఖే.  అంతే కాకుండా   మోడీ పాల‌సీలో ఫైనాన్స్ మినిస్ట్రీ అత్యంత ప్రధానమైన.. మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ. ఇక్క‌డ   పీక‌లోతు ప‌ని ఉంటుంది. అందులోంచి ఆమె ఇటు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని మోయాల్సి రావ‌డం అంటే అది సాధ్య‌మేనా? అన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఒక వేళ పార్టీ పగ్గాలు నిర్మలా సీతారామన్ కు అప్పగిస్తే.. రాష్ట్రపతిగా ఒక మహిళకు పట్టం గట్టడమే కాకుండా పార్టీ పగ్గాలు మరో మహిళకు అప్పగించిన ఘనత బీజేపీకి దక్కుతుంది.  అందు కోసం  ఆర్ధిక శాఖ‌ను మరొకరికి ఇచ్చి నిర్మలా సీతారామన్ కు పార్టీ పగ్గాలు అప్పగించే యోచన హైకమాండ్ చేస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.  మోడీ ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రిగా ప‌ని చేస్తూ అధ్య‌క్షులు ఉన్నవారు ఎవరు అంటే..  అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ  న‌డ్డా ఉన్నారు.  వారు ఇటు మంత్రి పదవి  నిర్వ‌హిస్తూనే అటు అధ్య‌క్ష బాధ్య‌త‌లూ  చేప‌ట్టారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌డ్డా కేంద్ర ఆరోగ్య మ‌రియు ర‌సాయ‌న  శాఖా మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాబట్టి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్షురాలైతే ఆమె జోడు గుర్రాల సవారీ చేయాల్సి ఉంటుంది. ఇక ద‌గ్గుబాటి  పురందేశ్వ‌రిని జాతీయ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలిని చేయాల‌న్న ఆలోచ‌న‌తో అధిష్టానం ఉందంటున్నారు. ఇప్ప‌టికే ఆమె ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క భూమిక పోషించారు. దీంతో కేంద్ర అధిష్టానం ముందు ఆమె ర్యాంకింగ్ బాగా పెరిగిన‌ట్టు తెలుస్తోంది. ఇచ్చిన టాస్క్ ఇచ్చిన‌ట్టు నెర‌వేర్చ‌డంలో మోడీ షాల ద‌గ్గ‌ర‌ పురందేశ్వ‌రికి గుడ్ మెరిట్సే ఉన్నాయి. కాబ‌ట్టి ఆమెకు  పార్టీలో కీలక ప‌ద‌వి ల‌భించే అవ‌కాశ‌ముంది. ఇక వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఎవ‌ర‌ని చూస్తే అంత డీఎంకే  హ‌వాలోనూ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోయంబ‌త్తూర్ సౌత్ లో అది కూడా ఒక పార్టీ అధ్య‌క్షుడైన క‌మ‌ల్ హాస‌న్ పై గెలిచారామె. ప్ర‌స్తుతం త‌మిళ శాస‌న స‌భ‌లో ఉన్న ఏకైక బీజేపీ మ‌హిళా నేత‌.  ఒక ర‌కంగా చెబితే ముగ్గురూ ముగ్గురే. ఇప్ప‌టికే నిర్మ‌లా సీతారామ‌న్ జీఎస్టీ  ద్వారా  దేశ ఆర్ధిక స్థితిగ‌తుల‌ను మెరుగు పరిచిన ఆర్ధిక మంత్రిగా ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో బ‌ల‌మైన పొజిష‌న్లోనే ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్షుడు జేపీ  న‌డ్డా, ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ తో  ఆమె భేటీ అయ్యారు. బేసిగ్గా  జేపీ  న‌డ్డా అధ్య‌క్ష ప‌ద‌వీ కాలం 2023 జ‌న‌వ‌రితోనే ముగిసింది. అయితే  2024 లో ఎన్నిక‌ల కార‌ణంగా జూన్ వ‌ర‌కూ పొడిగించారు. అప్ప‌టికీ ఏడాది గ‌డ‌చిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం.  సరిగ్గా ఇక్కడే పార్టీ పగ్గాలను మహిళా నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.  అది కూడా ద‌క్షిణాది మ‌హిళకు అప్పగించాలని అనుకుంటోంది. ఎందుకంటే ఇటు చూస్తే ఉత్త‌రాదిలో బీజేపీ  సీట్లు బాగా త‌గ్గ‌డం ప్రారంభించాయి. గ‌త ఎన్నిక‌ల్లో చావు ద‌ప్పి  క‌న్నులొట్ట‌బోయిన ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో ద‌క్షిణాది నుంచి గట్టి మద్దతు అవసరం ఉందని బీజేపీకి ఉంది.   అప్ప‌టికీ ద‌క్షిణాదిని క‌వ‌ర్ చేయ‌డానికి ఎన్నెన్నో ప్ర‌యోగాలు ప్ర‌య‌త్నాలు అవార్డులు- రివార్డులు- రాజ్య స‌భ్య‌త్వాలు ఇచ్చి చూస్తున్న బీజేపీకి త‌గిన గురి కుద‌డం లేదు. ద‌క్షిణాదిలో కేంద్ర మంత్రి ప‌ద‌వులు పొందిన  వారెవ‌ర‌ని చూస్తే తెలంగాణ  నుంచి ఇద్ద‌రు ఎంపీలు కిష‌న్, బండి సంజ‌య్. ఇక కేర‌ళ నుంచి సురేష్ గోపీ మాత్ర‌మే బీజేపీ  నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇక్క‌డ కావ‌ల్సింది ఒక సౌత్ ఐకానిక్ ఫేస్. ఒక ప‌క్క స‌నాత‌న  వార‌ధిగా సార‌ధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఎంక‌రేజ్ చేస్తూ సైడ్ వ‌ర్క్ ప్రారంభించింది  బీజేపీ అధినాయ‌క‌త్వం. అయితే సౌత్ కి ఒక బ‌ల‌మైన బీజేపీ ముఖ‌చిత్రం లేదు. గ‌తంలో ఎలా  చూసినా కూడా క‌నిపించిన ఒకే ఒక్క ఫేస్. య‌డ్యూర‌ప్ప‌. ఆయ‌న ఎరా ముగియ‌టంతో.. ఇప్పుడు కొత్త ముఖ‌చిత్రం అందునా మ‌హిళ అయితే బాగుండున‌ని చూస్తున్నారు. అలాగ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ని అధ్య‌క్షురాలిగా చేయ‌డం వ‌ల్ల కేవ‌లం మ‌హిళా కేట‌గిరికి మాత్ర‌మే స‌రిపోతుంది. బేసిగ్గా బీజేపీని గెలిపించిన మ‌హిళా ఓట‌ర్లు అధికశాతం గ‌ల రాష్ట్రాలేవ‌ని చూస్తే అవి మ‌హారాష్ట్ర‌, హ‌రియాణా, ఢిల్లీ.  అలా చూసినా కూడా సౌత్ లో ఏ స్టేట్ కూడా ఈ కేట‌గిరీ కింద‌కు రాదు. దానికి తోడు నిర్మ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల ప‌రిధిలోకి రాని  లేడీ లీడ‌ర్. ఆమె ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చెన్నై లోని ఒక నియోజ‌క‌వ‌ర్గం  నుంచి బీజేపీ  త‌ర‌ఫున బ‌రిలోకి దిగుదామ‌నుకున్నారు కానీ, ఎందుకో అది వ‌ర్క‌ట్ కాలేదు.  దానికి తోడు స్వ‌యంగా ఆమె.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో నిల‌బ‌డి ఖ‌ర్చు చేసేంత స్థోమత త‌న‌కు లేద‌ని తెగేసి చెప్పారు. సరిగ్గా అదే స‌మ‌యంలో ద‌క్షిణాదిలో గెల‌వాలంటే కులం గానీ, మ‌తం గానీ ఎక్కువ చూస్తార‌ని తెగేసి చెప్పిన స్వ‌భావం గ‌ల‌వారామె. ఈ క్ర‌మంలో నిర్మ‌ల కేవ‌లం ఒక ముఖ‌చిత్రంగా మాత్ర‌మే ఉంటారు త‌ప్పించి.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలను ప్ర‌భావం చేసే ప‌రిస్థితి పెద్ద‌గా  క‌నిపించ‌డం లేదు. ఇక పురందేశ్వ‌రి, వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఈ ఇద్ద‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అనుభ‌వ‌జ్ఞులుగానే చెప్పాలి. పురందేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీ  నుంచి రాజ‌మండ్రి ఎంపీగా గెలిచారు కూడా. ఈ లెక్క‌న పురందేశ్వ‌రికి మంచి ఛాన్సులు ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ త‌న‌య‌గా మాత్ర‌మే కాదు అటు బ‌హుభాషా కోవిదురాలిగానూ పేరు. గ‌తంలో  కేంద్ర మంత్రిగా  ప‌ని చేసిన అనుభ‌వం ఉండ‌టం వ‌ల్ల‌.. ఆమెకు  నేష‌న‌ల్ లెవ‌ల్ ఎక్స్ పోజ‌ర్ కూడా ఉంది. అంతేనా ఇటీవ‌లి కాలంలో ఆమె ఆప‌రేష‌న్ సిందూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ టూర్ లో ఒసభ్యురాలు కూడా. అంటే అంత‌ర్జాతీయంగానూ ఆమె త‌న స‌త్తా చాటారు. కాబ‌ట్టి.. అధ్య‌క్ష ప‌ద‌వికి ఈమె స‌రిగ్గా స‌రిపోతారు. కానీ అధిష్టానం ఆలోచ‌న ఎలా ఉందో తెలీదు. ప్ర‌స్తుతానికైతే పురందేశ్వ‌రికి బీజేపీ మ‌హిళా మోర్చా ప‌ద‌వి అయితే ఇచ్చేలా తెలుస్తోంది.  వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఇప్పుడిప్పుడే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు కాబ‌ట్టి ఎంతైనా ఆమె జూనియ‌ర్ కిందే లెక్క‌. పార్టీ ప‌ద‌వులు ఎన్ని చేసినా.. వాటిని నేష‌న‌ల్ ఎలెక్ష‌నీరింగ్ స్థాయికి కి విస్త‌రించాలంటే అందుకు  త‌గిన అనుభ‌వం కూడా అవ‌స‌రం. కాబ‌ట్టి ఈ ముగ్గురిలో బెస్ట్ సౌత్ ఫిమేల్ ఫ్యాక్ట‌ర్ ఆప్ష‌న్ గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తేలాల్సి ఉంది.

ఘోషా మహల్ కూ ఉప ఎన్నిక?!

తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీలలో ఆశావహులు తమతమ ప్రయత్నాలు షురూ చేసేశారు. అయితే జూబ్లీహిల్స్ కు మాత్రమే కాదు.. రాష్ట్రంలో మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమన్న పరిస్థితులు నెలకొన్నాయి.  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినప్పటికీ.. ఉప ఎన్నిక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం రాజసింగ్ తీరు పట్ల బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉందని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని నేడో, రేపో బీజేపీ అసెంబ్లీ స్పీకర్ ను కోరే అవకాశాలున్నాయనీ అంటున్నారు. తెలంగాణ బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖరాయాలన్న నిర్ణయం జరిగిపోయింది.  మొదటి నుంచీ రాజాసింగ్ వ్యవహార శైలిపై బీజేపీ అధినాయకత్వం ఆగ్రహంగానే ఉందంటున్నారు. పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడం, ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. పార్టీ చర్యలు తీసుకునేలోగానే ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి.. కావాలంటే తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసుకోండి అని సవాల్ కూడా చేశారు. దీంతో ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరుతూ లేఖ రాయాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చేసిందంటున్నారు.     అందుకే ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ వెంటనే ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని కోరిన వెంటనే అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావించలేం. ఒక వేళ స్పీకర్ బీజేపీ కోరిన మేరకు రాజాసింగ్ పై అనర్హత వేటు వేస్తే కనుక జూబ్లీహిల్స్ తో పాటే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఇది జరగాలంటే.. జూబ్లీహిల్స్ బై పోల్ షెడ్యూల్ విడుదలయ్యే లోగా బీజేపీ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించి, స్పీకర్ ను అనర్హత వేటు వేయాలంటూ లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ లేఖకు స్పీకర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఆమోదం తెలపాల్సి ఉంటుంది.  

కొనసాగుతున్న అమరనాథ్ యాత్ర.. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై)   ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సరిగ్గా 38 రోజుల తరువాత అంటే ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది.   ఈ యాత్రలో భక్తులు హిమాలయాల్లోని అమరనాథ్ గుహలో  మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు.   బాల్తాల్, పహల్గామ్ మార్గాల గుండా ఈ యాత్ర సాగుతుందిజ అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తుఅల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 581 కంపెనీల కేంద్ర సాయుధ  బలగాలు, డ్రోన్లు,   జామర్లతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.  

పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. శుక్రవారం (జులై 4) తిరుమల ఘాట్ రోడ్డులో తిష్టవేసిన ఏనుగుల గుంపు.. అటవీ అధికారులు వాటిని అడవులలోకి మళ్లించాయి. అయితే శనివారం (జులై 5)న జిల్లాలోని పులిచర్ల మండలం పాత పేట అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామానికి అతి సమీపంలో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు మామిడి, అరటి, టమాటా తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో పంటలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పొలాలకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగుల గుంపును దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

సమ్మక్క, సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును వ్యతిరేకిస్తున్న ఆదివాసీలు

మేడారం సమ్మక్క సారలమ్మ   గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయాలకు భిన్నంగా ఏకపక్షంగా సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పునకు నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అమ్మవారి గద్దల వద్ద ఆదివాసి గిరిజన సంప్రదాయం మాత్రమే ఉండాలని పట్టుబడుతున్నారు.   ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మల గద్దెల స్వరూపం మారనుంది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా శాశ్వత ప్రాతిపదికన గద్దెల డిజైన్‌ను మార్చనున్నారు. మేడారంలోని ఐటీడీఏ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన మహాజాతర సమీక్ష సమావేశంలో దేవాదాయ ఆర్కిటెక్ట్‌ రాజశేఖర్‌ ప్రొజెక్టర్‌ ద్వారా స్క్రీన్  పై గద్దెల డిజైన్‌ను ప్రదర్శించారు.  2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు కొత్త గద్దెలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గద్దెల కొత్త డిజైన్ ను ఆదివాసీ సంఘాలు మేడారం పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

పవన్ సినిమాలే కాపీ..పొలిటికల్‌గా కాదంటోన్న విజయ్

  డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ 'సీఎం కేండెట్ నేనే'నంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే ఆయన ఎవరితోనూ పొత్తులుండవ్. అంతా ఓన్ గా పవర్ లోకి రావడమే అంటూ కుండ బద్ధలు కొట్టేశారు. నా పార్టీ సీఎం అభ్యర్ధిగా నేనే ఉంటానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, కఠినమైన తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంత వరకూ రాణించగలరు? అన్నదొక డిబేట్. కారణం ఇక్కడ జయ తర్వాత ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. దానికి తోడు ఆమె నెచ్చెలి శశికళ సైతం రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. ఇక్కడొక వ్యాక్యూమ్ ఉన్న మాట నిజమే. అయితే స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో పొలిటికల్ మాస్ ఇమేజీని సొంతం చేసుకుని విజయ్ సీఎం పీఠం ఎక్కగలరా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. బేసిగ్గా దళిత సామాజిక వర్గానికి చెందిన 'విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్'(పూర్తి పేరు) ని ఇక్కడి ఓటర్లు ఎంత వరకూ ఆదరిస్తారు? అన్న క్వశ్చన్లు కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్ కులాలైన పన్నియార్లు, గౌండర్లు డీఎంకే, అన్నాడీఎంకేలుగా చీలిపోయాయి. ఇవిలా ఉంటే తమిళనాట గల కులాల వారీ శాతాలను పరిశీలిస్తే విజయ్ ప్రాతినిథ్యం వహించే దళిత ఓటు బ్యాంకు సుమారు ఇరవై శాతం మాత్రమే ఉంది. మిగిలిన 80లో అరవై శాతం బీసీలు, ఇంకో ఇరవై శాతం మరకూ ఇతర కులాలు ఉన్నాయి. కొంత కాలంగా దళిత పాంతర్స్ పార్టీ తమిళనాడు లో కూడా ఉంది. కానీ అది ఇప్పటి వరకూ ఏమంత ప్రభావం చూపించలేదు.ఇక వాటీజ్ విజయ్ ఆయన కెపాసిటీ ఏంటి? పూర్వాపరాలు ఎలాంటివని చూస్తే.. తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కాగా, తల్లి కర్ణాటక సంగీత కళాకారిణి. విజయ్ కి ఒక చెల్లెలు కూడా ఉండేది. పేరు దివ్య. అయితే ఆమె తన రెండో ఏటనే చనిపోయింది. ఆమె పేరిట దివ్య విజయ్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించడం మాత్రమే కాకుండా శుక్రన్ సినిమాలో ఆమె బొమ్మ కూడా చూపించాడు విజయ్.  తండ్రి తీసిన వెట్రి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఈ పదమే తన పార్టీ పేరులోనూ పెట్టుకున్నారాయన. విజయ్ పార్టీ పేరు 'తమిళిగ వెట్రి కళగం'. ఇక కమ్యూనికేషన్ లో పట్టా తీసుకుందాం అనుకున్న విజయ్ కి ఎలాగైనా సరే హీరో కావాలని ఉండేది. దీంతో డిగ్రీ మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసి వచ్చేశాడు. 18 ఏళ్ల వయసులో తండ్రి చంద్రశేఖర్ తీసిన 'నాలై తీర్పు' అనే చిత్రంలో తాను హీరోగా, కీర్తన హీరోయిన్ గా నటించారు. విచిత్రమేంటంటే తన తండ్రి చిత్రమే అయినా.. ఆడిషన్స్ లో పాల్గొని మరీ సెలెక్ట్ అయ్యాడు విజయ్. ఆ టైంలో విజయ్ కొట్టిన డైలాగ్ అన్నామలైలో రజనీకాంత్ డైలాగ్. అందుకే విజయ్ 'రజనీకాంత్ లేకుంటే తాను లేనని' అంటారాయన. ఇదిలా ఉంటే, తమిళనాట విజయ్ హవా.. 'రసిగన్' మూవీతో ఒక్కసారిగా పెరిగింది. విజయ్ కీ మన తెలుగు వారికీ ఉన్న అనుబంధం ఎలాంటిదంటే.. ఆయన గల్లి, పోకిరి, బద్రీ వంటి తెలుగు చిత్రాలు రీమేక్ చేసి మరీ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. వీటిల్లో పవన్ కళ్యాణ్‌ సినిమా బద్రి కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. "పవన్ కళ్యాణ్‌ ని తాను తెరపై కాపీ కొట్టానేమోగానీ తెరబయట- రాజకీయంగా కాదని" అంటున్నారాయన. తాను సొంత కాళ్లపై రాజకీయాల్లో నిలబడతానని అంటారు. 2017లో హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో 2వ స్థానంలో ఉన్న విజయ్ ప్రస్తుతం నెంబర్ వన్- తనే. మెర్సల్, తరీ, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలు వంద, నూట యాభై, రెండు వందల కోట్ల వరకూ వసూల్ చేశాయి. బీస్ట్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్సన్ల పరంగా విజయ్ కింగే అని నిరూపించింది. విదేశాల్లో రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్ విజయ్. బేసిగ్గా విజయ్ స్థానంలో అజిత్ ఇలాంటి పొలిటికల్ డయాస్ పైకి రావల్సింది. జయలతిత ఎంతో ముందు చూపుకొద్దీ.. 'తల' అజిత్ ని ఎంకరేజ్ చేయాలని చూశారు. కానీ ఆయనేమంత రియాక్ట్ కాలేదు. తానేంటో తన రేసింగ్ ఏంటో.. మూవీస్ ఏంటో.. అన్నట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతానికి కూడా అజిత్ నుంచి పెద్దగా పొలిటికల్ రియాక్షన్ లేదు.  కానీ తన తండ్రి ప్రేరణో లేక, మరొకటో తెలీదు కానీ.. విజయ్ మాత్రం అనూహ్యంగా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ దళిత్ కమ్యూనిటీ ఇక్కడ సిఎం పోస్టు వరకూ ఎదగలేదు. ఈ కొరత తీర్చడం కోసమైనా ఆయన ఈ పార్టీ, దాని నిర్వహణ చేయాలని భావించినట్టుగా కనిపిస్తోంది.అయితే తమిళ రాజకీయాల్లో కులాల ప్రస్తావన అధికంగా ఉంటుంది.  ఈ ప్రకారం చూస్తే ఆయన భారీ ఎత్తున అక్కడి లీడింగ్ క్యాస్ట్ లీడర్స్ ని తన పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న రోజా సైతం టీవీకేలోకి రావడానికి ఉత్సాహం చూపించగా.. అవినీతి మరక గల వారు మాకొద్దని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం. అయితే భర్త ఆర్కే సెల్వమణి దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కావడంతో.. ఆమెకు తలుపులు ఇంకా మూసుకుపోలేదని కూడా అంటారు. ఇదంతా ఇలాగుంటే అవినీతి మరక అంటని రాజకీయ నేతల్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించనలవి కాదు. అయితే విజయ్ తన తొలినాళ్లలో అభిమానులకే అధిక ప్రాధాన్యతనిచ్చేలా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు చూసుకున్న తర్వాత.. ఆయన రాజకీయ ధోరణిలో ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. అప్పటి వరకూ విజయ్ ఎన్ని కామెంట్లు చేసినా.. వాటికి పెద్దగా విలువనిచ్చేలా కనిపించడం లేదు. గతంలో అంటే, 2005లో తమిళ సినిమా ఫీల్డు నుంచి విజయ్ కాంత్ రూపంలో 'డీఎండీకే' అనే పార్టీ పెట్టడం.. ఆయన పెద్దగా ప్రభావం చూపలేక పోవడం అన్నది విజయ్ కి సవాల్ విసురుతోంది. దీన్నిబట్టీ చూస్తే తమిళనాట సినిమా వారి ప్రాధాన్యత.. ఒక ముగిసిన అధ్యాయం అనేవారున్నారు. అయితే అది అప్పుడు- ఇప్పుడు కాదంటారు విజయ్ ఫ్యాన్స్. విజయ్ కాంత్ పార్టీ పెట్టి ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. దానికి తోడు ఎక్కడో 'ఆంధ్ర సినీ పొలిటీషియన్ పవన్' మన వరకూ వచ్చేస్తున్నాడు. కాబట్టి మనం అలెర్ట్ కావాలి. ఇక్కడున్న లోకల్ పొలిటికల్ టాలెంట్ ని పబ్లిక్ ఎంకరేజ్ చేయాలన్న కోణంలో విజయ్ తమిళ రాజకీయ తెరపైకి దూసుకొస్తున్నారు. మరి చూడాలి.. ఈ కామెంట్లలోని దమ్ము తన రాజకీయాల్లో ఆయన ఏ విధంగా కొనసాగిస్తారో లేదో తేలాల్సి ఉంది  

కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారం : మల్లికార్జున ఖర్గే

  గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడుతు ఆపరేషన్ సింధూర్‌కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఆయన అన్నారు.  దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలను అర్పించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించారని ప్రశంసించారు. మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో రైతులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రధాని మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.గత బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని ముఖ్యమంత్రి అన్నారు

ఆయన ముందు.. అన్నీ సవాళ్లే

  తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం  పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది. అయితే,అసలు కథ ఇప్పుడే మొదలైందని, రాజకీయ పరిశీలకులు  భావిస్తున్నారు. ముఖ్యంగా,రామచంద్ర రావు ఎన్నిక లేదా ఎంపికలో బీజేపీ అధిష్టానం అనుసరించిన ప్రమాణాల విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.రామచంద్ర రావు, ఎన్నికతో, కమల దళంలో పాత – కొత్తల విభజన రేఖ మరో మారు ప్రముఖంగా చర్చకు వచ్చింది.  తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రం ఎపీలోనూ, అదే యార్డ్ స్టిక్’ ఆధారంగా’ పీవీ మాధవ్’కు పార్టీ పగ్గాలు అప్పగించారనే ప్రచారం జరగడంతో,ఇప్పడు పార్టీలో కొత్తగా చేరిన వారి పరిస్థితి ఏమిటి? ఎప్పటికీ, పల్లకీ మోయడ మేనా? అనే ప్రశ్నఇప్పుడు పార్టీ నేతల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన నాయకులలో, ‘కొందరు’ ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.   అయితే, ఇదేమీ కొత్తగా తెచ్చిన నిబంధన కాదని, పార్టీ రాజ్యాంగంలో ఉన్నదే అని పార్టీ నేతలు చెపుతున్నారు.పార్టీలో పదేళ్ళ క్రియాశీల సభ్యత్వంతో పాటుగా క్రియాశీల పాత్ర పోషించిన వారికి మాత్రమే పార్టీ సంస్థాగత ఎన్నికల్లోపోటీ చేసే అర్హత ఉంటుందని, వివరణ ఇస్తున్నారు. అలాగే, అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన నాయకులు నొచ్చుకోవడం, సహజమే అంటున్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న పెద్దలు అంటున్నారు.   మరోవంక,పార్టీ లోపల వెలుపల కూడా,రామచంద్ర రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఎవరూ పెద్దగా తప్పు పట్టడంలేదు. ఆయనకు, అధ్యక్షుడు అయ్యేందుకు,అవసరమైన అర్హతలు అన్నీ  ఉన్నాయి. అయితే, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో,ఆయనకంటే దూకుడుగా వెళ్ళగలిగే, ప్రత్యర్ధులు ఒకటంటే నాలుగు అనగలిగే, ‘నోటి దురుసు’ ఉన్న నాయకుడు అయితే బాగుండేదని అంటున్నారు. అలాగే, అలాక్లు వహించిన నాయకులు కూడా మెల్లమెల్లగా  సర్దుకుంటున్నారని అంటున్నారు. చివరకు, పోటీలో ప్రముఖంగా వినిపించిన మల్కాజ్ గిరి ఎంపీ  ఈటల రాజేందర్ కూడా, మొదట్లో కొంత నొచ్చుకున్నా,ఆ తర్వాత సర్డుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే, పార్టీ క్యాడర్’లో ఒక వర్గం మాత్రం బీజేపే సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.అలాగే సోషల్ మీడియాలోనూ రామచంద్ర రావును, ‘డమ్మీ’ ప్రెసిడెంట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.  అయితే, రామచంద్ర రావు అందరూ అనుకుంటున్నట్లుగా సౌమ్యుడు కాదని, ఆయన గత చరిత్ర తెలిసిన వారు చెపుతున్నారు. నిజానికి ఎవరో చెప్పడం కాదు, స్వయంగా ఆయనే, ‘‘మీరు అనుకుంటున్నట్లు నేను సౌమ్యుణ్ని కాను. ఉస్మానియా క్యాంప్‌సలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్లొచ్చా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా. జితేందర్‌రెడ్డిని హత్య చేసిన నక్సలైట్లను అరెస్టు చేయాలని నాడు అసెంబ్లీ ముందు ధర్నా చేశా. అప్పుడే లాఠీచార్జిలో నా చెయ్యి విరిగింది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చెయ్యడం కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలి’’ అని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు రాంచందర్‌రావు సవాలు విసిరారు. అయితే ఇవ్వన్నీ ఎలా ఉన్నా, రామచంద్ర రావు తన ముందున్న సవాళ్ళను ఎలా, ఎంత సమర్ద వంతంగా ఎదుర్కుంటారనే, దానిపై  ఆయన భవిష్యత్’తోపాటుగా పార్టీ భైశాయ్త్ కూడ ఆధార పడి ఉంటుందని అంటున్నారు. నిజానికి,రామచంద్ర రావు ముందు, సవాలక్ష సవాళ్ళున్నాయి. ముఖ్యంగా, ఓచేత్తో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, మరో చేత్తో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు 2008 అసెంబ్లీ ఎన్నికలవరకు, ఎన్నికల సమరంలోపార్టీని విజయ పథంలో నడిపించడం వరకు, ఎన్నో సవాళ్ళు అయన ముందున్నాయని అంటున్నారు. అలాగే, ఈ అన్నిటినీ మించి, ఆయన ఎన్నికతో పస్పుటంగా పైకొచ్చిన పాత కొత్త విభజన రేఖను తుడిచేసి, సమన్వయంతో పార్టీని ముదుకు తెసుకుపోవడం  రామచంద్ర యో మున్డునన్ అతి పెద్ద సవాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.  

బండి సంజయ్ బర్త్‌డే కానుకగా...20 వేల సైకిళ్ల పంపిణీ

    ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు  భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే.... కరీంనగర్ జిల్లాలో పదో తరగతి చదువుకునే బాలబాలికలు 3096 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్లలో 3841, జగిత్యాల జిల్లాలో 1137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది వెరసి 9348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.  అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అట్లాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు.  ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్ కు వచ్చాయి. తొలి దశలో ఐదు వేల సైకిళ్లను  ఈనెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక  సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే ఒక్కో సైకిల్ ను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు. టెన్త్ విద్యార్థులకే ఎందుకంటే.... ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.

అధికారం పోయినా చెవిరెడ్డిలో ఇంకా అహంకారం తగ్గలేదు : ఎమ్మెల్యే పులివర్తి

  అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణకు సహకరించాల్సింది పోయి... మీ అంతు తేలుస్తా, సిట్ కార్యాలయం ముందు ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్కొక్కరి తాట తీస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన తీరు ఆయన అహంకార దోరిణికి నిదర్శనం. విచారణ చేస్తున్న అధికారులపై ఈ రకమైన దురుసు ప్రవర్తన వైసీపీ నాయకుల సైకో విధానాన్ని తెలియజేస్తోంది. అధికారం పోయినా ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అహంకారం దగ్గలేదు.  ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చెవిరెడ్డిలాంటి మూర్ఖుల్లో ఇంకా మార్పు రాలేదు. ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నాడు. జైలు జీవితం తప్పదని తెలిసే విజయవాడ జైలులో చెవిరెడ్డి రంకెలు వేస్తూ చిందులు తొక్కుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టే చెవిరెడ్డిలో ఈ విధమైన భయం, ఆందోళనలు కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకొని, ఎన్నికల్లో తప్పుడు పద్దతిలో గెలిచేందుకు తరలించాడు. సిట్ అధికారులు 200 ప్రశ్నలు వేసినా ఒక్క సమాధానం కూడా చెవిరెడ్డి నుంచి రాలేదంటే... ఐదేళ్ల పాటు మద్యం కుంభకోణంలో ఏ రేంజ్ లో సొమ్ములు పక్కదారి పట్టించారో అర్థమవుతుంది. మద్యం కుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం విడిచిపెట్టదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు  

జూబ్లీలో ఉప ఎన్నికలో.. కూటమి పోటీ?

  సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. నిజానికి, ఉప ఎన్నిక  ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. కానీ, నియోజక వర్గంలో ఎన్నికల సందడి మాత్రం అప్పుడే మొదలైంది. ప్రధానంగా, ఆధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటుగా బీజేపీ కూడా  బరిలో దిగేందుకు రెడీ అవుతున్న నేపధ్యంలో సహజంగానే నియోజక వర్గం, అందరి దృష్టిని, మరీ ముఖ్యంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదాల ఉంటే. జూబ్లీహిల్స్’ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పునుందా? రాజకీయ సమీకరణలను మార్చివేస్తుందా, కొత్త పొత్తులకు తెర తీస్తుందా,? రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందా? ఇలా అనేక కోణాల్లో, అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  దీన్ని బట్టి చూస్తే ఏమి జరిగిన ఏమి జరగక పోయినా,జూబ్లీ ఉప ఎన్నికరాజకీయ ఊహాలకు,వ్యూహాగానాలకు వేదిక అవుతుందనిపిస్తోందని అంటున్నారు.  నిజానికి ఇప్పటికే, అనేక ఉహాలు, వ్యూహాగానాలు సోషల్  మీడియా మొదలు మెయిన్’ స్ట్రీమ్’ మీడియా వరకు కథలు కథలుగా చక్కర్లు కొడుతన్నాయి. అయితే, ఈ ఉహాలను, వ్యూహాగానాలను పూర్తిగా కొట్టివేయడం కుదరదని,, రాజకీయ పండితులు అంటున్నారు. అవును,ఉప ఎన్నిక జరుగుతున్నది, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గం కాకుండా మరో నియోజక వర్గం అయితే, ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ, జూబ్లీ హిల్స్’  నియోజక వర్గానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత  దృష్టా, తెలంగాణలోనే కాకుండా,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ జూబ్లీ ఉప ఎన్నిక గురించిన చర్చ జరుగుతోంది. ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నియోజక వర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే,అందులో ఒకొంతు ఓటర్లకు కొంచెం అటూ ఇటుగా, ఆంధ్రా మూలాలున్న, సెట్ల్లెర్స్’ ఉన్నారు.అఫ్కోర్స్,అంతకంటే ఎక్కువగా, ఒక లక్షా 20 వేల వరకు ముస్లిం, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అయినా జూబ్లీ నియోజక వర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించేది, సెట్లర్’ ఓటర్లే అంటారు.   అదొకటి అయితే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన, తెలంగాణ తొలి శాసన సభ ఎన్నికల్లోనూ జూబ్లీ నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన  మాగంటి గోపీనాథ్’ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్’లో చేరినా, వరసగా 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని గెలిపించింది మాత్రం సెట్లర్స్’ ఓట్లే అంటారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో రీ-ఎంట్రీకి ప్రయత్నిస్తునట్లు చెపుతున్న,తెలుగు దేశం పార్టీ, జూబ్లీ ఉప ఎన్నికను లాంచింగ్ ప్యాడ్’ చేసుకుంటుందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లో,జనసేన మద్దతుతో పోటీచేసిన బీజేపీ, టీడీపీ కూటమి,20 అసెంబ్లీ స్థానాలు( టీడీపీ 15, బీజేపీ 5) గెలుచు కుంది. 2018లో కాంగ్రెస్’ జట్టుకట్టి పోటీచేసినా టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తెలంగాణలో పోటీచేయలేదు. అయితే,ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, టీడీపీ తెలంగాణలో తిరిగి కాలు మోపేందుకు సిద్డమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్’ లో సక్సెస్ అయిన, టీడీపీ. జనసేన, బీజేపీ కూటమి ఫార్ములాను తెలంగాణాలో కొనసాగించాలని కూటమి నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూబ్లీ ఉప ఎన్ని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే, కూటమి తరపున, ఏపార్టీ పోటీ చేయాలి, అభ్యర్థి ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు.

చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన

  భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి  ఘన సంప్రదాయ స్వాగతం పలికింది. 29 జూన్ బో’నెస్ టౌన్ హాల్‌లో ఆయన తొలి స్కాట్లాండ్ ఉపన్యాసాన్ని 500 మందికి పైగా భక్తుల సమక్షంలో నిర్వహించారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో  సంస్థ  వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి తాజా పూలమాల సమర్పించగా, అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి (విజయ్ కుమార్ రాజు పర్రి కుమారుడు) స్కాటిష్ కళ ఐనటువంటి బ్యాగ్‌పైప్ ప్రదర్శనను స్థానిక కళాకారులతో కలిసి ఆకట్టుకునేలా ప్రర్శించారు తరువాత ప్రసాద్ మంగళంపల్లి మరియు ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయబద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం నిజరూపం దాల్చడంలో రాజశేఖర్ జాల JET UK వారితో సమన్వయం చేస్తూ ముఖ్యభూమికను పోషించారు.వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన  కార్య‌క్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి. ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు. కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు మరియు ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం యొక్క చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి మరియు ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు.జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంశా పత్రరూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు. "ఏడు కొండల (తిరుపతి) నుండి ఏడు కొండల (ఎడింబర్గ్) వరకు" అని భువన విజయం వారు అందులో పోల్చుతూ ప్రచురించిన తీరు అద్భుతం.“ఇది స్కాట్లాండ్ మరియు బో’నెస్‌ను రంగులతో నింపిన అద్భుత సంప్రదాయ వేడుక” అని ఒక వీక్షకుడు పలికిన మాట ఈ ఘనతను మరింత విస్మయపరుస్తోంది.   

జ‌ర్న‌లిస్టుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జ‌ర్న‌లిస్ట్‌లకు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వాల‌ని అధికారులకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, కొలుసు పార్ధ సార‌ధి, నారాయ‌ణ‌ల‌తో ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థలాలపై విధివిధానలను రూపోందించనుంది. వాటిని సమర్పంచనుంది. ఆ తర్వాత ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  రెవెన్యూ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వారసత్వ భూములకు సచివాలయంలోనే సక్సెషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షల లోపు విలువైన భూములకు రూ.100 రుసుముతో సర్టిఫికెట్లు పొందవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఆగస్టు 2లోగా, రెవెన్యూ సమస్యలు అక్టోబర్ 2 నాటికి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   

నిర్మలమ్మకు.. కమలం పార్టీ పగ్గాలు ?

  ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 21 న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని, బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చే వారం పది రోజుల్లో, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడు ఎవరో తేలిపోతుందని, బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం.  అయితే, ఈసారి బీజేపీ జతేఅయ్ అధ్యక్షుని ఎన్నికలో బిగ్ ట్విస్ట్’ ఉంటుందని అంటున్నారు.  బీజేపే జాతీయ అధ్యక్ష పదవి దక్షణాది రాష్ట్రాలకు, అందునా  మహిళా నాయకురాలికి  దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారంగా,మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే, అధ్యక్ష రేసులో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్’తో పాటుగా,ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి,తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  అయితే దక్షణాది మహిళకు అధ్యక్ష పీఠం అప్పగించాలనే నిర్ణయంలో మార్పు లేకుంటే నిర్మలా సీతారామన్’కు బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, గత ఏప్రిల్’లోనే నిర్మలా సీతారామన్ పేరు తెరపైకొచ్చింది. కాగా ఇప్పడు తాజాగా, కొద్దిరోజుల క్రితం జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన నేపధ్యంలో ఆమె పేరు మరో మారు తెరపైకి వచ్చింది.అదలా ఉంటే, ఇంచుమించుగా 45 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, పార్టీ అధ్యక్ష బాధ్యతలు మహిళ అప్పగించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం, ‘వ్యూహాత్మక’ ముందడుగుగా పరిశీలకులు పేర్కొంటున్నారు. రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల నాటికకి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తున్నందున, బీజేపే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అలాగే, దక్షణాది రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు, దక్షణాది మహిళకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడ  ఉభయ తారకంగా ఉంటుందని  అంటున్నారు.  అలాగే, ఇంతవరకు, బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్  సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు.కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళానేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  అదే జరిగితే, నిర్మల సీతరామన్’కు పదవి దక్కితే, అది పార్టీ చరిత్రలోనే కాదు, ‘ఫస్ట్’ విమెన్ డిఫెన్స్’ మినిస్టర్, (ప్రప్రధమ మహిళా రక్షణ మంత్రి ) ‘ఫస్ట్’  ఫుల్ టైమ్’  ఫైనాన్సు మినిస్టర్’తో  పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్’ ప్రవేశ పెట్టిన తొలి’ అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్’ రాజకీయ జీవితంలో మరో మెయిలు రాయిగా నిలిచి పోతుందని అంటున్నారు. అలాగే,ఆమె ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు. అనేకాకుండా, దక్షణాది  కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా  మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్’లోనూ మాట్లాడ గలరు. సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నదే, నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలున్న  నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు. అయితే, ఫైనల్’గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్’ తప్పదు..   అలాగే, ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు.ఎకడమిక్’ పర్సన్’. ఎకనమిక్ లేడీ.  ఒక విధంగా ఆమె లేడీ మనోహన్’ సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు. అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు.అంతేకాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే, ఆర్ఎస్ఎస్’ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి.సో.. చివరాకు ఏమి జరుగుతుంది అనేది ..వేచి చూడవలసిందే అంటున్నారు.

ఆసుపత్రి నుంచి కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష

  సాధారణ వైద్యల పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ప‌రామ‌ర్శించేందుకు పార్టీ నేతలు ప‌లువురు వచ్చారు. ఈ సందర్భంలో వారితో గులాబీ బాస్ ఇష్టాగోష్టి నిర్వహించారు.  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి వంటి అంశాలను పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.  

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష..రూ.6లక్షల జరిమానా

  ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి  నరసింహమూర్తి  తీర్పునిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 23/2019 కేసులో ఈ  ముద్దాయి అరెస్టయ్యారు. ఈ వ్యక్తి తమిళనాడుకు చెందిన వెల్లియన్ కాగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ నాగపట్ల బీట్, చామల రేంజి ప్రాంతంలో పట్టుబడ్డాడు.  వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమ ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని  అభినందించారు.